Saturday, October 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భరతమాతకు ప్రియతములు ఇరువురు

కడుపునింపే సైరికుడు ఒకడు

కాచుచుండే సైనికుడు ఒకడు

కిసాను జవాను చిర స్మరణీయులే

నిత్యకృషీవలులే నిజత్యాగధనులే


1.ఎండకెండి వానలోనా నానుతారు

రాళ్ళురప్పలు ముళ్ళలోనా సాగుతారు

కర్తవ్యమె దైవమంటూ నమ్ముతారు

దేశప్రజల ఆశలెపుడు వమ్ముకానీరు

కిసాను జవాను చిర స్మరణీయులే

నిత్యకృషీవలులే నిజత్యాగధనులే


2.పొంచిచూసే ఇరుగుపొరుగు శత్రుమూకలు

వరదలుతూఫానులు కరువుకాటకాలు

కబళింపజూచే గుంటనక్కలు దళారీ తోడేళ్ళు

వ్యవసాయికీ సిపాయికి అనునిత్య ఘర్షణలు

కిసాను జవాను చిర స్మరణీయులే

నిత్యకృషీవలులే నిజత్యాగధనులే

No comments: