మా ఊరు ధర్మపురి- మాదైవం నరహరి-గలగలా పారే -గోదావరి మాకు సిరి-జగతిలోనలేనె లేదు దీనికేదీ సరి-కళలకు కాణాచి- వేదాలకు పుట్టిల్లు-విద్వఛ్ఛికామణుల కాలవాలమైనది
gamanika:
నా టివి ప్రోగ్రాం మరియు రికార్డ్ అయిన పాటలకోసం(naa recorded songs and TV show-plz click the links)
- -కొత్త పాటలు -UPDATED ON 13-11-2012RAKI-SRI MANIKANTHA MAHIMA
- కొత్త పాటలు -UPDATED ON 13-11-2012-RAKI-SRI MANIKANTHA GEETHARCHANAM
- కొత్త పాటలు -UPDATED ON 13-11-2012 RAKI-OM GAM GANAPATHAYE NAMAHA
- DHARMAPURI NRUSIMHAA-27-02-2012 VIDUDALA UPLOADED ON 28-02-2012
- VEMULADA RAJANNA MANASU VENNA SHIVARATRI-2012 VIDUDALA UP LOADED ON 28-02-2012
- e link nundi kuda "DAYAMRUTHA VARSHINI"AUDIO SONGSdownload chesukovacchu
- FREE DOWNLOAD AVAILABLE/ PLZ PUT A COMMENT REGARDING LYRICS TUNES MUSIC AND SINGERS @ naa geethaalu(my recorded audio songs
- ***NEW ONE/RAKI-DAYAMRUTHAVARSHINI RELEASED ON 25-09-11-updated on 22-10-2011)
- my elder son short film
- naa videos ayyappa,maa tv,dharmapuri utsavalu pandugalu.godavari
- కవితల కలకలం(వచన కవితలు)
- నిత్యం-నానే-సత్యం(నానీలు)
Monday, July 1, 2019
సరసమే సారమైన సంసారం
ప్రేమకే గోపురం మీకాపురం
వర్ధిల్లనీ నిరంతంరం వికసించనీ అనవరతం
చిలకా గోరింకలు చిన్నబుచ్చుకుంటాయి
కలువా నెలవంకలు కాస్తనొచ్చుకుంటాయి
కన్నుకుట్టుకుంటుంది మిముచూసి ప్రతిజంట
మీ మిథునం జగతికే కన్నుల పంట
రాధాకృష్ణుల అనురాగ రూపమై
సీతారాముల జతలా అపురూపమై
శివపార్వతుల అర్ధనారీశ్వరమై
మీఅన్యోన్యతయే అజరామరమై
Saturday, June 29, 2019
తొలగినాయి చీకట్లు
కడతేరెను ఇక్కట్లు
తెలంగాణ అంతటా లేనె లేవు పవరుకట్లు
అంతరాయమే లేని విద్యుత్తు మిరుమిట్లు
చంద్ర శేఖరునీ ప్రణాళికే గెలువ
ప్రభాకరుని అద్వితీయ విద్వత్తు వెలుగ
1.సగటు మనిషికొఱకు ఇంటింటికి కరెంటు
పంటబావి మోటార్లు నాణ్యమైన కరెంటు
కంటతడి పెట్టకుండ రైతుకుచిత కరెంటు
కుంటుపడనీయకుండ ఇండస్ట్రీకి కరెంటు
చంద్ర శేఖరునీ ప్రణాళికే గెలువ
ప్రభాకరుని అద్వితీయ విద్వత్తు వెలుగ
2.కాళేశ్వర ప్రాజెక్టుకు రికార్డుగా కరెంటు
మిషన్ భగీరథ కోసం ఆగిపోని కరెంటు
పల్లెకు పట్నానికి నిరంతరం కరెంటు
ఎకసెక్కెమాడినోళ్ళనోళ్ళలో చొప్పదంటు
చంద్ర శేఖరునీ ప్రణాళికే గెలువ
ప్రభాకరుని అద్వితీయ విద్వత్తు వెలుగ
ఎటులనిను పోల్చగలనే చంద్రముఖీ
వెన్నుచూడగ కనులల్లాడగ
మొగము చూపితే స్థాణువునవనా
సొగసుబలగాల వ్యూహము మొహరించి
నను బంధించెదవో కౌగిలి చెఱవేసి
నీకురులతో నాకురివేసి
చంపవైతివే చంపకమాల
నీ దర్శనమో కరస్పర్శనమో
దయసేయగదే వసంత బాల
నీకవ్వింతలొ కడువింత దాగుంది
నీకనుబొమలలొ హరివిల్లుబాగుంది
దాగుడుమూతలు నేనాడలేను
నీ ఉడికింతలు నేసైచలేను
నీ వదనవీక్షణ నాకొక పరీక్షనా
నీకై ప్రతీక్ష నాకిక ఆజన్మ శిక్షనా
హిమవన్నగాలకు మేరునగాలకు
నడుమన ఉన్నది నడుమనులోయ
ఎన్నెన్ని వన్నెలొ అందీఅందక
నా ప్రాణాలు నిలువున తీయ
ఇసుక గడియారం నీమేను వయ్యారం
పెదవులతడియార్చు నీ దేహ సౌందర్యం
Friday, June 28, 2019
సాకి:
అంతర్యామి
సర్వాంతర్యామి
నీకు నాకు ఇక భేదమేమి..
పల్లవి:
నా ఊపిరి జపమాలా
ఉఛ్వాసనిశ్వాస నీ స్మరణా..
నా తనువూ నా మనసూ నీకే సమర్పణా
1.ప్రతి కార్యం నీ సేవ
నా నడకలు నీ త్రోవ
నా మదిలో నీరూపం
నా ప్రాణమే నీ దీపం ..
2.అశ్రువులే అభిషేకం
ప్రతిపలుకూ నీ శ్లోకం
నా మౌనం నీ ధ్యానం
నా జీవితం నైవేద్యం..
జగతి నీకు దాసోహం నీ సౌకుమార్యానికీ
మతి భ్రమించి పోయిందేమో ఆబ్రహ్మకు
నీ సృజనచేసి చేతులెత్తినాడమ్మా ఈజన్మకు
1.ముంగురులకు ఎంత తొందరో-చెంపల చుంబనానికై
ముక్కపుడక కేమి ఆత్రమో-తళుక్కున మెరవడానికై
పలువరుస తలపోస్తోంది నగవుల నగ అవడం కొరకై
నొక్కుబడిన చుబుకం సైతం ఉబలాటపడతోంది తను మెప్పుకై
నేరేడు పళ్ళకళ్ళతొ పోటీకి సాధ్యమౌనా అందమైనవెన్నున్నా
కనికట్టు చేసే కళ్ళను దాటగలుగు ధీరులెవ్వరు భూనభోంతరాలలోనా
చూపులనే గ్రోలగలిగితే మధిరలాగ మత్తెక్కేను
అల్లార్పని రెప్పల్లో సందేశాలెన్నెన్నో
ఆ సోగ కాటుకలో రవివర్మ చిత్రాలెన్నో
వర్ణించ నాతరమా చూపులే ఆపుతుంటే నాకలమును
తప్పుకోను నా వశమా కన్నుల్లో ఖైదుచేస్తే నా బ్రతుకును
అధరాల్లో చెఱకుదనం
వదనంలో నందనం
ఎదలో ఆరాధనం
అందాల నాచెలీ నీకు వందనం
ప్రణయాల నాసఖీ నీకు చందనం
1.ముట్టబోతె నిప్పులా కాల్చుతుంటావు
పట్టబోతె పాములా బుస్సుమంటావు
కస్సుబుస్సు లన్నీ పైపైనే
మరులుగొనుడు మాత్రం నాపైనే
కలలోకి వస్తావు కవ్విస్తుఉంటావు
కనిపించినంతనే నువుతప్పుకుంటావు
2.ఊరించుడెందుకో
ఉబుసుపోకనా
ఉడికించుడెందుకు
బొమ్మలాటనా
మనసువిప్పి చెప్పవే నీ ప్రేమని
బాసచేయవే చెలి కలిసుందామని
చితిచేరునందాక నాచేయివీడనని
మృతిలోనసైతం నీవాడనేనని
మది మత్తగు వలపుల జాణ
పరిచయమైతివె పరువాన
నీ సోపతిలో మల్లెల వాన
1.మంచి గంధమంటే నీ సామీప్యము
మలయపవన మంటే నీ సహచర్యము
వెన్నెలరేయి హాయి నీకన్నులలో
ఉషస్సులో కువకువలే నీ పలుకులలో
2.నీలి మేఘాలే నీ కురుల సోయగాన
మంజీరనాదాలే వయ్యారి నడకలలోన
సంతూర్ రావాలె గాజుల సవ్వడిలోన
మ్రోగించ గలిగేలా నీమేనే రసవీణ
కవి భావనకే వంతపాడుతూ
పాడాలి ప్రతి పాట తన్మయ మొందుతూ
శిలలైన కరగాలి పరవశమెందుతూ
పాడవే అభినవ కోయిలా
పాటకే బాటగా సన్నాయిలా
సవరించుకోవాలి శ్రుతినిను చూసి
లయనేర్చుకోవాలి కలయగ జూసి
1.పికమున కొకటే వసంతము
ప్రతిఋతువు కావాలి నీసొంతము
గ్రీష్మము నేర్పగ ఎదతాపము
ఆర్తిగ పలకాలి నీ గాత్రము
వర్ష ఋతువులో మేఘగర్జనే
మేల్కొలపాలి ఉద్రేకము
శరశ్చంద్రికలె కలకలము రేప
ఊరేగాలి రసజగము
హేమంతకాంత చేరగ చెంత
పారిపోవాలి శీతలము
శిశిరము తరహా విరహము సైచగ
మది మురియపూయాలి పూవనము
2.జలపాత హోరున సంగీతము
నదికదలికలో మృదునాదము
కడలి అలలలో కమనీయ రవము
చిరుగాలి సవ్వడిలొ మధుగీతము
వెదురు గాయాల సుధాగానము
మువ్వల యాతన కడుశ్రావ్యము
గళము పెగిలితే రసరమ్యము
ప్రేగు అదిలితే శ్రవణపేయము
పెదవులు ఆడితె పైపైన పలికితె
గానమెంతో పేలవము
మేను మరచి నాభినుండి
పాడితేనే పాటవము
ఇహము దేహము మీరునటుల
తల్లీనమైనదే కదా గానము
Thursday, June 27, 2019
దేనికి చూడాలి బాబా నీ మందిరము
మార్చవయ్యా మా గుండె షిరిడీగ
మా మనసే నీ మందిరముగ
తలచినంతనే దర్శనమీయి మాతలపులందున
పిలిచినంతనే నువు బదులీయి ఆపదలందున
1.నువు దైవమని నేను భావించనూ
పూజలు భజనలు నే చేయను
నీ బోధనలే పాటించెదనూ
నీ మార్గములో నే సాగెదను
సాటి మనిషిలో నిను చూసెదను
తోచిన సాయము నే చేసెదను
మానవత్వమె నీ తత్వము
జనుల హితమే నీ మతము
2.నీ హుండీలో వేయను రొక్కము
నీ ముందు వెలిగించనొక దీపము
ఆకలి తీర్చగ జీవుల కొఱకు
రూకలు రెండైన వెచ్చించెదను
దుఃఖము మాన్పగ దీనార్తులకు
చేయూత నందించి ఓదార్చెదను
మానవ సేవే మాధవ సేవ
సంతృప్తి నిచ్చేదె ముక్తికి త్రోవ
రాగం:తోడి
కోవెలలో ఉన్న దేవీ ఈవలకేల వచ్చెనో
ఈ భక్తుని కరుణించగా నా సేవలె నచ్చెనో
హరి మనోహరి సిరీ-శివకామిని శివానీ- వాణీ
1.ఏపూలమాలైన నే వేయలేదు
ఏ పూజసైతం నే చేయలేదు
స్తోత్రాల నైనా వల్లించలేదు
ఏ మొక్కులైనా చెల్లించలేదు
గుడిచేర్చినాను ముసలమ్మను
బడి చూపినాను పసి బాలకు
2.యజ్ఞాలు యాగాల ఊసైన లేదు
వేదాలు శాస్త్రా ధ్యాసైన లేదు
దానాలు ధర్మాల చేసింది లేదు
పుణ్యాలు పాపాల నెరిగింది లేదు
మా అమ్మ పాదాలు వదిలింది లేదు
మా నాన్న ఆజ్ఞల్ని మీరింది లేదు
Wednesday, June 26, 2019
OK
ఆ రెండు కళ్ళుచాలు నా గుండె ఆగడానికి
ఆ చిలిపినవ్వు చాలు ఎద తిరిగి మోగడానికి
సంపంగి నాసికే వేస్తుంది పూబాణాలు
సొట్ట బుగ్గ అందాలు తీస్తాయి నాప్రాణాలు
1.చూపు సుప్రభాతమై మేలుకొలుపుతుంది
పలుకు ప్రణయగీతమై మరులుగొలుపుతుంది
ఊహల్లో ఇంద్రధనసులే వెలయింప జేస్తుంది
స్వప్నాల్లో స్వర్గసీమలో విహరింపజేస్తుంది
2.సౌందర్య దేవతగా సాక్షాత్కరిస్తుంది
అపురూప భావనలే ఆవిష్కరిస్తుంది
జన్మకోశివరాత్రిగా బ్రతుకుమార్చి వేస్తుంది
రెప్పపాటులోనే మధురస్మృతిగ మారుతుంది
దర్శించనీ మము అన్నిటా
పసివారిలో బాల త్రిపుర సుందరిగా
ప్రౌఢకాంతలెవరైనా జగన్మాతగా
ఏ స్త్రీ రూపమైన మము కన్నతల్లిగా
ముగురమ్మల మూలపుటమ్మగా
1.అర్భకులముమేము -చంచల చిత్తులము
మోహావేశములో మృగయా ప్రవృత్తులము
చిత్తరువుకే మేము మత్తెక్కి తూలేము
కాసింత చనువిస్తే నెత్తినెక్కి సోలేము
హద్దుమీరునంతలోనే బుద్ధిచెప్పవే మాత
సద్బుద్ది మాకిచ్చి నిబద్ధతే నేర్పవమ్మా
2.బ్రతుకంతా మా పయనం భామలేక లేదమ్మా
పడతితోడు లేకమాకు ఏ పొద్దూ గడవదమ్మా
అమ్మా ఆలి అక్కాచెల్లీ కూతురుగా బంధాలన్నీ కలికితోనె
భార్యను మినహాయించి కామకాంక్ష త్రుంచవమ్మా
ధర్మరతిని దాటువేళ మగటిమి చిదిమేయవమ్మా
విచ్చలవిడి కాముకతకు తగినశాస్తి చేయవమ్మా
Tuesday, June 25, 2019
మనిషిగ పుట్టి మహిలోమనుట సవాలురా
అల్లాటప్పా కాదురా ఈశ్వరా పరమేశ్వరా
నీతీనియతీ లేని చోట బ్రతుకే నరకంరా
