రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పక్షపాతి భారతి ప్రియపతి - నీ ఎడల నిరుపమ లేమ
నాల్గుమతుల తులనం చేసి -సృజించాడు నినుఆ బ్రహ్మ
అందంమంత కుప్పగపోసి-అందజేసె సుందరినీకు
ఆనందాన్ని సేకరించి-ధారబోసె హాసిని నీకు
1.మేలైన మీనాలే నీ నయనాలకు అచ్చెరువొందు
దొండపండ్లుగా నీపెదవులగని రైతులే భ్రాంతి చెందు
నవ్వుల్లొ రాలుతుంది నాగమల్లి పూలజల్లు
చూపుల్లొ విరుస్తుంది అబ్బురాల హరివిల్లు
2.నిను తిరిగి చూడకుంటే మదికి అవకరమేదో
నిను చూసి చలించకుంటే ఆరోగ్య లోపమేదో
పడతులెవరైనా ఇలలో ప్రస్తుతించగలరే నిన్ను
ప్రవరాఖ్యుడైనా సరే పాదాక్రాంతుడవునే నమ్ము
No comments:
Post a Comment