రాగం:కల్యాణి
నీ పదముల నా మది కొలిచేను
నా పదముల నీ కృతి మలిచేను
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ ముకుంద మురారీ
1.అక్షర లక్షలు నీకర్పించెద
కవితల కోటి నీకందించెద
గీతమాలికల అలరించెద
కావ్యశతముల కానుకలిచ్చెద
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ ముకుంద మురారీ
2.నిత్య నరకము ఈ నరలోకము
నీ సన్నిధియే భూతల నాకము
తొలగించర నా అవిరళ శోకము
కావించర కర్మల పరిపాకము
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ ముకుంద మురారీ