https://youtu.be/JGCbcHftHuA?si=4wx_IU8Ldhy-_x5h
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
శ్రీ ఆంజనేయం దివ్య మహాకాయం
రామనామమంటె నీకు ఎంతో ప్రియం
నిన్ను తలచినంతనే భయమే మటుమాయం
నీ అనుగ్రహమ్ముతో విజయమే మంచినీళ్ళ ప్రాయం
నమో నమో జితేంద్రియా నమోస్తుతే సంజీవరాయా
1.రామ భజన జరుగు చోట నీ ఉనికి ఖాయం
రామకథను వినుట కనుట నీ అవతార లక్ష్యం
రామాయణ పారాయణ నీకు ప్రథమ కర్తవ్యం
రామగాన రసపానమే నీకు సదా ముఖ్యం
నమోనమో చిరంజీవా నమోస్తుతే ప్రభోవాగధీశా
2. ఊరూరికి రక్షణగా నిలవడమే నీ ధ్యేయం
నీ భక్తుల కండదండ కావడమే కడు భవ్యం
పిలిచినంతనే పలుకుతు ఔతావు ప్రత్యక్షం
నిను నమ్మికొలిచినంత సులభతరమె మోక్షం
నమోనమో అంజనానందన నమోస్తుతే దనుజ భంజన
No comments:
Post a Comment