Tuesday, September 8, 2026

 https://youtu.be/CfMyq2ItbEo

రాగం:మధువంతి


సౌభాగ్య లక్ష్మీ మాతా 

సౌహార్ద హృదయా ప్రియ దేవతా 

సౌందర్య లహరీ సమ్మోహితా

సౌశీల్య సుగుణా సురముని సంసేవితా

నీరాజనాలుగొను జననీ,నమోస్తుతే నారాయణీ


1.ముంగిట ముగ్గులు,మోమున సిగ్గులు,మోవిన నవ్వులు, తులసిసేవలు, సంధ్యా దీపాలు

అతిథులు,అభ్యాగతులు,ఆదరణలు,మర్యాదలు, ఇరుగుపొరుగులు,ఇల్లాలికి మెరుగులు

బంధుమిత్రులు,మంచిచెడ్డలు,పూజలు-నోములు,

పెళ్లిపేరంటాలు,విందులుయాత్రలు,సతికి సొబగులు

సంసారం సాకారమవగా,వ్రతఫలమందీయవమ్మా, మంగళదేవీ నీకు మంగళములు


2.పసుపు,కుంకుమ,పూలు,గాజులు,తాళి

సాధ్వికి నిత్య నయగారాలు

పతి,సంతతి,సదనము,సంపద,శ్రేయస్సులు నిజమగు సౌభాగ్యాలు

జాగృతి,స్వప్న,సుషుప్తి,తురీయ,తురీయాతీత స్థితుల నీ ధ్యాసలే వరములు

మా'కొనగూర్చు మాధవీ, అచ్యుత సహధర్మచరీ, శరణు శరణు నీ దివ్య చరణాలు

Sunday, August 30, 2026

నవ దుర్గ చాముండి 

పల్లవి

దండంబులు నీకివే చాముండేశ్వరి
చాముండి కొండ కొసన వెలసిన చండ ముండ సంహారి
మైసూరు పట్టణ వాసిని మాతా మాహేశ్వరి
పాలయ మాం పరిపాలయ మాం పరమేశ్వరి

చరణం – 1

క్రౌంచ పట్టణే చాముండీగా అష్టాదశ శక్తి పీఠ విఖ్యాతిని
అదృష్టమే దీన జనులకు నీ దివ్య దర్శనం దేవీ జగజ్జనని
దుష్ట దానవ శమనీ మానవ దురిత దూర కంకణ ధారిణి
వడయార్ రాజ వంశ సేవిత దసరా ఉత్సవ తేజో విరాజిని

చరణం – 2

నవరాత్రి ఉత్సవ అర్చిత నవ దుర్గా భవ తారిణి
దశ భుజి మహిష మర్దిని శరణాగత వత్సల శ్రేయో దాయిని
త్రిగుణాతీతా చతుర్వేద సన్నుతా పంచేంద్రియ సమ్మోహిని
షట్చక్ర దీపిని సప్తవ్యసన హారిణి అష్టకష్ట నివారిణి

Sunday, June 7, 2026

         గురువులకు జగద్గురువీవనీ 
         గురువారమ్మని పిలిచితి శరణం శరణమనీ 

ఓం స్వామి శరణం అయ్యప్ప శరణం 
ఓం స్వామి శరణం మణికంఠ శరణం
మాయలు చేసి భ్రాంతిలొ ముంచీ
నీ నుంచి దూరముంచుతావేమయా

ఓం స్వామి శరణం అయ్యప్ప శరణం 
ఓం స్వామి శరణం మణికంఠ శరణం

చపలమైన చిత్తము-చేయనీదు ధ్యానము
వగలమారి నేత్రము-కనదు నిన్ను మాత్రము
పూర్వ జన్మ పుణ్యము-ఎరుగనంది ప్రాణము
చేతనైన సాయము-చేయకుంది దేహము
నా మాటే వినకుంది- నాప్రతి ఇంద్రియము
నీ దీవెన లేకుంటే -పొందను ఏ జయము
కరుణాంతరంగ పాహి పాహిమాం

ఓం స్వామి శరణం అయ్యప్ప శరణం 
ఓం స్వామి శరణం మణికంఠ శరణం
మాయలు చేసి భ్రాంతిలొ ముంచీ
నీ నుంచి దూరముంచుతావేమయా

ఓం స్వామి శరణం అయ్యప్ప శరణం 
ఓం స్వామి శరణం మణికంఠ శరణం

నిన్ను నమ్ముకుంటిని-నడవలేని కుంటిని
చేయిపట్టినడిపించమని- నిన్ను వేడుకుంటిని
దారులన్ని మరిచాను-బేజారై నిలిచాను
అంధకార మార్గమంతా-ఆతృతగా వెదికాను
నీవే పరంజ్యోతివని-సత్యము నెరిగితిని
దారే చూపించమని నిత్యము కోరితిని
శరణాగతావన రావె వే వేగమే

ఓం స్వామి శరణం అయ్యప్ప శరణం 
ఓం స్వామి శరణం మణికంఠ శరణం
మాయలు చేసి భ్రాంతిలొ ముంచీ
నీ నుంచి దూరముంచుతావేమయా

ఓం స్వామి శరణం అయ్యప్ప శరణం 
ఓం స్వామి శరణం మణికంఠ శరణం
ప్రేమరూపాయ విమల చిత్తదాయకాయ 
షణ్ముఖ సోదర అయ్యప్పా సాష్టాంగ వందనం 
స్వామి శరణంటూ నినుచేరవచ్చేమయ్యా 
సచ్చిదానంద రూప సామగాన వందనం 

భూతనాథునీ దివ్య విగ్రహం-సర్వమంగళం మదికి నిగ్రహం 
మణికంఠునీ భవ్యవీక్షణం-మలయమారుతం పరమ పావనం 

కరుణకురియు స్వామి చూపు-మంచు కన్న శీతలం 
ప్రభలు చిలుకు స్వామి రూపు-అత్యంత సుందరం 
స్వామి చిత్రమే ముగ్ద మోహనం-స్వామి తత్వమే మోక్ష కారకం

 ప్రేమరూపాయ విమల చిత్తదాయకాయ 
షణ్ముఖ సోదర అయ్యప్పా సాష్టాంగ వందనం 
స్వామి శరణంటూ నినుచేరవచ్చేమయ్యా 
సచ్చిదానంద రూప సామగాన వందనం 

భూతనాథునీ దివ్య విగ్రహం-సర్వమంగళం మదికి నిగ్రహం 
మణికంఠునీ భవ్యవీక్షణం-మలయమారుతం పరమ పావనం 

వెతలు మాపు స్వామి చూపు- జ్య్తోత్స్నకన్న హాయి 
అంధులకిల దారి చూపు-పరంజ్యోతి స్వామి
శబరిధాముని చిద్విలాసము-పాపహారకం పర సౌఖ్యదాయకం

 ప్రేమరూపాయ విమల చిత్తదాయకాయ 
షణ్ముఖ సోదర అయ్యప్పా సాష్టాంగ వందనం 
స్వామి శరణంటూ నినుచేరవచ్చేమయ్యా 
సచ్చిదానంద రూప సామగాన వందనం 

భూతనాథునీ దివ్య విగ్రహం-సర్వమంగళం మదికి నిగ్రహం 
మణికంఠునీ భవ్యవీక్షణం-మలయమారుతం పరమ పావనం 

మత్తుమందు స్వామి చూపు- మదికి ఇంద్రజాలము 
కనులవిందు స్వామి రూపు - మణుల ఇంద్ర నీలము 
స్వామి నీడలో ఎద పారవశ్యము- అనుభవమ్ములో నమ్మశక్యము 

ప్రేమరూపాయ విమల చిత్తదాయకాయ 
షణ్ముఖ సోదర అయ్యప్పా సాష్టాంగ వందనం 
స్వామి శరణంటూ నినుచేరవచ్చేమయ్యా 
సచ్చిదానంద రూప సామగాన వందనం 

భూతనాథునీ దివ్య విగ్రహం-సర్వమంగళం మదికి నిగ్రహం 
మణికంఠునీ భవ్యవీక్షణం-మలయమారుతం పరమ పావనం 


