శారదా...కవన గాన జ్ఞానదా
స్మరియింతును మదినిను సదా సర్వదా
1.అర్దశతయుత షడక్షర సమన్విత
ఆంధ్ర వాఙ్మయ విభూషిత
గణిత విజ్ఞాన తర్క విరాజిత
అభ్యసింతునిను అనవరతముగా
2.షడ్జమ రిషభ గాంధార
మధ్యమ పంచమ ధైవతనిషాద
సప్తస్వర వర సంగీత సమ్మోహిత
సాధనజేతునే నిరవధికముగా
మా ఊరు ధర్మపురి- మాదైవం నరహరి-గలగలా పారే -గోదావరి మాకు సిరి-జగతిలోనలేనె లేదు దీనికేదీ సరి-కళలకు కాణాచి- వేదాలకు పుట్టిల్లు-విద్వఛ్ఛికామణుల కాలవాలమైనది
https://youtu.be/EuxGq641WxI?si=Wj69p9YFrANOEEbt
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం: ఉదయ రవిచంద్రిక(శుద్ధ ధన్యాసి)
ధర్మపురీ ,శ్రీ లక్ష్మీ నరసింహుని దివ్య క్షేత్రము
ధర్మపురీ,గోదావరి ప్రవహించే పుణ్య తీర్థము
కర్మలు నశియింప జేయు సన్నిధానము
జన్మను తరియి౦పజేయు ముక్తి ధామము
1.దక్షిణ వాహిని గా అలరారే గోదావరి ఒక వరము
దక్షిణ కాశీ గా వాసికెక్కి యున్నదీ ఈ పురము
దక్షిణ దిక్పతి నెలకొని యున్న స్థలము
దక్షిణ భారతాన ప్రసిద్ధ యాత్రాస్థలము
2.వేదాలకు నెలవైన విప్రవరుల నిలయము
సంస్కృతీ సనాతన సంప్రదాయ సహితము
సంస్కృతము జ్యోతిష్యము సమకూరి యున్నది
సంగీతము సాహిత్యము సకల కళల పెన్నిధి
3.శివకేశవులభేదమైన హరిహరక్షేత్రము
పరమత హితమెరిగిన మహిత స్థావరం
నిత్యమూ భక్తులతో అలరారే జనపదము
ప్రతిరోజు పండగనే తలపించే ఒకజగము
https://youtu.be/iRGTHuY5IZQ?si=4UIaom1810-fViKt
https://youtu.be/8T0JNAyYob0?si=uiNl-Oa90XVr5g3A
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం : హంసానంది
యుగ యుగాల వెలుగులీనె మన తెలుగు
దిగంతాల కీర్తి మించె మనతెలుగు
తెలంగాణ- 'తెలుగు' పురిటి గడ్డ
తెలంగాణ పలుకు - అప్యాయత అడ్డా
1.పాల్కుర్కిసోమన్న ప్రణీత ద్విపదగా ఆద్యమై
పనిపాటల పల్లె జానపదముగా హృద్యమై
తెలంగాణ నుడికారపు మమకారమై
కోనసీమ వెటకారపు వ్యవహారమై
రాయలసీమ మాండలీక మణిహారమై
కళింగాంధ్ర పదగతి ప్రాకారమై
మాధుర్యం చిలుకుతుంది మన భాష
ఆంతర్యం ఒలుకుతుంది మనభాష
2.వేమన బద్దెనల నీతిశతక బోధకమై
పోతన్న గోపన్నల భక్తిభావ సాధకమై
దాశరథీ వరదన్నల వాణీ పద మంజీర నాదమై
కాళోజీ సినారెల ఆధునిక వచన గీత వేదమై
హృద్య పద్య ప్రసిద్ధగా లోకామోదమై
సహజసిద్ధ భావనాయుత ఆహ్లాదమై
ప్రభలు చిమ్మె తెలంగాణ తెలుగు తేజమై
సుధలు కురిసె తెలంగాణ విశ్వ విరాజమై
3.అజంతా సుందరిగా అరుదైన పదాకృతి
ముత్యాల దస్తూరిగ తీరైన వర్ణ లిపి
జగతిలోన ఏ సాహితి నోచని పద్య సంస్కృతి
ప్రభుత కొలువందు కొలువొంద మనస్కృతి
అధికార భాషగా ఆదరించమని వినతి
తెలుగువారు మాతృభాష మన్నింపగ ప్రణతి
ఇటలిభాష 'పడమటి తెలుగని'పొందగ ఖ్యాతి
పాడుకోవాలి జనమంతా మక్కువతో తెలుగుగీతి
https://youtu.be/fUxtddMiA20?si=PVeTbJiwvwb9ఎల్ఫ్ల్
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం :వసంత
https://youtu.be/IETDqIG8HZU?si=DTyPWHMQH0qFdJ4p
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం :కీరవాణి ఆధారం
రెండు దేహాలు
పంచప్రాణాలు
ఒకటైన జీవితాలు
ఒకేలా ఇరువురి భావాలు
1.చిలుక వేరు గోరింకవేరు
వలపుకు అవి మారుపేరు
ఆ రాధామాధవులు
ప్రేమకు పెట్టింది పేరు
అనురాగ రాగాలు
రసరమ్య యోగాలు
ఒకటైన జీవితాలు
ఒకేలా ఇరువురి భావాలు
2.కలవలేని నింగి నేలను
కలుస్తుంది వంపివానను
అందుకొనిన నేల సైతం
మురుస్తుంది పెంచి వనమును
అపురూప స్నేహాలు
అనుపమాన బంధాలు
ఒకటైన జీవితాలు
ఒకేలా ఇరువురి భావాలు