https://youtu.be/x_CuJbKZgWE?si=hYmVHtmesnSbBmXX
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఎన్ని కారణాలో అప్సరసవు నీవని నమ్మడానికి
రూపం సౌందర్యం గాత్రం గాంధర్వం ఉనికే మార్మికం
ఎన్ని అనుభవాలో నిన్నే దేవతగా కొలవడానికి
దివ్యమైన విగ్రహం వరముల అనుగ్రహం ధర్మాగ్రహం
మనసా వచసా శిరసా అందానికి వందనం
దేహం జీవం భావం సర్వం నీకే అంకితం
1.మురిపిస్తావు సొగసులతో
బులిపిస్తావు సోకులతో
అందీ అందక ఎందుకో ఏమారుస్తావు
కలలో మాత్రం ప్రత్యక్షం
కలయిక కేలనో నిర్లక్ష్యం
ఎప్పటికిక దొరుకేనో నిను పొందే మోక్షం
2.పరీక్షించి చూస్తావు నా ఓర్పుని
నిరీక్షింప కురుస్తావు ఓదార్పుని
ప్రాణం పోతుంటే పోస్తావు అమృతాన్ని
నిలిచేవు నిత్యం నా కలమందు
పూసేవు కాలే నా హృదయానికి మందు
నవ్వుల దివ్వెలునాకై వెలిగిస్తావు అంధకారమందు
No comments:
Post a Comment