రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అలలు చెలఁగని కొలనునేను-
మధువు తరగని విరినినేను
మనసు చెదరని ధనిక నేను-
కలత నెరుగని కొమరు నేను
చిరుగాలిలా ఎదసొచ్చినావు-
భీభత్సమే మిగిలించినావు-
వంచించి నీవు
మాయనేర్చిన మారీచా నీచాతినీచా
రచ్చచేసి చిచ్చుబెడితివి కుత్సితా తుఛ్ఛా
1.కుటిల నటనలు ఏమార్చు మాటలు
వలపంటు పన్నినావే వన్నెలున్న వలలు
ఏ లక్ష్మణ రేఖసైతం ఆపలే నీ ఆగడాలు
స్నేహితులెవరైనగాని చూపలే సన్మార్గాలు
మాయనేర్చిన మారీచా నీచాతినీచా
రచ్చచేసి చిచ్చుబెడితివి కుత్సితా తుఛ్ఛా
2 బంగారు భవిష్యత్తని నమ్మబలికితివే
సింగారమె తప్పుకాదని ఒప్పించితివే
తెప్పనే తగులబెట్టి నీవేమొ జారుకొంటివే
గుట్టునంతా రట్టుచేయగ హెచ్చరించితివే
మాయనేర్చిన మారీచా నీచాతినీచా
రచ్చచేసి చిచ్చుబెడితివి కుత్సితా తుఛ్ఛా
PIC:Sri.Agacharya Artist
No comments:
Post a Comment