Saturday, October 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనదీ ఒక బతుకేనా కుక్కలవలెనక్కలవలె

మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె

సిగ్గూఎగ్గూ రోషం పౌరుషం ఇంటావంటా కనరాకుండా

మానం అభిమానం పరువు గౌరవం ఏకోశాన లేకుండా


1.ఖాండ్రించి ఉమ్మినా తుడిచివేసుకొంటూ

మన్నుమీద పోసినా దులిపివేసుకొంటూ

నలుగురిలో నిలదీసినా  నవ్వులొలుకబోసుకుంటు

పదుగురిలో  కడిగేసినా పరాచికాలాడుకుంటు

మనదీ ఒక నడతేనా కప్పలవలె ఎలుకలవలె

మనదీ ఒక క్రమతేనా గోడమీది పిల్లులవలె


2.మంచినీళ్ళప్రాయంగా లంగబొంకులే బొంకుతు

మంచి గంధమని ఎంచి సంకలెన్నొ నాకుతూ

విలువలనే వెలివేసి అడ్డమైన గడ్డిమేస్తూ

బట్టకడితెమాత్రమేమి నగ్నరీతి సంచరిస్తూ

మనదీ ఒక చరితేనా బల్లులవలె నల్లులవలె

మనదీ ఒక శీలతేన పెంటమీది ఈగలవలె


(మొదటి రెండు పంక్తులు శ్రీశ్రీ గారివి -వారికి నమస్సులతో)

No comments: