రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పసిడిదైతె మాత్రమేమి అది పంజరమే
నగిషీల సంకెళ్ళూ స్వేఛ్ఛా పరిహరమే
అద్దాలమేడలెందుకూ ప్రేమించగ అడ్డుకుంటే
కడుపార విందులెందుకు కన్నీరు పొంగుతుంటే
1.కులమునడిగి ఇష్టపడుట సాధ్యమా
మతమునెరిగి మనసిచ్చుట భావ్యమా
మన ప్రమేయమేలేక మనువాడుట సౌఖ్యమా
కన్నవాళ్ళ గుండెకోత మరవడమే లౌక్యమా
నొక్కబడిపోతుంది అడకత్తెరలో పోకచెక్కగా
నలిగుతుంది నెలత గానుగలో చెఱకు ముక్కగా
2.సంతానపు సంతసమే తలిదండ్రుల ప్రాథమ్యం
కూతురు సుతుల సౌభాగ్యమే శిరోధార్యం
రక్తంలో రక్తమౌ తనుజుల మీదనా తగని క్రౌర్యం
పరువు దరువు కాకూడదు ఎవరి పాడె మేళం
రాసుకోనేలా రమణితానె మరణశాసనం
ఆచితూచి అడుగేస్తే బ్రతుకు ఆనందనందనం
No comments:
Post a Comment