Saturday, October 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిధినిక్షేపాలెన్నో నీ చెంత నెచ్చెలి

క్షీరజలధికన్నా మిన్నగ ఓ కోమలి

మథిస్తెనే లభించేను పాలకడలి దీక్షతోని

యథేఛ్ఛాగా పొందేనునీకడ కోరిన లక్ష్యాన్ని


1.లక్షణమౌ నీలికురులే ఇంద్రనీలమణులు

కాంతులీను చక్షువులే అమూల్యమౌ మాణిక్యాలు

పరీక్షయే అక్కరలేని వజ్రమంటి నాసిక

మోక్షమే ప్రసాదించే అధరాలె పగడాలు

లక్షలు వెచ్చించినా పొందలేని ముత్యాలే దంతాలు


2.కల్పవృక్షమే నీమేను వలసిన ఫలములనొసగంగ

కామధేనువే నీ హృదయం కాంక్షలనన్నీ తీర్చంగ

 నీ పక్ష ఉచ్చైశ్రవమున దక్షతగా విహరించంగా

అక్షయమౌ అమరసుఖములే నేబడయంగా

అక్షరాలె అలిసేను నీ పసిడిపొంకాలే కొలువంగా

No comments:

8k8
seo