https://youtu.be/LYA7_Kv-FWY
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:శివరంజని
నిద్రలేని రాత్రులెన్నో నీకోసం ధారపోసా
నా మనః సాగరాన్ని ఎంతగానొ మథనం చేసా
సాహితీ పిపాసులనలరించే గేయాలకై పరిశ్రమించా
కవనామృతభాండం కోసం అనవరతం పరితపించా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ
1.కదిలించిన ప్రతివస్తువును కవితగా మలిచేసా
భిన్నమైన అభిమానులకై పలువిధముల రచనలు చేసా
రంజింప జేయడమే లక్ష్యంగా నే తలపోసా
మానవతే పరమావధిగా గీతాలను నే కృతిచేసా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ
2.సుందరమౌ చిత్రాలుగా పాటలనందించా
శబ్దార్థ కౌశేయములతొ అలంకరింప జేసా
ప్రాసల పసిడి నగలతో గీతిని తీరిచి దిద్దా
అక్షరమే దైవంగా అను నిత్యం నే కొలిచా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