రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
మాటలు నేర్చిన చిలకా ఓ మహానటి
ఎవరురారు ఇలలోనా నీ కాలిగోటి సాటి
నువ్వు నవ్వు నవ్వితే నవరత్నాలే
నవ్వుతోనే ఫలిస్తాయి నీ ప్రయత్నాలే
జాణవే నెరజాణవే మాణిక్యవీణవే
మత్తుజల్లి మాయజేయగ మహా ప్రవీణవే
1.కవిత్వాలె పుట్టిస్తావు సామాన్యునిలో
ఆశలు రేకెత్తిస్తావు నిరాశావాదిలో
తపోభంగమైపోదా మునివర్యులకైనా
దారితప్పదా ఆజన్మ బ్రహ్మచర్యమైనా
జాణవే నెరజాణవే మాణిక్యవీణవే
మత్తుజల్లి మాయజేయగ మహా ప్రవీణవే
2.పిచ్చివాళ్ళైనారు నిన్ను కనగ ఎంతోమంది
కాపురాలనొదిలేసారు నీకొరకు ఓ సౌగంధి
ఊరించి ఊరించి ఊడిగం చేయిస్తావు
అందినట్టె అనిపించి నువు జారుకుంటావు
జాణవే నెరజాణవే మాణిక్యవీణవే
మత్తుజల్లి మాయజేయగ మహా ప్రవీణవే
Art by:Sri .Agacharya Artist
No comments:
Post a Comment