Saturday, October 10, 2020

https://youtu.be/E1iMXSRCSI8?si=QHCrC3ae3SaQSNii

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


ఓంకారా ఝేంకారా శుభకరా శంకరా

శంభోహరా సాంబ మహాదేవా శివా

వేరే పనేమి లేదు నాకు నిను నుతియించడమే

వ్యాపకమింకేది లేదు నీకు నా అతీ గతీ గానడమే


1.గూడైనానీకు కట్టలేను పత్రిపూలు పెట్టలేను

దివ్య నాగమణులతో నిన్ను అర్చించగలేను

వేయిపంకజాలతో పూజ సలుపలేను

కన్నును పెకలించినీకు అమరించగలేను

నిను కీర్తించడమే ప్రభూ నే చేసెదను

నా ఆర్తిని బాపగా శరణము వేడెదను


2.ఘోరతపము చేయను కైలాసగిరిని మోయను

నాప్రేగులు లాగివేసి రుద్రవీణ మీట లేను

ఎదురొడ్డిపోరాడి నిన్ను మెప్పించలేను

భవబంధాలనే నాకుగా నేను తప్పించలేను

నీలీలావిలాసాల నే లిఖించెదను

నీ గుణగానమే సదా నే చేసెదను

No comments: