Saturday, January 18, 2025

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం దర్బార్ కానడ


శ్రీ త్యాగరాజ మహాశయా నీకు అభివందనం 

వాగ్గేయకార యశోభూషణా సాష్టాంగవందనం

శ్రీ రామ సంసేవితా నాదోపాసన విరాజితా 

రాగ రసామృత ప్రసాదితా అందుకో స్వర నీరాజనం 


1.తిరువాయూరున జన్మించి 

అమ్మవలన భక్తిని అనుసరించి 

చిరుతప్రాయమున రాముని తలంచి 

అనుపమాన రాగాల కృతుల రచించి

విఖ్యాతినొందితివి సంగీత విరించి


2.రాగ రసాంబుది సదా మధించి 

కర్ణాటక సంగీతసుధ పిపాసులకందించి  

కొన ఊపిరులకు స్వరములతో ఊపిరినిచ్చి 

బయకార మహిమను జగతికి ఎరిగించి 

తరతరాలు జీవించేవు మా ఎదల నిలిచి 

Friday, January 3, 2025

 https://youtu.be/6VszfsKGay4?si=85eBdeoN_qBES6q8


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం :మధ్యమావతి 


జయ జయ రామా జగదభిరామా నినుగన నీ వాకిట నిలిచాను 

దయార్ద్ర హృదయా భద్రాద్రిరామా దర్శనార్థినై నీముంగిట చేరాను 

ఉత్తరద్వారము తెరచు వరకు నా చిత్తము ఇక నీ పరము 

తలుపులు తీసిన తక్షణము-నీ దివ్య విగ్రహ వీక్షణ వరము 

నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినము కోరితి వైకుంఠ ద్వార దర్శనము 

జన్మ జన్మల మా పుణ్య విశేషము-నీ కరుణా కటాక్షమే నిదర్శనము 


1.గుహడను నేను-నీ పదములు కడిగితి నాడు 

శబరిని నేను నీకు ఫలములు తినిపించినాను 

రెక్కలు తెగిన పక్షిని నేను- జానకీ మాత జాడ తెలిపినాను 

నిను వదలక ఎదలో నిలిపిన నీ దాసుడను నీ హనుమను

నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినము కోరితి వైకుంఠ ద్వార దర్శనము 

జన్మ జన్మల మా పుణ్య విశేషము-నీ కరుణా కటాక్షమే నిదర్శనము 


2.పరమ పావని గోదావరి పారుతు చేరేను నీ దరి 

భద్రుని వినతిని విని ఇట స్థిర వాస మొందితివి సరి 

రామదాసుని భవ చెఱ విడిపించితివి ఉంచగా నీపై గురి 

*నీ దాసానుదాసుని ఈ రాఖీని బ్రోవగ మరవకు ఏమరి 

నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినము కోరితి వైకుంఠ ద్వార దర్శనము 

జన్మ జన్మల మా పుణ్యం విశేషము-నీ కరుణా కటాక్షమే నిదర్శనము 




Sunday, December 29, 2024

 https://youtu.be/miTiw-09Z_Y


సాకారం పృథ్వీ తత్వం 

నిరాకారం ఆకాశ తత్వం 

ఫాలానేత్రాన అగ్నితత్వం 

గంగాధరునిగ జలతత్వం 

జీవేశ్వరునిగ వాయు తత్వం 

పంచభూతాత్మకం ప్రభో నీ శివ తత్వం 

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 


1.ఏకామ్రేశ్వర నీ స్వరూపం పృథ్వీ లింగం 

చిదంబరేశ్వరా నీ చిద్రూపం ఆకాశ లింగం 

అరుణాచలేశ్వరా నీ ఆకారం అగ్నిలింగం 

జంబుకేశ్వరా హరా నీ మూర్తి ఇల జలలింగం 

శ్రీ కాళ హస్తీశ్వరా నీ అకృతి వాయు లింగం 

పంచభూతాత్మకం ప్రభో నీ శివ తత్వం 

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2. ద్రాక్షారామాన భూతత్వంగా నమో భీమేశ్వరమ్ 

అమరారామానా ఆకాశ తత్వంగా  అమరేశ్వరమ్ 

కుమార భీమా రామానా అగ్ని తత్వంగా కుమరేశ్వరం/కుమర భీమేశ్వరమ్ 

క్షీరారామానా జలతత్వంగా స్వామి రామలింగేశ్వరమ్ 

సోమారామాన  వాయుతత్వంగా వందే సోమేశ్వరమ్ 

పంచభూతాత్మకం ప్రభో నీ శివ తత్వం 

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

Friday, December 27, 2024

 

https://youtu.be/AFiX3xMngMc?si=FTwiZ5jdqJEsT7fg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

శ్రీ మాత్రే నమః జగన్మాత్రే నమః
పర యంత్ర తంత్ర మంత్ర ఛ్ఛేద
పరవిద్యా పరా శక్తి పరాంబికే పరదేవతా
ప్రణోదేవి లలితే శరణమహం నమోనమః

1.ప్రతీక్షించలేనే పరీక్షించకే నన్నింకనూ శిక్షించకే
నా దీక్షయు అపేక్షయు  నీ కృపా కటాక్ష వీక్షణమే
ఉపేక్షించకే సాక్షాత్కరించవే దేహి దేహి మోక్షదాయకే
జగజ్జనని లోక పావని శోకనాశని వందిత పాదాబ్జశోభితే

2.నా చపల చిత్తమునిక హస్తగతము చేకొనవే
నా మనో వికాసమునిక సత్వరమే కావింపవే
అరిషడ్వర్గాలబారినుండి నన్నిపుడే కాపాడవే
చిద్విలాసిని చిన్మయరూపిణి కార్యకారిణి చమత్కారిని

Tuesday, November 5, 2024

స్వామీ నువ్వే నాకు కావాలోయి
స్వామీ  నువ్వే దిగి రావాలోయి
ఏమాయెనో స్వామీ నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి

స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా

కనులు ఉన్నాయిగాని-అహముతో మూసుకపోయాయి 
చెవులు వింటాయి గాని-నీ చరితమెరుగము అంటాయి
నాలుకైనా సరే నీ నామమసలె పలుకక ఉంది
కాలుకైనా మరీ నీ గుడిదారే తెలియదు అంది

ఏమాయెనో స్వామీ నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి

స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా

కామమే లేక నీ –నామం జపియించనైతి
ఓపికేలేక నేను కోపగుణము గెలువకపోయితి
నీవిచ్చిన ధనమే ఐనా దానమన్న చేయక పోయితి
కాలమహిమ తెలియకనే గాలిలోన మేడలు కడితి

ఏమాయెనో స్వామీ నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి

స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా

స్వామీ నువ్వే నాకు కావాలోయి
స్వామీ నువ్వే దిగి రావాలోయి
ఏమాయెనో స్వామీ నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి

స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా

Monday, November 4, 2024

పాడుట నావంతు స్వామి 
కాపాడుట నీవంతు శరణం స్వామి 
వేడుట నావంతు స్వామీ 
నా వేదన తీర్చగ రావేమీ 
1. నీవే ఇచ్చిన ఈ గొంతున -మాధుర్య మడిగితె మరియాదనా
నీవే మలచిన నా బ్రతుకున-అంతే దొరకని ఆవేదనా
శరణంటువేడుదు సాయి-కరుణిచేవాడవు నీవేనోయి
2. గుండెను గుడిగా తలపిస్తే మరి షిర్డీ యాత్రయె ఒక వరమా
అందరిలో నువు కనిపిస్తేసరి-మందిరమేగుట అవసరమా
పరీక్షలిక చాలు సాయి- ప్రార్థన విని ఆదుకోవోయి
3. తెలిసీతెలియక ఏవో వాగీ-నిను విసిగించితి ఓ యోగి
మిడిమిడి జ్ఞానంతొ మిడిసిపడీ-నిను మరిచానా నే మూర్ఖుడిని
పలుకుట నావంతు సాయి-పలికించేవాడవు నీవేనోయి
x



గంపెడంత ఆశతొ శబరికొండకొచ్చాను 
గడపలెన్నొ ఎక్కిదిగి విసిగి వేసరి నే దిక్కు తోచకున్నాను
ఆదరించె మారాజు నీవని నమ్మి నీ పంచన జేరాను
వట్టిచేతులతొ స్వామీ నే వాపసు పోనయ్యా
వరములిస్తెనే గానీ నీ పదాలనొదలనయా

1. గణపతివి నీవె మారుతివి నీవె
శరణంటె కరుణించె సద్గురువు నీవే 
హరిహర బ్రహ్మలు ముగ్గురొక్కటైన
సాక్షాత్తు పరబ్రహ్మ దత్తాత్రివీ నీవే
అభయమీయగా ఎవ్వరూ నీ సరి రారయ్యా
వెన్న కంటెనూ మెత్తనిదీ నీ మనసేనయ్యా

2. నిరీక్షించలేనయ్య పరీక్షించ బోకయ్యా
నీ రక్ష కోరి వచ్చాను అయ్యప్పా 
భిక్ష పెట్టవయ్య నన్ను-లక్ష్యపెట్టవయ్య
నీ శరణు వేడి వచ్చాను మణికంఠా
కడలి కంటెనూ గొప్పదయా-నీదయ అయ్యప్పా
వెన్నెల కంటెనూ చల్లనయా-నీ చూపు అయ్యప్పా

3. తిట్టినా నువ్వే కొట్టినా నువ్వే
మెడ బట్టి నన్ను వెళ్ళగొట్టినా నువ్వే
పెట్టినా నువ్వె చే పట్టినా నువ్వే-
కడుపార నాకు బువ్వ పెట్టినా నువ్వే
నను గన్న తండ్రివి నీవే మా స్వామి అయ్యప్పా
చావైన బ్రతుకైన నీ తోనే ఓ స్వామి అయ్యప్పా ||వట్టి చేతులతొ||

Monday, October 21, 2024

 


https://youtu.be/Hs8WwWbRhL8?si=FINViy3rLjRw4J1T

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :ఆనంద భైరవి

కాణిపాక గణపతి కారుణ్యమూర్తీ శరణం
రత్నగర్భ గణపతి విఘ్నాధిపతీ శరణం
పంపాతీర గణపతి  పార్వతి నందనా శరణం
కన్ని మూల గణపతి అయ్యప్ప అగ్రజా శరణం

1.ధర్మపురీ గణపతీ హే దయామయా వందనం
   వేములవాడ గణపతి వేదమయా  వందనం
   శ్రీ శైల సాక్షి గణపతి ప్రభో సర్వాంగ వందనం
   వాతాపి ఆది గణపతి నమో సాష్టాంగ వందనం

2.ముంబయి సిద్ది గణపతి మనసా వందనం
తేర్ చింతామణి గణపతి శిరసా వందనం
వారణాసి అమృత గణపతి వచసా వందనం
డూండీ మోక్ష గణపతి అత్మార్పణ వందనం

Sunday, October 6, 2024

 


https://youtu.be/qyZsO5ztrxk?si=GgNW_WL_vplbDcmD

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మోహన

ఆడి పాడి అలసినారా ఓ లచ్చ గుమ్మడి
అమ్మ లాలా కొమ్మలాలా ఓ లచ్చ గుమ్మడి
తొమ్మిది నాళ్ళ ముచ్చటిది ఓ లచ్చ గుమ్మడి
బతుకమ్మను అనిపే రోజిది ఓ లచ్చ గుమ్మడి
సద్దుల బతుకమ్మనేడు ఓ లచ్చ గుమ్మడి
సుద్దులింకా పాడుకుందాం ఓ లచ్చ గుమ్మడి

మంగళగౌరి మాతల్లి ఓ లచ్చ గుమ్మడి
మంగళ కరమే నీరూపు  ఓలచ్చగుమ్మడి
మంగళ సూత్రం కావవే ఓ లచ్చ గుమ్మడి
మంగళహారతి గొనవమ్మా ఓ లచ్చ గుమ్మడి

మాట మార్చలేదమ్మా ఓ లచ్చ గుమ్మడి
పాటలాపలేదమ్మా ఓ లచ్చ గుమ్మడి
ఆటలాడి మురిసినాము ఓ లచ్చ గుమ్మడి
నిన్నే మదిలో నిలిపినాము ఓ లచ్చ గుమ్మడి

పచ్చని ఆకులైతే ఓ లచ్చ గుమ్మడి
పీఠంగా వేసినాము ఓ లచ్చ గుమ్మడి
గునుగుపూలు పరుపు చేసి ఓ లచ్చ గుమ్మడి
అమరించి నామమ్మా ఓ లచ్చ గుమ్మడి

కట్ల పూలు మెట్లు మెట్లుగా ఓ లచ్చ గుమ్మడి
పేర్చి కూర్చినామమ్మ ఓ లచ్చ గుమ్మడి
తంగేడుపూలు బంగరు చీరగ ఓ లచ్చ గుమ్మడి
నీకు సింగారించి నామమ్మా ఓ లచ్చ గుమ్మడి
బంతిపూల మాలలేశాం ఓ లచ్చ గుమ్మడి
చేమంతుల నగలు పెట్టాం ఓ లచ్చ గుమ్మడి

రంగు రంగులు పూలు కూర్చి ఓ లచ్చ గుమ్మడి
నిన్ను బతుకమ్మగ తీర్చి దిద్దాం ఓ లచ్చ గుమ్మడి
రాచగుమ్మడి కేసరాన్ని ఓ లచ్చ గుమ్మడి
గౌరిదేవిగ నిలిపాము ఓ లచ్చ గుమ్మడి
తొమ్మిది నాళ్ళు ఆడిపాడి ఓ లచ్చ గుమ్మడి
నమ్మి నిన్ను కొలిచాము ఓ లచ్చ గుమ్మడి

నూల సద్ది కొబ్బరి సద్ది ఓ లచ్చ గుమ్మడి
నిమ్మ సద్ది ఆవసద్ది ఓ లచ్చ గుమ్మడి
పులుసు సద్ది పెసారా సద్ది ఓ లచ్చ గుమ్మడి
మినప శనగ  పెరుగు సద్ది ఓ లచ్చ గుమ్మడి
సద్దులన్నీ సిద్ధం చేసాం ఓ లచ్చ గుమ్మడి
ఆరగించి ఆదరించు ఓ లచ్చ గుమ్మడి

సాగానంపు వేళాయే ఓ లచ్చ గుమ్మడి
సాగానంప వగపాయె ఓ లచ్చ గుమ్మడి
మరుసటేడు బిరగా రావే ఓ లచ్చ గుమ్మడి
మరిచిపోకు మమ్మెప్పుడు ఓ లచ్చ గుమ్మడి
దండాలు తల్లీ గౌరి ఓ లచ్చ గుమ్మడి
వందనాలు బతుకమ్మ ఓ లచ్చ గుమ్మడి

Friday, October 4, 2024

 

https://youtu.be/Jv_-R5uu2_k?si=F1zyT1OwikwGOk5v

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మోహన

సందామామా సందామామా  సందమామా
మా తల్లి బంగారు బతుకమ్మా సందామామా
సందామామా సందామామా  సందమామా
సందామామాతొ బుట్టింది మాయమ్మ లచ్చుమమ్మా
అందమైన అమృత గాథను సందామామా
పాడుకుందాము అనరో వినరో సందామామా

1.దేవ దానవులందరూ సందామామా
దేవులాడిరి సావును గెల్వగ సందామామా
పాల సంద్రాన్ని చిల్కి చూస్తే సందామామా
అమృత మొచ్చి తీరుతుందని సందామామా
ఎరుకతో ఒక్కటైరీ సుధకొరకై సందామామా
చిలుకుటలో సూత్రాలెన్నో చిత్రాలెన్నో సందామామా

2.మంధరగిరేమో కవ్వమైంది సందామామా
లాగే తాడైంది వాసుకి నాగు సందామామా
కవ్వానికి ఆధారమాయే హరి సందామామా
తాబేలుగా మారి అవతరించేను సందామామా
పాము పడగవైపు పట్టినారు సందామామా
బెదురే లేని దానవులందరు సందామామా
తోకవైపునుండి లాగ సాగిరి సురలు సందామామా

3.అలజడి రేగగ పాల కడలిన సందామామా
కాలాకూట విషమే వెలువడే సందామామా
విశ్వనాథుడే విషము మింగి సందామామా
విశ్వాన్ని కాపాడి నీలకంఠుడాయె విశ్వనాథుడే సందామామా

4.పుట్టుకొచ్చెను ఆ వెంటవెంటను సందామామా
వెన్నలాగా విలువైనవెన్నెన్నో సందమామా
కల్లుకుండ వెలికి రాగ సొల్లుకార్చగ సందమామా
దైత్యులకిచ్చిరి దానినంతట సందామామా
ఉఛ్ఛైశ్రవాన్నిచ్చిరి బలిచక్రవర్తికి సందామామా
తెల్లఏ నుగు కామధేనుకల్పతరువులు సందమామా
సుర రాజు ఇంద్రుని పాలాయేను సందామామా

5.చిలుకుతున్న ఆ చందానా సంబర మాయే సందమామా
అప్సరసలు  జాబిల్లి పుట్టుకొచ్చిరి సందామామా
సిరుల మా   తల్లి లచ్చిమి అవతరించెను సందమామా
శ్రీ మహావిష్ణువు సిరిని చేపట్టి ఎదలొ చోటిచ్చే సందమామా
అమృత కలశంతొ ఆవిర్భవించే ధన్వంతరి సందమామా

6.తమకంటే తమకంటూ తమకంతొ చెలరేగ సందమామా
మోహిని రూపంతో మాయజేసే మాధవుడు సందమామా
సురలకు సుధను పంచె అసురుల వంచించి సందమామా
మంచి తనమే శ్రీ రామ రక్షగా ఎంచమంటూ సందమామా

 

https://youtu.be/TusU5ppt6TQ?si=4l85yOCx3EV8K45G

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:శంకరాభరణం

పూలంటీ పూబోణులు కోల్
ఆడవచ్చిరమ్మ  బతుకమ్మలు
ఇంటింటి మారాణులు కోల్
పాడుతున్నారమ్మ నీ పాటలు కోల్
మా తల్లి గౌరమ్మ కోల్ కోల్- మమ్మేలు కోవమ్మ కోల్ కోల్
ఆరోగ్యమియ్యవే కోల్ కోల్- సౌభాగ్య మియ్యవే కోల్ కోల్

1.ఏడేడు వర్ణాల కోల్ కోల్-విరులేరు కొచ్చాము కోల్ కోల్
అందాలు చిందించగా కోల్ అమరించినామమ్మా కోల్ కోల్
సుందరంగ నీరూపును కోల్-తీరిచి దిద్దామమ్మా కోల్
భక్తితో నిను కొలువగా కోల్ -భామలం కూడితిమి కోల్
మా తల్లి గౌరమ్మ కోల్ కోల్- మమ్మేలు కోవమ్మ కోల్ కోల్
ఆరోగ్యమియ్యవే కోల్ కోల్- సౌభాగ్య మియ్యవే కోల్ కోల్

2.గుళ్లోనే కాదమ్మా కోల్ (మా) గుండెల్లో ఉంటావే కోల్
మంత్రంకు కరిగేవు కోల్ కోల్  పాటకు మురిసేవు కోల్
పూజకు కరు ణిస్తావు కోల్ ఆటకు వర మిస్తావు కోల్
దండాలు నీకమ్మా కోల్ మా అండ దండవు కోల్ కోల్
మా తల్లి గౌరమ్మ కోల్ కోల్- మమ్మేలు కోవమ్మ కోల్ కోల్
ఆరోగ్యమియ్యవే కోల్ కోల్- సౌభాగ్య మియ్యవే కోల్ కోల్

 

https://youtu.be/Zw9A1kRLu34?si=hru_S_3OTnekOccx

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మోహన

గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలా ఉయ్యాలా
గౌరమ్మ మొగుడెంత ఘనుడమ్మ ఉయ్యాలా
గంగ నెత్తిన బట్టి ఉయ్యాలా ఉయ్యాలా
జుట్టు లోన జుట్టె ఉయ్యాలా ఉయ్యాలా
పుడమికి పావని గంగ నొదిలేను ఉయ్యాలా
పున్నెం కొద్ది దొరికే భగీరథి మనకు ఉయ్యాలా
పాడుకుందాము పడతులారా ఆ కథను ఉయ్యాలా
వేడుకుందాము గౌరమ్మ దయకై ఉయ్యాలా ఇయ్యాలా

సగర చక్కురవర్తి అలనాడు ఉయ్యాలా
అశ్వమేధ యాగం చేసినప్పుడు ఉయ్యాలా
ఆరవై వేల మంది ఆతని పుత్రులు ఉయ్యాలా
కపిల మునివరుని కోపకారణమైరి ఉయ్యాలా
అగ్రహించిన ఆ ముని అంతటనే ఉయ్యాలా
అందరిని బూడిద చేసినమ్మ ఉయ్యాలా ఉయ్యాలా

భగీరథుడను సగరుని మనుమడు ఉయ్యాలా
చింత నొందే వారి దీనతకు ఉయ్యాలా ఉయ్యాలా
ఉత్తమ గతులింక వారికందుటకై ఉయ్యాలా
ఆకాశ గంగను ధరకు రప్పించ బూనే ఉయ్యాలా
పదివేల ఏండ్లు ఘోర తపము చేసి ఉయ్యాలా
బ్రహ్మ వరము పొందే గంగను భువి తేగా ఉయ్యాలా

ధరణి భరించదు గంగ ధారణయని ఉయ్యాలా ఉయ్యాలా
ఉరవడి నాపే హరుడు శివుడని ఎరిగి ఉయ్యాలా
మరల పదివేల ఏండ్లు భవుని వేడే ఉయ్యాలాఉయ్యాలా
కరుణించి హరుడంత వరమిచ్చేనమ్మా ఉయ్యాలా

గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలా ఉయ్యాలా
గౌరమ్మ మొగుడెంత ఘనుడమ్మ ఉయ్యాలా
గంగ నెత్తిన బట్టి ఉయ్యాలా ఉయ్యాలా
జుట్టు లోన జుట్టె ఉయ్యాలా ఉయ్యాలా
పుడమికి పావని గంగ నొదిలేను ఉయ్యాలా
పున్నెం కొద్ది దొరికే భగీరథి మనకు ఉయ్యాలా
పాడుకుందాము పడతులారా ఆ కథను ఉయ్యాలా
వేడుకుందాము గౌరమ్మ దయకై ఉయ్యాలా ఇయ్యాలా

కథ ఇంక కడతేరకపాయేనమ్మ ఉయ్యాలా ఉయ్యాలా
కష్టాలు వీడక పాయె అయ్యో భగీరథుణ్ణి ఉయ్యాలా
చిన్నా పాయగా వదిలే గంగను గంగాధరుడు ఉయ్యాలా
వెంట రాంగగ గంగ కదిలే భగీరథుడు వసుధ వైపు ఉయ్యాలా
ఉరుకులపరుగుల ఉత్తుంగ గంగ ఉయ్యాలాఉయ్యాలా
జన్ను ముని వాటి ముంచెత్తివేసింది ఉయ్యాలాఉయ్యాలా
కోపించి ఆ ముని మింగే గంగను ఉయ్యాలా ఉయ్యాలా
మళ్ళీ మొదలైయే కడగండ్ల కథ భగీరాథునికి ఉయ్యాలా

ప్రార్థిస్తూ కన్నీళ్ల పర్యoతమాయే భగీరథుడు ఉయ్యాలా
కృపగని మునివదిలే చెవినుండి గంగను ఉయ్యాలా
బూది కుప్పలపై గంగ పారంగా సగరులంత ఉయ్యాలా
సద్గతుల ప్రాప్తి నందిరమ్మా ఉయ్యాలా ఉయ్యాలా
పట్టువదిలి వేయని భగీరథుని పేర ఉయ్యాలా ఉయ్యాలా
భగీరథియని పేరుబడిసెనంత ఉయ్యాలా ఉయ్యాలా
ముని చెవి నుండి వచ్చే గనుకను ఉయ్యాలా ఉయ్యాలా
జాహ్నవి గాను ఖ్యాతి పొందెనూ ఉయ్యాలా ఉయ్యాలా
విన్ననూ పాడుకున్ననూ ఈ కథ ఉయ్యాలా ఉయ్యాలా
సకల సౌభాగ్యములు కలుగునమ్మ ఉయ్యాలా ఉయ్యాలా
బతుకమ్మ పాటగా రాసే ధర్మపురి వాసి ఉయ్యాలా
రాఖీ పేరున్న రామకిషనే వినరమ్మ ఉయ్యాలా ఉయ్యాలా

గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలా ఉయ్యాలా
గౌరమ్మ మొగుడెంత ఘనుడమ్మ ఉయ్యాలా
గంగ నెత్తిన బట్టి ఉయ్యాలా ఉయ్యాలా
జుట్టు లోన జుట్టె ఉయ్యాలా ఉయ్యాలా
పుడమికి పావని గంగ నొదిలేను ఉయ్యాలా
పున్నెం కొద్ది దొరికే భగీరథి మనకు ఉయ్యాలా
పాడుకుందాము పడతులారా ఆ కథను ఉయ్యాలా
వేడుకుందాము గౌరమ్మ దయకై ఉయ్యాలా ఇయ్యాలా

Sunday, September 22, 2024

 

4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి

https://youtu.be/UXFncWa84y8?si=8HfuuUacxaTU4QRk

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: కళావతి

పస్తులుంచకు ఎవరిని పరమేశ్వరి
ఆకలి చావులనిక ఆపవే అన్నపూర్ణేశ్వరి
నీవున్న తావున కరువులు కాటకాలా
నీవున్నావన్న మాటలన్నీ ఒట్టి బూటకాలా

అమ్మవు నీవని నిను నమ్మి యుంటిమి
కడుపు చక్కి చూడక ఏల మిన్నకుంటివి

1.అతివృష్టి అనావృష్టి ఇవి యేదైత్యుని సృష్టి
ప్రకృతిరూపిణి నీవుకదా మము పాలించే పరాశక్తి
మూడు పంటలు పండునట్లుగా వరమోసగవే
ముప్పొద్దులా ముద్ద దిగునట్లుగా కరుణించవే

2.కమ్మని రుచులు కలిగేలా వంటను మార్చవే
పంచభక్ష్య పరమాన్నాలు విస్తరిలో సమకూర్చవే
అన్నం పరబ్రహ్మ రూపం వృధా పరుచ నీయకే
అన్నమో రామచంద్రా అని అంగలార్చ నీయకే

3.తిండి దొరికేలా తిన్నది అరిగేలా దయాజూడవే
ఏ వ్యాధి బాధలు రానీయక మముకాపాడవే
ఆరోగ్యభాగ్యము జనులందరికీ అందగజేయవే
ఆనంద నందనవనిగా ఇల్లిల్లూ మురియ నీయవే

 

3. శ్రీ మహాలక్ష్మి

https://youtu.be/yxewkCrf9y0?si=0-qxzfRZLqYP0ogu

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: ఆనంద భైరవి

శ్రీ మహాలక్ష్మి శ్రిత జన పోషణి
శిరసా నమామి
వరమహా లక్ష్మీ వాంచితార్థదాయిని
వచసా భజామి
కనక మహా లక్ష్మి కరుణాంతరంగిని
మనసా స్మరామి
భవతారిణి రుజ హారిణి జయము నీకు జనని

1.చంచల హరిణి దురిత నివారిణి
డోలాసుర మర్ధిని
కౌశిక వాహిని కీర్తి ప్రదాయిని
అగణిత ధనవర్షిణి
మునిజన వందిని ముకుంద హృదయిని
మోక్ష ప్రసాదిని
భవతారిణి రుజ హారిణి జయము నీకు జనని

2.కమలాసని కమలిని కమల లోచని
కోల్హా పురవాసిని
పాపభంజని మనోరంజని నిరంజని
నారాయణి
క్షీరాబ్ది ప్రభవిని దారిద్ర్య శమనీ
అష్టలక్ష్మీరూప అవతారిణి
భవతారిణి రుజ హారిణి జయము నీకు జనని

  

https://youtu.be/_mc2XPtT9pw?si=ja82XLkRfGS9By3X

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: రేవతి

ప్రణవనాద రూపిణి-పంచ భూత వ్యాపిని
పంచ ప్రాణ పోషిణి -పంచేంద్రియ తోషిణి
ప్రణమామ్యాహం బ్రాహ్మిణి
గాయత్రి సావిత్రి సరస్వతీ
త్రికాల సంధ్యా వందని

1.ముక్తా విధ్రుమ హేమనీల ధవళచ్చాయ వదన విరాజిని
చతుర్వింశతి వర్ణ మూల మంత్ర భాసిని
చతుర్వింశతి ముద్రాయుత సుప్రతిష్టిని
సాంఖ్యాయనస గోత్రోద్భవి సుభాషిణి
ప్రణమామ్యాహం బ్రాహ్మిణి
గాయత్రి సావిత్రి సరస్వతీ
త్రికాల సంధ్యా వందని

2.విశ్వామిత్ర ఋషి నుత పవిత్ర మహా మంత్ర శక్తీ
సూర్యకిరణ తేజోమయ ఆరోగ్య ప్రధాత్రి
కుండలీనీ షట్చక్ర జాగృత  జ్ఞాన ప్రదీప్తి
సకల బీజాక్షర మంత్రాధిదేవతా దివ్య మూర్తి
ప్రణమామ్యాహం బ్రాహ్మిణి
గాయత్రి సావిత్రి సరస్వతీ
త్రికాల సంధ్యా వందని

 

https://youtu.be/PLK8GraHXEM?si=BHYbqJh6vsL_MUZq

విజయ దశమి- దేవీ నవరాత్రులు -రాఖీ-(10) దశ గీతార్చన

1.బాల త్రిపురసుందరీదేవి

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: కళ్యాణి

బాలా త్రిపుర సుందరి
కన్యాకుమారి ఈశ్వరి
ప్రణతులివే పరమేశ్వరి
కరుణగనవే యోగీశ్వరి

1.కన్నె ముత్తైదువుగా
పూజ లందుకొనెవే బాలా
నవరాత్రులు మాయింట
సేవలు గొని చూపవే లీల

2.బాలా నీవాక్కు బ్రహ్మ వాక్కు
తీర్చవే నెరవేరని మా మొక్కు
నీ చరణ సన్నిధి ఎప్పటికి దక్కు
నిర్మల నేత్రి నీవే నీవే మాకు దిక్కు

Monday, September 16, 2024

OK

 *ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం*


సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।

ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥

పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।

సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥

వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।

హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।

సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥


ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతావనిలో

ద్వాదశ స్వరస్థానాలు సంగీత స్వనిలో

సంగీత శాస్త్ర సృష్టికర్తవు  నీవే కదా సదాశివా

సామగాన విలోల సచ్చిదానంద భవానీ ధవా 

సహజమే సారూప్యత భవా ప్రణవ సంభవా

నమః శివాయ గురవే ప్రణతి దక్షిణామూర్తయే మహాదేవా

సహజమే సారూప్యత భవా ప్రణవ సంభవా

నమః శివాయ గురవే ప్రణతి దక్షిణామూర్తయే మహాదేవా


1.షడ్జమ సాకారం భజే సోమనాథమ్

శుద్ధ ఋషభం శ్రీశైల మల్లికార్జునమ్

చతుశ్శ్రుతి ఋషభం ఉజ్జయినీ మహాకాలమ్

సాధారణ గాంధార స్థావరం ఓంకారమమలేశ్వరమ్

అంతర గాంధార విలసితం పరళి వైద్యనాథమ్

సహజమే సారూప్యత భవా ప్రణవ సంభవా

నమః శివాయ గురవే ప్రణతి దక్షిణామూర్తయే మహాదేవా


2.శుద్ధ మధ్యమాశ్రితం ఢాకినీ భీమశంకరమ్

ప్రతిమధ్యమ స్వరవరం సేతుబంధ రామేశ్వరమ్

పంచమం అచల స్వరాక్షరం దారుకావన నాగేశ్వరమ్

శుద్ధ ధైవత సంస్థితం వందే వారాణసీపుర విశ్వనాథమ్

చతుశ్శ్రుతి ధైవతాన్వితం గౌతమీతట త్రయంబకేశ్వరం

సహజమే సారూప్యత భవా ప్రణవ సంభవా

నమః శివాయ గురవే ప్రణతి దక్షిణామూర్తయే మహాదేవా


3.కైకసీ నిషాదయుతం తం హిమగిరి కేదారేశ్వరం

కాకలీ నిషాద సంయుతం సతతం నమామి గృష్ణేశ్వరమ్

గతి సంగతుల ధృతి నటరాజ నర్తనం - గమకం నమక చమకావర్తనం

లయకారం రాగవిరాగం వందే ధర్మపురీ రామలింగేశ్వరమ్

సాంగనుతిర్మృదంగతాళ భంగి చలిత అభంగ శుభాంగ ఉత్తుంగ తరంగ గంగాధరమ్

సహజమే సారూప్యత భవా ప్రణవ సంభవా

నమః శివాయ గురవే ప్రణతి దక్షిణామూర్తయే మహాదేవా


ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతావనిలో

ద్వాదశ స్వరస్థానాలు సంగీత స్వనిలో

సంగీత శాస్త్ర సృష్టికర్తవు  నీవే కదా సదాశివా

సామగాన విలోల సచ్చిదానంద భవానీ ధవా 

సహజమే సారూప్యత భవా ప్రణవ సంభవా

నమః శివాయ గురవే ప్రణతి దక్షిణామూర్తయే మహాదేవా


ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

 

https://youtu.be/x6hkrdAFdqs?si=-4wLZ1XlvfShARPx

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: కానడ

మరపురాని చిరునవ్వువు
మాటల మల్లెపువ్వువు
మైత్రికి ఇలలో మరో పేరువు
మా మాడిశెట్టి గోపాల్ నువ్వు

1.ఉద్యోగం కొనసాగింది జీవితభీమాగా
వేదికపై నీ వ్యాఖ్యనం ఎంతో ధీమాగా
ప్రతివారికి నీ పలకరింపు మనసారా ప్రేమగా
నీ కవనం దవనమై నెత్తావిని చిమ్ముగా
బహుముఖ ప్రజ్ఞాశాలివీ మహా వినయశీలివి

2.పలు సాహితీ సంస్థల నిర్వహించి
సాటి కళాకారులెందరినో ఆదరించి
దేశ విదేశీ పురస్కారాలెన్నో గ్రహించి
అనంతచార్య తో కరినగరం బ్రదర్స్ గా భాసించి
కీర్తి గొన్నావు వాఙ్మయసేవనే శిరసా వహించి

Saturday, September 14, 2024

 

https://youtu.be/uqLrBmHVMe4?si=8pn3EMFvRCgsHWwR

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:నీలాంబరి

గొల్లపెల్లి వంశోద్దారకుడా
అంజయ్య వెంకటమ్మల ముని మనవడా
గీతా రాంకిషన్ ల పౌత్రుడా
అనూషా సిద్దీశ్ ల ప్రథమ పుత్రుడా
మీ బాబాయి హరీష్ భరద్వాజ్ కు అత్యంత ఇష్టుడా

ఏ పేరుపెట్టి నిన్ను పిలవాలిరా-ఊరికే పేరుతెచ్చువాడా
ఏ నామం అంకితమివ్వాలిరా-దేశానికి ఖ్యాతి తెచ్చేటి ధీరుడా
లాలి జో శ్రీ రామచంద్ర సముడా
లాలిజో శ్రీ కృష్ణుని సరి తేజుడా

1.జాతకం పరికించి శాస్త్రాలు శోధించి
ఇలవేల్పు పురవేల్పు ఇష్టదేవతలను తలపించి
ఏడేడు తరముల పెద్దలందరి దివ్య ఆశీస్సులాశించి
చక్కగా పలికేటి తీరైన పేరొకటి  నీ చెవిలొ వినిపించి
ముదము నొందేము బారసాలను నీకు జరిపించి

2.వివేకానందుడే నీకు ఆదర్శప్రాయుడు
విశ్వకవి రవీంద్రుడే నీ మార్గ దర్శకుడు
విద్యలోనా నీవు వినుతి కెక్కాలి
జాతి ప్రగతికి నీవు బాట వేయాలి
అతిథులందరు నీకు నందమొందీ దీవెనలను అందజేయాలి

*

Monday, September 9, 2024

https://youtu.be/nTGyhjpCahQ?si=Cbu5cfyAxRZT1-RE

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:నట భైరవి

గున గున రావయ్య ఓ గుజ్జు గణపయ్య
బిర బిర రావయ్య మా బుజ్జి గణపయ్య
ముజ్జగాలు కొలిచేటి ఓ బొజ్జ గణపయ్య
*ఒజ్జగా* మారి మాకు విద్దెలన్ని గరపవయ్య
గణపతి బప్పా మోర్యా
దండాలు వేనవేలు ఆచార్యా

1.ఆట పాటలన్ని మాకు -దీటుగా నేర్పవయ్య
లెక్కలన్ని  పక్కాగ -చేయు బుద్ది కూర్చవయ్య
తెలివితేటలెన్నొ మాలో పెంపుచేయవయ్యా
మీనమేషాలు మాని మమ్ము చేపట్టవయా

గణపతి బప్పా మోర్యా
దండాలు వేనవేలు ఆచార్యా

2.అన్నెంపున్నెం ఎరుగని వారికి సాయం చేసే మనసియ్యి
అమ్మా నాన్నకు అన్నం పెట్టే కొలువును దయచెయ్యి
ఎండా వానల అండగా నిల్చి  పంటలు పండనియ్యి
పిల్లాజెల్లను సల్లంగ చూసి సంతోషాన్ని కలుగజెయ్యి

గణపతి బప్పా మోర్యా
దండాలు వేనవేలు ఆచార్యా

*ఒజ్జగా*= ఉపాధ్యాయునిగా, గురువుగా, ఆచార్యునిగా


Friday, September 6, 2024

 

https://youtu.be/4a7ABMY_9ps?si=qfVXhPPjv3Su4p9z

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :శంకరాభరణం

నమోస్తుతే వేంకట గణపతి-తిరుమలేశ శ్రీ పతి
మా కీయరా స్వామి సన్మతి
శరణంటిమి నిన్ను తెలుపవేర సమ్మతి
తిరువేంకట పురపతి-సంకట హర విఘ్నపతి

1.కరిముఖ మూర్తిగా నిన్ను కొలిచితిమి
పరపతి పెంచమని మరి ప్రార్థించితిమి
పరిపాలించర  మరలా అవతరించి జగతి
నేటి శుభ భాద్రపద మాస శుక్ల పక్ష చవితి

2.ధర నిజ దైవమీవని మేము నెర నమ్మితిమి
మొర నాలించెదవని భక్తితో సేవించితిమి
నవరాత్రులూ మా వీధి మండపాన నిలిపితిమి
లంబోదరా నీ పూజలు ప్రియమారగ సలిపితిమి

 https://youtu.be/r9DC5i64ve0

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

తిరువేంకట గణనాయకా
నిను మెప్పించగ నాతరమా
శరణంటి నీ చరణాలే ఇక
నను బ్రోవగ తాత్సారమా

1.నీ కొండకు అరయగలేనని
ఈ మండపానికేతెంచివా
కన్నుల పండగనే నవరాత్రులు నినుగన
నన్నీరీతిగ దయగంటివా

2.దివారాత్రులు నిను సేవించి
నీ సన్నిధిలో తరియించెదను
భవసాగరమును దాటించి
దరిజేర్చమని ప్రార్థించెదను


https://youtu.be/TaBiee2re6s

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం : కళ్యాణి 


సిద్ధి వినాయక స్వామీ స్వామీ

నా మీద నీకింక దయరాదేమి


పాడితి నీ గీతి ప్రతి నిమిషమ్మున

వేడితి గణపతి నిను వేవిధముల

కొలిచితి నిన్ను శతకోటి రీతుల

తలచితి నీనామ మనంత మారుల


లయనేనెరుగను కరతాళములే

రాగములెరుగను భవరాగములే

తపముల నెరుగను తాపత్రయములె

వేదములెరుగను నీ పాదములే

Tuesday, September 3, 2024

 https://youtu.be/K9-uEkDPqFQ?si=B_W5rqNuPL2fsXum

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం
ఉపాధ్యాయ వర్గానికిది ఘన పర్వదినం
అధ్యాపక వృత్తే ఒక గర్వకారణం
గరుపూజా మహోత్సవం విద్యాజగతికే  శుభదినం
గురువర్యులందరికీ త్రికరణశుద్ధిగా అభివందనం

1.తార్కిక జ్ఞానము విద్యయు విజ్ఞానము
భారతీయ తాత్త్వికత  చదువు సంస్కారము
భాషా సంస్కృతులు జాతీయ దృక్పథము
పునాది రాళ్ళుగా భవితను తీర్చిదిద్ది
విద్యార్థులనుద్ధరించు గురువే నిజదైవము
గురువర్యులందరికీ త్రికరణశుద్ధిగా అభివందనం

2.నలు దిక్కుల పలు చిక్కుల నెదిరించి గెల్చి
బోధనేతర గురుతర బాధ్యతలూ తలదాల్చి
అంచనాల నధిగమించు అంచనాలు మించి
సమాజాన కీలకమై దేశ వికాస మౌలికమై
మట్టిని బొమ్మగ మలిచే సాక్షాత్తు గురు బ్రహ్మలై వెలిగే
గురువర్యులందరికీ త్రికరణశుద్ధిగా అభివందనం

Monday, September 2, 2024

 


https://youtu.be/R1ehAYCYwlU?si=dTcrR2FQolB2AgW0

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ

రాగం : కీరవాణి

పెళ్లి రోజు నేడు మీ పెళ్లి రోజు
అల్లిబిల్లిగా అల్లుకున్న కలలన్ని పండిన రోజు
ఇద్దరొకక్కరై గుండె లోక్కటై మనువాడిన రోజు
ఒక్క మాటగా బ్రతుబాటలో నడయాడిన రోజు
అందుకోండి మనసారా అందించే శుభాకాంక్షలు
అనూషా సిద్ధిశ్ లారా మీకివే పెళ్లి రోజు శుభాకాంక్షలు

1.మధురమైన అనుభవాలను నెమరువేసుకునే రోజు
మరపురాని అనుభూతులను పంచునే మంచి రోజు
మూడు ముడులు వడివడి మనవడిగా మారిన రోజు
ఏడడుగులు తోడుగ సాగి వారసుణ్ణి వరామిచ్చిన రోజు అందుకోండి మనసారా అందించే శుభాకాంక్షలు
అనూషా సిద్ధిశ్ లారా మీకివే పెళ్లి రోజు శుభాకాంక్షలు

2.అరమరికలు లేకుండా అలారరుతోంది మీ కాపురం
ఆదర్శ వంతమై విలసిల్లుతోంది మీ అనురాగ గోపురం
పిల్లా పాపలతో చల్లగ వర్ధిల్లాలి మీరు కలకాలం
అన్యోన్యత అనుబంధాలకు మీ దాంపత్యమే ఆలవాలం
అందుకోండి మనసారా అందించే శుభాకాంక్షలు
అనూషా సిద్ధిశ్ లారా మీకివే పెళ్లి రోజు శుభాకాంక్షలు

 

https://youtu.be/i2RnwmXRnjI?si=SEEq4GkK9bD_UQyM

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :మోహన

ఉద్యోగ పర్వం నీకొక ముగిసిన అధ్యాయం
ఇన్నాళ్ల పయనం లో అడుగడుగున విజయం
విజ్ఞాన ఖనిగా బ్రహ్మరథంపట్టింది
పనిచేసిన ప్రతి విద్యాలయం

మిత్రుడా అనంతా చార్యా
ప్రేమ పాత్రుడా విద్యార్థి లోకానికి
నిత్యం జ్ఞానప్రభను పంచిన సూర్యా

1.కలకుంట్ల వంశానికి కీర్తి తెచ్చిన ఘనుడవు
సంపత్కుమారాచార్య రంగనాయకమ్మల వరపుత్రుడవు
వైజయంతి మాలకు ప్రియ వరుడవైనావు
సుధేష్ణా పండిట్ సుధాంశు ఆచార్యుల సంతతిగా గొన్నావు
సోదరీమణులకు మేనకోడళ్లు అల్లుళ్లకు మమతను పంచావు
బంధువర్గమందున పురుషార్థివనిపించావు

2.బహుముఖ ప్రజ్ఞాశాలివి వ్యాఖ్యన చాతుర్య శీలివి
ఉన్నత విద్యలలో అత్యున్నత ప్రతిభ నీది
సహాధ్యాయులలో సహోద్యోగులలో చెరగని మైత్రి నీది
కవిగా రచయితగా వ్యాఖ్యాతగా అకుంఠిత దీక్ష నీది
కరినగరం పట్టణాన పరిచయ మక్కరలేని పేరునీది
శుభాకాంక్షలందుకో నీ మలి జీవిత శుభ సమయాన

Tuesday, August 27, 2024

 

https://youtu.be/DUD_ul7olc0?si=xRpWd4JoXzBddOqy

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : గణపతి

ప్రణవస్వరూపం ప్రథమ పూజితమ్
పార్వతీ సుతo ప్రణతోస్మి ఆదిదేవమ్

1.సంకటనాశకం సత్వర వరదాయకమ్
సమ్మోహన ముఖం ప్రముఖం సుముఖమ్
లంబోదరం పాశంకుశధరం స్కంద సోదరమ్
శ్రీకరం శుభకరం నమో నమామి కరుణాకరమ్

2.విఘ్నవారిణం-విజ్ఞాన ప్రసాదితమ్
విబుధ వినుతం మూషికాసుర విజితమ్
చిత్తశుద్ధి దాయినం గజముఖ విలసితమ్
సిద్ది బుద్ది ప్రదం  వందే ప్రమథ గణనాథమ్

Sunday, August 25, 2024

 

https://youtu.be/_RLYUJ0lwQ8

మెట్టుపల్లి లోనా గట్టిదైన ట్రస్టు

జనసేవలోనా అన్నిటిలో బెస్టు 

అదే అదే ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్టు

ప్రజలందరికి దాని పట్ల ఎంతెంతో ట్రస్టు 


1.సామాజిక సేవా కార్యక్రమాలు 

ప్రజలకు మంచి చేయు ఉద్దేశ్యాలు 

సంఘసేవ, సంక్షేమం సంస్థకు లక్ష్యాలు

మన్నన పొందయి ట్రస్టు విధివిధానాలు 

అలుపెరుగని విధంగా ఆదర్శనీయంగా 


2.రక్తదానం, నేత్రదానం నిత్యాన్న దానం 

   రోగులకందుబాటుగా అత్యవసర వాహనం  

   శీతల పేటికా సదుపాయం అనాథశవ దహనం 

  అంతిమ యాత్రకై వైకుంఠ వాహనం 

  నిరంతరం ఉచితంగా ఎల్లరకు సమయోచితంగా 


3.నిత్యాన్నదానాలు విద్యా ప్రోత్సాహకాలు 

పేద విద్యార్థులకు ఉన్నత విద్యా దానాలు 

పచ్చదనం స్వచ్ఛదనంకై మొక్కలు నాటడం 

వికలాంగులకు వంచితులకు చేయూత నీయడం 

చేయి చేయి కలిపారు ట్రస్టును ఉన్నతంగ మలిచారు 


Saturday, August 24, 2024

 

https://youtu.be/Dmm5sqTiFO4?si=qQlTMLx3zhT5hYQ9

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:మోహన

అష్టమి నాడు పుట్టావు
అష్టమ సంతానంగా అవని అవతరించావు
అష్ట భార్యలను చేపట్టావు
అష్టాదశాధ్యాయిని గీతను వెలువరించావు
వందనమిదె కృష్ణా యదునందన శ్రీ కృష్ణా

1.అష్టలక్ష్మీ పతి నీవే హరి నీవే
   అష్టైశ్వర్యాలు మా కొసగేవే
    అష్ట దిక్పతివీ నీవే చక్రవి నీవే
    అష్టకష్టాల నెడబాపేవే
    వందనమిదె కృష్ణా యదునందన శ్రీ కృష్ణా

2.అష్ట తీర్థాలు నీ పదములలో
అష్ట వసువులు నీ సదనములో
అష్టసిద్దులూ కృష్ణా నీ సాధనలో
అష్ట గంధములు నీ ఆరాధనలో
  వందనమిదె కృష్ణా యదునందన శ్రీ కృష్ణా

Friday, August 23, 2024

 https://youtu.be/lOcDwaNvWHc?si=cKWcDnreMeaSAwFk


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:నవరోజు 


యోగ నిద్రలో యుగములు మునిగేవు 

లాలి నేమని పాడాలి మోహన బాలా 

ఏడేడు లోకాలు ఏమరక పాలించేవు 

జంపాల నెలా ఊపాలి రాధాలోలా 

గోవిందా నిత్యానంద ముకుందా ||


1.ఆలమందల నదిలించి అలిసేవనే 

   నే చేసేద గోపాలా పవళింపు సేవనే 

   భక్తజనాల విన్నపాలన్ని విన్నావనే 

   భావనమున  నీకు వీచెద నే వీవనే 

   గోవిందా నిత్యానంద ముకుందా ||


2.మన్నే తిన్నావే మిన్నంతా చూపావే 

   వానబారి కాచావే విరహాగ్ని రేపావే 

   గాలి రూపు రక్కసుణ్ణి దునిమావే 

   పంచాభూతాత్ముడవు ప్రభూ నీవే 

   గోవిందా నిత్యానంద ముకుందా ||

Tuesday, August 20, 2024

 

https://youtu.be/u17z5EXAk-0?si=kG1w34rWpyoV3-m_

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :రేవగుప్తి

జాగృతమవరా నా కృతి వినరా
మోహనాకృతా మేఘశ్యామ శరీరా
నను నడిపించరా మనోరథ సారథిగా
నను కడతేర్చరా భవజలధి వారధిగా
కృష్ణమ్ వందే జగద్గురుమ్ ll

1.నా కామము సదా నిన్ను కనడమే
నా క్రోధము రాధతో నీవు మనడమే
నా లోభము నిన్ను వదలకుండుటయే
నాకున్న బలము -బంధువు నీవగుటయే
కృష్ణమ్ వందే జగద్గురుమ్ ll

2.నా మోహము ఈ దేహము నీ పొందుకే
నా మదమున్నది వేదికగా నీ చిందుకే
నా మత్సరమదే గోపికగానైనా పుట్టనందుకే
నా మోదము ఎదలో నీ గుడి కట్టినందుకే
కృష్ణమ్ వందే జగద్గురుమ్ ll

Saturday, July 27, 2024

 

https://youtu.be/zMJcMQhltOI?si=hVWYvOR--awrDX1w

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

ఒద్దికకేమో పధ్ధతిగా అల్లిన పువ్వుల దండ
ఓపిక లో ఎప్పుడు చెదరని తొక్కుడు బండ
నీవే నా పాలిటి చొక్కపు బంగారు కొండ
అడుగడుగున అనునిత్యం నీ అండా దండా

హ్యాపీ బర్త్డే టూ యు గీతా
మధురమే నీతో నా జత  జీవితమంతా

1.ప్లవించేవు రస గీతమై  రాఖీ కలం గుండా
ప్రవేశించినావు నా బ్రతుకున కలలే పండా
కాపురమంతా ప్రేమ ఘుమ ఘుమలే నిండా
కమ్మదనమే  ముప్పొద్దులా వలపులు వండ

హ్యాపీ బర్త్డే టూ యు గీతా
మధురమే నాతో నీ జత  జీవితమంతా

2.నీ నవ్వుల్లో ఇల్లంతా చీకటే లేని చోటై
నీ పలుకుల్లో అందరికీ ఆత్మీయత పరిపాటై
ఉల్లాసం నీలో... ఆమని కోయిల పాటై
నీవే నీవే నడిచే పరిమళలా పూదోటై

హ్యాపీ బర్త్డే టూ యు గీతా
మధురమే నాతో నీ జత  జీవితమంతా






https://youtu.be/Je51IlNev8I?si=rk8aJpJwDAiKA1ర

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం : ఖరహరప్రియ


ఇందరు ఎందుకు ఆరాధింతురు నిను 

ఇందిరా పతీ సుందరానన మా మోరనూ విను 

వందనాలు నీకివే కంజాదళాయతాక్షా మము దయగను 

గోవిందా వేంకటగిరి నిలయా సరసిజనాభా సహృదయా

నీ పదముల నొదలను 


1.నిను నమ్మిన కరుణింతువని అందురు కొందరు 

ముందుగానే కాచితివా ఎందుకు అందరు తలవకుందురు 

విత్తుముందు చెట్టుముందు తర్కమెందుకందురు 

నిను కొలిచి ఇలలోన బావుకున్న భక్తులెందరు 


2.బ్రతుకంతా బాధలతో సతమత మవుతుందురు 

దిక్కుమొక్కు లేక నిన్ను శరణు వేడుచుందురు 

నీవంటూ ఉన్నావంటే మహిమ చూపుమందురు 

వేడగనే వేగిరమే వేదాత్మా నిను వెతలు తీర్చమందురు 


Monday, July 22, 2024

 

https://youtu.be/HRboJ78qsPE?si=Wclj25H6TdZ_Ri4J

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

గురువు కానిదేది లేదు,ఎవరూ లేరు - మన జీవితాన
బ్రతుకు తెరువు గరపునదేదైనా- గురువే నా తలపున
గురువులలో సద్గురువే నావ మనకు- భవ సాగరానా
శరణువేడు విశ్వయోగి విశ్వంజీ గురుదేవుని మనమున
పరమ పావనమౌ నేటి గురుపౌర్ణమి శుభ తరుణమున

1.తరులు గిరులు ఝరులు పశు పక్ష్యాదులు
నేర్పును శమ దమాది సాధనా నియమాదులు
సజ్జన దుర్జనులూ చేతురు ఉచితానుచిత బోధనలు
ఆది గురువులు అమ్మానాన్నలు మమత మనుగడ వారి దీవెనలు

2. చపల చిత్తమును కట్టడి చేసే అంకుశమే గురుమంత్రం
విచలిత మనసును అదుపులొ ఉంచే నాగస్వరమా తారక మంత్రం
గాడి తప్పిన బ్రతుకు బండిని బాట పట్టించు భవ్య మంత్రం
ఇహపరముల తరియింప జేసేది సద్గురునామం స్మరణ మాత్రం

Saturday, July 20, 2024

 

https://youtu.be/oQheAIwbVFs?si=P5QuTTYIgYIO2YYd

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

వేదాలను విభజించి వేద వ్యాసుని గా కీర్తి గొన్న
కృష్ణ ద్వైపాయనా నీకు మనసా వందనం
సాక్షాత్తు విష్ణుస్వరూపా బాదరాయణా నీకు వచసా నమోవాకము
సత్యవతి పరాశర ప్రియ తనయా నీకు శిరసా ప్రణమామ్యాహం
చిరంజీవివై వరలెడి గురువర్యా నీకిదే పాదాభివందనం

1.అష్టాదశ పురాణాలు ఉపపురాణాల గ్రంధకర్త వీవు
బ్రహ్మ సూత్రాలనూ మనుజాళికి అందజేసినావు
మహాభారతాన్విత గీతామకరందమూ నీ వరమే
విష్ణు సహస్ర నామ స్తోత్రమ్మూ మాకు నీ ప్రసాదమే

2.ప్రవచనం చేసే ప్రతి పీఠానికి వ్యాసపీఠమనే వాసి
గురుశబ్దపు పరమార్థం నరులకు నీవొసగిన జ్ఞానరాశి
నీ లేఖిని వేగానికి గజముఖు డొక్కడే తగు లేఖకుడు
నీస్మరణగా వ్యాసపూర్ణిమయే సద్గురు పూర్ణిమాయే నేడు

Thursday, July 18, 2024

 

https://youtu.be/rylDm8_htpA?si=8XQLC-QPndJ2z-qi

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : మోహన

అప్పాల పండగే ఇది
అరె గొప్పనైన పండగే ఇది
ఆషాఢ శుద్ధ యాకాదశి
అన్నం ముట్టడు ఏ మనిషి

1.నెత్తి ముంచి తానాలు చెయ్యాలి
కొత్త బట్టగట్టి గుడి కైతే పోవాలి
ఎంకన్న సామికి దండమెట్టుకోవాలి
ఒక్క పొద్దు నోమింక నోచుకోవాలి

2.పాచి ఉంచ పనికి రాదు ఇంటి నిండా
నీచు మాట ఎత్త రాదు గమ్మత్కిగూడా
ఏడాది కొక్కనాడు కట్టుబాటు దాటకుండ
దానధర్మం జేయ్యాలి కప్పదాటు వెయ్యకుండ

Monday, July 8, 2024

 

https://youtu.be/N2mHvgQu4p0?si=39NOM6ieZg0IMVND

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :హంసానంది

సప్త మాతృకా స్వరూపిణి
పంచమ అవతారిణి భవతారిణి
భవబంధ మోచని వారాహీ జనని
మంత్ర తంత్ర యంత్ర సాధన సంతోషిణి
వందే  కామరూపిణి శరణు శరణు దుష్ట దమని

1.కృష్ణ వర్ణ తేజో ప్రకాశిని వరాహానని
అష్ట భుజి అష్ట కష్ట దుఃఖ ప్రశమని
కాశీ పుర వాసిని ఉగ్ర వారాహీ నామకీ
అనుగ్రహించవే శ్రీ లలితా దండ నాయకీ

2. నిశి పూజా ప్రియే దేవి నిశిత బుద్ధి దాయిని
అంధకాసుర హంతకీ రక్తబీజ దైత్య హనని
శాక్తేయ విధి సాధక  తాంత్రిక పరిపాలిని
గుప్త నవరాత్రోత్సవ దేదీప్యమాన విరాజినీ

Saturday, July 6, 2024

 

https://youtu.be/Jz37Iu9ogSI?si=yhxDyXaphMRJK1xL

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :యమన్

శ్రేయస్సు కోరే వాడే దేవుడు
యశస్సు పెంచేవాడే దేవుడు
మనస్సుకే ప్రశాంతినే ఒసగువాడు దేవుడు
సన్మార్గము చూపువాడె దేవుడు
ఇన్నిగుణములున్నవాడు ఒకడే మా గురుదేవుడు
ఇలలోన వెలసిన విశ్వయోగి విశ్వంజీ గురువరేణ్యుడు

1.కష్టాలనెదుర్కొనే ఆత్మ స్థైర్య మిచ్చేవాడు
పెనుసవాళ్ళు స్వీకరించు ధైర్యముకలిగించువాడు
వేదనలో అండగనిలిచి ఓదార్పు నిచ్చేవాడు
శ్రద్ధాసహనములను సమకూర్చే వాడు
ఇన్నిగుణములున్నవాడు అతడే కదదేవుడు
ఇలలోన వెలసిన విశ్వయోగి విశ్వంజీ గురువరేణ్యుడు

2.చెప్పడానికంటె ముందు చేసిచూపించువాడు
తనపరభేదమేది కనబఱచనివాడు
మనలోని దక్షతను ప్రకటింపజేయువాడు
కర్మకు తగుఫలితాలను అందజేయువాడు
ఇన్నిగుణములున్నవాడు అతడే కదదేవుడు
ఇలలోన వెలసిన విశ్వయోగి విశ్వంజీ గురువరేణ్యుడు


https://youtu.be/oJwmtwKW7wE?si=n7B4Ul2m6YoF3Av1

 ఆమె :నిన్నారాధించేను నా మది 

అతను :నీకై ఆరాటమొందే ఎదనే నాది 

ఆమె :నిను వదులుకోని బంధం నాది 

అతను :కనులు కదుపలేని అందం నీది

ఆమె :జన్మలెన్నైనా నీకొరకే వేచి చూస్తుంది 

అతను:జగతికే ఆదర్శమై మనగలుగుతుంది 


1.అతను :దోబూచులాడుతావు 

మబ్బు చాటు చందమామలా 

ఆమె : వెంటాడుతుంటావు 

నను వీడక తోడుగనడిచే నీడలా 

అతను :సతాయించకే ఇంకా ఓ  సత్యభామా 

ఆమె :నా మతే దోచేస్తే సాత్వికమా నీ ప్రేమా 



2.ఆమె :నను గిల్లుతుంటావు 

నాపై అల్లిబిల్లి కవితలెన్నో అల్లి 

అతను :నాతో ఆడుకుంటావు 

నీ నవ్వుల పువ్వుల మత్తే జల్లి 

ఆమె : నరనరాల పొంగి పొరలే అనురాగ గంగను 

అతను :తలచినంత వాలిపోయే స్వేచ్చా విహాంగను

Thursday, June 27, 2024

 

https://youtu.be/vb9pCbVAUyE?si=kNm1Jyqps-VSW5Z9


రాగం :హిందోళం 


సంగీత కారులెందరో ధరలో 

గురువర్యులెందరో జగతి లో 

మానవీయ విలువలున్న మాననీయులే అరుదు 

కోమాండూరి రామాచారి గారికే చెల్లును ఆ బిరుదు 


1.లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు

 ఎస్పీ బాలు గారి మన్ననలందిన సంగీత సేవకుడు 

ఉచిత సంగీత బోధనయే ధ్యేయమైన అధ్యాపకుడు

విశ్వ వ్యాప్త ఉత్తమశిష్యులు గల సద్గురువరేణ్యుడు 


2.సంగీతమే కాదు సంస్కారం అలవర్చే సచ్ఛీలుడు

భావమూ భాషా ఉచ్చారణ నేర్పించే  శిక్షకుడు 

పాటనెలా పాడాలో అలవోకగ తెలిపే సాధకుడు 

జీవితమే సంగీతమైన అభినవ గంధర్వుడు 

Wednesday, June 26, 2024

 

https://youtu.be/TYeuSn8xyHY?si=inAe-9sSzGWmIskr

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :హిందోళం

మహిమలు చూపించు- మహనీయుడవే
లీలలు కనబరచు -ఇలలో సద్గురుడవే
చిక్కులు తొలగించు సాక్షాత్తూ దేవుడవే
అక్కున మము జేర్చు ప్రత్యక్ష పరమాత్మడవే

విశ్వ యోగి విశ్వంజీ మహారాజా పాదాభి వందనాలు
విశ్వవ్యాప్త విభవాన్విత దివ్యతేజా మా హృదయ నీరాజనాలు

1.ఆకలితో ఉన్నాము ఆధ్యాత్మికత రుచించదు
వెతలలో  వేగుతుంటే వేదాంతం తల కెక్కదు
వ్యాధులు బాధిస్తుంటే బోధలన్ని మాకు వృధా
సంకట కంటకాల బాటేనా మాకు బ్రతుకంతా
విశ్వ యోగి విశ్వంజీ మహారాజా పాదాభి వందనాలు
విశ్వవ్యాప్త విభవాన్విత దివ్యతేజా మా హృదయ నీరాజనాలు

2.చెట్టును పుట్టను వదలక మొక్కులెన్నో మొక్కాము
ఎక్కిదిగిన గడపగా గడపగా  వైద్యులతో వెక్కాము
ఏ మందని ఏమందు మందులెన్నో వాడివాడి చిక్కాము
దిక్కిక నీవేనని మిక్కిలి కాచెదవని నమ్మి శరణు జొచ్చాము
విశ్వ యోగి విశ్వంజీ మహారాజా పాదాభి వందనాలు
విశ్వవ్యాప్త విభవాన్విత దివ్యతేజా మా హృదయ నీరాజనాలు

 

https://youtu.be/-F5qso8bjEg?si=4fuNtsyqdf-cXtUZ

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :మయా మాళవ గౌళ

ఊరకే ఎవ్వరూ శిష్యులవరు
ఉత్తినే అందరూ భక్తులవరు
ప్రకటించు మాకిపుడె దృష్టాంతరం
ప్రసాదించు మాకొక భవ్య వరం

సచ్చిదానంద సద్గురు సాయినాథా
అవదూత చింతన గురుదేవ దత్తా

1.చిలవలు పలవలు నీ లీలలు
కథలు కథలుగా నీ మహిమలు
ఆఁహాఁ ఓహో లు సాయి- నీ సూక్తులు
ఎండమావులే మాకు- నీదివ్య బోధలు

సచ్చిదానంద సద్గురు సాయినాథా
అవదూత చింతన గురుదేవ దత్తా

1.ఆవులను కాచినపుడే అర్జునుడవు నీవు
ఆర్తులను బ్రోచినపుడే గురు దత్తుడవు
ఆ నోట ఈ నోట ఎందుకోచ్చిన తంటా
నీకంటూ మనసుంటే కనిపించు ఈ పూట

సచ్చిదానంద సద్గురు సాయినాథా
అవదూత చింతన గురుదేవ దత్తా

Wednesday, June 19, 2024

 

https://youtu.be/UyZVJSaGU1A?si=yikGn6kkNVebRVTf

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :ఆనంద భైరవి

ధరలోన  దైవమే మానుష రూపేణా
విశ్వ గురువుగా చూపెను నాపై కరుణా
భగవాన్ విశ్వయోగి విశ్వంజీ ప్రేమాదరణా
అనుభవైక వేద్యమే శిష్య పరమాణువుగా
నను స్వీకరించిన ఆ శుభ తరుణానా

1.కన్నులు చేసెను బోధనలు
నవ్వులు బాపెను వేదనలు
నాలో మొదలాయెను అంతర్మదనలు
మోక్షగామిగా నిరతం నా శోధనలు
అనుభవైక వేద్యమే శిష్య పరమాణువుగా
స్వామి నను స్వీకరించిన ఆ శుభ తరుణానా

2.ఆత్మవిశ్వాసం అంకురించెను
ఆధ్యాత్మిక చింతన చిగురించెను
ఐహిక భావనలే నాలో లోలో అంతరించెను
పులకితమై నా జన్మ తక్షణమే తరించెను
అనుభవైక వేద్యమే శిష్య పరమాణువుగా
నను స్వీకరించిన ఆ శుభ తరుణానా

Friday, June 14, 2024

 

https://youtu.be/OpvyC89emOA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

అందాల దేవతవు-జన్మాల నా జతవు నా చేతి గీతవు -నా నుదుటిరాతవు నా పాలిట వెలసిన -భాగ్యవిధాతవు నా జీవన గీతవు -నా జీవన గీతవు 1.సృష్టికర్త రాసిన అద్భుత కవితవు వృష్టిగ నాపై కురిసిన మమతవు దృష్టికి హాయిగొలిపెడి అమృతవు పృష్టిగ నా బ్రతుకున పొడతెంచావు 2.ఎంతకూ బోధపడని వింతవు చింతను ఎడబాపే అంతస్మితవు పంతానికి నను లాగే కవ్వింతవు నాఅంతరంగానా నీవే అనంతవు

Sunday, June 9, 2024

 


https://youtu.be/NUluLxSipO8?si=a54W8biTqtnH1kH5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

దేవ ఋణం ఋషి ఋణం పితృ ఋణం
తీర్చుకోగ  వదిలాలి మనం తిలా తర్పణం
వంశాభివృద్ధికి పెద్దల దీవెనలే మూలకారణం
వసురుద్రాదిత్య రూపులవుదురు పితరులు మరణానంతరం
పిండప్రదానాలతో సంతృప్తి పరచాలి పితరులను
ప్రతీ సంవత్సరం

1.ఊర్ధ్వ లోక పయనమౌను-దేహమునొదిలిన ఆత్మ
ఉత్తమగతులను అశించును కోరుకోక మరే జన్మ
సత్కర్మల ఫలితముతో ప్రాప్తించును స్వర్గవాసము
పున్నామ నరకం దాటించడమే పుత్రుల కర్తవ్యము

2.పితృ పక్షాలలో సంతుష్టులవ్వాలి పితరులు బ్రాహ్మణ భోజనాలతో
ఉత్తరాయణ పుణ్య సమయాన సద్గతులు పొందాలి పెద్దలు తిలా దానాలతో
పుష్కరాలందున గతించిన బంధుజనులకూ సంతర్పణ చేయాలి పిండ ప్రదానాలతో
పితృయజ్ఞమొనరించి ఆశీస్సుల నొందలి  తరాలు అంతరించి పోకుండా శ్రద్ధాసక్తులతో

Saturday, June 8, 2024


https://youtu.be/PG17GE3o9YU?si=HOLzEu_Xgl_UaMiC

 నా కవనమే నాక వనం

కవనమే నాకు జీవనం

విహరించితే మలయ పవనం

విరహించితే నవనీత లేపనం


1.మదిలో చెలగే మధు భావనం

సుధలే కురియగా పరమ పావనం

వివిధ గదులుగల అద్భుత భవనం

మధురానుభూతుల బృందావనం


2.అడుగడుగునా ఆనంద నందనం

పదపదమున అబ్బరమొలికే గమనం

కదలాడే జీవనదుల సంగమ సుదానం

ఎద సొదల ని'దానమొసగు సన్నిధానం


Wednesday, June 5, 2024

 

https://youtu.be/o76gdIoBF3I?si=l6FTG4Aj7ap6k8D8

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రేవతి

విశ్వసించితి గురువే దైవమని,విశ్వమే తన రూపమని
నమ్మి కొలిచితి గురువే తల్లీ తండ్రియని
శరణనివేడితి విశ్వ గురువు చరణాలని
నా తలదాల్చితి వెతల దీర్చగా
విశ్వయోగి విశ్వంజీ దివ్యపాదుకలని

ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్తా
ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్తా

1.సులభంగా లభించదు గురువు భవ్యదర్శనం
పూర్వ పుణ్యమేలేక దొరకదు గురుపాదుకా స్పర్శనం
ఏనాటి నా భాగ్యవశమో గురుకృపా కటాక్ష వీక్షణం
ఏ తపఃఫలంబో ప్రాప్తించగ నాకు గురుముఖ జ్ఞాన బోధనం
ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్తా
ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్తా

2.గురుదక్షిణగా సమర్పణం ఈ దేహం నాప్రాణం
గురు సన్నిధిలో స్వామికిదే సాష్టాంగ ప్రణామం
నిరంతరం గురూపదేశ మంత్రమే మదిలో మననం
త్రికరణశుద్దిగా అనుసరించితి స్వామి మార్గదర్శనం

ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్తా
ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్తా

Tuesday, May 28, 2024

 


https://youtu.be/FUTn9zlwo8A?si=bscDaFUrifK_6n5P

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

విరించి విలాసి వైరాగి స్వామి విశ్వయోగి
విశ్వంజీ మహరాజ్ ని అపర దత్తావతారునిగా ఎరిగి
స్వామి కరుణామృత ఝరిలో నేను సాంతం కరిగి
కడతేరెదా గీతలహరిలో ఓలలాడుతూ
స్వామి పదములు నా కన్నీటితో కడిగి

1.జన్మించినదాదిగా మాయలోన మునిగి
బ్రతుకు పరుగు పందెంలో నెగ్గక తల ఒగ్గీ
అగమ్యగోచరంగా బేలనై చేష్టలన్ని ఉడిగి
ఉద్ధరించువారికై వేచితి వేదనతో రెక్కతెగిన పక్షి భంగి (రీతి)

2.ఎడారి జీవితాన తాను ఎడతెగపారే ఏరై
దాహార్తితొ పరితపించు వేళ అమృతము తీరై
నా పుట్టుకకొక సార్థకతకూర్చే వరముగ ఎదురై
నను చేపట్టే-గురువై- దరిచేర్చే-అక్షరముకు చక్కని దారై

Friday, May 17, 2024

 

https://youtu.be/3NPwDZliD4E?si=0jv3VaoPWAGRfgcF

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:పీలు

పెండ్లిచూడ రారండి రాజన్నది తండోప తండాలుగా
దండి శివరాత్రి జాతర ఎములాడన సందడిగా
కండ్ల పండుగే భక్తితో -చూసిన వాళ్ళకు చూసినంత రాజన్నా
బతుకు పండులే పున్నెం -చేసేటోళ్ళకు చేసినంత మాదేవా

1.గుండంల తానంజేసి గండదీపంల తైలంబోసి
కోడెనింక పట్టి గుడిసుట్టూ సుట్టి మట్టుకు గట్టి
మంటపాన గంటకొట్టి గణపయ్యకు దండమెట్టి
రాజన్నను రాజేశ్వరమ్మను కండ్లార సూడరండి

2.దినమంతా ఉపాసముండి రేతిరి జాగారముండి
రాయేశా మాతండ్రీ మమ్మేలు మమ్మేలమని తలచి
సంబరంగ జరిగేటి సాంబశివుని లగ్గాన్ని చూచి
జనమకో శివరాతిరన్నట్టు చెప్పుకుందాము శివుని గొప్పలు

Thursday, May 16, 2024

 

https://youtu.be/Fzur-M0AyWs?si=cghJvEA3NGS17ElL

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

ఏటేటా  ఏతెంచును తెలుగునాట ఉగాది
ఐదేళ్ళకోమారు ఎన్నికలే మన భవితకు నాంది
ఆరు రుచుల మేళవించి ఆరగించు  పచ్చడి ఉగాది పచ్చడి-క్రోధి ఉగాది పచ్చడి
ఆచితూచి ఓటు వేసి నిర్ణయించు ఏలుబడి-మన రాష్ట్ర ఏలుబడి-మన దేశ ఏలుబడి

ఓటరు పౌరుడా ఓటు విలువ నెరుగుమా
తగునేతల నెన్నుకొని నీతలరాత నరయుమా

1.తీయని బుజ్జగింపులు కారపు బెదిరింపులు
చేదైన హామీలు తరుణ లవణ వాగ్దానాలు
వగర్చే కులమత వత్తిళ్ళు -పులుపెక్కించే నగదూ బహుమతులు
మాయల వలలో చిక్కక ప్రదర్శించు నీ బుద్దీ కుశలతలు

ఓటరు నేస్తమా ఓటు విలువ నెరుగుమా
తగునేతల నెన్నుకొని నీతలరాత నరయుమా

2.నీ గ్రహచారం మారుతుంది నీదైన యోచనతో
నీ సంకల్పం నెరవేరుతుంది నీవివేకం వివేచనతో
యువత వార్ధక్యత అందరికి అగత్యమే ఓటువేయు సంసిద్ధత
ఓటును వినియోగించి చాటుకో ఈ పూట నీ నాగరికత

ఓటరు మిత్రమా ఓటు విలువ నెరుగుమా
తగునేతల నెన్నుకొని నీతలరాత నరయుమా

 


https://youtu.be/dUeSLqlxug4

"రాఖీ కలం-సహస్ర మనోరంజక గళాలు"వాట్సప్-యూట్యూబ్ గ్రూపు
ద్వితీయ వార్షికోత్సవ గీతం

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మోహన

అపురూప సంయోజనం-ఇది ఆత్మీయ సమ్మేళనం
పాటే బాటగ సాగే -మా పాటసారుల బ్రహ్మోత్సవం
ఇది"రాఖీ కలం-సహస్ర మనో రంజక గళం"-సమూహ ద్వితీయ వసంతోత్సవం-అద్వితీయ అనందోత్సవం

1.సంగీత సాహిత్య సృజనాత్మకతల సాంగత్యం
సరిగమ స్వరముల పదనిస పదముల సంయోగం
భావాలకు జీవం పోసే భారతీ భక్తుల సంధానం
నవరసాలు పోషించబడే అపర భువన విజయం

2.తరతమ భేదాలు లేని ఉత్తమ సభ్యుల సంసర్గం
గానమె ప్రాణమైన  అభినవ గంధర్వుల సంపర్కం
వినోదము వికాసము మానవీయ దృక్పథం మా పథం
మేము ఒకే కుటుంబమన్న భావనయే మా మనోరథం

 


https://youtu.be/LAssmO1iLXA?si=X8adDSkKqjtZoFCm

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మధ్యమావతి

ఊరు ఊరంతా ఉల్లాసం-ఇంటింటా ఎంతో సంబరం/
మా ధర్మపురి అయ్యింది నేడు మిథిలాపురం/
జరుగుతోంది ఈనాడు- సీతారామ కళ్యాణం/
మంగళ సూత్రాలు- వేదమంత్రాలు/
బాజాలు భజంత్రీలు-అన్నదానాలు/
తాడూరివారు నిర్వహించగా అంగరంగ వైభోగాలు

1.వాడవాడలా వెలిసాయి పచ్చని పందిళ్ళు/
వీథివీథిలో ఉత్సాహాలు ఉత్సవాల సందళ్ళు/
రాములోరి లగ్గం చూడగ చాలవుగా రెండుకళ్ళు/
తరలిరండి జనులారా జైశ్రీరామంటూ ఊళ్ళకూళ్ళు/

2. గుళ్ళోపెళ్ళిలో సీతారాములే  వధూవరులు/
వేడుకలో కానుకగా అందిస్తాము పట్టవస్త్రాలు/
మాటల ముత్యాలు పాటల పగడాలే తలంబ్రాలు/
వడపప్పు పానకం సేవించగా ధన్యమే జీవితాలు

 


https://youtu.be/Lndj4V_xn9o?si=kSpObQFbtOZwG04o

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

హిందువులం ఏకమవుదాం రాముని సాక్షిగా
సనాతన ధర్మం ఆచరించుదాం మనమంతా దీక్షగా
కాషాయమే మనదైన జెండా
భారతీయతే మన గుండెల నిండా
జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ జై శ్రీరామ్ జైజై శ్రీరామ్

1.జన్మనిచ్చిన మాతను బ్రతుకంతా సేవించుదాం
సకల దేవతా స్వరూపం గోమాతను పూజించుదాం
జన్మభూమి మన భరతావనని అమితంగా ప్రేమించుదాం
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీయను (శ్రీ)రామవాక్కు పాటించుదాం

2.మంచితనం మన బలహీనత కాదు మన సంస్కారం
సహనం మన పిరికితనం కాదు సునామి దాగిన సాగరం
జాతి సమైక్యత ధైర్యం శౌర్యంతో అనివార్య సంసిద్ధత
విశ్వహిందువులందరు బంధువులై మెలిగే నిబద్ధత
మనకాదర్శం (శ్రీ) రాముని ధర్మబద్ధత

 


https://youtu.be/ckLHJNKlLqA?si=nKi3bp9iYfu6pA9K

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:శివరంజని

కనుమూసినావా మము కన్నతల్లీ… నీవు
కను రెప్పపాటులోనే ఎటు మాయమైనావు
మనసెలా ఒప్పింది మము వదిలి వెళ్ళడానికి
ఏం చేయమంటావు నువు దారిమళ్ళడానికి

ఎవరు తీర్చగలరమ్మా… నువులేని లోటును
ఎవరు పూడ్చగలరమ్మా మా మదిలో నీ చోటును

1.ఎదను కలచివేస్తున్నాయి నీ కమ్మని జ్ఞాపకాలు
మదిని తొలిచివేస్తున్నాయి నువులేవను నిక్కాలు
దొరకునా నీప్రేమానురాగాలు వెదకినా ఏడేడు లోకాలు
ఆరునా నీకొరకై అంగలార్చెడి మా గుండె శోకాలు

ఎవరు తీర్చగలరమ్మా నువులేని లోటును
ఎవరు పూడ్చగలరమ్మా మా మదిలో నీ చోటును

2.అవసాన దశలోనూ అమ్మా… నీసేవ చేయనైతినే
నువు తుదిశ్వాస నొదులునప్పుడూ చెంతలేక పోతినే
పదములేవి తాకినా పొందగలనా నీవిచ్చే దీవెనలనూ
పదములెన్ని కూర్చినా వ్యక్త పరచేనా నాలో నీ భావనలనూ

ఎవరు తీర్చగలరమ్మా నువులేని లోటును
ఎవరు పూడ్చగలరమ్మా మా మదిలో నీ చోటును


 

https://youtu.be/sbfN0Jbxcd4?si=f5o8dpqLJ5dqJTGp

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)

రాగం:బృందావన సారంగ

నీవు సగం నేను సగం
ఇరువురిదీ ఒక సరసజగం
ఈరాకి సగం నా గీత సగం
మన కలయిక రాగయుగం- అనురాగమయం

1.ప్రకృతినీవు కాలము నేను
మన విశ్వమే అర్ధనారీశ్వరం
పగలు నీవు రేయి నేను
రోజంతా హాయి మనకాపురం

2.మేధ నేను మనసు నీవు
పరిపూర్ణమే మన జీవితం
రాధనీవు కృష్ణుడ నేను
మన సంగమమే అద్వైతం

3.సిద్దీశు సారధి హరీశు వారధి
అనుపమానం మన మనోరథం
జన దీవెనలు హిత భావనలు
శ్రీరామ రక్షయే మనకనునిత్యం

Tuesday, May 7, 2024

 


https://youtu.be/Ejt6TPENj3c?si=EHb9c_UhwigefNhf

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నా ముద్దుల ఎంకీ రావే
సద్దుమణిగే నా వంకా రావే
డొంకతిరుడు మాటలు మాని
సంకురాతిరేల సెంతకు రావే
నా సింతలింక తీరిచి పోవే

1.పొద్దుపొదంతా వద్దకు రావాయే
ముద్దుముచ్చట్లకు హద్దుగీస్తావాయే
సుద్దుల పద్దులు మనవి తీరవాయే
రాద్ధాంతమెందుకు నీవన్న తీరేనాయే

2.అలసి సొలసినేను ఆశగ వస్తినే
అలకబూనినావా నాకింక పస్తేనే
అక్కున జేరిస్తే అలవిగాదు మస్తుమస్తేనే
మక్కువ మన్నిస్తె కాళ్ళకాడ పడి చస్తానే

 

https://youtu.be/BPTu8dsjHhI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నా పానం లొ పానం- నీవేలే నా ఎంకి
నాదైన పెపంచకం నీవేలె నా ఎంకి
ఎంట తిప్పుకుంటావేవె ఎర్రిమాలోకమా
నీ జంట పావురాయిని నేనేనని మరిచావా

1.ఎండి కడియాలు కాళ్ళకు పెట్టి
తిప్పుకుంటు నడ్చి నన్ను తిప్పలు పెట్టి
నా గుండె తాళాల గుత్తికి కట్టి
చుప్పనాతిలాగా నీ బొడ్లో దోపెట్టి
ఎంట తిప్పుకుంటావేవె ఎర్రిమాలోకమా
నీ జంట పావురాయిని నేనేనని మరిచావా

ఎన్నెల రాతిరిలో ఏటిగట్టునెదిరి చూసి
ఎపుడొస్తావా అని రెప్పల నిదుర కాసి
నీ మాట నమ్ముకుంటినే వలపులు పూసి
నీ బంటుగ మార్చుకొంటివే నన్నే దో చేసి
ఎంట తిప్పుకుంటావేవె ఎర్రిమాలోకమా
నీ జంట పావురాయిని నేనేనని మరిచావా

Sunday, April 7, 2024

 

https://youtu.be/pvisbH0NxKk?si=GxOqn3Lk8aT7V0Ug

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నీ అందం అప్సరాకృతి-
నీ గాత్రం అపర భారతి-
జగదీశుడైనా మహేశుడైనా
నీ సొగసుకు దాసుడై కాడా
పరమ ప్రీతిగ నీ ప్రియపతి

1.దారి తప్పి ధరకు జేరిన మోహినివే
రామప్ప చెక్కిన శిల్పసుందరి నాగినివే
మనసంతా ప్రేమపొంగే రాగ రాగిణివే
పలుకుల్లో తేనె చిందే సుధామాధురివే

2.కొమ్మల్లో  కమ్మగ కూసే కోయిలమ్మవే
నవ్వుల్లో  హాయిని కురిసే వెన్నెలమ్మవే
నడకల్లో హోయలొలికే కలహంసవమ్మా
నెమలికే నాట్యం నేర్పే కులుకుల కొమ్మా

 

https://youtu.be/judfsXgfQds

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రుచి:కారం( మమకారం,వికారం,హాహా కారం)

రాగం:ఆనంద భైరవి

కాల గమనంలో-సమయ గణనం
ఋతు చక్రభ్రమణంలో-ఆమని ఆగమనం
అరవై పేర్లతో ఏటేటా-అలరారుతుంది వత్సరాది
ఈ ఉగాదిగా ఏతెంచి-తెలుగుల మది క్రోధం తొలగిస్తుంది క్రోధి
క్రోధి నామ సంవత్సర ఉగాది గీతమిది
ఆలకించరో మిత్రులారా శుభకాంక్షలంది

1.తన కోపమే తన శత్రువని నుడివెను బద్దెన
పరుల ఎడల ప్రేమ పెరగాలి ప్రతివారి బుద్ధిన
ఏడాతంతా గుర్తుచేయును పేరుతొ క్రోధి వద్దన్నా
గతంనేర్పిన గుణపాఠలను ఎవరూ మరవద్దన్నా

క్రోధి నామ సంవత్సర ఉగాది గీతమిది
ఆలకించరో మిత్రులారా శుభకాంక్షలంది

2.తీయగా మాటాడకుంటే- చేదు అనుభవాలే
పులుపెక్కి బలుపుచూపితే అంతటా పరాభవాలే
వగరు పొగరుకు తప్పదుగా బ్రతుకున ప్రతిదీ సవాలే
ఉప్పూ కారం తింటూ స్పందించనివారు జీవశ్చవాలే

క్రోధి నామ సంవత్సర ఉగాది గీతమిది
ఆలకించరో మిత్రులారా శుభకాంక్షలంది




https://youtu.be/2JxZfHKwITQ

*SONG  No.6*

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రుచి:పులుపు

రాగం:సిందు భైరవి

కొత్తగా మెదలెట్టు నేడే నీ జీవితం
కోయిల పాటను తెచ్చిందీ వసంతం
గతకాలం అనుభవాలు రేపటి పునాదిగా
క్రోధం తొలగించి మోదం పంచేదిగా
ఈ ఉగాదిగా అరుదెంచె శ్రీ క్రోధినామ ఉగాదిగా

అధిగమించు నేస్తమా కఠిన పరీక్షలు
అందుకో మిత్రమా నా శుభాకాంక్షలు

1.బెల్లం తీపి మామిడి వగరు వేపపువ్వు చేదు
చింతపండు పులుపు ఉప్పు మిర్చి కలుపు
బ్రతుకు ఉగాది పచ్చడి ఆస్వాదిస్తే నీదే గెలుపు
తేవాలి ఈ క్రోధి ఉగాది అనందాలు పొందే మలుపు

అధిగమించు నేస్తమా కఠిన పరీక్షలు
అందుకో మిత్రమా నా శుభాకాంక్షలు

2.పంచాంగ శ్రవణం నీ భవితకు సమాయత్తం
దైవ దర్శనంతో ప్రశాంతత నొందును నీ చిత్తం
చెరగని చిరునవ్వు నీకో వరమౌతుంది తథ్యం
ప్రేమను మించిన పెన్నిధి లేదన్నదే నిత్య సత్యం

అధిగమించు నేస్తమా కఠిన పరీక్షలు
అందుకో మిత్రమా నా శుభాకాంక్షలు



https://youtu.be/n1uzbkyrthc

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:పూర్వి కళ్యాణి


జయమంగళం మహీజాపతి

శుభమంగళం హే రఘుపతి

అందుకో అయోధ్యా పురపతి కర్పూరహారతి

ఆదిరించు వేగిరమే నీవే శరణాగతి


1.మునివెంట జని యాగముగాచిన రామునికి రాగహారతి

అహల్యశాపము బాపిన రఘునందనునికి

ఆనంద హారతి

హరువిల్లు విరిచి తరుణిసీతను పరిణయమాడిన

కళ్యాణమూర్తికి కమనీయ హారతి

పితృవాక్యమున వనమునకేగిన దశరథ సుతునికి

రమణీయ హారతి


2.గుహుడిని బ్రోచిన సుగుణాభిరామునికి  కుంభహారతి

శబరి దరికి తానుక జేరిన జానకి రామునికి

రమ్య హారతి

రావణుగూల్చిన కోదండ రామునికి నక్షత్ర హారతి

హనుమను అక్కునజేర్చుకొన్న భక్తవరదునికి  నా ప్రాణహారతి

Friday, March 22, 2024

 

https://youtu.be/XqA7iD-7K_k?si=ZplZwsAuQYXQytNn

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

జయహో జనని సిద్ధ కుంజికా
జయహో జయహో భద్రకాళికా
పాహి పాహి పరమంత్ర విచ్ఛేదికా
నమోస్తుతే దేవీ నరదృష్టి నివారికా

1.భూత ప్రేతపిశాచ పీడా పరిహారికా
తీవ్ర దీర్ఘ వ్యాధి చికిత్సకు నీవే మూలిక
పదునాల్గు భువనాలకు నీవే నీవే ఏలిక
ధరింతువే లోక కంటకుల  కపాలమాలిక

2.భయ భ్రాంతులు తొలగింతువు భ్రామరీ
ఆరోగ్యము నొసగెదవు అమ్మా అభయంకరీ
కనికరించి మము కావవే కర్వరి కృపాకరీ
శరణుజొచ్చినాము తల్లీ వరమీయవే గౌరీ

 

https://youtu.be/OE9cyYqzCHQ

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:తోడి

నమో నమో నమో హయగ్రీవా
నమో జ్ఞానదాయకా దేవ దేవా
మేథో దీప ఉద్దీపకా విజయ లక్ష్మీధవా
పాహిమాం పరిపాలయమాం కారణ సంభవా

1.శ్రావణ పూర్ణిమ పావనమైన నీ జయంతి
నీకు నాల్గు వేదాలు కాచితివను ప్రఖ్యాతి
చేసితివి అశ్వరూప దనుజుని నిహతి
బుద్ధిమాంద్య వ్యాధుల నివారణకు నీవే గతి

2.విష్ణువు అవతారమై వరలుతున్నావు
విశేషించి విద్యల నొసగే అది దేవతవు
విమలమతుల మము జేయగ వరమీయి స్వామి
నిరతము ఇక నిను దలతుము భో ప్రభో ప్రణతోస్మి

 

https://youtu.be/3NPwDZliD4E?si=0jv3VaoPWAGRfgcF

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:పీలు

పెండ్లిచూడ రారండి రాజన్నది తండోప తండాలుగా
దండి శివరాత్రి జాతర ఎములాడన సందడిగా
కండ్ల పండుగే భక్తితో -చూసిన వాళ్ళకు చూసినంత రాజన్నా
బతుకు పండులే పున్నెం -చేసేటోళ్ళకు చేసినంత మాదేవా

1.గుండంల తానంజేసి గండదీపంల తైలంబోసి
కోడెనింక పట్టి గుడిసుట్టూ సుట్టి మట్టుకు గట్టి
మంటపాన గంటకొట్టి గణపయ్యకు దండమెట్టి
రాజన్నను రాజేశ్వరమ్మను కండ్లార సూడరండి

2.దినమంతా ఉపాసముండి రేతిరి జాగారముండి
రాయేశా మాతండ్రీ మమ్మేలు మమ్మేలమని తలచి
సంబరంగ జరిగేటి సాంబశివుని లగ్గాన్ని చూచి
జనమకో శివరాతిరన్నట్టు చెప్పుకుందాము శివుని గొప్పలు

 

https://youtu.be/scsIp8tYT0g?si=v1WS2n6vptgHzH0E

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

విష్వక్సేనా నమో విష్ణు సేనా ప్రముఖా
ప్రథమ పూజితా ప్రభో కరిరాజ ముఖా
విఘ్నాలను తొలగించే విశిష్ఠ దైవమా
వినమ్ర ప్రణామాల నందిమాకు విజయమొసగుమా

1.నిత్యము లక్ష్మీ నారాయణుల నర్చింతువు
అహోరాత్రాలు శ్రీహరిసేవకొరకె అర్పింతువు
ముల్లోక పాలన దీక్షా దక్షునిగా ప్రవర్తింతువు
విష్ణుదూతవై భక్తుల వైకుంఠము చేర్పింతువు

2.విశిష్టాద్వైత మందునీది విశిష్ట స్థానమే
పాంచరాత్ర పద్ధతిలో నీకు ప్రాథమ్యమే
అంగుళిముద్రతో సురలను కట్టడి చేసేవు
సూత్రవతి ప్రియసతి నియతిగ మము కాచేవు

Sunday, March 3, 2024

 https://youtu.be/2qzS57l1fRg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:యమన్ కళ్యాణి


కనులకు రమణీయము

మనసుకు కమనీయము 

సదాశివా నీ కళ్యాణము

శివానీ తో నీ కళ్యాణము

ఓం నమఃశివాయ 

శ్రీ రాజరాజేశ్వరాయ


1.శివరాతిరి శుభ ఘడియలలో

  వేములవాడలోని నీ గుడిలో

  శ్రీ రాజరాజేశ్వరీ దేవి వధువుగా

  వైభవోపేతముగా పరిణయమాడగా


2.నిష్ఠతొ పొద్దంతా ఉపవసించి

నీ దివ్య లింగ రూపము దర్శించి

భక్తితో నిరతము రాజన్నా నిను ధ్యానించి

ముక్తినొందేము రేయంత జాగారమొనరించి


 


https://youtu.be/eKxCccDnEhg?si=3BxM43h7d_gJpyuZ

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రీతిగౌళ

కర్పూరహారతిదే కరుణాసాగరా
మంగళహారతిదే మంగళాంగాహరా
నక్షత్రహారతిదే అక్షరవరదా ఈశ్వరా
నా పంచ ప్రాణహారతిదే రాజరాజేశ్వరా

1.కొనియాడితిని నిను తూలనాడితిని
నిందాస్తుతితోను నిను మందలించితిని
ఛందో దోషాలతో నీపై కవితలు వెలయించితిని
నందివాహనా  మన్నించి నాకీయి శరణాగతిని

2.తెలిసీ తెలియకనే పరుషములాడితిని
వచ్చీరాక అరకొరగానే  భాషను వాడితిని
తండ్రీ కొడుకులమే కదా దండించకు  నీసుతుని
తప్పొప్పులు కాచి నన్ను కడతేర్చగ వేడితిని

Saturday, February 17, 2024

 


https://youtu.be/MHev7yfTR1M?si=5dvgVX1rBZAbdo5r

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నిన్నా మొన్నటీ చిన్నారి కూనవే
అన్నెం పున్నె మెరుగని అన్నులమిన్నవే
అంతలోనె ఎదిగావే అందాలబొమ్మగా
చిగురులెన్నో తొడిగావే లేలేత కొమ్మగా

కోకకట్టి ముచ్చటగా వేడుక చేసేమమ్మా    
పైటవేసి ఈనాడే పండుగ జరిపేమమ్మా

1.అల్లరి చిల్లరి ఆటలకు ఆనకట్టగా
దుందుడుకు నడవడిని దూరం పెట్టగా
పెద్దరికపు అద్దకాలనే తలకు చుట్టగా
ఎదిగే నీ వన్నెల చిన్నెలకే దిష్టి పెట్టగా

కోకకట్టి ముచ్చటగా వేడుక చేసేమమ్మా    
పైటవేసి ఈనాడే పండుగ జరిపేమమ్మా

2.బంధు మిత్రులందరూ సందడిచేయగా
ఇంటి పెద్దలందరునీకు దీవెన లీయగా
విందూ వినోదాలలో ఆనందం కురియగా
చిందులేసి మా ఎదలే ఎంతో మురియగా

కోకకట్టి ముచ్చటగా వేడుక చేసేమమ్మా    
పైటవేసి ఈనాడే పండుగ జరిపేమమ్మా




Wednesday, February 7, 2024

 https://youtu.be/jmeg1UyfPgA?feature=shared


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:జోగ్/నాట


నరకలోకాధిపతి దక్షిణ దిక్పతి

విజయా ప్రియపతి నమోస్తుతే సమవర్తీ

పాపుల పాలిటి సమ న్యాయపతి

సద్గురువుగ నను నడుపుము సద్గతి


1.ఆత్మయే రథియని బుద్ధియేసారథియని

ఇంద్రియములు హయములుగా మేనే రథమని

విజ్ఞానం విచక్షణ పగ్గాలతో మదినిఅదుపుచేయమని

ముక్తియే శ్రేయోమార్గమని సౌఖ్యానురక్తియే అనర్థమని 

యమగీతను బోధించి అనుగ్రహించితివే  నచికేతుని

గురుభ్యో నమః యమధర్మరాజా శరణంటిని

నన్నుద్ధరించు ప్రభూ వేగమే కరుణతో ననుగని


2.మార్కండేయుని కథ- నీ కర్తవ్యపాలనని

సతీసావిత్రి గాథ - నీ భక్త పరాయణతని

పక్షపాత రహితా నీ దండనావిధి ధర్మబద్ధతని

పరమ శివుని నిజ భృత్యా-నీ కార్యదీక్షతని

ఎరిగింపుము సరగున నను శిశ్యునిగా గొని

గురుభ్యో నమః యమధర్మరాజా శరణంటిని

ప్రసాదించు స్వామీ అనాయాస మరణముని

Friday, February 2, 2024

 https://youtu.be/Fnhls4efDls?feature=shared


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చట్టం న్యాయం ధర్మం -మూడు సింహాలుగా/ 

మన జాతీయ చిహ్నం-మన భారత్ అధికార చిహ్నం/

సత్యమేవ జయతే అన్నదే- న్యాయ నినాదం-

మన దేశపు చట్ట విధానం


కళ్ళకు గంతలతో తీర్పిస్తుంది రాగద్వేషాతీత/

నేరస్తుల శిక్షిస్తుంది కఠినంగా న్యాయదేవత


1.తన పర భేదాలను ఎంచిచూడక

బంధుమిత్ర పక్షపాతమే వహించక

తగు సాక్ష్యాధారాలను పరిశీలించి

అంతర్నేత్రంతోనే అవలోకించి


వాదోపవాదాలను పరిగణించి

నిరపరాధి సంక్షేమం సంరక్షించి

న్యాయాన్యాలను త్రాసులో ఉంచి

భారత శిక్షాస్మృతిని అనుసరించి


కళ్ళకు గంతలతో తీర్పిస్తుంది రాగద్వేషాతీత

నేరస్తుల శిక్షిస్తుంది కఠినంగా న్యాయదేవత


2.రాజూ పేదా ధనిక అందరికీ సమ న్యాయం

ఉండబోదు ఏస్థాయిలో రాజకీయ జోక్యం

నేరానికి తగిన శిక్ష అన్నది ఒకటే ధ్యేయం

పరమోన్నత న్యాయాలయమే పౌరదేవాలయం


సామాన్యుడి హక్కుల పరిరక్షణ ఊపిరిగా

రాజ్యాంగ దిశానిర్దేశ పరమ సూచికగా

సర్వ స్వతంత్ర స్వేఛ్ఛా వ్యవస్థకే వేదికగా

న్యాయమే పరమావధిగా-ఆశ్రితజనులకు ఆశాదీపికగా


కళ్ళకు గంతలతో తీర్పిస్తుంది రాగద్వేషాతీత

నేరస్తుల శిక్షిస్తుంది కఠినంగా న్యాయదేవత

Thursday, February 1, 2024


https://youtu.be/BSiox78KAFg?si=-_99xPIN4NRPfZSu

గతస్మృతుల మననానికి అపూర్వ వేదిక

మధురానుభూతుల పునఃసృష్టికి ఆత్మీయ కలయిక

సప్తవింశతి వసంతోత్సవ  మా విద్యాదీపిక

జగతికి వెలుగందీయుచు వెలిసినదీ అపురూప వేడుక


1.  రంగారెడ్డి జిల్లాలో  ఉన్నదీ పేరొందిన చేవెళ్ళ పట్టణం

అట ప్రాథమిక ఉన్నత పాఠశాల మా పాలిటి వరం

మేధో సంపత్తికి ఆలవాలం మాగౌరవ ఉపాధ్యాయ గణం

అరటిపండు నొలిచి పెట్టినటులె వారి బోధనవిధానం


2.పందొమ్మిది వందల తొంబయారు పదవతరగతి జట్టు

ఆట పాటలతో బాటు పోటీపడి చదువుటకూ గట్టి ఆటపట్టు

అరమరికలు ఎన్నున్నాగాని అందరిదొకేమాట అన్నదే పెద్దగుట్టు

ఏ స్థాయిలొ ఏపదవిలొ ఎవరున్నా పరస్పరం తోడు నీడ మా చెలిమి చెట్టు


3.విశ్వనాథ గుప్తా సారు చూపిన ప్రేమాదరణ

జైమున్నీసా మేడం నేర్పిన కఠినమైన క్రమశిక్షణ

శంకరయ్య శాంత జ్యోతిర్మయి టీచర్ల చక్కని బోధన

మరపురానిది మరువలేనిది  ఆ తీయని జ్ఞాపకాల స్ఫురణ



Sunday, January 28, 2024

 

https://youtu.be/ztusU0r9o_o

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:ఆనంద భైరవి

పదునాల్గు భువనాలు పసిడి ఊయల చేసి
నాల్గు వేదాలను చేరులుగ సమకూర్చి
అందాల తొట్లొలో సుందరాంగా నిన్ను బజ్జుంచి
లాలిజోయనుచునూ ముదమార ఊపెదను

లాలిజో లాలిజో శ్రీ రఘు వంశతేజా
నీ బోసినవ్వులే హాయి యువరాజా

1.స్ఫూర్తినిచ్చెటి పేరునే నీ చెవిలొ చెప్పెదను
నినుగన్న  అమ్మయూ నాన్నయూ ఒప్పగను
కీర్తితేవాలి నువు  మునుముందు గొప్పగను
ప్రగతి నొందగ జగతి మలుపు తిప్పగను

2.తరచి తరచి నీకు తగు పేరును ఎంచి
బియ్యపు పళ్ళెంలో ఉంగరంతొ రాయించి
సంప్రదాయముగనూ నామకరణం జరిపించి
ఆనందమొందారు ఇంటిల్లిపాదీ తమ మేనుమరచి

3.బావిలోనుండి మీఅమ్మతో నీటినే చేదించి
నానిన శనగలను అచటి వారికంతా పంచి
వస్త్ర తాంబూలాలు వచ్చిన వనితలకునిచ్చి
జరిపిరి నీ బారసాలను కడువైభోగమొనరించి

 


https://youtu.be/l1NkXAuNqh0?si=uRe4ISemRb3Cse0r

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

అమ్మతనము అతివకెంతొ అపురూపం
అమ్మలార చేయరో సుదతికి సీమంతం
గర్భాలయములో కొలువు దీరె శిశుతేజం
దీర్ఘాయురస్తుయని దీవిస్తూ ఈయరో నీరాజనం

1.షోడష సంస్కారాలలో ఉత్కృష్టమైనది
సతి సంతతి బడయుటలో అదృష్టమైనది
వేదోక్త మంత్రపూత దృష్టిదోష హారకమే ఇది
పతి శ్రీమతి నతిగా లాలించడమే వేడుకైనది

2.ముంచేతికి గాజులను నిండారగ తొడగరో
పాదాలకు పసుపూ పారాణియు పూయరో
చెక్కిళ్ళకు శ్రీగంధం మురిపెముగా నద్దరో
చక్కని చక్కెర బొమ్మను   మక్కువ సింగారించరో

3.ముత్తైదువులంతా ముదముగ ఏతెంచి
ఉల్లాసము కలిగించగా ఆటలాడీ పాడీ
సుఖప్రసవ మొందుటకు సుద్దులు బోధించి
అక్షతలే చల్లాలి మనసారా ఆశీస్సుల నందించి

Friday, January 26, 2024

 

https://youtu.be/ZUz06ccSf1A?si=NJ_p_ujEYiSmrxKe

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

కోలాటమాడరమ్మ కోమలాంగులారా
చిందేసి ఆడరమ్మ ముద్దుగుమ్మలారా
సరదాల బతుకమ్మ  సంబరమొచ్చె అమ్మలార
గౌరమ్మ తల్లిని కొలువరమ్మ కొమ్మలారా

1.చక్కని చుక్కలంటి అక్కయ్యలారా
   చిన్నారి అల్లరి చెల్లెమ్మలారా
   వన్నె చిన్నె లెన్నొ ఉన్న వదినమ్మలారా
   నిండు ముత్తైదువ లత్తమ్మలారా
   రండిరండి ఇరుగు పొరుగు రత్తమ్మలారా
   ఆడి పాడి బతుకమ్మ కారగింపు నీయరమ్మ

2.పట్టు పావడాలను దిట్టంగా కట్టినారు
సిల్కు సిల్కు కోకలను పొందిగ్గ చుట్టినారు
మెడల నిండ నగలెన్నొ అమరించినారు
పూమాల కొప్పునెట్టి సొగసు కుమ్మరించినారు
అవనికంతటికి అందంచందం అతివలేగా మెండుగ
పండుగలన్నిటికి అందం ఆనందం బతుకమ్మ పండుగ

 


https://youtu.be/5ElylbfKntQ?si=WJF11Iwl85T8fB4m

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మాయా మాళవ గౌళ

తుమ్మెదా తుమ్మెదా తుమ్మెదా
బతుకమ్మ తెలంగాణ సంస్కృతీ సంపదా
తుమ్మెదా తుమ్మెదా తుమ్మెదా
భామలకే సొంతమైంది బతుకమ్మ పండగా
పూలన్నీ  పలుకుతాయి తుమ్మెదా
ఎదఎదలో సొదలెన్నొ తుమ్మెదా
అందాలు చిలుకుతాయి విరులన్ని తుమ్మెదా
రంగులెన్నొ ఒలుకుతాయి మురిపెంగ తుమ్మెదా

1.తనకూ ఒక రోజొచ్చేను తుంటరి తుమ్మెదా
తంగేడు పువ్వు కూడ నేడు హాయిగ నవ్వె కదా
గుట్టుపట్టు వెతికి పట్టుకొస్తిమా తుమ్మెదా
గునుగు పూవూ సైతం తానూ గర్వించదా
గాలికి పెరిగిన గుమ్మడిపూవు తుమ్మెదా
రాణలెన్నో కుమ్మరించదా తుమ్మెదా
బురదలొ పుట్టిన కలువ కమలం తుమ్మెదా
బతుకమ్మగా ఒదగవా బంగారు తుమ్మెదా

2.హరి  చేరువ నోచని బంతులు తుమ్మెదా
సరి నలంకరించునే బతుకమ్మను తుమ్మెదా
గులాబీ చేమంతులూ  చిన్నారి తుమ్మెదా
తమవంతుగా అలరించవా బతుకమ్మను తుమ్మెదా
అమ్మగా ఆడపడుచుగా తుమ్మెదా తుమ్మెదా
బతుకమ్మను తలచేమిట తుమ్మెదా
ఆది దేవతగా గౌరమ్మగా తుమ్మెదా తుమ్మెదా
ఆడిపాడి అందరమూ కొలిచేము తుమ్మెదా

Wednesday, January 24, 2024

 

https://youtu.be/8K_M4QCiqJg?si=kwDEJ50eZtrn8Xzh

వచన  పద్యం:రచన-రాఖీ

శ్రమ పడి రాయిని శిల్పంగ మలచవచ్చు
నేర్వగ వీణతొ రాగాలు చిలకవచ్చు
నదులకు ఎదురీది చరితను సృష్టించవచ్చు
నారీ నీమది నెరుగ నరువరులకు సాధ్యమే

Tuesday, January 23, 2024

 

https://youtu.be/92TYokV1Smo?si=jt35C-Y0_ZTnSmph

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:బిలహరి

జయ జయ రామా జానకి రామా
జయహో రామా జగదభిరామా
అయోధ్యరామా అగణిత గుణగణ శుభనామా
పట్టాభిరామా పరమానంద వరదా ఇనకులసోమా

1.పితృవాక్య పరిపాలక రామా
శత్రుంజయ జయ కోదండరామా
సౌభ్రాతృత్వ పోషకా సహృయ శ్రీరామా
సుగ్రీవయోధ సుమైత్రీ బంధ  నిబద్ధరామా

2.భక్తహనుమ మది విలసిత రామా
దనుజ భంజకా ధర్మపరిరక్షక రామా
జన మనోరంజన పాలక నమో సార్వభౌమా
భవ జలధికి నిజ వారధినీవే ప్రభు తారకరామా

 

https://youtu.be/PWEV0Js_YRw?si=EfuMXgtihO4OtlHB

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నేనంటే పాటల తోటే
నేనుంటా పాటలతోటే
పాటొకటే నా బ్రతుకు బాట
పాటే నా ఉనికికి బావుటా

1.పాట పల్లవిస్తే నా పాలిటి పెన్నిధి
నా స్థానం పాట చరణ సన్నిధి
పాటతో శ్రుతికలపడమే నా విధి
పాటలోని శబ్దలయే నా హృది

2.పాట నాకు అమ్మా నాన్న
పాట నాకు దైవం కన్నమిన్న
పాటనాకు ప్రాణంప్రదమే సర్వదా
పాడుతూనె కడతేరనీ జన్మంతా

Sunday, January 21, 2024

 


https://youtu.be/8ytr9lvtN6I?si=j9XQYauaro1ZIJNq

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:సిందు భైరవి

పాట  నే పాడుతా -నా గాత్రధర్మం మేరకు/
నిరంతరం సాధన చేస్తా- కవిభావన తీరుకు/
నా పాట చెఱకుగ మారుస్తా-రసికతగల శ్రోతలకొరకు/
పాటనే ప్రేమిస్తా-పాటనే శ్వాసిస్తా-పాటగా జీవిస్తా- ఊపిరున్నంత వరకు

1.ఏజన్మలోనో-ఏ నోము నోచేనో-
వరముగా దొరికింది-మార్ధవ గాత్రం/

ఏనాడు తేనేధారతో -అభిషేకం చేసానో-
శివుడు ప్రసాదించాడు-గాన మాధుర్యం/

అడవిగాచిన వెన్నెల కానీయను-అపురూపమైన నా ప్రతిభను/

మకిలి పట్టించనెపుడూ-పాటవమొలికే నా పాట ప్రభను

2.ఆటంకాలు దాటుకుంటూ -పాటతోటే జతకడతా/

సాకులను సాగనంపి -పాటకే ప్రాధాన్యత నిస్తా/

పాటకొరకె నాజీవితం -పాటకొరకె నేను అంకితం/

పాటవల్లనే -నా విలువా గుర్తింపు - ఇలలో శాశ్వతం

 


https://youtu.be/ziotd5v8QzY?si=egN7nWmdyX74-_G4

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

స్వాగతాలు నీ కివే సంక్రాంతి లక్ష్మీ
ప్రణతులు గొనుమిదే పౌష్యలక్ష్మీ
నమస్సులు గైకొను మకర సంక్రమణాన కర్మసాక్షీ
ప్రశంసలనందుకో మా గృహలక్ష్మీ
భోగి సంక్రాంతి కనుమ పర్వదినములకు
శుభాకాంక్షలివిగో బంధుమిత్ర సాహితీజనములకు

1.మూల బడిన వస్తువులను బయట కుప్పవేసి-
మరపురాని పనితనాన్ని మననం చేసి-
సేవానిరతిని గుర్తించి పనిముట్లకు విముక్తి చేసి
శుద్ధి స్వచ్ఛతా స్వేచ్ఛల నిలుప బోగిమంటరాజేసి
హేమంతానికి వీడ్కోలు తెలుపగా
చలి గిలిగిలి ఇలనుండి సాగనంపగా
భోగి సంక్రాంతి కనుమ పర్వదినములకు
శుభాకాంక్షలివిగో బంధుమిత్ర సాహితీజనములకు

2. ఉత్తరాయణానికి లోకం ఆయత్త పడుచు
విత్తుల గాదెల నింపిన గిత్తల సాగిల పడుచు
వాకిళ్ళ కళ్ళాపి రంగవల్లి గొబ్బియలతో పల్లె పడుచు
పితృదేవతలకు భక్తిగా జనం తిలతర్పణాలిడుచు
కీర్తన జేసెడి హరిదాసుల హరిలొ రంగా
గాలిపటాలెగురవేయు పిల్లలు ఉత్సాహంగా
భోగి సంక్రాంతి కనుమ పర్వదినములకు
శుభాకాంక్షలివిగో బంధుమిత్ర సాహితీజనములకు

3.పట్టుచీరల రెపరెపలతొ ముత్తైదువలు
నోచుకున్న నోముల నొసగే చిరుకానుకలు
ఇంటింటా వచ్చిపోవు పేరంటాళ్ళ సందళ్ళు
విందులు వినోదాలు పందాలు అందాలు
గంగిరెద్దుల వారి ఆటల పాటలు కనుమ
కనుమ పండుగ వైభవం కనులారా కనుమ
భోగి సంక్రాంతి కనుమ పర్వదినములకు
శుభాకాంక్షలివిగో బంధుమిత్ర సాహితీజనములకు

 

https://youtu.be/92TYokV1Smo?si=jt35C-Y0_ZTnSmph

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:బిలహరి

జయ జయ రామా జానకి రామా
జయహో రామా జగదభిరామా
అయోధ్యరామా అగణిత గుణగణ శుభనామా
పట్టాభిరామా పరమానంద వరదా ఇనకులసోమా

1.పితృవాక్య పరిపాలక రామా
శత్రుంజయ జయ కోదండరామా
సౌభ్రాతృత్వ పోషకా సహృయ శ్రీరామా
సుగ్రీవయోధ సుమైత్రీ బంధ  నిబద్ధరామా

2.భక్తహనుమ మది విలసిత రామా
దనుజ భంజకా ధర్మపరిరక్షక రామా
జన మనోరంజన పాలక నమో సార్వభౌమా
భవ జలధికి నిజ వారధినీవే ప్రభు తారకరామా

 

https://youtu.be/1Se6uzAc1Sg?si=FeBsSEltPyse0A1-

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

దేశాన్ని ఏకం చేసే సుగుణాభిరాముడు
ధర్మాన్ని సంరక్షించే రఘువంశసోముడు
నభూతో న భవిష్యతి సాకేత సార్వభౌముడు
అవతాపురుషుడుతాను మర్యాదపురుషోత్తముడు
నమో కమల నేత్రాయా నమో రామ భద్రాయా
నమో కౌసల్య పుత్రాయా నమో సుగ్రీవ మిత్రాయా

1.కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్య రామమందిరం
హైందవుల కలల పంటగా వెలిసినదీ ఇలన సుందరం
ఒకే మాట ఒకేబాణం ఒకరే సతిగా శ్రీరాముని ఆదర్శ జీవనం
ఆ రాముడు నడచిన పుడమిలొ పుడితిమి మన బ్రతుకే పావనం

2.రామ అనే దివ్యనామమే నినదించును మారుతి ఎదన
రామ అనే రెండక్షరాలే ప్రేమను పంచును జనులకీ జగతిన
రామ తత్వమే ఆత్మస్థైర్యమై మనల గెలిపించును
ఆచరించిన
రామ మంత్రమే భవతారకమై జన్మనుద్ధరించును విశ్వసించిన

Wednesday, December 6, 2023

 

https://youtu.be/xGECPtJF4t8?si=O0tx8R0JrayiFolD

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:శివరంజని

పాటే ఊపిరైన గళం
నింపుతుంది ప్రతి మదిలో పరిమళం
లయతొ లయమైన హృదయం
తలపింపజేస్తుంది జగమే రసమయం
ఎలుగెత్తుతూ పాటందుకో విశ్వవ్యాప్తమయ్యేలా
విన్నవారంతా విస్తుపోగా నీవే పాటైపొయ్యేలా

1.సాధనతో సాధ్యమే లలిత కళలలో కొన్ని
అభ్యసించగా లభ్యమవుతాయి మరికొన్ని
దైవదత్తమే నేస్తమా గాత్ర సుధా మధురిమ
కాలరాస్తే చోద్యమే వరమైన గానపు గరిమ

ఎలుగెత్తుతూ పాటందుకో విశ్వవ్యాప్తమయ్యేలా
విన్నవారంతా విస్తుపోగా నీవే పాటైపొయ్యేలా

2.ఉన్నప్పుడు విలువ నెరుగరు లోక సహజమే
జన్మలెత్తినా దొరకదని మదికెక్కబోదు అది నిజమే
అందుకే చెబుతున్నా అంజలించి గాయక రత్నమా
చేజార్చకు ఏ అవకాశం నెరవేరలేని నా స్వప్నమా

ఎలుగెత్తుతూ పాటందుకో విశ్వవ్యాప్తమయ్యేలా
విన్నవారంతా విస్తుపోగా నీవే పాటైపొయ్యేలా

Saturday, November 25, 2023

 

https://youtu.be/LlMoIEBoV6c?si=w65WvveeZVTLrY9A

శ్రీ తులసి జయ తులసీ కళ్యాణ తులసీ

రామ తులసి కృష్ణ తులసి శుభలక్ష్మీ తులసి

ఆరోగ్య తులసి సౌభాగ్య తులసి మోక్షతులసి

మంగళా హారతులు గొనవే మా ఇంటితులసి


1.అనుదినము శ్రద్ధాగాను నీకు పూజలు సేతుము

కార్తీక మాసమందున భక్తితోను నిన్ను గొలుతుము

ప్రతి ఏటా కృష్ణమూర్తితొ నీ పరిణయ మొనరింతుము

బంధు మిత్రులమందరం కనువిందుగాను చూచి ధన్యత నొందెదము


2.అష్టభార్యల ఇష్ట సఖుడు వరుడు గోపీకృష్ణుడు

ప్రేమతో ఆరాధించిన నీకు నిరతము వశ్యుడు

తూచగలిగిన సాధ్వివే నీవు తులాభారమందున

పుత్రపౌత్రుల వంశాభివృద్ధికి -దీవించు ఈశుభ లగ్నమందున

Wednesday, November 22, 2023


https://youtu.be/FoXki1PZ_Pc

బాలల గేయం-4


తాతయ్యకు నేనే 

ఊతకర్ర నవుతా

నానమ్మకు నేనే

నడుంనొప్పి తగ్గిస్తా

అమ్మమ్మకు నేనో 

ఆటబొమ్మ నవుతా

ఇంటిల్లి పాదికి నేనే 

ఇష్ట దేవత నవుతా


1.సెల్ ఫోన్ నేర్పించే

గురువు నవుతా

టి వి రిమోట్ అందించే

పరుగు నవుతా


2.కథలు చెప్పమంటూ

చెవిలో ఊదర గొడతా

చిన్ని చిన్ని తాయిలాలకై

రోజూ నేను నసపెడతా

Sunday, November 19, 2023

 https://youtu.be/dFOe3-Hd-iE?si=S4Hk15cQZx4W1jfg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:నట భైరవి


ఇంటికి దీపం ఇల్లాలు అలనాడు

ఇలకే వెలుగిస్తోంది ఇంతి ఈనాడు

గృహమును చక్కదిద్దు ఒద్దిక-గృహిణికి ఆభరణం- ఒకనాడు

ఉద్యోగినిగానూ సవ్యసాచి సుదతికి నిత్యం- రణమూ గెలుపూ నేడు


1.లేచింది మొదలుగా పాచివదలగొడుతుంది

ఇంటిల్లి పాదికీ టీ టిఫిన్లు చేసి నోటికందిస్తుంది

వండి వార్చి లంచ్ బాక్స్ బ్యాగుల్లో సర్దిపెడుతుంది

అందరు వేళకేగులాగు పరుగిలిడి తను బస్సుపడుతుంది.


2.మగచూపులు తాకుళ్ళు వత్తిళ్ళు తట్టుకొంటుంది

ఆఫీసు బాసుకు అలుసవకుండా పనినెత్తుకుంటుంది

సహోద్యోగి అతిచొరవకు తప్పుకొంటు తిరిగుతుంది

నొప్పింపక తానొవ్వక నేర్పుగ ఓర్పుగ వృత్తి నెట్టుకొస్తుంది.


3.ఆర్థికంగ భర్తకెంతొ చేదోడు వాదోడౌతుంది

అత్తామామల మాటదాటక తల్లో నాలుకౌతుంది

సవాళ్ళెన్ని ఎదురైనా నవ్వుతు సగబెడుతుంది

షట్కర్మయుక్తను మరపించి సర్వకర్తగా అవతరించింది


4.కవన గాన కళారంగాలలో కలికి ప్రతిభ అపారము

కమ్ముకునే నిత్యాకృత్యాలతో అభిరుచికే అంధకారము

పాక్షికంగానో సమూలంగానో ప్రవృత్తి పట్ల నిర్వికారము

మగువా నీ మనుగడయే ఒడిదుడుకుల సమాహారము





Saturday, October 28, 2023

 

https://youtu.be/lpRxM0douc8?si=BGqFV6eZhbReQXVX

రాగం:శ్రీ రాగం


నీరాజనమిదె నీకు శ్రీ సత్య నారాయణా

నిజరూప దర్శనమీయి మాకు నిత్యపారాయణా

నిన్ను నమ్మి వేడుకుంటే బ్రతుకంతా వేడుకలు

నీ పాటలు పాడుకుంటే పరమానంద డోలికలు


1.ఓపలేము ఓ స్వామి భవతాప కీలలు

ఎడబాపవేమి మా ఇడుములు చూపగ నీ లీలలు

గొల్లలను బ్రోచావు మహరాజును కాచావు

వైశ్యులను ఆదుకున్నావు విప్రుడిని చేదుకున్నావు


నిన్ను నమ్మి వేడుకుంటే బ్రతుకంతా వేడుకలు

నీ పాటలు పాడుకుంటే పరమానంద డోలికలు


2.వైభోగ భాగ్యాలను కురియజేయి మాఇంటా

ఆయురారోగ్యాల ప్రసాదించమని శరణంటా

ఎన్నడూ ఎవ్వరితోనూ  రానీయకు ఏ తంటా

పండించవయ్యా పరంధామా మా కలలుపంట


నిన్ను నమ్మి వేడుకుంటే బ్రతుకంతా వేడుకలు

నీ పాటలు పాడుకుంటే పరమానంద డోలికలు

Thursday, September 21, 2023


https://youtu.be/rgkn-t8KYso?si=jL0Fi0KGWiOTDRSC

మేమంతా మీకోసం-మీ సేవలే మా వికాసం

మీ బాధలు తొలగించే నిజమైన నేస్తాలం

అత్యుత్తమ చికిత్స  మా ఓనస్ హాస్పిటల్స్ ధ్యేయం

అధునాతన రోబోటిక్ ప్రత్యేక వైద్యవిధాలన్నీ మాకే సొంతం

మీ యోగక్షేమం  ఆరోగ్యం మా ప్రథమ ప్రాథమ్యం


1.చిన్న చిన్న నలతలన్నీ చిటికెలోనె మటుమాయం

దీర్ఘరోగమైనా పూర్తిగ మానుట మా దవాఖానలో ఖాయం

మొండివ్యాధులైనా  నయం చేయుటే మా లక్ష్యం

రేయీ పగలు ఏడాదంతా మీకండదండగ ఉంటాం

కన్నవారిలాగా చూసుకుంటాం కంటికి రెప్పలాగా మిము కాచుకుంటాం


2.ఆరితేరిన వైద్యులతో అందుబాటులో పర్ ఫెక్ట్ ట్రీట్ మెంట్

అనుక్షణం నవ్వుతూ సేవలందించే మా నర్సింగ్ హార్ట్ ఫుల్ సప్పోర్ట్

వాణిజ్యకోణం లేని సరమైన రుసుములతో సర్వీసే మా కమిట్ మెంట్

ఆదుర్దాతో అడుగిడినా ఆనందంతో ఇల్లుచేరగలడు మా పేషంట్

రోగాల పనిపడతాం సమూలంగా-మామూలైపోతారు రోగలు మా మూలంగా



Thursday, August 24, 2023

 https://youtu.be/AA8pAdFlh1c?si=CBEsSWbWxtm9ay60


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:అభేరి(భీంపలాస్)


జగమంతా ఎరిగినది అష్టలక్ష్ములని

మరవకండి పతులారా మహితులా నవమలక్ష్మిని

నిత్యం కంటిముందు నడయాడే మన ఇంటి లక్ష్మిని,గృహలక్ష్మిని


ఆదరించండి ఆరాధించండి అనవరతం మీ అనురాగం పంచండి

లాలించండి సేవించండి చండీలక్ష్మిగా భావించండి


1.చిరునవ్వుతొ స్వాగతించే తాను చిన్మయ లక్ష్మి ఒద్దికగా ఇల్లు చక్కదిద్ధే తానే పరిశుభ్ర లక్ష్మి

కమ్మగ వండీ వడ్డించి కడుపు నింపే తాను మాతృలక్ష్మి

అలసినవేళలో సేదదీర్చి సేవలందిస్తుందీ  దాస్యలక్ష్మి,శృంగార లక్ష్మి


ఆదరించండి ఆరాధించండి అనవరతం మీ అనురాగం పంచండి

లాలించండి సేవించండి చండీలక్ష్మిగా భావించండి


2.చిక్కులు ఎదురైతే మనపక్కన నిలబడే స్నేహ లక్ష్మి

మిక్కిలి గుట్టుగా ఒడుపుగా సంసారనావ నడుపు సాహసలక్ష్మి

పరువు మర్యాదలు పదిలంగా కాపాడే పావన లక్ష్మి

జీవితాన అడుగిడి జీవితంతొ ముడిముడి జీవితమే తానయే జీవనలక్ష్మి


ఆదరించండి ఆరాధించండి అనవరతం మీ అనురాగం పంచండి

లాలించండి సేవించండి చండీలక్ష్మిగా భావించండి

Thursday, August 17, 2023

 https://youtu.be/95Z1EcypWk4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చేయి సాచనీయకమ్మ పరులముందు చెంచులక్ష్మీ

అప్పుల పాల్జేయకమ్మ ఎప్పటికీ మము ఆదిలక్ష్మీ

ధనవర్షమె కురియనీ మా ఇంటలో ధన లక్ష్మీ

కోరిన వరములొసగవమ్మా జననీ వర లక్ష్మీ


హారతి నీకిదే శ్రావణ శుభవేళ శ్రీ లక్ష్మీ

మంగళహారతిదే శుక్రవార వ్రతవేళ శ్రీ మహాలక్ష్మీ


1.పదిమందికి కడుపునింపు పాడిపంటలొసగవే ధాన్యలక్ష్మీ

ఎద ఎదలో వెలుగు నింపు చదువు నేర్పు ఎల్లరకు విద్యాలక్ష్మీ

పిల్లా పాపలతో చల్లగ వర్ధిల్లగా దీవించవే సంతాన లక్ష్మీ

కృషికి తగిన ఫలితమీయి విష్ణుపత్నీ విజయలక్ష్మీ


హారతి నీకిదే శ్రావణ శుభవేళ శ్రీ లక్ష్మీ

మంగళహారతిదే శుక్రవార వ్రతవేళ శ్రీ మహాలక్ష్మీ


2.రుజలను ఎడబాపవే నిజముగా జయ గజలక్ష్మీ

ఇడుములందు సత్తువనే సడలనీయకమ్మా ధైర్యలక్ష్మీ

ఉన్నంతలొ సంతృప్తిగ జీవించెడి బ్రతుకునీయి వైభవలక్ష్మీ

ఆయువున్నంత వరకు ఐదోతనమునే ప్రసాదించవే భాగ్యలక్ష్మీ సౌభాగ్యలక్ష్మీ




Monday, August 14, 2023

 https://youtu.be/oHzB1XUCSE8


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఎర్రకోట మీద -ఎగురుతోంది -

త్రివర్ణపతాకం

నీలి నింగికే వన్నెల తలమానికం

దేశమంటే మనుషులేనని తలపోసే మాప్రజానీకం

జైహింద్ అను నినాదమే- మా -దేశభక్తిఉత్ప్రేరకం


జైహింద్ జైహింద్ జైహింద్


1.జననీ జన్మభూమి మేము నమ్మే దైవాలు

విశ్వజనీనమైన ప్రేమకలిగినవి మా భావాలు

శత్రువుకెన్నడు వెన్నుచూపనివి మా ధైర్యసాహసాలు

శాంతి సహనం ఔదార్యాలు మా భారతీయుల ఆనవాలు


జైహింద్ జైహింద్ జైహింద్


2.ప్రపంచాన్ని శాసించే వారూ మా మేధస్సు ఫిదాలే

కీలక పదవుల నలరించింది విశ్వవ్యాప్తంగ మా వారే

దేశం మాకేమిచ్చిందంటూ వాపోబోని మా పనితీరే

ప్రాణము సైతం దారపోయుటకు మేమెపుడూ తయారే


జైహింద్ జైహింద్ జైహింద్

Thursday, July 27, 2023

 https://youtu.be/ZhyICRqpHAE


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ధర్మవతి


వనదేవతలారా మీకు వందనాలు

పావన దేవతలారా మీకు పసుపు కుంకాలు

జన దేవతలారా మీకివే పబ్బతులు

గిరిజన దేవతలారా అందుకోండి చేజోతలు


నమ్మి వచ్చినాము మిమ్ము సమ్మక్కా సారలమ్మ

మేడారం అడవిలో మీరు గద్దెకు రావడమే

ఆ వేడుక చూడడమే మాకు సంబరమమ్మా


1.పొలాసలో పుట్టవద్ద పాపగా కనిపించావు

సమ్మక్కా మేడరాజు ఆడపడచుగా ఎదిగినావు

పడిగిద్దరాజుకు ఇల్లాలివై ఇలలో వెలుగొందినావు

సారలమ్మ నాగమ్మ జంపన్నల సంతతిగా పొందినావు


నమ్మి వచ్చినాము మిమ్ము సమ్మక్కా సారలమ్మ

మేడారం అడవిలో మీరు గద్దెకు రావడమే

ఆ వేడుక చూడడమే మాకు సంబరమమ్మా


2.ధీర వనితగా అవనిలో పేరుపొందినావు

నీ హస్తవాసితో రోగ గ్రస్తులకు నయంచేసినావు

కాకతి రాజులకు ఎదురొడ్డి పోరు సలిపినావు

నడయాడే దేవతగా పూజలు గొనుచున్నావు


నమ్మి వచ్చినాము మిమ్ము సమ్మక్కా సారలమ్మ

మేడారం అడవిలో మీరు గద్దెకు రావడమే

ఆ వేడుక చూడడమే మాకు సంబరమమ్మా




https://youtu.be/OzroP1fwqxQ


 *నేడు నా శ్రీమతి గీత పుట్టిన రోజు సందర్భంగా…*


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ఖరహరప్రియ


ఏ బహుమతి నీకీయను ప్రియమైన శ్రీమతి

నువు పుట్టిన ఈరోజున ఆయోమయం నామతి

నాదంటూ ఏ ముందనీ- ఎరుగవా నా సంగతి

మరులన్నీ ఏర్చికూర్చి అర్పస్తా నీకై…నే నీగీతి


హ్యాపీ బర్త్ డే టూయూ మై డియర్ గీతా…

విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ


1.తొలి చూపులోనే ఐనాను నీ కంకితం

కోరి చేసుకున్నాను నిన్నే నా హృదయగతం

ముడివేసుకున్నాను విడివడని ఆత్మబంధం

ఇరువురు కుమరులతో మనది నిత్యానందం


హ్యాపీ బర్త్ డే టూయూ మై డియర్ గీతా…

విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ


2.స్వర్గంలోనే జరిగిందిగా మన వివాహం

రోజు రోజుకీ పెరిగిపోతోంది నీ పై మోహం

జన్మలేడు ఎత్తినా జవరాలా నీవే నా జత

నవరసభరితం ఏనాటికీ మన ప్రేమ చరిత


హ్యాపీ బర్త్ డే టూయూ మై డియర్ గీతా…

విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ

 https://youtu.be/DZ0cqhM96SY


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


సభ్య సమాజానికిది అయ్యో సిగ్గుచేటు

మానవీయ విలువలకు గొడ్డలి వ్రేటు

మహిళల మనుగడకే ఎంతటి చేటు

మణిపూర్ మగువలపై దాష్టీకం గగుర్పాటు


1.రాతియుగంలో సైతం నాతికి రక్షణ ఉంది

రావణరాజ్యంలోనూ వనితకు విలువుంది

అతి హేయం దారుణ సంఘటన మనసు కలచివేస్తోంది

నీచాతినీచం  నికృష్టపు దమనకాండ మెదడు తొలిచి వేస్తోంది


2.మదమెక్కిన మైథీలు బరితెగించిన వైనం

కుక్కీలను కుత్సితంగ నలిపేసిన మారణం

హత్యలు అత్యాచారాలే సహించలేని పాశవికం

వివస్త్రలుగా ఊరేగిస్తే విస్తుపోయిన నాగరీకం


3.న్యాయం చతికిలబడితే మృగత్వం పెట్రేగుతుంది

 చట్టం ఏమారితే నేరం కౄరంగా చెలరేగుతుంది

కృత్రిమ మేధయే వికసించు వేళ ఘోర వైపరీత్యం

నరజాతే తలవంచుకుని నగుబాటైన దృష్కృత్యం

Thursday, July 20, 2023

 

https://youtu.be/02zWC6n-_xk

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మాండు


ఒకవంకా శ్రీదేవి ఒకవంకా భూదేవి

ఇంక నీకు వంకేది తిరుపతి వెంకన్నా

పండేందుకు పాముంది పయనానికి పక్షుంది

ఇగనీకు బెంగేది  మా అయ్యా శీనయ్యా

వంకలు బెంగలు చింతలు చీ కాకులు 

అన్నీమా వంతేనాయే  

ధరమప్రభువా నీకిది న్యాయమేనయ్యా


1.నీ మకామేమో అల వైకుంఠపురము

నువ్వు తేలితేలియాడగ పాల సంద్రము

వందిమాగధులే సామి ముక్కోటి దేవతలు

వైభోగమేమందు వర్ణించగా వేలాయే నా కవితలు


2.ఓపిక సచ్చినా ఒరంగల్లు రాదాయే

నిన్నెంత మొక్కినా సామి నీ దయ రాదాయే

ఈ జన్మకింతేనా ఈశుడా మా వెంకటేశుడా

మా బతుకంతా వెతలేనా అండగ నీవుండా


Sunday, July 16, 2023

https://youtu.be/TnfgHk8DDKI?si=t2RJHWBY53iyV3MN


శతవసంతాల జయంత్యుత్సవం

స్మృతి పథాన మీ జీవన విధానం

పర్వదినమే ఏనాడు మీ జన్మదినం

మరపురానివి మీ ప్రేమా అభిమానం


నమస్సులు మీకివే రంగాచార్య తాతగారు

మీ ఆశీస్సులే మా ఉన్నితికి దివ్యవరాలు


1.భద్రాచల రామ చంద్రుని ఆరాధకులు

శ్రీ వైష్ణవ సాంప్రదాయ నిత్యార్చకులు

నృసింహోపాసనలో సదానందులైనారు

శ్రీమన్నారాయణుడిలో ఐక్యమొందినారు


2.పదిమందిని ఆదరించి ప్రేమని పంచారు

అన్నార్తులు ఎదురైతే కడుపునింపి పంపారు

నరునిలో సైతం శ్రీ హరిని దర్శించారు

పొడిచేటి వంశపు పొద్దు పొడుపు మీరు

పొడిచేటి వంశపు తలమానికమైనారు

Monday, July 10, 2023

 https://youtu.be/qJjg4gKVlkM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:భీంపలాస్


చదువరులకు వరమొసగే దేవాలయం

జిజ్ఞాసుల తృష్ణదీర్చు క్షీరసాగరం

పఠనాసక్తులకూ పుస్తక ఘన భండారం

అపార విజ్ఞాన రాశులకిది నిలయం

గ్రంధాలయం గ్రంథాలయం గ్రంథాలయం గ్రంథాలయం


1.గ్రంథాలయ తొలి ఉద్యమాన్ని సాగించాడు

కొమర్రాజు లక్ష్మణరావు లక్ష్యాన్ని సాధించాడు

భారత స్వాతంత్ర్య సంగ్రామ ఊతంగా మలిచాడు

తెలంగాణ సాయుధ పోరుకు ఇంధనమందించాడు

బహుళార్థ సాధకమై అందరికీ అందుబాటులో లైబ్రరీల సమయం

గ్రంధాలయం గ్రంథాలయం గ్రంథాలయం గ్రంథాలయం


2.నిశ్శబ్దం రాజ్యమేలు ప్రశాంత దివ్య లోకం

పాఠకులందరూ పుస్తకాలతో ఔతారు మమేకం

వేలాది పుస్తకాలు పలుభాషలలో ఇట ఉపలభ్యం

దినవార మాసాది పత్రికలూ చదువుకొనే సౌలభ్యం

కావ్యాలు ప్రబంధాలు విజ్ఞాన గ్రంథాలు

పురాణేతి హాసాలకాలవాలం

గ్రంధాలయం గ్రంథాలయం గ్రంథాలయం గ్రంథాలయం

Friday, July 7, 2023

 

https://youtu.be/RVeeUcgKvUM?si=WDPZ_KphFJW3RBdf

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


బడిరాజ్యం నీదే 

ఏలుబడి చేయగా రావదేఁ

ఉపాధ్యాయ నేస్తమా …

అమ్మ ఒడిలా విద్యార్థుల ఆదరించవేమదేఁ


1.కౌశిక మునివర్యుని కౌశల్యము నీవు 

సాందీప గురువర్యుని సారూప్యత నీవు

సర్వేపల్లి రాధాకృష్ణ సమతుల్యుడవు

అబ్దుల్ కలాం గారి నిజ వారసుడవు

నీతికి నియతికి నిర్దేశకుడవు 

జాతికి నీవే ఆదర్శ ప్రాయుడవు

గుర్తెరుగూ నీలోని నిబిడీకృత మేధా శక్తిని

ప్రజ్వలింపజేయుమిక నీ శిష్యుల జ్ఞాన దీప్తిని


2.పదోన్నతుల నెన్నడు ఆశించబోవు

అక్రమార్జనమాట అసలే ఎరుగవు

తరిగిపోని చెరిగిపోని విద్యాసంపద నీ సొత్తు

ఏ ప్రభుతా గ్రహించదు దేశప్రగతిలో నీ మహత్తు

పేద విద్యార్థులకు పెన్నిధినీవు

బదిలీలెన్నైనా ప్రతిచోటా ఆప్తుడవు

దేశాధినేతలైన నీ పూర్వ విద్యార్థులే

ఘన శాస్త్రవేత్తలైన నీ కృపా పాత్రులే…



శుభాకాంక్షలందుకో విద్యా దాన కర్ణుడా

శుభాభినందనలివే సర్వ మానవ శ్రేష్ఠుడా

 https://youtu.be/cI6Tuol9BfU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఇది బ్రహ్మ గర్జన - బ్రాహ్మణ జన గర్జన

 లోకాః సమస్తా స్సుఖినోభవంతు యని

సర్వదా కోరుకునే ద్విజులందరి ఆత్మీయ సమ్మేళన

వేద ధర్మ పరిరక్షణ నిజ హక్కుల ప్రకటన

పరిపాలనలో సైతం తగు భాగ స్వామ్య సాధన


1.ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం పరశురామ ప్రతీకలం

అర్థశాస్త్ర కోవిద చాణక్యుడి వంశ వారసులం

తిరు కోవెలలోన స్వామి అర్చకులం దైవ సేవకులం

సంస్కృతీ సదాచార సాంప్రదాయ పరిపోషకులం

బ్రాహ్మణో మమ దేవతా అన్న మాధవుడి భక్తులం

నిత్య గాయత్రీ మంత్ర జపానుష్ఠాన అనురక్తులం


2.అగ్రకులం అన్నది అపప్రథేగాని నిరుపేదలమే అధికులం

నరుడే హరుడని వ్యవహరించే విశ్వమానవ ప్రేమికులం

దాన ధర్మాల విలువనెరిగియున్న సమైక్య భావుకులం

మీన మేషాలు లెక్కించి ప్రజా శ్రేయస్సు కాంక్షించే జ్యోతిష్కులం

దేశాన్ని ఏల గలుగు సత్తా గలిగిన సహజ నాయకులం

ఒక్క మాటపై నిలిచి ఒక్కబాటలో నడిచే లక్ష్య పథికులం

 https://youtu.be/pj0PfkC_LFI


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


 నీవుంటే కలకలం

నీవెంటే నా కలం

ఎంత మధురమో నీగళం

అది అనవరతం పూర్ణ సుధాకలశం


1. సెలయేరు నీపాటలో 

పరవళ్ళు తొక్కుతుంది

చిరుగాలి నీ పాటతో

మత్తెక్క వీస్తుంది

నీవున్న చోటనే నందనవనం

నీ స్నేహబాటనే బృందావనం


2. కొడిగట్టే దీపానికి

ఊపిరయే చమురే నీవు

ఆశలుడుగు జీవితానికి

ఎదురయే వరమే నీవు

ఏడడుగులు చాలవే నీతో సావాసం

ఏడు జన్మల నీ సహచర్యం

కడు మాధుర్యం