రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
తేనే కళ్ళ చిన్నదీ తెగనీల్గుతున్నది
సొట్టాబుగ్గల చిన్నదీ సోకులుపోతున్నది
అబ్బదీని సింగారం దీని ఒళ్ళె బంగారం
పంటినొక్కునొక్కిందా చిత్తం కాస్త గోవిందా
సిగ్గులొలకబోసిందా గుండె జారి గల్లంతా
1.దిష్టిచుక్క అయ్యింది గద్వమీది పుట్టుమచ్చ
వలపుపట్టు అయ్యింది మట్టమీది పచ్చబొట్టు
వంకీల ముంగురులే - పలికె స్వాగతాలు
ఓరకంటి చూపులే-రాసె ప్రేమలేఖలు
వశమైపోదా మనసే పరవశమై
బానిసకాదా బ్రతుకే దాసోసమై
2.జారగిల నిలబడితే అజంతా జీవచిత్రమే
వాలుజడ ముడిపెడితే హంపి కుడ్యశిల్పమే
బొటనవేలు నేలరాస్తే బాపూ కుంచె బొమ్మనే
పెదవివిప్పి నవ్విందా దివ్య స్వప్న సుందరే
సొంతమైతె ఏముంది -భవ్య భావన
సంసారం సాగరమై నిత్య వేదన
No comments:
Post a Comment