Sunday, October 18, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముక్కంటి దేవర

నిక్కముగ కావర

మాకు వరమీయర

కలవరమెడబాపర


1.మది నమ్మినానుర

పదమడిగినానుర

పదపడిదె వేగరా

దయసేయి శంకరా


2.నలత మరి మాన్పర

కలత పరిమార్చర

కలలు నెరవేర్చర

కైవల్యమొసగరా

No comments: