https://youtu.be/nzoS6uCcVFE
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఇంతి నీ అణువణువున చంద్రకాంతి
పూబంతి నీ మోము కనగ మదికి ప్రశాంతి
నిలువెల్లా వెల్లువై తెలుపు తెలుపుతోంది
పాలని బోలిన స్వచ్ఛత నీ మనసుదంది
1.తెల్లచీర అందాన్ని సంతరించుకొంది
నీ తనువును పెనవేసి పులకించింది
తల్లోన మల్లెమాల తరించిపోయింది
నీ కురులను అలరించి పరవశించింది
2.ఫక్కున నవ్వితే పల్వరుసే వజ్రదంతి
మిక్కిలి పరిమళమే నీకడ తెల్లచామంతి
చుక్కల మెరుపంతా నీ అక్కున జేరింది
నీ కదలిక తటిల్లతగ చూపరులకు తోచింది
No comments:
Post a Comment