రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
మా ఊరు ధర్మపురి- మాదైవం నరహరి-గలగలా పారే -గోదావరి మాకు సిరి-జగతిలోనలేనె లేదు దీనికేదీ సరి-కళలకు కాణాచి- వేదాలకు పుట్టిల్లు-విద్వఛ్ఛికామణుల కాలవాలమైనది
gamanika:
నా టివి ప్రోగ్రాం మరియు రికార్డ్ అయిన పాటలకోసం(naa recorded songs and TV show-plz click the links)
- -కొత్త పాటలు -UPDATED ON 13-11-2012RAKI-SRI MANIKANTHA MAHIMA
- కొత్త పాటలు -UPDATED ON 13-11-2012-RAKI-SRI MANIKANTHA GEETHARCHANAM
- కొత్త పాటలు -UPDATED ON 13-11-2012 RAKI-OM GAM GANAPATHAYE NAMAHA
- DHARMAPURI NRUSIMHAA-27-02-2012 VIDUDALA UPLOADED ON 28-02-2012
- VEMULADA RAJANNA MANASU VENNA SHIVARATRI-2012 VIDUDALA UP LOADED ON 28-02-2012
- e link nundi kuda "DAYAMRUTHA VARSHINI"AUDIO SONGSdownload chesukovacchu
- FREE DOWNLOAD AVAILABLE/ PLZ PUT A COMMENT REGARDING LYRICS TUNES MUSIC AND SINGERS @ naa geethaalu(my recorded audio songs
- ***NEW ONE/RAKI-DAYAMRUTHAVARSHINI RELEASED ON 25-09-11-updated on 22-10-2011)
- my elder son short film
- naa videos ayyappa,maa tv,dharmapuri utsavalu pandugalu.godavari
- కవితల కలకలం(వచన కవితలు)
- నిత్యం-నానే-సత్యం(నానీలు)
Thursday, October 21, 2021
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
Monday, October 18, 2021
OK
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నందనవని నీ మానసం ఆహా-నిన్న ఎంత సుందరం
సుడిగాలి చెలరేగి అయ్యో -నేడు చిందరవందరం
వివిధ వర్ణ విరి శోభితం-నీమది ప్రశాంతమౌ వసంతం
భీభత్సపు వానలు ముంచగ-మోడుబారి ఇపుడో శిశిరం
నందనవని నీ మానసం ఆహా-నిన్న ఎంత సుందరం
సుడిగాలి చెలరేగి అయ్యో -నేడు చిందరవందరం
వివిధ వర్ణ విరి శోభితం-నీమది ప్రశాంతమౌ వసంతం
భీభత్సపు వానలు ముంచగ-మోడుబారి ఇపుడో శిశిరం
పలుకులు తలపించె నాడు-మెలికలతొ పారే సెలయేళ్ళు
నవ్వుల్ని రువ్వితె చాలు-ఎదలొ దుముకు జలపాతాలు
నీ మౌనమిపుడాయే నేస్తమా -గాంభీర్య గౌతమి పగిది
నీ హృదయమనిపించే ప్రియతమా అగాధాల జలధి
నందనవని నీ మానసం ఆహా-నిన్న ఎంత సుందరం
సుడిగాలి చెలరేగి అయ్యో -నేడు చిందరవందరం
వివిధ వర్ణ విరి శోభితం-నీమది ప్రశాంతమౌ వసంతం
భీభత్సపు వానలు ముంచగ-మోడుబారి ఇపుడో శిశిరం
నీ కనులు కురిపించాయి అపుడు -పగలైనా వెన్నెలలు
నీ చెలిమి అలరించినంతనే తొలగినాయి ఇట్టే నా వేదనలు
మూగవోయింది వీణ - తీగలే తెగిపోయి- మూలబడి
రాగాలు మరిచింది తాను - నలుగురిపై గురిపోయి- తడబడి
నందనవని నీ మానసం ఆహా-నిన్న ఎంత సుందరం
సుడిగాలి చెలరేగి అయ్యో -నేడు చిందరవందరం
వివిధ వర్ణ విరి శోభితం-నీమది ప్రశాంతమౌ వసంతం
భీభత్సపు వానలు ముంచగ-మోడుబారి ఇపుడో శిశిరం
https://youtu.be/MDmFMciHwjE?si=RbmdYIFbIPgP8Gdv
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:హుస్సేని
చూపించవయ్యా కైలాస మార్గము
నను చేర్చవయ్యా కైవల్య తీరము
మంచులాంటి మనసే నీది శంకరయ్యా
కురిపించు దయామృతం ఈశ్వరయ్యా
1.మూఢభక్తి నాది ముక్కంటి కనవయ్యా
గాఢానురక్తి నీపై పెంచుకుంటి లింగయ్యా
నాగుపాము ఏనుగుపాటి సేవచేతునయ్యా
ఆగలేను ఓపను నీ తావు తోవ నడ్తునయ్యా
2.చేసేను నిను కనగా గణపతి సోపతి
వాడేను దరిజేరగ సేనాపతి పరపతి
ఆదరించి బ్రోచునుమాయమ్మ పార్వతి
ఆలస్యమిక నీదే ఆనతీయ పశుపతి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఆత్రమేమొ నేత్రాల్లో
ఆర్తి దంతవస్త్రాల్లో
ఆగలేను ఇక ఎంత మాత్రము
చేస్తున్నా చెలి ప్రేమ స్తోత్రము
1.చూపు పంపు ఆహ్వాన పత్రము
వలపు తెలుపు దివ్య సూత్రము
కైపు రేపు నీ కాంతి వక్త్రము
నునుపు గొలుపు నవనీత గాత్రము
2.మనసేమో దయాపాత్రము
సొగసే అపురూప చిత్రము
వయసిక శృంగార శాస్త్రము
మన కలయిక కడు విచిత్రము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:నీలాంబరి
కోపముంటే కొట్టూ తిట్టూ
కినుక కలిగితె పీకను పట్టు
మాటలాడక చేయకు బెట్టు
నొప్పించను నిన్నిక ఒట్టు
చింతించనేల తీవ్రాతి తీవ్రంగా
మంత్రించనేల భవిత శూన్యంగా
1.అంతగా బాధించానా
ఎదలొ కత్తులు దించానా
మత్తుమందుపెట్టి మైకంలో ముంచానా
మాయమాటలే చెప్పి నిన్ను వంచించానా
చింతించనేల తీవ్రాతి తీవ్రంగా
దూషించనేల బ్రతుకు నాశంగా
2.నీ గాథనంతా జీర్ణించుకున్నాను
ఆవేదనంతా నే పంచుకున్నాను
కొనసాగలేమా శ్రేయోభిలాషులుగా
మన వ్యాపకాలే ఊపిరులవగా
చింతించనేల తీవ్రాతి తీవ్రంగా
శపియించనేల చితిని పేర్చంగా
FOR audio.. ping un whatsapp
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:ముల్తాన్
నీ గానమే రోజూ నా కవితౌతుంది
నీ మౌనమూ నాపాలిట పాటౌతుంది
నీ స్నేహం అపురూప వరమౌతుంది
నీ అలకతో నేస్తమా కలవరమౌతుంది
ప్రాయశ్చిత్తమేలేదా పశ్చాత్తాపానికి
విషాదాంతమేనా నా జీవితానికి
1.గాయాన్ని చేయాలంటే గుండెనే కోయాలా
గుణపాఠం నేర్పాలంటే ప్రాణమే తీయాలా
నువ్వు మన్నించకుంటే మనుగడే నాకు శూన్యం
నువ్వు చేయిసాచకుంటే నా ఉనికి కడు దైన్యం
ప్రాయశ్చిత్తమేలేదా పశ్చాత్తాపానికి
విషాదాంతమేనా నా జీవితానికి
2.నీ మనసులొ ఏముందో ఎలా తొంగి చూడను
తప్పుకొనగ ఎప్పుడు చూడకు నేను నీనీడను
దాపరికమేలేదు నా మదిలొ ఎన్నడునూ
నమ్మినా నమ్మకున్నా నీ చేదోడు వాదోడును
ప్రాయశ్చిత్తమేలేదా పశ్చాత్తాపానికి
విషాదాంతమేనా నా జీవితానికి
https://youtu.be/6t-BPLTzkJw
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
వర్షాకాలంలోనూ వన్నెల వసంతం విరిసింది
వానలు ముసిరినగానీ కన్నె కోయిల కూసింది
ఉల్లములో ఉప్పెనలా ఉద్వేగాలే ఉసిగొలుప
వలకాక వలపులతో వెల్లువలా పెల్లుబుక
1.ఒంటరి తానైతేమి ఈ తుంటరి లోకంలో
ఎందుకు మునిగుండాలీ పికము ఎప్పుడు శోకంలో
గున్నమావి కవిగామారి భావచివురులందిస్తుంది
ఎలుగెత్తీ గానంచేయగ ఎంతో పరవశిస్తుంది
2.పాట ఒకటి ఉంటేచాలు ప్రాణానికి సాంత్వన
ఆకలీ దప్పులు తీర్చును గాత్రామృతాస్వాదన
పంచభూతాలే శ్రోతలు పంచమాస్యా సదస్సున
శషభిషలు మానేసీ చెలఁగాలీ స్నేహ జగాన
Saturday, October 16, 2021
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
భావానికి అక్షరాల రేపర్ చుట్టి
పొందికైన పదాలతో రిబ్బన్ కట్టి
అందించా కానుకగా నామనసట్టిపెట్టి
ఉంచుకో ఎప్పటికీ గుండెలో నను దాపెట్టి
1.నిను గెలిచానే ప్రేమనే ఉట్టికొట్టి
నడవాలి ఏడడుగులు నా జతకట్టి
అడుగెట్టు నా ఎదలో మెట్టెల కుడి పాదమెట్టి
అధికారమిచ్చా నడిపించు నను గాడిలొ పెట్టి
2.ఆంక్షలే పెట్టుగాని ముంచకు నా పుట్టి
నీకోసం నీకోసం ప్రతిసారీ నే పుట్టి
జన్మలెన్ని ఎత్తినా వదలను నిను చేపట్టి
సేవించనీ నను హాయినీ స్వర్గాలు చూపెట్టి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
మెదడు తొలుస్తున్నావే కుమ్మరి పురుగువై
చెవిలొ పాడుతున్నావే తుంటరి దోమవై
మనసు గ్రోలుతున్నావే తమకపు తుమ్మెదవై
దాడి చేస్తున్నావే తలపులపై నీవే తేటీగవై
ఎలా తట్టుకోనే ఇంతటి నీ ప్రేమ ఒత్తిడి
చిత్తమంత చేసావే పుత్తడిబొమ్మా చిత్తడి చిత్తడి
1.మరాళమే మరలిచూచు నీ హొయలుకు
మయూరమే పురులు విప్పు నీ కురులకు
చకోరమే శశిని మరచు వెన్నెల నీ మేనని
పికమే భావించు కిసలయమని నీ మోవిని
ఎలా తట్టుకోనే ఇంతటి నీ ప్రేమ ఒత్తిడి
చిత్తమంత చేసావే పుత్తడిబొమ్మా చిత్తడి చిత్తడి
2.కస్తూరి విస్తుబోవు నీ దేహపు నెత్తావికి
నాగులెన్నొ నిన్నుజేరు మొగిలి వేదు గాత్రానికి
సీతాకోక చిలుకలే వాలి అతికేను నీ ఒంటికి
చాతకమే పరితపించు చెలీ నీ హర్ష వర్షానికి
ఎలా తట్టుకోనే ఇంతటి నీ ప్రేమ ఒత్తిడి
చిత్తమంత చేసావే పుత్తడిబొమ్మా చిత్తడి చిత్తడి
Friday, October 15, 2021
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
చీర జన్మ ధన్యమైంది నువు కట్టుకొంటే
అబ్బురపడిపోయెమది ఆ కనికట్టు కంటే
నగలమెరుపుతగ్గింది నువ్వు నవ్వుతుంటే
ఇంతకంటె ముదమేముంది నా బ్రతుకే నీదంటే
1.మబ్బు మురిసిపోయింది నీ జుట్టువంటిదంటే
పువ్వు పరవశించింది నీ పరిమళాన్ని పోల్చుతుంటే
పసిడి మిడిసి పడిపోయింది నీ మేనిరంగు తనదంటే
సింగిడి తలవంచింది నీ తనువు వన్నెలుచూస్తుంటే
2.సిందూరం రవిబింబమైంది నుదుట దిద్దుకుంటే
ముక్కెర ధృవతారయ్యింది దృష్టి తగులుతుంటే
కేణా వడ్డాణమైంది నీ నడుము కెట్టుకుంటే
సంగీతం తరించింది నీ అందెలసడి మంజులమంటే
OK
తలమునకలుగా ఉన్నావు తిరుపతి బాలాజీ
నీ దృష్టిని మరలించగ పాడెదను రాగమిదే వలజి
నీకెంతో ప్రియమని చల్లెద పరిమళమీ జవ్వాజి
నా బ్రతుకు తీరు మార్చివేయి కాకుండా గజిబిజి
వందనమిదె వేంకటేశ నను దయజూడు
వేడెద నిను వేదాత్మా వేగిరముగ కాపాడు
1.రాదాడి పోదాడిగ నీకడ భక్తుల తాకిడి
వింత వింత విన్నపాలు తీర్చగ నీకెంత ఒత్తిడి
ఏరోజు చూసినా నీగుడిలో సందడే సందడి
అలసినాను నినుజూడ పడిగాపులు పడిపడి
వందనమిదె వేంకటేశ నను దయజూడు
వేడెద నిను వేదాత్మా వేగిరముగ కాపాడు
2.కోరలేదు నిన్నెప్పుడు గొంతెమ్మ కోరికలు
అడగలేదు అప్పనంగ నాకు కీర్తిచంద్రికలు
మనశ్శాంతి లేక నాకు ఎన్నాళ్ళీ లుకలుకలు
ఆరోగ్యపరచు స్వామి ఇఛ్ఛలే మరీచికలు
వందనమిదె వేంకటేశ నను దయజూడు
వేడెద నిను వేదాత్మా వేగిరముగ కాపాడు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఎవరిగోల వారిదే ఎవరి శైలి వారిదే
ఎవరికోసమో తెలియక ఎగజిమ్మడం
ఎందుకోసమో ఎరుగక మోసెయ్యడం
ఎక్కడెక్కడివో ఏరుకొచ్చి తోసెయ్యడం
మినహాయింపులే లేవు సామాజిక మాధ్యమాన
వెర్రివాళ్ళమే అంతా ఈ వింత మిథ్యా జగాన
1.పుంఖాను పుంఖాలు పోస్టులు పోస్టుతాం
జన్మహక్కుగా భావిస్తాం స్పందనలెన్నోఆశిస్తాం
స్క్రోల్ చేస్తూ పరులవైతే చూడడమూ మానేస్తాం
పరిచయస్తులవి మొక్కుబడిగా లైకేస్తాం ట్యాగేస్తాం
మినహాయింపులే లేవు సామాజిక మాధ్యమాన
వెర్రివాళ్ళమే అంతా ఈ వింత మిథ్యా జగాన
2.వ్యక్తిగతపు స్పర్శనెపుడో చిత్రంగా కోల్పోయాం
హృదయంలో ఆర్ద్రతనే సమూలంగ తుడిచేసాం
యాంత్రికతను మనసుగా మార్చేసుకున్నాం
సరికొత్త బంధాలను ఆతృతగా అలుముకున్నాం
మినహాయింపులే లేవు సామాజిక మాధ్యమాన
వెర్రివాళ్ళమే అంతా ఈ వింత మిథ్యా జగాన
https://youtu.be/4hpQbsD9sdM?si=Z6BY7HBMvzK6k3J4
సరదాల కలబోత దసరా ఇది
దసరాన సరదాల సంబరాలివి
తెలంగాణకంతటికీ పండగంటె ఇదే ఇదే
బంధుమిత్రులందరికీ నా శుభకాంక్షలివే ఇవే
1.దేవీ నవరాత్రులకిది ఆలవాలం
శ్రీరామ విజయోత్సవ భవ్య కాలం
తిరుమల బ్రహ్మోత్సవ సముజ్వలం
ఆటపాట బతుకమ్మల కోలాహలం
2.ఆయుధ వాహన పూజలు ముందు
దైవ దర్శనాలతో మనసానందం పొందు
విందులు మందులే పండగలో బహు పసందు
బంధుమిత్ర సమాగమాన సంతసాలె చిందు
3.జయముల సమకూర్చు జమ్మి చెట్టు
శాంతి శుభాలకూ సంకేతం పాలపిట్ట
అలయ్ బలయ్ ఆలింగన ఆత్మీయత
పెద్దల దీవెనలందగ బంగారు భవిత
https://youtu.be/ayfN6xQ4QC8
తేయాకు చూర్ణేన కాళీమాత
క్షీరధార మిళితేన లక్ష్మీదేవి
పంచదార సంయుతేన సరస్వతి
త్రయిమాత్రేన సమన్వితం 'టీ పరమ పవిత్రం
1.సక్రమ కాలకృత్య ఉత్ప్రేరకం
కుశాగ్రబుద్ధి జాగృత ద్రావకం
శిరోవేదన ఉపశమన ఔషదం
ఏతత్ గుణ త్రయేన చాయ దైవరూపకం
2.క్షీర రహిత హరితమై ఆరోగ్య దాయం
మసాలాపూరితమై లాలాజలోదయం
బహువిధ రుచిపూతమై రసన రసమయం
ఆబాలగోపాలం సదా తేనీటి సేవన ప్రియం
https://youtu.be/5uHd0LtQ-14?si=vwxzR8Q71jZi0dEV
గ్రామదేవతవైనా సంగ్రామ విజేతవైనా
మహిషమర్దినివైనా దనుజ హారిణివైనా
జగన్మాతవు ఐనా జగన్మోహినివైనా
సర్వంసహా విశ్వమంత నీవే నీవే జనని
మము చల్లగ చూడవే నీ పిల్లలమే భగవతి భవాని
1.బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ భృత్యులే
ఇంద్రాది దేవతలు నీ పరిచారకులే
సప్తమహా ఋషులు సైతం నీ సేవకులే
అఖిలాండకోటి బ్రహాండనాయకివి నీవే జనని
మము చల్లగ చూడవే నీ పిల్లలమే భగవతి భవాని
2.నీ ఆనతిలేక ఈ లోకమే నిశ్చలము
నీ కనుసన్నలలో జననము మరణము
బుద్ధి యశస్సంపదలన్నీ నీ అధీనాలే
మణిద్వీపవాసినివి మందహాసినివీ నీవే జనని
మము చల్లగ చూడవే నీ పిల్లలమే భగవతి భవాని
Wednesday, October 13, 2021
https://youtu.be/GzbOzzivnsw
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పారాయణి నారాయణి దాక్షాయణి
పరమార్థ దాయని నవ దుర్గా కాత్యాయని
త్రిశక్తి రూపిణి త్రిభువన పాలిని కపాలిని
శివాని భవాని శాకిని సనాతని మాలిని
త్రిగుణాతీతా పరదేవతా జగన్మాతా
నమామి సతతం సకలలోక పూజిత శ్రీ లలిత
1.మాతవే గీతవే నా భవితకు నిర్మాతవే
పునీతవే అనంతవే అపర్ణవే అపరాజితవే
నగజాతవే సుజాతవే ఆనంద సంజాతవే
పైడినెలతవే మంగళదేవతవే తమ్మింటిగరితవే
1.కాలికవే కరాళికవే అంబికవే కాళికాంబికవే
అమ్మికవే నాలోని నమ్మికవే ననుగాచే చండికవే
చండాలికవే సర్వార్థసాధికవే నా మనస్తోకవే
మాతృకవే పురుహూతికవే బృహద్భట్టారికవే
(దుర్గాష్టమి శుభాకాంక్షలతో)