రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
చూపులకేం పని తూపులు వేయడమే
పెదవులకేం పని వ్యూహమమలు చేయడమే
పగబట్టింది నీ అంగాంగాం నను బంధించుటకై
నీకెంతటి ఉబలాటమో అస్త్రాలు సంధించుటకై
1.కనుగీటితె చాలుగా కదనకుతూహలమేల
నవ్వితె సరిపోవుగా సంగ్రామ తపనయేల
నేనూ ఇక సిద్ధమే నిషిద్దాలు ఆయుధాలు
మల్లయుద్ధమైతే మేలు ఇరువురికి విజయాలు
2.ఊపిరాడనీయను బాహువుల బిగించి
తేరుకోనీయను ముద్దులతో ముంచెత్తి
పట్టేపడతాను ఆయువు పట్లపై సరసంగా
ఉట్టేకొడతాను దండిగ వెన్నా మీగడ లొలుకంగ
No comments:
Post a Comment