అమ్మానాన్నలె.దేవుళ్ళు
మా ఇంటకురిసేను నవ్వుల వెన్నెల జల్లు
ప్రతిపూట విరిసేను సంబురాల హరివిల్లు
1.బంధుమిత్రులకు ఆతిథ్యాలే మాకు తిరునాళ్ళు
ఆటపాటలతొ ఆనందాలే గోదారిలాగా పరవళ్ళు
పచ్చదనాల పలుమొక్కలతో కళకళలాడును మాలోగిళ్ళు
స్వఛ్ఛదనాల పరిసరాలే ఆహ్లాదానికి ఆనవాళ్ళు
2.నోరూరించే కమ్మని రుచులకు కార్ఖానాయే మావంటిల్లు
వరుసపంక్తుల్లొ వడ్డించె భోజనాల మా నడిమిల్లు
చల్లనివెన్నెల కాలవాలము మలయసమీరపు మాడువిల్లు
సరససల్లాపముల సేదదీరగా శాంతినొసగమా పడకటిల్లు
3.తాతా బామ్మా మందలింపులతొ ఇంపైనది
అరమరికలెరగని అమ్మానాన్నల మనసైనది
అన్నదమ్ము లేరాళ్ళు కలివిడిగా అలరారునది
ఉమ్మడికుటుంబమంటే ఉదాహరణగా విలసిల్లునది