రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కోరిందెంత కొండంతా? నీ గుండెంత
ఇచ్చిందెంత ఇసుమంతా? నా మనసంత
కొలమానం అంటూ ఉందా విశ్వైక ప్రేమముందు
రుగ్మతలన్నీ పోగొట్టేది ఒకటే ప్రేమమందు
1.మిలమిలమెరిసే నీ చూపులే దారిదీపాలై
కిలకిలనవ్వే నీ నవ్వులే సాంత్వన రూపాలై
వెనకడుగే వేయనీయనీ నీతోడే ప్రేరకమై
వదలమాకే నా చేయినీ స్ఫూర్తిదాయకమై
2. నీ పలుకే ప్రతీకగా బ్రతుకే వెలగనీ
నీ పదమే నా పథమై పయనం సాగనీ
సంశయాలు తీర్చేటి నా భగవద్గీతవై
సమాయత్తపరిచేటి పాంచజన్యమై
No comments:
Post a Comment