Friday, April 3, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

https://youtu.be/mD5lQQv8hD4

పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ
మీరు సల్లంగా కాచే తల్లులె గదమ్మా
మిమ్ములను మొక్కంది దినామే గడువదు
మిమ్ములను కొలువంది పానామె ఊకోదు
ఊకూకే గిట్లైతే మేమెట్ల సచ్చూడో
తాపకో మామ్మారిని మీరెట్ల మెచ్చుడో
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

1.ప్లేగు మశూచీ కలరా స్ఫోటకపు వ్యాధులు
క్షయ డెంగ్యూ చికున్ గన్యా వంటి రోగాలు
ఎన్నిటినినుండి గట్టెక్కించినారో మమ్ముల
కడుపులవెట్టుక సక్కగ సాకినారో మమ్ముల
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

2.యాపమండలె బతుకు దీపాలాయే నాడు విషజ్వరానికి 
పసుపు పూసుకుంటే మందాయే కదమ్మా ప్రతి గాయానికి  
మైలబడకుండా శుచిగా ఉంటిమి  జబ్బుపడినప్పుడు
పత్యం పాటించి నిత్యం మిము తప్పక తలచామప్పుడు
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

OK

Wednesday, April 1, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎవ్వరమూ కాము అనాథలం
మనుషులమంతా ఆత్మబంధువులం
మన మధ్యన బంధుత్వం మానవత్వం
అనంతవిశ్వంలో మన ఉనికే నిత్వత్వం
కలసికట్టుగా చిచ్చేపెడదాం కౄర కరోనాకు
నరుని ఘనతనే చాటిచెప్పుదాం ఈ జగత్తుకు

1.దిగంత అంతరాళంలో మన భూమొక పిపీలికం
ఖగోళ పాలపుంతల్లో ఎంతటిదీ మన స్థానం
రోదసి గ్రహరాసుల్లో పరమాణు పరిమాణం
నక్షత్ర మండలాల్లొ ఒక మూలగ మన వాసం
లక్షల వత్సరాల  మనుగడకే సవాలు
చావోరేవో అనాదిగా ఎన్నని నరజాతి యుద్ధాలు

2.కంటికి కనబడని  లక్షలాది విరోధి వైరస్లు
నిత్యం వెంటాడే వేలాది బాక్టీరియ ఫంగస్లు
పంచభూత విలయాలు ప్రతిఏటా విపత్తులు
వంచన మించిన సాటిమనిషి అనూహ్యమైన వెన్నపోట్లు
లక్షల వత్సరాల  మనుగడకే సవాలు
చావోరేవో అనాదిగా ఎన్నని నరజాతి యుద్ధాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఔదార్యం ఉండదు కొందరికి ఉంటెనేం ఎంతో  ధనం
అవకాశం దొరకదు ఇంకొందరికి వితరణకై ఏక్షణం
సాటివారి ఎడల స్పందించగ ఇదె తరుణం
మానవాళిపట్ల తీర్చుకొనగ మన ఋణం
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం

1.వృద్ధిచెందాయి కరోనా పుణ్యమా అని వ్యక్తిగత శ్రద్ధలు
పెరుగసాగాయి కరోనా మూలాన పరిసర పరిశుభ్రతలు
ఇనుమడించాయి కుటుంబ సభ్యులతో అనుబంధాలు
పెంపొందుతున్నాయి దేశ ప్రజలలో జాతీయ భావనలు
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం

2.అలవడింది నేతల పిలుపుతో గడపదాటని క్రమశిక్షణ
ఒంటబట్టింది చట్టానికి సహకారమందించే పౌరబాధ్యత
తెలియవచ్చింది విపత్తునధిగమించు మన ధీరోదాత్తత
అవగతమైనది సమాజశ్రేయస్సుకున్న ప్రాథమ్యత
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం

Tuesday, March 31, 2020

https://youtu.be/4jvkplvQ3Zo

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

పైన పటారం లోన లొటారం కాదయ్యా నువు శంకరా
ఎంత పటాలం నీకున్నదో మము కాచుటలో లేదు శంక రా
కైలాసం వదిలేసి గణములనాయత్త పరచి మా వంకరా
పిలిచీ పిలువగనే భక్తుల బ్రోచుటలో నీకు లేదు వంక రా

1.శివునాజ్ఞలేనిదే చీమైనా కుట్టదని మేమెరుగమా
నీ ఆనతిలేనిదే యముడైనా కదలడని అనుభవమేగా
మృత్యుంజయా ఆపరా సత్వరమే కరోనా కరాళ నృత్యం
జీవేశ్వరా ఛేదించరా కరోనా వ్యాప్తి వెనుక దాగిన సత్యం

2.నర జాతియే నాశనమొందువేళ ఏల తాత్సారం
మనుషుల మధ్యన మతమొకగీతగా దేనికి మత్సరం
అధికార దాహాలు రాజ్యాధిపత్యాలు ఎంత కుత్సితం
మానవ సమాజాన  మచ్చగమారనీకు ఏ వత్సరం

Monday, March 30, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:మాల్కోస్

త్వమేవాహమ్ పరమ శివమ్
దేహిమే ఆత్మ దర్శనమ్ పరమాత్మ దర్శనమ్
ఏకమ్ సత్ విప్రా బహుదావదంతి
అవలోకయమామ్ ఋగ్వేదోక్తి

1.మమ సంశయమతి అజ్ఞానపూరితమ్
సందేహనివారిణమ్ వందే విశ్వైకగురుమ్
పార్వతీ వల్లభమ్ అర్ధనారీశ్వరమ్
దివ్యానంద ప్రసాదినమ్ దిగంబరమ్ సుందరమ్

2.తత్వమసి అహం బ్రహ్మాస్మి భావనమ్
కించిత్ మీమాంస సంయుతమ్
దేహాత్మ భేదమ్ అవగతవరదమ్
సోహమేకం సత్యం శివమ్ సుందరమ్
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పాటకోసం ఎదిరిచూసే తోటనైనాను
తోటలోని చివురుకోరే పికమునైనాను
గున్నమావి చివురులున్న తోటనేనేను
గొంతువిప్పీ గీతిపాడే కోయిలమ్మనునేను
ఏమనినే చెప్పెదను మనస్నేహం జగతిన సుందరం
ఆమనియే అరుదెంచు మనవల్ల పొందగ ఆనందం

1.వరమునొసగె దైవము నీకు గాత్ర మాధుర్యం
నీది ఎంతటిభాగ్యము మనసంతా ఔదార్యం
ఉన్నదాన్ని ఉపయోగిస్తె జగత్కళ్యాణము
 ప్రతిభనంత ధారపోస్తే  జన్మసార్థక్యము
ఏమనినే చెప్పెదను మనస్నేహం జగతిన సుందరం
ఆమనియే అరుదెంచు మనవల్ల పొందగ ఆనందం

2.వాడే పూవు తెలుపుతుంది తావిపంచడాన్ని
పారెగంగ నేర్పుతుంది తపన తీర్చడాన్ని
పరికించి చూడూ ప్రకృతే గురువౌతుంది
చెలిమిని అందించు చెట్టునేస్తమౌతుంది
ఏమనినే చెప్పెదను మనస్నేహం జగతిన సుందరం
ఆమనియే అరుదెంచు మనవల్ల పొందగ ఆనందం

OK

ఏ దివ్య లోకాలనుండో దిగివచ్చినావే చెలీ
రస రమ్య సోయగాలే ఇల సంధించినావే సఖీ
వెన్నెలనంతా దోచుకొచ్చి వెల్లెవేసావు నీమేనికి
కన్నె పరువం దాచుకొంటూ వన్నెలూనావే నేటికీ
ప్రౌఢలోనీ గూఢపొంకం సాటిరాదది నీకే సొంతం
నీ అంగాంగం మన్మథరంగం నిత్యవసంతం  జీవితాంతం

1.అందంగా జన్మించడం  లలనకు అదృష్టం
కలకాలం సవాలే యవ్వన పరిరక్షణం
ఏపూటన తిన్నావొ పస్తులే ఉన్నావో సౌష్ఠవానికి
వ్యాయామమె చేసావో ఆరోగ్యమె కాచావో సొగసుకి
సౌందర్యపోషణే నిష్టాగరిష్టమైన యజ్ఞం
ఏమరుపాటులేక కాచుకున్నావు సౌందర్యం

2.ఏచోటన తమ అందపు కేంద్రముందొ ఎరుగరు
ఏవర్ణం సొబగుల ఇనుమడించునో తెలియరు
కనులు వీక్షణలు అధరాల విరుపులు బుగ్గసొట్టలు
నాభి నడుమొంపులు పయోధరాలు కురులు జఘనాలు
ఎదగుట్టు కనిపెట్టి కనికట్టు చేసే కప్పుర గంధీ
తాపసులకు కసిరేపి రతికై ఉసిగొలిపే కలశస్తనీ

Sunday, March 29, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఒంటరిగా నా పయనం
అనంతమే నా గమ్యం
భావాలనే కవితలుగా మలచుకొంటూ
గీతాలనే ఎలుగెత్తి పాడుకొంటూ

1.యుగాలుగా నాదిదే కథ
ఎన్ని జన్మలెత్తినా మారదు చరిత
తామరాకుపై నీటిబొట్టుగా
తాత్కాలికంగా ఇతరుల జతకట్టగా

2.వచ్చింది ఈ ఇలకు ఒంటరిగానే
వదిలేది సైతం ఒంటరిగానే
నాతోనేనే గడిపేను హాయిగా
ఇల్లే ఇలలో ఒక స్వర్గసీమగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నరునికీ కరోనాకు నడుమన సమరం
కంటికి కనిపించకుండ రాక్షస యుద్ధం
రాజీపడి మరుగైతె గెలుపు మనదె తథ్యం
ఎదుటపడగ సమిధలై మన సమాధి ఖాయం
నరజాతికి కరోనా పాడుతోంది చరమగీతం

1.పరిశుభ్రత వహించడం ప్రజలను కాచే కవచం
మాస్క్ లూ శానిటైజర్లు సంధించే ఆయుధాలు
ఇంటిపట్టున అంటకమెంటక ఉండడమే పద్మవ్యూహం
సోషల్ డిస్టెన్స్  ఒకటే జనులకు వాడగ పాశపతాస్త్రం

2.మాయలనేర్చిన మారి కరోనా రెచ్చగొట్టేను ఎరలను వేసీ
కాలుకదపక కూర్చొనువేళ కాలుదువ్వును వలలను పన్నీ
యుద్ధనీతే లేదుగా కరోనాకు మననే మార్చును అస్త్రాలుగా
 కబళించైనా మనుషులపైనా గెలుపే ధ్యేయం కౄర కరోనాకు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హిందోళం

కరోనా అంటే  మన జనాలకు ఒక కల'రా
కరోనా అన్నది మన మూర్ఖులకు కల్పనరా
దేశవ్యాప్త లాక్ డౌన్ పెద్ద జోకురా
ఇంటిపట్టునుండమంటె ఎంతడోకురా
ఎవరుచెపితె ఎక్కుతుంది ఈ మూఢులకి
ఎలాచెపితె ఎరుకౌతుందో ఎర్రిమొర్రోళ్ళకి

1.రోజువారి పనులన్నీ యథావిధిగ చేసేరు
రోడ్డుమీది కొద్దంటే వింతగ వాదించేరు
చావులంటె ఎవరికీ ఏమాత్రం లెఖ్ఖలేదు
కర్ఫ్యూ ను పెట్టినా కాస్త ఖాతరైనలేదు
ఎవరుచెపితె ఎక్కుతుంది ఈ మూఢులకి
ఎలాచెపితె ఎరుకౌతుందో ఎర్రిమొర్రోళ్ళకి

2.మొకానికైతె నేమోమాస్కన్నదె ఉండదు
శానిటైజర్ పేరైనా తెలియనే తెలియదు
పరిశుభ్రత అన్నది ఇంటా వంట లేదు
మనుషుల మధ్యన దూరం మాటవరుసకైన లేదు
ఎవరుచెపితె ఎక్కుతుంది ఈ మూఢులకి
ఎలాచెపితె ఎరుకౌతుందో ఎర్రిమొర్రోళ్ళకి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఏడేడు లోకాలు నీకళ్ళలో
ఎన్నెన్ని వర్ణాలు చెక్కిళ్ళలో
కడతేరిపోతాను కౌగిళ్ళలో
ముగిసిపోతేమి బ్రతుకు మూన్నాళ్ళలో

1.సమయమెంత దొరికిందో కరోనా మిషవల్ల
తేరిపార చూస్తున్నా సుందరినీ తనువెల్లా
కవితలెన్నొ  రాస్తున్నా కవినైనా కాకున్నా
చూపులతొ చిత్రాలెన్నో చిత్రంగా గీస్తున్నా

2.చేజారిన కాలమంతా తిరిగి ఏరుకుంటున్నా
నీ ఎడల నిర్లక్ష్యానికి దండుగనే చెల్లిస్తున్నా
చేదోడువాదోడై బాధ్యతగా ఉంటున్నా
ఏడాది పండుగలన్నీ ఇపుడె చేసుకొంటున్నా

Saturday, March 28, 2020

https://youtu.be/dyTZSqgbTMw

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాడేసాత్ శని నిన్నూ పట్టబోతుంటేనూ
మఱ్ఱిచెట్టు తొర్ర లో సొర్రలేదా
భస్మాసురుడు నెత్తిమీద సెయ్యిబెట్టబోతేనూ
హరినే శరణుకోరి బచాయించలేదా
మంచుకొండదప్ప మంచి ఇల్లైనా లేదాయే
వల్లకాడెగాని  చిన్న గుడిసైనా లేదాయే
పైలంరా శంకరా అంటురోగమంటరా అమానవీయం 
భద్రంరా ఈశ్వరా ఇలాజ్ లేదంటరా బ్రతుకే అయోమయం 
సల్లంగ బతికుంటే శివరాత్రికి మల్ల శ్రీశైల మొచ్చేము
నూకలు బాకుంటె కోడెనుగట్ట మేము ఎములాడకొచ్చెము

1.కనివిని ఎరుగని కాలనేమి ఇదిరా కాలకాలుడా
నీ ఆనతివినని పెను భూతమేనురా భూతనాథుడా
జాతరలంటూ తిరుగుతూ ఆడికీ ఈడికీ  పోబోకు
భక్తులవెంట బడి నీకున్న మైమలకే ముప్పు తెచ్చుకోకు
పైలంరా శంకరా అంటురోగమంటరా అమానవీయం 
భద్రంరా ఈశ్వరా ఇలాజ్ లేదంటరా బ్రతుకే అయోమయం

2.సల్లబడ్డదేమో సంపనీకి నీకన్ను ముక్కంటీ
శిలుంబట్టిందేమొ పొడవనీకి శూలం శూలపాణీ
వైద్యనాథడువైననూ నీకే అంతువట్టకుంది ఈ వింత వైఖరి 
గరళకంఠుడవైన నీవే హరించలేనిదాయె ఈ వ్యాధి మల్లారి 
దిక్కులకే రారాజువు నీకే దిక్కులేదు మమ్మెట్లకాచేవు
యుమునికే గురుడవు నీకే సక్కిలేదు మమ్మెట్ల సాకేవు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అరె ఏం జెప్పుడ్రబై మన పబ్లిక్కు
దీన్ని సౌరగజేసుడెంత సిక్కు
నెత్తినోరుగొట్టుకుంటు మొత్తకున్నగాని పట్టించుకుంటే ఒట్టు
ఖుల్లం ఖుల్లజేసి ముంగట్లవెట్టినా ఎక్కదేందిరో గీ కరోనా గుట్టు

1.కాళ్ళుమొక్కిజెప్పినా ఖాతరే జేయరాయె
దండవెట్టిజెప్పినా మొండిగా వినరాయే
దందాలన్ని బందువెట్టి ఇంటికాడ ఉండమంటే
లెక్కజేయకుండ ఇంక సడకు మీద్కి రావట్రి
సబ్బువెట్టి సెయ్యితోమి సచ్చంగా ఉండమంటే
ఏదివడ్తె అదిముట్టి కంపుకంపు జేయవట్రి

2.టీవీల్లల్ల జూపినా సింతాకంత సింతలేదు
మైకువెట్టి జెప్పినా మంచిగైతె ఇనుడెలేదు
దగ్గు తుమ్ము ఏదొచ్చిన మూతిమూసుకోమంటే
నాకేమైతదంటు  పర్వజేసుడె లేదాయే
గజమంత దూరముండి పన్లు సక్కవెట్టమంటె
మీదమీద వడుకుంటూ రాస్కపూస్క తిరుగుడాయె
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మాయామాళవగౌళ

అనివార్యం మనిషికి మరణం
అర్ధాంతరమైతేనే అది దారుణం
ఇంటినిలిచి గెలిచేటిదీ రణం
మించిపోనీకు కరోనానరికట్టే తరుణం
బుద్ధి లేక వెధవలై గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా

1.దేశాధినేతలే పబ్బతులిడి చెప్పినా
ప్రపంచమంతా బెదురుతు గడగడలాడినా
వార్తల్లో కళ్ళముందు వ్యాధి వ్యాప్తి ఎరుకైనా
టీకా చికిత్సలూ లేనే లేవని తెలిసినా
బుద్ధి లేక వెధవలై గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా

2.మిమ్మల్ని చేయమన్న దేశ సేవ ఏమిటని
మిమ్మల్ని కోరుతున్న త్యాగం ఏపాటిదని
అంటకమెంటక శుభ్రత పాటించడమేగా
కుటుంబ సభ్యులతో ఇంటగడపమనేగా
బుద్ధి లేక వెధవల్లా గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా

Friday, March 27, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."