సిద్ది వినాయక స్వామి స్వామీ 

నా మీద నీకింక దయరాదేమీ


సిద్ది వినాయక స్వామి స్వామీ 

నా మీద నీకింక దయరాదేమీ


పాడితి నీగీతి ప్రతి నిమిషమ్మున

వేడితి గణపతి నిను వేవిధముల

కొలిచితి నిన్నూ శతకోటి రీతుల

తలచితి నీనామ మనంత మారుల


సిద్ది వినాయక స్వామి స్వామీ 

నా మీద నీకింక దయరాదేమీ


లయ నేనెరుగను కరతాళములే

రాగము లెరుగను భవరాగములే 

తపముల నెరుగను తాపత్రయములె 

వేదము లెరుగను నీపాదములే


సిద్ది వినాయక స్వామి స్వామీ 

నా మీద నీకింక దయరాదేమీ


Tuesday, December 9, 2025

 

https://youtu.be/1zxSMvc2ff0?si=1faBW6s8u2szQvbO

[రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:శివ రంజని


ఎంత చమత్కారము నీ సాక్షాత్కారము

ఎంత మనోల్లాసము నీ సుందర దర హాసము

ఎంత సుధామధురము నీ తారకనామం

ఎంతగ్రోలినా గాని తనిదీరదు స్వామి శరణం

స్వామియే శరణము అయ్యప్పా శరణము


1. నీ దర్శన భాగ్యమైతె బాధలన్ని తొలగేను

చిరునవ్వుల వరమిస్తే చింతలు ఎడబాసేను

నీ సన్నిధిలో నిలిస్తె మనశ్శాంతి దొరికేను

నీ కరుణే లభియిస్తే బుద్దివిమలమయ్యేను

స్వామియే శరణము అయ్యప్పా శరణము


2. నీ నామం స్మరియిస్తే సంపదలే కలిగేను

నీ ధ్యానం వహియిస్తే ఆపదలే తొలగేను

నీ మహిమలు కీర్తిస్తే సచ్చిదానందమే

బ్రతుకే నీకర్పిస్తే మనిషి జన్మ ధన్యమే

నాజన్మ ధన్యమే

స్వామియే శరణము అయ్యప్పా శరణము

Monday, October 6, 2025

 

https://youtu.be/2mNpvbGK2ck

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:జోగ్


బ్రహ్మచారిణి దివ్య యోగిని శివకామిని

వేదరూపిణీ మోదదాయిని నాదవినోదిని

తపఃశాలిని తమోదూరిణి తత్త్వబోధిని 

సంకల్పసిద్ధిని దీక్షాదక్షిణి నమో లోక పావని 


1.జపమాలా కమండల కర భూషణి

శ్వేతాంబరధర శోభిణీ దిగంబరధర మోహిని

పారాయణీ నారాయణి దాక్షాయణి

దుర్గా అవతారిణి శరణాగత సంరక్షిణి


2.ప్రకండాసుర దహని ప్రకీర్తి ప్రసాదిని 

భవ రుజభంజని దేవీ నిజ శివరంజని 

నిరంజని నిశ్చల భక్తి జ్ఞాన వైరాగ్యకారిణి

పాహిమాం పరమేశ్వరి ప్రణతోస్మి జనని

Saturday, October 4, 2025

 శ్రమిస్తేనే విజయం విశ్రమిస్తే నెరవేరదు ధ్యేయం 

శ్రమయే జీవన సౌందర్యం శ్రమతో నరుల వికాసం 

ప్రపంచ కార్మికులారా మీదే నేడే మే డే సంబరం 

భవిష్య విధాత లారా మీరు చేసే సృజనే అబ్బురం 

జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా


1)ఘర్మజలం పారించే జీవ నదులే మీరు

అహరహం ఆరక మండే సూర్యులు మీరు

యంత్రాలను నడిపించే  ఇంధనాలు మీరు

సూత్రాలను పాటించే కఠిన నిబద్దత మీ తీరు

జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా


2)బడుగు జీవుల అవసరాలు మీవల్లనే తీరు

మధ్యతరగతి సౌకర్యాలు మీ శ్రమతో నెరవేరు

సంపన్నుల విలాసాలకు మూలం చక్కని మీ పనితీరు

మీరు లేని రంగమేది మీ సమ్మెతొ జగమే బేజారు

జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా


3)ఎదుగు బొదుగు లేనివి అనాదిగా మీ జీవితాలు

ఆచితుచి పెంచుతారు పోరాడితేనే మీకు జీతాలు

అడుగు అడుగులో పొంచి ఉండే  ఎన్నో ప్రమాదాలు 

కర్మాగార కాలుష్యలకు బుగ్గిపాలు మీఆయు రారోగ్యాలు

జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా


4) లాభాలకై వెంపర్లాటలొ లాలూచితొ యాజమాన్యాలు

జిత్తులు కుయుక్తులెరుగక కార్మికులకు బలి పీఠాలు

ఒక్కతాటిపై కార్మికులంతా చక్కని బాటలొ సాగాలి

వేరుకుంపట్ల కుమ్ములాటలను విజ్ఞత బాయక వీడాలి

జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా


Thursday, September 25, 2025


https://youtu.be/RB9hg8sPRuc

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:శివరంజని


చంద్రఘంట నామాంకిత మాతా 

నవ దుర్గాంతర్గత త్రయో దివస ప్రకటిత 

చంద్రఖండ, చండికా, రణచండీ నామాంతర ప్రఖ్యాత 

దేహిమే నిరంతరం దేవీ తవ పాద సేవా ప్రసాదమ్

పాహిమామ్ పాలయమామ్ అహరహం కుమార విధమ్


1.తేజోరూపిణి ఓజోదాయిని అర్ధచంద్ర శిరోభూషిణి

రజోగుణ విరాజమాన ఫాలనేత్రి తీక్షణ వీక్షణి దాక్షాయణి 

విజయదుర్గ అవతారిణి దురిత ధూమ్రలోచను సంహారిణి

అష్టభుజీ అష్టాయుధ ధారిణి శార్దూలాధిరోహిణి సామ్రాజ్ఞి

పాహిమామ్ పరిపాలయమామ్ అహరహం కుమార విధమ్


2.భగవతి భవాని నిర్గుణి నిరంజని భవరుజ భంజని

భవతారిణి శివ భామిని కారణభూత సంభూత జనని 

శుంభ నిశుంభ దంభ నాశిని దుష్ట దానవ నష్టకారిణి 

జగదాంబా శాంభవి లంబోదర సృజని నీరాజనమిదే పావని

పాహిమామ్ పరిపాలయమామ్ అహరహం కుమార విధమ్


Friday, August 22, 2025

https://youtu.be/fVpvef5Ptx8


వినాయక చవితి పండుగ

ఊరంతా సందడి సందడిగా

ఉత్సాహం గుండెల నిండుగా

పిల్లలూ పెద్దలంత దండుగా

పూజలు భజనలు-మారుమోగుతుండగ

నవరాత్రి జరుపగ - మా కలలె పండుగా

​గణపతి బప్పా నీకు కోటి దండాలు

వక్రతుండ రానీకు మాకు ఏ గండాలు


​ఎలుక నెక్కి రావయ్య చక చక చక

ఓ బొజ్జ గణపయ్య గజ్జెల్ ఘల్ ఘల్మన

గుజ్జు రూపు దేవ రార బిర బిర బిర

జై జై విఘ్ననాయక మా ఒజ్జ నీవేర

సిద్ధంగుంది నీకొరకు సక్కనైన వేదిక

ముజ్జగాల ఏలికా మమ్ము గావు నీవిక

​గణపతి బప్పా నీకు కోటి దండాలు

వక్రతుండ రానీకు మాకు ఏ గండాలు


అమ్మ నీకై పానంబోసె నలుగుపిండిబొమ్మకే

అయ్యనైన ఆపిన్నావు అమ్మ మాట తియ్యకే

అగ్గిబుక్కి కుత్కెదెంపె నువ్వు పోరు జెయ్యగ

పార్వతమ్మ వెక్కిఏడ్వ ఊర్కవెట్టె పెన్మిటిగ

ఏన్గుతలతొ అత్కినాడు హరుడు నీకు నేర్పుగ

గణపతిగ నిన్నుచేసె అమ్మ మనసు మురియగ

​గణపతి బప్పా నీకు కోటి దండాలు

వక్రతుండ రానీకు మాకు ఏ గండాలు

Saturday, July 19, 2025


https://youtu.be/_TJuG510RTI?is=BLvPBro61i1RwTt3

ఎంతా సక్క గున్నాడో -సుక్కల్లో సందామావలా/

దినాము పున్నమి లెక్కనే -ఆడు తోడుగ నా పక్కనుంటే/

ఎంత ముద్దు గున్నాడో - తూరుపింటి తొలిపొద్దులా/

బురుదలొ తామర పువులా -సంబుర పడ్తా ఆణ్ణి సూత్తా ఉంటే/

ఏడేడు జన్మలు ఎదిరిసూత్త బెమ్మ దేవుడో - ఆడు మనువాడుతానంటే/

కమ్మాని ఆ కలగంట నా కంటా -ఇత్తే గిత్తే ఆ భాగ్గె మియ్యాలి

నాకంటా 


1.అందని ద్రాచ్చ గుత్తులే ఆని మత్తయిన గమ్మత్తు కైపుకళ్లు/

సూపులు సూపుల్తో కలిత్తే సొత్తాయి గుండెన తుపాకిగుళ్ళు/

కండలు దిరిగిన సేతుల్తో ఆడు ఊపిరాడ నీక కావలిస్తే/

ఊడిగమే నే సేస్త నా బతుకంతా మారు మాటాడక కావలిస్తే/


ఏడేడు జన్మలు ఎదిరిసూత్త బెమ్మ దేవుడో - ఆడు మనువాడుతానంటే/

కమ్మాని ఆ కలగంట నా కంటా -ఇత్తే గిత్తే ఆ భాగ్గె మియ్యాలి

నాకంటా /


2.ఆడింటి ముంగిట్లోముగ్గునవుతా గొబ్బినవుతా నాకోసం కూసింత నవ్వాడంటే/

పంటికింద సికెన్ నవుతా పడకింట సిలక నవుతా కాసింతనాతో జత గూడాడంటే/

ఆడెదురు పడ్తే బెదురు గొడ్డు నవుతా - అని గాలిసోకిందా ఎగిరే ఎండు గడ్డి నవుతా/

ఏలుకుంటే గంతేసి ఆడికి ఆలినవుతా- పంచన ఉంచు కున్నామానే బాంచ నవుతా/


ఏడేడు జన్మలు ఎదిరిసూత్త బెమ్మ దేవుడో - ఆడు మనువాడుతానంటే /

కమ్మాని ఆ కలగంట నా కంటా -ఇత్తే గిత్తే ఆ భాగ్గె మియ్యాలి

నాకంటా


OK

Monday, June 16, 2025

 https://youtu.be/vHwBYAYUDug

ఆషాఢ మాసం అమ్మవారి బోనాల పాట

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నల్లా పోచమ్మా-తల్లీ పోచమ్మ
సల్లంగ గాచేటి దయగల్ల మాయమ్మ
మీరుపేటలోన జోరుగ వెలిశావు
మైమలెన్నొ జూపుతూ మైలోన నిల్చావు

1.పానాలు నీ మీద పెట్టుకొచ్చినాము
బోనాలు నీకనీ నెత్తినెత్తితెచ్చినాము
ఒడి బియ్యం చీర సారె పట్టుకొచ్చినాము
ముడుపులన్ని ఒడుపుగా మూటగట్టుకొచ్చినాము

2.మేళతాళాలతో ఊరేగివచ్చినాము
సుట్టపక్కాలను కూడగట్టుకొచ్చినాము
ఆటపాటలాడుతూ నిన్నునమ్మి వచ్చినాము
ఆదరించి చేరదీయమంటువేడ వచ్చినాము

Friday, June 13, 2025

 https://youtu.be/moAraBHFl2w


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ఉదయ రవిచంద్రిక


సాత్విక రాజస తామస గుణాధీనులు -లోకములో సకల జనులు

సహజాతముగానే త్రయీ గుణ ప్రభావితములు-శ్రద్దా విశ్వాసయుత మానసికములు

కర్మ ఏది చేసినా ఫలితములన్నీ త్రిగుణాన్వితములు

యజ్ఞ తపో దానములందును గుణత్రయాలు -నిత్యత్వములు


1.ఆహార విహారాదులూ గుణత్రయ సంయుతములు

సాత్వికారాధకుల దైవాలు ముక్కోటి దేవీ దేవతలు

రాజస మనుజులకు పూజార్హులు ఇల యక్ష రాక్షసులు

తామసోపాసకుల కొలుపుల కొరకు భూతప్రేత గణములు


2.శాస్త్రవిధి సమ్మతమై ఫలాపేక్ష రహితమైనదే సాత్విక యజ్ఞము 

కామేష్టిగా గర్విష్ఠిగా పటాటోపముతో ఒనరించేదే రాజస యజ్ఞము 

మొక్కుబడిగా తడబడుతూ యధేచ్చగా జరుపబడేది తామస యజ్ఞము 

సర్వోత్కృష్టమే యజ్ఞ క్రతువైనా అది గుణత్రయాతీతమగుట సత్య దూరము 


3.మనోవాక్కాయకృతమైన త్రయీమయ తపస్సులూ త్రిగుణ సంపన్నములు 

శ్రద్ధాసక్తులతో విశ్వాసముతో ప్రతిఫలమాశించక సలిపేవి సాత్విక తపస్సులు 

డాంభిక దర్పములతో కీర్తికాంక్షతో ఆచరించు తపములు రజోగుణ రుచస్సులు

క్షుద్ర సాధనతో బలుల సమర్పణ ఆత్మార్పణతో చేసే భూత సంప్రీతులు నిజ తమస్సులు


4.విధినిర్వహణగా ఎంచి నిష్కామనగా నొనరించిన గుప్తదానము సాత్వికము

విధిలేక ఇచ్చెడి విరాళము పేరునెరుకపరచు విధానము రాజస గుణము

విదిలించెడి తీరుగా తన పాపములు తీరగ వేసే బిచ్చము తామసిక దానము

ఉన్నప్పుడు ఇచ్చేది ఉన్నంతలో ఇచ్చేది ఉన్నదంతా ఇచ్చేది దాన గుణత్రయ సోదాహరణము



 

https://youtu.be/P9Cl39biRiE

నశ్వరమే దేహము నరవరా 

త్రిగుణాన్వితమిది ఎరుగరా 

సత్వ రజస్తమో గుణతత్వములను పరిహరించరా

ముక్తినొందగల విధమిదె విని పరిగ్రహించరా


1.ఉత్తమము ఉన్నతము ఉర్విలో సత్వగుణము

శాంతి సదాచార సద్గుణములు దీని లక్షణము

తపో దాన త్యాగాదులచే సులభమే ఆచరణము

సాత్వికత నోచని జీవుల జన్మలు చర్విత చరణము


2.కాంక్ష అసంతృప్తి పరితాపములు రాజసము

 కామ్యకర్మల వలలో చిక్కిన ఆత్మ నిర్భాసము

జనన మరణ వలయంలో జీవులు తృణ ప్రాయము

తాపత్రయాలకు బద్ధులై కోల్పోదురు విశ్వాసము


3.తామస ప్రవృత్తి మనుషులలో అధమాధమము

సోమరిగా మత్తు భ్రాంతి లో కొనసాగు జీవనము

మాయ మోహితమై బ్రతుకంతా అజ్ఞానాంధకారము

 మరుజన్మలలో వారి పుట్టుక ఇక జీవజంతు జాలము


4.త్రిగుణాతీతుడు సృష్టి లొ ఒకడే పరమాత్ముడు

స్థాయీ భేదమున్నా మనుజుడు త్రిగుణాత్మకుడు

ఈశ్వర శరణాగతిచే ద్వంద్వాతీతుడు మానవుడు

సమత్వదృష్టి వృద్ధినొందగా కాగలడు మొక్షార్హుడు

Friday, May 9, 2025

 https://youtu.be/Qt9Nch8ds_g?si=hz8atJPq11rfnia4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లిరాంకిషన్ రాఖీ


