*నా సాహిత్యాభిమాన పాఠక బంధుమిత్రులకు కృతజ్ఞతాభి వందనములు..!!*
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఋణం తీరిపోదు ధన్యవాదాలతో
మొక్కుచెల్లిపోదు కృతజ్ఞతా ప్రకటనతో
ఎన్నాళ్ళ అభిమానమో మన సాహితీ గంధం
ఎన్నేళ్ళ సావాసమో మన కవన బాంధవ్యం
మనసా వచసా శిరసా మీకు అభివందనాలు
నిన్నా నేడూ రేపూ మీకు మైత్రీ చందనాలు
1.అడుగు అడుగులో మీ శుభాకాంక్షలు
అలుపు అలుపులో మీ స్ఫూర్తీ ప్రేరణలు
మలుపు మలుపులో తెలిపే మీ ప్రశంసలు
గెలుపు గెలుపులో మీ శుభాభినందనలు
ఇంతకన్న ఏంకావాలి ప్రోత్సాహకాలు
ఇవేకదా ఉత్సాహానికి ఉత్ప్రేరకాలు
2.పెద్ద మనసు గలవారు మీరు పాఠక శ్రేష్టులు
విశాల రసహృదయులు నా పాటల ఇష్టులు
నాకు పరిపూర్ణత కూర్చగ మీరే నా స్రష్టలు
నా ఉన్నతి సంకల్పించే నిజమైన ద్రష్టలు
ఇదేకదా జీవితానికి అసలైన పరమార్థం
మీ ఆదరాభిమానంతో నా జన్మ చరితార్థం
No comments:
Post a Comment