Sunday, May 22, 2022


https://youtu.be/Fd94P4JmvN4

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కినుక నీకేలా నీ భక్తుడనె గణనాథా

అలుకలిక చాలుచాలిక 

అలసితిని నీతో వేగలేక సద్గుణనాథా

తొలి సారి నీకే మ్రొక్కి తొలిపూజ నీకేచేసి

తలిచేను నిరతము నిన్నేగా

మరచితివి నన్నెందుకో మరి ఏకదంతా

వందనాలు గొనవయ్య వక్రతుండ

సుందరాంగ సిద్ధి గణపయ్య నీవే నాకు అండ


1.గుంజీలు తీసెదను శరణు శూర్పకర్ణా

గరికెనర్పించెదను మనసార విఘ్నేశ్వరా

కుడుములు నెవేద్యమిడుదు కుడువు

లంబోదరా

ఉండ్రాళ్ళు దండిగబెడుదు భుజియించు హేరంబా

వందనాలు గొనవయ్య వక్రతుండ

సుందరాంగ సిద్ధి గణపయ్య నీవే నాకు అండ


2.ఏదీ నిన్నిమ్మని అడగలేదు ఇన్నాళ్ళు

అవసరాలు నెరవేర్చావు ఎరిగి మరీ ఇన్నేళ్ళు

నీ కరుణ తరిగిందా నాకెందుకు కన్నీళ్ళు

విప్పవయ్య వినాయకా ఇకనైనా చిక్కుముళ్ళు

వందనాలు గొనవయ్య వక్రతుండ

సుందరాంగ సిద్ధి గణపయ్య నీవే నాకు అండ

Friday, May 20, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ దైవం కోసం చెలీ నీపూజలు

ప్రత్యక్ష దేవిగ నీవే సాక్షాత్కరిస్తే

ఏ కోవెలకరుదెంచగ నీ పరుగులు

నా హృదయ మందిరాన నిను ప్రతిష్ఠిస్తే

నే చేసెద ముప్పొద్దుల ప్రేయసీ ప్రేమాభిషేకం

వరమొసగవె జన్మంతా ఒనరించగ కైంకర్యం


1.ఉషోదయాన తుషార బిందువులేరుక వచ్చి 

మంజుల నాదాల మంజీరాలవగా వరుసగ గుచ్చి 

అలంకరించెద మెరియగ నీ పాదాలకు మెచ్చి

ప్రసాదించవే పరువాలు ప్రణయాలు అనుబంధాలు

ప్రమోదించవే రాగాలు యోగాలు యుగయుగాలు


2.నా గుండె మాణిక్యం నీ ఎదకు ఆభరణం

నా మనసు మందారం నీ మెడలో సుమహారం

నా పిడికిలి నీ నడుముకు అమరెడి వడ్డాణం

నా ఊపిరి నీ తనువుకు సౌగంధికా శ్రీ చందనం

విశ్వమంతరించనీ కాలము కడతేరనీ నీదే ఈ జీవితం

తరగని చెరగని గని నా ప్రేమ నీకే నీకే నీకే చెలీ అంకితం


OK

Thursday, May 19, 2022

https://youtu.be/GSYu5kMGGZ4?si=kyyLpvzS-MMRq1M9

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

తలుపు తట్టిరాదా అదృష్టమంటు వస్తే
తల్లీ వరలక్మీ ఘన ఘనమౌ నీ దయ వర్షిస్తే
తహతహలాడినా తపనలనే బడసినా
సిరీ హరిదేవేరి వృధాయే నీవే హూంకరిస్తే
పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే

1.భాగ్యమంటె సంపదకాదు ఆరోగ్యమే
సౌఖ్యమంటె విలాసమవదు వైరాగ్యమే
అష్టైశ్వర్యాలున్నా తృప్తినీయకున్న బ్రతుకు దైన్యమే
నవ నిధులున్నా నీ కృపలేనిది శాంతి మృగ్యమే
పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే

2.ఆస్తిపాస్తులెందుకు నిత్యానందిని కానీ
పదవులు వలదమ్మా పరమానందమెందనీ
రాగద్వేషాలను వదిలి నీ పదముల నందనీ
భవబంధాలు సడలి నీకే నీకే నన్నిక చెందనీ
పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వంచనే వంచనైంది ప్రతి ఇంచునా ప్రపంచమంతా

ముంచడమే మించుతోంది కచ్చితంగా కుత్సితంగా

తలవంచనేల ఆత్మవంచనేల మంచిగా ప్రవర్తించినా

చింతించనేల స్వగతించనేల సత్యమే

ప్రవచించినా


1.ముక్కు పచ్చడైతే మాత్రమేంటి ముక్కుసూటి తనానికి

ఢక్కామొక్కీలు తిన్నా ఇష్టమేమరి

లెక్కచేయని గుణానికి

ఆశచావదు మోడుకైనా చినుకొస్తే చిగురించడానికి

తపన వీడదు బీడుకైనా తొలకరికి 

పులకరించడానికి


2.వైఖరిని మార్చుకోనేల వ్యక్తిగా

అదే గుర్తింపుగా

ఒకరితో పోల్చుకోనేల తరతమాలుగా

నీవు నీవులా నీవుగా

శిఖరంలా నిలువుగ ఎదగడం స్వార్థమే అంతరార్థం

సంద్రంలా ఎద నదులను కలుపుకోవడం 

సౌహార్దం

 

https://youtu.be/10D63SQ2zAQ?si=tQe-IhPiUZJCpND3

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గడ్డిపోచ దొరికినా వదులుకోలేరు

వరదలో కొట్టుకెళ్తు మునకలేయువారు

కాస్త సానుభూతికైనా ఊరటచెందేరు

అయోమయంతో ఏ దిక్కుతోచనివారు

దీనుల బలహీనతే పెట్టుబడి బూటకాల బురిడీ బాబాలకు

గుడ్డిగ నమ్మడమే రాబడి మాటకారి మాయావి మాతలకు

మోసం మోసం బ్రతుకే హైన్యం ఈ పరాన్న బుక్కులకు

సిగ్గూ శరం అన్నవి శూన్యం ఈ నీచ్ కమీనే

కుక్కలకు


1.దీర్ఘకాలవ్యాధులు మానిపోని మనాదులు

మూఢనమ్మకాల మేడల కవేలే పునాదులు

వైద్యవిధానాలేవి ఫలించలేని అభాగ్యులు

కార్పొరేటు ఘరానా ఖర్చుమోయనోళ్ళు

అమాయకులు అనాధలే లక్ష్యమీ ఫకీర్లకు

ప్రచారాలు గారడీలు రేపగలవు పుకార్లను

మోసం మోసం బ్రతుకే హైన్యం ఈ పరాన్న బుక్కులకు

సిగ్గూ శరం అన్నవి శూన్యం ఈ నీచ్ కమీనే

కుక్కలకు


2.చెప్పులతో కొడతారు నిప్పుల్లో తొస్తారు

నూనెలేవొ రాస్తారు మేన బూది పూస్తారు

తావీజులు తాంత్రిక పూజలు దొంగ గురూజీల రివాజులు

దైవాన్నే నమ్మినప్పుడు మన మతులకేల ఈ బూజులు

కర్మసిద్దాంతమే మన జీవన విధానం కదా

గీతాబోధనలే మనకు ఆచరణీయం సదా

మోసం మోసం బ్రతుకే హైన్యం ఈ పరాన్న బుక్కులకు

సిగ్గూ శరం అన్నవి శూన్యంఈ నీచ్ కమీనే

కుక్కలకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఓర చూపులు చూస్తాను 

దోరనవ్వులు నవ్వుతాను

కొంటెతనపు మాటలెన్నో కొసరి కొసరి రువ్వుతాను

స్నేహమొలకబోస్తాను

వలపునెరగ వేస్తాను

తేరగా గుంజడానికి వగలొలుకుతుంటాను

బ్రతుకనేర్చిన నవీన వనితను నేను

మాయలేడినైనా మనసంతా పవిత్రను


1.నన్నుముట్టుకోకంటూ నామాలకాకినౌతా

పత్తిత్తు వేషాలేస్తూ అత్తిపత్తి నేనౌతా

మగవాడి వంకర బుద్దిని అలుసుగాగొంటూ మసిబూసి మాయజేస్తా

తోకాడిస్తు వెంటబడే వాడిని పిచ్చిగా వాడుకొంటూ పిప్పి పిప్పిజేసేస్తా

బ్రతుకనేర్చిన నవీన వనితను నేను

మాయలేడినైనా మనసంతా పవిత్రను


2.మగాడి బలహీనత నేనని నాకు బాగా తెలుసు

అందాలు ఆరబోస్తే చొంగకార్చగలడని తెలుసు

కోరినది కాదనకుండా విలాసాలు నెరవేర్చగలగడం నాకొక అలుసు

కొత్త చేప దొరికినంతనే పురుగులా దులిపేయడం నాకు రివాజు

బ్రతుకనేర్చిన నవీన వనితను నేను

మాయలేడినైనా మనసంతా పవిత్రను

 https://youtu.be/hufgaNGIUag?si=DAMQb5Rfpj20agbu

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మట్టితావెంత మధురిమ

మట్టితావె మనభాగ్య సీమ

మట్టితోనె ఆహారం మట్టే ఔషధం

మట్టి మనను కన్నతల్లి మట్టే మన కల్పవల్లి


1.హీనంగా చూడకు మన్నేయని

హేయంగా భావించకు బురదని

పంటలనందించే తరగని ధాన్యదాత ధరణి

జీవరాశి జనని పరమ పావని జగతిలోన మన అవని


2.నిస్సారవంతమవసాగే నిర్లక్ష్యానికి నేల

సాగుకు నోచక మేడలు వెలయగ విలవిల

మొక్కలు పెంచక అడవులు నరకగ నరకంలా

సమీప భావితరాల మనుగడ ప్రశ్నార్థకంలా


3.పర్యావరణపు అసమతుల్యత ఒకలోపం

కలుషిత కర్భన రసాయనాలే మనకు ఘోరశాపం

మానవజాతి చేసుకొంటున్న స్వయంకృతాపరాధం

మనకై మనమే పూనుకొని ఆపాలి ఈ నరమేధం

Tuesday, May 17, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మలయమారుతం(చారుకేశి ఛాయలతో)


ఎప్పుడూ శుభోదయం చెప్పుతుంటె నప్పదు

నిద్రాణమై మెలిగితె రోజంతా చెప్పక తప్పదు

జాగృతితో జాతి చెలఁగ మేలుకొలుపు అవసరమా

నిద్రనటించువారినైతె  లేపగ ఆ బ్రహ్మకైన తరమా


1.భక్తుడై పోగలడా బలిమికి లింగం కడితే

పక్కకెళ్ళి చెఱపడా పట్టి పంగనామమెడితె

చెవుడొచ్చినవాడైతే తేడా ఎరుగునా తిడితే

అత్తిపత్తి చిత్తాలు ముడుచుకొనునుగా ముడితే


2.మనసునొకటి మాటొకటి చేత ఇంకొకటి

లోకాన అధికులకూ ఇదేకదా పరిపాటి

చొరవా చేతన కలిగినవారే కదా నేటి ఘనాపాటి

రవిలా కాకున్నా  వెలుగీయగ కవికాగలుగును తానో దివిటి

Sunday, May 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎప్పుడు నీ మూల్యం కుటుంబాన శూన్యమై పోతుందో

ఎప్పుడు నీ ఉనికి నీ ఇంట కంటగింపుగా మారుతుందో

ఎరగుమా నేస్తమా ఆరంభమైనదని నీ మహాప్రస్థానం

తెలుసుకో మిత్రమా నువు చేరావని నీ చరమాంకం


1.అవసరాలు నెరవేర్చే ఆర్థిక వనరుగా

ఇంటిపనుల తీర్చేందుకు నీవో నౌకరుగా

పరిగణింపు ఎప్పుడు మొదలౌతుందో

దబాయింపు అదే పనిగ నసపెడుతుందో

ఎరుగుమా నేస్తమా నీవిక ఒంటరి బాటసారివేనని

తెలుసుకో మిత్రమా నీవొక శాశ్వత పనివాడివైనావని


2.సుద్దులు నేర్పుతుంది రోజూ నీ శ్రీమతి

హద్దులు పెడుతుంది నిన్నన్నిట నీ సంతతి

నీ ప్రతిచర్యను విసుక్కొంటు నీవారెన్నడు తలచేరో

వదిలించుకునే గుదిబండగ నిను సతిసుతులెపుడెంచేరో

ఎరుగుమా నేస్తమా నువు చనుటకు వేళయ్యిందని

తెలుసుకో మిత్రమా నీ కనుమరుగే ఇలకు

మేలయ్యిందని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆత్మన్యూనత మనకు అతిపెద్ద రుగ్మత

ఆత్మస్తుతి పరనింద కాదు సభ్యత

యథాతథపు జీవితం తథాగతుని ప్రశాంతం

ఆచరణాత్మకం అనునిత్య సాధనతో సుసాధ్యం


1.ప్రతిభ ఎంతొ దాగి ఉంది ప్రతివారిలో

సానబెడితె వజ్రమై వెలుగులీను జగతిలో

తటపటాయింపులే మానుకోవాలి ఇక

మొహమాటాలకు ఏనాడూ తావీయక

ఉన్నదేదొ ఉన్నది జన్మతః అబ్బినది

చొరవవల్లనే కదా ఎల్లరకూ ఎరుకయేది


2.సహృదయులే కదా మనతోటి వారంతా

ప్రోత్సహించు మిత్రులుండ మనకేల చింత

సహజమే ఎవరికైన గుణదోషాలిలోనా

తలదాల్చగ సిద్ధమే సద్గురువుల సూచన

సంగీతము సాహిత్యము కవలపిల్లలు

ఆనందం పంచుటకై లేవు మనకు ఎల్లలు


PIC courtesy: Agacharya Artist sir

Saturday, May 14, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గంటలు మ్రోగుతాయి ఎదలో-ఎదురుగా నీవొస్తే

మంటలు రేగుతాయి మదిలో - గోముగా నువుచూస్తే

అందమన్నదొకటే కాదు అందుకు కారణం

నీ మనసుకు నా మనసుకు  ప్రేమ తోరణం


1.పూలపట్టుగా చెట్టుని కనుగొని కోసినపుడు

పూలబుట్టగా పట్టు పావడను చేసినప్పడు

చిటారుకొమ్మన విరులుకోయ నిను మోసినప్పుడు

వెచ్చని మెత్తని నీ తనువే నాకొరిసినప్పుడు

ఉద్వేగంతో ప్రతిధ్వనించెనే చెలీ నా గుండె చప్పుడు


2.మామిడి తోపులో తాడుతొ ఊయల వేసినప్పుడు

నిలబడి ఎగబడి అల్లంతగ నువ్వూగినప్పుడు

విరబోసిన నీ నీలి కురులు గాలికి రేగినప్పుడు

పట్టుతప్ప నిను పట్టుకొనగ నా ఒడి చేరినప్పుడు

ఉద్వేగంతో ప్రతిధ్వనించెనే చెలీ నా గుండె చప్పుడు


https://youtu.be/8yrScsuhq_Y

 రచన,స్వరకల్పన&గానం: డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:ధర్మవతి


శుభములు చేకూర్చు నీ జయంత్యుత్సవాన

అఘముల నోకార్చు నీ ఆవిర్భవ సమయాన

శుభాకాంక్షలే నెరవేర్చు సర్వులకీ పర్వాన

శుభఫలాలనందించు మేమానందించు విధాన

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి


1.హరిఏడని వదురుచుండ ప్రహ్లాద వరద

సరి గానరా యని కంబాన వెలిశావుగద

వరగర్వుడా హిరణ్యకశిపు నొనరించావు వధ

సవరించర మా బ్రతుకుని సరగున గోవిందా

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి


2.పాపిగ నను నిర్ణయించి ఇపుడే రూపుమాపు

సంచిత పుణ్యముంటె సత్వరమే ఆర్తిబాపు

నిర్లిప్తతనికమాని ఉగ్రతనే బూనీ నీ ఉనికినే జూపు

నను ముంచినా తేల్చినా నాకు ముక్తి  నీ ప్రాపు

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి

 https://youtu.be/bGUp5ara034


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


నమ్మితిని వేంకటపతి-నింపితి నిను నా మతి

చూసెదవని అతీగతి-నిలిపెదవని పరపతి

రానీ నను తిరుపతి-నీ చరణాలే నాకుగతి

గోవిందగోవింద శ్రీపతి-త్రికణశుద్ధిగా నీవే శరణాగతి


1.హాయిగొలుపు తిరుమల ప్రకృతి

బంగారు శిఖరాల మందిర నిర్మితి

ముగ్ధ మనోహరమే స్వామీ నీ సుందరాకృతి

పొగడగ నా తరమా నమోనమో రమాపతి


2.బండగమారె నా గుండెన కనగ ఆర్ద్రమే

గండములెన్నొ చేరె అడుగిడ కడు సాంద్రమే

కొండమీదను సంద్రముంది నీ దయా సంద్రమే

అండకోరు వారిఎడల నీ కడ సౌహార్దమే 

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తీయగా మూల్గుతోంది నా మనసు

నీ అందాలు ఆస్వాదించమని

ప్రబందాల కందని నీ పరువాలని

పదిలంగా పాటలో కుదించమని

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి 

తనుసాంతం నీసొంతం కావాలని


1.చెక్కణాల చక్కదనం కొక్కెమేయ వెక్కుతోంది

కక్కలేక మ్రింగలేక బిక్కచచ్చిపోతోంది

పక్కచూపులేవొ చూస్తూ ఫక్కున నవ్వుతోంది

లెక్కకు మిక్కిలిగా చిక్కుల చిక్కుతు చీకాకు పడుతోందీ

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి తను సాంతంనీకే సొంతంకావాలని


2.ఎద దాటదు ఏ భావన కలవరపెడుతున్నా

పెదవికైన తెలియదు కనులు కతలు పడుతున్నా

తలపెట్టిన ప్రతిసారీ పీకనొక్క ఆగిన మరులెన్నో

పుట్టిన ప్రతి తలపుకు కట్టిన తాజ్ మహలులెన్నెన్నో

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి తను సాంతంనీకే సొంతంకావాలని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అడ్డాలనాడే మన బిడ్డలు

