Tuesday, December 29, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎందుకు పుడతారో భూమ్మీదే

మమ్మల్ని చంపటానికిట్లా సుందరంగా

ఒలకబోస్తారేల అందాల బిందె

వాలు చూపుల తో పురుషుల  వయ్యారంగా 

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు పడతుల పొంకాలు

ఘోటక బ్రహ్మచారులకైనా సడలుతాయిలే బింకాలు


1.మేనకలై వచ్చి చెడగొడతారు తపస్సును

రాధికలై గిచ్చి చెదరగొడతారు మనస్సును

కునుకున కలై సొచ్చి సోకనీయరు ఉషస్సును

యవ్వన కోరికలై ఎక్కడిదురు తనువు ధనస్సును

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు పడతుల పొంకాలు

ఘోటక బ్రహ్మచారులకైనా సడలుతాయిలే బింకాలు


2.దాచుకునే నిధులన్ని బట్టబయలు చేసి

చేసేదంత చేసేసి మగవారిపై అపనిందలు వేసేసి

ఏమెరుగని నంగనాచి కథలెన్నో చెప్పేసి

చేస్తారు పిచ్చోళ్ళుగా మారెడుకాయ  మసిపూసి

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు పడతుల పొంకాలు

ఘోటక బ్రహ్మచారులకైనా సడలుతాయిలే బింకాలు

No comments: