https://youtu.be/FqY-IBMp0yI?si=qllOsk_m6UADsw5C
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కట్టుకోను పట్టుబట్టలేదు-ఇంటికేమొ పై కప్పులేదు
పెట్టుకోను పైడి నగలేదు-మబ్బుల్లొ తిరుగాడె ఎకిరింత లేదు
అయ్యయ్యో మా శివ్వయ్య-అన్నాల మింతగ ఏందయ్య
లోకమంతా ఏమైతెనేమి- నీకింక నేనైతె ఉన్నాయ్యా
1.వల్లకాడా మంచుకొండా నీవుండేందుకు
చితి బూడిదా ఏనుగుతోలా- ఒంటిని చుట్టేందుకు
నా గుండెలొ మస్తు చోటుందయ్య
లచ్చనంగ నువ్వుండిపోవయ్యా
నాచిత్తమైతె పట్టు వస్త్రమేనయ్య
నీ చుట్టూర చుట్టి కట్టుకోవయ్యా
2.బిచ్చమడిగి తినగా నీకొక పుర్రె బొచ్చెనా
ఎక్కితిరుగ నీకైతే ఎద్దుమాత్రమున్నదా
కలోగంజొ కడుపు నింపుతానయ్యా
నా పానమల్లె చూసుకుంటానయ్యా
ఆశల రెక్కల గుర్రమున్నది ఎగిరిపోగా
నా మనోరథము నీదేమరి ఊరేగిరాగా
No comments:
Post a Comment