రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
మాటల మూట విప్పితే ప్రియా -
ముత్యాలను ఎద దాచుకుంటా
పలుకుల వాన కురిస్తే చెలీ -
తేనెధారలే వీనుల జుర్రుకుంటా
మనసైన నేస్తమా మౌనమే ప్రాప్తమా
భావనలే ఆత్రమవగ నేత్రభాష మాత్రమా
1.మదిసొదనే ఎరుకపరుచ సైగలే కష్టతరం
నా ఆర్తిని నివేదించ భాషకూడ పిపీలికం
అనుభూతిని సాంతం ప్రసరించనీ
నను మొత్తంగా నీలోకి ప్రవహించనీ
2.ప్రణయమే మనమధ్య ఒక యానకమై
మన నడుమన చొరబడు గాలికే భయానకమై
ఉపిరిలో ఊపిరిగా నను మననీ
ఒకే ప్రాణమని లోకమనని మనని
No comments:
Post a Comment