గడ్డాలనాడు సెగ గడ్డలు

మమకారపు భావన మనది

బాధ్యత, గర్జులన్న వాదన వారిది

తరాల అంతరాలలో నలుగుతున్న జీవులం

సతాయింపు సణుగుడులో సతమతమౌతున్న నిస్సహాయులం


1.మాటనుటకు వీలులేదు దాటవేయగా మరి దారిలేదు

తండ్రులకు కొడుకులకు జడవక గడవని మన

తీరు చేదు

భయము భక్తి గౌరవాలు ఫెద్దలకందించినాము

ఎదురుతిరిగి ఈసడించినా పిల్లలనాదరించినాము

మితమగు సంతతే ఈ గతికి కారణం

అతిగా ప్రేమించుటే దుస్థితి దర్పణం


2.ఆస్తులమ్మి అమెరికా చదువుకు  సాగనంపినాము

నెలలు గడిచి తలవకున్నా కడుపుతీపితో మిన్నకున్నాము

తమ బ్రతుకే తమదనుకొన్నగాని మద్దతుగా నిలిచాము

చరమాంకపు జీవితాన ఏకాకులమై

వగచాము

మారుతున్న కాలానికి మారాలి మనమే

చిరునవ్వుతొ స్వాగతించి కోరాలి మరణమే

Thursday, May 12, 2022

https://youtu.be/0w31P3M-gUQ?si=cilSnKybSuykSWpL

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిత్తశుద్ధిగా చేసే యత్నమె నిజమగు గెలుపు

పశ్చాత్తాపం ఎరుగని కృషి సంతృప్తి గొలుపు

నిరంతరం పయనించడమే మానవ జీవన గమ్యం

మలుపు మలుపులో ఎదురౌ మజిలీలే కడు రమ్యం

కాలానికి గాలం వేసి పట్టుకోవాలి నిమిషాల ఝషలను

ఫలితాలేవైనా స్వీకరించి పక్కకునెట్టాలి పసలేని మిషలను


1.ఎన్నడైనా ఎత్తక మానేనా ఎక్కక ఆగేనా

చిన్నచీమ తనను మించిన బరువున్నా 

తను  పదేపదే జారుతున్నా ఏ తోడులేకున్నా రాకున్నా

ఎన్ని సార్లు దులిపినా తన వాసం కూల్పినా

సాలీడు  వెనుకాడేనా గూడల్లిక నొల్లేనా

తనువులోని దారం ఆధారంగా నైపుణ్యమే పుణ్యంగా


2. ఎదురేమున్నా బెదురేలేకా వడివడి కదిలేనుగా

నది విధిగా ఏటవాలుగా తనకు వీలుగా

విప్లవించేనుగా పాధి మిన్ను మబ్బు వాన నేల

ఆటవిడుపుగా

తూరుపు బుగ్గన అరుణిమ సిగ్గు మొగ్గలు తొడిగినా 

గడియగడియకు బిడియము నొదిలి చెలగును భానుడు ధాటిగా ఏకదాటిగా

రేపటి ఆశలు  పేర్చుకొని ఎరుపుని పిడికిట చేర్చుకొని చనునజ్ఞాతిగా పడమటి దెసగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేనేంటో నేనే -నువ్వూ నువ్వే…

పోలికలు తులనాలు-హాస్యాస్పదాలు..

ఈర్ష్యా ద్వేషాలు-వ్యక్తిత్వపు హననాలు


ఎందుకు నేస్తం బ్రతుకే క్షణికం

నీకెలా ఉన్నా నాకు నువ్వే ప్రత్యేకం


1.ఎన్నెన్నితత్త్వాలు ఎన్ని మనస్తత్వాలు

ఎన్ని విభిన్న కోణాలలో కళలు కవిత్వాలు

ఎన్నెన్నని వన్నెలు చిన్నెలు వనమున నన సన్నలు

గిరులు ఝరులు ఎడారులు సప్త మహా సాగరాలు

కనగ ఎదన పరవశాలు మనకివి ప్రకృతి వరాలు

హెచ్చుతగ్గులంటు లేవు నేస్తం

దేనికదే వైశిష్ట్యం సృష్టి సమస్తం


2.మేధావివి నీవు నేను కళాపిపాసిని

గాయకునివి నీవు నేనేమో రచయితని

వచన కవిత నీసొత్తు పాటతోనె నా పొత్తు

వాఙ్మయ విద్వత్తునీది వాణీ మహత్తు నాది

ఆస్వాదన లక్ష్యమైతే అనుభూతి ముఖ్యమైతె

ఎవరికెవరు ధరన సాటి మిత్రుడా

నిమిత్తమాత్రులే ప్రేమ పాత్రుడా

Tuesday, May 10, 2022


మీ మంచి మనసులకు చేజోతలు

మీ శ్రద్ధాసక్తులకు నా నమస్సులు

కురిపించినారు  అభినందనలతో మందారాలు

చిలికించినారు శుభకామనలతో

చందనగంధాలు

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు


1.విసుగు చెందకున్నారు నా వరుస కవితలకు

తూలనాడకున్నారు నా వికృత పాటలకు

గురుతు పెట్టుకొని మరీ పలకరించినారు

విశాల హృదయంతో దీవెనలందించినారు

నిన్నటి నా జన్మదినం సందర్భాన

నేటి మా వైవాహిక వార్షికోత్సవాన

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు


2.ఆత్మీయ బంధువులు నా ఆప్త మిత్రులు

సాహితి అభిమానులు ఏ కాస్తో పరిచితులు

వీరూ వారని లేరూ ఎందరో మహానుభావులు

పేరుపేరునా తెలుపున్నా కృతజ్ఞతాంజలులు

నిన్నటి నా జన్మదినం సందర్భాన

నేటి మా వైవాహిక వార్షికోత్సవాన

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు

 

https://youtu.be/M9QimINIMaE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోపమెంత ఉన్నదో నామీద నీకు

అలక ఉన్నచోటే ప్రేమ తావు కాదనకు

చికాకెంత ఉన్నదో నా మీద నీకు

నీ చిత్తమంత నిండినాను ఆ మాట బూటకమనకు

చెలీ చెదరగొట్టనేల కలనిలా ఎద కలచివేసేలా

ప్రేయసీ అదరగొట్టనేల బెదిరీ బావురుమనేలా


1.పిపాసివై అలిసినప్పుడు శీతల పానీయమునైనా

తుఫానులో చిక్కినప్పుడు తీర దీప స్తంభమునైనా

బిగుసుకుంటుంది పాశం జారవిడిచిన కొద్దీ

తగ్గిపోతుంది దూరం  తప్పుకుంటున్న కొద్దీ

చెలీ చెదరగొట్టనేల కలనిలా ఎద కలచివేసేలా

ప్రేయసీ అదరగొట్టనేల బెదిరీ బావురుమనేలా


2.నా పాటలు పునాదిగా ప్రేమసౌధం నిర్మించా

నీ మాటలు ఆలంబనగా అనుభూతులు

మర్మించా

ఉభయత్రా నేనే ద్విపాత్రాభినయం చేసా

పదేపదే నిన్ను ఒడిదుడుకుల జడిలో ముంచేసా

మన్నించు నేస్తమా నా కవితకు నిను వస్తువు చేసా

చరమగీత మిదేలే భావుకతను ఇక్కడే పాతరవేసా

 

https://youtu.be/p8KAYvIti-o?si=tRTs3YFL3P2ob6w7

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కంఠధ్వని కర్కశము-పలుకులేమొ పరుషము

లౌక్యమైతె శూన్యము-ముక్కుసూటి వైనము

ఎవరు చేయగలరిలలో-రాఖీ… నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


1.పదిమందిలొ ఇమిడేటి పద్దతి నెరుగవు

పదుగురితో ముదమారగ ప్రవర్తించనేరవు

పదపడి కదలడమే నీ పాట్లకు మూలము

చెల్లించగ రివాజే నీవే తగు మూల్యము

ఎవరు చేయగలరిలలో-రాఖీ ……..నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


2.నీకున్న కొద్దిమంది చెలిమి వారి సహనము

నీతోటి కొనసాగుట నీ మిత్రులకతి నరకము

నిష్ఠూరపు వాస్తవాలు నీవైనా ఓర్వగలవా

మనసారా పరుల ప్రతిభ ప్రశంసించ గలవా

ఎవరు చేయగలరిలలో-రాఖీ… …..నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


3 కొడుకుగా సేవచేయనైతివి తల్లికి

భర్తగా సాయపడక పోతివి నీ ఆలికి

ఉన్నతి కలుగజేయవైతివి నీ సుతులకు

సన్నుతి వేడనైతివి దైవాన్ని సద్గతులకు

విఫలమైనావు వాసి పస లేని నస కవిగా

విగతజీవివైనావు ఒరులకు కొరగాని కొరవిగా


నీది అసమర్థుడి జీవయాత్ర

నీది విధివక్రించిన దీన పాత్ర

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి గీతా రాంకిషన్(రాఖీ)


ఒకటి ఒకటీ కూడితే అది రెండైతే కలన గణితం

మనసూ మనసూ కూడితే ఒకటైతే మన జీవితం

ఏనాడో అయినాము ఒకరికి ఒకరం అంకితం

ఈడు జోడుగ తోడునీడగ మన మనుగడ శాశ్వతం

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై 


1.నదులు రెండు సంగమించి సాగరమైన తీరుగా

మొక్కల నంటితె కొత్త వంగడం అంకురించినట్లుగా

కలలు రెండు పల్లవించి ఫలితమొకటైన రీతిగా

ఇరువురి నడగలు చేర్చే గమ్యం స్వర్గమైన చందంగా

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై 


2.ఇరు చరణాల మూలం పల్లవి మన సంసారంగా

మాట నీదిగా బాట నాదిగా సర్దుబాటయే కాపురంగా

చిరుచిరు అలకలు అరమరికలుగా ఆనందం సాకారంగా

ఊపిరి నీదిగ ఎదలయ నాదిగ  జతపడి జీవన శ్రీకారంగా

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై


https://youtu.be/A4E3ZGluQiI?si=-l7vH_paYWiO0N4F

 రచన,స్వరకల్పన&గానం:

డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


చల్లగ చూసే శ్రీశైల మల్లన్నా మా కొమురెల్లి మల్లన్నా మా వేలాల మల్లన్నా

పాద నమస్సులు మీకు నా పబ్బతులు పట్నాలు దయగనరోరన్న

ఎల్లకాలమిలా "నా పుట్టిన రోజున"

 చల్లని దీవెన్లు మీరు చల్లాలి నా మీన


1.తడిలేని గుండెతొ పుడితి పుడమినింక

గడియైన తిరమనక పడితి గవ్వల యెనక

గడిచి పోయే సామి నా బతుకంత ఎర్థంగా

పడిగాపులు పడుతున్నా నీదయకై ఆత్రంగా

ఆదుకో నన్నింక ఆ తిన్నని మాత్రంగ

చేదుకో సామి నీ వంక నను ప్రేమపాత్రంగ


2.కోపాలు తాపాలు నా లోపాలిస్తా తీస్కో

 ఫాల శేఖర నా పానాలైదునీవె భద్రంగ కాస్కో

పాపాలు శాపాలు ఏ జన్మలోనో చేసానెందుకో

నీ పాల ననుబడనీ వేడితి నా చేయినందుకో

లెక్కజేయి సామి  గ్రక్కున నన్ను ఎములాడ రాజన్న

అక్కున జేర్చుకొ మిక్కిలి దయగల్ల మా అక్కపెల్లి రాజన్న

 (అశుతోష్ రాణా నటుడు   హిందీ కవి షాయరీకి -స్వేఛ్ఛానువాద గీతం)


అనువాద రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:యమన్ కళ్యాణి


ఆదమరచి నిదురే పోలేనివేళ

ఎద భారం తీరేలా ఏడ్వలేని వేళ

మనసుకు తగు ఊరటే దొరకని వేళ

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకపరుస్తుంది


1.వడివడి గుండె దడే హెచ్చినపుడు

వత్తిడి చిత్తాన్ని కత్తిరించినప్పుడు

మనసు మనసులో లేదనిపించినపుడు

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకపరుస్తుంది


2.బ్రతుకు దుర్భరమయినపుడు

భవిత భయం గొలిపినపుడు

ఏకాకిగ నీలొ నీవు మదనే పడినప్పుడు

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకజేస్తుంది


3.వయసు మీరిపోతుంటే

తలపు తిరోగమిస్తుంటే

అసహనమే దహిస్తుంటే

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకజేస్తుంది

 https://youtu.be/2Ib-pTh4uu8


"మాతృ వందనం"


అమ్మా నీ మొదటి మాట 'నానా మంచిగ ఉన్నావా'

వెనువెంటనె నీ నోట 'కన్నా నువు తిన్నావా'

కడుపు చక్కి చూసేది నీవే కద మాయమ్మా

కమ్మగ చేసిపెట్టి కడుపు నింప నీకెంత తపనమ్మా


1.వయసు మీరి పోయినా విశ్రాంతి కోరుకోవు

ఇన్నేళ్ళు వచ్చినా నన్ను పసివాడిననే ఎంచేవు

డిల్లీకి రాజుగ నేనెదిగినా తల్లివి నీకు నేను బాలుడనే

నీ చల్లని దీవెనలే అమ్మా నా ఉన్నతి కెప్పుడు

మూలములే


2.ఏ చదువులు నేర్పలేవు నువు నేర్పిన సంస్కారం

పది మంది మెప్పుదలకు నీ పెంపకమే ఆస్కారం

నీ కడుపున పుట్టడం అమ్మా నా  జన్మకు పురస్కారం

నీ ఋణం తీరదెప్పటికీ ననుగన్న తల్లినీకు

పాదనమస్కారం



Thursday, May 5, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ప్రసాదమేనా నాకీ నిత్య విషాదం

నీకు ప్రమోదమౌనా ఈ వింత వినోదం

నీ ప్రదానమేదైనా నాకు ప్రధానం

నీ విలాసమే  సృష్టి విధి విధానం


ఎరుగక చేసితినేమో ప్రభూ ఏదో ఘోర అపరాధం

ఏడుకొండల స్వామి మన్నించు నా నిర్లక్ష్యపు అపచారం


1.ఒకటొకటిగ లాక్కొన్నావు లాఘవంగ అంగాలు

మాట పలుకు చేత నడకలాయె అప్పనంగ

నీ పాలు

ఎందుకింక మనకు మనకు ముసుగులో కా రణాలు

కోరకముందే ఇస్తున్నా స్వీకరించు నా పంచ ప్రాణాలు

ఇచ్చితివిప్పటికే నాకెన్నో యోగాలు వైభోగాలు

నీవేనా ఇచ్చేది ప్రతిఫలం గ్రహించు నా

వాసనలు వాంఛలు


2.అక్షరాల భాషయేల మన మధ్య ఆత్మకు పరమాత్మకు

అవసరాల యాచనేల మనకు పరస్పరం వేరుకాని యోచనకు

బింబము నీవు ప్రతిబింబము నేను ఐహిక దర్పణంలో

తొలగించగ అద్దానిని నేనే అబద్దానిని ఆత్మ సమర్పణంలో

ఎంతకాల మింక స్వామి నేను నాదను ఈ దేహ భావనం

అతలాకుతలమయే వెతల కతల గతుల మోహ జీవనం

 https://youtu.be/vrivw2wdo6w


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాయి బాబా అంటాం సాయి దేవా అంటాం

సాయి రామ అంటాం సాయి నాథా అంటాం

అనుక్షణం నిన్నే తలుస్తుంటాం

మనసారా నిన్నే కొలుస్తుంటాం

షిరిడీలో నిను దర్శిస్తాం నీ పాదం స్పర్శిస్తాం

జయజయజయ సాయిరాం ద్వారకామయి రాం

నమో నమో సాయిరాం నమో పరమ పావన నామ్


1. ప్రతివారిని సాయీ నీవుగా భావిస్తాం

అందరినీ నీరూపుగ ఎప్పుడూ తలపోస్తాం

కలమత భేదాలు లేక ఆత్మీయత చూపిస్తాం

సాటి మనుషులందరినీ సర్వదా ప్రేమిస్తాం

జయజయజయ సాయిరాం ద్వారకామయి రాం

నమో నమో సాయిరాం నమో పరమ పావన నామ్


2.కాలుకు నొప్పైనా సాయీ అని మూల్గుతాం

నువు చేసే జాప్యానికి నీ మీద అలుగుతాం

నీ అండ చూసికొని నిర్భయంగ నీల్గుతాం

నువు దయజూస్తె చాలు బ్రతుకంతా చెలగుతాం

జయజయజయ సాయిరాం ద్వారకామయి రాం

నమో నమో సాయిరాం నమో పరమ పావన నామ్

Wednesday, May 4, 2022

https://youtu.be/M9Y0qL66igA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


నరకేసరి నీకేవరు సరిసాటి

సరగున బ్రోవడమే స్వామీ నీకు పరిపాటి

వరముల నొసగుటలో నీవే ఇల ఘనపాఠి

మరిమరి నిను వేడుటేల మాతండ్రివి నీవంటి

భూషణ వికాస మా ధర్మపురి నివాస

దుష్టసంహార నరసింహా నిజ భక్తపోశ


1.తల్లిగర్భములోనే నూరిపోస్తివి భక్తిని

వెన్నతొ పెట్టిన విద్యగా కలిగిస్తివి అనురక్తిని

చిన్ననాటి ఆటల పాటల రేపితివి ఆసక్తిని

కోరిమరీ ప్రసాదిస్తివి ప్రభూ ప్రహ్లాదునికి ముక్తిని

భూషణ వికాస మా ధర్మపురి నివాస

దుష్టసంహార నరసింహా నిజ భక్తపోశ


2.పుట్టిపెరిగి నామయ్యా నీ కనుసన్నలలో

మనుగడ సాగింతుమయా నీ మన్ననలతో

మము సరి నిలుపవయా లోకోన్నతులతో

నిను విసిగింతుమయా నరుసయ్యా వినతులతో

భూషణ వికాస మా ధర్మపురి నివాస

దుష్టసంహార నరసింహా నిజ భక్తపోశ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మస్తు మస్తుగున్నదే నీవస్తువునైనందుకు

జబర్ దస్తుగున్నదే నే స్ఫూర్తినిస్తున్నందుకు

మంచికో చెడ్డకో మనసులొ చోటుందిగా

నా తలపేదొ నీలొ అలజడి రేపిందిగా

హాయిగా ఉందినాకు నీ విసుగు సైతం

వేదమల్లె వినిపిస్తోంది నీ వేసట గీతం


1.వెర్రి మొర్రి వేషాలన్ని దృష్టి మరల్చేందుకే

నిన్నుగిల్లుడెందుకంటే ధ్యాసలొ నిలిచేందుకే

పందాలు వేసుకుందాం ప్రేమ పెంచుకుందుకు

పోటీగ రాసుకుందాం ప్రజ్ఞ చాటుకుందుకు

హాయిగా ఉందినాకు నీ చిటపట రాగం

వేదమల్లె వినిపిస్తోంది నీదైన అనురాగం


2.నిన్ను చూసి చూడగానే మది ఆనందమయం

నన్ను కలుసుకోగానే నీకోపం మటుమాయం

చికాకు చిదంబర మర్మం ఎడబాటు ఫలితం

నీదని నాదని వేరేదిలేదు ఒకటే మనజీవితం

హాయిగా ఉందినాకు పరస్పరపు ఆసక్తి

వేదమల్లె వినిపిస్తోంది నీ మూగ అనురక్తి


OK

Tuesday, May 3, 2022

 

https://youtu.be/CbuGwsMgJ7c?si=3w2__u9XGKmBOrFD

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సంగీత శాస్త్రము నీ ఆవిష్కరణం

కమనీయ గాత్రానికి నీ కృప కారణం

తాండవ నృత్యము నీకొక ఆభరణం

నటనలు ఘటనలె నీకు సర్వసాధారణం 

నటరాజా నటేశ్వరా  స్ఫటిక లింగేశ్వరా

నిటలాక్ష హాటకేశ్వర రసలింగేశ్వరా

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


1. సాకర స్వరూపమే స్వర షడ్జమం  -స

రిధమరాజ రిపునిగా స్వర రిషభం - రి

 గళం గరళమౌ తరుణం స్వర గాంధారం - గ

మరులు మత్తుగొలుపగా స్వర మత్తేభం - మ

స్వరవిహార మనోహరా సైకత లింగేశ్వరా

త్రిపురాసుర సంహారా ప్రణవ లింగేశ్వరా


2.పంచభూతాత్మకమే స్వర పంచమం - ప

దేహాత్మ సంయోగమవగ స్వర ధైవతం - ద

నిరాకార నిర్గుణ ధారణే స్వర నిషాదం - ని

వినూత్న రీతి స్ఫురించెనీ స్వర సంభవం-ఓం

సంగీత నాట్యలోల భక్త పాల రాజలింగేశ్వరా

పంచాక్షరి ఔషధమే దీనులకిల రామలింగేశ్వరా

Saturday, April 30, 2022

 https://youtu.be/nDZPaoOfXf4?si=gXtGlK6cRYfUyKIG


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మల్లెపూలకు ముళ్ళున్నా నే నమ్మగలను 

మకరందం చేదని అన్నా ఒప్పుకోగలను

చందమామ నల్లబడినా నే బాధపడను

పికము గొంతు నాలా మారినా విస్తుపోను

నువు కరుణజూడవంటే విశ్వసింతునా వేంకటేశ్వరా

నువు కావగ రావంటే నేనోర్తునా మా రమేశ్వరా

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా


1. తీయగా మార్చగలవు ఉప్పునీటి బావిని

చల్లగా చేయగలవు మండుటెండ కాయు రవిని

ఇంపుగా చేర్చగలవు గాలికి పారిజాత తావిని

అన్నమయగ దయజూతువు శరణన్న ఈ కవిని

చిత్రమే కదలవంటె ఆర్తుల మొరలు విని

వింతయే నెరవేర్చవంటె భక్తుల మనవిని

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా


2.దరిజేరావు ఎదిరిచూచు శబరి అనునయానికి

లాలించావు  ఉడతనైనా చిరుసాయానికి

వరమిచ్చావు కుబ్జకు తగు సమయానికి

సారథివైనావు కిరీటికి అని ధర్మ విజయానికి

న్యాయమా నను పరికించగా ఈ ప్రాయానికి

భావ్యమా నను దూరం చేయగా ఆరోగ్యానికి

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా

Thursday, April 28, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాకిచ్చుడేమి వద్దు బులిపిచ్చుడింక వద్దు

కాంతా కనకాలనసలు ఎరవేయగా వద్దు

నిన్నడుగుడు వదిలేసా ఆ చెడుగుడు మానేసా

సమర్పించ సిద్ధపడ్డా నా బ్రతుకు నీ పదాల వద్ద

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా


1.నాయిలాలు నీకడ నాలుగు వేదాలు

ఇంద్రియాలు మదముడిగి నీకు అధీనాలు

అరిషడ్వర్గాలెపుడూ నీకామడ దూరాలు

చేర్చగలవు సులువుగా భవసాగర తీరాలు

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా



2.కార్తవీర్యార్జునుని కనికరించినావు

వ్యసనాల బానిసగా లీల ప్రదర్శించావు

అవధూతగ  అడుగడుగున దర్శనమిచ్చెదవు

గురు పరంపరకు నీవు ఆదిమూలమైనావు

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా

https://youtu.be/jZpyt2JSswo?si=UGIZenLYA6Jlo1NO

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: నట భైరవి

తూగుతున్నావన్నది నన్ను లోకం
నేను తాగడమే ఎరుగనోణ్ణి అన్నది సత్యం
కమ్మేసిందన్నది జనం బొత్తిగా నన్ను మైకం
మత్తుమందు ముట్టనోణ్ణి అన్నది వాస్తవం
నిన్ను తలుచుకున్న అన్ని సమయాల్లొ నెచ్చలీ
నిన్ను కలుసుకున్నప్పుడల్లా నా మనోహరి

1.పిచ్చి పిచ్చిగీతలేవేవో గీస్తుంటానట
పచ్చి పచ్చి రాతలేవేవో రాస్తుంటానట
రచ్చరచ్చగా చిందేసి తెగ ఆడేస్తుంటానట
ఇఛ్ఛారీతిగ ఏ పాటలో ఆగక పాడుతానట
నా కన్నుల్లో నింపుకున్నా నిన్ను మాత్రమే
నా హృదయంలో దాచుకున్నా నీ చిత్రమే

2.పిచ్చుక గూళ్ళేవో కడుతుంటానట
సీతాకోక చిలుకల్ని పడుతుంటానట
పచ్చాని చిలుకలతో ముచ్చటలాడేనట
వెచ్చదనంకై వెన్నెల జలకాలాడెదనట
నీ కోసమే వెచ్చించానంతే నా జీవితం
నా ప్రేమను చేసేసా ప్రేయసీ నీకు అంకితం



రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


హద్దు తప్పింది ముద్దరాల నా బుద్దే

వద్దు వద్దన్న వినకుంది ఈ పొద్దె

ముద్దంటు వద్దకొస్తే నన్నాపొద్దె

మద్దులొలుకు అందాల్ని ఇంకిత చేపొద్దే


1.కన్నుల్తొ కహానీలు చెప్ప బుద్ధి

చూపుల్తొ బాతాఖానీ వేయబుద్ది

ముక్కు జున్నుముక్కలాగ కొరక బుద్ది

పెదాల ఐస్ఫ్రూట్ ని చప్పరించ బుద్ది


2.చెంపల్ని చెంపల్తొ ఆన్చబుద్ధి

చెవులకున్న జూకాల్ని మీటబుద్ది

మెడవంపులో ఊపిరినొదల బుద్ధి

చుబుకాన్ని మునిపంట నొక్క బుద్ధి


3.ఎదమీద తలవాల్చి సేదదీర బుద్ధి

పిడికిట్లొ నడుముని ఇముడ్చ బుద్ధి

నాల్కెతో నాభిలోతు కొలువ బుద్ధి

మొత్తంగ ఇద్దరం ఒకటవ్వ బుద్ధి

Wednesday, April 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టించుకుంటే వెంట పడుతున్నమంటరు

పట్టించుకోకుంటే లోన బెంగపడుతుంటరు

చిక్కొచ్చి పడ్డదే ఈ చక్కని చుక్కలతొ

చిక్కిపోక తప్పదు ఆ చిక్కనైన దృక్కులకు


1.సోగ కన్నులతో చేస్తుంటారు సైగలను

సొట్ట బుగ్గలతో వేయిస్తారు లొట్టలను

పంటినొక్కులతొ తెప్పిస్తారు తిప్పలను

మూతి విరుపులతొ కలిగిస్తారు ముప్పులను


2.పరేషాన్ చేస్తారు పదేపదే పైట సవరింపుతో

తమాషానే చూస్తారు చీర నాభి అమరింపుతో

మషాలా గుప్పిస్తారు గుంభనాల పలవరింపుతో

నిషా ఎక్కేలా చూపిస్తారు అందాలు చిలకరింపుతో

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కవితకు కంటకం నీ ఎడబాటు

నా పాటకు సంకటం నిన్నుగనని లోటు

పదపదమున కదలలేక నా కలపు తడబాటు

ఏ క్షణమూ నను వదలక నీ తలపు చొరబాటు

పరిచయమైతివేల గుండెను మండించ

ప్రేమను కురిపించవేల కలలను పండించ


1.కలిసిన మన అభిరుచులు కలిపెనులే మనసులు

కలవరమొందగా ఊరటనిచ్చె నీ ప్రియ వచనములు

అలసిన తరుణాన వింజామరలాయే నీ చిరునగవులు

నీకదలిక నీమెదలిక నా కవనపు మేలి బిగువులు

చెలిమిని చేసితివే నా స్ఫూర్తిదాతగా

వేదన రేపితివే వరమీయని దేవతగా


2.నీవు మాత్రమెరుగవనా నా ఊపిరి నీవని

నా హృదయ చలన సూత్రమై మారితివీవని

కవిత సంగతేమొ గాని జీవితమిక దుర్భరము

సడలుతోంది నువు లేక బ్రతుకుఎడల నిబ్బరము

నీ చేతిలొ నా మనుగడ నిష్కమణ

చేయబోకె నెచ్చెలి నన్ను నిరాదరణ

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిన్ను దీవించాలి నింగి దేవతలంతా

శతమానం భవతియని

ఆశీర్వదించాలి సకల మానవులంతా

చిరంజీవ చిరంజీవాయని

అందించాలి బంధుమిత్రులు శుభాకాంక్షలు

వర్ధిల్లాలి దినదినమూ ఆయురారోగ్యాలు

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  భరద్వాజ

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ


1.నరదృష్టి పడకుండా నరసింహుడు కాచనీ

పరఘాత సోకకుండా  పరమేశుడు సాకనీ

అండగా ఉండనీ కొండగట్టు ఆంజనేయుడు

నిను ముందుకు నడపనీ వర  సిద్ది వినాయకుడు

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ


2.మనస్థైర్య మీయనీ నీకు శ్రీ మణికంఠుడు

నవ్వులు చిగురింనీయనీ షిరిడి సాయినాథుడు

సిరులతొ తులతూగనీయనీ శ్రీ మహాలక్ష్మి

మేధకు బలమీయనీ మాతా బాసర సరస్వతి

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  భరద్వాజ

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ

https://youtu.be/Ajvuh_bH9M8


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మూగయే నాకన్నా ఎంతో మేలు

నిను పాడని నాగొంతు కంతను పోలు

నీపదములు నేనొదలను అమ్మా శారదా

నీపదముల సాధనలో తరించనీ నను సదా


1.మృదు మార్ధవ గళమునకై  

మరిమరి నే జన్మిస్తా

మధుర గాత్ర మరయగనే

తక్షణమే మరణిస్తా

ప్రాధేయపడితినమ్మా నిన్ను పదేపదే

పలుచన చేసితివే పరితపించ నామదే


2.కారునలుపు నీయనుంటివి

కోయిల గళమును వరమిచ్చి

గాయాలే చేయనుంటివి

వేణువుగా నన్నే మలచి

ఉరితీగలు భరింతును వీణగ నను మార్చవే

ఊపిరి నర్పింతును గొంతులొ సుధ చేర్చవే

 

https://youtu.be/oACd0dP9ioM?si=xi9Qb0PXUQylr5yA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతటి వాడినని ననింతగ జేసినావు

అంతరంగమెరిగి నటుల ఆశలు దీర్చినావు

పొంతనలేదునా పనితనముకు ఫలితముకు

ఉన్నతంగ ఉంచినావు చింతనురానీక నా చెంతకు

శ్రీకాంత శ్రీహరి వేంకటాచలపతి

సతతము నే  నిలిపెద నిన్నే నా మతి


1.తండ్రివి నీవయి నను నడిపించినావు

తప్పులు చేసినపుడు దండించినావు

నాగుండెను నీదండలొ గుచ్చి మెడలొ వేసినాను

అండదండ నీవేయని దండిగ నిను నమ్మినాను

కొండెక్కి నినుజేరెద కొండలరాయా

కొండెక్కనీయకు నాభక్తి డంబునీయ


2.చిరునవ్వును నాటితే సిరుల పూలు పూసినావు

సాయమునందీయగ ఎందరికో బంధువుజేసినావు

సిద్దపరచు నా బుద్దిని సత్కర్మలు చేయునట్లు

పద్దులనెంచని మంచివిద్దెనీయి నీపదములు చేరునట్లు

ఇచ్చినదంతా నీదే స్వామి నీ ఇచ్ఛమేరకు

నచ్చినట్లు నను నడుపు చివరిశ్వాస వరకు

Friday, April 22, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చంపేంత క్రూరమా ప్రేమంటే

చచ్చేంత దైన్యమా ప్రేమంటే

కుదిరెనా జతగా చేరాలి ఆరాధిస్తే

చెదిరినా హితమునే కోరాలి ప్రేమిస్తే

ప్రేమంటే ఇష్టము  

కానేకాదు నికృష్టము ఇదిస్పష్టము

ప్రేమంటే సంతుష్టము

చేయవలదు సంక్లిష్టము కానీకు భ్రష్టము

ప్రేమంటే అదృష్టము


1.మనసు చూరగొనడం

మమత పంచుకొనడం

అనురాగమంటె ఆశించకపోవడం

వలపు దాచి ఉంచడం

వేచి వేచి ఉండడం

మరుజన్మకైనా నోచుకొనగ తపించడం

ప్రేమంటే ఆపారమైన ఇష్టము

ప్రేమంటే సంతుష్టము అదృష్టము


2.వెంటాడి వేధించడం

బ్రతిమాలి యాచించడం

ఒప్పుకోనప్పుడు ఆసిడ్ పోసెయ్యడం

బెదిరించి భయపెట్టడం

నమ్మించి వంచించడం

వాడుకొని ఆడుకొని పీకలు కోసెయ్యడం

ప్రేమ కాదు పైశాచికత్వము

ప్రేమ కాదు వెర్రి వైరాగ్యము

Thursday, April 21, 2022

 

https://youtu.be/UI827s-j5vM?si=lzcPD-OAeNNpWd79

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నయనాలు రాస్తాయి చూపులతో ప్రేమ లేఖలు

అధరాలు గీస్తాయి ముద్దులతో ప్రణయ రేఖలు

నీ అందచందాల్లో గతమెరుగని ప్రబందాలు

నీ హావభావాల్లో అపూర్వమైన  కావ్యాలు

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


1.నీ నీలి కురుల భాష్యం శృంగార నైషధం

నీ అధర మకరందం విరహ బాధకు ఔషధం

నువు చెంత ఉన్నంత కాళిదాసు శాకుంతలం

నువు లేనివేళంతా మనసు అతలాకుతలం

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


2.  అగుపింతురు నీలోనే అష్టవిధ నాయికలు

వగపు మించి ఆలపింతురు జయదేవ గీతికలు

నీ విలాసమందున ద్యోతకమౌ హరవిలాసం

నీవుంటే జీవితమంతా శాశ్వతమౌ వసంతమాసం

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


PIC COURTESY: SRI Agacharya Artist

 

https://youtu.be/Xi6Cy-vTu-0?feature=shared

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


నా ప్రతి అవయవం సాంబశివం

నా కాయం పరమశివ మయం

నా ప్రాణం నాజీవం సదా శివం

దేహాత్మ భావరహితమై శివోహం శివోహం 

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.మదము నదిమితె నాశిరం శివశంకరం

ముదము నోచని నాకనులు గంగాధరం

అదుపుతప్పెడి నా నాల్క నాగేశ్వరం

మధువులొలుకని నా గళం గరళధరం

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మమకార మయమై నా మనసు రాజేశ్వరం

స్వార్థపూరితమై నా తలపు అరుణాచలేశ్వరం

సాయమెరుగని నా కరద్వయం కాశీ విశ్వేశ్వరం

సరిదారినెరుగని నా పదయుగళి కేదారేశ్వరం

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

https://youtu.be/smLmnVVb_oE


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాటకు ప్రాణం పోయుదమా

పాడుతు ఎదలే మీటుదమా

ఆహ్లాదమొలికే రాగముతో

సాంత్వన పలికే భావనతో


1.శ్రుతిలో లయలో సమతుల్యతతో

అలతి అలతి పద ప్రాస రమ్యతతో

శ్రవణపేయమై లలిత గేయమై

రసికుల నలరించు రీతిగా

ఓలలాడగ మురిపించు గీతిగా


2.పల్లము పారే ఏరుగా పల్లవి తీరై

ఉల్లము పొందే హాయికి మారు పేరై

చరణాలు వడివడి సాగెడి రాదారై

ఎలుగెత్తి మైమరచి ఆలపించి

సహానుభూతితో పలవరించి


3.కోయిల కమ్మని పాటకు దీటుగ

జుమ్మను తుమ్మెద నాదపు సాటిగ

మార్ధవమే రంగరించి మాధురి మేళవించి

ప్రకృతిగా మేను పరవశించ

సుకృతిగా మనసు పులకరించ

Wednesday, April 20, 2022

 

https://youtu.be/WuRqsgV3Lhs?si=mcjL2z_l_7eR1NAg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వర పుత్రులు శ్రుతి గాత్రులు

స్వర ద్రష్టలు గళ శ్రేష్టులు

అంగడిలో దొరకదు మాధుర్యము

సాధనతో అబ్బదు ఆ మార్ధవము

జన్మజన్మల పుణ్యమే ఆ అదృష్టము

అమ్మలాలి మధురిమే ఆ సుశ్రావ్యము


1.సహజమైన గమకాలు అమరడం

గొంతు నుండి తేనెవాన కురవడం

రాగతాళాలతో రమ్యత రాటుదేలడం

భావనతో మమేకమై గాన మొలకడం

జన్మజన్మల పుణ్యమే ఆ అదృష్టము

అమ్మలాలి మధురిమే ఆ సుశ్రావ్యము


2.అపాత్ర దానమని తలచవద్దు దైవం

వృధాగ మారనేల అపురూప పాటవం

ఎలుగెత్తి పాడితే శంఖానికి పరాభవం

మనోధర్మ సంగీతంతో గీతానికి ప్రాభవం

జన్మజన్మల పుణ్యమే ఆ అదృష్టము

అమ్మలాలి మధురిమే ఆ సుశ్రావ్యము


https://youtu.be/P6rfJPrHncY?si=wSU7qb_XSwYV_aU8

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వీడికి మూడు నామాలు వాడికి మూడు నేత్రాలు

ఎంచిచూడబోతె సామ్యాలు ఇద్దరివొకటే సూత్రాలు గోత్రాలు

లీలామానుష వేషధారి ఒకడు

భోలా శంకర నటరాజు ఒకడు

మొక్కుతున్నా వాళ్ళనెపుడు లెక్కలేనన్ని మొక్కులు

తీర్చుకుంటె దిక్కులేదిక నాకున్న చిక్కులు


1.నది అంటే ఇష్టం వాడికి

కడలంటే ఇష్టం వీడికి 

నీరంటే ప్రీతే ఇద్దరికి

గిరులలో ఉనికి వాడికి

గిరులంటే తేలిక వీడికి

మొత్తానికి భూమే నచ్చును ఇరువురికి


2.కన్నులో నిప్పులు వాడికి

కడుపున జఠరాగ్ని వీడికి

అగ్గి ఎడల మొగ్గే ఇరువురికి

వాయువై లోనికి వీడు

ఆయువే తీయును వాడు

పంచ ప్రాణ వాయువులే ఉభయులు


3.విశ్వాకాశపు వ్యాపి వాడు

విశ్వాంతరాళ రూపి వీడు

శూన్యమంత ఆవరించిన శక్తి రూపులు

పంచభూతాలుగా వాడు

పంచప్రాణాలుగా వీడు

ద్వయతత్త్వాలూ ఒక్కడే ద్వయరూపీ అద్వైతుడే

Tuesday, April 19, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏకల్లె వచ్చి మేకల్లె గుచ్చుతారు

ఉండనీకి జాగనిస్తె పండ మంచమడుగుతారు

తిన్న ఇంటి వాసాల్నే లెక్కపెట్టుతారు

అక్రమంగ చొరబడితూ దేశామాక్రమించుతారు

నమ్మరాదు బాబోయ్ అసహనమనే వాదులను

నమ్మరాదు నమ్మరాదు ముసుగు చాటు మూకలను


1.ఉన్నచోట ఉండరు అన్నిట్లో తలపెడతారు

కావాలని రెచ్చగొట్టి రచ్చ రచ్చ చేస్తుంటారు

తమలాగ మారని వారికి బతుకు హక్కులేదంటారు

పచ్చనింట్లొ చిచ్చుబెట్టి తమలోకి లాక్కుంటారు

నమ్మరాదు బాబోయ్ అమ్మరొమ్ము గుద్దేవాళ్ళను

నమ్మరాదు పాలుత్రాగి విషం చిమ్ము ద్రోహులను


2.ఉసురు తీసుకుంటారు మూగజీవాలది

కసిగ మసిని పూస్తారు తమ అభిమతాలది

లోకువే ఘనసమూహాలు లౌక్యజగతిలో

ఐక్యతే కొరవడిపోతే అపఖ్యాతి భవితలో

నమ్మరాదు బాబోయ్ నవ మానవ మర్కటాలను

నమ్మరాదు సవాళ్ళతో సఖ్యత త్రెంచే

ముష్కరాలను

Monday, April 18, 2022

 వగలే సింగారమాయే

వగరే నయగారమాయే

వగపు నాకు స్వీకారమాయేమి

వలపు మాట బంగారమాయేమి


ఓ గోపిక పరికించకు నా ఓపిక

ఓపలేను నినుగనక ఓ క్షణమిక


1.అల్లనేరేడు పళ్ళ నీ కళ్ళ మీదనే నాధ్యాస

నోరూరే బూరెల చెక్కిళ్ళ మీద నాకెంతో ఆశ

పనసతొనలు నీ పెదాలు ఉవ్విళ్ళూరించేను ఆ మిసమిస

చెఱకు గడలొ మాధుర్యం- నీ రసన గ్రోల నా రసన నస


ఓ గోపిక పరికించకు నా ఓపిక

ఓపలేను నీ విరహపు తీక్షణ యిక


2.దాహం తీర్చగ అందించు ముందు పాలకుండలు

ఆ వెనకే సిద్ధపరచు సేదదీర ఉబ్బెత్తు ఇసుక దిబ్బలు

నడుమన నాకిష్టం మెత్తనీ మడతల మీగడలు

తేనె నాస్వాదించగ కడుపొక్కిలి దక్కగ రగడలు


ఓ గోపిక పరికించకు నా ఓపిక

ఓపలేను నీ ఎడబాటు నిరీక్షణయిక

Sunday, April 17, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒకే వైపు నీ యోచన

అదే పనిగ నీ యాచన

ఓపలేని తీపి యాతన

నీ పిలుపు వలపే నాకు చేతన


1.ఏ దే మై పోయినా

కాలం తో నే పోరినా

కత్తిమీద సాము నాకుగ కోరినా

కన్నీటి మడుగే మరి ఏమారినా


2.సమయం సహకరించక

నాకేటూ మనస్కరించక

డోలాయమానమాయెనా ఎద ఇక

విధే తీర్చునొకనాడు  మన వేడుక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవు నాకే సొంతము-జీవితపర్యంతము

నీతో అనుబంధము-పూర్వజన్మ సంబంధము

ఈగైనావాలకుండా నిను కాచుకుంటా

నీకాలు కందకుండా నే చూసుకుంటా

నీసర్వహక్కులు నావే నీ బరువు బాధ్యత నాదే

నా ఆస్తిపాస్తివి నీవే చెలీ నా జాన్ దోస్తువు నీవే


1సూర్యకిరణం నిన్నుతాకినా ఓర్వలేను ఓ క్షణమైనా

మలయపవనం నిన్ను సోకినా తాళలేను ఓ నా మైనా

గుండెలోన దాచుకుంటా ఎవ్వరికీ చిక్కకుండా

నా మనసుగ మార్చేస్తా పరులకు ఇక దక్కకుండా

ఈ మాత్రం  ప్రేమ ఉంటే ఆ మాత్రం అసూయ సహజం

నీవంటి చెలి ఆలైతేనో స్వార్థమవద ఒంటి నైజం


2.దేవతలా ద్యోతకమవుతే నీ ఎడల భక్తే జనులకు

యోగినిలా దర్శనమిస్తే ఆరాధన యతులకు మునులకు

నే రాసే ప్రతిగీతంలో నిను స్తుతిస్తు వర్ణన చేస్తా

నా కవితలొ పదములను హృదయంలొ ముంచిరాస్తా

ఈ మాత్రం నను కరుణిస్తే ఆమాత్రం సేవచేయనా

నీలో నేనైక్యమైపోయి అద్వైతపు భావమందనా

Saturday, April 16, 2022

 https://youtu.be/W33fVoHgUZ8


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏడు జన్మల తోడు ఏడు కొండలవాడు

ఎడబాయని మిత్రుడు శ్రీ శ్రీనివాసుడు

ఎలమి అలమేలుతో కూడి చెలఁగెడివాడు

ఏకాదశి వ్రతమున్నచాలు ప్రీతిజెందెడివాడు

ఏడేడు లోకాలకాప్తుడు భవతాప హరుడు


గోవిందుడు గోవిందుడు సుందరాకారుడు

గోవిందుడు గోవిందుడు భక్తమందారుడు


1.ఏనాడు ఏ పాపమే రీతిచేసేమో

ఏచోట ఏదోషమెందకొనరించితిమో

ఎక్కడకు వెళితేమి దక్కదేమాత్ర పుణ్యము

ఎక్కినంతనె గిరులు ముక్తి బొందుట తథ్యమ


గోవిందుడు గోవిందుడు కరుణాంతరంగుడు

గోవిందుడు  గోవిందుడు భవసాగర నౌకా సరంగుడు


2.ఎదుట స్వామి కనబడితే ఎదకెంతో మోదము

ఎన్నగ  ఎవరి తరము పన్నగశాయి చరితము

ఏకాగ్రచిత్తమే స్వామిని చేర్చెడి ఋజు మార్గము

ఎరిగి మెలిగినంత జనులు పొందగలరు మోక్షము


గోవిందుడు గోవిందుడు అరవింద నేత్రుడు

గోవిందుడు గోవిందుడు శరణాగత త్రాణుడు

https://youtu.be/tUpPb1NEc8w?si=5Gc191Jf9U9Zs3Jz

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:చారుకేశి

నువ్వేమో బిజీ బిజీ-నా మదిలో గజిబిజి
నిను చూడక పడలేను పరిస్థితులతో రాజీ
నను బుజ్జగించ  జూసి అలసె -మా ఇంటి సన్నజాజి

1.పున్నమి నాడే నింగిలో నిండు జాబిలి
నీ శశివదనాన నిరతము వెన్నెలే నాచెలి
తాళజాల నువులేక ఈ మండు వేసవి
నీవు నాతావునుంటే చిరుగాలి విరితావి
నువ్వేమో నల్లపూస-నాకేమో నీదే ధ్యాస

2.వనమున మంజులము సౌరభము గులాబి
రసనకు కడుమధురము కమ్మదనము జిలేబి
అదికన్నా ఇదితిన్నా ఔనన్నా కాదన్నా నీదే తలపు
ఎన్ని ఉన్నా నీవులేక గడుపుట గగనమే ప్రతిమాపు
నీకు నేను మామూలే-నువ్వు నాకు పంచప్రాణాలే


https://youtu.be/NUqeGNfk6v4


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయరవిచంద్రిక


ఇంటింటి దేవుడు మాయింటి దేవుడు

యుగయుగమందునూ కనిపించు దేవుడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర


1.త్రేతాయుగములో సీతారాములకు వారధియైనాడు

ద్వాపరమందున పార్థుని రథమునకు కేతనమైనాడు

రామ భజన వినిపించిన తావేదైనా ప్రత్యక్షమౌతాడు

రోమరోమ మందున రాముని నిలుపుకొన్న పవనాత్మజుడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర


2.పెదవులపై రామ స్మరణ ఎప్పుడూ తప్పనివాడు

హృదయములో శ్రీ రాముని ప్రతిష్ఠించుకున్నవాడు

సూర్యుడినే పండుగా మ్రింగేసిన ఘన శూరుడు

సిందూర ధారణతో సీతమ్మను అలనాడు అబ్బురపరచిన వాడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనులలో ఏదో తెలియని కసి ఉంది

మనసునే మరీ మరీ ఉసి గొలుపుతోంది

అందం మాత్రమే నీ సూత్రంకానే కాదు

నీ ఆకర్షణ ఎవ్వరినైనా చిత్తు చేయకపోదు

 

1.కన్నులనొదిలెయ్ కురులదే కట్టిపడేసే ఘనత

ముంగురులేమో లేమా నీ ముక్కుపుడుకదే గొప్ప

పెదవుల పాత్రా తక్కువె కాదు చూపుకె ఆరును నా మోవి

అధరాలటుంచి మత్తులొ ముంచును నీ

మేని తావి


2.దబ్బపండు ఛాయ ఒళ్ళు అబ్బా… అనిపించు

పట్టులాంటి ప్రతితావు తనువును తాకు

తపనే పెంచు

తమలపాకు తలపించే పాదాలు ఎంతో మురిపించు

అణువణువున ఆమని సొబగే అనవరతం నీలో

వికసించు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విరి బుట్టలో కూర్చున్న ఓ బుట్టబొమ్మ

పలువన్నెలు రువ్వుతున్న పూలకొమ్మ

ఏడు రంగులున్న నింగి సింగిడి నీవమ్మా

సప్తవర్ణ సంకీర్ణ శ్వేత కిరణమే నీవమ్మా


1.నా సప్తవ్యసనాల సంకలనం నువ్వు

సప్తస్వరాల సమ్మిళితం గలగల నీ నవ్వు

సప్తమహా ఋషులైనా దాసులౌదురంటె నమ్ము

సప్తగిరీశుని చలవతో నను నీవాడినవనిమ్ము


2.సప్తపదే నడవగ నీతో పదే పదే మదికోరే

సప్తతాళాలలో హృదయం నీకై సందడి చేసే

సప్త సముద్రాలొకటైనా మారదు నా తీరే

సప్త ముక్తిధామాలే ఇల నీవుగ సమకూరే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ భారత నిర్మాత-రాజ్యాంగపు నిర్ణేత

బహుజనులకు వెలుగిచ్చిన దివ్యజ్యోతి

సబ్బండవర్గాల ఆశాజ్యోతి అసాధారణ ప్రజ్ఞాజ్యోతి

నేడు అంబేద్కర్ మహాశయుని జయంతి

యుగాలు మారినా చెదరదు ఆయన ఖండాంతర ఖ్యాతి


1.అట్టడుగు వర్గంలో జనియించినా

వెనకడుగేవేయలేదు ఏనాడు

అంటరానితనం వింతరోగమంటూ

సమాజానికెదురొడ్డి నిగ్గదీసినాడు

ఉన్నత చదువులు చదివి దేశానికె వన్నె తెచ్చినాడు

గాంధీజీ ఎదుటనిలిచి తన తత్వం తెలిపినాడు


2.ప్రపంచాన అతి పెద్దదైన 

రాజ్యాంగం పొందుపరిచాడు

హక్కులు బాధ్యతలను విధిగా 

దేశ పౌరులకేర్పరచినాడు

కులమత రహితమైన సమాజానికై పోరు సలుపినాడు

అసాధ్యాలనెనన్నొ సుసాధ్యాలుగా మలచిచూపినాడు

Wednesday, April 13, 2022

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గాలిమోటరెక్కిస్తా

సంద్రాలు దాటిస్తా

దునియ మొత్తమంతున్న

దుబాయికే తోల్కపోత

రాయే రాయే నా రంగసాని

సూసినాంక కాకెమరి పరేషాని

రాయే రాయే నా రంగసాని

కొత్తగా సూపిస్తా జీవితాన్ని


1.బంగారుగాజులని సంబరంగ కొనిపెడ్తా

రవ్వల నకిలేసుని మెడలో దిగబెడ్తా

కాళ్ళకు ఘలుఘల్లు గజ్జలనే చేపిస్తా

నడుముకు ఒడ్డాణపు నగనే పెట్టేస్తా

చమకు చమకంటూ మెరిసే 

చీరలెన్నొ నీకు ఇనాంగ నేనిస్తా

రాయే రాయే నా రంగసాని

రాలుగాయివే నా ఇంటి రమణి


2.ఖజ్జూరపు చెట్టంటి దీవులను జూపిస్తా

బుర్జు ఖలీఫా బిల్డింగును ఎక్కిస్తా

ఎన్నడూ  నువ్వు తినని రుచులన్ని

కమ్మ కమ్మగ నీకు కడుపార తినబెడ్తా

ఒంటెల బండిగట్టి ఎడార్లో తిప్పిస్తా

మన జంట అందంతొ జనాల్నే మెప్పిస్తా

రాయే రాయే నా రంగసాని

మస్తుగుంటది జిందగి నీతోని


PIC courtesy: Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తలమునకలుగా నీవు నీ పనులలో

నీ తలపులే ఊపిరిగా నే తపనలో

నీ మనసులో ఏమున్నదో ఎరిగించవు

నా ఎదలయ ఏమంటున్నదో గ్రహించవు

ఎలాచావనే నీతో నను మరి'చావనే వెతతో


1.తొలిచూపులోనే నాదానివిగా భావించాను

నన్నాదేశించే వేదానివిగా తలదాల్చాను

అనుక్షణం నీవే నా మోదానివిగా తలపోసాను

నను నడిపించే మేధావినిగా ఆరాధించాను

ఎలా చావనే నీతో నను విడిచావనే దిగుల్తో


2.మాటతప్పుతుంటావు మాటిమాటికీ ఎందుకో

బాస మరచిపోతావు పదేపదే ఎందుకో మరెందుకో

సాధ్యమో అసాధ్యమో ఈ జన్మకి మన కలయిక

కాలం కరుగుతుంటే నా ఓపికనే కరిగే కల ఇక

ఎలా చావనే నీతో -   బ్రతుకన్నా చావనే భావనతో

Tuesday, April 12, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మానవ అవతారమెత్తిన అమ్మోరువో

నిండైన దైవత్వం నింపుకున్న దేవేరివో

కదలదు నా దృష్టి క్షణమైన నీనుండి

కరుణించావు నేకన్న కలలు పండి


1.తిలకము మీద చూపు సారించునంతలో

కనులే చేసేను కనికట్టులేవో

నయనాల మత్తులో మునిగిపోయేంతలో

అధరాల అరుణిమే రేపేను ఆకర్షణలేవో

సాక్షాత్తునీవే సౌందర్య లహరివే

ప్రత్యక్షమైన అపర పరమేశ్వరివే


2.ముక్కెర ఒక్కటే కొక్కెము వేసేను చిక్కగ నా దృక్కులకు

చక్కని నీ నగవే హాయిని గొలిపేను మిక్కిలి హృదయముకే

పంచభూతాత్మికవు ప్రపంచ ఏలికవు

శాంతించిన కాళికవు ఆనందపు గుళికవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సూదంటురాళ్ళు చక్కని నీ కళ్ళు

చూసేకొద్ది పుట్టు ఎదలో ఎక్కిళ్ళు

కవి తల వెలిసే కవితల పుట్టిళ్ళు

స్వప్న సౌధాలకే అందాల లోగిళ్ళు

దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు


1.కొత్తగా చూస్తున్నా కలువలకున్న గుచ్చే చూపుల ముళ్ళు

విస్తుపోతున్నా  కను మీనాలాయే నీలొ నర్తించే నెమళ్ళు

గులాబీలు పూస్తున్న  చిత్రమైన చెక్కిళ్ళు

అంతలోనె నవ్వుతుంటె బుగ్గల వింత సొట్టళ్ళు

దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు


2.నడుమొంపులోనా వళ్ళుతిరిగే సెలయేటి ఉరకల పరవళ్ళు

నాభి కనగ సహకరించు సుళ్ళుతిరిగి ఉసిగొలుపగ దోపిన కుచ్చిళ్ళు

ఆరావళి మేరుగిరుల ఇరుపక్కల ఆనవాళ్ళు

మంటలేక చలికాగగ బిగి కౌగిళ్ళే నెగళ్ళు

దనివారదు నిను గాంచ  రేయింబవళ్ళు

 https://youtu.be/V9pNeyUk-K8


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పలుకనీ పలుకనీ పలుకని నా నాలిక

పలుకనీ పలుకనీ పలుకలేని గొంతుక

పలుకనీ పలుకనీ భవతారకమౌ నీ మంత్రాలిక

పలుకనీ  సదా పరవశమొలికించెడి నీ నామాలిక

పలుకీయమనుట పలుకనీయమనుట

ఔతుందా స్వామీ గొంతెమ్మకోరిక


1.పలుకనీ నా పలుకులు నిను స్మరియించగా

పలుకనీ నా తలపులు నిను స్ఫురియించగా

పలుకనీ నా చూపులు నిను స్పృశియించగా

పలుకనీ నా పలుకులు నేనిక తరియించగా

పలుకీయమనుట పలుకనీయమనుట ఔతాయా స్వామీహి రణ్యాక్షవరములిక


2.పలుకనీ నా పలుకులు నీపై తేనియలొలుకగా

పలుకనీ నా పలుకులు నీ మేన గంధము చిలుకగా

పలుకనీ నను నిన్నే మనోవాక్కాయ కర్మలలో

పలుకనీ  నిన్నే అజన్మమొందుదాక జన్మజన్మలలో

పలుకీయమనుట పలుకనీయమనుట 

ఔతుందా స్వామి త్రిశంకు స్వర్గమంటి బ్రాతిక

ఒక


https://youtu.be/lKLVvUsNEFA


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోవిందనాముడు సుందర వదనుడు

అరవింద నేత్రుడు నిజ భక్తవరదుడు

ఎందుగానరానివాడు డెందమందె ఉంటాడు

సందుదొరికితెచాలు బంధనాలు వేస్తాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి


1.ఉన్నచోట ఉండనీయడు తిన్నగా యోచించనీయడు

ఎండమావుల వెంట పరుగులు తీయిస్తాడు

 రాయిలాగ ఉలకడు పలకడు రాలుగాయి కొండల రాయుడు

రాగద్వేషాల వలలొ చిక్కుబడగజేస్తాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి


2.మాయలెన్నొ చేస్తాడు మత్తులోన ముంచేస్తాడు

చెడ్డదార్లు తొక్కేలా మనల మభ్య పెడతాడు

మా దొడ్డ మారాజు మా వడ్డికాసులవాడు

దీనులకిల దిక్కైన ఆపద మొక్కులవాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి

Wednesday, April 6, 2022

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కడో చూసినట్టు ఉంటుంది

ఎప్పుడో కలిసినట్టు ఉంటుంది

స్మృతిపథం నుండి మాయమౌతుంది స్నేహితం

మెదడు అట్టడుగుపొరల్లో నిక్షిప్తమౌతుంది నేస్తం

తాజాదనం కోల్పోయి వాడిపోతుంది సోపతి

ఎదగని ఒక పిందెలాగా రాలిపోతుంది చెలిమి


1.మైత్రీవనంలో నిత్యం పూలెన్నొ పూయించాలి

రకరకాల పూలమొక్కలు ప్రేమగా పెంచాలి

ఏ తెగులు పట్టకుండా జాగ్రత్తగ పోషించాలి

తగినంత నీరందించి ఎదిగేలా చేయాలి

ఏమరుపాటన్నది  ఏపూటకు తోటకి చేటే

గాలికి వదిలేసామంటే చెడిపోవుట పరిపాటే


2.పలుచూపుల ముళ్ళున్నా గులాబిలా విరియాలి

నాగులతో హానిఉన్నా నవ్వుల మల్లెలు రువ్వాలి

గుడిలోకో గుండె పైకో చేరాలని మరి కోరాలి

మొక్కనుండి విడివడకున్నా తావిగా వ్యాపించాలి

తేటి కొరకు మకరందం దాచి దాచి ఉంచాలి

మనసులోని భావావేశం స్నేహితులకె కద పంచాలి

Monday, April 4, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెరుగుతుంది చేవ్రాలు

చెప్పకనే వీడ్కోలు

ముందో కాసింత వెనకో ఏ ఊహకందకా

మురిపించి మూన్నాళ్ళు

చెరిపేసి ఆనవాళ్ళు

కనుమరగౌతుంది కవిత ఎవరికీ చెందకా


1.రేపు మాపు వాయిదాలే

రేపుతాయి  గాయాలే

అర్థోచిత కథలకైనా

అర్ధాంతర ముక్తాయింపులె

ఇల్లు దిద్దుకోవాలి దీపమున్నప్పుడే

ఎదకు హత్తుకోవాలి ఎదురు పడినప్పుడే


2.గెలుపన్నది లేని చోట

అందరిదీ ఓటమి బాటే

మనకైతే ఏమీ కాదని

ఎగిరి పడుట పరిపాటే

మనసువిప్పి చెప్పాలి సంశయించకా

మరిదొరకదు మరుక్షణం తరుణం మించనీక

Friday, April 1, 2022


https://youtu.be/1kchGwkDQpk


మంజుల గీతమొకటి వినిపించవే పికమా

మంగళ వాద్యమై రవళించునట్లుగా

మల్లెలూ జాజులను కురిపించు పూవనమా

పరిమళాలు విరజిమ్మవె మలయ పవనమా


స్వాగతాలు పలుకవే ఋతురాజుకు

వత్సరాది ఉగాది నేటి పండుగ రోజుకు

శుభములు కూర్చనున్న శుభకృతుకు

సుఖముల నొసగనున్న కాల దేవతకు


1.నిన్న మొన్న గతకాలపు చింతను మరవమని

చేసిన తప్పిదాలతో గుణపాఠం నేర్వమని

రానున్న కాలానికి రాశిఫలం శుభమస్తేయని

అరు రుచుల ఆస్వాదన జీవిత పరమార్థమని

చెప్పకనే చెబుతోంది ఆమని ఎరుగమని

అక్కున చేర్చుకొని పంచనుంది ప్రేమని


2.నెలకు మూడు వానలుగా రైతుకు బాసటగా

బడుగు బ్రతుకు మూడుపూవులారుకాయలుగా

యువతకు చైతన్య స్ఫూర్తి ఇనుమడించినట్లుగా

మహిళకు స్వావలంబన సమకూర్చునట్లుగా

అరుదెంచెను అదిగదిగో  ఆమని

కొనితెచ్చెను కానుకగా చైత్రపు శోభని


https://youtu.be/Kef_7pzE9rE

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: హంసానంది


నా గార్వమంతా నీదగ్గరే

నా అల్గుడంతా నీ ముందరే

తల్లివి నీవుకాక పరులెలా భరిస్తారు

అమ్మవు నువ్వు కాక అక్కునెవరు జేర్చెదరు

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే


1.కడుపే నింపెదవో నా ఆకలి చంపెదవో

బ్రతుకంతా పస్తులుంచి నను పరికించెదవో

అడిగినదిచ్చెదవో ఆశలు త్రుంచెదవో

అప్పచ్చులేవో చూపి సముదాయించెదవో

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే


2.సుధనే పోసెదవో వ్యధనే తీర్చెదవో

మదిలో నిండుకున్న గుబులే ఆర్పెదవో

శిఖరము చేర్చెదవో ఫకరే నరికెదవో

పరమ పదము నందించి నందింప జేసెదవో

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే

Thursday, March 31, 2022

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోయిల మూగవోతుంది

కిసలయాలు కరువైతే

నెమలి నాట్యమాగుతుంది

మేఘమాల కనరాకుంటే

వసంతమెలా వస్తుంది

వనమెల్ల విరియకుంటే

నా కవిత ఎలా వెలుస్తుంది

నీతో స్ఫూర్తి పొందకుంటే


1.పావనమని తోస్తుందా

మందిరాన దేవే లేకుంటే

కనులకింపునిస్తుందా

కలువలేని కొలనుంటే

పున్నమైనా వెన్నెలకాసేనా

శశికి మబ్బులడ్డొస్తుంటే

నా కవనమెలా పొడుస్తుంది

నీ ప్రేరణ వరించకుంటే


2.పాల పిట్ట కనరాక

పండగెలా ఔతుంది దసరా

రంగవల్లి ముంగిట లేక

సంకురాతిరి సంబురమా

దివ్వెలే వెలుగని వేళ

దీపావళి అరుదెంచేనా

నా భవిత  గెలుస్తుందా

వెన్నుదన్ను నువు లేకున్న

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవిత్వమంటే కల్పనా చాతుర్యత

కవిత్వమంటే అతిశయమొలికే సామాన్యత

గోరంతలు కొండంతలుగా మలచితే కవిత

నల్లరాతికి నగిషీలు చెక్కితే అద్భుత భావుకత

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే


1.దేవకన్యలు పోలికలై వరుస కడతారు

అప్సరసలు ఉపమానాలుగ నిలబడతారు

కావ్య నాయికలంతా జేరి నిను కొనియాడేరు

అలంకారమే కవితకు అలంకారమనియేరు

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే


2.చిలవలు పలవలుగా ఆకసానికెత్తేస్తారు

ఉబ్బితబ్బిబ్బయ్యేలా ఊదరగొడతారు

నీలా ఇలలో లేనే లేరని ఇట్టే పొగిడేస్తారు

కవితావస్తువు వనితైతే మరి కట్టిపడేస్తారు

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే

https://youtu.be/YUiOQ--nyMU?si=6OSgqLqURIzQJyT5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: శంకరాభరణం

సాయీ యను పిలుపులోనె హాయి ఉన్నది
సాయినామ స్మరణలో తన్మయత్వమున్నది
సాయి ఎడల ఎడదలో నమ్మకమున్నది గట్టి నమ్మకమున్నది
సాయిని కోరుకొనగ ఏమున్నది ఇంతకన్న ఏమున్నది
సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం 

1.సాయి కనులలో అపారమైన కరుణ ఉన్నది
సాయి చూపులో విశేషమైన ఆకర్షణ ఉన్నది
సాయి సన్నిధానంలో శాంతి ఉన్నది ప్రశాంతి ఉన్నది
సాయి బోధలందున క్రమత ఉన్నది మానవత ఉన్నది
సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం 

2.సాయి పాదాలలో పావన గంగ ఉన్నది
సాయి చేతిలో అక్షయ పాత్ర ఉన్నది
సాయి ఒసగు విభూతిలో ఔషధమున్నది ఐశ్వర్యమున్నది
సాయి భక్తి భావనలో తృప్తి ఉన్నది జీవన్ముక్తి ఉన్నది
సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం


Wednesday, March 30, 2022

https://youtu.be/02ZPy-JTYlQ?si=OKLXdi56hUXnrdNv

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఎప్పుడైనా ఎన్నడైనా గుండె గొంతై పలికిందా

ఏ ఘటనకైనా  ఎడద కరిగి కన్నీరై ఒలికిందా

కదిలించక మానదు మదిని మరుగైన మానవత

హృదయాన ఊరక మారదు ఊరకనే ఆర్ద్రత

ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులె మిన్న

చెమరించే కన్నులకన్నా అందించే ఆసరా మిన్న


1.వ్యర్థపరచు ఆహారాన్ని చెత్తనుండి ఏరుకొని

 ఆకలికి తాళలేక ఆబగా తినబూనే ఆర్తులనేగని

పాడుబడ్డ పైపులలోన కాపురాలు చేసుకొంటుంటే

వాననీరు వరదైముంచితె పాలుపోని దీనులనే గని

ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులె మిన్న

చెమరించే కన్నులకన్నా అందించే ఆసరా మిన్న


2.దిక్కుమొక్కులేకుండా రోడ్డు పక్కనిదురోతూ

చలికి తట్టుకోలేకా ముడుచుకొంటు వణికే బాలలకై

చదువు సంధ్య నోచుకోక పోట్టపోసుకోవడానికి

చిట్టిచిట్టి చేతులతో మోటు పనులుచేసే అనాథలకై

ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులె మిన్న

చెమరించే కన్నులకన్నా అందించే ఆసరా మిన్న

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పొగడ్తే పెద్ద అగడ్త

ఆ వ్యసనానికి బానిసనయ్యానా

రోజు రోజుకీ దిగజారుట మొదలెడ్తా

ప్రశంసే వింత నషా

మెప్పుకై తహతహలాడానా

నాకు నేను వ్యతిరేకంగా పరుగెడ్తా

మనసా నాకీయవే భరోసా

మనసా నను నడిపించవే సుగతి దెస


1.తోచినదేదో రాసెయ్యడం 

సోషల్ మీడియాలో తోసెయ్యడం

స్పందించాలని ఆనందించాలని ఆశించడం

ఆవెంటనే ప్రతిచర్య గనక ఆరాట పడడం

పదేపదే ప్రతివారిని ప్రాధేయ పడడం

మనసా అవసరమా నీకీ పోకడ 

మనసా తూగేనా ఈ కప్పల తక్కెడ


2.మసిబూసి మారేడు చెయ్యడం

పసలేకున్నా పరులు మొయ్యడం

ఏ భావన కవనానికి  పురికొలిపిందో

ఏ గీతం హృదయాలను అలరించిందో

ఏ లక్ష్యం సంతృప్తికి నిను దరిజేర్చిందో

మనసా నీకేల కీర్తి కండూతి

మనసా నీకెందుకు దుష్ట సంస్కృతి

Sunday, March 27, 2022

 

https://youtu.be/BiaqGO2liwQ?si=oWvGLIURD1tLy5X3

రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ


రాగం:దర్భార్ కానడ


నా భక్తిని సడలనీకు భక్తవ శంకరా

అనురక్తి నీ ఎడల ఇనుమడించు అర్ధనారీశ్వరా

ఆసక్తిని ద్రుంచు విషయవాంఛలందు అరుణాచలేశ్వరా

ముక్తి ద్రోవ నను చేర్చు  ప్రభూ వారాణసీ పురపతే నమో విశ్వేశ్వరా


1.ఇల్లూ పట్టుయని మోహపడే సాలీడును

మదము మీరి ప్రవర్తించు మత్తేభమును

బుసలుకొట్టు క్రోధమున్న కోడెనాగును

తిన్నని యోచన లేని క్రూర భిల్లుడను

కడతేర్చి కరుణించు శ్రీ కాళ హస్తీశ్వరా శ్రీశైల మల్లీశ్వరా


2.ఉచితానుచితములసలెంచని రావణుడను

స్వార్థము మూర్తీభవించిన గజాసురుడను

శరణాగతి కోరుకున్న మార్కండేయుడను

గుడ్డిగా  నమ్ముకొన్న దీనుడ శిరియాళుడను

సరగున వరమీయర శ్రీ రాజ రాజేశ్వరా శ్రీరామలింగేశ్వరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందరిలానా నేను నీకు-అంతలా నన్నసలే అనకు

నేను నీకు ఏకైకం-నేనంటే ప్రత్యేకం

ఇంతకన్న ఇంకెవరున్నా నేను తప్పుకుంటా

పొరపాటే నాదని చెప్పి తప్పు ఒప్పుకుంటా


1.ఎక్కువగా ఊహించానా-ఆత్మలాగ ప్రేమించానా

అనుక్షణం నిను వెంటాడి వింతగా వేధించానా

ఇప్పుడైనా చెప్పరాదే నేను నీకు ఏమీ కానని-కానననీ

తప్పదింక చెరుపుకుంటా నీ జ్ఞాపకాలని-కాలనీ కాలనీ


2.సంశయాలున్నాయి-సంకోచాలున్నాయి

చెప్పనివి మది విప్పనివి ముచ్చటలెన్నో ఉన్నాయి

తేల్చుకో నాస్థానం నీమదిలో- పోల్చుకో నారూపం నీఎదలో

స్పష్టపరచు ఆగుతాను నే చచ్చేదాకా నువు మనసిచ్చేదాకా

Saturday, March 26, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్ర కౌఁస్


కనికరమే గనవా-శ్రీకర శ్రీవిభవా

ఇహపరమీవే కావా-వరదా మాధవా

నను జడునిగ మార్చావు మూఢునిగా చేసావు

ఆంతర్యమేమి సర్వాంతర్యామి సర్వేశా

దీని భావమేమి నమో తిరుమలేశా


1.మన్నుతినే పాములా మిన్నకుంటిని

మిన్ను మీద పడినా కూడ కదలకుంటిని

అనారోగ్యమో ఇది వైరాగ్యమా నాది

ఆంతర్యమేమి సర్వాంతర్యామి సర్వేశా

దీని భావమేమి నమో తిరుమలేశా


2.నిస్తేజమయ్యింది ఉత్సాహమంతా

నిర్వీర్యమయ్యింది నా సత్తువంతా

నిరాసక్తతో ఇది అనురక్తో ముక్తిది

ఆంతర్యమేమి సర్వాంతర్యామి సర్వేశా

దీని భావమేమి నమో తిరుమలేశా

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూడాలని ఉన్నా చూడలేని దీన స్థితి

రావాలని ఉన్నా రాలేని పరిస్థితి

ఎందుకింత ఆరాటం 

ఒడ్డున పడ్డ చేపలాగా

ఏమిటో తాపత్రయం 

చందమామ నందుకొనగ

చూడాలని ఉన్నా చూడలేని దీన స్థితి

రావాలని ఉన్నా రాలేని పరిస్థితి


నీ మనసు నాకు తెలుసు

నేనంటే పిచ్చి పచ్చి పులుసు

అందుకే నీకింత నేనలుసు

నీ కంటికి నే నలుసు నీ కంటిలోని నలుసు

ఒక్కసారి కనిపిస్తే మదికెంతో ఊరట

స్పందించి నవ్వితే గెలిచినట్టె ఆట


చూడాలని ఉన్నా చూడలేని దీన స్థితి

రావాలని ఉన్నా రాలేని పరిస్థితి

ఎందుకింత ఆరాటం 

ఒడ్డున పడ్డ చేపలాగా

ఏమిటో తాపత్రయం 

చందమామ నందుకొనగ

చూడాలని ఉన్నా చూడలేని దీన స్థితి

రావాలని ఉన్నా రాలేని పరిస్థితి


నోరార తెలపాలి నీ ప్రేమను

వదలనంటు చేయాలి నాకు బాసను

తెగువతో దాటాలి నువ్వు గడపను

నీవు లేక నేను ఎలా ఎలాఎలా గడపను

మాటవరసకైనా కాదనకు నన్ను

విరిగిపడుతుందపుడు కాదంటే నామీద మిన్ను


చూడాలని ఉన్నా చూడలేని దీన స్థితి

రావాలని ఉన్నా రాలేని పరిస్థితి

ఎందుకింత ఆరాటం 

ఒడ్డున పడ్డ చేపలాగా

ఏమిటో తాపత్రయం 

చందమామ నందుకొనగ

చూడాలని ఉన్నా చూడలేని దీన స్థితి

రావాలని ఉన్నా రాలేని పరిస్థితి


Friday, March 25, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొత్తగా శబ్దం చేస్తోంది

లబ్ డబ్ మానేసి నా గుండె

కేవలం నీ పేరే ధ్వనిస్తోంది

 ప్రేయసీ ప్రేయసీ అని

గారాలు పోతోంది

మారాము చేస్తోంది

ధ్యాసను మళ్ళింప జూస్తే

బెట్టుగా మొండికేస్తోంది


1.మనసెపుడో నీ వశమైంది

చిత్తము నీ మత్తునుగొంది

ప్రేమంటే పిచ్చేనని ఋజువయ్యింది

నిద్దుర లో కలవరింతలు

రోజంతా పలవరింతలు

నీ చింతన తీరనిచింతగ నా వంతైంది


2. మామూలుగ నను జమకట్టకు

అందరితో నను ముడిపెట్టకు

వెంటబడి వేధిస్తానని నన్ను సరిపెట్టకు

ప్రేమించే నా నిజాయితి

నీవే నా బ్రతుకైన సంగతి

ఇకనైనా గ్రహించవే నన్ననుగ్రహించవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వసంతం విరిసినట్టు

విద్యుల్లత మెరిసినట్టు

చిరుజల్లులు కురిసినట్టు

సిరి మల్లెలు పరిచినట్టు


ఆ నవ్వెంత మధురము

సుధ లొలికె అధరము

ఆ ఆహ్లాద వదనము

మనసానంద సదనము


1.తేనె జాలువారినట్టు

తేటగీతి రాసినట్టు

తేరుమీద సాగినట్టు

తెలతెల తెలవారినట్టు


ఆ నవ్వెంత సుందరము

ఎదురొచ్చే నందనము

ఆ ఆహ్లాద వదనము

మనసానంద సదనము


2.నురగలు చెలరేగినట్టు

సరిగమలే పలికినట్టు

వరములనే పొందినట్టు

ముత్యాలు రాలినట్టు


ఆ నవ్వే మనోహరం

హృదయాన కలవరం

ఆ ఆహ్లాద వదనము

మనసానంద సదనము

Thursday, March 24, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుడ్డివాడినే నిను చూడనినాడు

వెర్రివాడినే నువు కాదని చూడు

ఊపిరైన ఆపివేస్తా నిను తలచుటకోసం

జీవితమే అర్పిస్తా నిను వలచుటకోసం

కోన్ కిస్కాగాడినైనానా నా చెలీ

సర్కస్లో జోకర్ గాడినైనానా  నెచ్చెలీ


1.అదే పనిగ చూస్తున్నా ఎదురువస్తావని

పదేపదే ఊహిస్తున్నా నావైపు చూస్తావని

పట్టపగలు సూరీడున్నా దట్టమైన చీకటి నువులేకా

కళ్ళకు తగుజోడున్నా మసక మసక నిను గనకా

వెన్నెలవై వెలుగులు తేవే నా నీరవ నిశీధిలోనా

గోదారిగ పరుగున రావే నా నెర్రెల బీడు నాన్పగ


2.నాకు నేనే ప్రశ్నించుకొని సమాధాన పడుతున్నా

నాలో నేనె గొణుగుకొని సహనమెంతో వహిస్తున్నా

పిచ్చోడిగ అనుకుంటేమి నువ్వే నను మెచ్చనప్పుడు

మతిభ్రమించి పోతేఏమి భ్రమలో నువు దక్కినప్పుడు

అశ్రువు నువు రాల్చినపుడే  నా చితి సంపూర్తిగ కాలు

ఏడాదికోసారైనా నీ స్మృతిలోనైనా  నే మెదిలితే చాలు

 


https://youtu.be/Qx64COXsl4A?si=1tkGllskwaylDo-X

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


కసాయికైనా కరుగుతుంది హృదయము

సాయీ నీకింకనూ కరుగకుంటె చోద్యము

ఎలా ఉన్న జీవితాన్ని ఎలా మార్చినావు

ఆనందమె నోచకుండ దిగజార్చినావు

నాకు చేతకాదని ఇపుడైనా ఒప్పుకో

నా ఎదురుగ నిలవక ఇకనైనా తప్పుకో


1.పేరుగొప్ప ఊరు దిబ్బ ఉదాహరణ నీవేలే

తండోప తండాల జనం ఉత్తి అమాయకులే

అభిషేకాలు  అర్చనలు భజనలు నీకు వృథాలే

పంచ హారతులు పల్లకీ సేవలు సర్వం వ్యర్థాలే

ఎవరు ఖండించినా నమ్మి చెడిన నా అనుభవాలివి

ఎంతగ వాదించినా ఎవరు తీర్చలేని నా వెతలివి


2.అదిగో పులియంటే ఇదే ఇదే తోకయనే వైనము

చిలవలు పలువలుగా నీ మహిమల వ్యాపనము

నాకేమీ ఒరుగకున్నా సాయి నీ పాటలెన్నో రాశాను

నయమేమి చేయకున్నా బాబా నీ భక్తుడనయ్యాను

ఔనన్నా కాదన్నా బెల్లంకొట్టే రాయివే సాయి నీవు

ఎవరి బాధలేమాత్రం పట్టించుకోని గోసాయివీవు

Wednesday, March 23, 2022

 

https://youtu.be/rMudgl1PGDI?si=Ub298ttDCuz20RoT

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిద్రపట్టదు నీ నగుమోమును గనక

రెప్పవాలదు నినుగాంచలేదు గనక

బ్రతకమంటావా,చంపుకుంటావా

నీ మనసునడుగు ఒకసారి

ఓపలేకున్నా నీకై వేచిచూచి వేసారి

శుభరాత్రికానపుడు శుభోదయంకాదెపుడు


1.స్ఫూర్తిగలుగ జేస్తుంది

ఆర్తి తీర్చివేస్తుంది

అందాలకే అందం నీ వదనారవిందం

మత్తులో ముంచేస్తుంది

హాయిలో తేలుస్తుంది

అమృతభాండం నీ ముఖబింబం

చూపిస్తె సొమ్మేంపోదు కనిపిస్తె ఖర్చేంకాదు

శుభరాత్రిగ మార్చేయి శుభోదయం కానీయి


2.కలలు కనవచ్చు నినుచూసి

కల్పనే చేయొచ్చు కనుల దాచి

కవితలెన్నొ రాయవచ్చు నాకు వెరసి

మరుల జోరు నాపవచ్చు

మనసు పోరుమాన్పవచ్చు

తెల్లారిపోయేదాకా ప్రశాంతంగ ఉండవచ్చు

శుభరాత్రిక చెప్పాకా శుభోదయం తప్పదిక 

 https://youtu.be/arAdNItyMvc?si=EWynWBBrXvyg2gfZ

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మాట తప్పడం మామూలేగా నీకు

దాట వేయడం అలవాటేగా నీకు

చేసిన బాసలు చెప్పిన ఊసులు నీటిమూటలేనా

వేసిన ఒట్లు మాటల కనికట్లు గాలివాటమేనా

చెప్పిందేమిటి నువు చేసేదేమిటి

ఇస్తానన్నది చెలీ మరుస్తావేమిటి


1.బొట్టు కాటుక పెట్టుకొని

తల్లో పువ్వులు తురుముకొని

సిరిసిల్ల నేతచీరనే సింగారించుకొని

కరినారం వెండి పట్టీలే పాదాలకు పెట్టుకొని

వస్తానంటివే మహలక్ష్మివి నీవై

ఎదురొస్తానంటివే గృహలక్ష్మివి నీవై


2.సిగ్గును బుగ్గన దిద్దుకొని

నగవులు పెదవుల అద్దుకొని

కళ్యాణి రాగాన ఆలాపన జతివై

మంజుల స్వానాల స్వానుభూతివై

ఇస్తానంటివే  కొత్త జీవితాన్ని

వినిపిస్తానంటివే మన ప్రేమగీతాన్ని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోరుకో చెలీ  ఏ కానుకైనా

ఇచ్చేస్తా అది నా హృదయమైనా

వదులుకుంటా నా ప్రాణమైనా

వదులుకోలేను నిను క్షణమైనా

ప్రేమా ప్రణయం జీవన సర్వం నువ్వే

నేడూ రేపూ జీవిత కాలం నువ్వే నువ్వే


1.పొద్దుపొడిచేది నీతోనే

పొద్దుగ్రుంకేది నీతోనే

పొద్దుపొద్దంతా నాకు నీ సుద్దులతోనే

ఆకలిని నే మరిచానే

నిద్దురను మానేసానే

నీ తలపులలోనే మునకలువేసానే

అచ్చట ముచ్చట నచ్చుట అన్నీ నీతోనే

పచ్చని వెచ్చని మెచ్చిన ఊహలు నీతోనే


2.ప్రతి భావన పంచుకొని

అనుభూతిగ మలచుకొని

ఆనంద నందనాన నీతో విహరిస్తానే

పదములలో పొదువుకుని

పాటలుగా అల్లుకొని

పాడుకుంటూ కడదాకా బ్రతికేస్తానే

ఇష్టము కష్టము స్పష్టముగా నాకు నువ్వే

అదృష్టము సంక్లిష్టమూ నాకు నువ్వే నువ్వే

OK


ఇందు అందు ఎందు వెదకినా దొరకని నా 'ఇందు' అందమేమందు

చిందర వందర గందరగోళపు నా మదికి ఇందు అందమే మందు

వందలాది వత్సరాలు తపముజేసినా పొందలేని వరము నా ఇందు

అందము ఆనందము కలబోసిన అతిలోక సుందరాంగి నా ఇందు


1.ఇందు చెంత ఉంటే ఎంతటి అడవైనా నందనవనమే

ఇందు తోడుగా ఉంటే ఎడారి సైతం అపర బృందావనమే

ఇంద్రపదవి ఇచ్చినా వదులుకుంటా ఇందు నా చేయినందుకుంటే

ఇందు వదన  మందగమన నా ఇందు నాకు కనువిందు నా ముందుంటే


2.ఇందు అరవింద పాదానికి అందెగా తగిలిస్తా నా డెందము

ఇందు అరవింద నయనాలను అలరించగ నేనౌతా అంగారము

మందార మకరంద మధురిమ లొలుకును సదా నా ఇందు అధరాలు

మందస్మితాన చంద్రికలే చిలుకును ఆహ్లాద భరితమై  ఇందు హసితాలు




https://youtu.be/m61ypGogfDA?si=lBB-0tD4PwAukLNk

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

ఒక్కసారి కనిపిస్తావా-మనసు గుట్టు చెప్పేస్తావా
యుగాలుగా వీడనిబంధం-ఎరుక తిరిగి కలిగిస్తావా
పెదవులిపుడు విప్పేస్తావా-ప్రేమనింక ప్రకటిస్తావా
కొట్టుమిట్టాడే నా ప్రాణం-పోకుండగ చూస్తావా

1.చినుకుగ నను తడిపేస్తావా-మారాకులు తొడిగిస్తావా
ఈ మోడునికనైనా-చిగురింపజేస్తావా
సంతసాన్ని సొంతం చేసి-సాంత్వననే కలుగగజేసి
ఆకు కొసన జారకుండా-నాలో విలీనమౌతావా

2.మరునిమిషం మాయమౌ-హరివిల్లువు నువుకావొద్దు
అందుబాటులో ఉండే -అవనివైతె ఎంతో ముద్దూ
చేరువగా తపనలు పెంచే-మరీచికగా మారవద్దు
గుక్కెడైన నీరందించే -చెలమెలాంటి చెలిమిని నాకిద్దూ


Tuesday, March 22, 2022

 

https://youtu.be/h3XpK5ECluc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


క్రీగంట చూసినా చాలు లైలాలా

ఫీలైపోతాను నాకు నేను మజ్నూలా

ఓ పూట హా యన్నా చాలు లవ్ లీగా

సంబరాలు చేసుకుంటా హోళీలా

ఎలిజిబెత్ రాణి వేస్టే నీముందు

క్లియోపాత్రా వరెస్టే నీదే అందమందు


1.దినమానం అరుస్తున్నా వినిపించుకోవేమే

అనుక్షణం అంగలారుస్తున్నా పట్టించుకోవేమే

గొట్టంగాడెవడో నీకెందుకు చుట్టమవ్వాల

బేవార్స్ ఆ టోపీవాల నీకేల సోపతి కావాల

ఓర్చుకోలేను సూర్యుడి పోడ తాకినా సైతం

జీర్ణించుకోలేను వడగాలి సోకినా ఏమాత్రం


2.తలచుకో చాలు నన్ను జీ హుజూరని వాలుతాను

ఆజ్ఞాపించు వేలుకోసుకొమ్మని మెడత్రెంచి నే తెస్తాను

కొండంత నా ప్రేమను ఈజీగా  బలిఇస్తా

పిసరంత నీ ప్రేమను బ్రతుకంతా చవిచూస్తా

నువ్వు నాకే సొంతం -బద్నామ్ ఐనా మానే - నేనూ నా స్వార్థం

నువ్వే జీవన సాఫల్యం నీ ప్రేమే నా పరమార్థం


OK


 

https://youtu.be/kFX0nRjYcYM?si=2Ia2ziPFn99zJBPp

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


(మహాకవి శ్రీ శ్రీ గారి ప్రేరణతో)


కుంభవృష్టి కురిసినా చలించని దున్నలం

కుళ్ళి కంపుకొడుతున్న  జీవశ్చవాలం

మనదీ ఒక బ్రతుకేనా బ్రతకలేక బ్రతికేస్తూ

మనదీ ఒక మనుగడనా ఎలాగోలా గడిపేస్తూ


1.తాయిలాల కోసమే చొంగ కారుస్తూ

ఎంగిలి మెతుకులకై అంగలారుస్తూ

ఎరగా  దొరికేటి రాయితీల కోసమై

తేరగా లభించేటి కాటి కూటి కొఱకై

మనదీఒక బ్రతుకేనా అరచేతి బెల్లానికి మోచేయి నాకుతూ

మనదీ ఒక బ్రతుకేనా స్వతంత్ర భారతిలో బానిసలై మసలుతూ


2.ఓటుకొరకు మనని మనం అమ్ముకొంటూ

కులం మతం ప్రాతిపదికగ కుమ్ముకుంటూ

కుడి చేత్తో కుడిపించి ఎడం చేత్తొ లాక్కొనడమెరుగక

కుక్కిన పేనల్లే చిక్కిన చాపలల్లే ఏ మాత్రం కిక్కురుమనక

మనదీ ఒక బ్రతుకేనా శక్తున్నా చేష్టలుడుగి చేవ చచ్చి

మనదీ ఒక బ్రతుకేనా సోయున్నా సోమరులై మనసుపుచ్చి

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సగం సగం నమ్మినపుడె భ్రష్టుబట్టి పోతారు

సగం సగం నమ్మనపుడె బొక్కబోర్ల పడతారు

విశ్వాసం అంటేనే వంద శాతం

ఆస్తికతో నాస్తికతో సంపూర్తిగ నవ్మితేనే సజావు జీవితం


1.అన్యధా శరణం నాస్తియంటూ

పొందాలి సర్వస్య శరణాగతి స్వామిని వేడుకొంటూ

ఒడ్డును చేర్చే సరంగు నీవేయని 

సాగిలపడిపోవాలి సర్వం సమర్పణ చేసుకొంటూ

రాకతప్పదప్పుడు కరిరాజ వరదునికి

శాయశక్తులా నువు చేసిన ప్రయత్నానికి

నీకు చేయూతనీయడానికి

దైవం మానుషరూపేణాయని తెలపడానికి


2.చెదరని సంకల్ప బలం

మొక్కవోని ప్రయత్నం అనితరసాధ్యమైన సాధన

గెలువడమే స్థిర లక్ష్యం

ఓటమి ఒక గుణపాఠం ఏకాగ్రత విజయానికి నిచ్చెన

గమ్యమే కాదు సుమా గమనమైన రమ్యమే

కలుపుతుంది ఒక గీత గెలుపును ఓటమిని

తెలుపుతుంది బ్రతుకు విలువ

ఆత్మవిశ్వాసమే ఆనంద హేతువని

Monday, March 21, 2022

 https://youtu.be/xxpR_vD1rGc


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


కళ్యాణ వేంకటేశ్వరా కళ్యాణమే కూర్చరా

కళ్యాణ వేంకటేశ్వరా జగత్కళ్యాణమే కూర్చరా

కారుణ్య శ్రీనివాసుడా మాపై కనికరము జూపరా

కారుణ్య శ్రీనివాసుడా అభయకరమునందీయరా

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి


1.మంగమ్మను పద్మావతిని సతులుగ చేకొంటివి

రంగరంగ వైభోగముతో సేవలందుకొనుచుంటివి

మేలుకొలుపు మొదలుకొని పవళించు వేళ వరకు

విశ్రమించవు భక్తులబ్రోయుచు కూర్చోవూ చివరకు

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి


2.వలచి వరించినావు  శ్రీమతిగా పద్మావతిని

అప్పుచేసి సైతం అందుకొంటివి శ్రీదేవి చేతిని

నిలువుదోపిడే అడిగేవు ఋణబాధ విముక్తికోసం

దేహమే కాదు స్వామి దోచుకోవయ్య నా మానసం

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి

 రచన,స్వరకల్పన&గానం:  డా.రాఖీ


సొట్టబుగ్గల సొగసెంత - కళ్ళు తిప్పలేనంత

సోగకన్నుల సొబగెంత - కవులు పొగడలేనంత

పలుకులలో పదునెంత- మంత్రముగ్ధులయ్యేంత

నవ్వులలో సుధ ఎంత-మృతులు తిరిగి బ్రతికేంత

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


1.మండుటెండలోన నీచెంతన మలయమారుతం

ఎడారిదారులందు ఎదురైతే నీవే ఆమని సంయుతం

కాళరాతిరిలో నీవే వెల్లువయ్యే పూర్ణచంద్రికా పాతం

ఆశల వెలుగుల పొడసూపేటి  తూరుపు సుప్రభాతం

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


2. నీవున్న తావులే కమనీయ నందనవనములు

నీసన్నధిలోని క్షణాలే  రాధికాసాంత్వన సమములు

నీ కరస్పర్శ  మరిపించు మయూర పింఛ స్పృశ్యతను

నీ దర్శనమే మురిపించు చకోరి చంద్రికా సదృశ్యతను

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం

https://youtu.be/cETKvC4CO0o?si=MM2J_v9iHiCjmxLw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: రామప్రియ

నీవే నడయాడే ఒక హరివిల్లు
నీ తనువున అణువణువున హోళీ ఆనవాళ్ళు
ఆపాదమస్తకం సప్తవర్ణ ప్రస్ఫుటమౌ గాజు పట్టకం
నఖశిఖ పర్యంతం వన్నెలు మార్చే కృకలాస సదృశం

1.విరబోసిన కురులలో ఒలికే నల్లదనం
చిరునవ్వున దంతాల మెరిసే తెల్లదనం
సిగ్గులొలుక బుగ్గలలో కురిసే ఎరుపుదనం
సిరిచందన ఛాయ చిలికె నీ సంవాహనం

2.నీ చేతి గాజులలో నిగారించె హరితము
పాదాల సంరక్షగ పరిఢవిల్లె హరిద్రము
వీనుల ఊగాడే బుట్టలదోగాడే ఉదావర్ణము
నయనాల కనుపాపల ద్యోతకమౌ నీలము


Wednesday, March 16, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తలుపులు మూయగలవేమో-తలపుల చొరబడ అడ్డేది

కలవగ వాలాయించెదవేమో - కలలో కలయికెలా చెడేది

ఊపిరిలో ఊపిరినౌతా - ఎదచేసే సవ్వడినౌతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి


1.మెడకు పడిన పామైనా కరవకుండునేమో

అడుగు పెడితె ముల్లైనా గుచ్చకుండునేమో

పసుపు తాడునై నీతో జతపడి పోతా

నుదుట కుంకుమనై నేనతుకు పడతా

మనసులో భావమవుతా మాటలో స్పష్టమవుతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి


2.నీడైనా ఎపుడైనా నిను వీడిపోవునేమో

నీవైనా ఎన్నడైనా నీ ఆజ్ఞ మీరుదువేమో

తనువు చాలించినా నిను వదలని తోడౌతా

నువు గీచిన గీతనెపుడూ దాటని నీ దాసుడనౌతా

పెదవి మీద నవ్వునౌతా పదముల సిరిమువ్వ నౌతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి

https://youtu.be/IXxykgH6H0g?si=f4pd6y0IAQxPVuDa

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

నీ సొమ్మేం జారిపోతుంది 
ఒక్కసారి నాకు నువ్వు హాయ్ చెప్పితే
నీ సోకేం కరిగిపోతుంది 
గుడ్ మార్నింగంటూ నన్ను పలకరించితే
గజ గమనా ఘనజఘనా నీకిది తగునా
లలనా  మనగలనా నిముషమైన నువు వినా

1.నా అంతట నేనుగా కుదుపాలి నిన్ను
కవితగా నిను మలచగ కదపాలి పెన్ను
పొలమారునట్లుగా తలచాలి నిన్ను ప్రతిపొద్దు
కలనెరవేరేట్లుగా దాటవేల నువ్వు ప్రతి హద్దు
గజ గమనా ఘనజఘనా నీవేలే నా మనమున
లలనా  మనగలనా నిముషమైన నువు వినా

2.గాజుముక్కలే పూలరెక్కలు నీ చూపుల కన్నా
గండశిల సైతం అతిసున్నితం నీ కరకు గుండెకన్నా
నావైపుగా ఆరాటమెంత ఉంటే ఏం ప్రయోజనం
అర్పించినా కరుణించవాయే హృదయ నీరాజనం
గజ గమనా ఘనజఘనా నువ్వే లేక నే కవినా
లలనా  మనగలనా నిముషమైన నువు వినా


https://youtu.be/7t-GYRbJO2c?si=nX5NIXPE5BzeRu6f

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : వసంత ముఖారి /బసంత ముఖారి

ఇమ్మని అడుగలేదు ఏనిధిని-ఇస్తే చాలు సాయీ విబూదిని
కోరానా షిరిడీలో నీ సన్నిధిని-తొలగిస్తే మేలు నా దీర్ఘవ్యాధిని
చాలించు ఏకాదశ సూత్ర సోదిని-పరిమార్చు చిరకాల మనాదిని
పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు

1.గొప్పలకేం కొదవలేదు సన్యాసివైనా
ఘనతకేం తక్కువని అవధూతవైనా
నీ గురించే నీ ధ్యాస చూడవేల మా దెస
ఎందరినినో బాగు చేసావే నాపై శీతకన్ను వేసావే
పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు

2.మహిమలంటు ఉన్నాయా నిజముగనీకు
లీలలు చూపావంటే  నమ్మశక్యమా నాకు
కనికట్టులు చేసావేమో గారడీలు చూపావేమో
వందిమాగధులతో వింతగు ప్రచారాలు నెరిపావేమో
పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు


Tuesday, March 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాకి: కలడు కలండనగ నీవిక కలవో లేవో

కలనైనా కనిపించక నీవొక కలవూ కావో


ఉన్నావని స్మరించలేనులే

లేనే లేవని విస్మరించలేనులే

ఎంత సందిగ్ధమాయే నీ ఉనికి

సంశయాలె తీరవాయే ఈనాటికి

నిరూపించుకోలేకుంటే నువ్వే హుళుక్కి

స్వామీ నువ్వే హుళుక్కి


1.శిష్టరక్షకుడ వంటారు 

దుష్ట శిక్షకుడవంటారు

తారుమారాయే నేటి తార్కాణాలు

శిష్ట శిక్షకునివైనావు దుష్ట రక్షకునిగ మారావు

ఉన్నావని నిను నమ్ముకోలేను

లేనే లేవని నిర్ధారించుకోలేను


2.ఆపత్తులలో ఆదుకొందువందురు

నీ భక్తుల నీదరికి చేదుకొందువందురు

ఎటమటమైపోయే నీ లక్షణాలు

ఆపదలు కలిగిస్తావు భక్తులను బాధిస్తావు

ఉన్నావని ఎలుగెత్తిచాటను

లేనే లేవని నాస్తికుడనవ్వను

Saturday, March 12, 2022

 

https://youtu.be/FkAIDnG4HsI

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోదారి గంగలో తానాలు

నరసిమ్మసామి దర్శనాలు

ఏటేటా జరిగే జాతరా సంబరాలు

మొక్కులుముడుపులు కోరమీసాలు పట్టెనామాలు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లు ధరంపురిలొ  నేల అంబరాలు


1.లచ్చిందేవి నరుసయ్యల పెండ్లే కనువిందు

కోనేట్లొ తెప్పదిరుగ సామిది - షానా పసందు

డోలాలు ఊగుతుంటె పక్క చూపులే బందు

బుక్కాగులాలు బత్తెరసాల పేర్లు సామికె చెందు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లె ధరంపురిలొ  నేల అంబరాలు


2.జోడు రథాలెక్కి కదుల నరహరి హరులు

తోకముడిచి పారిపోర కదాన  దానవ వైరులు

నలుదిక్కుల జైత్రయాత్ర సాగించి పలుమారులు

ఏకాంత సేవలో మునిగెదరు  శ్రీహరి సిరులు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లు ధరంపురిలొ  నేల అంబరాలు

 https://youtu.be/VCQB-J8EzwE?si=0BSg9LLHJnlcu8fC

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రవ్వలగాజులు చేతులకే రమణీయం

మువ్వల పట్టీల పాదాలే కమనీయం

నవ్వుల రతనాల మోవియే మాధుర్యం

పువ్వుల దండ వాలు జడకే సౌందర్యం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం


1.సూర్యకాంతి మించిన మేను విణ్ణానం

చంద్రకాంతి వర్షించే కన్నుల విన్యాసం

అంగారక రంగీనే నుదుటన సిందూరం

గురుతరమై అలరారే యుగ పయోధరం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం


2.పాంచజన్యం ప్రతిధ్వనించే కోమల గాత్రం

గాండీవాన్ని స్ఫురింప చేసే అంగ సౌష్ఠవం

సంగ్రామానికి సమాయత్తగా కుడి కురుక్షేత్రం

విజయాన్ని అందించడమే అంతస్సూత్రం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ గతానికీ భవితకూ నేనౌతా వంతెన మిత్రమా

నీ ప్రగతికి ఆశయానికీ నేనౌతా నిచ్చెన

వేలుపట్టి నడిపించే తోడును నేనౌతా నేస్తమా

వెన్నంటి ఉండేటి చేదోడు వాదోడుగ జతగూడుతా


1.అవసరాలు నెరవేర్చే అద్భుత దీపమౌత

ఆపదలందు కాచు  యోధుని రూపమౌతా

నీ వేదన తొలగించే ఉల్లాసం కలిగించే వినోదమౌతా

కడుపార తినగలిగే కమ్మదనపు అమ్మచేతి ముద్దనౌతా


2.చెలిమిభ్రమలొ త్వరపడగ చెలియలికట్ట నౌత

తుప్పల దారుల తప్పించే కూడలి దిక్సూచి నౌతా

ఆనందం కలిగించే ప్రేరేపించే ప్రశంసకు అచ్చమైన అచ్చునౌత

వికాసాన్ని అందించే మెళకువ నేర్పించే మచ్చునౌత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సరసిజనాభ హరి పుండరీకాక్ష

ఎన్నాళ్ళు స్వామీ ఈ కఠిన పరీక్ష

సప్తగిరీశా తాళజాల నీకై ఈ ప్రతీక్ష

చాలదా నాకీ జన్మకు ఇంతటి ఘోర శిక్ష

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద


1.ఎవరైనా సుఖించిరా నిన్ను నమ్మి అనాదిగా

సంతోషమునందిరా నిన్ను కొలిచి నిత్యవిధిగా

దశరథుడూ లక్మణుడూ మైథిలీ హనుమంతుడు

త్యాగరాజు రామదాసు అన్నమయా జయదేవుడు

బ్రతుకంతా నీ స్మృతిలో నిరంతరం నీకృతిలో

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద


2.ఎంతటి కష్టానికైన హద్దంటూ ఉండదా

ఏ దోషానికైన ఒక పద్దంటూ ఉండదా

తండ్రివి నీవుగాక తప్పులెవరు మన్నింతురు

దండించిన తదుపరి మము అక్కునెవరు చేర్చెదరు

నడుపుమమ్ము నీగతిలో చేర్చుకో నిర్వృతిలో

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అవధులులేనిది ఏదీ లేదు విశ్వం సహా

అపారమైన  నా ప్రేమ మినహా

పరిధులు కలదే ప్రతిదీయన్నది వ్యర్థపు ఊహ

అనంతమే నా హృదయ విశాలత ఎవరెరుగరు ఈ తరహా

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై


1.వదలను నీచేయి వదులుకోను ఈ హాయి 

వలపులు నీతోనే పగలూ రేయి

అడుగులొ అడుగేసి ఏడడుగులు నడిచేసి

తరిస్తా బ్రతుకంతా నీతో గడిపేసి

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై


2.ముగ్గులోకి ననుదించి  ప్రేమనెంతొ అందించి 

నీ దాసునిజేసావే నను మురిపించి

దాటిపోను నీ గీత జవదాటను నీ మాట

ఆనందనందనమే నాకు నీవున్నచోట

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై

Thursday, March 10, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతగా పొగిడేను ఇంతీ నీ ఇంతటి  అందాన్ని

దేనితో పోల్చేను సాటిలేని ఈ చినదాన్ని

కొలమానమే లేదు కొలువగ సొగసులని

ఉపమానమే లేదు ఎంచగ  బెళుకులకి

తేరుకోరెవరు  చక్కదనపు నీ నిక్కులకు

ఊరుకోరెవరు  మిక్కిలియగు నీటెక్కులకు


1.జాబిలిదే  సౌందర్యము నినుగాంచ నంతవరకు

వెన్నెలతో ఆహ్లాదము నీ హాస చంద్రిక గనుదాకా

అల్పమైన వాటిని కవులు ప్రామాణిక మనుకొన్నారు

కూపస్థ మండూకాలై భ్రమలు బడసియున్నారు

ఒక్కసారి నిను చూస్తే బిక్కమొకం వేస్తారు

సుందరాంగి నీవేనంటూ అంగలార్చుతారు


2.హిమనగాలు ఎత్తేలే నిన్నమొన్న నిన్ను చూడక

సెలయేళ్ళదే మెలికల నడక నీ హొయలు తిలకించక

మెరుపు తీగ కాంతిహీనమే అంచనాకు నువు అందాక

మంచిగంధమెంతటి వాసన నీ తనువు తావితెలిసాక

ప్రతీకేది నీకై దొరకదు ఎవరెంతగ శోధించినా

సింగారొకతి పుట్టుకరాదు పాలకడలి మధించినా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పలుకే పంచదార పాకం

కులుకే బైర్లుగమ్ము మైకం

ఏంటే నీ సోకుమాడ

ఏడనే కనగ నీజాడ

ఒక్కసారి పలుకవే ఒప్పులకుప్పా

ఒప్పుకొని తీరుతా నీ వంపుల గొప్ప


1.వద్దనబోకే నీవద్దకు వస్తుంటే

కాదనబోకే అదనుకై చూస్తుంటే

మంచిమంచివాళ్ళే మన్ను బుక్కిపోతారు

స్థాయి మరచి నీ చూపుకె బుక్కైపోతారు

మామూలు వాణ్ణి నాకు మతిపోయిందే

మైమరిచి పోయేంతగా శ్రుతి మించిందే


2.చూసీ చూడగనే పడిపోవుట మరి ఖాయం

పరిసరాలు సైతం ఔతాయి మటుమాయం

నీ వెంటబడక పోవడమే నిజమైన అన్యాయం

ముదుసలికీ వస్తుంది నినుగని యవ్వన ప్రాయం

ఫిదానై పోయా నీ పిచ్చెక్కేఅందానికి

సదా నీవే విలాసము పరమానందానికి


PIC courtesy: Sri. AAGACHARYA sir

https://youtu.be/XJexuwGMsCs?si=QEWpYvNPMFWJVJhj


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాఎదయే తిరుమల-మా మతియే తిరుపతి

కనులు మూసుకుంటె చాలు కనిపింతువు శ్రీపతి

ధ్యాస నిలిపినంత వరకు అపారమౌ మనశ్శాంతి

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా


1.అంధకారమే  జగతి సూర్య చంద్రులున్నా

ఏకాకులమే చుట్టూరా బంధుమిత్రులున్నా

నిత్య దరిద్రులమే తరగని సిరి సంపదలున్నా

ఒక్కగానొక్కనీవు ఆత్మజ్యోతివై వెలుగకున్నా

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా


2.తీర్థాల మునిగితేమి మనసున మకిలుంటే

క్షేత్రాలు తిరిగితేమి చిత్తశుద్ది లేకుంటే

పూజాపునస్కార ఫలమేమి భూతదయే లేకుంటే

తపములేక వరమిత్తువు మాలో మానవత్వముంటే

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా

 

https://youtu.be/VqHZdNmrKWE?si=y0hpAbO9jAutfXP_

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరయవె సరగున  జ్ఞాన సరస్వతి

కురియవె వరముల  విద్యా భారతి

సంగీత మందీయి శ్రీ శారదామణి

నా రాత సరిజేయి నమసము శ్రీవాణి


1.పఠనము కొఱవడె దినచర్యలో

సాధన అడుగంటె ఎద రాపిడిలో

అక్షరమొకటే లక్ష్యముగా మారే

జీవిత చక్రపు కక్ష్యయే తారాడే


2.ఐహికపరమౌ మోహము మెండాయే

పరమార్థ చింతన చింతల పాలాయే

నుతుల ముఖస్తుతుల మతి బానిసాయే

సద్గతి నడుపగ సాయ మపసారమాయే

Tuesday, March 8, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అద్దానికైనా ఆతురతే నీ అందమంటే

బింబానికైనా అసూయే నీ చందమంటే

ఎన్నిహృదయాలు జారిపడినాయో నువు నడిచే దారివెంట

ఎన్ని చూపులు వెన్నంటి వెంబడించినాయో ఎరుగవంట

ఎలా కాపాడుకుంటావో నిన్ను నీవు నీరజాక్షి

ఎలా గట్టెక్కుతావో తోడవనీ చెలీ నీకు కర్మసాక్షి


1.పడిగాపులు పడతారు నీ వాలుచూపు కోసం

పిల్లిమొగ్గలేస్తారు కోరి పిసరంత దరహాసం

తహతహలాడతారు మాటకలుప

ఏ నిమిషం

చొంగకార్చుకొంటారు కలిపిస్తే అవకాశం

ఎలా కాచుకుంటావో నిన్ను నీవు నీరజాక్షి

ఎలా దాటవేస్తావో చూపిస్తూ ఒక బూచి


2.పబ్బంగడుచుటకై మునగచెట్టులెక్కిస్తారు

అరచేతిలొ స్వర్గమంటూ గారడులే చేస్తారు

గోముఖాల వ్యాఘ్రాలై  నిలువున కబళిస్తారు

దాటిస్తారని నమ్మితే  నట్టేట ముంచుతారు

ఎలా నడువగలుగుతావో కత్తిమీదే నీ నడక

నొప్పింపక నువు నొవ్వక ఇక తికమక పడక

Saturday, March 5, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పదములు చాలవు మది తెలుప

తపనలు తీరవు  నిను గనక

నా బ్రతుకు నా భవిత నీవే గనక

నను చేకొనమా ఇకనైనా కాదనక


1.విన్నపమొకటే ఆ విధికి

ప్రార్థన చేసెద దేవునికి

నీతో నిలుపగ నా ఉనికి

కలుపగ నీతో నను జతకి


2.నీవే నీవే చెలీ నాలోకం

లేదులే మరియే వ్యాపకం

నీతో ఉన్నదె నాకు నాకం

నిత్యం చేస్తా ప్రేమాభిషేకం


https://youtu.be/lzpBPNU_9OM

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఓడిపోక తప్పదు నీకు ఓ వేంకటేశ్వరా

పోటీగ నిలిచేవా గెలిచేవా జగదీశ్వరా

పెట్టుకో ఎన్నైనా కఠిమైన పరీక్షలు

తట్టుకొనగలిగెదను నీ పాదాలే నా రక్షలు


1.దేహానికే గదా నువు వేసే  శిక్షలు

భౌతికమైనవేగా ఈ ఈతిబాధలు

గాయాలు మానిపోతాయి నీ ధ్యాసలో

కష్టాలు తీరిపోతాయి  నీ నీడలో


2. కొలిమిలో కాల్చేవు తనువు మకిలిని

తపనలో మాడ్చేవు మనసు కొసరును

త్రోవలన్ని  మూసేది నీ దారి చేరుటకేగా

బంధాలు బిగించేది త్వరగా తెగుటకేగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెలో  పరవశం నువ్వే నువ్వే

