రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
మట్టి దుప్పటి కప్పుకున్నా
కాటిలో కాలి బూడిదైనా
మరువలేనే నేను నిన్ను ప్రియతమా
మరుజన్మకైనా నువ్వు నాకు ప్రాప్తమా
1.నీ చీకటిదారిలోనా ధృవతారనైపోనా
వేకువనే తెలియగజేస్తూ వేగుచుక్కనేకానా
పదం మలినపడకుండా ఎదతివాచి పరిచితినే
అడుగేస్తె నొవ్వకుండా అరచేతుల నడిపితినే
ఎలా మనసైందో నీకు నన్నువంచించగా
ఎలా సిద్ధపడ్డావో మనప్రేమను త్రుంచగా
2.నీ కంటికాటుక కోసం నేను మసిగ మారానే
నీ నుదుట సింధూరంగా నా రుధిరం దిద్దానే
నా పాలిటి దేవతగా నిన్ను ఆరాధించానే
సర్వస్వం నీకేనంటూ బ్రతుకే రాసిచ్చానే
మూడునాళ్ళముచ్చటగా అనురాగం పంచావు
మనువు మాటరాగానే నిండా నను ముంచావు
No comments:
Post a Comment