రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నీళ్ళొదులుకుంటే మేలు నీతో స్నేహానికి
చరమగీతం పాడితె ఇకచాలు మన చెలిమికి
పట్టించుకోనపుడు పట్టుబట్టి పట్టిపట్టి వెంటపడతావు
పరిచయాన్ని పెంచుకోబోతే ముఖం కాస్త చాటేస్తావు
1.ఎండమావిలోనైనా నీరుండవచ్చేమో
ఇంద్రధనుసునైనా అందుకోవచ్చేమో
ఉసూరనిపిస్తుంది నీతో చేసే మైత్రి
వృధాప్రయాస మాత్రమే నా అనురక్తి
2.చేయీచేయి కలిపితేనే అది స్నేహితం
మనసు మనసు ఒకటైతేనే భవ్య జీవితం
ఉబుసుపోక కట్టేవన్నీ గాలి మేడలే
సరదాకై గడిపితె బ్రతుకులు చట్టుబండలే
No comments:
Post a Comment