రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నాభికాదు రసికుల మది రెచ్చగొట్టేది
అరవిరిసిన నవ్వులే చిచ్చుపెట్టేది
నడుంకాదు సరసులనిల మాయచేసేది
అర్ధనిమీలిత నేత్రాలే వలవిసిరేది
పరచిన అందమెపుడు ఉత్తేజపరచదు
విప్పిన యే గుప్పిటి ఉత్సుకతే రేపదు
1.నునుసిగ్గుల లేలేత చెంపలు దింపేను ముగ్గులోకి
నగవులతో జతకట్టిన బుగ్గసొట్టలు లాగేను రగ్గులోకి
అచ్చికబుచ్చిక పలుకుల సమాయత్తమే రస రమ్యము
సురుచిర సుకుమార శృంగార సంగరమే కడు భవ్యము
2.పయోధరాలదేముంది మధురాధరాలదే అలజడి
ముందువెనక తపనల తడితడి ఎద తనువుల సందడి
రసనలు రచించే వైవిధ్య కావ్యాలే చిరస్మరణీయము
హరివిల్లుగ చెఱకువిల్లుగ వన్నెలొలుకబోయ రమణీయము
No comments:
Post a Comment