రాగం:దర్బార్ కానడ


గీతను దాటని రఘుపతి నేను 

ఈ రాముని బాటలొ సీతే తాను 

పంచత్రింశతి వత్సర మా అపురూప కాపురానా 

ప్రేమానురాగాలతో నిండే మా దాంపత్య ఖజానా 


1.అన్నీ తెలుసను తన అమాయకం 

అణుకువగా ఆరనవ్వుతొ నా వినయం 

అమ్మగా తానై అనునయించే ఆ వైనం 

ఆ తరుణీక్రాంతమైతేనే ఎంతో నయం 


2.లోకంతో మమేకమయ్యే తన సంఘీభావం 

  నాతో నేనే ఐక్యమయ్యే నా ఏకాంత తత్వం 

ఉత్తమ లక్షణాలతో తనదేమో క్షితిజ వ్యాపకత్వం 

ఉన్నత లక్ష్యాలతో నాదిక శిఖర సమాధిరోహణం

 https://youtu.be/eedKx1K0vrc


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లిరాంకిషన్ రాఖీ


అలవోకగ గడిచాయి - అరవైరెండు వసంతాలు

అనుభూతుల గురుతులన్ని - చేదు తీపి మిళితాలు 

ఊరికి దూరంగా - నా హృదయానికి చేరువగా 

సాగనీ నా ఆలోచనలు - మూగనీ పారమార్థిక చింతనలు 

నేడు నా పుట్టినరోజైన సందర్బంగా 

కడతేరనీ నీ పదముల నను నిబ్బరంగా 

నీ కృపతో లక్ష్మీ నరసింగా-మా ధర్మపురి నరసింగా 


ఏటికి గోదాటికి ఎదురీతే వృధా వృధా

వాలుకు సాగిపోతే ప్రశాంతతే సదా సర్వదా

సహజంగా జీవిస్తే  సంతసమనిపించదా 

యథాతథపు బ్రతుకెపుడూ సంతృప్తి నీయదా

నేడు నా పుట్టినరోజైన సందర్బంగా 

కడతేరనీ నీ పదముల నను నిబ్బరంగా 

నీ కృపతో లక్ష్మీ నరసింగా-మా ధర్మపురి నరసింగా


కోరితేనే కదా తీరని కోరికలే కలిగించు వెతలను 

ఊహిస్తేనే కథా కథనం ఉస్సూరనిపించు మతులను 

ఆస్వాదిస్తే ఆ క్షణమిస్తుంది అపూర్వ బహుమతులను 

అడుగులో అడుగేసి నడిస్తే విడదీయదేవిధి దంపతులను 

నేడు నా పుట్టినరోజైన సందర్బంగా 

కడతేరనీ నీ పదముల నను నిబ్బరంగా 

నీ కృపతో లక్ష్మీ నరసింగా-మా ధర్మపురి నరసింగా

Tuesday, April 22, 2025

 https://youtu.be/908qgrG3CvI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం: మధ్యమావతి

తిరుమలేశు వాసిగొలిపె అన్నమయ్య పదములు
రామభద్రు జాడ తెలిపే శ్రీ రామదాసు కీర్తనలు
ధర్మపురి నరసింహుని ఖ్యాతినిలిపె
భక్త కవి శేషప్ప నుతించిన పద్యములు
నరసింహ శతక పద్యములు
ప్రాతః స్మరణీయుడు కవి శేషాచల దాసు
మా ధర్మపురీయుడు కాకుత్సమ్ శేషాచలదాసు

భిక్షటన వృత్తిగా హరినామ సంకీర్తనే ప్రవృత్తిగా
నరసింహుని భక్తులలో అపర ప్రహ్లాదుడు
నరహరి త్రిశతి నభినుతించిన నిత్యసిద్ధుడు
నృకేసరి శతపద్యకృతి వెలయించిన ప్రసిద్ధుడు
ప్రాతః స్మరణీయుడు కవి శేషాచల దాసు
మా ధర్మపురీయుడు కాకుత్సమ్ శేషాచలదాసు

భూషణ వికాస శ్రీ ధర్మపురనివాసా-దుష్ట సంహార నరసింహ దురితదూర
పద్య మకుటమెరుగని మాన్యులేరి సామాన్యులేరి
శేషప్ప కవి ప్రణీత పద్యమేలేని పాఠమేది తెలుగు పాఠమేది
శేషప్పనెరుగని తెలుగు పండితులేరి ధర పామరులేరి
ప్రాతః స్మరణీయుడు కవి శేషాచల దాసు
మా ధర్మపురీయుడు కాకుత్సమ్ శేషాచలదాసు

