https://youtu.be/kjg1sgcHa0M
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఉక్తులమ్మా కదలకుండ నా కవితల నివసించవే
సొత్తులమ్మా రూకల కలతలన్నీ పరిహరించవే
సత్తువమ్మా నా తనువు నలతలన్నీ దహియించవే
ముగ్గురమ్మల మూలపుటమ్మా ఇల వెతలనే కడతేర్చవే
1.పోతనకు తెనాలి రామకృష్ణకవికి
కాళిదాసుకు రామకృష్ణ పరమహంసకు
శంకరాచార్యునకు ఛత్రపతి శివాజీకి
ఏ తీరుగ తీర్చినారొ ఇడుములను
ఏ విధముగ కూర్చినారొ గెలుపులను
2.పట్టుమని పదిలిప్తలు మది నిలుపగలేను
సారస్వత సాగరాన్ని ఆపోసన పట్టలేను
భవబంధాలనుండి బయటపడగలేను
ఏ తీరుగ తీర్చెదరో నా ఇడుములను
ఏ విధముగ కూర్చెదరో నా గెలుపులను
No comments:
Post a Comment