Saturday, September 26, 2020


https://youtu.be/RAkNLXC8gos?si=JhK-LMpmEm23a6lu


ఏనాటికైనా చేరేదినీ పాదాల కడకే

ఏ తీరుగానైన తీరేనుగా- నిను వేడగా నా వేడుకే

అలనాటి నుండి నీ అలవాటుగా 

శరణాగతినీయగా నీకు వాడుకే

తిరుమలరాయా నేను పరాయా నమోనమః

గోవింద ముకుంద అనంత నామధేయా నమోనమః


1.ఏపూటనొ ఏచోటనొ  రేయి పగలు ఏవేళనొ

ఇంటనో బయటనో ప్రమాదాన ఆకస్మికముగనో

సుదీర్ఘవ్యాధి బాధలతో ఏమనో వేదనలతోనో

ఈ పాంచభౌతిక దేహం పంచభూతాలకాహుతియౌనో

ననుమాత్రం మరవకు మాధవాయ నమోనమః

చేయినైతె వదలకు చక్రధరా నమోనమః


2.అనాయాస మరణముకై వినయముతో నా వినతి

సునాయాస నిహతికై సదానీకు నమస్కృతి

అంత్యకాలమందు నీ స్ఫురణలో కడతేరనీ

అపమృత్యువందుగాని నీ స్మరణలో మృతిరానీ

 నీ ధ్యాస దయచేయి దామోదర నమోనమః

నీ ధ్యానము తప్పనీకు శ్రీధరా నమోనమః

No comments: