జయహో తెలుగు సినీ కళామతల్లి నీకు జయం
జగన్మోహనుడే కొనితెచ్చె నీకు పూర్వ వైభవం
పసిపాపకు చందమామ నందించిన చందంగా
సామాన్యుడి వాకిటిలొ నిను ఆడిపాడ నిలిపెనుగా
అభినవ శ్రీ కృష్ణ దేవ రాయలుగా
అండగనిలిచాడు జగన్నీకు అపూర్వ కళాభిమానిగా
1.పాలాభిషేకాల ఉత్తుత్తి హీరోలు జీరోలౌతూ
అభిమానుల గుండెలపై తన్నేలా బాక్సాఫీసు రాజేస్తూ
వీక్షకుణ్ణి నిర్లక్ష్యం చేస్తూనే తాము ఎదిగేస్తూ
దారుణానికొడిగట్టారు ఫ్యాన్స్ నే పావులుగా ఎరవేస్తూ
వాస్తవాల నెరిగినపుడె అభిమానికి కనువిప్పు
గుడ్డిగా నమ్మితే ఎప్పటికైనా తప్పదు ముప్పు
2.వినోదాన్ని వ్యాపార పరం చేసే గుత్తాధిపత్యం
ఒకరిద్దరి కబంధ హస్తాల్లో చిక్కెను నీ భవితవ్యం
టికెట్టు రేటు శాసిస్తూ థియేటర్లుదాచేస్తూ పరిశ్రమను చేసారు అయోమయం
సామాన్యుడికెన్నటికి అందుబాట్లొ లేకుండా సిన్మా అయ్యింది ఓ గగనసుమం
గుప్పిటిలో నొక్కేసి లాభాలే ధ్యేయంగా నిను చేసిరి విషమయం
కరవాలం ఝళిపించి కట్టడి చేసె జగన్ మించనీక సమయం
3.సినిమాఫియా కోఱలు పెరికినాడు జగన్ జడవక
లోకాన నిజమైన హీరోగా వెలిసాడీ cm మడమతిప్పక
చిన్నా పెద్దా అనికాక ప్రతి సినిమాకొకే రీతి టికెట్టుగా జారీ చేసాడు హుకుం
విర్రవీగు సినీముఠాకు బుద్ధివచ్చునట్లుగా నేర్పాడు చక్కని గుణపాఠం
కళాకారులెందరి కృషితోనో వెలిగె నీ తెలుగు సినీ ఖ్యాతి
పేదోడికి ఏకైక ఊరటగా సేదదీర్చగా చల్లనైన నీ సన్నిధి
No comments:
Post a Comment