Saturday, December 17, 2022

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హంసానంది


నేలబాట పట్టింది మేఘమాలిక

నీ కురులు చూస్తె తోచిందీ పోలిక

సుందరాంగుల లోకానికి నీవే ఏలిక

దిగిరావే ఒదిగిపోవే నీతోడే కావాలిక


1.నీ పలువరుసే ముత్యాల పేరు

నగవులందు వెన్నెల సెలయేరు

చెంపల సొట్టలలో పుట్టతేనెలూరు

కెంపులే పెదాలకే అరుణిమనే కూరు


2.చుక్కే దాక్కుంది ముక్కుపుడకతో పడక

కనుబొమలే సుమధనువై దోగాడిన వేడుక

నీ కనులే మీనాలై నా చూపుల వలలలో పడక

నీ తలపుల తూపులతో అంపశయ్య నా పడక

No comments: