https://youtu.be/Zqqr1NGEzIY
లంచావతారం ప్రపంచవ్యాప్తం
అవినీతి వివిధ రూప పరివ్యాప్తం
లంచమివ్వక తప్పని సామాన్యుని అసహాయత్వం
వేళ్ళూనుక పోయింది దేశమంతా ఇది బహిరంగసత్యం
1.సాంప్రదాయమయ్యింది అవినీతి సైతం
రివాజుగా మారింది అమ్యామ్యా చేతి వాటం
ఇందుగలదందు లేదను సందేహమెందుకు
లంచం తప్పనిసరైంది పని జరిగేందుకు
2.రెవెన్యూ మున్సిపల్ కార్యాలయమేదైనా
రవాణా రిజిస్ట్రేషన్ ప్రభుత్వ శాఖలేవైనా
ఫైలంటూ ముందుకి కదిలే మంత్రం లంచం
కేసంటూ కొసకంటూ తేల్చే సాధనం లంచం
No comments:
Post a Comment