Saturday, September 26, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరణం లేదు ఇలలో పాటకు

బేధం లేదు బాలుకు పాటకు

అనునిత్యం వినువిందు చేసే అమరుడే బాలు

బాలసుబ్రహ్మణ్యం గాత్రంలో సదా గంధర్వగానాలు


1.కోదండపాణి సారథికాగా

పూరించెను దేవదత్తం అప్రతిహతంగా

సినీమాయారంగంలో రాణించాడు పాత్రోచితంగా

నలభైవేల గీతాల సుదీర్ఘ ప్రస్థానం

భారతీయభాషలెన్నటిలోనో మధురగానం

ఓకే ఒక్క శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం

మొన్నా నిన్నా నేడూ రేపు ఎప్పుడూ ఎల్లప్పుడూ ధన్యం


2.దివిలోవిరిసిన పారిజాతం భువికి దింపాడు

శంకరాభరణాన్ని సైతం గళమున దాల్చాడు

సాగరసంగమాన్ని అమృతంగ పంచాడు

కులమతాలకతీతమౌ రుద్రవీణ పలికించాడు

బాలు పాడని పాటలేదన అతిశయోక్తి కానేకాదు

తీయగా పాడేవారికి దిక్సూచియే యన వింతేమిలేదు

పాడుతా తీయగా పాడుతీయగా పాడుతాతీయగా అంటూ కదిలాడు


3.రాసుకుంటు పోయేకవికి అలుపురాక తప్పదు

పదివేల చరణాలైనా పాటపూర్తి కానేకాదు

కావ్యంలో చెప్పే భావం గేయంలో సాధ్యమయేనా

ఏకోణం తీసుకున్నా బాలు చరిత భారతమే

గుప్పిటిలో విశ్వం పట్టగ ఘనకవులకైనా తరమే

 చిరంజీవిగా బాలు సతతం శ్రోతలనలరిస్తాడు

అభిమానుల గుండెల్లో ప్రాణంగా జీవిస్తాడు

No comments: