రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్( రాఖీ)
"ప్లవించనీ 'ప్లవ ఉగాది' జీవ గోదారిగా.."
ఓ కవి ప్లవ సరస భావనా ఉగాది
ఒక విప్లవ శోభన కవన నాంది
నవ జీవన పరిపుష్ట భవనపునాది
అశాస్త్రీయ విధానాల కిది సమాధి
విరులు పూయ ఎద ఆమని వనవాటిగా
గొంతు పెంచు కోయిలవై నిలదీయ సూటిగా
పచ్చడిచేయాలి వైరులార్గురుని ధాటిగా
జాతకాలనే మూఢంగా పాటించని మేటిగా
తెగులు తొలగ తెలుగులు తెగువ మీరగా
తెలుగువారి హక్కులకై ఎడతెగక పోరగా
తెలుగు భాష తెలుగుజాతి వెలుగు తీరుగా
తెరలు తీసి తెలుగు మనసు లొకరికొకరుగా
కరోనా నేపథ్యం ఆరోగ్యమె ప్రాథమ్యం
వ్యాయామం వదలక తెమలే దినచర్యం
అలవాట్లు మేలుకూర్చ మనకదే మహాభాగ్యం
అనందమె పరమావధి పొందవలదు వైరాగ్యం
No comments:
Post a Comment