లక్షాదికారికీ లవణమన్నమేయన్నది నానుడిగ వాడబడే
తక్షణ హరినామస్మరణ అగత్యమన్న నుడి నుడివే ఆనాడే
మోక్షమొక్కటే అక్షరసిరి యని దాతృత్వఘనత నెరిగించినాడే
లక్షలాది జనుల నాలుకలపై రోజూ ఆయన పద్యాలు నాట్యమాడే
ప్రాతః స్మరణీయుడు కవి శేషాచల దాసు
మా ధర్మపురీయుడు కాకుత్సమ్ శేషాచలదాసు

Monday, April 21, 2025

 https://youtu.be/N_oYzTSO8pQ?si=UPHpE2m01qcDs7MN


ఉలికి పడుదు వేలనే చిట్టి బంగారు

కలత చెందనేలనే కలికీ కంగారూ

సాత్వికమైనది నీ మనస్తత్వము

ఆత్మీయ మైనది నీ స్నేహితత్వము 

నీ చెలిమిని కోరుదునే జీవితాంతము 

మన మైత్రియె ఇలలో ఆదర్శ వంతము


1.మంచియని భ్రమించి వేశావు తప్పటడుగు

వంచనతో పరితపించ స్మృతుల కన్నీటి మడుగు

ఎంచి చూడ నమ్మిక అంటే నీకొక మోసపు తొడుగు 

తప్పించుకొనుటకు మాటల కప్పదాటు నీకొక గొడుగు 


2.చేదు అనుభవాలతో స్నేహమాయే నవ్వులాట 

అపవాదు మోసినందుకా నిత్యం డోబూచులాటా 

అనుమానం పెనుభూతం పాటించు జాగ్రత్తల చిట్టా 

నిజమైన నేస్తలను వదులుకుంటే బ్రతుకంతా కటకటా 

Tuesday, April 15, 2025

https://youtu.be/YErqllhxywg?si=9cM2_8W8DA6ijJqx


నేనంటూ ఉండను రేపటి చోటులో 

నాకంటూ ఉండదు స్థానమేది కవనబాటలో 

బ్రతికుంటా చితి కాలినా నా ప్రతి పాటలో 

నినదిస్తా పాడేగొంతులో స్పందిస్తా ఎద ఎదలో 


1.అక్షరమవుతా అక్షరమై లక్షల మంది యాదిలో

నిలిచిపోతా నే నిత్యమై గీతిని మెచ్చే ప్రతి మదిలో 

గానమై నర్తిస్తా ఆనందంగా కదిలే పెదవుల వేదికపై 

ప్రాణానికే హాయినిస్తా ఆహ్లాదంగా తేలి వచ్చే వీచికనై 


2.ఏ కోవెలలోనో హారతి కృతినై స్వామిని ఆర్చిస్తా 

ఏ భక్త బృందంలో భజన కీర్తనగా స్వాముల నలరిస్తా 

తొలి చూపుల భావనకే ఊతమై ప్రేమికులనే జతజేస్తా 

లాలిపాడే అమ్మ పాటనై బుజ్జాయిని నే బజ్జో పెడతా 


OK

 https://youtu.be/d2z0aW3zwGg


నా కనుకొలుకుల పారేను గంగా యమునలు

నా హృదయమునందేలా తీరని ఈ తపనలు

అధిపత్య పోరులో నాపై నిప్పు నీరుల ఆగడాలు 

సతమతమై పోతున్నా తీర్చ లేక వైరుల జగడాలు


1.చిన్ననాడు ఒంటరిగా దిగులుతో కంట నీటిఊటలు 

ఉన్నవాడు అణగ ద్రొక్కితే ఎడదలో రేగెను పెనుమంటలు

సాటివారు చెలిమిపేర గేలిచేస్తే నయనాలాయే చెలమెలు

పోటీల్లో అన్యాయంగా నను ఓడిస్తే గుండెలో జ్వాలలు


2.తొలి ప్రేమలో నమ్మించీ చెలి నను వంచిస్తే అశ్రుధారలు

 నా... నోటి ముందరి ముద్దనూ కక్షగా లాగేస్తే అగ్ని జ్వాలలు

మారేనా ఈ జన్మకు నా బ్రతుకే...... నే చితిలో కాలే దాకా

అరేనో దుఃఖపు కీలలు ఆగేనో అలజడులు నే కడతేరాకా


Ok