Saturday, October 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అమ్మ దేహము నాన్న ప్రాణము

మన జీవితమే తలిదండ్రుల దానము

కన్నవారు కన్నకలల పంటే మనము

జననీ జనకుల దయలేక క్షణమైనా మనము


1.పాలు మురిపాలు అమ్మ దయాబిక్షయే

ఈనాటి మన ఉన్నతి నాన్న క్రమశిక్షణే

తమనోరుకట్టుకొని మనమడిగినదొసగినారు

తమ లక్ష్యమె మనమవగా దీక్షగా సాకుతారు

ఏమిచ్చినాగాని తీరిపోదు వారి ఋణము

కన్నందుకు బాధ్యతంటె అది వ్యర్థప్రలాము


2.ముదిమిలోన ఆసరాగ నిలుచుటయే ధర్మము

కంటికిరెప్పలాగ కాచుకొనుటె కర్తవ్యము

ప్రాథమ్యాలలో పట్టించుకొనకుంటే నీచము

వృద్ధాశ్రమాల ఊసు మాయమైతె ధన్యము

ఏమిచ్చినాగాని తీరదు కన్నవారి ఋణము

అనురాగము ప్రతిగచూపి పొందాలి ఆశీర్వచనము

No comments: