Saturday, December 17, 2022

 https://youtu.be/m49YERE0gAU?si=vX_j5hT_FUYxJD82

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాడిందే పాడి పాడి-వేడిందే వేడి వేడి

విసిగినాను విప్పలేక బ్రతుకులోని చిక్కుముడి

అనుకున్న ప్రతిసారీ అడుగులు తడబడి

వేంకటేశ పనికిరాద వసతికి నా గుండెగుడి

మొక్కుచుంటి మొరవినమని స్వామీ సాగిలబడి


1.పడగెత్తి బుసకొట్టు పాము నా కోపము

పవళించవయ్యా చేకొని నీ  శయ్యాతల్పము

రెక్కలను సాచి ఎక్కడికొ ఎగిరేటి పక్షి నా కామము

ఎక్కి తిరుగవయ్యా చక్కని గతి వదలక ఏ క్షణము

చెలఁగేనా గుణగణములు చేయనీ నీకై కైంకర్యము


2.నా జీవితదశలు నీ దశావతారాలుగను

తల్లిగర్భాన చేపను శిశువుగ తాబేలును

ఉచితా నుచితములెరుగని వరాహము మృగమును

మరియాద రామునిగా మనుటకొరకు వగచెదను

గీతా కృష్ణునిగా జీవన పరమార్థమెరుగ ప్రార్థించెదను

No comments: