Monday, July 18, 2022

https://youtu.be/uA-xPXQxM1w?si=6BB0yWjXr0P-P2mE

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ

రాగం : పీలూ 


తప్పుకుంటా తప్పకుండా

నీకు నేను కాలేనో గుదిబండ

వాడిపోయెను మనమైత్రి పూదండ

సైచలేను బ్రతుకును ఇకపై నిన్ను కలవకుండ


1.బదులీయని నీమౌనం

శ్రుతి తప్పిన పికగానం

చిల్లుబడిన కుండైంది అభిమానం

చెత్తకుండి పాలైంది నా బహుమానం

చిన్న నిర్లక్ష్యమైనా గుండెకౌను గాయం

చిరు నిర్లిప్తతతోనే చనువంతా మటుమాయం


2.పట్టుబట్టి చేసేస్నేహం

పట్టిపెట్టు పంగనామం

ఉబుసుపోని కబురైంది హృదయ నినాదం

బూదిలో పన్నీరైంది

నా అంకిత భావం

వరదంతా నా కన్నీరే గమనించవు అదినీతీరే

మాటవరసకైనా తలవవేఁ

నేనంటే శూన్యపు విలువే

https://youtu.be/sZWxRvJe-jc

రాగం:అమృత వర్షిణి

భక్తుడనైతే నన్ననుగ్రహించు

ద్విషత్తుడనైతే సంగ్రహించు

ఏదేమైనా సరే నాపై నీ దృష్టి సారించు

నీ సన్నిధి నిరతం ప్రసాదించు

నమో నారసింహా- దైవమేది నీ తరహా

శరణుకోరనెవరిని స్వామీ- నిను మినహా


1.అతి మదమ్ముతో విర్రవీగి

వరగర్వముతో గద్దించి వాగి

గదతో చెలరేగి స్తంబాన్ని మోదగా

ఉద్భవించినావు నరకేసరిగా

ఋజువు పరచినావు సర్వాంతర్యామిగా

దునిమినావు దైత్యుని దుష్టశిక్షణా దక్షునిగా


2.సంపూర్ణ విశ్వాస వేద్యునిగా

విద్యలమర్మం హరియేయను ఆద్యునిగా

భారం నీపైవేసి మనగలిగిన ప్రహ్లాదుని

నిను నుతించి ముక్తిని బడసిన శేషప్పని

కాచి చాటినావు నీవు భక్త పక్షపాతివని

శిష్టరక్షణార్థమై అవతరించి బ్రోచెదవని

Sunday, July 17, 2022

https://youtu.be/WT066-htEVM?si=o0hRDtcopoPiNrqg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:సరస్వతి 


శివోహం శివోహం పరమశివమ్ 

నీవంటే నాకు లేదు భేదభావమ్ 

శివోహం శివోహం మహాదేవమ్ 

అహం దహించెనా త్వమేవాహమ్ 


1.చిక్కులు నీకున్నవి తలలోనే

నా బ్రతుకంతా చిక్కుబడే వెతలలోనే

శివగంగ అలుగంగ ఇలన కరువుకాటకంగా

నా నయన అశ్రుగంగ జాలువారు అనవరతంగా

నీకు నాకు లేనే లేదు భేదభావం

భ్రమర కీటక భంగి శివోహం శివోహమ్ 


2.నుదుటి కంట మంట మండు నీకు

అశాంతితో మండు చుండు గుండె నాకు

నాగాభరణాలతో  మేనంతా నీకు

రోగాభరణాలతో కడుచింతే నాకు

నీకు నాకు లేనే లేదు భేదభావం

ఇనుమయస్కాంతమైనటుల శివోహం శివోహమ్ 







https://youtu.be/mD0T6rUYOBY

పరమ దయాళా

పరమేశ్వర పింగళా

భక్త వరద ధవళ పుద్గలా

పురహర వందే నీలగళా


1.విశాల  హృదయా

కాశీ విశాలాక్షీ ప్రియా

విశ్వేశ్వర గంగాతీరనిలయా

పశుమతిని నేను పశుపతి 

పరి పాలించవయా


2.తిన్నడి పాటి నే గానా

మార్కండేయుని బోలనా

కరి కర్కటి సాటి తూగనా

భోళాతనమున ఎంచగ 

నను పంచాననా


OK

 నా వెన్నుదన్ను నీవే అన్నులమిన్నా

నా ఎదకు కన్ను నీవే

వన్నెల వదనా

నా ప్రతి విజయం వెనక నీవే

నా శ్రీమతి గీతా

అడుగడుగున తోడునీవే  సుందర హసితా

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు


1.సరిగమలను ఒలికించే సంసార వరవీణవు

మధరిమలను చిలికించే నా మానస సదనవు

అనుకున్నది సాధించేలా విశ్వాసం నింపే ప్రేరణవు

తరచి తరచి తర్కించే నా జీవన విశ్లేషణవు

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు


2.ఉడికించేవు ఊరించేవు వారించేవు వారిజనేత్రి

మురిపించేవు నను మై మరపించేవు కోమల గాత్రి

సహనంలో సాటి నీకు రాగల దిలలో ఒకటే ధరిత్రి

శతమానం భవతి నా ప్రియసతీ

వీడనీకు మన జన్మల మైత్రి

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు


Saturday, July 16, 2022

OK

పురూరవ సార్వభౌమ నిర్మితమందిరము

చందనచర్చిత ద్వయావతార సుందర విగ్రహము

సింహాచల శ్రీలక్ష్మీ వరాహ నరసింహ క్షేత్రము

పరమ పవిత్రము ప్రహ్లాద వరదుని పావన ధామము


1.హిరణ్యాక్షు దునిమి ధరణిని ఉద్ధరించి వెలిసిన వరాహ రూపము

హిరణ్య కశిపు సంహరించి భక్త ప్రహ్లాదుని బ్రోచిన నరసింహతేజము

ఏక కాలమందున దివ్య సాక్షాత్కారము

సింహాద్రిని దర్శించిన సులభ సాధ్యము


2.ఉగ్ర జ్వలిత దేహానికి ఉపశమనము చందన లేపనము

కరుణా దృక్కుల కమనీయ స్వరూపము కామితార్థదాయము

సింహాద్రి అప్పన్న భక్తజనుల కల్పవృక్షము

స్తంభ సంభవుని సాక్షిగ కోరికలీడేరును పెనవేయగ కప్ప స్తంభము

Thursday, July 14, 2022

 

https://youtu.be/Vil89h6Rq2s?si=g-ZE7oHa5-hLu5nT

హే దీన బంధో దయాపూర్ణ సింధో

నమ్మి వచ్చినానురా నన్ను కానరా స్వామీ

తిరుమలేశ గోవిందా కరుణజూడు పాహి ముకుందా

విన్నపాల నాలకించి నన్ను పాలించరా


1.అల్లంత దూరం నుండి-

కొండంత భారంతోని -నిన్ను చేరవచ్చినాను నిలువు నామాల వాడా

తలనీలాలిచ్చేసాను-కోనేట్లో నే మునిగాను నీవాకిట నిలుచున్నాను నిన్ను చూసేందుకు పరితపించి పోతున్నాను


2.మరల మరల రాలేనయ్యా

నేను మరలి పోనయ్యా

మరచి పోయినాను నినుగాంచి

మైమరచినానయ్యా

వింతవింత కోరికలేవో వెంటతెచ్చినానయ్యా 

మన్నించి నిను సేవించే భాగ్యమొక్కటీయవయ్యా


శ్వాసమీదనే ధ్యాసను నిలుపు

నీమీద నీకు అదే తొలి గెలుపు

ఆలోచనలను చేయకు అదుపు

విచ్చలవిడి తిరుగగ వాటికి రానీయి అలుపు


ఏదో ఒక క్షణమందున కలుగును మైమరపు

అదే కదా ధ్యానికి మేలుకొలుపు


1.ఇంద్రియాలు వాటి పనిని అవి చేసుకోనీయి

మనోబుద్ద్యహంకార చిత్తాలను కట్టడి చేయకోయి

మూలాధారంలో  ఏదో కదలిక మొదలయ్యి

పాకుతుంది కుండలినీ  పైపైకి జాగృతమైపోయి


2.సాగనీ ప్రయాణం స్వాధిష్ఠానం మీదుగా

నాభిక్రింద మణిపూరం ఉద్దీపనమవగా

ఉరఃపంజర మధ్యమాంతాన అనాహతం జ్వలించగా

కంఠ్యాదిన విశుద్ధి చక్రం చైతన్యమందుగా


3.భృకుటి మధ్య వెలుగొందును ఆజ్ఞాచక్రం

అణిమా గరిమాది అష్ట సిద్ధుల మూల కేంద్రం

సంతృప్తిని చెందక చేరాలి బ్రహ్మరంధ్రం

అదే కదా అలౌకిక పరమానం సహస్రారం

సహస్రార ఛేదనతో సంప్రాప్త మయ్యేను నిస్తారం



Wednesday, July 13, 2022

ఎంత సన్నని గీత- చావు బ్రతుకుల మధ్య

కన్నుమూసి తెరిచేలోగా- ప్రపంచమే  మిథ్య

గట్టునుండి చూసేవారికి-చెప్పలేని ఉబలాటం

వరదలొ కొట్టుక పోయేవారికి -జీవన్మరణ పోరాటం


1.అప్పటిదాకా నవ్వుతు తుళ్ళుతు ఉన్న మనిషి

కుప్పకూలిపోతుంటే-కళ్ళప్పగించడమే తెలిసీ

దేశాధినేతలైతే ఏమి-రాజాధిరాజులైతే ఏమి

నిస్పక్షపాతమే మృత్యుదేవతకు యామదూతలకు 


2.నేల నీరూ గాలి నిప్పు-ముంచుకొచ్చిందంటే ప్రతిదీ ముప్పు

రోగం నొప్పి ప్రమాదం ఏదైతేనేం ఏదో ఓ కారణం

అనివార్యం అనూహ్యం వరించెనా నిర్వాణం

అనాయాస మరణం ప్రసాదించగా పరమాత్మకు విన్నపం


https://youtu.be/wraC77Z8yo8


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్

రాగం:శుభపంతువరాళి


కనులు చెలమెలాయే

కనుకొలుకుల వరదలాయే

కనని వినని వేదనయే కారణమాయే

కనుగొనలేరెవరూ ఎద బడబానలమాయే


1.కక్కలేని మ్రింగలేని గరళమే ఇది

అవిరళంగ పారుతోంది  దుఃఖ నది

ఏ సాంత్వన పొందనిది మందన్నది లేనేనిది

గుండె రాచపుండై కబళించే

దండి దమనకాండ ఇది


2.పైనేమో చిరు నగవు పటారం

లోనేమో తెగని తగువు వ్యవహారం

రాపిడిలో నుసిగా రాలుతూ మనసు నలిగె చక్రవ్యూహం

మరణమొకటె తీర్చేటి అంతులేని వింతదాహం


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉంటావేల స్వామీ కొండలపైన

ఉండలేవా ఏమీ మా గుండెలలోన

తిరుమలలో బదరీనాథ్ లొ వైష్ణవత్వంగా

శ్రీశైలంలో కేదార్ నాథ్ లొ శివతత్వంగా

వేలవేల భక్తులు లక్షలాది యాత్రికులు దర్శనార్థమై పడరానిపాట్లు

నీ గిరి కొస్తే నీ దరికొస్తే ఎందుకయా అగచాట్లు


1.అకాల వర్షాలు ఉధృతమైన వరదలు 

హఠాత్తుగా విరిగే కొండచరియలు

ఏ దారీ లేక దిక్కుతోచక అల్లాడుతు అలమటించు ఆపన్నులు

నమ్మికదా వచ్చినారు ఉంటాయని నీ వెన్నుదన్నులు


2.అడుగడుగున ఎదురయ్యే అవినీతికి బలియౌతూ

అక్రమాలు ఆగడాలు కనలేక కుదేలౌతూ

దూరాభారాలకోర్చి వ్యయప్రయాసలే భరించినా

కుటుంబాలు సభ్యులనే కోల్పోవుట నీకీర్తి పెంచునా


OK


 


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవిని నేను  జీవనదిని నేను

కవితనై అనవరతం ప్రవహిస్తాను

ఎందరు దాహం తీర్చుకున్నా

ఎవ్వరు కలుషిత పర్చుతున్నా

ఆగదు నా కవనం అనంతమే నా పయనం


1.ఒకరి పట్ల అనురాగం లేదు

ఎవరి ఎడల ఏ ద్వేషం లేదు

కొండలు కోనలు ఎదురైనా అధిగమించి

వాగులు వంకలతో దారంతా సంగమించి 

సాగుతాను చైతన్యంగా సాగర తీరందాక

అడ్డుకట్టలెన్నికట్టి ఆపజూచినా వెనుకంజవేయక


2.ఏ పుష్కర పురస్కారం ఆశించక

దరులలో హారతులకై తలవంచక

ఒకోసారి ఉదృతమై ఉప్పొంగే వరదగా

ఎల్లకాలం మానవాళి మనుగడకే వరదగా

కల్మషాలనే సమాజంలో సమూలంగా కడిగేస్తా

గలగలగా గంభీరంగా అలజడిగా సడిచేస్తా




Tuesday, July 12, 2022


https://youtu.be/a8nmjD-OH9U


యాడబడితె ఆడనె ఉంటావట సామి

మా యాదిల మనకపోతె నాయమా ఏమి

తిరిగినాము కాళ్ళరిగేలా ఊళ్ళకూళ్ళు

నిను సూడగ దనివారక గోపురాలు గుళ్ళూ 

నర్సిమ్మసామి నీకు మా దండాలు

చెంచు లచ్మిని గూడ్న పెంచలయ్య తీర్చు మాకున్న గండాలు


1.కంబం పగులగొడ్తె ఊడిపడినావు

నరసింగం రూపుతో ఉగ్రంగ నిల్చావు

దూర్తుడు ఇరన్య కశిపున్ని చీల్చావు

ప్రాలాద సామిని దగ్గెరికి దీశావు

నువ్వంటె మాకు మా ఐదు పానాలు

నమ్మికొలిచినాము మేమిన్ని దినాలు


2.ఆవేశంతొ ఊగిపోతు అడివంతాదిరిగావు

చెంచులచ్మి ఎదురపడితె శాంతించినావు

అమ్మనిన్ను పెనవేయగ ఆడ్నే సిలగ వెల్శావు

నిమ్మలమై మునిగ నిల్చి మమ్ముల నిల గాచేవు

కల్యాణం మా ఇంట్లో జరగునటుల జేయి

పిల్లా పాపలతో మము సల్లగ జూడవోయి


https://youtu.be/QN_p9oBRYtw

నీ దివ్య మంగళ విగ్రహం

దర్శించితి స్వామి ధన్యోహం

అనిమేషుల మౌదుమటులె కాంచినంత తృటికాలం

శ్రీలక్ష్మీనరసింహ స్వామీ దాసోహం


1.రత్నఖచిత మకుటము దేదీప్యమానము

జ్వలిత నేత్ర యుగళము దుర్జన భీకరము

దంష్ట్రా కరాళ వక్త్రము ప్రకటిత రసనము

శటసంయుత భీషణోగ్ర కంఠీరవ

వదనము


2.శంఖ చక్ర సహిత కర యుగ్మము 

నిశిత వజ్ర నఖాన్విత హస్త విరాజితం

వక్ష స్థల కౌస్తుభ శోభితం

పీతాంబర ధారిణం   

నర మృగ ద్వయ రూప సమ్మోహనం మన్మోహనం


https://youtu.be/cAOLzSA0XzE


స్వామివారి తత్వమంతా-సామాజిక దృక్పథమే

నరసింహావతార నిదర్శనం-సర్వవ్యాపకత్వమే

నర మృగ యుగ దేహుని గ్రహించగా జీవకారుణ్యమే

ప్రహ్లాద వరదుని ఆరాధనలో-అడుగడుగున మానవీయకోణమే

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో



1.జీవజంతు జాలమంతా నరసింహుని అవతారమే

ప్రతి మనిషిని భావించినంత-మహావిష్ణు రూపమే

చరాచరజగత్తులో ఆవరించి ఉన్నదంత పరమాత్మయే

ఎరిగి మసలుకొనగలిగిన-నరుల జన్మ చరితార్థమే

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో


2.ఆపన్నుల నాదుకొనమనే దివ్య సందేశము 

అరాచకము నెదిరించమనే-భవ్యాదేశము

అవయవాలె ఆయుధాలనే-గురూపదేశము

ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసే-దిశానిర్దేశము

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో

OK

నవ నారసింహం-నమామ్యహం

భవతారకనామం భజామ్యహం

అతులిత నుత మహిమాన్వితం

స్తంభ సంభవ తవ దివ్య చరితం

శరణమహం స్మరామ్యహం నరహరే దాసోహం


1. అహో మహా బలా యని

నిను సురలు మునులు కొనియాడగ కరుణబూని

వెలిసావు అహోబిలాన నవవిధ రూపమ్ములనే గొని

అగస్త్యమహాముని ప్రార్థన మన్నించి శనివారం దర్శనమీయ ప్రకటితమైనావు మాల్యాద్రిని

హిరణ్యాక్ష కుమారుని రక్తాలోచనుని దునిమి వశిష్ఠముని వినతితో నెలకొన్నావు అంతర్వేదిని


2.ఉగ్రయోగ ద్వయ మూర్తులుగా

గోదావరి నదీతీరమందున

స్థిరవాసమున్నావు ధర్మపురిన శేషప్ప వరదునిగా

పానకమే ప్రీతిగా గ్రోలుతూ 

అర్పించిన సగం తిరిగి ప్రసాదిస్తూ వరలుతున్నావు మంగళ గిరిన

చెంచులక్ష్మినే మోహించి పెండ్లాడి పెనవేసి

పెనుశిలగా నిలిచావు పెంచలకోనలోన


3.యాద ఋషిని బ్రోవగా ఉగ్రయోగజ్వాలగండభేరుండ రూపాలుగా యాదగిరిన వెలుగొందేవు లక్ష్మీనరసింహునిగా

వరాహవదనము కేసరివాలము మానవ దేహము కలిగిన మూర్తిగా

చందనలేపిత రూపంగా అగుపించేవు సింహాద్రిన అప్పన్నగా

మత్స్యావతారాన సోమక సంహారాన వేదాలకు వరమిచ్చి నీసన్నిధి స్థానమిచ్చి వేదమూర్తిగా వరలేవు వేదాద్రిన

https://youtu.be/9uy4ZOM01y0

రాగం:తోడి


కృతిరచించ నాతరమా రమాధవుని మహిమను

శ్రీ నరసింహావతార  గాథను

వినిననూ చదివిననూ తరింపజేయును మానవ జన్మను

నుడివినను పాడినను అంతరింపజేయును  అఘమును


1.సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులను

స్వామి దర్శనార్థమై వైకుంఠమేతెంచినంతను

అడ్డగించ ద్వారపాలకులా జయవిజయలను

కోపించి శపించగా మునులా భృత్యులను

శ్రీహరి కృపనొంది జన్మించిరి

హిరణాక్ష హిరణ్య కశిపులుగాను


1.హరి వైరిగా చెలరేగెను హిరణ్య కశిపుడు

గడగడలాడెను శచీపతి తన పదవి గతించినప్పుడు

నారాయణ మంత్రమొసగినంత నారదుడు- 

హరి భక్తుడాయె గ్రహించి దితి సుతు సతి గర్భాన ప్రహ్లాదుడు 


2.హరి తన పాలిటి అరి యని

వారించె హరిని స్మరించ జనకుడు ప్రహ్లాదుని

సర్వాంతర్యామి మహా  విష్ణువని 

కొలిచి తరించమనె తన తండ్రి హిరణ్య కశిపుని

ఏడిరా  శ్రీహరి  ఇందు కలడాయని మోదెను వెనువెంట ఎదుటగల  స్తంభాన్ని


3.వరగర్వితుడా దైత్యుని దునుమాడగ

నరహరి మహోగ్ర రూపమ్మున  వెలువడగ

కోఱలతో గోరులతో హిరణ్యకశిపుని చీల్చి చెండాడగ

శాంతింపమని ప్రహ్లాదుడు నరసింహుని వేడెగా

Wednesday, July 6, 2022

https://youtu.be/y-QroB5r7P0


నువ్వంటూ ఉన్నావని 

మా మొరలే విన్నావని

నిన్ను నమ్మినాము సాయీ

పరీక్షలే పెట్టినగాని

జాప్యమిటుల చేసినగాని

సత్ఫలితం ఇవ్వకతప్పదోయి


1.పాటలెన్నొ కట్టానంటే పనీపాట లేదన్నాట్టా

నీ పదములు పట్టానంటే

నావి నటనలన్నట్టా

నువు రాయివైనా మానే

కరుగాలి మా కథవింటే

సమాధియైనాగాని కదలాలి మావెత కంటే


2.ఫకీరువే నీవనుకొన్నా 

కన్నీరు కార్చేవు మా దుస్థితికి

అవధూతగ నిను కనుగొన్నా

ఆదుకొని తీరేవు మా దుర్గతికి

నీపేరే పెట్టుకొని- నిత్యం నిన్నే-నే

స్మరిస్తున్నా

ప్రాధేయపడుతున్నా -నన్నే నీవు విస్మరిస్తున్నా


OK



OK

 హారతి నేనే పట్టకుంటే-ఆపాటిదే నీ అందమంటే

పాటలె నేను కట్టకుంటే-అందరివంటిదే నీ ఒంటి మట్టే

సుందరాంగీ నను గానకుంటే నువు చుప్పనాతివే

మోహనాంగీ నన్నొప్పకుంటే నువ్వప్పలమ్మవే


1.మూలన పడిఉన్న బండరాయిని శిల్పంగ చెక్కానే

నిబిడీకృతమై నీలొ దాగి ఉన్న నగిషీలనెన్నో సానబట్టానే

గుండెను గుడిచేసి ప్రేమదేవిగ నిన్ను కూచొబెట్టానే

ముడుపులెన్నొగట్టి నీ ముందుపెట్టి జేజేలు కొట్టానే


2.రవిగాంచకున్నట్టి రాణ బైటపెట్టి కవితలెన్నొ నేను కట్టానే

ఎండ తగులకుండా చినుకు తడుపకుండ గొడుగు నీకు పట్టానే

కాలుకందకుండ లోకాలుతిప్పి నీకు చూపెట్టానే

ఎవరికందకుండ ఎత్తెంతొ ఎక్కించి నిన్నుగా నిలబెట్టానే


Tuesday, July 5, 2022

 లంచావతారం ప్రపంచవ్యాప్తం

అవినీతి వివిధ రూప పరివ్యాప్తం

లంచమివ్వక తప్పని సామాన్యుని అసహాయత్వం

వేళ్ళూనుక పోయింది దేశమంతా ఇది బహిరంగసత్యం


1.సాంప్రదాయమయ్యింది అవినీతి సైతం

రివాజుగా మారింది అమ్యామ్యా

చేతి వాటం

ఇందుగలదందు లేదను సందేహమెందుకు

లంచం తప్పనిసరైంది పని జరిగేందుకు


2.రెవెన్యూ మున్సిపల్ కార్యాలయమేదైనా

రవాణా రిజిస్ట్రేషన్ న్యాయ శాఖలేవైనా

ఫైలంటూ ముందుకి కదిలే మంత్రం లంచం

కేసంటూ కొసకంటూ తేల్చే సాధనం లంచం


https://youtu.be/ZMQ-HPleMOA?si=Kl_JY2YoWnW9uKMw


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఖర్చులేదు వెచ్చం లేదు-పంచుకుంటే తరిగి పోదు

పదేపదే వాడుతుంటే పదునెక్కే వింతైన తీరు

శ్రోతల తపనల దాహం తీర్చే సెలయేరు

పాటే తేనేల ఊట -పాటే మనసుకు ఊరట

పాటే పువ్వుల బాట-పాటే ప్రగతికి బాసట


1.పాడేవారికి పరవశమే ప్రతిగీతం

ఎవరున్నా వినకున్నా అదోలోకం

మధువుకన్నా మిన్నదే ఈ మైకం

స్థలము సమయం అవసరమే లేని వైనం

పాటే తేనేల ఊట -పాటే మనసుకు ఊరట

పాటే పువ్వుల బాట-పాటే ప్రగతికి బాసట


 2.ఒంటరి పయనాన వెంటొచ్చే నేస్తం

దగా పడిన తమ్ముడికి కన్నీరు తుడిచే హస్తం

జన్మజన్మాల పుణ్యఫల సంప్రాప్తం

పాటను ప్రేమించే వారికి పాటనే సమస్తం

పాటే తేనేల ఊట -పాటే మనసుకు ఊరట

పాటే పువ్వుల బాట-పాటే ప్రగతికి బాసట



https://youtu.be/cMz43jgy6g4

భోజన ప్రియ నమో లంబోదరాయ

పంచభక్ష్య పరమాన్న నైవేద్య సంప్రియ

కడుపారా తినవయ్యా ఆరగింపులు

మనసారా గొనవయ్యా మా నివేదింపులు


1.మోదకాలు గైకొనుమా మోదకారకా

కుడుములు స్వీకరించు శ్రీగణనాయకా

ఉండ్రాళ్ళ నొసగితిమి దండిగ భుజియించరా

అరిసెలు గారెలివిగొ ముదముగ గ్రహియించరా


2.లడ్డూ పాయసాలు సంతుష్టిగ గ్రోలరా

జిలేబీ పులిహోర సంతృప్తిగ సాపడరా

వెలగపళ్ళు తిని బ్రతుకున వెలుగులు దీపించరా

చెఱకు గడలు గొని మనసుల తీపినింక నింపరా


 

https://youtu.be/ynEJXIu8F5A

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంజనీ పుత్రా మహాబల గాత్రా

సుగ్రీవ ప్రియ మిత్రా బ్రహ్మచర్య దీక్షా పవిత్రా

ఆర్త త్రాణ పరాయణా రామనామ పారాయణా

మా ఇష్టదైవము నీవు మాత్రము

అనవరతం నినుచూడగ మా కాత్రము

మా హారతి గొనవయ్యా మారుతి రాజా

సిందూరాంకిత దేహా గదాయుధ విరాజా


1.నీ చరితము బోధపడిన నరజన్మ చరితార్థము

నీ నడవడిలో అడుగడుగున జీవన పరమార్థము

చెరగని మైత్రికి నీవే నిదర్శనం

విశ్వసనీయతకు నీవే ఉదాహరణం

మా హారతి గొనవయ్యా మారుతి రాజా

సిందూరాంకిత దేహా గదాయుధ విరాజా


2ఆజ్ఞాపాలనకు నీవే తార్కాణం

అకుంఠిత దీక్షా దక్షతకు నీవాలవాలం

జితేంద్రియా ఏకాగ్రతకీవె మార్గదర్శనం

సంజీవరాయా నీనామ  స్మరణయే ఆరోగ్యదాయనం

మా హారతి గొనవయ్యా మారుతి రాజా

సిందూరాంకిత దేహా గదాయుధ విరాజా




Monday, July 4, 2022



https://youtu.be/qqC20ooKr9g?si=qXZOnN13YiQrtC8Z

వేకువనే నువు చిమ్మగ వాకిలి

అద్దంలా మారుతుంది ఆ లోగిలి

చెలరేగి ముంగురులే ముద్దాడగ చెక్కిలి

చిరు చెమటలు చిరుగాలికి ముత్యాలుగ రాలి

ఉషఃసుందరీ తుషార మంజరీ

నీ వయారానికే బేజారై  నా గుండె జారీ

ఊడిగమే  చేయుటకై నీకు నే గులాముగా మారీ


1.చీర కొంగును నడుముకు చుట్టి

కుచ్చిళ్ళను  నాభి క్రింద దోపి

ముంగిట ముగ్గును వేసే లోపే

పిండి పట్టిన చేతితో ముంగురులెగదోస్తే

ముగ్గుపిండే బుగ్గల ముద్దాడేస్తే

ఉషఃసుందరీ తుషార మంజరీ

నీ వయారానికే బేజారై  నా గుండె జారీ

ఊడిగమే  చేయుటకై నీకు నే గులాముగా మారీ


2.కుడికాలు కాస్త  మడిచేస్తూ

వింతగా దొంతిగా వంగేస్తూ

ఎడంచేత పొడుగాటి జడ నొడిసిపడ్తూ

రంగవల్లులే అందంగా పెడ్తూంటే

పౌష్యలక్ష్మే ప్రత్యక్షంగా తోస్తూ

ఉషఃసుందరీ తుషార మంజరీ

నీ వయారానికే బేజారై  నా గుండె జారీ

ఊడిగమే చేయుటకై నీకు నే గులాముగా మారీ


Sunday, July 3, 2022


https://youtu.be/gaLhrO4Epfc

మహాదేవ శంకరం భక్తవశంకరం

శ్రీకరం శుభకరం అభయంకరం

త్రయంబకం త్రిపురాంతకం 

నమో పంచభూతాత్మకం నమో నమఃశివాయ నమశ్శివమేకమ్


1.భూతత్వయుక్తం చర్మ శల్యసంయుతం

శీతోష్ణవిచలితమీ భూఘనం

నశ్వరం ఖనన దహన అంకితం

ఈశ్వరా నీకే సమర్పితం

నమో పంచభూతాత్మకం నమో నమఃశివాయ నమశ్శివమేకమ్


2.జల రుధిర రూప ద్రవ సమన్వితం

ఆమ్లజని పూరితం తేజో విరాజితం

చైతన్య జీవశక్తి విలసితం ఆత్మాకాశ సంభూతం

నమో పంచభూతాత్మకం నమో నమఃశివాయ నమశ్శివమేకమ్


3.చిదంబరేశ్వరం శ్రీకాళహస్తీశ్వరం

అరుణాచలేశ్వరం జంబుకేశ్వరం

ఏకాంబరేశ్వరం కాశీ విశ్వేశ్వరం

కాళేశ్వర ముక్తీశ్వర శ్రీరాజరాజేశ్వరం శ్రీ రామలింగేశ్వరం

నమో పంచభూతాత్మకం నమో నమఃశివాయ నమశ్శివమేకమ్


Saturday, July 2, 2022

 



https://youtu.be/FhblbOiK6k0?si=nYbLcXecVfxRpuR-

నీ ఒళ్ళే మదనుని విరుల విల్లు

నీ కళ్ళే వదలని సూదంటు రాళ్ళు

నీ సొగసే నేల దిగిన హరివిల్లు

నీ వయసే నిత్య వసంతమై విలసిల్లు

వెంటపడక మానెదరా వేదాంతులైనా

కంటగింపె నీ అందం చెలీ దివికాంతలకైనా


1.వెనకనుండి చూస్తే మేనకవే

కనగ ముందుకెళితే ఊర్వశివే

తలఎత్తగ అబ్బో  తిలోత్తమవే

సింగారాల తులతూగే అపర రంభవే

వెంటపడక మానెదరా వేదాంతులైనా

కంటగింపె నీ అందం చెలీ దివికాంతలకైనా


2.నీలవేణి నీ జడ నీలోత్పలము

అలివేణి నీ మోము అరవిందము

పూబోణీ నీ అధరము చూతము

నడుమే నవమల్లిక చనుదోయి అశోకము

వెంటపడక మానెదరా వేదాంతులైనా

కంటగింపె నీ అందం చెలీ దివికాంతలకైనా


Friday, July 1, 2022


https://youtu.be/Mw8JC_yrIYw?si=4WZfEl_cpCe1E7II

నా దృష్టి నీమీదే కరివరదా

దయావృష్టి కురియనీ సదా నా మీద

సర్వస్య శరణాగతి నీవే గోవిందా

తిరుమలేశ భక్తపోష పాహి ముకుందా

నీ పద పద్మాలనే నే తలదాల్చెద


1.మరపురాదు తిరునామాంకిత వదనం

అపర వైకుంఠమే నీ బంగారు సదనం

నీ నామస్మరణయే ఏకైక ముక్తి సాధనం

సారసదళనేత్ర స్వామీ నీకు సాష్టాంగ వందనం


2.వజ్ర కాంచన మకుటం నీ శిరో భూషణం

కౌస్తుభ మణిహారం విశాల వక్షస్థల శోభితం

వైజయంతి మాలాలంకృత దివ్య విగ్రహం

వీక్షణమాత్రాన మన్మోహనం అలౌకికా నందదాయనం




 

https://youtu.be/jqIJ9T6WsDA

అక్షరార్చన జేతు అనుదినము నీకు

లక్ష్యమొక్కటె నాకు దీక్షతప్పగనీకు

ధ్యాసయు శ్వాసయు నీవె ప్రతిజన్మకు

ప్రణతులు ప్రణుతులివె ప్రణోదేవీ 

నీ  పద పద్మ యుగ్మమ్ముకు వాగ్దేవీ


1.నా కలమొలికే అక్షరమేదైనా బీజాక్షరమవనీ

నా మనమున మననమయే భావం

దివ్యమంత్రమవనీ

ప్రభవించే ప్రతిగీతం పరమ పావనమౌ

సంకీర్తనయే కానీ

జనుల నాల్కలందు నాని నా పాట శాశ్వతమై నిలవనీ


2.పరులకు పంచితే పెరిగే సంపద కవనం నీవరం

శ్రోతలనలరించినా కొలది మార్ధవమౌ గాత్రం నీ ప్రసాదం

పాఠక హృద్యమౌ సాహితీ సౌరభమందించవే

జనరంజకమై వరలెడు సంగీతాంబుధి

యందికనను ముంచవే


Wednesday, June 29, 2022

వ్యూహాత్మక మౌని రాజకీయ జ్ఞాని

పాలనా పటిమకు ప్రతీకయే పీవి

గర్విద్దాం మన తెలుగువాడైనందుకు పివీ

విశ్వవిఖ్యాతమే ప్రధానిగా ఆయన కీర్తి తావి

జయహో పాములపర్తి వేంకట నరసింహారావు గారు

శ్రద్ధాంజలి నీకిదే బహుభాషా కోవిదుడా జోహారు


1.కాంగ్రేసు పార్టీకి జన్మాంత సేవకుడవే

ఇందిరా గాంధీకి అనుంగు విధేయుడవే

సంక్లిష్ట సమయాలలో తగు సలహాదారుడవే

అలుపెరుగని సాధనా శూరుడవే

జయహో పాములపర్తి వేంకట నరసింహారావు గారు

శ్రద్ధాంజలి నీకిదే సుకవి కోవిదుడా జోహారు


2.ఆర్థిక సంస్కరణల విప్లవ వీరుడివే

బ్యాంకింగ్ రంగానికి సంజీవరాయుడవే

అగణిత ఉద్గ్రంథ పఠనా,రచనాశీలుడవే

మా ధర్మపురికి చిరకాల ఆప్తమిత్రుడవే


 సిగలొ మందారం-నుదుటి సింధూరం

అధర దరహాసం-నీ హృదయ స్థిరవాసం

కోరలేదు నిను నేస్తం-దొరికిందే నా ప్రాప్తం

నీ పదముల అందియగానైనా

మననీయవే నను జీవితాంతం

నీ చరణ మంజీర మంజుల స్వనమునై రవళించనీ అనవరతం



1.నీ మువ్వల సవ్వడికి నా నవ్వులు జతజేస్తా

నీ దారి వెలుగులకై కను దివ్వెలు వెలిగిస్తా

నీకు అంగ రక్షకుడిగా అడుగడుగున తోడొస్తా

కనుపాపల నిను దాచి రెప్పలనే కప్పేస్తా


2.నీ కాలు కందకుండా అరచేతుల నడిపిస్తా

ప్రతిరోజూ నిను చూడగ పడిగాపులు పడిఛస్తా

ఆత్యాశే నాదైనా నిను పొందగ ఆశిస్తా

మరుజన్మకు సరియని మాటిస్తే  ఇపుడే నే ఛస్తా


Monday, June 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక గొప్ప నాన్నకు కొడుకును 

మంచి కొడుకులకు నాన్నను 

కొడుకుగా నేను ఎందుకూ కొఱగాను

నాన్నగానూ ఎవరికీ అక్కఱకే రాను


1.మా నాన్న నాకెప్పటికీ రియల్ లైఫ్ హీరో

నాన్నగా నా విలువను లెక్కిస్తే  మాత్రం జీరో

అనురాగాలు ఉద్వేగాలు నా కెంతో దూరం

నాతో అనుబంధం  కుటుంబానికే భారం

మనిషిగా నేనేంతో స్వార్థపరుడను

అంటీముట్టక వ్యవహించే పరుడను


2.నాన్నకెంతో భయపడతూ చిననాడు నలిగాను

నాన్నను నేనను తేడా చూపక మిత్రుడిగా మెలిగాను

నాన్న ఆజ్ఞకు లోబడి బ్రతుకును గడిపాను

స్వేఛ్ఛగా నిర్ణయాలను తనయులకే విడిచాను

కోరడానికేముంది సతీసుతుల ఆనందం మినహా

నాదైన నా వైఖరే తామరాకుపై నీటి బొట్టు తరహా

 

https://youtu.be/QHoS9vSDeTw?si=CxfErztjyKeIwQbL

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


నీ వశమైనాను సదాశివా

ఇహ పర వశమే ప్రభూ నీత్రోవ

సదవకాశమే సర్వదా నీ సేవ

సత్కర్మ విశేషమే ఇది మహాదేవా


1.ఇడుముల బడద్రోతువా నీ చిత్తం నా ప్రాప్తం

వరముల కురిపింతువా అది మాత్రం నీ దయాపరత్వం

నీ పదముల నిక వదలను శంభో శంకరా

నీ మననము మరి మానను మహేశ్వరా హరా


2.సులభ సాధ్యుడవనీ భోలావని నిన్నెంచుకుంటిని

దృష్టిని సారింతువని శరణంటిని

నువు ముక్కంటివని

గుడి గుండాలుగా గుండెలనే నువు భావింతువని

తలచిన తడవుగా తక్షణమే ఎదుట సంభవితువని

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్


సాధ్యమే సాధ్యమే సజావైన దృక్పథం

జీర్ణమైతీరుతుంది స్వీకరిస్తే వాస్తవం

సానుకూల వర్తనతో స్వప్నాలు సాకారం

సకారాత్మ భావనతో లభ్యం శాంతి సౌఖ్యం


1.అంతా మనమంచికే అని లోకులు అందురు

మంచి తలచి మంచి పలికి మంచి చేస్తూ అందరు

మంచి చేయ పరిణమించు మనిషే దైవంగా

మంచిని ఆచరించ మనలను రక్షించు 

నిశ్చయంగా


2.సద్భావం సచ్ఛీలం సత్వర్తన సంప్రాప్తం సాధనతో 

సహృయత మృదుభాషణ నగవులు నగలుగా నడవడితో

మంచివి చూస్తూ మంచివే వింటూమంచిగా జీవించగ ఆనందంతో

మంచి ప్రపంచం నిర్మించగలం మనుషులమంతా విశ్వాసంతో

Friday, June 24, 2022

https://youtu.be/UrhhaVQ2S9w

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్


రాగం:కాంభోజి


ఆలిమాట కెదురుచెప్పు మగడేడి జగాన

శ్రీమతి గీత దాటు పతియేడి ప్రపంచాన

హృదయపీఠాన నిన్ను పట్టమహిషి చేసాడే

వైకుంఠానికె నిను మహరాణిని చేసాడే

నీఆజ్ఞ మీరునా శ్రీపతీ… వేంకటాచలపతీ

నీ మాట జవదాటునా మాయమ్మ అలమేలు మంగా ప్రణతి


1.తల్లిచాటు పిల్లలం తండ్రి ఎడల భయభక్తులం

అమ్మా నీ కొంగు చాటుచేసుకొని అంగలార్చెదం

విసుగులేని సమయాన తనకు(నాన్నకు)విన్నవించవే

చిన్నచిన్న మురిపాలను తీర్చగ ఒప్పించవే

నీఆజ్ఞ మీరునా శ్రీపతీ… వేంకటాచలపతీ

నీ మాట జవదాటునా మాయమ్మ అలమేలు మంగా ప్రణతి


2.తీరిక చేసుకొని  పట్టించుకొన మనవే

అక్కున జేర్చుకొని ఆలన చూడ మనవే

చక్కెర పొంగలి పెట్టి వినిపించు మా మనవే

పుక్కిట కప్పుర విడియమెట్టి వినమనవే

నీఆజ్ఞ మీరునా శ్రీపతీ… వేంకటాచలపతీ

నీ మాట జవదాటునా మాయమ్మ అలమేలు మంగా ప్రణతి

 

https://youtu.be/C3jHexA82ag?si=CSaAf9NP9nnChtgy

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎత్తుకెళ్ళావే నా ఎదనెప్పుడో

చిత్తుచేసావే మదినెన్నడో

పిచ్చోణ్ణి చేసావె రెచ్చగొట్టి

ఎర్రోణ్ణి చేసావె సోకు విందెట్టి

బ్రతికేదెలా ఇక చచ్చేదెలా

పట్టేదెలా మరి వదిలేదెలా

నా పంచ ప్రాణాల నుగ్గబట్టి


1.మరచిపోయే వేళలో కెలికి వెళతావు

కలిసి నడిచేదారిలో కలికీ జారుకుంటావు

తలచేదెలా మరి వగచేదెలా

మెరుపంటి నిన్ను వలచేదెలా

తలపోయకే నా వెతని సోదిలా


2.చెప్పలేను నాపై ప్రేమలేదని

ఒప్పుకోనూ నేనే నీకు ముఖ్యమని

 చొరవ నాదే చెలీ గర్జ్ నాదే

తపన నాకే నీఎడ ఫర్జ్ నాదే

ఔనన్న కాదన్న నిజమెప్పుడూ చేదే

Thursday, June 23, 2022

https://youtu.be/ru1fX7LBMu8?si=ybXPuVlZYrcZaRlH

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:భాగీశ్వరి

నిను మోహించితి నిను దేహించితి
అహరహము నీకై తహతహ లాడితి
అహము దహించితి దేహము దాచితి
విరహము మించగ నిను తలపోసితి
రాధాలోలా రాస విహారా నాకీయరా శరణాగతి

1.సందేహించక నన్నావహించు
నా వాసనలిక సంగ్రహించు
అద్వైతమను తరహా సంగమించు
త్వమేవ మమనాథమ్ అనుగ్రహించు
మాధవా మహానుభావా నాతో రమించు

2.శిరసావహించితి నీపదధూళి
నువు లేక మనలేను శిఖిపింఛమౌళి
మ్రోగించి మురిపించు అనురాగ మురళీ
సాగించు నాతో రసరమ్య రతికేళి
నీలో లయమవగ హరీ నా మనసే నివాళి


Wednesday, June 22, 2022

 

https://youtu.be/oSv7SoSKyck?si=Xm4bbCPW-tDliFT9

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


కవన తెరల చాటున వలపు దాచుకున్నా

మనసు పొరల మాటునా మమత పెంచుకున్నా

కక్కలేక మ్రింగ లేకా సతమత మవుతున్నా 

గుడ్లు మిటకరిస్తూనే రోజులు గడిపేస్తున్నా

చెలీ పొంగుతోంది గుండెలో గోదావరి

ప్రేయసీ రగులుతోంది రావణకాష్ఠం మతిగా మారి


1.విషయమేది రాసినా ఆవు వ్యాసమౌతోంది

ఏ దారికి మారినా నీతావుకు చేర్చుతోంది

సమాసాలన్ని కలిసి నీ ప్రేమస్వామ్యమౌతోంది

ఊహ ఊటగా ఊరి బ్రతుకు రమ్యమౌతోంది

చెలీ పొంగుతోంది గుండెలో గోదావరి

ప్రేయసీ రగులుతోంది రావణకాష్ఠం మతిగా మారి


2.భావమేది పలికినా కళ్యాణ సంబంధమాయే

రాగమేది పాడినా కళ్యాణి అనుబంధమాయే

నీ తలపు తట్టగానే తనువే మయూరమాయే

మనువు సాధ్యమయ్యే దాకా జగమంతా మాయే

చెలీ పొంగుతోంది గుండెలో గోదావరి

ప్రేయసీ రగులుతోంది రావణకాష్ఠం మతిగా మారి

https://youtu.be/cZyEDL9_aos

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ పేరులోనే  ఏదో  ప్రకంపనం

నీ రూపులోనూ యమ ఆకర్షణం

నెరవేరునా నా కల ఏ జన్మలోనైనా నీతో నా సహజీవనం

నీవే నీవే నీవే నీవే నీవేలేనా ప్రియభావనం

మంజులా మంజులా నీ ప్రేమరాజ్యానికి నే రారాజులా

మంజులా మంజులా నేనుంటా నీ సిగలో వాడని విరజాజిలా


1.మంజులమంటే కోమలం

మంజులమంటే పరిమళం

మంజులమంటే మనసుకు మత్తుని గొలిపే రసనము

మంజులమంటే ప్రణయము

మంజులమంటే పరిణయం

మంజులమంటే నందనవనిలా తలపించే జీవనం

నాకై నేనే రాసుకున్న నిఘంటువులో

ప్రతి పదము ప్రతి పదార్థం మంజులమే


2.మంజులమంటే దేవళం

మంజులమంటే దైవము

మంజులమంటే ఆరాధించే నివేదించే విధానము

మంజులమంటే హృదయము

మంజులమంటే ప్రాణము

మంజులమంటే కాలము లోకము సకల విశ్వము

మంజులమంటే నాకై నాచే కల్పిత

కవిత్వము

 

https://youtu.be/LZhKaakiOZI?si=Jv0q34r5yf6l7Gkg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లతలా అల్లుకపోయింది నీ స్నేహయోగం 

కవితలా అంకురించింది నీపై అనురాగం 

నీ వన్నెచిన్నెలకు మనసే మురిసింది

వలపుల వలనే ఒడుపుగా మది విసిరింది

హృదయ సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టింది

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చేసింది


1.ఇంద్రధనువు కనుబొమలు

చూపులు విరి తూపులు

ఊరించే బూరెల్లాంటి బుగ్గలు

కన్నాను నాసికగా సంపంగి మొగ్గను

తుమ్మెదలను ఆకర్షించే మధుర అధరాలు

నను మైమరిపింప జేసే మదిర దరహాసాలు

హృదయ సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టాయి

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చివేసాయి


2.పైటదాపు దాటు వెన్నెలవెన్నగిన్నెలు 

చాటులేని నడుమున ఇసుక తిన్నెలు 

చాటుతున్నవి వాటి వాటి పాటవాలు

నాభిమాత్రం ఒంటిగానే చేసేనే సవాలు

అరటిబోదెలైనాయి నీ ఊరువులు

తమలపాకులనిపించే లేలేత పాదాలు

హృదయ సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టాయి

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చివేసాయి

Monday, June 20, 2022

 

https://youtu.be/GtA0YZayug4?si=oediKDWMHtyhmSud

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అదిగో పులియన ఇదిగో తోకయనక యువత

రాజకీయచదరంగం జిత్తులనెదిరించగ  మీ విజ్ఞత

కీలుబొమ్మలై తోలుబొమ్మలై కొమ్మకాయక

మనకంటూ ఉంటుందిగా నిటారుగా వెన్నెముక


1.రెచ్చగొట్టు వాదాలకు గొడుగు పట్టక

చిచ్చుపెట్టు చర్యలకు నడుం బిగించక

ప్రగతిశీల దారులలో పయనించే దిశగా

విచక్షణతొ ప్రవర్తించి ముందడుగేయగా


2.వ్యక్తిత్వం కుటుంబం  జాతి నిర్మాణం లక్ష్యంకాగా

సఛ్ఛీలం సద్వర్తన సదాశయం సర్వదా ముఖ్యంగా

ఓటును వాడాలి పదునైన ఆయుధంగా

అండగ నిలవాలి మన జెండా కొరకై అనవరతంగా

Sunday, June 19, 2022

 

https://youtu.be/yO8WFbuDp9M

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


ఎంతకూ తీరకుంది నా దాహం గంగాధరా

ఏమిటో ఆరకుంది నా మోహం చంద్రశేఖరా

నా గళముకు నిగళమేల గరళకంధరా

నా కలముకు తపనలేల శూలధరా

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ


1.వారాశిగా భావాలనే తలపోసితి

రాశిగా నే కవితలెన్నో వ్రాసి పోసితి

చిత్తశుద్ధిగా శివా నీ పూజనే చేసితి

ఆత్మతృప్తి లేకనే భవా అల్లలాడితి

మెప్పించలేకపాయే నా కావ్యాలు సాహిత్య కారులను

కదిలించ లేకపాయె నా గేయాలు సామాన్య శ్రోతలను

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మార్ధవాన్ని గాత్రంలో కూర్చవైతివి

సంగీతాన్ని శాస్త్రంగా  నేర్పవైతివి

ఊటలాగ కఫమెంతో ఊరజేస్తివి

కంఠనాళాలనే కపర్దీ కరకుజేస్తివి

గొంతు జీరబోవునాయే ఎలుగెత్తి పాడితే

తాళమెచటొ తప్పునాయే ఊపుగా ఊగితే

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక వెర్రిబాగులోడే నాన్న

స్వార్థపరుడెవరున్నారు తనకన్నా

తన కోర్కెలకోసమే నిను కన్నా

విలనే తానై తన కలల హీరోగా నిను కన్నా

చేతకాని వాడనిపించుకున్న

ఈతరాని వాడని ముద్రవేయించుకున్న

ఒక వెర్రిబాగులోడే నాన్న

స్వార్థపరుడెవరున్నారు తనకన్నా


1.తెప్పలు తగలేసే తనయులకై

తీరం చేరవేసే సరంగుతానై

గడ్డాలనాడొక తెడ్డుజూపు కొడుకులకై

అడ్డాలు పడకుండా అరచేతులుంచినందులకై

ఈసడించబడుతున్న

విలువను కోల్పోతున్న


2.బాధ్యతలెరుగని బద్మాషులున్నా

హక్కులు మిక్కిలిగా గుంజుకున్నా

తండ్రిగ చెప్పుకొన్న తలవంపులనుకున్నా

ఎదురుగ కనిపించినా మొకం తిప్పుకున్నా

ఎదను సమాధాన పర్చుకునే

మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే

https://youtu.be/vODJlb-SJHw?si=e5K8-GjUNMVAG4r1

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:దర్బార్ కానడ

నాదను కొంటేనే కలవరం
కాదనుకొంటే మనం ఎవరికి ఎవరం
ఇంతకన్న ఎలా తెలుపను నా ఎద వివరం
అలజడి రేగింది నీవల్లే నా ప్రశాంత మానస సరోవరం

1.నీ తలపులతో ఔతుంది నా మది చిత్తడి
నీ ఊహలకే దూకుతుంది భావావేశం మత్తడి
నీదేలే నా హృదయం మేలిమి పుత్తడి
చేదేలే నువు కాదంటే ఆరదు నా కంటతడి

2.ఎప్పుడు ముడివడిందో మనకీ చిక్కుముడి
ఇచ్చేసా ఏనాడో నీకు నిలువుదోపిడి
ఓపలేను ఆపలేను గుండెలోనీ రాపిడి
త్రెంచుకోకు చంపమాకు మనబంధం పొరబడి


Friday, June 17, 2022

 

https://youtu.be/pKJlwsQ48NE?si=o2GOZBW9dr6f57BA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరవై స్తంభాల ఆలయమంటే నీదే వేంకటేశ్వరా

మా ధర్మపురిలో నిలువెత్తు విగ్రమున్నది నీకే శ్రీనివాసుడా

ఆగ్రహమే ఎరుగవు నీవు అనుగ్రహం మినహా

చిద్విలాస మూర్తిగ వెలిసావు ఎదన సిరితో సహా

ప్రణామాలు నీకివే వాంఛితార్థదాయకా

ప్రమోదాలు నీవల్లే రమా నాయకా


1.గోదావరి జలములతో నిత్యాభిషేకాలు

ప్రతి శుక్రవారము నీకు క్షీరాభిషేకాలు

పలు వన్నె చిన్నెల పట్టు వస్త్రా లంకారాలు

భక్తవరుల మనోభీష్టాలైనవి నీ ఆభరణాలు

తులసిదళాలతో పలువిధ విరులతో అల్లిన మాలలు

కళ్ళు రెండుచాలవు కనగ మదిన ఆనంద హేలలు


2.ఏటేటా జరిగేను బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు

కనుల పండుగ చేసేను కోనేటి తెప్పోత్సవాలు డోలోత్సవాలూ 

శివ నరసింహులతో బాటు రథోత్సవాలు

ఆర్జిత సేవలు అర్చనలు భోగాలు

నీకు అంగరంగ వైభోగాలు

కళ్ళు రెండుచాలవు కనగ మదిన ఆనంద హేలలు

Wednesday, June 15, 2022

 

https://youtu.be/1JqUsQY0VCE?si=CiH2vvCjXX6xWijN

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

తరించిపోయింది నీ పాదాలు కడిగిన కడలి
పరవశించిపోయింది నీపై వెన్నెల కురిసిన పున్నమి జాబిలి
వయ్యార మొలికింది  నీ మేను తాకిన చిరుగాలి
అపురూపమైన నా నెచ్చెలి 
నీవు నాదానివన్న ఊహకే మనసు ఎగిరిపోతోంది దూదిపింజలా తేలితేలి

1.తహతహలాడుతుంది గులాబీ
నీ జడలో తానొదిగి గుర్తింపు పొందాలని
తపనేపడుతుంది పచ్చలహారం
నీ ఎదపై  చేరగ హెచ్చరిల్లు తన అందాలని
తానేం తక్కువతింది కోక నిను చుట్టుకోక 
తన బ్రతుకే వృధా కనుక నీకే చెందాలని
తన్మయమొందుతోంది మనసు అనుక్షణం
తలపోస్తూ నీతో పొందు ఆనందాలని

2.గోదారి గట్టున ఉన్న ఇసుకతిన్నెలన్ని 
వేచిచూస్తుంటాయి మన కబుర్లకోసమని
రాదారి పక్కనున్న తురాయిపూవులన్ని 
దారి కాస్తుంటాయి  మనపై కురుద్దామని
పావురాలు బ్రతిమాలుతాయి 
ప్రేమరాయబారాలు   తాము నెరపు తామని
ఎరిగితివా ప్రియా గొప్పకవుల కలాలు సైతం 
మన ప్రణయం కావ్యాలుగా రాయ గోరాయని


https://youtu.be/IS5ck9vmWdc?si=bXPsc27mf7R5edtw

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : శివరంజని

సౌందర్య నిధినీవే-నా జీవన కౌముదివే
నిశీధులన్ని నీవల్లే ప్రకాశించినాయి
మధురానుభూతులెన్నో సంప్రాప్తమైనాయి
కొనసాగింతునే…నా ప్రేమ ఏడు జన్మలదాకా
క్షణమైనా మనలేనే చెలీ నీతోడు లేక

1.నిర్జన ఎడారులే  నిన్నటి నా బ్రతుకంతా
బ్రహ్మజెముళ్ళే నే నడిచిన దారంతా
అలమటించి పోయాను ప్రేమరాహిత్యంతో
పరితపించిపోయాను నే తీరని దాహంతో
శ్రావణ మేఘమై అనురాగం కురిసావే
శరత్తు చంద్రికవై ఆహ్లాదం పంచావే

2.నిండైన జాబిలికి చెట్టుమచ్చనే అందం
 నీ నగు మోముకు మోవి పుట్టుమచ్చ అందం
అందాలన్ని ఒక్కదిక్కే కుప్పబోస్తె నీ చందం
కనుగిలుపక నిన్ను చూస్తే అంతులేని ఆనందం
రాయంచలు వయార మొలుకు నీ కులుకులు నేర్వంగా
రాచిలుకలు పలికి తేనె చిలుకు నీవే గురువని గర్వంగా


Tuesday, June 14, 2022

 రచన,స్వరకల్పన &గానం:డా.రాఖీ


వ్యర్థపు వ్యక్తులకు జన్మెందుకిస్తావో

ప్రయోజనం లేని మనుజుల ఎందుకు పుట్టిస్తావో

అర్థంపర్థమేమైనా ఉందా స్వామీ నీచర్యలకు

పైశాచికానందమేనాప్రభూ నీ వికృత క్రతువులకు

దేవుడంటె దేవుడిలా ప్రవర్తించు స్వామి

నిను నమ్మివారి బాధ్యత నిర్వర్తించవేమి


1.భరించగరాని బాధలు తగిలింతువేల

కనీవినీ ఎరుగనట్టి కఠినరీతి శిక్షింతువేల

తప్పుచేయడం మాకు సరదానా ఏమి 

వక్రబుద్ది పుట్టేల ప్రేరేపింతువెందుకు స్వామి

దోషాలు ద్రోహాలు నీవు చేసుకుంటూ

తగినశాస్తి చేసానంటూ నీవే నవ్వుకుంటూ


2.కారణం మేమే ఐతే ఏకంగా మరణశిక్ష వెయ్యి

ముందువెనక చూసుడెందుకు ఇపుడే చంపెయ్యి

చావుకైతె వెఱించిందిలేదు బ్రతికిందే ఇక చాలు

దైన్యంగా నూరేళ్ళకంటే అనాయాస మృతి మేలు

కోరింది ఏదీ తీర్చన దాఖలాయే లేదు

మరిమరి కోరను స్వామి ఆఖరిదిది తీర్చేద్దూ

Monday, June 13, 2022

 

https://youtu.be/wv64meWEL20?si=MeZteI011xYDBQko

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భవతారకం నీ నామం నమఃశివాయ

పరమ ఔషధం నీ తీర్థం నమఃశివాయ

సులభ సాధ్యం నీ అర్చనం నమఃశివాయ

కైవల్య సాధనం నీ ధ్యానం నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ


1.శుభ సూచకం నీ దర్శనం నమఃశివాయ

అఘనాశనం నీ స్పర్శనం నమఃశివాయ

అంజలి సలిలం నీ అభిషేచనం

నమఃశివాయ

పత్రి దళం నీకు ప్రియ సమర్పణం

నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ


2.సుస్వర ధారణం నీ పదసేవనం నమఃశివాయం

నశ్వర భావనం నువు వినా జీవనం

నమఃశివాయ

పంచాక్షరీ మంత్రం పరమ పవిత్రం

నమఃశివాయ

అక్షరమగు అక్షరాలు లక్ష్యము నెరవేర్చనీ మోక్షమునీయనీ నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ

 https://youtu.be/0ql5t1PfIt4


కడిగిన ముత్యము నీ రూపం

స్వచ్ఛని స్ఫటికము నీ అందం

విరిసిన పుష్పము నీ దరహాసం

అనురాగ రంజితం నీమానసం

నవమోహిని నీ దర్శనం ఉత్తేజ జనితం

ప్రియభామిని నీ స్పర్శతొ అమరత్వ భావనం


1.సుప్రభాత శుభవేళ ఇల్లూ వాకిలి తీర్చిదిద్ది

ముంగిట ముగ్గేసి గడపకు పసుపు రాసి కుంకుమనద్ది

అభ్యంగనమొనరించి కురులారగ నెట్టెము జుట్టి

తులసి కోట చుట్టు దిరిగి తులసిని అర్చించగ

నవమోహిని నీ దర్శనం ఉత్తేజ జనితం

ప్రియభామిని నీ స్పర్శతొ అమరత్వ భావనం


2.చేతిలొ పాలచెంబు కొప్పులొ మల్లెచెండు పరవశమొందించు

నల్లంచు తెల్లచీర నాభికనగ జార

మునివర్యులనైనా ముగ్గులోకి దించు

ముద్దు ముచ్చట్లతో వింత కౌగిలింతలతో ఎదలానందించు

శృంగార తరంగాల అంగాలు అంగలార్చ కైవల్యమందించు

నవమోహిని నీ దర్శనం ఉత్తేజ జనితం

ప్రియభామిని నీ స్పర్శతొ అమరత్వ భావనం


Ok

Saturday, June 11, 2022


కానుకగా నీకీయనా నగిషీలు కలబోసిన పసిడి గాజులను

బహుమతినందీయనా మెరిసే రవ్వలు పొదిగిన హారాలని

అలంకరించనా మంజులమగు నీ పదాల స్వర్ణ మంజీరాలని

మణిమయ మకుటమే తలనుంచనా విశ్వైక సుందరి నీవేనని


1.జాంబవంతునితో పోరి కొనితేనా భామామణీ శమంతకమణిని

బొందితోనే అమరావతి చేరి ఎత్తుకరానా పారిజాత తరువుని

ఇంద్ర ధనుసునే దించి చీరగ అందించి

నందింప జేయనా డెందముని

అలకాపురినే నీపరం చేసి మురిపింపగజేయనా నీ మురిపెముని


2.కోహినూరు వజ్రమే నీవైతే మరొకటెలా సంపాదించను

తాజ్ మహల్ సౌందర్యం సరిరాదే

అద్భుత హర్మ్యమేది నిర్మించను

మానవ సాధ్యమేదైనా తులతూగదు

కానుకనీయగా నీ జన్మదినమును

నభూతోనభవిష్యతి నామతి నీకెపుడో ఇచ్చేసితిగా నా మనమును








https://youtu.be/k3pNwO7qGrE

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాకము నరకమని మరి లేవు నరునికి 

శోకము సౌఖ్యము ఏకమే నీ భక్త వరునికి

నిశ్చింతయు నీ చింతయు అపర స్వర్గ ధామము

ఆరాటము అసంతృప్తి అవనిలొ యమ లోకము

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


1.ఋణము తీర్చుకొనుటకే సతీ సుతుల బంధాలు

వడ్డీకి వడ్డీ వేసి గుంజుకొని నంజుకతిను చందాలు

దృష్టిని నీనుండి మరలించెడి మోహ గంధాలు

నీటి బుడగ నిలుచునంత సేపటి ఆనందాలు

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


2.వ్యాధులుగా బాధించును పూర్వజన్మ పాపాలు

వెంటాడి వేధించును ఏనాడో ఏ అర్భకులోఇచ్చిన శాపాలు

అశాంతి అలజడి వత్తిడి నిలువెల్లా దహించు తాపాలు

అడుసు త్రొక్కి జలము కోరునటుల ఈ పరితాపాలు

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


OK


https://youtu.be/uPE4fnmEPOc

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువు చెప్పిందేమిటి సాయి

మరి చేస్తున్నదేమిటి సాయి

నీ మాటకు చేతకు పొంతన ఐతే లేదోయి

కరుణను మాత్రం వర్షిస్తుంది నీకనుదోయి

సాయిబాబా షిరిడీ సాయిబాబా

ఎంతకాలం నీ గారడీ సాయిబాబా


1.షిరిడీలో అడుగిడితే రావంటివి ఆపదలు

నా సమాధి తాకినంత  తొలగునంటివి వేదనలు

తలువగనే పిలువగనే వచ్చెదవన్నవి అనృతాలు

నమ్మితె కోర్కెలు తీర్చెదవన్నవి కోతలే కోతలు


2.శరణన్నవారికి దక్కేదేముంది నేనే ఉదాహరణం

దిక్కునీవని మ్రొక్కేవారి భారం మోసావ ఏదీ తార్కాణం

ఆదుకున్నదీ చేదుకున్నదీ లేదన్నదే

నా ఆరోపణం

త్రికరణ శుద్ధిగ విశ్వసించాను చేయాలి నీవే నిజనిర్ధారణం

Wednesday, June 8, 2022

https://youtu.be/dig29bXPUJs


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిత్తకార్తి కుక్కకన్నా హీనం

గోతికాడి నక్కకన్నా నీచం

ఒక్కటైనా లేదు నీలో మనిషి లక్షణం

భువికి భారం నీఉనికిఘోరం  ఏ క్షణం


1.ఏకపత్నీ వ్రతుడు రాముని జన్మభూమి ఇది

చతుర్విధ పురుషార్థాలను ఆచరించే

పుణ్యస్థలమిది

నా దేశం ప్రపంచానికే ఆదర్శం

నా దేశం అంటేనే విశ్వసందేశం

సతి అనుమతి లేనిఎడల ధర్మరతియూ నేరమే

బలాత్కారం మానభంగం పరులపై అతి క్రూరమే


2.వావి వరుసలు జాలి కరుణలు  నీకడ మృగ్యమే

మానవీయ విలువలన్నవి ఎరుగనీ 

వికృత మృగమువే

నీవు చేసే భీభత్సం మెచ్చదే సమాజం

నీది ఎంతటి కుత్సితం మారదా నైజం

మాటు వేసి వేటాడే అకృత్యాలే దారుణం 

చట్టరీత్యా  తగినశాస్తిగ శిక్ష ఒకటే నీకు మరణం

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చీరకట్టులోనే ఉంది సుదతి సింగారం

చేలముతో ఇనుమడించు ఇందువదన సౌందర్యం

కనికట్టు చేస్తుంది భారతీయ వనిత కట్టుబొట్టు

కట్టిపడవేస్తుంది కాళ్ళకాడ మగవాడిని ఎరిగి ఆయువుపట్టు


1.చీరలు పలు కొలతలు వన్నెలు నగిషీలు అంచులు కొంగులు నాణ్యతలు

చేనేత పట్టు సిల్కు సింథటిక్కుల సారీలు పెక్కురీతులు

వివిధ సందర్భాలకు అమరి అలరెడు

తరుణుల ప్రియతములు

దాయాదుల విరోధానికి భాగవత విలాసానికి హేతువులు


2.ప్రాంతాలవారిగా సంతరించుకుంది 

చీర ప్రత్యేకత

కట్టుకొనుటలో ఆకట్టుకొనుటలో చీరలకుంది విశిష్టత

మరాఠీ గుజరాతీ మార్వాడీ మళయాళి తెలుగుది దేనికదే ఘనత

దాచిదాచక అందాలతొ కనువిందు చేయుటే చీర మార్మికత

Tuesday, June 7, 2022

 

https://youtu.be/kHAU-JGAuVE?si=xsbG0Utwk_7emlLg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కలానికి బలమిచ్చే విటమిన్ల టానిక్ నువ్వు 

నడుమన నను ముంచక ప్రేమతీరం చేర్చే టైటానిక్ నువ్వు

ఏడాది పాటూ నాలో పల్లవించే నవ వసంతం నువ్వు

నెలపొడుగునా పున్నమిలా వెన్నెల కురిసే జాబిలి నువ్వు


1.ఏ మూలో నీ హృదయంలో చోటిచ్చిన మైత్రివి నువ్వు

కవితను పొంగి పొరలింపజేసే వైచిత్రివి నువ్వు

నా జీవిత నాటకంలో ప్రముఖమైన పాత్రవి నువ్వు

ఎండకు వానకు తోడైనిలిచి ననుకాచే

ఛత్రము నువ్వు


2.నన్ను నేను దిద్దుకునేలా నా మదికి అద్దము నువ్వు

గెలుపు గిరుల నెక్కించే ఎత్తైన నిచ్చెన నువ్వు

నా నాలుక పైన ఆడే లల్లాయి పాటవు నువ్వు

నాకు వేడుక కలిగించే నృత్త నయన జంటవు నువ్వు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏదనేదో వెలితిగా

మనసంతా నలతగా

పాట రాయని ప్రతిపూట

కలం కదలక అలసట


1.నవ్యత నందించేలా

రమ్యత సాధించేలా

ధన్యతను పొందేలా

భావమొకటి రాదేలా


2.వస్తువుల జబర్దస్తీ

పద సంపద నా ఆస్తి

గేయానికి హాయితొ దోస్తీ

కృషితో దుర్భిక్షం నాస్తి

Monday, June 6, 2022


https://youtu.be/n4Boj7U0fLA

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అప్పగింతలంటే కళ్ళప్పగింతలే

సాగనంపుడంటే కన్నుల చెమరింతలే

నోముల పంటగా కన్న కూతురిని-పెళ్ళికూతురిని

అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారిని

ఆఖరి ఘట్టానికి వచ్చిందిక కళ్యాణం

ఒక అయ్యచేతిలో బొట్టిని పెట్టే తరుణం

మారుతుంది తానిక అత్తింటి తోరణం

తీరేనా ఎప్పటికీ పుట్టింటితో రుణం


1.పుట్టింది మొదలుగా ఇంటికి మహలక్ష్మి

ఇంటిల్లిపాదిని ఏలే ఏకైక యువరాణి

ఆజ్ఞలు వేస్తుంటే పాటించుటే పరిపాటి

నవ్వులు రువ్వుతుంటే మెరుపు వెలుగులేపాటి

మారుతుంది తానిక అత్తింటి తోరణం

తీరేనా ఎప్పటికీ పుట్టింటితో రుణం


2.ఆడింది ఆటగా పాడింది పాటగా

తనమాటే వేదవాక్కు

అమ్మానాన్నలకు ఆరిందానిలా తానే పెద్ద దిక్కు

బంగరు తల్లిగా బుంగమూతి పట్టడం తన జన్మహక్కు

మంచి కోడలనే మాట మా గారాల పట్టికి ఎలాగూ చిక్కు

మారుతుంది తానిక అత్తింటి తోరణం

తీరేనా ఎప్పటికీ పుట్టింటితో రుణం

 

https://youtu.be/qDxPaJnN2hI?si=nielkdQUjIzQeiMv

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈ మేను లేకపోతె మాత్రమేమి సాంబ శివా

నేనుగా నీలో అజరామరమై మనలేనా సదాశివా

ఉన్నంత వరకు దేహమున్నంతవరకు చేయనీ నీ సేవ

నిను చేరెడి తోవలోనె నను నడిపించరా మహాదేవా


1.రేపు మాపని మా పని ఆపని వేలుపు నీవని

నమ్మి నాను నెమ్మనమున నమో పినాకపాణి

దారాసుత బంధాల నుండి విముక్తి చేయరా కపర్దీ

ఈదలేను చేదుకో  భవ జలధిని కళానిధీ


2.లింగాకారా గంగాధరా త్రయంబకా ప్రభో మృత్యుంజయా

నర్తించరా నటరాజా నా నాలుకపై నమో నమఃశివాయ

పరమేశ్వరపరమై వరలెడు జన్మ నీవొసగెడి వరమయా

 శివమేకమై శివైక్యమై శివోహమై మననీ నను దయామయా

Friday, June 3, 2022


https://youtu.be/cFWKpK4sKJU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సంకటాలెన్ని స్వామి చిన్ని అంకురానికి

బాలారిష్టాలే బాలాజీ ప్రతి బీజానికి

ఒడుదుడుకులు తట్టుకొని చెట్టుగ గట్టెక్కుటెంత కష్టము 

మనిషి లక్ష్యమే వృక్షపుగతియైతే జన్మధన్యమగుట తథ్యము

తిరుమలేశ నీ రచనా కౌశలాన సృష్టి సమస్తం కడు విచిత్రము


1.క్రిములు తొలిచి ఒళ్ళు గుల్ల చేసే ప్రమాదము

సారవంతమైన నేలన లోతున నాటితేనే పటుత్వము

తగినంతగ జలమందగ మొలకెత్తును జీవిగ విత్తనము

మొక్కగ ఎదుగుతూ మానుగ మనుదారిలొ ఎందరిదో పెత్తనము

మనిషి లక్ష్యమే వృక్షపుగతియైతే జన్మధన్యమగుట తథ్యము

తిరుమలేశ నీ రచనా కౌశలాన సృష్టి సమస్తం కడు విచిత్రము


2.కంచె ఒకటి పశువుల నోటికందకుండ కుజమును కాయాలి

చీడ పీడలన్నిటిని విధిగా ఎదుర్కొని 

పూలు కాయలు ఫలాలు కాయాలి

తరువు తనువులొ అణువణువు పరుల కొరకె దారపోయాలి

తన కొమ్మలొ భాగమే కామాగా మారి

నరికే గొడ్డిలి  కొమ్ముకాయాలి

మనిషి లక్ష్యమే వృక్షపుగతియైతే జన్మధన్యమగుట తథ్యము

తిరుమలేశ నీ రచనా కౌశలాన సృష్టి సమస్తం కడు విచిత్రము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎలా తెలుసుకోను నేనంటే నీకు ప్రేమెంతో

ఎలా కొలువగలను నీమదిలో నా విలువెంతో

నీవెరుగనట్టుగా మారుదునా వేగులవాడిగా

నీచుట్టే సంచరించనా చేరినీ

ఊపిరిలో ఊపిరిగా


1.కవిత రాయు సమయాన

 కలం మొరాయించు వేళ

రాయించనా సూచించనా రాయంచనై

గుణదోషాలు నిర్ణయించనా నిస్పక్షపాతినై

నీ భావాల స్పష్టత నేనై

అనుభవాల ద్రష్టను నేనై


2.నీ మేనుకు మెరుగులు దిద్దగా

వలువలు వన్నెలకు నా శ్రద్ధనద్దగా

అందాలు చిందగా డెందమా నందమొందగా

నా వేడుక నీ వాడుకగా పరిణమించగా

నీలో నేను ప్రతిఫలించగా

స్వప్నాలే సతతం ఫలించగా

Wednesday, June 1, 2022

 

https://youtu.be/Vzv3gchRDuc?si=M5VwaeQBInxM_w_3

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రాణమున్న పాటను నేను

పరిమళాల విరి తోటను నేను

మానవత మనగలిన చోటును నేను

విజయానికి దారితీయు ప్రగతి బాటను నేను

పాటే ప్రతి పూట సాపాటై పరిపాటై నా నోట


1.పాటగ పరిణమించు ఎదన నాటిన సంఘటన

పాటగ ఉదయించు మదిని మీటిన 

పర్యటన

పాటను ఆలపించు హృదయంగమమై  పటిమ

పాటే ప్రతి పూట సాపాటై పరిపాటై నా నోట

పాటే నా తూట సమ్మెట తప్పెట చేట  తరగని ఊట ఎగసే బావుటా


2.పాట ప్రేమ ఆలంబన ఆరాధన

పాట విరహ వేదన విషాద నివేదన

పాట భావ ప్రకటన వాదన వంతెన 

పాట ఆత్మ శోధన పరయోగ సాధన

పాటే ప్రతి పూట సాపాటై పరిపాటై నా నోట

పాట నా పబ్బతి వినతి శరణాగతిగా నాకు బాసట


https://youtu.be/CFyVDbNqt-A

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టుకోలేవు వదిలిపోలేవు

నీవు నాప్రాణం నేను నీకు ప్రహసనం

దోబూచులాడేవు న్యాయమా

దొంగాట లాడేవు చెలీ ధర్మమా


1.ఆన్ లైన్లో లేంది చూసి పలకరిస్తావు

బ్లూ టిక్కులు లాస్ట్ సీన్ దాచేస్తావు

స్పందన లేదనను స్ఫూర్తివె కాదనను

యథాలాప మైత్రికే నే వ్యధ చెందేను


2.ఆచితూచి వ్యాఖ్యలను నాపై రాస్తావు

నీ కవితలు వెతలను కనుమరుగే చేస్తావు

నా మస్తకమే నీకెపుడు తెరిచిన పుస్తకం

నీ మనస్సంద్రమే అంతుచిక్కనీయని అగాథం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చక్కబెట్టుకోవాలి ఇంటిని దీపమున్నప్పుడే

