రచన,స్వరకల్పన&డా.రాఖీ
https://youtu.be/2y0Dn5qEt2U
https://youtu.be/2y0Dn5qEt2U
ప్రేమని మోసుకొస్తుంది
ఒక అల్లరి పలకరింపు
బంధం చిగురింపజేస్తుంది
ఒక చల్లని చిలకరింపు
మానవీయ బంధాలను మించి ఏమున్నది
మహదానందం
మనసువిప్పి మాటాడితే జీవితాన
మకరందం
1.మనుషులమని మరిచిపోయి ముసుగులేసుకొంటాము
కులమతాల రంగులను మేన పూసుకొంటాము
ఎక్కించే రక్తానికి ఎవరిదైన ఎరుపు రంగె
కొట్టుకునే గుండెలధ్వని లబ్ డబ్ లబ్ డబే
2.సంపన్నవర్గమైన తిను అన్నం పరిమితమే
సబ్బండ వర్గానికైనా ఆకలి తీరుట ఉచితమే
ఉన్నోడికి లేనోడికి పొట్ట తిప్పలకు తేడాయే లేదులే
సంతృప్తి లేనప్పుడు నోట్లకట్టలున్నా బ్రతుకు చేదేలే
3.ఇవ్వడమను గుణానికి పేదతనం తెలియదు
లోభత్వానికీ ఎంతగ ఉన్నా చాలనే చాలదు
పోగేసుక పోయేందుకు నూలుపోగూ వెంట రాదు
సాయపడగ సిద్ధపడితె ఏ మాత్రం ఆస్తి తరిగిపోదు
ఒక అల్లరి పలకరింపు
బంధం చిగురింపజేస్తుంది
ఒక చల్లని చిలకరింపు
మానవీయ బంధాలను మించి ఏమున్నది
మహదానందం
మనసువిప్పి మాటాడితే జీవితాన
మకరందం
1.మనుషులమని మరిచిపోయి ముసుగులేసుకొంటాము
కులమతాల రంగులను మేన పూసుకొంటాము
ఎక్కించే రక్తానికి ఎవరిదైన ఎరుపు రంగె
కొట్టుకునే గుండెలధ్వని లబ్ డబ్ లబ్ డబే
2.సంపన్నవర్గమైన తిను అన్నం పరిమితమే
సబ్బండ వర్గానికైనా ఆకలి తీరుట ఉచితమే
ఉన్నోడికి లేనోడికి పొట్ట తిప్పలకు తేడాయే లేదులే
సంతృప్తి లేనప్పుడు నోట్లకట్టలున్నా బ్రతుకు చేదేలే
3.ఇవ్వడమను గుణానికి పేదతనం తెలియదు
లోభత్వానికీ ఎంతగ ఉన్నా చాలనే చాలదు
పోగేసుక పోయేందుకు నూలుపోగూ వెంట రాదు
సాయపడగ సిద్ధపడితె ఏ మాత్రం ఆస్తి తరిగిపోదు
No comments:
Post a Comment