https://youtu.be/xQ8YVPH04lU?si=Trr0j6UDdRXoAtPv
21) గోదాదేవి ఇరవైఒకటవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం
30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం
దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము
ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు
రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:చక్రవాకం
గోవర్ధన గిరిధారి గోకుల శౌరి
గోవింద నామాంకిత కృష్ణా బృందావిహారి
అభివందనచందనాలు నీకు మురారి
నిను లేపగ వచ్చితి నీ నీలను గోదా బృందముచేరి
నిదురలేచి సిద్దపడగ నోముఫలముకై నిను కోరికోరి
1.కుండలు నిండిపోగ దండిగ పాలుపొరలెడు
ఆవులమందలకే అధిపతి మా నందగోపుడు
యశోదానందులకే గారాల సుతుడవు
ఈ నీలా సుందరికే ప్రియతముడవు నీవు
నిదురలేవవయ్యా నీవే నిజమగు ఆశ్రితవరదుడవు
2.సర్వస్య శరణాగతివేడి అంకితమైతిమి
శత్రుంజయ సురేంద్ర విజయ నమోనమామి
నీవారము మేము వరమిచ్చేవని వచ్చితిమి
కరుణించెదవని నిన్నూ మనసారా నమ్మితిమి
కనికరించి నిదురలెమ్ము తరించెదము నోమునోమి
No comments:
Post a Comment