రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఇప్పటికి కదా స్వామీ నీ మనసు కుదుట పడ్డది
ఈ గెలుపేకదా ప్రభూ నీకు ఊరట కలిగించినది
దుర్భర యాతనతో బ్రతుకు భారమంటుంటే
నా అంతట నేనుగా నిన్నుకోరుకుంటుంటే
1.పొమ్మని అనవుగాని పొగబెట్టక మానవు
లేదని అనవుగాని వేదనలే ఇచ్చేవు
చిరుసాయం అడిగితే చేతువు గుండెకు గాయం
వరమునే కోరామా చూపింతువు నరకం
2.నీకెంత ప్రేమ స్వామీ నిజంగానె నాపై
క్షణం మరవనీయవు అణువణువూ నీరూపై
కష్టంవెనక కష్టము కొనితెచ్చేవెంతో ఇష్టంగా
నీ ఆంతర్యం చెప్పకనే తెలుస్తోంది స్పష్టంగా
3.ఎంతగా నీకు నచ్చానో ప్రభూ నేను
త్వరగా నిను చేరమనే సంజ్ఞనందుకొన్నాను
బద్నామౌతావనా బాధ్యత నా కిచ్చావు
నీకొరకు తపించేల వెతలను కల్పించావు
No comments:
Post a Comment