బ్రతుకులో పరిమళం నువ్వే నువ్వే

సఫలీకృత స్వప్నం నువ్వే

ఎదురొచ్చిన స్వర్గం నువ్వే


1.నా మనసును కబ్జా చేసిన రౌడీ నువ్వే

నా తలపులనాక్రమించిన కేడీ నువ్వే

నిలువెల్లా దోచేసావు దోపిడి చేసి

మదినెత్తుక పోయావు మాయజేసి


2.ఊ అంటే బెదిరిస్తావు అలుసుగ నన్నెపుడు

ఊహూ అంటూ వారిస్తావు అలకతొ ఉన్నపుడు

తగ్గదే లేదంటూ తగవే పెడతావు

ఏదేమైనా ఎంతగానో నన్నిష్టపడతావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతివలకైనా మతిపోగొట్టే అంగ సౌష్ఠవం

అప్సరసలే అచ్చరువొందే అప్రమేయ సౌందర్యం

దాగుడుమూతల ఉసిగొలిపే వస్త్రధారణం

ఇంతకన్నావలసిందేమిటి దాసుల జేసే కారణం

వందలసార్లు చావొచ్చే చెలీ నీకోసం

తెగింపునిస్తుందెంతగానో నీ దరహాసం


1.తుమ్మెదనై జన్మిస్తా నీ ముంగురుల చందంగా

సీతాకోకచిలుకై పుడతా నీగులాబి చెంపల వ్రాలగ

తేటిగనైతీరుతా నీపెదవుల మకరందం  గ్రోలగ

తూనీగగా మారిపోతా సున్నితమైన నీ మేను తాకగ

వేలసార్లు పుట్టొచ్చే చెలీ నీకోసం

 పడిగాపులు పడవేస్తుంది నీ క్రీగంటి వీక్షణం


2.తమలపాకునేనౌతా నీ పాదాలతొ పోటీపడగ

తామరతూడునైపోతా నీచేతివ్రేళ్ళతొ పోలగ

మెరుపుతీగనైతే మాత్రం నీ మురిపానికి సరిపోతానా

వంపుల సొంపుల వాగునైనా తూగగలనా నీ పొంకానా

ఏలకేళ్ళు బ్రతికేస్తా చెలీ నీకోసం

నీ పంటినొక్కులు పలుకగ నాకాహ్వనం

Wednesday, March 2, 2022

 

https://youtu.be/BCH_j6tuIbs?feature=shared

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(08/03/20


స్వావలంబన చేకొనుమా మహిళామణి

సాధికారత సాధించు నీవే నీవే మహారాణి

ఆర్థిక స్వేఛ్ఛ లేకపోవుటే నీకు వెనకబాటు

ఆకాశంలో సగంగ ఎదుగు వద్దంటూ వెసులుబాటు

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు


1.నిక్కచ్చిగా చదువుకొని చదువుల తల్లిగ భాసించు

తల్లి చదివితే తరతరాలు ప్రగతే యని నిరూపించు

ఉద్యోగాలూ చేయాలి ఊళ్ళను సైతం ఏలాలి

అన్ని రంగాల్లొ అభ్యున్నతినే అవలీలగ పొందాలి

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు


2.సిరిసందలకు స్త్రీయే మూలం దర్జాగా ఆర్జించు

 ఆకతాయిల ఆటలు కట్టగ వీరనారిగా విజృంభించు

ఆత్మన్యూనతను అధిగమిస్తూ నీలో ప్రతిభను దీపించు

ప్రపంచ మహిళా దినోత్సవాన మహిలో మహిళగ గర్వించు

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు

 

https://youtu.be/braTYeKZhlk


"కాలవలయం"

కాలచక్రం గిర్రున తిరిగింది

కళ్ళముందుకు మళ్ళీవచ్చింది

ప్రతి ఉగాదికంటే ఎంతో విశేషమైనదిది

అమ్మకడుపున అంకురమై నాడు నే వెలిసినది

శుభములు కూర్చుతుంది శుభకృతు ఉగాది

అరవై ఏళ్ళక్రితం ఇదే ఇదే నా ఉనికికి నాంది


1.అగ్రహారం నదీతీరం  చక్కని వాతావరణం

పచ్చని పైరులు చుట్టూ గిరులు చెక్కుచెదరని పర్యావరణం

నిర్బంధమె లేని విద్యావిధానం వీథి వాడా క్రీడా మైదానం

అమూల్యమైన బాల్యమే ఆటపాటల సన్నిధానం

సంస్కృతి సభ్యత సహితంగా సాగింది అభ్యసనం

శుభములు కూర్చింది నాడు జగతికి శుభకృతు 

శోభను మోసుకొచ్చింది ఆవెనుకే వచ్చిన శోభకృతు


2. మహానగరం గరం గరం అశాంతి వాతావరణం

వాయు శబ్ద కాలుష్యాలతొ విషతుల్య పర్యావరణం

చిత్తడి చిత్తడిగా తీవ్ర వత్తిడితో చిత్తవుతూ చిత్రంగా చిత్తం

లేనిదిలేదు మోదం మినహా యాంత్రికంగా కృతక జీవనం

కవనం గానం ఊపిరిగా మనుగడ సాగును ఆసాంతం

శుభములు తేవాలని ఉంది బ్రతుకున ఈ శుభకృతు

శోభను కలిగించాలని ఉంది వచ్చే ఏటికి శోభకృతు



https://youtu.be/m8SmhdL_XpU?si=FPxGzws0aoVk0pjs

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏకాదశి ఉపవాసమెన్నడుండగనైతి

శివరాత్రి జాగరణ నియతి చేయగనైతి

నడిచి దండిగ నీకొండ నెక్కగానైతిని

పట్టెడైనను అన్నార్తికిని పెట్టనైతిని

ఐనను నను ఆదుకో  అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో  చంద్రమౌళీశ్వరా


1.గోదారి గంగలో మేను ముంచకపోతి

దోసెడు జలమైన లింగాన పోయనైతి

పత్తిరి దళమైన శ్రద్ధగా నీ తలనపెట్టనైతి

భక్తిమీరగ హరహరా యని మ్రొక్కనైతి

ఐనను ఆదుకో నను అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో నను చంద్రమౌళీశ్వరా


2.ననుగన్న నాన్నగను చనువుగనుంటిని

అనురాగమింకను ఆశించుచుంటిని

తప్పులు నావంతు తప్పించమంటిని

గార్వము నీఎడల దూరమోర్వకుంటిని

ఐనను ఆదుకో నను అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో నను చంద్రమౌళీశ్వరా

OK

కలుసుకున్నాయి హృదయాలు గుంభనంగా

అల్లుకున్నాయి బంధాలు లతల చందంగా

నదివి నీవు కడలి నేను ఏకమైనాము సంగమంగా

పూవు నీవు తావి నేను వనమునకు మనమే అందంగా


1.నా ఉనికి కోల్పోయాను నీలోన లీనమైపోయి

మనుగడను సాగిస్తున్నాను నీకు ఆలంబననేనై

రుచీ గతి వదిలేసాను నేను నీవుగ మారిపోయి

పరిపూర్ణగ తరించినాను నీకు జతగ చేరిపోయి


2.నా పుట్టుక కొండలు గుట్టలు తోబుట్టులు ఇరుగట్టులు

మెట్టినింట అడుగెట్టినాను నీ తరగలు సంఘట్టనలు

లావణ్యం సౌందర్యం వరములు నా  సహజాతాలు

నీవు నా తోడైనప్పుడు గుప్పుమనెను గుభాళింపులు

Tuesday, March 1, 2022


https://youtu.be/CdEzKhWnHYw?si=CctAaIqz76QPVyxf

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శివశంకరా అభయంకరా

గిరిజామనోహరా హరా హరహరా

గంగాధరా సుందరా చర్మాంబరధరా

ఈశ్వరా పరమేశ్వరా శ్రీరాజ రాజేశ్వరా

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ


1.చెప్పలేనంత ఆకలీ ఉపవాసమెలా సాగాలీ

పగలే నిద్ర ముంచుకొస్తే జాగారమెలా చేయాలి

శివరాత్రి  వ్రతమే తీవ్రతరమాయే కదా కపాలి

నీ ఆనతిలేనిదే పరిపూర్తి సాధ్యమా ఇందుమౌళి

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ


2.గుడికైన వెళ్ళనైతిని నా గుండెలోనె ఉన్నావని

కోరికలేవీ కోరనైతిని నా అక్కఱలన్నీ ఎరిగేవని

ప్రతిశ్వాస నీధ్యాసగ నిరంతరం నీ ఉపవాసమే

నా ఎదలయ నీ స్మరణగ అనవరతం జాగారమే

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ

Monday, February 28, 2022

 

https://youtu.be/YvcA0SXTWnI?si=tYhHb3ObHfzpaPMU

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


*మహాశివరాత్రి-2022 శుభాకాంక్షలు*

రాగం:తోడి

ప్రణవనాద ప్రాభవా పరమేశ్వరా

పరంజ్యోతి స్వరూపా ప్రభాకరా

మహాలింగ విగ్రహా మహేశ్వరా

శాశ్వత శివదాయక శంభోహర శంకరా


1.సోమనాథ సంస్థిత సోమేశ్వరా

శ్రీశైల శిఖరాగ్ర గృహ శ్రీ మల్లీశ్వరా

ఉజ్జయినీ నగరేశ్వర  మహాకాళేశ్వరా

ఓంకార పురీశ్వరా అమరేశ్వరా


2.చితాభూమి స్థావరా వైద్యనాథా

ఢాకిన్య స్థిరా నమో భీమశంకరా

సాగర తీరాగారా శ్రీ రామనాథా

దారుకావన స్థితా నమో నాగనాథా


3.వారణాసి వాసా విశ్వేశ్వరా

గౌతమీతట నివాసా త్రయంబకేశ్వరా

హిమశిఖర విలాసా హే కేదారీశ్వరా

ఎల్లోరా ఘృష్ణేశ్వరా శ్రీ రాజరాజేశ్వరా

 

https://youtu.be/PhqGpQvsGxg?si=jVPvzPtKJbc0AK3-

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హర హర హర నమః పార్వతీపతయే నమః

శివ శివ శివ శంభో మహాదేవాయ నమః

కాలకాలాయనమః ఫాలనేత్రాయనమః

రుద్రాయనమః భద్రాయనమః 

మహాలింగరూపాయ నమః గంగాధరాయనమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః


1.నీల కంఠాయ నమః శూలహస్తాయ నమః

దిగంబరాయ నమః త్రయంబకాయ నమః

భూత నాథాయ నమః ప్రమధనాథాయ నమః

శంకరాయ నమః శశి శేఖరాయ నమః

నగధర సన్నుత నమః పన్నగ శోభిత నమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః


2.భస్మధరాయనమః పురంధరాయనమః

జటాధరాయనమః మహానటాయ నమః

మృత్యుంజయాయ నమః నృత్య ప్రియాయ నమః

వృష వాహనాయ నమః శ్రీ వైద్యనాథాయ నమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః

 

https://youtu.be/VEplLsvioEs?si=kEnGKNp67nFaYdnF

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ



రాగం:మోహన

అగ్గేమో ఎగసేను నీ కంటిగుండా

బుగ్గేమో పూసేవు నీ ఒంటినిండా

నీటి బుగ్గేమో నెత్తినుండి జారుతుండ

ఎలుగు బుగ్గేమో తలన ఎలుగుతుండ

చెప్పనలవిగాదు శంకరా నీకుండె సింగారమింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా


1.సంపేటి ఇసమేమో బొండిగనుండ

కాటేసె పామేమో నీ మెడలొ దండ

ఏనుగు తోలే నీకు కట్టే బట్టగనుండ

బుడబుక్క తిప్పేటి సప్పుడెప్పుడుండ

చెప్పనలవిగాదు శంకరా  నీకున్న గొప్పలింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా


2ఎద్దునెక్కినువ్వు తిరుగుతుండ 

ఇంటింటి బిచ్చంతొ నీకడుపునిండ

వల్లకాట్లోనే నీదైన కొలువుండ 

నీ ఇల్లుపట్టేమో ఆ ఎండికొండ

చెప్పనలవిగాదు శంకరా సన్యాసి నీ వాసినింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా

 

https://youtu.be/z6UgpVAjaXM?si=uRz_HidvkbJfTNg6

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కైలాసము నాకేల కైవల్యము నాకేల

కథలలో వినగనేల పరమశివా నీ లీల

ఉన్నట్టో లేనట్టో గమ్మునుంటె తెలియుటెలా

కదులు మెదులు ఎదలొ నీవె మా జీవ లయలా

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


1.పురాణాలు కావ్యాల ఎన్ని తార్కాణాలు

హరికథలు స్థలగాథల ఎన్ని నీ  నిదర్శనాలు

అంతటా లింగాలు అడుగడుగున నీ గుళ్ళు

నామమాత్రమే  కదా వెత దీర్చని దేవుళ్ళు

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


2.ప్రదోషకాల వ్రతాలు సంతతాభిషేకాలు

శివరాత్రి ఉపాసాలు జాగార ఉపాసనలు

హరహరమహాదేవ శంభోయను నినాదాలు

ఇవేకదా సదా శివా  మేమేరిగిన వేదాలు

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

మొబైల్:9849693324P

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మది బృందావని కెంతగా ఎదురుతెన్నులు

మనమను యమునకు కాయలుకాచెను కన్నులు

కన్నయ్యా నీ హృదయమే వెన్నయ్యా

కనికరముతొ కని అరుదెంచగ నీకింతటి జాగేలయ్యా


1.ఆరాధనే అగుపించదా నేచేసే ఆరాధనలో

ఆ మీరా స్ఫురించదా నేసమర్పించే నివేదనలో

అనాథనైతిని నేను నను చేరదీయరా శ్రీనాథా

అక్కునజేర్చుకోవేరా ఆలకించి నా దీనగాథ


2.తీర్చావుగా పదహారు వేల గోపికల కోరికల

నెరవేర్చవేలనయా వారిలా నేకన్న తీపి కల

చోటులేకపోతెమానె కాసింతైనా నీ ఎడదన

కడతేరనీయి కన్నయ్యా నీ పదముల కడనైనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భారతీయులం మేము లౌకికవాదులం

కులమతాల ఆజ్యంలో రగిలే మంటలం

జాతీయత వలసిన చోట మతాల మతలబులం

హైందవమంటూ కలవని కులాల కంపులం

భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగే పౌరులం

సమైక్యభారత సౌభ్రాతృత్వ వారసులం


1.మతం మనసు దాటనేల నమ్మిందే దైవం

తరచిచూస్తె అన్నిమతాల్లో ఏకైక భావం

సాటి మనిషి సంతోషానికి కాస్తైనా సాయపడు

చేతనైంది ఇసుమంతైనా  చేయగ ముందుండు

పరులు వైరులను సూత్రాలేవి ప్రతిపాదించకు

అభిమతమే ముఖ్యంకదా విద్వేషాలందించకు


2.గడపదాటితే ఏ కులమైనా ఎడదన వ్యాకులమే

వృత్తుల వల్ల వృద్ధిచెందితేం కులాలు కోరే కాకులమే

పుట్టిన జాతికి చేసే పనికి పొంతన లేని లోకులమే

వచ్చినప్పుడు పోయేనాడు ఎవ్వరమైనా ఏకాకులమే

విశ్వమానవ .కళ్యాణానికి తలా ఓ చేయి వేయాలి

వసుధైక కుటుంబమంటే ఏంటో తెలియజేయాలి


3.ఉనికి కోసం ఉచితానుచితం అసలో ఆలోచించం

పదవిని పొందే పందెంలో ఎంతకైనా ఎపుడూ సిద్ధం

సమాఖ్య  సాకుగ మాటల బాకుతొ మా యుద్ధం

రాజకీయ చదరంగంలో రౌతు జిత్తులే పద్మవ్యూహం

సమగ్ర భారత సార్వభౌమ భావనే మా ప్రాధమ్యం

ఝండా ఊంఛా రహే హమారా ఇది సత్యం తథ్యం

Tuesday, February 22, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మోమున జాబిలి అందం 

మోవిన జాలువారు మకరందం

నా జీవన నందనవనిలో 

నీవే చెలీ కమ్మని చందన గంధం


1.శ్వేత చేల సుందరి

దివ్య స్వర్ణ మంజరి

నా కలమున ప్రవహించే జీవఝరి

సరస గీత మాధురి

సకల జన మనోహరి

నా గళమున ఉరకలిడే సుధా లాహిరి


2.నీ నామ జపమే సతతం

నీ రూపు వలపునకూతం

నీ చూపే నాలో మరులకు సుప్రభాతం

నీ తనువే కిసలయ చూతం

నీ నవ్వే  ఆమని పిక గీతం

నిలువెల్లా చెలీ నీవే గణిత నిర్మితం

నడవడి నేర్పని బడి ఎందులకు

బ్రతుకు తెరువు గరపని చదువెందులకు

క్రీడాస్పూర్తి కొరవడిన స్పర్ధ వ్యర్థమే కదా

మానవతను వికసింపజేయని విద్యయే వృధా


1.అరకొర చదువులు ఎందుకట బట్టీ పట్టే పాఠాలు కాబట్టి

గాడిద మోతలెందుకట తూకం తోటే జ్ఞానం అనుకోబట్టి

చదువుకొనే లోకంలో చదువుకుంటె లౌక్యమబ్బేనా

మార్కులకోసం విక్రమార్కులైతే తెలివిక మబ్బేనా


2.ఆటలు పాటలకలవేకాని పాఠశాల ఒక బంధీఖానా

చదువుతొ బాటుగ సంస్కారానికి లేనేలేదు ఠికానా

విలువల విలువను ఎరుగుట లేదుగ ఈ జమానా

తమతో తామే తలపడినప్పటి  గెలుపే ఓ నజరానా


Sunday, February 20, 2022

అసూయకలగనీ నాలో నీ ఉన్నతినేగని

పదేపదే నే కలగనీ పొందనీ నీకున్న ప్రతిభని

నీ భావాల పాదాలకు మువ్వల పట్టీనై నను చెలగనీ

నీ మంజుల వర్ణాలకు శబ్దాల లయనై నను మెలగనీ


1.రమ్యమైన నా గమ్యం నీకీర్తి శిఖరమై

అనన్యమైన నీ ధ్యానం జనవశీకర కరమై

దృక్పథాన్ని విశ్వమంత విస్తృత పరచనీ

మనోరథాన్ని విశాలమైన సరళపథము చేర్చనీ


2.శిష్యులే సద్గురువుకు మార్గదర్శులైన వేళ

గురువు మదే ఊగదా సదానంద డోలికల

నీ గెలుపే నాదిగా అనాదిగా అలవాటే కదా

నీ నుదుటన ఒదగదా సిందూరమై నా ఎద