చక్కదిద్దుకోవాలి బ్రతుకుని జీవించి ఉన్నప్పుడే

ప్రదర్శించితీరాలి ప్రతిభని అవకాశం వచ్చినప్పుడే

మేలుచేయగలగాలి జనులకి ఉన్నంతలో ఇప్పటికిప్పుడే

ఎపుడు ముంచకొచ్చునో మరణము

మించిపోనీకు మంచిదిదే తరుణము


1.ప్రభాతాన విరియకుంటె కమలము

ఆగాలి మరుసటి ఉదయానికి

వసంతాన కూయకుంటె వాసంతము

వేచిచూడాలి మరుఏటి ఆమనికి

గొంతువిప్పి రంజింజేయాలి మధుర గాత్రము వేదిక దొరికినప్పుడే

ప్రదర్శించితీరాలి ప్రతిభనిబ

అవకాశం వచ్చినప్పుడే

ఎపుడు ముంచకొచ్చునో మరణము

మించిపోనీకు మంచిదిదే తరుణము


2.తూర్పార పట్టాలి పంటను వాలుగా గాలి వీచినప్పుడే

వడియాలనెండ బెట్టాలి ఆరుబయట

మబ్బులు పట్టనప్పుడే

వాయిదా వేయకనే సాయపడాలి వెంటనే బుద్దిపుట్టినప్పుడే

మేలుచేయగలగాలి జనులకి నీకడ

ఉన్నంతలో ఇప్పటికిప్పుడే

ఎపుడు ముంచకొచ్చునో మరణము

మించిపోనీకు మంచిదిదే తరుణము

Tuesday, May 31, 2022

 

https://youtu.be/uLBkOUjW14s

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అనుభూతులు శూన్యము

ఆర్భాటమే ప్రాధాన్యము

ఎలా కాగలుగుతుంది కళ్యాణ క్రతువు ధన్యము

పరిణమే జీవితాన అపురూపము అపూర్వము అనన్యము


1పెండ్లికి ముందరే ప్రేమలు కలయిలు

వివాహపూర్వమే విరహాలు దాహాలు విహారాలు

తొలిచూపులు నులి సిగ్గులు విచిత్రమైన పదాలు

ముద్దులు ముచ్చట్లతో హద్దులెన్నొ దాటేసిన పెదాలు

మనసులో పదిలంగా పదిలపరచు కొనవలసిన మనువులు

షూటింగులు డేటింగులలో తడిసిముద్దవుతున్న తనువులు


2.సంస్కృతి సాంప్రదాయమన్నది మన్ను బుక్కిపోయింది

ఆచారం ఆనవాయితీల ఆచూకే లేక పోయింది

వేద మంత్రాలు దాంపత్యపు అర్థాలు

వింత తంతులయ్యాయి

జిలకర బెల్లాలు తాళి తలంబ్రాలు చిత్రాలకు ప్రహసనాలయ్యాయి

షడ్రసోపేత విస్తృత జాబితా భోజనాలు 

అడుగుడుగున అన్నాన్ని వృధా పరచు జనాలు


https://youtu.be/F4oFfOPAPC4

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తానేమో చంద్రమౌళి

ఆలేమో మహంకాళి

సంజెవేళ ఆనంద తాండవకేళి

మరుభూమే తనకిల వాహ్యాళి

భోలానాథుడు వాడు విశ్వనాథుడు వాడు

సాంబ శివుడు వాడూ సదా మనల కాపాడూ

ఓం నమః శివాయ ఓం నమఃశివాయ


1.పిల్లనిచ్చిన మామది తల తెంపినాడు

పార్వతికై పరితపించి వరించినాడు

మరులు రేపు మదనుడిని బూది చేసినాడు

తిక్కశంకరయ్య వాడు తింగరి లింగడు

సాంబ శివుడు వాడూ సదా మనల కాపాడూ

ఓం నమః శివాయ ఓం నమఃశివాయ


2.పసిబాలుడు ఉసిగొలుపగ బలిచేసినాడు

గజాసురుని శిరమునతికి సతికి ప్రియము కూర్చినాడు

లోకపరిక్రమయను పరీక్షతో గణాధిపత్య మిచ్చినాడు

అల్పసంతోషివాడు అభిషేక ప్రియుడు

సాంబ శివుడు వాడూ సదా మనల కాపాడూ

ఓం నమః శివాయ ఓం నమఃశివాయ

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:వలజి


సూర్యుడోస్తేనే శుభోదయమా

సుప్రభాతం మ్రోగితేనే శుభోదయమా

కొలనులో కమలం విరిసినా

తోటలో తుషారం కురిసినా

కానేకాదది శుభోదయం

కువకువకువ పక్షులే పలికినా

నవ కుసుమాలు మకరందం చిలికినా

ఐపోదది శుభోదయం

చెలి కను కనుమల కనుగొనినంత సిందూరం-శుభోదయం

అభ్యంగన మొనరించి నా పెదవులు చుంబించ కురుల రాల స్నిగ్దత-శుభోదయం


1.కళ్ళాపి చల్లేవేళ ఇల్లాలి గాజుల గలగల సవ్వడి రేగితె సుప్రభాతం

పనిలో తలమునకలై ఇల్లంతా కలయ దిరుగగా మంజుల లయల మంజీరాలు రవళిస్తే సుప్రభాతం

చెలి కను కనుమల కనుగొనినంత సిందూరం-శుభోదయం

అభ్యంగన మొనరించి నా పెదవులు చుంబించ కురుల రాల స్నిగ్దత-శుభోదయం


2.గోముగా ఎదపై వాలి ప్రేమగా సుద్దులు పలికి చెలి చక్కిలి గిలి సలిపితే సుప్రభాతం

తనని లేవకుండా బిగియార కావలిస్తూ ఆవలించగ పిడికిలితో జుత్తును పీకుతు అలినన్ను అదిలిస్తే

సుప్రభాతం

చెలి కను కనుమల కనుగొనినంత సిందూరం-శుభోదయం

అభ్యంగన మొనరించి నా పెదవులు చుంబించ కురుల రాల స్నిగ్దత-శుభోదయం

Sunday, May 29, 2022

https://youtu.be/-IQZRkTw-cA?si=Xo47gcaQy2L6ky_m

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాండు


సాయము నందీయుటలో ప్రథముడవీవు

కష్టముదీర్చుటలో కడుదిట్టవు 

పంచముఖీ హనుమంతుడా మా పంచప్రాణ సముడా

నీ పంచన చేరితిమి నిన్నే శరణుజొచ్చితిమి


1.సముద్రమే లంఘించి సీతమ్మను కనుగొని సంతసింపజేసావు రామయ్యను

అశోకవనమందు అంగుళీయకమును నిచ్చి ఆనందింప జేసావు సీతమ్మను

సుఖశాంతులు వెల్లివిరియు ఫ్రభో నీకృపతో

మనోవ్యధలు తొలిగేను స్వామీ నీదయతో


2.సౌమిత్రి నేలకొరుగ సంజీవిని గొనితెచ్చి ప్రాణ దాతవైనావు సంజీవరాయా

యయాతి నిను శరణుకోర రామునికే ఎదురునిలిచి అభయదాతవైనావు శ్రీ ఆంజనేయా

ఆయువు ఆరోగ్యము సమకూరును నీ వరమున

ఏ భయములు దరిజేరవు నిను తలచగ మనమున

Saturday, May 28, 2022

 

https://youtu.be/sWLOZWtOqYE?si=OL71KGvrA72UchdV

పులకరింపచేస్తుంది -ముద్దాడి నేలను

చూసి ఎద మురుస్తుంది - కురిసేటి వానను

పరవశింపజేస్తుంది కడలి- కౌగిలించి నదిని

తలచి మనసు కోరుతనకై- తపించే ఒక మదిని


1.మండుతున్న నా గుండెకు

 నవనీతం చెలి కావాలి

నాకూరట కలిగించాలి

నవ్వుతు నా ఒడిలో వాలి


నేనెడారిలో బాటసారిని

నా దాహమంత తీరాలి

అనురాగ వాహినితానై

చెలి నన్నుచేరాలి


2.నా చీకటి నిశీధిలోనా

చెలి వెన్నెల విరబూయాలి

నా ఒంటరి బ్రతుకులోనా

చెలి మంజుల రవమవ్వాలి


దారితెన్ను లేనినన్ను

రాదారికి మరలించాలి

శూన్యమైన నా భవితకు

చెలి రమ్యత చేకూర్చాలి

Friday, May 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆవులు కోడెలు కొట్లాడినంత

లేగలు గాయాల పాలౌటే చింత

రాజకీయ వ్యూహాలు పన్నినంత

ప్రజలే ప్రతిసారీ బలియౌట వింత


కళ్ళుతెరిచి చూడరో పౌరులారా

కుళ్ళు నెరుగగ మేల్కొనరో సోమరులారా


1.బురద చల్లుకోవడం కండువాలు మారిపోవడం షరా మామూలే

బూతులతో తూలనాడడం ఆపై చేతులు కలుపబూనడం రివాజే

నోళ్ళువెళ్ళబెట్డడం ఆత్మను జోకొట్టడం కార్యకర్తలకలవాటే

పార్టీలే రోజొకటైతే సిద్దాంతం నీటిమూటే

జేజేలూ ఛీఛీలు నినాదాలూ గాడిద పాటే


2.ఆవులను కాచినవాడే అర్జునుడు భారతాన

పదవులనెఱజూపినోడే నాయకుడు

నేటి జమానా

వాగ్ధామేదైనా సరె మసిబూసి మారెడు చేయాలి

కానుకనో నగదో ఇచ్చి ఓటర్లను మభ్య పెట్టాలి

కులం మతం జాతి ప్రాతం ఔతున్నాయి ఓట్లకు ఊతం

https://youtu.be/Pi-a4AiLr40?si=rE8S0-vge1NdZ4ఎ

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:హిందోళం

నేడు పావన శనివారం ప్రభో వేంకట రమణా
మేము నీవారం నీకై ఆశపడే వారం  స్వామీ కరుణా భరణా
మా వేదన నార్చేవాడివని-మా వేడ్కలు తీర్చే ఘనుడవని
నమ్మి వేచియున్నాము ఈ దశాబ్దం
నిను చూడబోతేనేమొ నీరవమౌ నిశ్శబ్దం

గోవింద గోవింద గోవింద గోవింద-గోడునాలించరా
గోవింద గోవింద గోవింద గోవింద-కేళి చాలించరా

1.ఉలకవు పలకవు బండరాయికి మల్లె
కదలవు మెదలవు తండ్రీ నీకె చెల్లె
నిదురబోతె మానే పాడగవచ్చు నిను లేపగ సుప్రభాతాలు
నిదుర నటిస్తే మేల్కొలుపగ మా తరమా-వ్యర్థ ప్రయత్నాలు

గోవింద గోవింద గోవింద గోవింద-గోడునాలించరా
గోవింద గోవింద గోవింద గోవింద-కేళి చాలించరా

2.నటనలొ నువు దిట్టవే నటన సూత్రధారీ 
పాత్రలమే నీప్రేమ పాత్రులమే ఘటనాఘటన చక్రవర్తీ
బురుదలొ తోసింది నీవె నీళ్ళకొరకు మేము  మ్రొక్కాలా
మాయల లోయలొ పడవేసింది నీవే-ఏడు కొండ లెక్కాలా

గోవింద గోవింద గోవింద గోవింద-గోడునాలించరా
గోవింద గోవింద గోవింద గోవింద-కేళి చాలించరా



https://youtu.be/8H0TFGlN2jk

చూపు తిప్ప నీయవేమె నీ సోయగాలు సూదంటురాళ్ళు

రెప్పవేయ కుంటెనేమొ  చెలమెలా ఊరెనె

కళ్ళలో నీళ్ళు

మసకబారి పోయాయి నా కనుగిలుపక నా చూపులు

ఐనా సరె గ్రోలెద నీ అపురూప అందాలు పొద్దు మాపులు 


కళ్ళలోనే చెలీ నే కాపురముందునే 

నీ కనుపాపల ఊయల లూగెదనే

కాటుకగా మారి నీ కనులను అలరించెదనే

కన్నీరు చిప్పిలకుండా సంతసాలముంచెదనే

నే కూరుక పోయానే నీ నయన ఊబిలో

తేరుకోలేకున్నానే  పొడగాంచి నీ మత్తులో


చూపు తిప్ప నీయవేమె నీ సోయగాలు సూదంటురాళ్ళు

రెప్పవేయ కుంటెనేమొ  చెలమెలా ఊరెనె

కళ్ళలో నీళ్ళు

మసకబారి పోయాయి నా కనుగిలుపక నా చూపులు

ఐనా సరె గ్రోలెద నీ అపురూప అందాలు పొద్దు మాపులు


ముంగురులు ముందుకుదూకి నిమిరేను నీ నునుపు చెంపనే

చెంపలే పొంగుక వచ్చి గిల్లమనేలా నాకు ఎంతో ముద్దొచ్చెనే

ముద్దుపెట్టకోమంటూ ఊరించే పెదాలే ముంచెనా కొంపనే

కొంపంటుకొంటుందేమో అంటించినావే నా విరహ కుంపటే

చంపడం నీకెంతో తేలికే ఊపిరాడకుండ జేసీ


చూపు తిప్ప నీయవేమె నీ సోయగాలు సూదంటురాళ్ళు

రెప్పవేయ కుంటెనేమొ  చెలమెలా ఊరెనె

కళ్ళలో నీళ్ళు

మసకబారి పోయాయి నా కనుగిలుపక నా చూపులు

ఐనా సరె గ్రోలెద నీ అపురూప అందాలు పొద్దు మాపులు


బ్రతికించడం సులభమే నీ నవ్వుల సుధలే కురిసీ

Thursday, May 26, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అర్హత మించి అడ్డదారులలో ఫలితం పొందినా

తగు మూల్యంకన్నా మాయచేసి ఎక్కువ గుంజినా

అహంకార మినుమడించ దర్జా దర్పం ప్రదర్శించినా

పక్షపాత బుద్దితోటి తనవారికి లబ్దికూర్చి పైకినెట్టినా

మరోచోట ఎక్కడో చెల్లించక తప్పదు రెట్టింపు పరిహారం

చక్కదిద్ది తీరుతాడు పైవాడు లెక్కలు సరిచేసి మన వ్యవహారం


1.ఎదుటివారి బలహీనత సొమ్ము చేసుకున్నా

అవసరం ఆసరగా బెట్టుతొ మెట్టే దిగకున్నా

మంచితనం ముసుగులో వంచన చేయుచున్నా

మాటకారితనముతో తిమ్మిని బమ్మిగ నమ్మించుచున్నా

ఎక్కడో ఒకచోట చెల్లించక తప్పదు రెట్టింపు పరిహారం

చక్కదిద్ది తీరుతాడు పైవాడు లెక్కలు సరిచేసి మన వ్యవహారం


2.పదిమంది ఒక్కడినే పట్టుబట్టి గేలిచేసి పైశాచికా నందమొందినా

అబలలు బాలలు అసహాయులపై బలవంతులమని హాని చేసినా

ఉన్ననాడు విచ్చలవిడి ఖర్చులు విలాసాలకై వెచ్చించినా

పదవి అధికారపు అండలతొ విర్రవీగి ఘోర అరాచికాలొనరించినా

ఎప్పుడో ఒకనాడు చెల్లించక తప్పదు రెట్టింపు పరిహారం

చక్కదిద్ది తీరుతాడు పైవాడు లెక్కలు సరిచేసి మన వ్యవహారం

https://youtu.be/SQ1TVJ1qjLc


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


పోలిక నీకెందుకు సాయిబాబా

ఏలిక నీవె నాకు షిరిడీ బాబా

కాచాలిక  కరుణతొ నను కంచెవు నీవై

దాచాలిక నీ కడుపులొ ప్రపంచమె మనదై


1.నీవొక ఆధ్యాత్మికమైన ప్రవాహం

నాదేమో జిజ్ఞసతొ తీరని దాహం

అడుగడుగున అడ్డుగా నా అహం

దృష్టిని మరలింప జేస్తు ఇహ వ్యామోహం


2.రాముడవని శివుడవని నిన్నెంచను

నీవు నాకు దైవమని దూరాన్ని పెంచను

చేయిపట్టి దాటించే నేస్తమని గ్రహించాను

మనసు విప్పి స్పష్టంగా నీముందుంచాను

Wednesday, May 25, 2022

https://youtu.be/5DwaQB0I0rc

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:అమృత వర్షిణి

గానానికి పోస్తారు ప్రాణం 
గాయనీ గాయకులందరు
గానమే మానవరూపమెత్తితే
మాననీయ మానినీ శ్రియా అది నీవందురు
శ్రవణాలకు మకరందం నీ గాత్రం
నా మనసుకు నవనీతం నువు పాడే ప్రతి గీతం

1 .కోయిల శిలాసదృశమాయే నీ పాటకు
భ్రమరమే భ్రాంతినొందె నీ గళమొలికే తేనె తేటకు
అన్నపానాదులే నాకు నీ పాటలు పూట పూటకు
స్ఫూర్తికారకాలు ఉత్ప్రేరకాలు నా ప్రగతి బాటకు
శ్రవణాలకు మకరందం నీ గాత్రం
నా మనసుకు నవనీతం నువు పాడే ప్రతి గీతం

2.గంధర్వులు గురువుగా నిను స్వీకరించిరి
నారద తుంబురులు నీతో ఓటమి నంగీకరించిరి
సరస్వతి వారసత్వమే నీదని సురలు పురస్కరించిరి
సంగీతామృత సమాగమం నీవుగా నరులు కీర్తించిరి
శ్రవణాలకు మకరందం నీ గాత్రం
నా మనసుకు నవనీతం నువు పాడే ప్రతి గీతం


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మహనీయులు కారెవరూ మంచిమాట చెప్పినంత

ప్రవక్తలైపోరెవరూ సూక్తులు ప్రవచించినంత

ఉత్తములని పేరొందరు నీతులు వల్లించినంత

జాతినేతలైపోరు జనులను ఉసిగొలిపినంత


నమ్మిన సత్యాలను ఆచరించి చూపాలి

నిస్వార్థ త్యాగనిరతి నిరూపించ గలగాలి

వందనాలు వందనాలు మానవతావాదులకు

అభినందన చందనాలివే  స్ఫూర్తి దాతలకు


1.పూలు పూయనప్పుడు పొరక మాత్రమే పూల మొక్క

తావిలేక తానౌనా పేరు గలిగినంతనే గంధపు చెక్క

వలపులు పండువేళ నోరు పండనపుడదియా ఆకువక్క

చరిత లిఖిస్తుంది నడవడి ఒరవడి కూడిన లెక్కాపక్కా

వందనాలు వందనాలు పరోపకారులందరికీ

అభినందన చందనాలు ఉదాత్త వ్యక్తులందరికి


2.ఉనికిని కోల్పోయినా కురిసి తీరుతుంది శ్రావణ మేఘం

గుర్తింపే నోచక ఆకుచాటు కోయిల ఆలపించు కమ్మని రాగం

ఇసుమంత ఆశించక పారే జీవనది తీర్చుతుంది దాహం

ఘనులెందరొ జగమందున రవిచంద్రుల చందాన అహరహం

వందనాలు వందనాలు ఆ కారణ జన్ములకు

అభినందన చందనాలు అవతార పురుషులకు


OK

 

https://youtu.be/ih65zSZ8Pe0?si=1iddjP2Pu4Zr5VlT

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


పౌరుషానికే ప్రతీక నీవు వీరాంజనేయా

స్వామిభక్తికే మచ్చుతునకవు భక్తాంజనేయా

నిను నమ్మిన దాసులకు నిజమైన అండవు కొండగట్టు హనుమా

మా నయన హారతులివే మారుతిరాజా ప్రియమార గైకొనుమా


1.రవినే మ్రింగినావు ఇంద్రునితో పోరినావు వాయునందనుడా

అంజనాదేవి కేసరిల ప్రియ తనూభవుడవు

ఇంద్రియ జితుడా

సుగ్రీవ మిత్రుడవు జాంబవత పౌత్రుడవూ అంగద హితుడా

శ్రీ రామదూతవు నీవు సీతామాతకు ఆనందదాతవు

సుందరాత్ముడా


2.ఎరుకపరచు స్వామి ఏకాగ్రతా లబ్ది

ధ్యానమునందు

తెలియజేయవయ్య ప్రభూ తన్మయత్వ సిద్ధి

గానమునందు

నీ రామనామ భజనలో భక్తిభావ సుధలే ఎల్లెడలా చిందు

శ్రీరామనామ గానమెచట సాగినా స్వామీ నువు వేసెదవూ చిందు

Tuesday, May 24, 2022


https://youtu.be/Wfvrw25bV6o

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:షణ్ముఖ ప్రియ


మంగళహారతి గొనవే మంగళగౌరి

మంగళ  మొనరించవే మాహేశ్వరి

మాంగళ్యం  మెట్టెలు గాజులు 

పసుసు కుంకుమలౌ ఐదోతనం కావవే


1.పలు వన్నెల పూలతొ రోజూ నీ పూజ చేయుదును

నిండు ముత్తైదువగా  నిన్నే కొలిచెదను

నోములు వ్రతములు నేనాచరించెదను

త్రికరణ శుద్ధిగా తల్లీ నిను నమ్మెదను


2. నా పతి మతిలోనా నా స్మృతే మెదలనీ

శ్రీవారి పరపతి జగతిలో ఉన్నతమై ఎదగనీ

నా సంతాన మెపుడూ సంతసాల నందనీ

అనునిత్యము నాచేత అన్నదానం జరుగనీ

Monday, May 23, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిదుర లేమి కన్నులతో

కుదురు లేని యోచనతో

పదేపదే పలవరింపుగా

అదేపనిగ కలవరింపుగా

చెలీ చెలీ చెలీ నీవలపుల జడిలో

ప్రతిక్షణం నీ యాదిలో మనాదితో


1.ఊపిరైతె ఆగింది గుండె లయ తప్పింది

నీ ప్రేమలోని నియతే ప్రాణం నిలబెట్టింది

కంటికి నువుదూరమున్నా ఎదలోనె కాపురమున్నావు

మంటలూ రేపుతున్నావు మమతతో ఆర్పుతున్నావు

చెలీ చెలీ చెలీ నీవలపుల జడిలో

ప్రతిక్షణం నీ యాదిలో మనాదితో


2.యాతనెంత పడ్డదో అల దవ్వై కడలి

మదనపడునె కలువ కలువ  పున్నమి జాబిలి

నెర్రెలు బారానే బీడునై తొలకరి నింకనూ నోచక

అర్రులు సాచానే శిశిరమునై ఆమని నావంక ఏతెంచక

చెలీ చెలీ చెలీ నీవలపుల జడిలో

ప్రతిక్షణం నీ యాదిలో మనాదితో


OK


https://youtu.be/UdIRULJ7Mlg?si=1mI9Kbl2_gzK1కకు

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం : చక్రవాకం


నేస్తమా  నీ మధుర జ్ఞాపకం 

తీపి తలపులకే ప్రేరేపకం

ప్రియతమా నీ సంతకం

చిలిపి ఊహకే ఉత్ప్రేరకం

ఈ రేయి హాయినీ ఇరువురం మోయనీ

సరస రస కావ్యాలనే రసనతో రాయనీ


1.మబ్పు మోసుకొచ్చింది తమకాల జల్లునీ

గాలి పూసివెళ్ళింది తపనలున్న తావిని

వెన్నెలే తెలిపింది నీ తహతహ మనోగతం

తెరిచి ఉంచాను ఎదనీకై చెలికాడా స్వాగతం

ఈ రేయి హాయినీ ఇరువురం మోయనీ

సరస రస కావ్యాలనే రసనతో రాయనీ


2.దేహాలు మోహంతో విరహించినాయి

నయనాలు వేచిచూసి  నీరసించినాయి

అధరాలు చుంబనాలనే ఆశించినాయి

మనసులే జతగా ముడివడి పరవశించినాయి

ఈ రేయి హాయినీ ఇరువురం మోయనీ

సరస రస కావ్యాలనే రసనతో రాయనీ

 https://youtu.be/oERUOxyET58


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పరమార్థమేదో ఎరిగించరా పరమేశ్వరా

పరతత్వమేదో బోధించరా పరమ గురువరా

దక్షిణామూర్తీ ఆది గురుమూర్తీ తీర్చవే నా జ్ఞానఆర్తి 

గమ్యమే రమ్యమౌ   ధ్యానమే ధ్యేయమౌ 

మోక్షమే లక్ష్యమౌ  సర్వం సహా విశ్వైక చక్రవర్తి


1.నీ భాష మౌనము ఆత్మగత భావమై చరియించగా

ఉపదేశ మంత్రము అద్వైత సూత్రమై స్ఫురియించగా

పాంచభౌతిక తాపత్రయాత్మిక దేహమే హరియించగా

బ్రతుకు నైవేద్యమే భవ రుజకు వైద్యమై తరియించగా


2.యోగవాశిష్టమే అనుష్ఠాన సాధ్యంగా అనుభవైకవేద్యంగా

బ్రహ్మ సత్యం జగన్మిథ్య విభూతి యోగంగా అనుభూతి హృద్యంగా

ఏకమేవా అద్వితీయం తత్వమేవాహం గా అహరహం శివోహంగా

ఆది మూల బీజం ఓమిత్యేకాక్షరం ప్రణవంగా 

తత్వమసి పరిణమించి సోహంగా

Sunday, May 22, 2022


https://youtu.be/Fd94P4JmvN4

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కినుక నీకేలా నీ భక్తుడనె గణనాథా

అలుకలిక చాలుచాలిక 

అలసితిని నీతో వేగలేక సద్గుణనాథా

తొలి సారి నీకే మ్రొక్కి తొలిపూజ నీకేచేసి

తలిచేను నిరతము నిన్నేగా

మరచితివి నన్నెందుకో మరి ఏకదంతా

వందనాలు గొనవయ్య వక్రతుండ

సుందరాంగ సిద్ధి గణపయ్య నీవే నాకు అండ


1.గుంజీలు తీసెదను శరణు శూర్పకర్ణా

గరికెనర్పించెదను మనసార విఘ్నేశ్వరా

కుడుములు నెవేద్యమిడుదు కుడువు

లంబోదరా

ఉండ్రాళ్ళు దండిగబెడుదు భుజియించు హేరంబా

వందనాలు గొనవయ్య వక్రతుండ

సుందరాంగ సిద్ధి గణపయ్య నీవే నాకు అండ


2.ఏదీ నిన్నిమ్మని అడగలేదు ఇన్నాళ్ళు

అవసరాలు నెరవేర్చావు ఎరిగి మరీ ఇన్నేళ్ళు

నీ కరుణ తరిగిందా నాకెందుకు కన్నీళ్ళు

విప్పవయ్య వినాయకా ఇకనైనా చిక్కుముళ్ళు

వందనాలు గొనవయ్య వక్రతుండ

సుందరాంగ సిద్ధి గణపయ్య నీవే నాకు అండ

Friday, May 20, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ దైవం కోసం చెలీ నీపూజలు

ప్రత్యక్ష దేవిగ నీవే సాక్షాత్కరిస్తే

ఏ కోవెలకరుదెంచగ నీ పరుగులు

నా హృదయ మందిరాన నిను ప్రతిష్ఠిస్తే

నే చేసెద ముప్పొద్దుల ప్రేయసీ ప్రేమాభిషేకం

వరమొసగవె జన్మంతా ఒనరించగ కైంకర్యం


1.ఉషోదయాన తుషార బిందువులేరుక వచ్చి 

మంజుల నాదాల మంజీరాలవగా వరుసగ గుచ్చి 

అలంకరించెద మెరియగ నీ పాదాలకు మెచ్చి

ప్రసాదించవే పరువాలు ప్రణయాలు అనుబంధాలు

ప్రమోదించవే రాగాలు యోగాలు యుగయుగాలు


2.నా గుండె మాణిక్యం నీ ఎదకు ఆభరణం

నా మనసు మందారం నీ మెడలో సుమహారం

నా పిడికిలి నీ నడుముకు అమరెడి వడ్డాణం

నా ఊపిరి నీ తనువుకు సౌగంధికా శ్రీ చందనం

విశ్వమంతరించనీ కాలము కడతేరనీ నీదే ఈ జీవితం

తరగని చెరగని గని నా ప్రేమ నీకే నీకే నీకే చెలీ అంకితం


OK

Thursday, May 19, 2022

https://youtu.be/GSYu5kMGGZ4?si=kyyLpvzS-MMRq1M9

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

తలుపు తట్టిరాదా అదృష్టమంటు వస్తే
తల్లీ వరలక్మీ ఘన ఘనమౌ నీ దయ వర్షిస్తే
తహతహలాడినా తపనలనే బడసినా
సిరీ హరిదేవేరి వృధాయే నీవే హూంకరిస్తే
పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే

1.భాగ్యమంటె సంపదకాదు ఆరోగ్యమే
సౌఖ్యమంటె విలాసమవదు వైరాగ్యమే
అష్టైశ్వర్యాలున్నా తృప్తినీయకున్న బ్రతుకు దైన్యమే
నవ నిధులున్నా నీ కృపలేనిది శాంతి మృగ్యమే
పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే

2.ఆస్తిపాస్తులెందుకు నిత్యానందిని కానీ
పదవులు వలదమ్మా పరమానందమెందనీ
రాగద్వేషాలను వదిలి నీ పదముల నందనీ
భవబంధాలు సడలి నీకే నీకే నన్నిక చెందనీ
పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వంచనే వంచనైంది ప్రతి ఇంచునా ప్రపంచమంతా

ముంచడమే మించుతోంది కచ్చితంగా కుత్సితంగా

తలవంచనేల ఆత్మవంచనేల మంచిగా ప్రవర్తించినా

చింతించనేల స్వగతించనేల సత్యమే

ప్రవచించినా


1.ముక్కు పచ్చడైతే మాత్రమేంటి ముక్కుసూటి తనానికి

ఢక్కామొక్కీలు తిన్నా ఇష్టమేమరి

లెక్కచేయని గుణానికి

ఆశచావదు మోడుకైనా చినుకొస్తే చిగురించడానికి

తపన వీడదు బీడుకైనా తొలకరికి 

పులకరించడానికి


2.వైఖరిని మార్చుకోనేల వ్యక్తిగా

అదే గుర్తింపుగా

ఒకరితో పోల్చుకోనేల తరతమాలుగా

నీవు నీవులా నీవుగా

శిఖరంలా నిలువుగ ఎదగడం స్వార్థమే అంతరార్థం

సంద్రంలా ఎద నదులను కలుపుకోవడం 

సౌహార్దం

 

https://youtu.be/10D63SQ2zAQ?si=tQe-IhPiUZJCpND3

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గడ్డిపోచ దొరికినా వదులుకోలేరు

వరదలో కొట్టుకెళ్తు మునకలేయువారు

కాస్త సానుభూతికైనా ఊరటచెందేరు

అయోమయంతో ఏ దిక్కుతోచనివారు

దీనుల బలహీనతే పెట్టుబడి బూటకాల బురిడీ బాబాలకు

గుడ్డిగ నమ్మడమే రాబడి మాటకారి మాయావి మాతలకు

మోసం మోసం బ్రతుకే హైన్యం ఈ పరాన్న బుక్కులకు

సిగ్గూ శరం అన్నవి శూన్యం ఈ నీచ్ కమీనే

కుక్కలకు


1.దీర్ఘకాలవ్యాధులు మానిపోని మనాదులు

మూఢనమ్మకాల మేడల కవేలే పునాదులు

వైద్యవిధానాలేవి ఫలించలేని అభాగ్యులు

కార్పొరేటు ఘరానా ఖర్చుమోయనోళ్ళు

అమాయకులు అనాధలే లక్ష్యమీ ఫకీర్లకు

ప్రచారాలు గారడీలు రేపగలవు పుకార్లను

మోసం మోసం బ్రతుకే హైన్యం ఈ పరాన్న బుక్కులకు

సిగ్గూ శరం అన్నవి శూన్యం ఈ నీచ్ కమీనే

కుక్కలకు


2.చెప్పులతో కొడతారు నిప్పుల్లో తొస్తారు

నూనెలేవొ రాస్తారు మేన బూది పూస్తారు

తావీజులు తాంత్రిక పూజలు దొంగ గురూజీల రివాజులు

దైవాన్నే నమ్మినప్పుడు మన మతులకేల ఈ బూజులు

కర్మసిద్దాంతమే మన జీవన విధానం కదా

గీతాబోధనలే మనకు ఆచరణీయం సదా

మోసం మోసం బ్రతుకే హైన్యం ఈ పరాన్న బుక్కులకు

సిగ్గూ శరం అన్నవి శూన్యంఈ నీచ్ కమీనే

కుక్కలకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఓర చూపులు చూస్తాను 

దోరనవ్వులు నవ్వుతాను

కొంటెతనపు మాటలెన్నో కొసరి కొసరి రువ్వుతాను

స్నేహమొలకబోస్తాను

వలపునెరగ వేస్తాను

తేరగా గుంజడానికి వగలొలుకుతుంటాను

బ్రతుకనేర్చిన నవీన వనితను నేను

మాయలేడినైనా మనసంతా పవిత్రను


1.నన్నుముట్టుకోకంటూ నామాలకాకినౌతా

పత్తిత్తు వేషాలేస్తూ అత్తిపత్తి నేనౌతా

మగవాడి వంకర బుద్దిని అలుసుగాగొంటూ మసిబూసి మాయజేస్తా

తోకాడిస్తు వెంటబడే వాడిని పిచ్చిగా వాడుకొంటూ పిప్పి పిప్పిజేసేస్తా

బ్రతుకనేర్చిన నవీన వనితను నేను

మాయలేడినైనా మనసంతా పవిత్రను


2.మగాడి బలహీనత నేనని నాకు బాగా తెలుసు

అందాలు ఆరబోస్తే చొంగకార్చగలడని తెలుసు

కోరినది కాదనకుండా విలాసాలు నెరవేర్చగలగడం నాకొక అలుసు

కొత్త చేప దొరికినంతనే పురుగులా దులిపేయడం నాకు రివాజు

బ్రతుకనేర్చిన నవీన వనితను నేను

మాయలేడినైనా మనసంతా పవిత్రను

 https://youtu.be/hufgaNGIUag?si=DAMQb5Rfpj20agbu

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మట్టితావెంత మధురిమ

మట్టితావె మనభాగ్య సీమ

మట్టితోనె ఆహారం మట్టే ఔషధం

మట్టి మనను కన్నతల్లి మట్టే మన కల్పవల్లి


1.హీనంగా చూడకు మన్నేయని

హేయంగా భావించకు బురదని

పంటలనందించే తరగని ధాన్యదాత ధరణి

జీవరాశి జనని పరమ పావని జగతిలోన మన అవని


2.నిస్సారవంతమవసాగే నిర్లక్ష్యానికి నేల

సాగుకు నోచక మేడలు వెలయగ విలవిల

మొక్కలు పెంచక అడవులు నరకగ నరకంలా

సమీప భావితరాల మనుగడ ప్రశ్నార్థకంలా


3.పర్యావరణపు అసమతుల్యత ఒకలోపం

కలుషిత కర్భన రసాయనాలే మనకు ఘోరశాపం

మానవజాతి చేసుకొంటున్న స్వయంకృతాపరాధం

మనకై మనమే పూనుకొని ఆపాలి ఈ నరమేధం

Tuesday, May 17, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మలయమారుతం(చారుకేశి ఛాయలతో)


ఎప్పుడూ శుభోదయం చెప్పుతుంటె నప్పదు

నిద్రాణమై మెలిగితె రోజంతా చెప్పక తప్పదు

జాగృతితో జాతి చెలఁగ మేలుకొలుపు అవసరమా

నిద్రనటించువారినైతె  లేపగ ఆ బ్రహ్మకైన తరమా


1.భక్తుడై పోగలడా బలిమికి లింగం కడితే

పక్కకెళ్ళి చెఱపడా పట్టి పంగనామమెడితె

చెవుడొచ్చినవాడైతే తేడా ఎరుగునా తిడితే

అత్తిపత్తి చిత్తాలు ముడుచుకొనునుగా ముడితే


2.మనసునొకటి మాటొకటి చేత ఇంకొకటి

లోకాన అధికులకూ ఇదేకదా పరిపాటి

చొరవా చేతన కలిగినవారే కదా నేటి ఘనాపాటి

రవిలా కాకున్నా  వెలుగీయగ కవికాగలుగును తానో దివిటి

Sunday, May 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎప్పుడు నీ మూల్యం కుటుంబాన శూన్యమై పోతుందో

ఎప్పుడు నీ ఉనికి నీ ఇంట కంటగింపుగా మారుతుందో

ఎరగుమా నేస్తమా ఆరంభమైనదని నీ మహాప్రస్థానం

తెలుసుకో మిత్రమా నువు చేరావని నీ చరమాంకం


1.అవసరాలు నెరవేర్చే ఆర్థిక వనరుగా

ఇంటిపనుల తీర్చేందుకు నీవో నౌకరుగా

పరిగణింపు ఎప్పుడు మొదలౌతుందో

దబాయింపు అదే పనిగ నసపెడుతుందో

ఎరుగుమా నేస్తమా నీవిక ఒంటరి బాటసారివేనని

తెలుసుకో మిత్రమా నీవొక శాశ్వత పనివాడివైనావని


2.సుద్దులు నేర్పుతుంది రోజూ నీ శ్రీమతి

హద్దులు పెడుతుంది నిన్నన్నిట నీ సంతతి

నీ ప్రతిచర్యను విసుక్కొంటు నీవారెన్నడు తలచేరో

వదిలించుకునే గుదిబండగ నిను సతిసుతులెపుడెంచేరో

ఎరుగుమా నేస్తమా నువు చనుటకు వేళయ్యిందని

తెలుసుకో మిత్రమా నీ కనుమరుగే ఇలకు

మేలయ్యిందని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆత్మన్యూనత మనకు అతిపెద్ద రుగ్మత

ఆత్మస్తుతి పరనింద కాదు సభ్యత

యథాతథపు జీవితం తథాగతుని ప్రశాంతం

ఆచరణాత్మకం అనునిత్య సాధనతో సుసాధ్యం


1.ప్రతిభ ఎంతొ దాగి ఉంది ప్రతివారిలో

సానబెడితె వజ్రమై వెలుగులీను జగతిలో

తటపటాయింపులే మానుకోవాలి ఇక

మొహమాటాలకు ఏనాడూ తావీయక

ఉన్నదేదొ ఉన్నది జన్మతః అబ్బినది

చొరవవల్లనే కదా ఎల్లరకూ ఎరుకయేది


2.సహృదయులే కదా మనతోటి వారంతా

ప్రోత్సహించు మిత్రులుండ మనకేల చింత

సహజమే ఎవరికైన గుణదోషాలిలోనా

తలదాల్చగ సిద్ధమే సద్గురువుల సూచన

సంగీతము సాహిత్యము కవలపిల్లలు

ఆనందం పంచుటకై లేవు మనకు ఎల్లలు


PIC courtesy: Agacharya Artist sir

Saturday, May 14, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గంటలు మ్రోగుతాయి ఎదలో-ఎదురుగా నీవొస్తే

మంటలు రేగుతాయి మదిలో - గోముగా నువుచూస్తే

అందమన్నదొకటే కాదు అందుకు కారణం

నీ మనసుకు నా మనసుకు  ప్రేమ తోరణం


1.పూలపట్టుగా చెట్టుని కనుగొని కోసినపుడు

పూలబుట్టగా పట్టు పావడను చేసినప్పడు

చిటారుకొమ్మన విరులుకోయ నిను మోసినప్పుడు

వెచ్చని మెత్తని నీ తనువే నాకొరిసినప్పుడు

ఉద్వేగంతో ప్రతిధ్వనించెనే చెలీ నా గుండె చప్పుడు


2.మామిడి తోపులో తాడుతొ ఊయల వేసినప్పుడు

నిలబడి ఎగబడి అల్లంతగ నువ్వూగినప్పుడు

విరబోసిన నీ నీలి కురులు గాలికి రేగినప్పుడు

పట్టుతప్ప నిను పట్టుకొనగ నా ఒడి చేరినప్పుడు

ఉద్వేగంతో ప్రతిధ్వనించెనే చెలీ నా గుండె చప్పుడు


https://youtu.be/8yrScsuhq_Y

 రచన,స్వరకల్పన&గానం: డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:ధర్మవతి


శుభములు చేకూర్చు నీ జయంత్యుత్సవాన

అఘముల నోకార్చు నీ ఆవిర్భవ సమయాన

శుభాకాంక్షలే నెరవేర్చు సర్వులకీ పర్వాన

శుభఫలాలనందించు మేమానందించు విధాన

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి


1.హరిఏడని వదురుచుండ ప్రహ్లాద వరద

సరి గానరా యని కంబాన వెలిశావుగద

వరగర్వుడా హిరణ్యకశిపు నొనరించావు వధ

సవరించర మా బ్రతుకుని సరగున గోవిందా

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి


2.పాపిగ నను నిర్ణయించి ఇపుడే రూపుమాపు

సంచిత పుణ్యముంటె సత్వరమే ఆర్తిబాపు

నిర్లిప్తతనికమాని ఉగ్రతనే బూనీ నీ ఉనికినే జూపు

నను ముంచినా తేల్చినా నాకు ముక్తి  నీ ప్రాపు

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి

 https://youtu.be/bGUp5ara034


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


నమ్మితిని వేంకటపతి-నింపితి నిను నా మతి

చూసెదవని అతీగతి-నిలిపెదవని పరపతి

రానీ నను తిరుపతి-నీ చరణాలే నాకుగతి

గోవిందగోవింద శ్రీపతి-త్రికణశుద్ధిగా నీవే శరణాగతి


1.హాయిగొలుపు తిరుమల ప్రకృతి

బంగారు శిఖరాల మందిర నిర్మితి

ముగ్ధ మనోహరమే స్వామీ నీ సుందరాకృతి

పొగడగ నా తరమా నమోనమో రమాపతి


2.బండగమారె నా గుండెన కనగ ఆర్ద్రమే

గండములెన్నొ చేరె అడుగిడ కడు సాంద్రమే

కొండమీదను సంద్రముంది నీ దయా సంద్రమే

అండకోరు వారిఎడల నీ కడ సౌహార్దమే 

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తీయగా మూల్గుతోంది నా మనసు

నీ అందాలు ఆస్వాదించమని

ప్రబందాల కందని నీ పరువాలని

పదిలంగా పాటలో కుదించమని

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి 

తనుసాంతం నీసొంతం కావాలని


1.చెక్కణాల చక్కదనం కొక్కెమేయ వెక్కుతోంది

కక్కలేక మ్రింగలేక బిక్కచచ్చిపోతోంది

పక్కచూపులేవొ చూస్తూ ఫక్కున నవ్వుతోంది

లెక్కకు మిక్కిలిగా చిక్కుల చిక్కుతు చీకాకు పడుతోందీ

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి తను సాంతంనీకే సొంతంకావాలని


2.ఎద దాటదు ఏ భావన కలవరపెడుతున్నా

పెదవికైన తెలియదు కనులు కతలు పడుతున్నా

తలపెట్టిన ప్రతిసారీ పీకనొక్క ఆగిన మరులెన్నో

పుట్టిన ప్రతి తలపుకు కట్టిన తాజ్ మహలులెన్నెన్నో

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి తను సాంతంనీకే సొంతంకావాలని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అడ్డాలనాడే మన బిడ్డలు

గడ్డాలనాడు సెగ గడ్డలు

మమకారపు భావన మనది

బాధ్యత, గర్జులన్న వాదన వారిది

తరాల అంతరాలలో నలుగుతున్న జీవులం

సతాయింపు సణుగుడులో సతమతమౌతున్న నిస్సహాయులం


1.మాటనుటకు వీలులేదు దాటవేయగా మరి దారిలేదు

తండ్రులకు కొడుకులకు జడవక గడవని మన

తీరు చేదు

భయము భక్తి గౌరవాలు ఫెద్దలకందించినాము

ఎదురుతిరిగి ఈసడించినా పిల్లలనాదరించినాము

మితమగు సంతతే ఈ గతికి కారణం

అతిగా ప్రేమించుటే దుస్థితి దర్పణం


2.ఆస్తులమ్మి అమెరికా చదువుకు  సాగనంపినాము

నెలలు గడిచి తలవకున్నా కడుపుతీపితో మిన్నకున్నాము

తమ బ్రతుకే తమదనుకొన్నగాని మద్దతుగా నిలిచాము

చరమాంకపు జీవితాన ఏకాకులమై

వగచాము

మారుతున్న కాలానికి మారాలి మనమే

చిరునవ్వుతొ స్వాగతించి కోరాలి మరణమే

Thursday, May 12, 2022

https://youtu.be/0w31P3M-gUQ?si=cilSnKybSuykSWpL

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిత్తశుద్ధిగా చేసే యత్నమె నిజమగు గెలుపు

పశ్చాత్తాపం ఎరుగని కృషి సంతృప్తి గొలుపు

నిరంతరం పయనించడమే మానవ జీవన గమ్యం

మలుపు మలుపులో ఎదురౌ మజిలీలే కడు రమ్యం

కాలానికి గాలం వేసి పట్టుకోవాలి నిమిషాల ఝషలను

ఫలితాలేవైనా స్వీకరించి పక్కకునెట్టాలి పసలేని మిషలను


1.ఎన్నడైనా ఎత్తక మానేనా ఎక్కక ఆగేనా

చిన్నచీమ తనను మించిన బరువున్నా 

తను  పదేపదే జారుతున్నా ఏ తోడులేకున్నా రాకున్నా

ఎన్ని సార్లు దులిపినా తన వాసం కూల్పినా

సాలీడు  వెనుకాడేనా గూడల్లిక నొల్లేనా

తనువులోని దారం ఆధారంగా నైపుణ్యమే పుణ్యంగా


2. ఎదురేమున్నా బెదురేలేకా వడివడి కదిలేనుగా

నది విధిగా ఏటవాలుగా తనకు వీలుగా

విప్లవించేనుగా పాధి మిన్ను మబ్బు వాన నేల

ఆటవిడుపుగా

తూరుపు బుగ్గన అరుణిమ సిగ్గు మొగ్గలు తొడిగినా 

గడియగడియకు బిడియము నొదిలి చెలగును భానుడు ధాటిగా ఏకదాటిగా

రేపటి ఆశలు  పేర్చుకొని ఎరుపుని పిడికిట చేర్చుకొని చనునజ్ఞాతిగా పడమటి దెసగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేనేంటో నేనే -నువ్వూ నువ్వే…

పోలికలు తులనాలు-హాస్యాస్పదాలు..

ఈర్ష్యా ద్వేషాలు-వ్యక్తిత్వపు హననాలు


ఎందుకు నేస్తం బ్రతుకే క్షణికం

నీకెలా ఉన్నా నాకు నువ్వే ప్రత్యేకం


1.ఎన్నెన్నితత్త్వాలు ఎన్ని మనస్తత్వాలు

ఎన్ని విభిన్న కోణాలలో కళలు కవిత్వాలు

ఎన్నెన్నని వన్నెలు చిన్నెలు వనమున నన సన్నలు

గిరులు ఝరులు ఎడారులు సప్త మహా సాగరాలు

కనగ ఎదన పరవశాలు మనకివి ప్రకృతి వరాలు

హెచ్చుతగ్గులంటు లేవు నేస్తం

దేనికదే వైశిష్ట్యం సృష్టి సమస్తం


2.మేధావివి నీవు నేను కళాపిపాసిని

గాయకునివి నీవు నేనేమో రచయితని

వచన కవిత నీసొత్తు పాటతోనె నా పొత్తు

వాఙ్మయ విద్వత్తునీది వాణీ మహత్తు నాది

ఆస్వాదన లక్ష్యమైతే అనుభూతి ముఖ్యమైతె

ఎవరికెవరు ధరన సాటి మిత్రుడా

నిమిత్తమాత్రులే ప్రేమ పాత్రుడా

Tuesday, May 10, 2022


మీ మంచి మనసులకు చేజోతలు

మీ శ్రద్ధాసక్తులకు నా నమస్సులు

కురిపించినారు  అభినందనలతో మందారాలు

చిలికించినారు శుభకామనలతో

చందనగంధాలు

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు


1.విసుగు చెందకున్నారు నా వరుస కవితలకు

తూలనాడకున్నారు నా వికృత పాటలకు

గురుతు పెట్టుకొని మరీ పలకరించినారు

విశాల హృదయంతో దీవెనలందించినారు

నిన్నటి నా జన్మదినం సందర్భాన

నేటి మా వైవాహిక వార్షికోత్సవాన

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు


2.ఆత్మీయ బంధువులు నా ఆప్త మిత్రులు

సాహితి అభిమానులు ఏ కాస్తో పరిచితులు

వీరూ వారని లేరూ ఎందరో మహానుభావులు

పేరుపేరునా తెలుపున్నా కృతజ్ఞతాంజలులు

నిన్నటి నా జన్మదినం సందర్భాన

నేటి మా వైవాహిక వార్షికోత్సవాన

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు

 

https://youtu.be/M9QimINIMaE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోపమెంత ఉన్నదో నామీద నీకు

అలక ఉన్నచోటే ప్రేమ తావు కాదనకు

చికాకెంత ఉన్నదో నా మీద నీకు

నీ చిత్తమంత నిండినాను ఆ మాట బూటకమనకు

చెలీ చెదరగొట్టనేల కలనిలా ఎద కలచివేసేలా

ప్రేయసీ అదరగొట్టనేల బెదిరీ బావురుమనేలా


1.పిపాసివై అలిసినప్పుడు శీతల పానీయమునైనా

తుఫానులో చిక్కినప్పుడు తీర దీప స్తంభమునైనా

బిగుసుకుంటుంది పాశం జారవిడిచిన కొద్దీ

తగ్గిపోతుంది దూరం  తప్పుకుంటున్న కొద్దీ

చెలీ చెదరగొట్టనేల కలనిలా ఎద కలచివేసేలా

ప్రేయసీ అదరగొట్టనేల బెదిరీ బావురుమనేలా


2.నా పాటలు పునాదిగా ప్రేమసౌధం నిర్మించా

నీ మాటలు ఆలంబనగా అనుభూతులు

మర్మించా

ఉభయత్రా నేనే ద్విపాత్రాభినయం చేసా

పదేపదే నిన్ను ఒడిదుడుకుల జడిలో ముంచేసా

మన్నించు నేస్తమా నా కవితకు నిను వస్తువు చేసా

చరమగీత మిదేలే భావుకతను ఇక్కడే పాతరవేసా

 

https://youtu.be/p8KAYvIti-o?si=tRTs3YFL3P2ob6w7

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కంఠధ్వని కర్కశము-పలుకులేమొ పరుషము

లౌక్యమైతె శూన్యము-ముక్కుసూటి వైనము

ఎవరు చేయగలరిలలో-రాఖీ… నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


1.పదిమందిలొ ఇమిడేటి పద్దతి నెరుగవు

పదుగురితో ముదమారగ ప్రవర్తించనేరవు

పదపడి కదలడమే నీ పాట్లకు మూలము

చెల్లించగ రివాజే నీవే తగు మూల్యము

ఎవరు చేయగలరిలలో-రాఖీ ……..నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


2.నీకున్న కొద్దిమంది చెలిమి వారి సహనము

నీతోటి కొనసాగుట నీ మిత్రులకతి నరకము

నిష్ఠూరపు వాస్తవాలు నీవైనా ఓర్వగలవా

మనసారా పరుల ప్రతిభ ప్రశంసించ గలవా

ఎవరు చేయగలరిలలో-రాఖీ… …..నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


3 కొడుకుగా సేవచేయనైతివి తల్లికి

భర్తగా సాయపడక పోతివి నీ ఆలికి

ఉన్నతి కలుగజేయవైతివి నీ సుతులకు

సన్నుతి వేడనైతివి దైవాన్ని సద్గతులకు

విఫలమైనావు వాసి పస లేని నస కవిగా

విగతజీవివైనావు ఒరులకు కొరగాని కొరవిగా


నీది అసమర్థుడి జీవయాత్ర

నీది విధివక్రించిన దీన పాత్ర

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి గీతా రాంకిషన్(రాఖీ)


ఒకటి ఒకటీ కూడితే అది రెండైతే కలన గణితం

మనసూ మనసూ కూడితే ఒకటైతే మన జీవితం

ఏనాడో అయినాము ఒకరికి ఒకరం అంకితం

ఈడు జోడుగ తోడునీడగ మన మనుగడ శాశ్వతం

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై 


1.నదులు రెండు సంగమించి సాగరమైన తీరుగా

మొక్కల నంటితె కొత్త వంగడం అంకురించినట్లుగా

కలలు రెండు పల్లవించి ఫలితమొకటైన రీతిగా

ఇరువురి నడగలు చేర్చే గమ్యం స్వర్గమైన చందంగా

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై 


2.ఇరు చరణాల మూలం పల్లవి మన సంసారంగా

మాట నీదిగా బాట నాదిగా సర్దుబాటయే కాపురంగా

చిరుచిరు అలకలు అరమరికలుగా ఆనందం సాకారంగా

ఊపిరి నీదిగ ఎదలయ నాదిగ  జతపడి జీవన శ్రీకారంగా

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై


https://youtu.be/A4E3ZGluQiI?si=-l7vH_paYWiO0N4F

 రచన,స్వరకల్పన&గానం:

డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


చల్లగ చూసే శ్రీశైల మల్లన్నా మా కొమురెల్లి మల్లన్నా మా వేలాల మల్లన్నా

పాద నమస్సులు మీకు నా పబ్బతులు పట్నాలు దయగనరోరన్న

ఎల్లకాలమిలా "నా పుట్టిన రోజున"

 చల్లని దీవెన్లు మీరు చల్లాలి నా మీన


1.తడిలేని గుండెతొ పుడితి పుడమినింక

గడియైన తిరమనక పడితి గవ్వల యెనక

గడిచి పోయే సామి నా బతుకంత ఎర్థంగా

పడిగాపులు పడుతున్నా నీదయకై ఆత్రంగా

ఆదుకో నన్నింక ఆ తిన్నని మాత్రంగ

చేదుకో సామి నీ వంక నను ప్రేమపాత్రంగ


2.కోపాలు తాపాలు నా లోపాలిస్తా తీస్కో

 ఫాల శేఖర నా పానాలైదునీవె భద్రంగ కాస్కో

పాపాలు శాపాలు ఏ జన్మలోనో చేసానెందుకో

నీ పాల ననుబడనీ వేడితి నా చేయినందుకో

లెక్కజేయి సామి  గ్రక్కున నన్ను ఎములాడ రాజన్న

అక్కున జేర్చుకొ మిక్కిలి దయగల్ల మా అక్కపెల్లి రాజన్న

 (అశుతోష్ రాణా నటుడు   హిందీ కవి షాయరీకి -స్వేఛ్ఛానువాద గీతం)


అనువాద రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:యమన్ కళ్యాణి


ఆదమరచి నిదురే పోలేనివేళ

ఎద భారం తీరేలా ఏడ్వలేని వేళ

మనసుకు తగు ఊరటే దొరకని వేళ

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకపరుస్తుంది


1.వడివడి గుండె దడే హెచ్చినపుడు

వత్తిడి చిత్తాన్ని కత్తిరించినప్పుడు

మనసు మనసులో లేదనిపించినపుడు

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకపరుస్తుంది


2.బ్రతుకు దుర్భరమయినపుడు

భవిత భయం గొలిపినపుడు

ఏకాకిగ నీలొ నీవు మదనే పడినప్పుడు

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకజేస్తుంది


3.వయసు మీరిపోతుంటే

తలపు తిరోగమిస్తుంటే

అసహనమే దహిస్తుంటే

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకజేస్తుంది

 https://youtu.be/2Ib-pTh4uu8


"మాతృ వందనం"


అమ్మా నీ మొదటి మాట 'నానా మంచిగ ఉన్నావా'

వెనువెంటనె నీ నోట 'కన్నా నువు తిన్నావా'

కడుపు చక్కి చూసేది నీవే కద మాయమ్మా

కమ్మగ చేసిపెట్టి కడుపు నింప నీకెంత తపనమ్మా


1.వయసు మీరి పోయినా విశ్రాంతి కోరుకోవు

ఇన్నేళ్ళు వచ్చినా నన్ను పసివాడిననే ఎంచేవు

డిల్లీకి రాజుగ నేనెదిగినా తల్లివి నీకు నేను బాలుడనే

నీ చల్లని దీవెనలే అమ్మా నా ఉన్నతి కెప్పుడు

మూలములే


2.ఏ చదువులు నేర్పలేవు నువు నేర్పిన సంస్కారం

పది మంది మెప్పుదలకు నీ పెంపకమే ఆస్కారం

నీ కడుపున పుట్టడం అమ్మా నా  జన్మకు పురస్కారం

నీ ఋణం తీరదెప్పటికీ ననుగన్న తల్లినీకు

పాదనమస్కారం



Thursday, May 5, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ప్రసాదమేనా నాకీ నిత్య విషాదం

నీకు ప్రమోదమౌనా ఈ వింత వినోదం

నీ ప్రదానమేదైనా నాకు ప్రధానం

నీ విలాసమే  సృష్టి విధి విధానం


ఎరుగక చేసితినేమో ప్రభూ ఏదో ఘోర అపరాధం

ఏడుకొండల స్వామి మన్నించు నా నిర్లక్ష్యపు అపచారం


1.ఒకటొకటిగ లాక్కొన్నావు లాఘవంగ అంగాలు

మాట పలుకు చేత నడకలాయె అప్పనంగ

నీ పాలు

ఎందుకింక మనకు మనకు ముసుగులో కా రణాలు

కోరకముందే ఇస్తున్నా స్వీకరించు నా పంచ ప్రాణాలు

ఇచ్చితివిప్పటికే నాకెన్నో యోగాలు వైభోగాలు

నీవేనా ఇచ్చేది ప్రతిఫలం గ్రహించు నా

వాసనలు వాంఛలు


2.అక్షరాల భాషయేల మన మధ్య ఆత్మకు పరమాత్మకు

అవసరాల యాచనేల మనకు పరస్పరం వేరుకాని యోచనకు

బింబము నీవు ప్రతిబింబము నేను ఐహిక దర్పణంలో

తొలగించగ అద్దానిని నేనే అబద్దానిని ఆత్మ సమర్పణంలో

ఎంతకాల మింక స్వామి నేను నాదను ఈ దేహ భావనం

అతలాకుతలమయే వెతల కతల గతుల మోహ జీవనం

 https://youtu.be/vrivw2wdo6w


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాయి బాబా అంటాం సాయి దేవా అంటాం

సాయి రామ అంటాం సాయి నాథా అంటాం

అనుక్షణం నిన్నే తలుస్తుంటాం

మనసారా నిన్నే కొలుస్తుంటాం

షిరిడీలో నిను దర్శిస్తాం నీ పాదం స్పర్శిస్తాం

జయజయజయ సాయిరాం ద్వారకామయి రాం

నమో నమో సాయిరాం నమో పరమ పావన నామ్


1. ప్రతివారిని సాయీ నీవుగా భావిస్తాం

అందరినీ నీరూపుగ ఎప్పుడూ తలపోస్తాం

కలమత భేదాలు లేక ఆత్మీయత చూపిస్తాం

సాటి మనుషులందరినీ సర్వదా ప్రేమిస్తాం

జయజయజయ సాయిరాం ద్వారకామయి రాం

నమో నమో సాయిరాం నమో పరమ పావన నామ్


2.కాలుకు నొప్పైనా సాయీ అని మూల్గుతాం

నువు చేసే జాప్యానికి నీ మీద అలుగుతాం

నీ అండ చూసికొని నిర్భయంగ నీల్గుతాం

నువు దయజూస్తె చాలు బ్రతుకంతా చెలగుతాం

జయజయజయ సాయిరాం ద్వారకామయి రాం

నమో నమో సాయిరాం నమో పరమ పావన నామ్

Wednesday, May 4, 2022

https://youtu.be/M9Y0qL66igA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


నరకేసరి నీకేవరు సరిసాటి

సరగున బ్రోవడమే స్వామీ నీకు పరిపాటి

వరముల నొసగుటలో నీవే ఇల ఘనపాఠి

మరిమరి నిను వేడుటేల మాతండ్రివి నీవంటి

భూషణ వికాస మా ధర్మపురి నివాస

దుష్టసంహార నరసింహా నిజ భక్తపోశ


1.తల్లిగర్భములోనే నూరిపోస్తివి భక్తిని

వెన్నతొ పెట్టిన విద్యగా కలిగిస్తివి అనురక్తిని

చిన్ననాటి ఆటల పాటల రేపితివి ఆసక్తిని

కోరిమరీ ప్రసాదిస్తివి ప్రభూ ప్రహ్లాదునికి ముక్తిని

భూషణ వికాస మా ధర్మపురి నివాస

దుష్టసంహార నరసింహా నిజ భక్తపోశ


2.పుట్టిపెరిగి నామయ్యా నీ కనుసన్నలలో

మనుగడ సాగింతుమయా నీ మన్ననలతో

మము సరి నిలుపవయా లోకోన్నతులతో

నిను విసిగింతుమయా నరుసయ్యా వినతులతో

భూషణ వికాస మా ధర్మపురి నివాస

దుష్టసంహార నరసింహా నిజ భక్తపోశ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మస్తు మస్తుగున్నదే నీవస్తువునైనందుకు

జబర్ దస్తుగున్నదే నే స్ఫూర్తినిస్తున్నందుకు

మంచికో చెడ్డకో మనసులొ చోటుందిగా

నా తలపేదొ నీలొ అలజడి రేపిందిగా

హాయిగా ఉందినాకు నీ విసుగు సైతం

వేదమల్లె వినిపిస్తోంది నీ వేసట గీతం


1.వెర్రి మొర్రి వేషాలన్ని దృష్టి మరల్చేందుకే

నిన్నుగిల్లుడెందుకంటే ధ్యాసలొ నిలిచేందుకే

పందాలు వేసుకుందాం ప్రేమ పెంచుకుందుకు

పోటీగ రాసుకుందాం ప్రజ్ఞ చాటుకుందుకు

హాయిగా ఉందినాకు నీ చిటపట రాగం

వేదమల్లె వినిపిస్తోంది నీదైన అనురాగం


2.నిన్ను చూసి చూడగానే మది ఆనందమయం

నన్ను కలుసుకోగానే నీకోపం మటుమాయం

చికాకు చిదంబర మర్మం ఎడబాటు ఫలితం

నీదని నాదని వేరేదిలేదు ఒకటే మనజీవితం

హాయిగా ఉందినాకు పరస్పరపు ఆసక్తి

వేదమల్లె వినిపిస్తోంది నీ మూగ అనురక్తి


OK

Tuesday, May 3, 2022

 

https://youtu.be/CbuGwsMgJ7c?si=3w2__u9XGKmBOrFD

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సంగీత శాస్త్రము నీ ఆవిష్కరణం

కమనీయ గాత్రానికి నీ కృప కారణం

తాండవ నృత్యము నీకొక ఆభరణం

నటనలు ఘటనలె నీకు సర్వసాధారణం 

నటరాజా నటేశ్వరా  స్ఫటిక లింగేశ్వరా

నిటలాక్ష హాటకేశ్వర రసలింగేశ్వరా

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


1. సాకర స్వరూపమే స్వర షడ్జమం  -స

రిధమరాజ రిపునిగా స్వర రిషభం - రి

 గళం గరళమౌ తరుణం స్వర గాంధారం - గ

మరులు మత్తుగొలుపగా స్వర మత్తేభం - మ

స్వరవిహార మనోహరా సైకత లింగేశ్వరా

త్రిపురాసుర సంహారా ప్రణవ లింగేశ్వరా


2.పంచభూతాత్మకమే స్వర పంచమం - ప

దేహాత్మ సంయోగమవగ స్వర ధైవతం - ద

నిరాకార నిర్గుణ ధారణే స్వర నిషాదం - ని

వినూత్న రీతి స్ఫురించెనీ స్వర సంభవం-ఓం

సంగీత నాట్యలోల భక్త పాల రాజలింగేశ్వరా

పంచాక్షరి ఔషధమే దీనులకిల రామలింగేశ్వరా

Saturday, April 30, 2022

 https://youtu.be/nDZPaoOfXf4?si=gXtGlK6cRYfUyKIG


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మల్లెపూలకు ముళ్ళున్నా నే నమ్మగలను 

మకరందం చేదని అన్నా ఒప్పుకోగలను

చందమామ నల్లబడినా నే బాధపడను

పికము గొంతు నాలా మారినా విస్తుపోను

నువు కరుణజూడవంటే విశ్వసింతునా వేంకటేశ్వరా

నువు కావగ రావంటే నేనోర్తునా మా రమేశ్వరా

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా


1. తీయగా మార్చగలవు ఉప్పునీటి బావిని

చల్లగా చేయగలవు మండుటెండ కాయు రవిని

ఇంపుగా చేర్చగలవు గాలికి పారిజాత తావిని

అన్నమయగ దయజూతువు శరణన్న ఈ కవిని

చిత్రమే కదలవంటె ఆర్తుల మొరలు విని

వింతయే నెరవేర్చవంటె భక్తుల మనవిని

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా


2.దరిజేరావు ఎదిరిచూచు శబరి అనునయానికి

లాలించావు  ఉడతనైనా చిరుసాయానికి

వరమిచ్చావు కుబ్జకు తగు సమయానికి

సారథివైనావు కిరీటికి అని ధర్మ విజయానికి

న్యాయమా నను పరికించగా ఈ ప్రాయానికి

భావ్యమా నను దూరం చేయగా ఆరోగ్యానికి

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా

Thursday, April 28, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాకిచ్చుడేమి వద్దు బులిపిచ్చుడింక వద్దు

కాంతా కనకాలనసలు ఎరవేయగా వద్దు

నిన్నడుగుడు వదిలేసా ఆ చెడుగుడు మానేసా

సమర్పించ సిద్ధపడ్డా నా బ్రతుకు నీ పదాల వద్ద

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా


1.నాయిలాలు నీకడ నాలుగు వేదాలు

ఇంద్రియాలు మదముడిగి నీకు అధీనాలు

అరిషడ్వర్గాలెపుడూ నీకామడ దూరాలు

చేర్చగలవు సులువుగా భవసాగర తీరాలు

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా



2.కార్తవీర్యార్జునుని కనికరించినావు

వ్యసనాల బానిసగా లీల ప్రదర్శించావు

అవధూతగ  అడుగడుగున దర్శనమిచ్చెదవు

గురు పరంపరకు నీవు ఆదిమూలమైనావు

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా

https://youtu.be/jZpyt2JSswo?si=UGIZenLYA6Jlo1NO

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: నట భైరవి

తూగుతున్నావన్నది నన్ను లోకం
నేను తాగడమే ఎరుగనోణ్ణి అన్నది సత్యం
కమ్మేసిందన్నది జనం బొత్తిగా నన్ను మైకం
మత్తుమందు ముట్టనోణ్ణి అన్నది వాస్తవం
నిన్ను తలుచుకున్న అన్ని సమయాల్లొ నెచ్చలీ
నిన్ను కలుసుకున్నప్పుడల్లా నా మనోహరి

1.పిచ్చి పిచ్చిగీతలేవేవో గీస్తుంటానట
పచ్చి పచ్చి రాతలేవేవో రాస్తుంటానట
రచ్చరచ్చగా చిందేసి తెగ ఆడేస్తుంటానట
ఇఛ్ఛారీతిగ ఏ పాటలో ఆగక పాడుతానట
నా కన్నుల్లో నింపుకున్నా నిన్ను మాత్రమే
నా హృదయంలో దాచుకున్నా నీ చిత్రమే

2.పిచ్చుక గూళ్ళేవో కడుతుంటానట
సీతాకోక చిలుకల్ని పడుతుంటానట
పచ్చాని చిలుకలతో ముచ్చటలాడేనట
వెచ్చదనంకై వెన్నెల జలకాలాడెదనట
నీ కోసమే వెచ్చించానంతే నా జీవితం
నా ప్రేమను చేసేసా ప్రేయసీ నీకు అంకితం



రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


హద్దు తప్పింది ముద్దరాల నా బుద్దే

వద్దు వద్దన్న వినకుంది ఈ పొద్దె

ముద్దంటు వద్దకొస్తే నన్నాపొద్దె

మద్దులొలుకు అందాల్ని ఇంకిత చేపొద్దే


1.కన్నుల్తొ కహానీలు చెప్ప బుద్ధి

చూపుల్తొ బాతాఖానీ వేయబుద్ది

ముక్కు జున్నుముక్కలాగ కొరక బుద్ది

పెదాల ఐస్ఫ్రూట్ ని చప్పరించ బుద్ది


2.చెంపల్ని చెంపల్తొ ఆన్చబుద్ధి

చెవులకున్న జూకాల్ని మీటబుద్ది

మెడవంపులో ఊపిరినొదల బుద్ధి

చుబుకాన్ని మునిపంట నొక్క బుద్ధి


3.ఎదమీద తలవాల్చి సేదదీర బుద్ధి

పిడికిట్లొ నడుముని ఇముడ్చ బుద్ధి

నాల్కెతో నాభిలోతు కొలువ బుద్ధి

మొత్తంగ ఇద్దరం ఒకటవ్వ బుద్ధి

Wednesday, April 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టించుకుంటే వెంట పడుతున్నమంటరు

పట్టించుకోకుంటే లోన బెంగపడుతుంటరు

చిక్కొచ్చి పడ్డదే ఈ చక్కని చుక్కలతొ

చిక్కిపోక తప్పదు ఆ చిక్కనైన దృక్కులకు


1.సోగ కన్నులతో చేస్తుంటారు సైగలను

సొట్ట బుగ్గలతో వేయిస్తారు లొట్టలను

పంటినొక్కులతొ తెప్పిస్తారు తిప్పలను

మూతి విరుపులతొ కలిగిస్తారు ముప్పులను


2.పరేషాన్ చేస్తారు పదేపదే పైట సవరింపుతో

తమాషానే చూస్తారు చీర నాభి అమరింపుతో

మషాలా గుప్పిస్తారు గుంభనాల పలవరింపుతో

నిషా ఎక్కేలా చూపిస్తారు అందాలు చిలకరింపుతో

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కవితకు కంటకం నీ ఎడబాటు

నా పాటకు సంకటం నిన్నుగనని లోటు

పదపదమున కదలలేక నా కలపు తడబాటు

ఏ క్షణమూ నను వదలక నీ తలపు చొరబాటు

పరిచయమైతివేల గుండెను మండించ

ప్రేమను కురిపించవేల కలలను పండించ


1.కలిసిన మన అభిరుచులు కలిపెనులే మనసులు

కలవరమొందగా ఊరటనిచ్చె నీ ప్రియ వచనములు

అలసిన తరుణాన వింజామరలాయే నీ చిరునగవులు

నీకదలిక నీమెదలిక నా కవనపు మేలి బిగువులు

చెలిమిని చేసితివే నా స్ఫూర్తిదాతగా

వేదన రేపితివే వరమీయని దేవతగా


2.నీవు మాత్రమెరుగవనా నా ఊపిరి నీవని

నా హృదయ చలన సూత్రమై మారితివీవని

కవిత సంగతేమొ గాని జీవితమిక దుర్భరము

సడలుతోంది నువు లేక బ్రతుకుఎడల నిబ్బరము

నీ చేతిలొ నా మనుగడ నిష్కమణ

చేయబోకె నెచ్చెలి నన్ను నిరాదరణ

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిన్ను దీవించాలి నింగి దేవతలంతా

శతమానం భవతియని

ఆశీర్వదించాలి సకల మానవులంతా

చిరంజీవ చిరంజీవాయని

అందించాలి బంధుమిత్రులు శుభాకాంక్షలు

వర్ధిల్లాలి దినదినమూ ఆయురారోగ్యాలు

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  భరద్వాజ

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ


1.నరదృష్టి పడకుండా నరసింహుడు కాచనీ

పరఘాత సోకకుండా  పరమేశుడు సాకనీ

అండగా ఉండనీ కొండగట్టు ఆంజనేయుడు

నిను ముందుకు నడపనీ వర  సిద్ది వినాయకుడు

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ


2.మనస్థైర్య మీయనీ నీకు శ్రీ మణికంఠుడు

నవ్వులు చిగురింనీయనీ షిరిడి సాయినాథుడు

సిరులతొ తులతూగనీయనీ శ్రీ మహాలక్ష్మి

మేధకు బలమీయనీ మాతా బాసర సరస్వతి

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  భరద్వాజ

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ

https://youtu.be/Ajvuh_bH9M8


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మూగయే నాకన్నా ఎంతో మేలు

నిను పాడని నాగొంతు కంతను పోలు

నీపదములు నేనొదలను అమ్మా శారదా

నీపదముల సాధనలో తరించనీ నను సదా


1.మృదు మార్ధవ గళమునకై  

మరిమరి నే జన్మిస్తా

మధుర గాత్ర మరయగనే

తక్షణమే మరణిస్తా

ప్రాధేయపడితినమ్మా నిన్ను పదేపదే

పలుచన చేసితివే పరితపించ నామదే


2.కారునలుపు నీయనుంటివి

కోయిల గళమును వరమిచ్చి

గాయాలే చేయనుంటివి

వేణువుగా నన్నే మలచి

ఉరితీగలు భరింతును వీణగ నను మార్చవే

ఊపిరి నర్పింతును గొంతులొ సుధ చేర్చవే

 

https://youtu.be/oACd0dP9ioM?si=xi9Qb0PXUQylr5yA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతటి వాడినని ననింతగ జేసినావు

అంతరంగమెరిగి నటుల ఆశలు దీర్చినావు

పొంతనలేదునా పనితనముకు ఫలితముకు

ఉన్నతంగ ఉంచినావు చింతనురానీక నా చెంతకు

శ్రీకాంత శ్రీహరి వేంకటాచలపతి

సతతము నే  నిలిపెద నిన్నే నా మతి


1.తండ్రివి నీవయి నను నడిపించినావు

తప్పులు చేసినపుడు దండించినావు

నాగుండెను నీదండలొ గుచ్చి మెడలొ వేసినాను

అండదండ నీవేయని దండిగ నిను నమ్మినాను

కొండెక్కి నినుజేరెద కొండలరాయా

కొండెక్కనీయకు నాభక్తి డంబునీయ


2.చిరునవ్వును నాటితే సిరుల పూలు పూసినావు

సాయమునందీయగ ఎందరికో బంధువుజేసినావు

సిద్దపరచు నా బుద్దిని సత్కర్మలు చేయునట్లు

పద్దులనెంచని మంచివిద్దెనీయి నీపదములు చేరునట్లు

ఇచ్చినదంతా నీదే స్వామి నీ ఇచ్ఛమేరకు

నచ్చినట్లు నను నడుపు చివరిశ్వాస వరకు

Friday, April 22, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చంపేంత క్రూరమా ప్రేమంటే

చచ్చేంత దైన్యమా ప్రేమంటే

కుదిరెనా జతగా చేరాలి ఆరాధిస్తే

చెదిరినా హితమునే కోరాలి ప్రేమిస్తే

ప్రేమంటే ఇష్టము  

కానేకాదు నికృష్టము ఇదిస్పష్టము

ప్రేమంటే సంతుష్టము

చేయవలదు సంక్లిష్టము కానీకు భ్రష్టము

ప్రేమంటే అదృష్టము


1.మనసు చూరగొనడం

మమత పంచుకొనడం

అనురాగమంటె ఆశించకపోవడం

వలపు దాచి ఉంచడం

వేచి వేచి ఉండడం

మరుజన్మకైనా నోచుకొనగ తపించడం

ప్రేమంటే ఆపారమైన ఇష్టము

ప్రేమంటే సంతుష్టము అదృష్టము


2.వెంటాడి వేధించడం

బ్రతిమాలి యాచించడం

ఒప్పుకోనప్పుడు ఆసిడ్ పోసెయ్యడం

బెదిరించి భయపెట్టడం

నమ్మించి వంచించడం

వాడుకొని ఆడుకొని పీకలు కోసెయ్యడం

ప్రేమ కాదు పైశాచికత్వము

ప్రేమ కాదు వెర్రి వైరాగ్యము

Thursday, April 21, 2022

 

https://youtu.be/UI827s-j5vM?si=lzcPD-OAeNNpWd79

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నయనాలు రాస్తాయి చూపులతో ప్రేమ లేఖలు

అధరాలు గీస్తాయి ముద్దులతో ప్రణయ రేఖలు

నీ అందచందాల్లో గతమెరుగని ప్రబందాలు

నీ హావభావాల్లో అపూర్వమైన  కావ్యాలు

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


1.నీ నీలి కురుల భాష్యం శృంగార నైషధం

నీ అధర మకరందం విరహ బాధకు ఔషధం

నువు చెంత ఉన్నంత కాళిదాసు శాకుంతలం

నువు లేనివేళంతా మనసు అతలాకుతలం

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


2.  అగుపింతురు నీలోనే అష్టవిధ నాయికలు

వగపు మించి ఆలపింతురు జయదేవ గీతికలు

నీ విలాసమందున ద్యోతకమౌ హరవిలాసం

నీవుంటే జీవితమంతా శాశ్వతమౌ వసంతమాసం

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


PIC COURTESY: SRI Agacharya Artist