దిక్కులేని చావునే చావాలా
కుక్కచావు లాంటిదే కావాలా
ఇంటిపట్టునుండమంటె ఇంత నిర్లక్ష్యమా
మనకైతే రాదనే వింత ఉదాసీనమా
కొనసాగితె ఇలాగే కరోనా కోఱల్లో చిక్కకతప్పదిక
మృత్యుకరాళ నృత్యానికి కాబోతోంది ప్రతి ఎద ఒక వేదిక

1.చావైనా పండగే  మన ఇండియాలో
చచ్చాకా సందడే సంప్రదాయ రీతిలో
స్వర్గవాసమో ముక్తిధామమో మరణాంతర ఆంతర్యం
కళేబరాలనైనా పూడ్చలేక కాల్చలేక ఇకపైన మనదైన్యం
కరోనా కోఱల్లో చిక్కకతప్పదిక
మృత్యుకరాళ నృత్యానికి ప్రతి ఎద ఒక వేదిక

2.మనం బ్రతికి మందిని బ్రతికించగలగడం
ఎదుటివారికి తగినంత దూరంగా మెలగడం
ఇల్లే ఒక స్వర్గమని ఇంటికి పరిమితమవడం
చేతులు కడుగుకొంటు పరిశుభ్రత పాటించడం
క్రమశిక్షణ కలిగియుంటె  కరోనాకు అంతం
నియంత్రణను మీరకుంటె కరోనాకు మరణం

https://youtu.be/ZUPJ7hW0J0M?si=aJB0iUVASotSnZSg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: సారమతి

ఇందరు ఎందుకు కొలుతురు నిన్ను
ఇందిరా రమణా నీ ఉనికే లేకున్న
పరిపరి విధముల పొగడుదురేలను
పురుషోత్తమా నీ గుణగణములను
గోవింద గోవింద హరి నారాయణ
గోవింద గోవింద కరుణాభరణా

1.వందలు వేలు నీ మందిరములు
లక్షలు కోట్లు నీ భక్త జనములు
నిత్యపూజలు కైంకర్యములు
తప్పక జరిపెడి బ్రహ్మోత్సవములు
ఇంతగ ఎందుకు కొలుతురు నిన్ను
ఇందీవరశ్యామ నీ మహిమలు గనకున్న
గోవింద గోవింద వేంకట రమణ
గోవింద గోవింద కరుణాభరణా

2.నారదాది ముని పుంగవులు
అన్నమయ్య వంటి వాగ్గేయ కారులు
స్మరియించిరి సహస్ర నామాల
కీర్తించిరి నిను వేవేల కీర్తనల
కరిని బ్రోచిన మకరి సంహారి
కావవేర కరోనా మహమ్మారి బారి
గోవింద గోవింద శుభ చరణా
గోవింద గోవింద కరుణాభరణా

క-ట్టుబడి ఉంటాను నీ నట్టింటిలో
కాపురముంటాను నీ కాటుక కళ్ళలో
కితకితలే పెడతాను నిను జోకుల్తో
కీర్తనలే పాడతాను నీ అందాలు పొగుడ్తూ

రో-మాంచితమాయే రేతిరౌతుంటేనూ
రౌద్రరసం పొంగుతోంది పడక దక్కకుంటేనూ
రంజైన వయసంతా నీరుగారి పోతోంది
రఃదారి మూసివేయ బతుకు వెగటు కొడుతోంది

నా-కూ నీకు మధ్య దూరముంది సరేనా
నిమిషమైన తప్పుజేస్తె తప్పదింక కరోనా
నీడ కూడ పడకుండా జాగ్రత పడుతున్నా
నువ్వే నేనైతే అదేకదా ప్రేమకు నజరానా
రచన,స్వర కల్పన&గానం:డా.రాఖీ

ఎంత మస్తుగున్నవె నీ సోకుమాడ
మత్తెక్కిస్తున్నావే నీ జిమ్మడ
సూపుల్లో కైపుంది నవ్వుల్లో కిక్కుంది
పడిసస్తాడెవడైనా నీ కాళ్ళకాడ
ఇస్తాడే పానాలైన నిన్ను గూడ

1.పిక్కలపైకెగ గట్టిన సుక్కల కోక
నీ ఎండి కడియాలు కేకోకేక
తిప్పుకుంటు ముప్పుదెచ్చె సుప్పనాతి నడుము
బొడ్డుసూడబోతెనేమొ యాదికొచ్చె కుడుము
నడకేమో హంసనడక తప్పదింక హింస పడక
పడిసస్తాడెవడైనా నీ కాళ్ళకాడ
ఇస్తాడే పానాలైన నిన్ను గూడ

2.సుక్కలన్ని దండగుచ్చి సుట్టావే కొప్పులో
సెంద్రవంకనెట్టినావు ముక్కెరగా ముక్కులో
ముందు ఎనక చెప్పబోతె ఎన్నెన్ని గొప్పలో
కళ్ళబడితె ఆగలేక గుండెకెన్ని తిప్పలో
నువులేక దిగదు మెతుకు నీతోనే నాకు బతుకు
పడిసస్తాడెవడైనా నీ కాళ్ళకాడ
ఇస్తాడే పానాలైన నిన్ను గూడ
https://youtu.be/fEzWA1J8QVQ?si=DKmBE9pyPyu07EJY
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి

భీకరాకారా నరకేసరీ చక్రధరా
ధర్మపురీ సంస్థితా దనుజ సంహారా
ప్రహ్లాద వరదా హే ప్రభో కరుణా సముద్రా
అరిషడ్వర్గమునే హరించరా  కరిరాజ భద్రా

1.విచ్చలవిడి మా నడతను మార్చుకున్నాం
విర్రవీగ గుణపాఠం నేర్చుకున్నాం
మానవతను మా అక్కున చేర్చుకున్నాం
నీవే ఇక దిక్కని అంగలార్చుతున్నాం

2.ప్రకృతి ఎడల మరికాస్త శ్రద్ధవహిస్తాం
పర్యావరణానికి తగినవిలువనిస్తాం
మనిషికి మనిషికి మధ్యన వంతెన వేస్తాం
చిత్తశుద్ధితో నిన్ను సర్వదా స్మరిస్తాం

3.ఇందుగలదందులే దని ఎరుగం
కరోనా అన్నదే బ్రహ్మ పదార్థం
సర్వాంతర్యామివి స్వామీ నీవు
కరతలామలకమే నీకు కరోనా చావు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వినాలి ఎద సవ్వడి ఏమంటున్నదీ
కవితల కనాలి అనుభూతుల నెలా మలుచుకుంటున్నదీ
చిగురాకులా స్పందించేను చిరుగాలి వీచినా
ఘనఘనమై వర్షించేను తనమేనొకింత తాకినా

1.కలయేదో వచ్చి వాలింది రెప్పలపై చిలుకలా
కలయికయే వరమయ్యేలా ఆశగొలిపింది రేపులా
ఊసులెన్నొ చెప్పింది బాసలెన్నొ చేసింది
కనులు తెరిచి చూసినంతనె కలవరమే రేపింది
కల్లగానె మారింది

2.నా చీకటి జీవితాన ప్రమిదలా వెలుగిచ్చింది
నా ఒంటరి ప్రపంచాన ప్రమదగా తోడొచ్చింది
ఏడడుగులు వేసేతరుణం ఏడు జన్మలదా ఋణం
చెప్పాపెట్టకుండానే బంధాలను త్రెంచేసింది
సంద్రంలో ముంచేసింది

Thursday, March 26, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:యమన్

కనుగీటనేల మదిమీటనేల
కుదురుగా ఉండేవేళా-ముగ్గులోకి లాగనేల
పట్టించుకోవేల పరువాలు వగచేలా
యవ్వనాన విహరించేలా అందించు రాసలీల

1.ఏ కరోనా కాటువేయునో ఏకరువు పెడుతున్నా
నీ దైనలోకంలోనే కలలు కందువేలా
బ్రతికితె రతికేమి కొదవలే అడ్డుఅదుపులేనేలేదా
ఓపికనువు పట్టావంటే ఓరుగల్లు పట్నమౌనులే

2.చేజారిపోనీకు మనవైన మధురక్షణాలు
మించనీకు సంగమించు ఎదురవనీ మరణాలు
గడిచిపోతె మరలారాదు ఘడియ సమయమైనా
నిమిషమే యుగమయ్యేను సరసమే రసమయమైనా

PIC courtesy:  నీ నేస్తం ID

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలక్కామోద్

సిద్ధ హస్తుడవు ప్రసిద్ధ వైద్యుడవు
మహమ్మారుల పరిమార్చే దురంధరుడవు
మృత్యువుకే ఎదురొడ్డిన పరమాత్ముడవు
దీనజనుల కాచిన అపర పరమేశ్వరుడవు
కడగళ్లనే కడతేర్చగా కరుణించవో గురునాథా
షిరిడి సాయినాథా జయ జయ సద్గురునాథా

1.కలకలము రేపెను షిర్డీ గ్రామాన కలరా
తిరుగలితొ బాబా గోధుమలు విసరా
పిండినంత షిర్డీలో మూలల్లో విసరా
పారిపోగ చేసావుగ ఎవరైనా నీకు సరా
కడగళ్లనే కడతేర్చగ కరుణించవొ గురునాథా
షిరిడి సాయినాథా జయ జయ సద్గురునాథా

2.గాలిలోన చేతులుతిప్పి గారడీలు చేసేవు
ధునిలోని విభూతినిచ్చి వ్యాధులెన్నొ మాన్పేవు
ఫకీరుగా ఉంటూనే బంధాలకు విలువిచ్చావు
వండివార్చి ఎందరికో క్షుద్బాధను తీర్చావు
కడగళ్లనే కడతేర్చగ కరుణించవొ గురునాథా
షిరిడి సాయినాథా జయ జయ సద్గురునాథా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎంతోకొంత స్వార్థముంటుంది-ప్రేమికుల ప్రేమలో
రక్తబంధమైతే ఉంటుంది- బాంధవ్యాలలో
కలుషితమసలే అవ్వనిది ప్రతి ఫలాల నాశించనిది
సృష్టిలోనే తీయనిది యుగములైనా మాయనిదీ
స్నేహ బంధము మైత్రీ గంధము మహదానందము

1.చెలిమికి కారణమేమిటో ఇదమిద్దంగా తెలియదుగా
మనసుల కలిపే వంతెనేదో ఎవ్వరైననూ ఎరుగరుగా
పురుషులు స్త్రీలను భేదమె లేక సోపతి నావలొ ఎక్కేరు
వయసూ స్థాయీ ఎల్లలనే నేస్తాలెప్పుడు పరిగణించరు
సృష్టిలోనే తీయనిది యుగములైనా మాయనిదీ
స్నేహ బంధము మైత్రీ గంధము మహదానందము

2.బేషరతుగా తోడైనిలుచును స్నేహితమన్నది జీవితాంతం
ధనము సమయము కష్టము కోర్చును ఫ్రండ్షిప్పన్నది కలకాలం
నిస్వార్థం నిర్మలత్వం సంయమనాల సంగమమే సాంగత్యం
త్యాగం కోసం తలపడగలిగే అద్భుత బంధమె సావాసం
సృష్టిలోనే తీయనిది యుగములైనా మాయనిదీ
స్నేహ బంధము మైత్రీ గంధము మహదానందము

Wednesday, March 25, 2020

OK

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:దర్బార్ కానడ

సాగర కెరటాలై నీ కరములు
నర్తించువేళల ఉత్తుంగ తరంగాలు
జలపాత ధారలై నీ పదములు
కదలాడు సమయాన ఉరకల తురంగాలు
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ తనువే సప్తవర్ణాల ఇంద్రధనువు

1.మనోజ్ఞమై విలసిల్లు నీ అపూర్వ నృత్యము
రసజ్ఞులను అలరించగ నయనానందకరము
ప్రవర్ధమానమై ఒప్పారు నీ అనన్య నాట్యము
ప్రసిద్ధ నర్తకీమణులకైన అనితర సాధ్యము
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ మేనే నేల దిగిన విద్యుద్ధామము

2.లాస్యబ్రహ్మ నటరాజ ప్రియపుత్రిక నీవే
నాట్య శాస్త్ర భరతమునికి శిశ్యురాలి వీవే
అప్సరసల తలదన్నే హావభావ భంగిమలు
ఆంగిక వాచిక నేత్రాంకిత  నటన ప్రకటనలు
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ గాత్రమే ప్రతి పాత్రకు బ్రాతిపాత్రము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రణయాలలీలలెరిగిన జాబిలీ జాలిగనవా
అందించు  ప్రియసఖునికి నా అహరహర విరహ వేదన
పరిమళాలు విరజిమ్మే అరవిరిసిన జాజిబాలా
జవరాలి కెరిగించు నా అహరహర విరహ వేదన

1.చేసుకున్న బాసలన్నీ మరచిపోయెనేమో తానూ
తట్టిచెప్పవే కాస్తా నా అహరహర విరహ వేదన
చెప్పుకున్న ఊసులన్నీ చెదిరిపోయెనేమో మదిలో
మొక్కిచెప్పవే ప్రియునికి నా అహరహర విరహ వేదన

2.ఆకుఅలికిడైనా తానని ఆరాట పడుతున్నాను
ఓపలేను నేస్తమా నా అహరహర విరహ వేదన
ఏ మువ్వల సవ్వడివిన్నా తానేనని భ్రమపడుతున్నా
తాళలేను నా ప్రియతమా ఈ అహరహర విరహ వేదన

3.సందేశాలనందించే అందాల మేఘమాలా
చేరవేయి నా చెలునికి ఈ అహరహర విరహ వేదన
ప్రేమలేఖలందించే ఓ చిట్టి పావురమా
వివరించు నెచ్చెలికి ఈ అహరహర విరహ వేదన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిన్నే చూస్తు ఉండగలను  ఒక యుగము
నిన్నే చేసుకున్నాను నాదైన జగము
ఇల్లునసలు కదలను రెప్పలైన గిలుపను
దృశ్యారాధనయే జీవితాంతము
సౌందర్యో పాసనయే అనుక్షణము

1.పిడుగులైన పడిపోనీ కుంభవృష్టి కురియనీ
వరదలు తూఫానులు ఎన్నైనా ఇక రానీ
ఇల్లునసలు కదలను దేనికింక బెదరను
చీకటైతె నీ కన్నుల వెన్నెలనే కంటాను
ఆకలైతె నీఅందమునాస్వాదిస్తాను

2.కరోనాను రాకుండా కట్టడియే చేసాను
జ్వరమైన దూరకుండ జాగ్రత్త పడినాను
ఇల్లునసలు కదలను ఇతరములే తలచను
చేదోడుగ నీకెపుడూ నేనుంటాను
నీవాడిగ కడదాకా తోడుంటాను
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసధ్వని

సరిహద్దుకు వెళ్ళి కంచెను కాచే పనిలేదు
అవసరమొస్తే యుద్ధం చేసే అగత్యమే లేదు
ప్రపంచమంతా మృత్యు విపత్తుతొ విలవిలలాడే
జగత్తుమొత్తం కౄర కరోనా కోరలలోన చిక్కుబడే
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

1.పెడచెవిన పెట్టకు ప్రభుత సూచనలు ఎప్పటికప్పుడు
అతిక్రమించకు చట్టాన్నెపుడు తప్పవు ముప్పుతిప్పలు
సంయమనం పాటించాలి కష్టకాలన బాధ్యతగా మనం
అంటక మెంటక మెలగాలి అంటువ్యాధితో ప్రతిక్షణం
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

2.మనిషికి మనిషికి మధ్యన  తగిన ఎడంగా ఉండాలి
పదేపదే చేతులు కడుగుతు పరిశుభ్రపరచుకోవాలి
తుమ్ము దగ్గు తుంపర్లుకు అడ్డుగ గుడ్డను వాడాలి
ముక్కుమూతి కన్నులను విధిలేనప్పుడె తాకాలి
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

3.కట్టడి చేద్దాం కరోనాను సమిష్టికృషితో మనమంతా
నశింపజేద్దాం వైరస్ ను నామరూపాలు లేకుండా
పొరపాటొక్కరిదైనా భారీ మూల్యం అందరికీ
తీవ్రత గ్రహించకుంటే చరమగీతమే మననరజాతికి
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

Tuesday, March 24, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

"ఉగాది శుభాకాంక్షలు-సకారాత్మకతయే జీవితం"

అగత్యమే శార్వరి ఉగాదికీ స్వాగత గీతం
తథ్యమే ప్రతి కాళరాత్రికీ ఓ సుప్రభాతం
శుభకృతును చేరాలంటే శార్వరిని దాటక తప్పదు
పునఃసృష్టి కావాలంటే మృత్యువీణ మీటక తప్పదు
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం

1.పాపం పండే రోజొకటి రానేవచ్చింది
బలిదానంకోరే తరుణమెప్పుడో తప్పనిది
కోయిలపాటే కాకికూతగా కర్ణకఠోరమౌతోంది
గుణపాఠంనేర్పగ కాలం యుగాంతమైపోతోంది
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం

2.మూడు వారాల గ్రహచారం ఆరుఋతువుల సంచారం
ఎవరికివారై క్రమశిక్షణగా నడవగ తెలుపును పంచాంగం
చేదుమ్రింగితె చాలు అర్ధమండలం ఏడాదంతా మకరందం
చావూ బ్రతుకూ ఇరుచేతుల్లో చేతలే మార్చేను జీవితం
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తాకితె అల్లన మోవి
పలికేను రాగాలు పిల్లనగ్రోవి
నల్లనయ్య నన్నుచేరి మేను మీటగా
గమకాలనొలుకుతు మారిపోదు నేను పాటగా

1.బండరాయి సైతం సజీవశిల్పమౌతుంది
ఎండినమోడైనా చివురుతొడుగుతుంది
యదునందనుని ఎదుట నిలువగా
 హృదయమే యమునౌతుంది
మాధవుణ్ణి మతిలో నిలుపగ
మనసు మధువనమౌతుంది

2.కుబ్జవంటి వక్రజీవితం సుందరమౌతుంది
మీరాకోరుకున్న తత్వం నిత్యత్వమౌతుంది
సుధాముడైమెలిగామంటే
గాఢ మైత్రి దొరుకుతుంది
తులసిదళమైపోతేనో
భక్తి  సిరులు తూచుతుంది

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నాన్నంటే ప్రాణము
నాన్నంటే జ్ఞానము
నాన్నంటే లోకము
నాన్నేగా దైవము

1.నాన్న బీజము అమ్మ క్షేత్రము
కమ్మని కలల పంటనే సంతానము
నాన్న జీవము అమ్మ దేహము
ఇద్దరి వలపుల ఫలితమే జీవితము
నాన్నంటే మార్గము-నాన్నంటే దుర్గము
నాన్నంటే గోప్యము-నాన్నేగా ధైర్యము

2.నాన్న భద్రత అమ్మ ఆర్ద్రత
వెన్నంటి తోడుండేదే కుటుంబము
నాన్న మేలుకొలుపు అమ్మజోలపాట
ఇరువురి అనురాగమే మాధుర్యము
నాన్నంటే వైద్యము నాన్నంటే హృద్యము
నాన్నంటే ఆరాధ్యము నాన్నే సర్వస్వము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఇల్లే జైలు ఇపుడైతేనే మేలు
ఎవరికివారైతేనే తప్పేను చావులు
ఆషామాషీ కాదు నేస్తమా కరోనాకు విరుగుడు
ఇంటిపట్టునుంటేనే వైరసిక ఆగుడు
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు

1.చెవిముందు శంఖమూదినా పట్టించుకోవేల
కంటిముందు కనబడుతున్నా వింతపోకడేల
దుర్దినము దూరములేదు అజాగ్రత్త వీడకుంటే
ఆత్మహత్యయేకాదు హత్యలౌను నువు వినకుంటే
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు

2.దేశ సరిహద్దులైనా  మూసివేసినారు
రాష్ట్రాల మధ్యనా కంచెవేసినారు
ప్రాణాలు ఉగ్గబట్టి ప్రయత్నించ ప్రభుత్వాలు
కొంచమైన జంకులేకా సంకనాకి పోతావు
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

పరమ దయాళా పరమేశ్వరా
కరుణతొమము కావుమయ్య కాలకాలుడా
మించిపోతున్నది మనగలిగే తరుణం
ముంచుకొస్తున్నది అకాల మరణం
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

1.చదువు లేని మూఢులమే మేమందరం
చదువుకున్న మూర్ఖులమే ప్రతి ఒక్కరం
కష్టకాలమందైనా ఇష్టారాజ్యమె మాది
నియమాల నతిక్రమించు నైజము మాది
పనులుచక్కబెట్టమంటె వంకలతో మానేము
ఇంటిపట్టునుండమంటే బేఖాతరు చేసేము
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

2.ఆయువు మూడినా అవినీతినొదలము
ప్రళయము కబళించినా నిర్లక్ష్యము వీడము
ఇతరులకన్నా మేమే అతీతులనుకంటాము
చేయిదాటిపోయాకా నెత్తికొట్టుకుంటాము
మా వంకర బుద్ధులింక సరిజేయర శంకరా
మా తింగరి చేష్టలనే అరికట్టర హరహరా
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

Saturday, March 21, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వేనవేల వందనాలు వైద్యులకు
శిరసువంచి ప్రణామాలు నిత్యారాధ్యులకు
ఎన్నలేము అహర్నిశల మీ సేవానిరతి
జేజేలుకొడుతోంది జనమంతా పడుతోంది హృదయహారతి

1.గుండె బదులు గుండెమార్చి కొత్త ఊపిరులు పోసి
తమప్రాణం ఫణంపెట్టి వికృత విషపూరిత రోగాలనరికట్టి
భేదాలను పక్కనెట్టి మానవుడే దేవుడన్న సత్యాన్ని నిలబెట్టి
సకలమానవాళికి అవిశ్రాంత సేవజేసి ధన్యులైన వైద్యులారా
ఎన్నలేము అహర్నిషల మీ సేవానిరతి
జేజేలుకొడుతోంది జనమంతా పడుతోంది హృదయహారతి

వేనవేల వందనాలు వైద్య సిబ్బందికి
శిరసువంచి ప్రణామాలు నిత్యారాధ్యులకు-
వేనవేల వందనాలు అత్యవసర సిబ్బందికి
శిరసువంచి ప్రణామాలు నిత్యారాధ్యులకు
ఎన్నలేము అహర్నిషల మీ సేవానిరతి
జేజేలుకొడుతోంది జనమంతా పడుతోంది హృదయహారతి

2.శుచీ అశుచి అనిలేక ఎంత కంపైనా అసహ్యించుకోక
తమప్రాణం ఫణంపెట్టి చెత్తను తొలగించే పారిశుద్య కార్మికులకు
అగ్నిమాపక పోలీసు సిబ్బందికి చిత్తశుద్దితొ పనిచేసే యంత్రాంగానికీ
అంబులెన్స్ డ్రైవర్లకు క్యాటరింగ్ కర్తలకు ఆపద్బాంధవులందరికీ
ఎన్నలేము అహర్నిషల మీ సేవానిరతి-కరోనా వ్యతిరేక అవిరళ కృషికీ
జేజేలుకొడుతోంది జనమంతా పడుతోంది హృదయహారతి

Friday, March 20, 2020

రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:పట్ దీప్

నీ వదనమే అరవిందము
నీ అందమే మకరందము
నా చూపులు మారేనూ భ్రమరాలుగా
నీ మోమున వాలేనూ సుధలుగ్రోలగా

1.కలువల వలలోనా -చిక్కుకుంది నాహృదయం
అధర మందారాల్లో మత్తుగొంది నా చిత్తం
కపోలాల నిగారింపులో స్ఫురించింది నవనీతం
కనుబొమల కనుమల్లో సింధూర సుప్రభాతం

2.ఊరించసాగాయి ఉరోజాలు పరువాన్ని
పక్షపాతి అయ్యింది పైటకొంగు తప్పుకొని
ఉపాసించగలనే నిన్ను సౌందర్య దేవత
ప్రసాదించవే వరమును అందించి నీ మమత
https://youtu.be/_Pdu8Byh3fU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలాంగ్

శిరమునుండి కరుణగంగ పొంగిపొరలదా
కనులనుండి దయామృతం వరదలై పారదా
భోళాశంకరుడవు సర్వదుఃఖ హరుడవు
శివుడవు భవుడవు ప్రణవ స్వరూపుడవు
సాష్టాంగ వందనాలు సదాశివా
కవనచందనాలు నీకు సాంబశివా

1.కాలకూట విషమునైన కంఠాన నిలిపావు
ప్రళయాగ్నినైనా మూడో కంటిలోన దాచావు
నాగులనే నగలుగా తనువున దాల్చావు
చితివిభూతి ఒంటికంత పూసుకున్నావు
కరోనాను కాలరాయ నీకేపాటి
దీనులనిల కావగా నీకెవరు పోటి

2.కనికరమున వరములీయ లేరునీకు సాటి
కోరినదొసగుటలో అసామాన్యమె నీ దృష్టి
అర్ధాంగినైతె నేమి ఆత్మలింగమైతెనేమి
అడిగినదే తడవుగా ప్రసాదించినావు
కరోనాను కాలరాయ నీకేపాటి
దీనులనిల కావగా నీకెవరు పోటి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఒళ్ళుమరిచె ప్రపంచం సోషల్ మీడియాతొ
జగతి విడిచె సమాజం అంతర్జాలంతో
మంటగలిసిపోయాయి మానవీయ బంధాలు
మింటికెగసిపోయాయి రక్తసంబంధాలు
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు

1.బందైపోయాయి బయట తిరగడాలు
కుచించబడిపోయాయి హోటళ్ళలొ తినడాలు
ఇల్లాలి చేతివంటలొ వడియాలు అప్పడాలు
పరస్పరం శ్రద్ధాసక్తుల ఆరోగ్య భాగ్యాలు
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు

2.సంసారమె ప్రాధాన్యతగా సాగాలి లోకం
వ్యక్తిగత సౌఖ్యమే సంఘానికి శ్రేయోదాయం
ఎవరికివారైతేనే ప్రబలిపోదు అంటువ్యాధి
ఇంటిపట్టునే ఉంటే కట్టగును ప్రతి మహమ్మారి
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హేమవతి

ఏడు కొండలనైతే వీడవులే సరి
మా గుండెల నెలా చేరుదువో శ్రీహరి
విజృంభిస్తున్నదీ అమానుష వైఖరి
మము కావగ నినువినా ఎవరిక మరి
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

1.మా దేహమందు నిన్ను ఆవాహన చేసెదము
మా హృదయమందు నీకు ఆసనము వేసెదము
పన్నీటి పాద్యమిచ్చి పదముల కడిగెదము
కన్నీటి అర్ఘ్యమొసగి కరముల తోమెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

2.మాలిన్యము తొలగేలా అభిషేకించెదము
స్వచ్ఛమైన వస్త్రాలను ధరియించెదము
ప్రకృతి పచ్చదనం నిత్యం నిలిపెదము
పర్యావరణమునే పరిశుభ్ర పరిచెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

3.సాటివారిపట్ల మేము బాధ్యతగా మెలిగెదము
కలుషితాల నెడబాసి నీ ధ్యాసలొ మనెదము
ప్రతి నరుడిలో మురహరినే దర్శించెదము
మానవీయ బంధాలు పునరుద్ధరింపజేసెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

Thursday, March 19, 2020

https://youtu.be/PCE_QX0mE7M?si=VI9RCJg8SWu9zUSR

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


అందం సంగతి సరేసరి
ఏర్చి కూర్చాడు విరించినీకై  కొసరికొసరి
అంతకుమించి ఏదో ఉంది
చూసీచూడగానే ఆహ్లాదమాయే నా మది
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు

1.అమావాస్య నాడూ విరిసే కౌముదివే
మృగతృష్ణలోనూ పారే మందాకినివే
నింగికి రంగులు వెలయగజేసే సింగిడివే
బీడును తడిపెడి  తొలకరి  చినుకువు నీవే
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు

2.సుధలు రంగరించిన అనురాగ రాగిణివే
మూర్తీభవించిన అపర సౌందర్య లహరివే
ఆరాధనకే అర్థము నేర్పిన ఆ రాధనీవేలే
ప్రణయానికే భాష్యము రాసిన సూర్యకాంతివే
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చేతితో మూతిఅన్నది నను తాకరాదనీ
పాణితో నేత్రమన్నది ననుతాకరాదనీ
ముక్కుతనను ముట్టవద్దనీ హస్తంతోఅన్నది
నేడు కరోనాను కట్టడిసేయమని మోము కరమునన్నది

1.పరిశుభ్రత పాటిస్తే కరోనా ఏపాటిది
తగు జాగ్రత వహియిస్తే లక్ష్మణ గీటది
సానిటైజర్లనే పరిపరి వాడితీరాలి
పదేపదే చేతులను గిచగిచా తోమాలి
చికిత్సకన్నా ఉత్తమం ముందుజాగ్రత్తలే
నిర్లక్ష్యం చేస్తేనే తప్పవింక తిప్పలే

2.దగ్గినా తుమ్మినా అడ్డుగ దస్తీనుంచాలి
చిన్నసుస్తి చేసినా డాక్టర్ కడకేగాలి
జ్వరమేదైనా సరే నియంత్రింప జేయాలి
ఇతరులతో వేరుగా ఇంటిలోనె ఉండాలి
సూచనలను పాటిస్తే కరోనాకు అంతమే
బెంబేలు పడిపోతే అగమ్యగోచరమే

3.ప్రతి నలతకు కారణం కరోనా ఐపోదు
ప్రతిజలుబూ కరోనాకు దారితీయనే తీయదు
స్వచ్ఛదనం కావాలి మన జీవన విధానం
పరిశుభ్రతె చెప్పుతుంది రోగసమాధానం
రోగనిరోధక వ్యవస్థ వృద్ధి పర్చుకోవాలి
విషమపరిస్థితెదురైనా నిబ్బరంగ ఉండాలి
https://youtu.be/pjSBGChI-3g?si=lUOVpO4dbyZtc0Eg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మకరి బారి కరిగాచిన శ్రీహరీ
డింభకు బ్రోవగ స్తంభాన వెలసినా నరహరీ
వ్యాధుల పరిమార్చే శ్రీ ధన్వంతరీ
కరోనాను కడతేర్చర కనికరించి మురారీ

1.ఎత్తినావు ఎన్నెన్నో అవతారాలు
తీర్చినావు పలుమార్లు మానవ సంకటాలు
దిక్కుతోచకున్నది మానవజాతి అంతరించు దిశగా
దిక్కికనీవన్నది కరోనా మహమ్మారి నణచగ ఆశగా

2.ఆచారాలన్నీ తగు శాస్త్రీయమైనవే
సంప్రదాయాలూ మనుగడకుపయుక్తమైనవే
నాగరికత మోజులో దిగజారిపోయాము
విచ్చలవిడి స్వేఛ్ఛలో ఉచ్ఛనీచాలవిడిచాము

3.తప్పిదాలు మావెన్నో తలచక మన్నించు
పద్ధతులను అలవరచి మమ్ముద్ధరించు
ఇకనైనా మేల్కొనీ పాటింతుము క్రమశిక్షణ
నిను నమ్మినవారికీ ఇంతటి మరణశిక్షనా

Wednesday, March 18, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ   

రాగం:రేవతి

లేటువయసులో ఘాటు సొగసుతో మాటువేసినావే
రేతిరంతనూ రతీదేవివై నిదురకాసినావే
సూదంటి నీ చూపులు నాటబోకె నాగుండెలో
నీ నవ్వుల వలవేసావో నా బ్రతుకే నీ గుప్పిటిలో
రేవతీ రాగంలా రెచ్చగొట్టమాకే
కార్తీక పున్నమిలా కసిపెంచమాకే

1.ఇన్నాళ్ళు ఏలోకాల్లో విహరించుతున్నావే
నా బ్రహ్మ చర్యమంతా హరియించుతున్నావే
నా జీవన గగనంలో ఇంద్రచాపమైనావు
నా మనసును మాయచేసే ఇంద్రజాలమైనావు
స్వర్గమంటె వేరే కాదు నీ సన్నిధియే
స్వప్నమే నిజమవగా నువ్వు నా పెన్నిధియై

2.నెమలికెంత అసూయనో నీ నాట్య భంగిమలు
గంధర్వ కాంతకు  విస్మయమే నీ నాభి దివ్య సొబగులు
వయసాగిపోయేనీకు పరువాల పాతికలో
మునులైన ముక్తిపొందరా నీ వలపు పాచికలో
తపములేలనే చెలీ తరించరా నీ బిగి కౌగిట కాలి
సుధలేలనే సఖీ అనిమేషులవరా నీ మోవి గ్రోలి

Tuesday, March 17, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అనురాగ రంజితం ప్రతి సుప్రభాతం
రసయోగ సంయుతం మన జీవితం
గతంలోని వెతలన్నీ మతిమరచిపోదాం
రేపేంటను ఆందోళననూ విస్మరించేద్దాం
ఆస్వాదిద్దామూ ఇద్దరమే మనదైన లోకాన్ని
ఆనందం చేద్దామూ చేజార్చక అన్ని క్షణాల్ని

1.రాయబడ్డ నాటకంలో నటించే పాత్రధారులం
కాలప్రవాహంలో కలుసుకున్న బాటసారులం
పాత్రోచితంగా   రక్తికట్ట పోషించాలి
ప్రమేయమే లేకుండా ప్రవహిస్తు సాగాలి
ఆస్వాదిద్దామూ ఇద్దరమే మనదైన లోకాన్ని
ఆనందం చేద్దామూ చేజార్చక అన్ని క్షణాల్ని

2.విపత్తులూ విపర్యయాలూ జీవితంలో భాగాలే
వ్యాధులూ యుద్ధాలు మనుగడలో సవాళ్ళే
మరణం అనివార్యమేకద అనుదినం వగయగనేల
రాబోయే మృత్యువుకోసం నేడు స్వాగతించనేల
ఆస్వాదిద్దామూ ఇద్దరమే మనదైన లోకాన్ని
ఆనందం చేద్దామూ చేజార్చక అన్ని క్షణాల్ని
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:శుభ పంతువరాళి

ముట్టుకుంటే అత్తిపత్తి
పట్టబోతె ద్రాక్షగుత్తి
రెండువైపుల పదునున్న కత్తి
గొంతులింక కోయడమే నీ ప్రవృత్తి
ఆశలెన్నొ కల్పిస్తావు చెలీ అందాలనెరవేసి
నడి కడలిన తోసేస్తావు ప్రేమ నావలోంచి

1.పట్టించుకోకుంటే సెలుకుతావు గిల్లిగిల్లీ
చొరవగా ముందుకెళ్తే చేస్తావు లొల్లిలొల్లి
తప్పించుక తిరుగుతుంటే మాటేస్తావు పిల్లికిమల్లె
చావనీవు బ్రతుకగనీయవు నేనెలాసచ్చేది తల్లే
ఆశలెన్నొ కల్పిస్తావు చెలీ అందాలనెరవేసి
నడి కడలిన తోసేస్తావు ప్రేమ నావలోంచి

2.ప్రేమనొలకబోస్తావనే భ్రమలేర్పరుస్తావు
జీవితమే అంకితమంటూ కథలెన్నొచెబుతావు
పీకల్లోతు మునిగేవరకు దుస్థితే తెలియదెవరికీ
గుండెగాయమైపోయి భవితశూన్యమౌను చివరికి
ఆశలెన్నొ కల్పిస్తావు చెలీ అందాలనెరవేసి
నడి కడలిన తోసేస్తావు ప్రేమ నావలోంచి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాయకుండ ఉండలేను నీ మీద గీతమొకటి
తెలుపకుండ ఆగలేను మదిలోని భావసంపుటి
అందమంత కేంద్రీకృతమై నాభిలోనే దాగుంది
నాట్యమాడ నడుమెపుడో వంశధార అయ్యింది

1.గుండెలెన్నొ దండగుచ్చి మెడలోన దాల్చావు
చూపుల్ని మాలకట్టి సిగలోన దూర్చావు
నిన్ను చూసి యువకులంతా అన్నాలు మానారు
ఇంటికో దేవదాసై నీ ధ్యాసలొ మునిగారు
మైకమేదొ కమ్ముతుంది నిన్ను చూసినంతనే
మతి భ్రమించి పోతుంది నవ్వునవ్వినంతనే

2.వయసుకు విలోమానమై  సౌందర్యం వికసిస్తోంది
చెదిరిపోని సౌష్ఠవమింకా బుసలుకొడుతోంది
జన్మలెన్ని ఎత్తితేమి నిన్ను పొందడానికోసం
చచ్చీ చెడైనాసరే బ్రతుకంతా నీదాసోహం
అయస్కాంతమేదోఉంది నీ ఒంటిలో
ఇంద్రధనుసు కనిపిస్తుంది నీ కంటిలో

Monday, March 16, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నరాలన్ని జివ్వుమంటూ సరాగాలు పాడుతున్నయ్
కోర్కెలకు రెక్కలొచ్చి స్వర్గాన్ని చేరుతున్నయ్
పెదాల్నుండి పెదాల్లోకీ సుధనదులు పారుతున్నయ్
వెచ్చనైన ఊపిరులే చలినింకా పెంచుతున్నయ్
అంగనా నీ అంగాంగమే మదన రంగమయ్యింది
కాయాలు కాలు దువ్వగ కదనరంగమయ్యింది

1.నీ మేని వీణియనే మీటింది నా రసన
నీ ఎడద ప్రేరణగా సాగింది నా రచన
వేణువేదొ మ్రోగుతోంది మోవి తాకినపుడల్లా
మువ్వలే సవ్వడిచేసే నువ్వు నవ్వినపుడల్లా
అంగనా నీ అంగాంగమే మదన రంగమయ్యింది
కాయాలు కాలు దువ్వగ కదనరంగమయ్యింది

2.తబలాల దరువుల్లో తనువు నాట్యమాడింది
చెమట కురియ అణువణువు హరివిల్లు విరిసింది
వ్రేలికొసల వెంపర్లాటకు దేహమే మోహనమైంది
తమకమే హయముగమారి రతివాహనమైంది
అంగనా నీ అంగాంగమే మదన రంగమయ్యింది
కాయాలు కాలు దువ్వగ కదనరంగమయ్యింది

Sunday, March 15, 2020


https://youtu.be/0w41gD_9WRY?si=tZxxsdJwUzjL6AxS

చేపరూపుదాల్చి సోమకుణ్ణి జంపి
వేదాలను కాచావు వేదవేద్యా వేంకటేశా
సాగరాన్ని మథించగా మంథరగిరిని మోయగా
కూర్మావతారివై కూర్మికూర్చినావు దేవతారాధ్యా శ్రీనివాసా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

1వరాహమూర్తివై  హిరణ్యాక్షు వధియించి
భువి చెఱ విడిపించావు వడ్డికాసులవాడా
నరకేసరి రూపుదాల్చి హిరణ్య కశిపు దునిమి
ప్రహ్లాదుని బ్రోచావు ఆపదమ్రొక్కులవాడా
వామన భార్గవ అవతారములెత్తి దాన ధర్మ
వైశిష్ట్యము తెలిపావు వకుళా నందనా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

2.సీతా రామునిగా మానవీయ విలువలనే
జగతికి తెలిపావు జగదానందకారకా
శ్రీ కృష్ణ మూర్తిగా జగద్గురువు నీవై
గీతను బోధించావు గోవింద ప్రియ నామకా
బుద్ధ కల్క్యి రూపుడవై లోకోద్ధరణ జేసి
ప్రసిద్ధికెక్కినావు తిరుమల గిరి దీపకా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చిన్ని చిన్ని జాగ్రత్తలు
తీర్చివేసేను మన చింతలన్నీ
వస్తే రానీ ఆపత్తులు
తిప్పికొడదాము చిత్తశుద్ధితోని
కలిసి పోరుదాం మనవంతు బాధ్యతగ
కలియబడదాం కరోనా మహమ్మారినణిచేయగా

1.దరిరావు ఏ క్రిములు వైరస్ లూ
పరిశుభ్రతను పాటించినపుడు
మనలేవు ఏ రోగాలు వ్యాధులు
పరిసరాలు స్వఛ్ఛగా ఉంచుకొన్నప్పుడు
నిర్లక్ష్యమే మనకు ఆత్మహత్య వంటిది
నిగూఢతే మనిషిని మట్టుబెడుతుంది

2.పదేపదే చేతులని ప్రక్షాళణ చేసుకుందాం
దగ్గుతమ్ము జలుబుల్లో మాస్కుల్నే వేసుకుందాం
ఏమాత్రం జ్వరమున్నా ఆసుపత్రికి వెళదాం
చికిత్సదాకా ఎందుకు ముందస్తు చర్యలు చేపడదాం
కరచాలనాలే కరోనాకాలవాలం
నమస్కారమొక్కటే రోగవ్యాప్తి పరిష్కారం

3.అంటువ్యాధి కరోనా అన్నది మరువొద్దు
గుంపులుగా పొరపాటుగను కూడిఉండవద్దు
అరికట్టే వరకైనా కట్టుబాట్లు పాటించాలి
చావోరేవో  కరోనాను తుదముట్టించాలి
ప్రపంచానికే ఇది ఒక సవాలయ్యింది
ఘోరకలేదైనా సరే మానవాళే గెలుస్తుంది

Thursday, March 12, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

విపత్తులేం కొత్తకాదు మానవాళికీ
ప్రకృతికి ఎదురీత అనాదిగా ఆనవాయితీ
బ్రతుకడమంటేనే నిత్యం సంస్ఫోటం
మనుగడ కోసం తప్పదెపుడు పోరాటం
చచ్చేవరకు జీవించాలి-చావుమిష ను చంపేయాలి
మానవలోకాన్నే స్వర్గతుల్యం చేయాలి

1.టర్నడోలు త్సునామీలు భువి ఎన్ని చూడలేదు
భూకంపాలు జలప్రళయాలెన్ననుభవించలేదు
బెదిరినంతసేపు మ్రింగచూచు ప్రతి సమస్య
ఎదిరించబూనితే తోకముడుచు పురుగు పుట్ర
బెంబేలు పడిపోతే ఉన్నమతి చెడిపోతుంది
జాగరూకులైతేసరి కరోనా కనుమరుగౌతుంది

2.ప్లేగు మశూచి వ్యాధుల మట్టుబెట్టలేదా
క్షయ కలరాలను కట్టడే సేయలేదా
జగమొండి రోగాలకు టీకా కనిపెట్టలేదా
నిరంతరం శోధిస్తూ చికిత్సలే చేపట్టలేదా
ప్రభుత్వ సూచనలన్నీ తు.చ తప్పక పాటించాలి
పాలనా యంత్రాంగానికి సహకరించి తీరాలి

3.నిర్లక్ష్యమె మూలకారణం అన్ని విలయాలకు
స్వయంకృతాపరాధాలే సకల జాడ్యాలకు
పరిశుభ్రత పాటించగలిగితే  పరమ ఔషధమౌతుంది
స్వఛ్ఛదనం పచ్చదనం మనిషికి సంజీవనౌతుంది
ఇంటిపట్టున ఉంటేచాలు కరోనా నరికట్టవచ్చు
మనుషులు తగు ఎడముంటే కరోనాఆట కట్టించవచ్చు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సిత్రమే శివయ్య నీ తీరు
మొక్కినంత మాత్రాన్నే   ఆత్రాలన్నీ తీరు
వింతలెన్నొ సాంబయ్య నీ చెంతన
చింతలన్ని ఆర్పేను నీ నామ చింతన

 1.ముందూ వెనకా చూడవు
ఆగ్రహమొస్తే అసలే ఆగవు
అడ్డగిస్తే ఎవర్నైనా తలతెంచుతావు
భంగపరిస్తే మరున్నైనా దహియించుతావు
వీరభద్రునివై  కాలరుద్రునివై
శూల శస్త్రముతో జ్వాలనేత్రముతో

2.బూది బూసుకుంటావు
యోగ సమాధిలోన ఉంటావు
యాదిచేసుకోగానె వచ్చేస్తు ఉంటావు
ఏదడిగితే అది ఇచ్చేస్తు ఉంటావు
ఆలైనా ప్రాణాలైనా
పాశుపత అస్త్రమైనా పాశగత ఆయువైనా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

హక్కులంటే ఎంత ప్రీతి ప్రతి ఒక్కరికీ
బాధ్యతల ఊసే పట్టదు  జనాలకెవ్వరికీ
మినహాయింపే లేదు అమాత్యులైనా సామాన్యులైనా
ఓటేసే వరకే స్వీట్ మల్లన్న ఓటు వేసేసాక హేట్ మల్లన్న-బైకాట్ మల్లన్నా

1.ఆశయాలెన్నున్నా అవసరాల వరకే
ఎంతచదువుకున్నాగానీ తమభుక్తి కొరకే
అంతర్జాలంలో చిక్కుకుంది శిఖరాల నెక్కే యువత
రాంకుల పంట పండిస్తేనే ఔతుందా అది ఘనత
జాతీయత అన్నది ఎన్నడూ వినని బ్రహ్మపదార్థం
భారతీయత నాశించి భంగపడుటయే వ్యర్థం

2.అధికారమన్నదే అత్యంత ప్రాథమ్యం
పార్టీ ప్రయోజనాలైతే మరిమరి ముఖ్యం
డబ్బు -పదవి -డబ్బు అన్నదే ఓ విషవలయం
ఉఛ్చం నీచం అన్నవి రాజకీయాలలో మృగ్యం
ప్రజా సంక్షేమమే నేడు  ఓ నేతి బీరకాయ
అధినేతల చేతల్లో సర్వం సహా విష్ణుమాయ
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జయదేవుడు గ్రోలాడు నీ అందాల మకరందాన్నీ
కాళిదాసు రాసాడు నినుచూసే మేఘసందేశాన్నీ
అల్లసాని పెద్దన్న అల్లాడు పద్యాల్ని నీ వల్లనే
శ్రీనాథుడు వర్ణించిన రతిఆకృతి నీముందు కల్లనే
సహస్రదళ వికసిత సువర్ణ కమలం నువ్వు
గంధర్వ సంగీత అపూర్వ రాగస్వర సర్వస్వం నువ్వు

1.కలువలు ముకుళిస్తాయి నీ కనుల సింగారానికీ
 ఆవిరులే విరజిమ్ము విరులు నీ నయగారానికీ
భ్రమరాలు విభ్రములౌ నీ ముంగురుల అంగారానికీ
తారలు శశిని విడుచు నీమోము కోజాగరానికీ
విధాత అతులిత సౌందర్య శిల్పకల్పనా చాతుర్యం నువ్వు
అనన్య మానవ మానినీ సాదృశ ధన్యమాన్యవు నీవు

2.కిన్నెరసాని కన్నెరజేసింది నీ వయ్యారానికి
గోదావరి మ్రాన్పడిపోయింది నీగాంభీర్యానికి
క్రిష్ణవేణి విస్తుపోయింది నీ ఔదార్యానికి
భాగీరథి నివ్వెరపోయింది నీ నైర్మల్యానికి
షట్కర్మయుక్తగా సౌశీల్య వర్తిగా కీర్తిబడసినావు నీవు
సుగుణాల రాశిగా అనురాగరాగిణిగా వరలుతున్నావు

Saturday, March 7, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జీవితం క్షణక్షణం ఒక యుద్ధం -యుద్ధం యుద్ధం యుద్ధం
తలపడుటకు కావాలి సంసిద్ధం-సిద్ధం  సిద్ధం సిద్ధం
గోటితో పోయేవాటికి గొడ్డల్ని వాడక తప్పని అగత్యం
మాటనే ఈటెలా విసరడమే బ్రతుకున అనునిత్యం
నెగ్గడమూ తల ఒగ్గడమూ తప్పవన్నదే పరమసత్యం

1.అమ్మకడుపు చించుకరావడమే ఆది పోరాటం
పరీక్షలెన్నో ఛేదించుకుంటూ గెలుపుకోసం సంస్ఫోటం
సంసారాన్ని దిద్దుకొనుటలో సదా సర్వదా సంగ్రామం
ముసలితనంలో అనాయాస మరణంకై  రోగాలతో రణం
అనితరసాధ్యము అని అనిన కలగలసిన అనుభవాల తోరణం

2.మనుగడ కోసం అడుగు అడుగనా సమాజంతో సమరం
అర్హత ఉండీ అందుకొనుటకై అవకాశాలతొ కలహం
టికెట్టు పెట్టీ సుఖపయనంకై బస్సులొ రైళ్ళో జగడం
ఓట్లను వేసీ సదుపాయాలకు ప్రభుతతోను సమితం
నీలోనీకు నీతోనీకు నిమిషంనిమిషం ఎదలో సంఘర్షణం
https://youtu.be/lzrlcu-q5d8

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మధ్యమావతి

కౌసల్య పాడింది రామచంద్రునికీ లాలిపాట రామలాలి పాట
యశోద పాడింది బాలకృష్ణునికీ జోలపాట కాన్హా జోలపాట
ముక్కోటిదేవతలు మురిపెముగ పాడేరు నరసింహస్వామికి సేవపాట
 ఏకాంత సేవపాట పవళింపు సేవపాట
చిన్నారి నా కన్నా నా చిట్టి సుందర నిను నిదుర పుచ్చగ  పాడేను
రామలాలి పాట కాన్హా జోలపాట లాలిలాలి జోజో జోజో బజ్జో బేటా

1.గణపతికి పాడింది పార్వతమ్మ త్రిగుణాతీత లాలిపాట
కుమరయ్యకు పాడారు కృత్తికలంతా ప్రేమతొ లాలిపాట
అయ్యప్పకు పాడేరు స్వాములంతా హరివరాసన లాలిపాట
చిన్నారి నా కన్నా నా చిట్టి సుందర నిను నిదుర పుచ్చగ  పాడేను
రామలాలి పాట కాన్హా జోలపాట లాలిలాలి జోజో జోజో బజ్జో బేటా

2.జీజాబాయ్ పాడింది  వీరత్వమొలక శివాజీకి లాలిపాట
భువనేశ్వరి పాడింది ధీరత్వమొలక వివేకానందునికీ లాలిపాట
శారద పాడింది విశ్వశాంతి చిలుక రవీంద్రనాథునికీ లాలిపాట
చిన్నారి నా కన్నా నా చిట్టి సుందర నిను నిదుర పుచ్చగ  పాడేను
రామలాలి పాట కాన్హా జోలపాట లాలిలాలి జోజో జోజో బజ్జో బేటా

Thursday, March 5, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శివరంజని

ఎలా నమ్మగలను  నీ ఉనికే లేదంటే
నేనెలా ఒప్పుకోగలను నీకు మహిమ లేదంటే
అద్భుతాలన్నీ నీ చలవ వల్లనేగదా స్వామీ
విపరీతాల నిమిత్తము నీవెరుగనిదా ఏమీ
శరణాగతి నీవే తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరా
కరుణతొ మమ్మేలు అలమేలు మంగా పతీశ్వరా

1.ఆర్యోక్తి కదా దైవం మానుష రూపేణా
ఎందరిలానో నువ్వై చేసావు నిరూపణ
చూసే కనులకు స్వామీ సృష్టంతా నువ్వే
తలపోసే తపనల పరమార్థం ప్రభూ నువ్వే
శరణాగతి నీవే తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరా
కరుణతొ మమ్మేలు అలమేలు మంగా పతీశ్వరా

2.అనుభవాల గుణ పాఠాలెన్నో నేర్పేవు
గతితప్పే మమ్ముల సన్మార్గానికి చేర్చేవు
సుఖ దుఃఖాల వలయంలో స్వామీ మము తిప్పేవు
నిను తెలుకునేటంతలో ఏదో మాయను కప్పేవు
శరణాగతి నీవే తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరా
కరుణతొ మమ్మేలు అలమేలు మంగా పతీశ్వరా






Friday, February 28, 2020


https://youtu.be/82jVZmm2Q98?si=xKOdmdD8h2VKyqBy

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: శివరంజని

పంచాక్షరి జపించెద పరమశివా నీ పంచన జేర్చరా-ఓం నమఃశివాయ
అష్టాక్షరి స్మరించెద హరీ కష్టములెడబాపరా ఓంనమో నారాయణాయ
రామనామమే భజింతు హనుమా సరగున ననుబ్రోవరా
నాదోషము లెంచకా ప్రేమతో గ్రహించరా అనుగ్రహించరా

1.నేనర్భకుడిని నాకు దుర్భరమాయే ఈ మాయ బ్రతుకు
దుర్భల హృదయుడిని చంచలపరచకు నా మనసు
పుండుమీది పుట్రలాగ నా వెతలకంతేలేదా
శిక్షనా పరీక్షనా నీ చేష్టల పరమార్థమేదో కదా
రామనామమే భజింతు హనుమా సరగున ననుబ్రోవరా
నాదోషము లెంచకా ప్రేమతో గ్రహించరా అనుగ్రహించరా

2.క్రూరాతి క్రూరులూ అనుభవించలేదీ తీరు ఈ భవిలో
నీచాతి నీచులూ ఈ విధి యాతన నెరుగరు ఈ సృష్టిలో
ఏ జన్మలోనో ఈ జన్మలోనే చేసితినేమో ఏ ఘోరనేరమో
ఉద్ధరించుస్వామీ పశ్చాత్తపమే ప్రాయశ్చిత్తమౌనేమో
రామనామమే భజింతు హనుమా సరగున ననుబ్రోవరా
నాదోషము లెంచకా ప్రేమతో గ్రహించరా అనుగ్రహించరా

Wednesday, February 26, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలక్కామోద్

బాబా నువు చాటిన బోధలేమిటి
సాయీ నువు తెలిపిన తత్వమేమిటి
అంతరార్థము నొదిలి ఆర్భాటలకై వెంపర్లాట
పరమార్థమే మరచి ఐహిక సౌఖ్యాలకై వింతవేట

1.వెలిసాయి ఎన్నెన్నో నీ మందిరాలు
తిలకించగ గుడులన్నీ బహు సుందరాలు
దర్శించినంతనే కోవెల ప్రతి గురువారాలు
దక్కునా పిచ్చిగాని కోరే గొంతెమ్మ వరాలు
మనశ్శాంతి దొరికేదే బాబా నీ ఆలయం
ముక్తిదారి చేర్చునదే సాయీ దేవాలయం

2.అభిషేకమేలా ఆదరించమన్నావు దీనులను
హారతులవి యేలా ఆచరించమన్నావు నీ సూక్తులను
పల్లకీ సేవకంటె పట్టెడంత పెట్టమన్నావన్నార్తులకు
భజనకీర్తనకంటే భుజంతట్టమన్నావాపన్నులకు
మానవత్వమే బాబా నీ దివ్య బోధన
ప్రేమతత్వమే సాయీ నీ తత్వ సాధన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వ్యక్తిగా ప్రతిమనిషికీ ఎంతో మంచితనం
ఏ రంగులో పులుముకుంటేనే నీచగుణం
మారుతాడు అవసరాలకై ఊసరవెల్లిలాగా
అవకాశవాదౌతాడు గోడమీది పిల్లిలాగా

1.భూతద్దం తోటి వెదికినా గోచరించదు మానవత
ఆశిస్తే ఎంతటి వింత ఎదల్లో భారతీయత
మతం బురఖాలోనా అభిమతం గొంతునొక్కి
కులం బంధిఖానాలో వ్యక్తిత్వం తొక్కిపెట్టి
బ్రతుకీడ్చుతుంటారు మర మనుషులుగా
మనగలుగుతుంటారూ  జీవశ్చవాలుగా

2.శీలవర్తన ఫణం పెట్టి దిగజారుతారు పదవి కోసం
విలువలన్ని పక్కనెట్టి ఎగబాకుతారు పడతి కోసం
కూడబెడతారు సంపద ఏ దొంగ గడ్డో కఱచి
కీర్తి బడసేరు తేరగా అడ్డదారులనెన్నొ కడచి
కొండంత కోరుతారు గోరంత కృషితోనే
స్వర్గానికెగసేరు ఉట్టైనా కొట్టని శ్రమతోనే

Tuesday, February 25, 2020


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చంపకే చంపక మాలా
ఊరించకే ఉత్పలమాలా
చూపుల్లో తూపులు వర్షించి
పెదవుల్లో మధువులు హర్షించి
ఎంత శ్రధ్ధ తీసుకున్నాడో ఆ బ్రహ్మ
అద్భుతంగ మలిచాడే నీ బొమ్మ

1.దేశాధినేతలైనా తలవంచుతారే  నీ ప్రేమ కోసం
రాజాధిరాజులైనా దాసోహమంటారే నీ పొందు కోసం
కనీవినీ ఎరుగని సౌందర్యం సృష్టిలో నీ సొంతం
నభూతోన భవిష్యతీ నీ  అసమాన లావణ్యం
ఎంత శ్రధ్ధ తీసుకున్నాడో ఆ బ్రహ్మ
అద్భుతంగ మలిచాడే నీ బొమ్మ

2.గణాంకాలు పొంకాల్లో అనల్ప శిల్ప నిర్మాణం
కుంచె దించిన వంపుల్లో అపూర్వ చిత్ర నైపుణ్యం
గుణగణాల పరిగణలో పతివ్రతల సమతుల్యం
తార్కికమౌ వాదనలో అతులిత మేధా చాతుర్యం
ఎంత శ్రధ్ధ తీసుకున్నాడో ఆ బ్రహ్మ
అద్భుతంగ మలిచాడే నీ బొమ్మ

Sunday, February 23, 2020

"గెలుపు బా(పా)ట"

ఆశ బ్రతుకు నిస్తుంది
తపన వెన్నుతడుతుంది
జీవన్మరణ ఘర్షణలో
మనుగడకై పోరులో
ఆశయం స్ఫూర్తి నిస్తుంది
సంకల్పం గెలుపునిస్తుంది

1.ఈత నేర్చుకోలేక చేపకు గతిలేదు
రెక్కవిప్పుకోకుంటె పిట్టకు దిక్కులేదు
కూడబెట్టుకోకుంటె చీమకు భవితలేదు
ఉపాధి కనుగొనక యువతకు మారులేదు
సాధన పెంచుతుంది ప్రావీణ్యం
పట్టుదలే తుంచుతుంది ప్రతిదైన్యం

2.తోకతెగిన బల్లైనా వెనుకడుగే వేయదు
మూతికాలి పిల్లీ తన యత్నం మానదు
సూక్ష్మప్రాణి దోమకూడ వేటాడుటనాపదు
ఏదో ఒక మిషతొ యువత ఊసూరుమన తగదు
కంటకాల బాటే జీవితమంటే
ఓటమే ఓడుతుంది మనోధైర్యముంటే

Saturday, February 22, 2020

https://youtu.be/5YfRYczs7nM

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:అభేరి

ఈప్సితార్థ దాయకా ఈశ్వరా
సత్వర వరదాయకా పరమేశ్వరా
క్లేశనాశకా కేశవ ప్రియబాంధవా
ఆశేషైకలోకేశా సువిశాల హృదయా
విశ్వేశా విశేష దైవమా నమఃశివాయ

1.సప్తమహా ఋషీశ్వర సహా మునిజన వందితా
నందీ భృంగ్యాది సపరివార సమేత  సంసేవితా
గణపతీ సేనాధిపతీ సతిపార్వతీ నిజ పాలకా
దేవ యక్ష కిన్నెర గంధర్వ సర్వభూత సంపూజితా
విశ్వేశా విశేష దైవమా నమఃశివాయ నమఃశివాయ

2.గజాసుర రావణాది దైత్య భక్త నిత్యార్చితా
సిరియాళ మార్కండేయాది సిసు ప్రాణ ప్రదాయకా
పాండవ మధ్యమ పార్థార్థ పాశుపతాస్త్రదాయకా
కిరాతావతార గైరిక నేత్రహర మోక్షప్రాప్తికారకా
విశ్వేశా విశేష దైవమా నమఃశివాయ నమఃశివాయ

OK

ఆరు ఋతువుల ఆరంభం ఉగాది
ఆరు రసముల ఆస్వాదం ఉగాది
తెలుగువారి తొలి సంబరం ఉగాది
ఉగాదిరాకతో పులకించు తెలుగువారందరి మది


1.వసంతం ప్రసాదించు తీయని మకరందం
గ్రీష్మం స్ఫురింపజేయు కారపు హాహాకారం
వర్షం కరిగించి మట్టిని కడలిజేర్చు లవణసారం
శరత్తు మత్తుల్లో వలపు వగరు శృంగారం
హేమంత  మిథున పరిష్వంగం ఆమ్లకాసారం
శిశిర విరహ వేదనలో వయసు వగచేదయ్యే వివరం

2.మన సు కవుల కవనంలో సాహితీ సౌరభం
ఆమ్ర తరుల వనంలో పికగాన మాధుర్యం
పంచాగ శ్రవణంలో కలగాపులగ భవితవ్యం
పంచభక్ష్య పరమాన్నాల భోజన సౌఖ్యం
దైవ దర్శన సౌభాగ్యంలో భక్తి పారవశ్యం
ఇంటిల్లిపాది సందడితో  ఆనందాల నృత్యం



విలపించనీ నన్ను బోరుబోరున
దుఃఖించనీ నన్ను ఎద భారం తీరేలా
కన్నీటి సంద్రమంతా ఇంకిపోయేలా
గుండెలోని తడియంతా ఆరిపోయేలా

1.నింగికెంత స్వేఛ్ఛ వానగా కురియడానికీ
నీటికెంత స్వేఛ్ఛ ఆవిరై మురియడానికి
గాలికెంత స్వేఛ్చ ఇఛ్ఛగా విహరించడానికి
నేలకెంత స్వేఛ్ఛ తానుగా కరగడానికీ
ఉగ్గబట్టిన వేదనంతా ఉబికివస్తోంది
బిగబట్టిన యాతనంతా బ్రద్దలైపోదోంది

2.గోటిచుట్టు నొప్పెంతో ఘోరమైనది
దానిపై రోకటిపోటు అతిదుర్భరమైనది
ఆపైన కారంపోస్తే ఆ తీవ్రత చెప్పరానిది
అదేచోట చురకతాకితే అదేకదా నరకమన్నది
ఇంతటి కష్టమైనా అనుభవించు ఆనందంగా
కట్టేసికొట్టినప్పుడు భరించే చందంగా

Friday, February 21, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కేవల పంచాక్షరీ మహామంత్రం
కైవల్యసాధనకు సామీప్య సూత్రం
కైలాస నాథుని నామజపం
కైవసమొనరించును శివరూపం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

1.ఆద్యంతమే లేనీ మహాలింగం
ఉద్భవించే శివరాత్రి పర్వకాలం
ఆధిపత్యపోరులో హరి బ్రహ్మలు
గెలుపుకై తపించిరి అహర్నిశలు
తుదినెరుగ ఎరిగినాడు హంసగా విధి
మొదలేదో వెదకబూనె ఆదివరాహమూర్తి
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

2.పరాశక్తి తోనే పరాచికాలాడి
శాపగ్రస్తులైనారు విరించీ విష్ణువులు
మహాదేవుడొక్కడే అఖిలాండకోటికి
తపోధనులు మాత్రమే చేరెదరాచోటికి
శివరాత్రి ఉపవాసం రేయంతా జాగారం
అత్యంత సులభముగా చేర్చేను భవతీరం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:యమన్ కళ్యాణి

తేనెలొలుకు తెలుగు భాష-
కస్తూరి సౌగంధి  కన్నడము
భావగాంభీర్యం ఉర్దూ భాష
సాక్షాత్తు దేవభాష సంస్కృతము

కన్నతల్లి వంటిదే మన అందరి మాతృభాష
భాష ఏదైనా నినదించును హృదయ ఘోష

వందనాలు వందనాలు  భాషామతల్లికీ
నా గానచందనాలు వాక్కు కల్పవల్లికి

1.అమ్మ ఆది గురువుగా భాష ఒంటబడుతుంది
పురజనుల వాడుకతోనే అది బలపడుతుంది
ప్రథమ భాషగా ఎల్లరకు బడిలొ నేర్పబడుతుంది
సాహితీ విలువలతో లెస్సగ వెలుగొందుతుంది
వందనాలు వందనాలు  భాషామతల్లికీ
నా గానచందనాలు వాక్కు కల్పవల్లికి

2.గద్యమై పద్యమై హృద్యమై వరలుతుంది
గేయమై గీతమై మదిని రంజింప జేస్తుంది
లఘురూప కైతగా వచనంగా అలరింపజేస్తుంది
నానుడి పలుకుబడులతో అక్షరమౌతుంది
వందనాలు వందనాలు  భాషామతల్లికీ
నా గానచందనాలు వాక్కు కల్పవల్లికి
https://youtu.be/BPRTvT5-0P8

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నంది వాహన నాగభూషణా నమఃశివాయ
మహాదేవ మదనాంతకా నమఃశివాయ
శంభో శంకర సాంబ సదాశివ నమఃశివాయ
వామదేవా వ్యోమకేశా విశ్వేశ్వరా నమఃశివాయ
యతిరాజా యమాధిపా యుగాంతకా నమఃశివాయ

1.నగవుల సరిగమ నర్తన తకధిమి నమఃశివాయ
మగనిగ  సగము మగువగ సగము నమఃశివాయ
శిరమున నెలవంక సిగను గంగ దుంక నమఃశివాయ
వాసిగ వారణాసి వసించెడి విశ్వనాథా నమఃశివాయ
యమ నియమాది యోగ ప్రదాయక నమఃశివాయ

2.నగజా ప్రియపతి ప్రమథాధిపతీ నమఃశివాయ
మృత్యుంజయ మహేశ్వరా ముక్కంటీ నమఃశివాయ
శరణాగతావన బిరుదాంకితా శూలధరా నమఃశివాయ
విషకంఠా విరూపాక్షా వైద్యనాథా నమఃశివాయ
యాచితవరదాయక నిత్య యాచకా నమఃశివాయ

OK

OK

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అందాల నావా అనురాగ నావా
కలల సౌధాలనే కూల్చేసినావా
కడలి నడుమ నన్ను దించేసినావా
కన్నీటి లోనే ముంచేసినావా
నవ్వాలో ఏడ్వాలో తెలియడమే లేదు
బతకాలో చావాలో నిర్ణయించుకోలేను
నవ్వాలో ఏడ్వాలో తెలియడమే లేదు
బతకాలో చావాలో నిర్ణయించుకోలేను


ఇందుకే నా బ్రతుకులోకి తొంగి చూసినావ
ఊరించి ఊరించి అందకనే మరుగైనావా
చిందర వందరైంది పండంటి జీవితం
గందరగోళమైంది మానస సరోవరం
నవ్వాలో ఏడ్వాలో తెలియడమే లేదు
బతకాలో చావాలో నిర్ణయించుకోలేను

అందాల నావా అనురాగ నావా
కలల సౌధాలనే కూల్చేసినావా
కడలి నడుమ నన్ను దించేసినావా
కన్నీటి లోనే ముంచేసినావా
నవ్వాలో ఏడ్వాలో తెలియడమే లేదు
బతకాలో చావాలో నిర్ణయించుకోలేను

నీ మట్టుకు నీకుదొరికె బంగారు భవితయే
పనిగట్టుక  ఆడినట్టు విధివింతనాటకమాయే
ఆశే అడియాసవగా అనునిత్యం నరకమాయే
కవితల భావనంతా విషాద పర్వమాయే
నవ్వాలో ఏడ్వాలో తెలియడమే లేదు
బతకాలో చావాలో నిర్ణయించుకోలేను

అందాల నావా అనురాగ నావా
కలల సౌధాలనే కూల్చేసినావా
కడలి నడుమ నన్ను దించేసినావా
కన్నీటి లోనే ముంచేసినావా
నవ్వాలో ఏడ్వాలో తెలియడమే లేదు
బతకాలో చావాలో నిర్ణయించుకోలేను

Thursday, February 20, 2020

https://youtu.be/AIkILZL4LIo

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాయా మాళవగౌళ

ఇల్లూ పట్టూ లేదు నీకు శివుడికిమల్లే
ఊరూపేరు లేదు నీకు ఆదిభిక్షువోలే
శిథిలమైన మసీదే నీ నివాస విలాసము
శితికంఠుని వాసము స్మశానము కైలాసము
షిరిడీ సాయిగా పిలుచుకుంటున్నాము
కులమతరహితంగా కొలుచుకుంటున్నాము
సాయిరాం శివసాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం

1.కనికట్టు చేసేటి గారడివాడవు
మైకంలో ముంచెత్తే మత్తుమందువు
వదలుకోలేనీ సవ్య వ్యసనానివి నీవు
సంతృప్తినీయనీ దివ్య అశనానివి నీవు
తెలిసీ నీమాయలో పడుతున్నాము
సమయమంత నీ సేవలొ కోల్పోతున్నాము
సాయిరాం శివసాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం

2.ఏమిస్తే మాత్రమేమి ఏమీ పట్టనపుడు
ఏంత చేసి లాభమేమి పట్టించుకోనపుడు
రెండురూకలే లంచంగా  అడుగుతావు
శ్రద్ధా సహనాలనే ఎంచి తెలుపుతావు
వంచితి నాతల నీ పాదాలు తాకునట్లు
వంచనచేయబోకు ప్రపంచమే నమ్మనట్లు
సాయిరాం శివసాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం

OK

Wednesday, February 19, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:అమృతవర్షిణి

నేలమీది జాబిల్లీ అమృతవల్లీ
అప్పుడే విరిసిన లిల్లీ నా కల్పవల్లి
నన్ను చంపమాకే నీ చూపుల్తో గిల్లీ
నిను చూడ మనసాయే నవ్వుల సిరిమల్లి

1.ఊహల్లో ఉండిపోక ప్రత్యక్షమైనావే
కావ్యాల్లో బంధిస్తే కంటిముందు కొచ్చావే
ముజ్జగాలు నాకొరకే వెదికి వెదికి వచ్చావో
సరిజోడగు రారాజునేనని నన్నే నువు మెచ్చావో

2.మేనక నను కోరివస్తె ఆనక రమ్మన్నా
ఊర్వశి ఊరించబోతే వలదుపో పొమ్మన్నా
రంభ నన్ను రమ్మంటే కుదరదింక లెమ్మన్నా
అమృతాన్నందించే నవమోహిని కలగన్నా -
అది నీవే నీవే నీవేనని తెలుసుకున్నా
సంగీతం  అమృతమే
మధురగానం నవరసభరితమే
అనుభూతులనే అనువదించగ
సరస హృదయాలే ఆస్వాదించగ -ఆనందించగా

1.షడ్జమ రిషభ గాంధార మధ్యమ
పంచమ ధైవత నిషాదాలు నర్తించ
మానస వీణ ఊపిరి శ్రుతిలో
ఎదస్పందనల క్రమయుత లయలో
శతకోటి రాగాలు పల్లవించగా
అనంతమౌ భావాల వెల్లి విరియగా-జగతి మురియగా

2.పరమ శివుని రచనలో సంగీతశాస్త్రమై
నటరాజ నర్తనలో లయ విణ్ణానమై
వేణుధరుని అధరాల సుధామాధుర్యమై
శ్రీ వాణీ వీణియలో మంద్రస్వర నాదమై
నారద తుంబురు వాదనైకవేద్యముగా
శిశు పశు నాగాదుల రసనైవేద్యముగా-మనో వైద్యముగా

Tuesday, February 18, 2020

https://youtu.be/ClVUaCdYMvY

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:సారమతి

ఏమిటి నీమాయ-మా కన్నులు మూయ-అమ్మా అమృత హృదయ
గజిబిజి మాకేలా- తికమక లివియేల- జననీ నీ లీలా
నిను తెలియగ మేమెన్ని -ఎత్తాలో జన్మల్ని
నిను అరయగ మేమెన్ని చేయాలో తపములని
శ్రీ చక్ర సింహాసినీ శ్రీ లలితే జగన్మోహినీ  నమో మోక్షదాయినీ

1.జననాలు మరణాలు సంక్లిష్ట జీవనాలు  నీకేళీవిలాసాలు
ఖేదాలు మోదాలు నాదేయనువాదాలు నీ క్రీడా వినోదాలు
ప్రేమలు పెళ్ళిళ్ళు ఈ గందర గోళాలు నీ లీలా విశేషాలు
ఈ నాటకరంగానికి తెఱదించవె ఇకనైనా
నీపద సదనానికి మముచేర్చవె ఇపుడైనా
శ్రీ చక్ర సింహాసినీ శ్రీ లలితే జగన్మోహినీ  నమో మోక్షదాయినీ

2.ఈ భవబంధాలు తనపర భేదాలు ఛేదించగ దయగనవే
ఈ రాగద్వేషాలు  ఈ మోహపాశాలు తొలగించి వేయవే
అజ్ఞానకృత దోషాలు అహంభావ వేషాలు పరిమార్చవే
ఆత్మదేహ భావననిక అవగతమొనరించవే
విశ్వైక్య మొందించగ అవనతమొందించవే
శ్రీ చక్ర సింహాసినీ శ్రీ లలితే జగన్మోహినీ  నమో మోక్షదాయినీ
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నువ్వంటే నాకు ఆరాధనే
నేనంటె నీకు అనురాగమే
ఇరు హృదయాల్లో ప్రేమ భావనే
మన ఇద్దరి సంగమం రసగాథనే
ప్రేమ ఉన్నచోటని భువిపైకి వచ్చాము
ప్రేమతో బాటే దివి చేరిపోతాము

1.కాలమనే నదిలోనా బ్రతుకుతున్న జలపుష్పాలం
విధివిసిరిన వలపుల వలలో ఎలాగో చిక్కుకున్నాం
మిథునరాశి చేరుకున్నాం మీనరాశినొదిలేసీ
రతిరీతులు నేర్చుకున్నాం ప్రణయ కృతులు చదివేసీ
ప్రేమ ఉన్నచోటని భువిపైకి వచ్చాము
ప్రేమతో బాటే దివి చేరిపోతాము

2.ఖంబు నీవు కడలిని నేను కలుసుకున్నాం దిక్చక్రాన
ఎండ నేను వానవు నీవు జతగూడాం ఇంద్ర ధనసున
స్వప్నలోకాలన్నీ మనవే సాంగత్యజీవితాన
మిథ్యా జగత్తూ మనదే దాంపత్య గమనాన
ప్రేమ ఉన్నచోటని భువిపైకి వచ్చాము
ప్రేమతో బాటే దివి చేరిపోతాము

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

తొలినాడు బుడిబుడి అడుగై
కడదాకా తడపని గొడుగై
కనిపించని కన్నీటి మడుగై
ముఖాన మఖ్మల్ తొడుగై
నాన్న నాన్న -నాన్న మనసు వెన్న
నాన్న నాన్న-ఎప్పటికీ నాన్నే మిన్న

1.గాంభీర్యం మాటున గారాబమెంత ఉందో
క్రమశిక్షణ పేరునా గుండె రాయైపోయిందో
ప్రశంసిస్తె ప్రగతికి చేటని గొంతు పెగలకుండిందో
దుబారాను కట్టడిసేయ మనసెంత గోలిందో
నాన్న నాన్న  -నాన్న మనసు వెన్న
నాన్న నాన్న -ఎప్పటికీ నాన్నే మిన్న

2.భవిష్యత్తు అవసరాలకై ప్రాణమే ఫణమైందీ
చికిత్సనే దాటవేయ హృద్రోగ మరణమైంది
వండి వండి వంటల మంటకు దేహమే మాడింది
అచితూచి వేసిన అడుగు కుటుంబాన్ని కాచింది
నాన్న నాన్న  -నాన్న మనసు వెన్న
నాన్న నాన్న -ఎప్పటికీ నాన్నే మిన్న

Monday, February 17, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఏమీ చేయగలేను-చూస్తూ ఊర్కోలేను
కనలేను నిను నే పరదానిగా
మనలేను నేనూ ఒకమోడుగా
తీరని ఆశే ఉరిత్రాడుగా

1.ఆకాశానికి నిచ్చెనవేసి-దివి చేరాలని కలగన్నాను
అందాల జాబిలి పొందాలనుకొని-అందనిదానికి అర్రులు సాచాను
మేను మరచిన నేనూ-నిప్పై రగిలాను
నిజము నెరిగిన వేళా-నివురై మిగిలాను

2.ఏడేడు జన్మల బంధానికై-ఎన్నాళ్ళుగానో ఎదిరి చూసాను
మూడుముళ్ళ అనుబంధానికి-యవ్వన మంతా ధారపోసాను
శిల్పాలు శిథిలాలుగామారితే-చిత్తరువైనాను
బాష్పాలు రుధిరాలుగా పారితే-విస్తుపోయాను
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఆసరా అవసరమే వృద్ధాప్యంలో
ఆలంబన ముఖ్యమే ముదిమివయసులో
మేలుకో తమ్ముడా యువకుడిగా ఉన్నపుడే
చేరిపో అటల్ పింఛన్ పథకంలో ఇప్పుడే

1.చేరువలోనే  తెలంగాణ గ్రామీణ బ్యాంకు
అది అందుబాట్లొ ఉండడమే మన అందరి లక్కు
ఆదరించి పంచేరు సిబ్బంది చిరునవ్వులు మనకు
వివరించి తెలిపేరు వివరాలు  ఖాతాదారులకు
మేలుకో తమ్ముడా యువకుడిగా ఉన్నపుడే
చేరిపో అటల్ పింఛన్ పథకంలో ఇప్పుడే

2.వయసు పరిమితి పద్దెనిమిది నుండి నలభైవరకు
ఆధార్ కార్డు మొబైల్ నెంబరుంటె చాలు అర్హతకు
వేయి నుండి ఐదువేలు అందేలా ఎంచుకో ఫించన్కు
సగం  నీవు చెల్లిస్తే చందా సగం భరించు సర్కారు తనవంతుకు
అరవయేళ్ళు దాటాక అందుకో పింఛన్ దర్జాగా
జీవిత భాగస్వామికి సైతం బ్రతుకంతా ఆర్జనగా
అర్థాంతరంగా అంతమైంది  ప్రేమగాథ
మూడునాళ్ళ ముచ్చటగా ముగిసింది మా కథ
ఆదిలోనె హంసపాదెదురయ్యందీ
పురిటిలోనే శిశువుకాస్త మృతిచెందింది
ప్రణయకావ్యాలన్నీ విషాదాంతమే
మనిషికి ఊరట ఎప్పటికీ వేదాంతమే

1.ఎందుకు ఏర్పడిందొ చిత్రమైన పరిచయము
ఎలా పరిణమించిందో ఈ వింత బంధము
ఊహల హంసనెక్కి  దిగంతాలు విహరించింది
కల్పన తల్పముపై స్వర్గాలు చవిచూసింది
అంతలోనె మాయమైంది నేస్తం ఇంద్రచాపమోలే
ఇట్టే కరిగింది నా సమస్తం మంచుశిల్పమల్లే

2.రహదారి కాస్తా అడవిలోకి చేర్చింది
తీతువొక్కటేదో తలపైన ఎగరింది
వెనుదిరిగి చూసుకుంటే త్రోవమూసి ఉన్నది
ఏమీ చేయలేక దిక్కుతోచకున్నది
ఆకలితో అలమటించి కడుపు మండుతున్నది
దప్పికతో పరితపించి గొంతు ఎండుతున్నది

Sunday, February 16, 2020


https://youtu.be/-Nd2EGV2bdQ"

నమఃపార్వతీ పతయే హరహరా
భక్త   వశంకరా   భక్తవ శంకరా
గంగాధర వరా మనోహర హరా
కైలాసపురాధీశ శ్రీ రామ లింగేశ్వరా
ఇహపర సుఖకరా నిత్య శుభంకరా

1.జటదారీ  నటేశ్వరా హఠయోగీశ్వరా
మకుటశశిధరా కటిచర్మాంబరధరా
లలాట నేత్ర ప్రస్ఫురా నిటల భస్మాలంకారా
త్రిశూల ఢమరు పటతర అలవరా
కైలాసపురాధీశ  శ్రీ రామ లింగేశ్వరా
ఇహపర సుఖకరా నిత్య శుభంకరా

2.దక్షాధ్వర నాశకరా త్రిపురాసుర సంహారా
భిక్షావృత్తి స్వీకృత పుర సంచారా కపాలధరా
శరణాగత సంరక్షక బిరుదాంకిత విరూపాక్షా
ఉక్షధ్వజ మోక్షకారకా వృషపర్వా శర్వా
కైలాసపురాధీశ శ్రీ రామ లింగేశ్వరా
ఇహపర సుఖకరా నిత్య శుభంకరా

3.శివరాత్రి పర్వ సంభవా భూరీ భవానీ విభో
అభయప్రద ఐశ్వర్యదాయకా మహాలింగ శంభో
కాలకూటవిషసేవిత నీలకంధరా ప్రపంచేశ్వరా ప్రభో
నాగభూషణా వృషభవాహనా స్వామీ స్వయంభో
కైలాసపురాధీశ శ్రీ రామ లింగేశ్వరా
ఇహపర సుఖకరా నిత్య శుభంకరా

OK

Saturday, February 15, 2020

https://youtu.be/b8nxAxKXtPU

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:హంసానంది

కన్నులు కాయలు కాచాయి అదేదో వింత అనుభవం
అనుక్షణం  నీకై వేచాయి ఇదేదో కొత్త లక్షణం
నువ్వెలా ఉన్నావో నీ సంగతి  ఎరుగనైతినే
నన్ను తలిచేవో లేదో నిన్నెప్పుడు మరువనైతినే

1.ప్రేమ అంటె ఏమిటో కాసింత రుచిచూపావు
విరహాన్నీ వెనువెంటే పరిచయం చేసావు
తీయనైన వేదనలోకి నిర్దయగా నను తోసావు
మోయలే నంతబరువుగా నా గుండెను మార్చేసావు
నీకెలా ఉంటుందో  నీ సంగతి  ఎరుగనైతినే
నన్ను తలిచేవో లేదో నిన్నెప్పుడు మరువనైతినే

2.సుఖంగా ఉండేవాడిని సుడిలోకి నెట్టేసావు
హాయిగా మసలేవాడిని అలమటింపజేస్తున్నావు
కలయికలే కలలైపోగా కన్నీరు వరదైసాగే
చెవిని ఆనించు నా ఎదపై నీ పేరే మారుమ్రోగే
నువ్వెలా స్పందిస్తావో నీ సంగతి ఎరుగనైతినే
నన్ను తలిచేవో లేదో నిన్నెప్పుడు మరువనైతినే

https://youtu.be/HI44BUl4LDA?si=6ozWikibjQ44Jr_t


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:చక్రవాకం

పాటగా మారిపోతా-పరవశాన్ని పంచిపెడతా
నేనుగా శూన్యమైపోతా-ఎద ఎదలో చొరబడతా
చిరంజీవిగా చిరకాలం-సిద్ధించగా అమరత్వం

1. నానుతాను  పాటగా ఆనోట ఈనోట
వినబడుతు ఉంటాను ఎక్కడో ఒకచోట
ఏ పుట్టిన రోజులోనో బృందగానమౌతా
ఏ గుడి మంటపమందైనా భజనగా సాగుతా
ప్రగతిదారి చూపెడుతా దేశభక్తి తలనిడుతా
చిరంజీవిగా చిరకాలం-సిద్ధించగా అమరత్వం

2.సంగీత పోటీల్లో బహుమతినే తెస్తాను
గాత్ర కచ్చేరీల్లో కీర్తనగా అలరిస్తాను
ఏ సభలోనో స్వాగతమై వినబడుతా
ఏతల్లి జోలగానో పసిపాపను జోకొడతా
సాంత్వన ప్రకటిస్తాను మనసునూరడిస్తాను
చిరంజీవిగా చిరకాలం-సిద్ధించగా అమరత్వం

https://youtu.be/ABJY8KcJcHo

ఎంతటి గౌరవముంది భారతనారికి
మరెంతటి మన్నన ఉంది హైందవ మానినికి
జగన్మాతగా పూజలందుకొంటుంది
ఆదిపరాశక్తిగా విజయమొసుగుతుంటుంది

1.చీరకట్టు నుదుటన బొట్టు ఆకట్టు
కాటుకెట్టు కన్నల్లోనా ఎంతటి కనికట్టు
ముక్కున  ముక్కెరే మదినొడిసిపట్టు
చెవులకు గున్నాలే చకితుల్ని చేసేట్టూ
ఎదురవ్వగానే పవిత్రతే భాసించేట్టూ
జగన్మాతగా పూజలందుకొంటుంది
ఆదిపరాశక్తిగా విజయమొసుగుతుంటుంది

2.చూసిచూడగానే దేవతగా అనిపించేట్టూ
సన్నటి నవ్వుల్లో మల్లెలు కురిపించేట్టూ
కన్నులనుండి వెన్నెల్లు ప్రసరించేట్టూ
మాటల్లొ సుధలెన్నో ఒలికించేట్టూ
ఎదురవ్వగానే పవిత్రతే భాసించేట్టూ
జగన్మాతగా పూజలందుకొంటుంది
ఆదిపరాశక్తిగా విజయమొసుగుతుంటుంది

Friday, February 14, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం: తోడి

చేసిందే చెప్పడం చెప్పేదే చెయ్యడం
ఎంతగొప్పనైనదీ సత్యవ్రతము
ఆచరణకు కఠినము సాధనతో సరళము
సత్యదీక్ష సృష్టిలో పరమోత్కృష్టము

1.కష్టమెంత వచ్చినా ఆడితప్పలేదు
అలనాడు హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు
ఇచ్చినమాటకై ఇడుములు బడిసాడు
ఇక్ష్వాకు రామచంద్రుడు శ్రీ రామచంద్రుడు
వ్యక్తిత్వపు కొలమానం సత్యభాషణం
ఆచంద్రతారార్కం ఆ మహనీయుల తార్కాణం

2.ఎంతటి చేదైనా సరె నిజాన్ని వదలలేదు
జాతిపిత గాంధీజీ మహాత్మా గాంధీజీ
నిప్పులా కాల్చేదైనా ఆయుధమౌ వాస్తవం
కలిగించును నిర్భయం పురికొల్పును ధైర్యం
తడబడే పనిలేదు తలవంచే స్థితిరాదు
ఆత్మాభిమానమెపుడు చెక్కుచెదరదు

OK

https://youtu.be/xtWsK_81TJk

ఢమఢమఢమ ఢమఢమఢమ ఢమరుకమై ధ్వనిస్తోంది నా గుండె
ఝణఝణఝణ ఝణఝణఝణ జాగృతమై క్వణిస్తోంది నీ అందె
ఆడరా నటరాజా దిగంతాలు అదరగా
నర్తించరా నటేశ్వరా ధూర్తులంత బెదరగా

1.యోగివనుకొని చెలరేగుతున్నారు దుర్మార్గులు
విరాగివనుకొని విర్రవీగుతున్నారు దుష్కృతులు
జడలను విదిలించి జఢతను వదిలేసి చిందులు తొక్కరా
పదములు కదిలించి పథమును సవరించగా నీవే దిక్కురా

 2.అర్ధనారివనుకొని ఆగడాలు సాగింతురక్రమార్కులు
భోళాహరుడవని మితిమీతున్నారు వికృత మూర్ఖులు
ముక్కన్నెఱ జేసి ముక్కెర సరిజేసి తాండవమాడరా
సతినెడబాయగా దక్షుని దునిమినట్లు క్షితిరక్షణ జేయరా

Thursday, February 13, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ప్రేరణలోని ప్రే అనే అక్షరం 
మనుషిలోని మ అను అక్షరం
రెండింటి మేలు కలగలుపే ప్రేమా
ప్రేరణ మనిషికి కలిగించేదే  ప్రేమా
ప్రపంచమంతా మనగలిగేది ప్రేమా
యుగాంతాలకూ చనగలిగేదే ప్రేమా
ప్రేమా ప్రేమా లవ్ యూ  ప్రేమా
ప్రేమా ప్రేమా లైఫ్ యూ  ప్రేమా

1.ప్రేమకు పట్టంకట్టారు రాధా కృష్ణులు
ప్రేమకు అర్థం తెలిపారు గౌరీశంకరులు
ప్రేమే పెన్నధి శకుంతలా దుష్యంతులకు
ప్రేమే పరీక్ష ఐనది నలదమయంతులకు
ప్రపంచమంతా మనగలిగేది ప్రేమా
యుగాంతాలకూ చనగలిగేదే ప్రేమా
ప్రేమా ప్రేమా లవ్ యూ  ప్రేమా
ప్రేమా ప్రేమా లైఫ్ యూ  ప్రేమా

2.రామాయణ మూలం కపోతాల ప్రణయం
కురుక్షేత్ర సంగ్రామం మమకార రాహిత్యం
జాతిని మరచినవైనం శుకశారిక సాంగత్యం
ఎన్నడుచేరని తీరం నింగీనేలా అనురాగం
ప్రపంచమంతా మనగలిగేది ప్రేమా
యుగాంతాలకూ చనగలిగేదే ప్రేమా
ప్రేమా ప్రేమా లవ్ యూ  ప్రేమా
ప్రేమా ప్రేమా లైఫ్ యూ  ప్రేమా
https://youtu.be/9_w8zht3dh0

నీదివ్య సుందర విగ్రహము తిలకించినంత
నా రెండునయనాల అప్రయత్న చమరింత
నీ పవిత్ర నామావళి  పారాయణ చేసినంత
నా గొంతుపెగలక గద్గదమై వరలునంత
శరణాగతి నీయరా తిరుపతి శ్రీ వేంకటేశ్వరా
సరగున నను బ్రోవరా నా పంచప్రాణేశ్వరా

1.రేయి పవలు నీ ధ్యానమె దయచేయవయ్యా
నా బ్రతుకును నీ పదముల కడతేరనీయవయ్యా
త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మితినయ్యా స్వామీ
తాపత్రయమునింక పరిమార్చవయ్యా స్వామీ
శరణాగతి నీయరా తిరుపతి శ్రీ వేంకటేశ్వరా
సరగున నను బ్రోవరా నా పంచప్రాణేశ్వరా

2.సానబెట్టి వజ్రమల్లె నను జేయగ పరీక్షలా
కాకతీసి పసిడిలాగ నను మార్చగ శిక్షలా
ఏమైనా చేసుకో దేహము జీవము నీదే
ఎలాగైన మలచుకో భవమూ భావము నీదే
శరణాగతి నీయరా తిరుపతి శ్రీ వేంకటేశ్వరా
సరగున నను బ్రోవరా నా పంచప్రాణేశ్వరా


OK

Wednesday, February 12, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:ధర్మవతి

షిరిడీ పతి సర్వదా గొనుము నా మానస పూజా
సాయినాథ కరుణజూడూ నను అన్యధా భావించకా

1.బుద్ధిలొ కొలువున్ననీకు జాగృతమిదిగో
సుప్రభాతమిదిగో
మనసులొ నెలకొన్న నీకు అభిషేకమిదిగో
క్షీరాభిషేకమిదిగో
నా హృదయ కమలముతో అర్చనలిదిగో
అనంత నామార్చనలిదిగో
నా పంచ ప్రాణాధీశా హారతులందుకో
పంచ హారతులందుకో

2.నా చిత్తము చిరుగుల కఫినీ ధరించవయ్యా
అవధరించవయ్యా
నా అహంకారమే రుమాలు ఒడిసిపట్టవయ్యా
నీ తలకు చుట్టవయ్యా
నా ఆశలజోలె ఎంతొ పెద్దది భుజాన తగిలించవయ్యా
నింపడమే నీ పనయ్యా
నా ఊహల పల్లకీ అందమైనది అధిరోహించవయ్యా
వాస్తవీకరించవయ్యా
అంటించినావు ప్రేమ జబ్బును
ఎదమీద కొట్టావు పెద్ద దెబ్బను
మెరుపులా మెరిసిపోయి తృటిలోన మాయమైనావు
ఆచూకి జాడలు సైతం తెలుపకుండ పోయినావు
ప్రేమ అంటేనే దగా దగా
 ప్రేమిస్తే బ్రతుకంతా దిగాలుగా


1.ఏమి కోరినాను నిన్నూ  ముఖం చాటేసావు
ఏం బావుకున్నాను సుఖం ధారపోసాను
పిచ్చివాడినైపోయి తిండీ నిద్ర మానుకున్నా
కరుణించే దేవివనీ ప్రాధేయ పడుతున్నా
ప్రేమ అంటేనే దగా దగా
ప్రేమిస్తే బ్రతుకంతా దిగాలుగా

2.ప్రేమ అంటె బిచ్చంకాదని ఇప్పటికి తెలిసింది
ప్రేమ అంటె దానంకాదని ఇకనైనా ఎరుకైంది
పరస్పరం మనసుంటేనే ప్రేమ నిలువగలిగేది
త్యాగమనే గుణముంటేనే ప్రేమగెలువ గలిగేది
తొలిచూపు నిర్ణయం ప్రేమకాదుగా
మూణ్ణాళ్ళ మచ్చట్లో ప్రేమ చేదుగా

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఏమంటారో ఏమో దీన్నీ
ప్రేమే అంటారేమో
చూసీచూడంగానే నిన్నూ
నా సొంత మనిపించ సాగావే
నీ కళ్ళలో ఇల్లు కట్టుకోవాలనీ
నీ  మదిలో కాపురమెట్టుకోవాలనీ

1.పుట్టిబుద్దెరిగిన నాటినుండీ
అందగత్తెలనెందరినో చూసానే
మీసకట్టు వచ్చిన ఈడునుండీ
మాటవరసకైనా మనసు జారలేదే
ఏ స్వప్నమందూ ఎదతలుపు తట్టావో
ఈ జన్మలోనూ నా కొరకే పుట్టావో

2.ఆకలి అసలే కాదెందుకో
నీతో ఓ మాటైనా మాటాడకుంటే
కునుకైనా కంటికి రాదెందుకో
రోజుకోమారైనా నిను చూడకుంటే
నువు కాదంటే ఈ బ్రతుకే చేదంటానే
నువు లేక నా భవితే లేదంటానే
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అమరేంద్రుని రాజధాని అమరావతి
ఆంధ్రులకూ అమరినది అమరావతి
భూతల స్వర్గమే అమరావతి
రాజకీయాల వల్ల ఎందులకీ దుర్గతి

1.బౌధ్ధారామమై వరలి ఖ్యాతి గన్నది
ఆంధ్రరాష్ట్రమంతటికీ నడిబొడ్డున ఉన్నది
కళింగ రాయల సీమలకూ కేంద్రబిందువైనది
ఆంధ్ర ప్రజల కందరికీ అందుబాటైనది
భూతల స్వర్గమే అమరావతి
రాజకీయాల వల్ల ఎందులకీ దుర్గతి

2.మౌలిక సదుపాయాలు కలిగియున్నది
అభివృద్ధికి తగురీతిగ వనరులు సిరులున్నది
ఉద్యోగ ఉపాదులకు సానుకూలమైనది
పరిశ్రమల కల్పనకూ పాటియై చెలగునిది
భూతల స్వర్గమే అమరావతి
రాజకీయాల వల్ల ఎందులకీ దుర్గతి

3.వ్యక్తుల స్వార్థాలకు బలిచేయుట తగదు
పార్టీల పగలకూ వేదిక ఇది కారాదు
రైతుల కన్నీటిని కాల రాయగా రాదు
పెట్టుబడుల విముఖతకు గురికారాదు
మూడు రాజధానుల ముచ్చటే విడూరం
దీర్ఘకాల లాభాలే ఎల్లరకూ సంబరం

Tuesday, February 11, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మధుమాసం నీ చూపుల్లో
చంద్రహాసం నీ నవ్వుల్లో
మలయపవనం నీ సన్నధిలో
మదన సదనం నీ కౌగిలిలో
పొగుడుతూ పోతుంటే తెల్లారి పోతోంది
ఆచరించ బూనకుంటే చల్లారి పోతోంది

1.మకరందం నీ పెదవుల్లో
మాధుర్యం నీ ముద్దుల్లో
వయ్యారం నీ కటి తటిలో
సుకుమారం నీ స్పర్శలలో
మాటలకే పరిమితమైతే తెల్లారి పోతోంది
చేతలలో పెట్టకుంటే చల్లారి పోతోంది

2.సుధా జలధి నీ నాభిలో
రసాలములు పయ్యెదలో
భ్రమరాలు ముంగురులలో
మేరుగిరులు జఘనాల్లో
పీఠికనే ఒడవకపోతే తెర తొలగకుంది
తాత్సారం చేస్తూబోతే తపన తీరలేకుంది
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:హిందోళం

రాస్తాను నచ్చినట్టుగా నీవే ఓ తెల్లకాగితం
మలిచేను మెచ్చునట్లుగా నాదేగా నీ జీవితం
ఎదురుచెప్పకూడదు పెదవి విప్పకూడదు

1.ఏ హంగులు ఉన్నాయి నీలి ఆకసానికి
ఏ రంగు ఉన్నది పారుతున్న నీటికి
ఎందుకంత ఆరాటం చందమామకి వెన్నెల కురియాలని
ఎందుకంత ఉబలాటం సెలయేటికి గొంతులు తడపాలని
ప్రకృతి అందాలన్ని మదిదోస్తుంటాయి
సృష్టిలోని బంధాలన్ని వింతగానె ఉంటాయి

2.శృతికీ లయకూ సంధి కుదిరి తీరాలి
భావమూ గీతమూ పొందికగా అమరాలి
ఎలుగెత్తి పాడావంటే కోయిలైన వింటూ విస్తుపోవాలి
పశువులు శిశువులు సైతం చెవులు రిక్కించ గలగాలి
సంగీతానికెప్పుడూ అంకిత మవ్వాలి
పాడడానికెవరైనా పెట్టిపుట్టి తీరాలి
https://youtu.be/RLyQ7fOWs8Q

ప్రహ్లాద వరదా-ఆర్తత్రాణ బిరుదా
మనసారా వేడెదా-నీ కీర్తన పాడెదా
నమో ధర్మపురీ క్షేత్ర ఉగ్ర నారసింహా
నమో గోదావరీ తీర్థ యోగ నారసింహా
లక్ష్మీనారసింహా శ్రీ లక్ష్మీ నారసింహా

1.గౌతమిగంగలో మూడు మునకలేసి
తడిబట్టలతో నీగుడి గంటారవము జేసి
అష్టోత్తర నామాల నిను అర్చన జేసీ
సాగిల పడెదము సాష్టాంగముగనూ
నమో ధర్మపురీ క్షేత్ర ఉగ్ర నారసింహా
నమో గోదావరీ తీర్థ యోగ నారసింహా
లక్ష్మీనారసింహా శ్రీ లక్ష్మీ నారసింహా

2.పట్టుపీతాంబరాలు కృష్ణ తులసి మాలలూ
పట్టెనామాలు కోరమీసాలు నీకు మా  కానుకలు
బుక్కాగులాలు బత్తెరసాల పేర్లు నీకలంకారాలు
మము దయజూడుస్వామి గైకొని మా మొక్కులు
నమో ధర్మపురీ క్షేత్ర ఉగ్ర నారసింహా
నమో గోదావరీ తీర్థ యోగ నారసింహా
లక్ష్మీనారసింహా శ్రీ లక్ష్మీ నారసింహా



Monday, February 10, 2020

కరిగిన నా గతానికి జ్ఞాపిక నీవు
తిరిగిరాని జీవితానికి చిత్రిక నీవు
ఆనందాలు కొన్ని అనుభూతులైనవి
ఆవేదనలు ఎన్నో గుణపాఠాలైనవి
కలగలసిన భావాలకు ప్రతీకవే నీవు
తీపి చేదు కలలన్నిటికీ నిదర్శనం నీవు

1.పరిధులెపుడు మించదు అవధిలేని ప్రేమా
పలకరించక మానదు అనురాగపు ధీమా
అనుబంధం ఆత్మీయతకూ నీవేగా చిరునామా
అంధకార భవితవ్యానికి ఆరిపోని దీపమా
కలగలసిన భావాలకు ప్రతీకవే నీవు
తీపి చేదు కలలన్నిటికీ నిదర్శనం నీవు

2.నీ ప్రతి కదలికతో మువడింది నా బ్రతుకు
నీవు లేని ఏ నిమిషం ఎద నీకై వెదుకు
అమాసకో పున్నమికో కనిపించి పోరాదా
ఆశపడే తీరాన్నీ నువు స్పృశించి పోరదా
కలగలసిన భావాలకు ప్రతీకవే నీవు
తీపి చేదు కలలన్నిటికీ నిదర్శనం నీవు

Sunday, February 9, 2020

https://youtu.be/3UEb4RB4Gbk

మూడు జగములన్నిటికీ మూలపుటమ్మా
ముగ్గురమ్మలనే గన్న చానా పెద్దమ్మా
సింగమునెక్కి ఊరేగే దుర్గాంబా మహంకాళికాంబా
లోకములన్నీ మోకరిల్లే శాకంబరి శాంభవీ జగదాంబా
వందనాలు లాల్ దర్వాజా సింహవాహినీ
అందుకోవమ్మా బోనాలు కాళికా భవానీ
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

1.పోతరాజు వెంటనుండ సాగేను జాతర
దుర్మార్గులనందరినీ  వేసేయవె పాతర
ఆడపడచుగానూ నిన్నాదరణ చేసేము
ఆషాఢమాసాన నిను ఆహ్వానించ వచ్చాము
ఆదరించవమ్మా మము నిండు మనసుతోనూ
మము చల్లగ జూడవమ్మ ప్రేమ మీరగానూ
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

2.మహిషాసుర రక్కసున్ని కర్కశంగ దునిమావే
మధుకైటభులనూ మదమణచగ చంపినావె
నిశుంభునీ శుంభునీ సంహరించి వేసావే
కలిలోని కీచకులను పీచమణచ వేలనూ
నీ ప్రియమగు బోనాలు  మోసుకొచ్చామే
ఆరగించి అర్తి తీర్చి దీన జనుల కావవే
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

నీదైన అంగాంగం సుందర ప్రకృతి రంగం
నీ సొగసరి పరువం మదన కదన తురంగం
నీ గడసరి తమకం ముంచేత్తే కడలి తరంగం
అంతే దొరకని ప్రణయ ప్రబంధం నీ అంతరంగం

తూరుపు కనుమల నడుమన రవికే ఆహ్వానం
నీ కలువల కన్నుల లోనా శశికే సింహాసనం
నీ వెచ్చని తనువు స్పర్శనం రతి జాగృతి గీతం
నీ చల్లని చూపుల చంద్రిక నా తపనకు నవనీతం

నీ క్షీర శైల శిఖరారోహణ నాకానందపర్వం
నీ క్షార స్వేద రసాస్వాదలో మధురిమలే సర్వం 
నిను క్షేమతీరం చేర్చినపుడే నా మగటిమికి గర్వం
నీలా సలక్షణ సమవుజ్జీ ఇలన అపురూపం అపూర్వం


OK
మేలుకుంటే తలపుకొస్తా
నిదురోతే కల్లో కొస్తా
నీడల్లే వెంటబడతా
నీగుండెలొ చొరబడతా

1.సుద్దులెన్నొ చెప్పుతుంటా
ముద్దులెన్నొ పెట్టుకుంటా
గట్టిగా నా కౌగిట్లో
నిన్నట్టి పెట్టుకుంటా

2.నీ మేను కాన్వాసిస్తే
నాలుకనే కుంచెగ చేస్తా
గిలిగింతలు కలిగించే
చిత్రమైన చిత్రాలనే వేస్తా

3.పిడికిట్లో నడుమిముడుస్తా
నాభి తెనే పట్టుబడతా
శిఖరాలు లోయలు దాటి
నిధులన్ని కొల్లగొడుతా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

దోచేసినావు నా హృదయాన్ని
లాగేసినావు నా పంచ ప్రాణాల్ని
ఆక్రమించావు నా ఆలోచనల్ని
ఆశలెన్నొ రేపావు అందించ నీ ప్రణయాన్ని

1.దోబూచులాడుతావు తప్పించుకొంటూ
దొంగాటలాడతావు నన్నుడికించుకుంటూ
మానవే నా చెలీ ఈ సయ్యాటలు
మౌనమేల తెలుపగ నీ మనసు మాటలు

2.నీ పేరు తలచుకొంటే ఉద్వేగం పెరుగుతుంది
నీ రూపు గుర్తొస్తే ఉద్రేకం కలుగుతుంది
తీయనైన బాధవు నీవు నా రాధికా
తీరని ఆనందం నువ్వు నా విరహ గీతికా

Saturday, February 8, 2020

పురులు విప్పుకొంటోంది
మరులు గొన్న పరువము
తహతహలాడుతోంది
తలపులతో తమకము
ప్రియా రావేల నాదెస
తొలగించవా నా గోస

1 మోయలేను ఎదభారము
యవ్వనమే ఒక నేరము
ఓపలేను నీ విరహము
నీ ధ్యాసే అహరహరము
ప్రియా రావేల నాదెస
తొలగించవా నా గోస

2.కాల్చివేస్తోంది కామాగ్ని నన్ను
ఏకం చేస్తోంది మిన్ను మన్ను
నాకింక పంచు నీ వెన్నా జున్ను
నంజుకో ప్రతిరోజు వదలక నన్ను
ప్రియా రావేల నాదెస
తొలగించవా నా గోస

Friday, February 7, 2020

రాధికా నా ప్రణయ వేదిక
నా హృదయం నీదిక
నువు లేక జీవితమే చేదిక

కన్నయ్యా నా మనవిని విన్నయ్యా
నీ మనసే వెన్నయ్యా
నా కన్నుల వెలిగేటి వెన్నెలవయ్యా

1.యవ్వన వనమున ప్రసూనము నీవెగా
నా కామన భ్రమరానికి అందించగ మధూళిక
మామిడి కొమ్మన కిసలయమే నీవుగా
నా ఆత్రపు గాత్రానికి  రసికతనే కూర్చగా
రమించుదాం విరమించక సుఖాల అంచులదాకా
ద్రవించుదాం తపనలు కరిగి తనురసమూరుదాకా

2.మదన లోయలందున పారే వాహినిగా
నా బాహుకెరటాల్లో ఒదిగి సంగమించగా
నా బీడునేలన బీజమంకురించగా
నాలోన హర్షాతిరేక మొలక వర్షించగా
శ్రమించుదాం  ఆపని పనిగా తన్మయమే మించగా
సేద్యమించుదాం తీపి కలల పంటలే పండించగా


https://youtu.be/I3nqFMSchOs?si=bHeVaNAj3జ్మ్లిప్లార్

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

తోడుకో నేస్తం కావాలి ఎవ్వరికైనా
తోడుకో చెలిమి చెలమెలో ఎంతగానైనా
స్నేహమంటె ఇవ్వడమే.,స్నేహమంటె నవ్వడమే
స్నేహమంటే నువ్వు నేనుగా నేను నువ్వుగా అవ్వడమే

1.స్నేహానికి నిర్వచనం చెప్పలేదు ఏవేదం
స్నేహానికి పరమార్థం సర్వదా ఆనందం
అమ్మకైన చెప్పలేనివి నాన్నకైన చెప్పుకోనివి
అరమరికలు లేకుండా పంచగలము స్నేహానికి
స్నేహమంటె విశ్వాసం స్నేహమంటె విశ్రాణం
స్నేహమంటే ఇలలోనే అతి పవిత్ర భావం

2.శ్రమ సమయం ధనం అన్నో ఏకొన్నో
వెచ్చించ గలిగితేనే వెలుగొందు స్నేహం
కుల మత లింగ భేదాలూ త్యజించితేనే
మనగలుగుతుంది మైత్రి కలకాలం
స్నేహమంటేనే హక్కు స్నేహమంటె బాధ్యత
రక్తసంబంధాలన్నీ దిగదుడుపే సోపతి ముందు

https://youtu.be/fyjnI7xAQa4?si=96xQoqQeUGniPzd4

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:నట భైరవి

సరసిజమా నా ప్రియతమా  నీమోము 
సరసాలకాలవాలమా నీ హృదయము
సృష్టిమూలం శృంగారం శృంగారానికి ప్రణయం
ఇరువురు గెలిచే సమరం తనువులు మరిచే సమయం
మనమైక్యమై పోదాము ఒకరిలొ ఒకరం
రససౌఖ్య లోక మేలుదాం అహరహం

1.రసన అలసి పోయేలా మేని రుచులు గ్రోలుదాం
ఎవరిపెదవులేవో ఎరుగనట్లు ముడిపెడదాం
చెవితమ్మెల మెత్తదనం దంతాల నడిగేద్దాం
మెడ వంపు వెచ్చదనం చెంపలకు చెప్పేద్దాం
కర్పూరమై కాలిపోదాం కమ్మని కౌగిళ్ళలో
నిలువెల్లా మునిగేద్దాం స్వేదపు సెలయేళ్ళలో

2.హద్దులన్ని చెరిపేద్దాం ముద్దులకే స్వేఛ్ఛనిస్తూ
మత్తులో చిత్తౌదాం బాహుమూల లాఘ్రాణిస్తూ
కంపు ఇంపు భేదమె లేదు తమక రతి కేళిలో
నీది నాది వాదమె లేదు రస మన్మథ జగతిలో
అద్వైత సిద్ధినే అవలీలగ పొందుదాం
అమరత్వ లబ్ధినే అరఘడిలొ అందుదాం

Thursday, February 6, 2020


https://youtu.be/SntUCcSE99w?si=AP6pKXRi8QTbDE1O

రచన స్వరకల్పన &గానం డా. గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:కళ్యాణి

సిత్రాలూ నీవీ శీనయ్యా సామీ
ఆత్రాలు మావీ ఆపదమెక్కుల సామీ
వరాలీయవయ్యా వడ్డీ కాసు ల వాడా
మొరాలించవయ్యా తిరుమల రేడా

1.నీకోవెల కట్టలేము నగలేమి పెట్టలేము
మాగుండెయే నీ దేవళము మా నగవులె ఆభరణములు
ముడుపులు కట్టలేము మొక్కులు తీర్చలేము
తలపులు నీవీగ చేకొనుసామీ వాక్కుల్ని నామాల్లా ఎంచుకొ సామీ

2. చిల్లర అక్కఱ్లు చెప్పాలా చిరుచిరు కోర్కెలు కోరాలా
పితరుడవు దాతవు అన్నీ నీవే దేహము ప్రాణము అన్నీ నీవే
 తాయిలాలకై తపించనేలా నీ మాయలొ చిక్కగ నేలా
నీ పద సేవనె దయసేయీ పరమ పదమునే అందీయీ

ముట్టుకుంటె మాసిపోయే ముద్దుగుమ్మా
పట్టుకుంటె జారిపోయే లేతకొమ్మా
ఎంత అందమేనీకు పెదవిపైని పుట్టుమచ్చ
మరలి కాస్త చూడవే నీ చూపులు ననుగుచ్చ

1.కలువలంటి నీకన్నులతో కలువనీవే నా కన్నులను
గులాబీరేకు సౌకుమార్యమే నిమరనీవే నీ చెక్కిళ్ళను
తామరపూవంటీ నీమోముపైనా
వాలెనే తుమ్మెదలై ముంగురులు చానా
సవరించనీయవే తిలకించగ నీ సొగసుఖజానా

2.చెవుల తమ్మెలకే నేను జూకాలై  ఊగిపోనా
ఊసులెన్నొ మోసుకొచ్చి గుసగుసలే నీతో చెప్పనా
సహజమైన అరుణిమతోనూ
అలరారే నీ అధరాలనూ
నన్ను గ్రోలనీవే తృప్తిగా మకరందాలనూ
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

లంపటాలనంటించావు
కుంపటొకటి ముట్టించావు
సంసార బంధనాల్లో
కసిగా నను పడద్రోసావు
ఇంతటి పగయేముంది నీకు నాకు సాయీ
చింతలనే అంటగట్టి వినోదుంతువేలనోయి

1.నీ మసీదులోనాకు కాసింత చోటేలేదా
నీ కప్పెర మధుకరము మనలకు సరిపోదా
పొద్దస్తమానము నీ బోధలు వినకపోదునా
నిదుర సమయానికి పదసేవ చేయకపోదున
కానివాడినయ్యానా నేను నీకు సాయీ
ఏ చింతలే లేని నీ చింతన కలుగగ జేయి

2.చెప్పినట్టు నడుచుకొంటూ నీవెంటేఉండేవాడిని
ఏబాదరబందీ లేకా సుఖపడతూ ఉండేవాడిని
ఏ కష్టమొచ్చినా కనురెప్పగ కాచేవాడివి
నను కన్నతండ్రిలాగా ఆర్చితీర్చేవాడివి
కలవరిస్తున్నాగాని కనికరించవేల సాయీ
మించిపోయింది లేదు ఇకనైనా చేరదీయి
నీ మైత్రికోసం నేనార్తిగానూ
నీరాకకోసం వేచిచూస్తాను
నీ మాటకోసం ప్రతిపూటలోను
పరితపిస్తాను పలవరిస్తాను
నేస్తమా నిర్లక్ష్యమా
ప్రాప్తమే మృగతృష్ణయా

1.వేయలేను రెప్పనైనా-దృష్టి దాటిపోతావేమో
తీయలేను ఊపిరైనా-ఊహవై మిగిలేవేమో
రావేల రెక్కలనే కట్టుకొంటూ-
జాగేల కాలాన్నే నెట్టివేస్తూ
నేస్తమా నిర్లక్ష్యమా-ప్రాప్తమే మృగతృష్ణయా

2.బహుమతొకటి దాచిఉంచా-నిన్నబ్బుర పరచేలా
ఎద తలుపులు తీసిఉంచా-నేరుగా నను చేరేలా
వృధాసేయబోకే విలువైన జీవితాన్ని-
చేజార నీకే మరలిరాని సమయాన్ని
నేస్తమా నిర్లక్ష్యమా -ప్రాప్తమే మృగతృష్ణయా

Wednesday, February 5, 2020

కన్నతల్లి కడుపుకోత ఎవరికి తెలుసు
కన్నతండ్రి గుండె మంట ఎరిగినదెవరు
రుధిర సాగరాలే ఎగసీపడుతున్నాయి
అగ్నిపర్వతాలే బ్రద్దలౌతున్నాయి

1.శ్రీరాముడి వనవాసం పధ్నాలుగేళ్ళు
పాండవుల అజ్ఞాతం పన్నెండు నెల్లు
తీరలేని ఆవేదన బ్రతికినన్నాళ్ళూ
వరదలై పొంగేను రోజూ ఆపినా ఆగని కన్నీళ్ళు

2.మొక్కులెన్ని మొక్కినా దక్కని ఫలితం
ముడుపులెన్ని కట్టినా కరుణించడు దైవం
వైద్యులంత చేతులెత్తి నిస్సహాయులైనారు
మందులు మంత్రాలూ బూదిలొ పన్నీటి తీరు

3.ఎన్ని జరగలేదు జగతిలో అద్భుతాలు
ఎంతమంది నోచలేదు నమ్మలేని మహిమలు
ఓదార్పులు ఆర్పలేవు ఎదలోని కార్చిచ్చును
లేపనాలు మాపలేవు మనసుకైన గాయాలను

నిజమే బాగుంది ఊహకంటే వెంటనీవుంటే
ఎరుగనంటి నీవులేనిదేదైనా స్వర్గమంటే
అలా గాలివీచినా ఏటి అలను తాకినా
నిన్నుమించి ఉండదు ఆ అనుభూతి
తుషారం కురిసినా ప్రభాతం మెరిసినా
చలించదే నువ్వువినా నామతి
ఇవ్వవే సమ్మతి నీ ప్రేమనే గతి
చెరిగిపోదెన్నడూ నీ స్మృతి

1.గోదావరి ఇసుక తెన్నెలు
విహరించిన పుట్టిదొన్నెలు
పడమటి చెంగావి వన్నెలు
చెంగల్వల తలపించు కన్నులు
ఎలా మరచిపోగలనే ఆ తీపిజ్ఞాపకాలు
ఎలా మరలపొందేనో మనవైన లోకాలు
ఇవ్వవే సమ్మతి నీ ప్రేమనే గతి
చెరిగిపోదెన్నడూ నీ స్మృతి

2.మబ్బుననే రంగవల్లులు
అడ్డోచ్చే నీలి ముంగురులు
ఎగదోయగ గాజుసవ్వడులు
ఎదదోయగ నడుమున వడులు
తదేకంగ నిన్నే చూస్తూ నేను కరిగిపోయాను
తదేవలగ్నం కుదరకనే నేను మరిగిపోయాను
ఇవ్వవే సమ్మతి నీ ప్రేమనే గతి
చెరిగిపోదెన్నడూ నీ స్మృతి

Tuesday, February 4, 2020

https://youtu.be/MRgXo2qx5S8

బుంగమూతి ఎందుకే నంగనాచి
సంగతేంటొ చెప్పవే దయతలచి
కయ్యానికి కాలుదువ్వే వగలాడి
వేధించీ సాధించే మాయలేడి
తప్పదేమొ ఎప్పటికీ మొగుడికి ఈ ఆగడం
ఆలిని బ్రతిమాలడం కాళ్ళబేరానికి దిగడం

1.పాంజేబులు చేయిస్తా నీ లేత పాదాలకి
పాపిట బిళ్ళకొనిపెడతా అందాల నీ మోముకి
 పచ్చలహారం కొని వేసేస్తాను నీ మెళ్ళోకి
వడ్డాణం దిగబెడతాను నాజూకైన నీ నడుముకి
చెవులకు జూకాలు ఇంపగు మాటీలు
బంగారు గాజులే మోజుమీర కొనిపెడతా

2.కంచిపట్టు చీరలెన్నొ ఎంచి ఎంచి నీకు తెస్తా
కాలుకింద పెట్టకుండా తివాచీలనే పరుస్తా
సింగారించడానికెన్నో అలంకరణలందజేస్తా
ఘుమఘుమలాడేటి అత్తరులను గుత్తగ ఇస్తా
మల్లెపూల బారెడుదండ మాపటేలతల్లో పెడతా
కమ్మనైన మిఠాయిలెన్నో కడుపారా తినపెడతా

OK
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దర్భార్ కానడ

కరుణను మించినా రసమున్నదా
ఆదరణను  ఆశించని మనసున్నదా
కారుణ్యమె లోకాన అనుభవైకవేద్యము
దాక్షిణ్యమే దైవానికి ప్రియకర నైవేద్యము

1.ఏకో రసః కరుణ ఏవ యనివచించే భవభూతి
ఎరుగనివారెరు సృష్టిలో దుఃఖరసానుభూతి
జనన మరణ సమయాల రోదన సాధారణమే
మనుగడకై ప్రతి జీవికి అనునిత్యమూ రణమే

2.అవకరమును గనినంత పొంగదా జాలి
దీనజనుల ఆర్తికి కనుగవలే చెమ్మగిల్లి
చేయూతనీయదా మానవతే మోకరిల్లి
కటాక్షవీక్షణాల పరిమళాలు వెదజల్లి
https://youtu.be/gjkcdda8PEs?si=phc0Z6bWZ4FdyaN9

పరాకు సేయకు నను పరమశివా
పరాచికములా నాతో మహాదేవా
పరమ దయాళా  పరమేశ్వరా
పరీక్షించకు నను అపరకైలాస వేములాడ రాజేశ్వరా

1.పరిసర ధ్యానమో పరధ్యానమో
పరా ధ్యానమో పరంధామధ్యానమో
పరిపరి విధముల నిను ప్రార్థించిననూ
పరిమార్చవేలరా  భవపాప పరితాపములను

2.పంచానన ఫణిభూషా ప్రపంచాధీశా
పంచభూతాత్మక పంచప్రాణప్రదా
పంచబాణధర దహన పంచామృత ప్రియ
పంచనజేరితినను ఇంచుక బ్రోవర ఆలసించక

Monday, February 3, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:బేగడ

నీ సుందర వదన దర్శనం-నాకు సుప్రభాతం
నీ మందస్మిత అధరం నాకు- మకరంద మందారం
నీ పలుకుల ప్రవాహం-నా జలకములకు జలపాతం
నీ స్నిగ్ధ కుసుమ దేహ స్పర్శం-అపరిమితానంద పారవశ్యం

1.రసమంజరీ మంజులమీ మంజీర నాదం
నవమోహినీ ఆ సవ్వడే నను నడిపెడి జీవనవేదం
నాకోసమే దిగివచ్చిన ఇంద్రచాపమే నీవు
ముంచెత్తే  మత్తుజల్లే  శరశ్చంద్రరూపమె నీవు

2. నీ కనులు నాపాలిటి ఇంద్రనీలమణులు
నాభి మంజూషయై దాచుకొంది నవనిధులు
ఉరోజాలు మేరుగిరులు జఘనాలు హిమనగాలు
నడుము కిన్నెరసానిగ ఒలికేను నయగారాలు

OK
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దేశ్

అనుభవించడం నేర్చుకో ప్రతీ క్షణాన్నీ
పుణికిపుచ్చుకో నేస్తం ఆస్వాదించు లక్షణాన్ని
రోజూ వండేదైనా రుచీ రుచీ భిన్నమే
రోజూ ఉండేదైనా ఏ అభిరుచీ నూత్నమే

1.కొత్తగా పుట్టుకరావు కొంగ్రత్త జీవితాలు
నిత్య నవీనమై ఉండబోవు అనుభూతులు
మార్చుకుంటె చాలు మనదృక్పథాలు
అగుపించితీరుతాయి ఊహించని కోణాలు

2.అక్షరాన్ని లక్ష్యపెట్టు మంత్రమై ఫలియిస్తుంది
ప్రజ్ఞ మీద దృష్టిపెట్టు  ప్రగతిదారిపడుతుంది
పరిసరాలలోనే స్వర్గం దీక్షతొ నిర్మించుకో
పరస్పరం సహకారం మైత్రితో ఇచ్చిపుచ్చుకో
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:తిలాంగ్

పూబాలవే అలివేణీ
అపురూప అందాలరాణీ
వదలదు నీ రూపు ఏకవిని
వర్ణించగ వరమీయి, నా మనవిని విని

1.ఎన్నిమార్లు అడగాలో సై యని అనడానికి
ఎంత బతిమిలాడాలో ఒప్పుకోవడానికి
నన్ను కలచివేస్తోంది  తీరని కలవొకటి
పాటగా నిన్ను మలచని నా ప్రతిభ ఏపాటి

2.కనికట్టు ఏదోచేసి ఆకట్టుకున్నావే
మంత్రమేదొవేసినన్ను లోబరచుకున్నావే
కల్పనలోనే  చిత్రిస్తాను ఇక నిన్ను
ఆపతరమా నీకు ఏకమైనా మన్ను మిన్ను
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ముఖారి

మల్లెలేరి మాలకడతా రాలి పడగ.. నీ నవ్వుల్లో
మరులుగొని మాలపెడతా నీలికురుల నీ తల్లో
కాసింత చూడవె నాకేసి చేపకళ్ళ తల్లో
నీతోటి స్నేహం చేస్తా ఇలలో కుదరకుంటే కల్లో

1.మకరందం గ్రోలుతా నీ మాటల్లో
తన్మయమే చెందుతా నీ పాటల్లో
బ్రతుకంతా విహరిస్తా నీ వలపుతోటల్లో
నీ వెంటే నడుస్తా ఆనందపు బాటల్లో

2.నిను నాయకి చేస్తా నా కవితల్లో
నీ సాంత్వన కోరుకుంట నా వెతల్లో
నిను దేవత చేస్తా నా గుండె గుళ్ళో
నే సేదతీరుతా నీ ఊహల ఒళ్ళో