1.గరళం తాగి ఘనతే చాటా వనుకోకెప్పుడు
సరళం కాదుర కల్తీ మింగి బాల్చీ తన్నకుండుడు
గంగను తలపై పెట్టుకుంటే తపనంటేమిటొ తెలిసేనా
దప్పిక తీరక చుక్కనీటికై అలమటించడం ఎరుకౌనా
కైలాసాన్నే వీడరా భువికి విలాసం మార్చరా
పట్టుమని నువు పదినాళ్ళుంటే ఒట్టంటే ఒట్టేరా
2. పాములే నగలనుకొంటూ గొప్పలు చెప్పితే ఎట్టా
పసికూనలనే కాటువేసే విషనాగులు మాచుట్టా
భూతనాథుడవు నీవంటే నమ్మేదది ఎట్టా ఎట్టెట్టా
వావివరుసలు మరచిన కామ పిశాచాలు మాచుట్టా
ఉంటేగింటే నీ మహిమలనే చూపరా ఇకనైనా
కాల్చివేసే కన్నే ఉంటే అమానుషం మసిచేయరా
పలుకుల ఝరి నీలో ప్రవహింపజేయరా
మాటల తేనెల్లో మము ముంచివేయరా
బిడియము ఏలరా-తడబడనేలరా
తెలిసిన భాషలోనె తెగబడి భాషించరా
మనసులోని భావమంత సూటిగ సంధించరా
1.నిన్ను నీవు ఎన్నటికీ చులకన చేసుకోకు
పరులకన్న నీవెపుడూ అల్పుడవని అనుకోకు
అణగారి పోయింది నీలొ ఆత్మవిశ్వాసం
తట్టిలేప గలిగితే చేయగలవు సాహసం
న్యూనతాతత్వాన్ని నీనుండి తరిమికొట్టు
సంకల్పం గట్టిదైతే చేరగలవు తుదిమెట్టు
బేలవుకావురా ధీరుడవీవురా
మడమతిప్పకుండనీవు ముందుకె అడగేయరా
2.అలసటనే ఎరుగునా అల ఎన్నటికైనా
చెలియలికట్టనే అడ్డుగ కట్టినా
ప్రయత్నాన్ని విరమించక అంచనాలు మించదా
సునామిగా మారి గట్టు దాటక తా మానునా
ఆటంకం నీలోన పెంచాలి పట్టుదల
ఓటమి నీకెపుడూ నేర్పాలి మెళకువ
ఇటుకమీద ఇటుక పేర్చి కట్టాలి భవంతిని
ఓపికతో జట్టుకట్టి కొట్టాలి ఉట్టిని
ఘుమఘుమ వాసన-నీళ్ళూరగ రసన
బంగారు వన్నెతో అలరారు చుండగ
బండిని దాటిపోవ బ్రహ్మ కైన సాధ్యమా
1.శ్రేష్ఠమైన పచ్చిమిర్చి-రెండవకుండ చీల్చి
మధ్యలోన ఉప్పు వాము చింతపండు కూర్చి
చిక్కనైన శనగపిండిలొ ఒకే వైపు ముంచి
కాగిన నూనెలో కడాయిలోకి జార్చి
కాలీకాలకుండ జారమీద ఆరనిచ్చి
మరిగిన నూనెలో మరలా వేయించి
తరిగిన సన్ననైన ఉల్లిపాయల్ని చల్లి
గరం మీద కొరికితింటె నా సామి రంగా
చస్తేనేం తిన్నాకా ఉన్న ఫళంగా
2.వేడితో ఒకవైపు కారంతో మరోవైపు
సుర్రుసుర్రుమన నాల్కె హుషలుగొట్ట తింటుంటే
ముక్కునుండి కళ్ళనుండి గంగధార కడుతుంటే
ఎన్ని తిన్నామో తెలియనంత మైమరచి
పెదవి నుండి పెద్దప్రేగు చివరి వరకు మండినా
ఆపమెపుడు తినడాన్ని తనివి తీరునంతదాక
తెలుగువారికెంతగానొ ప్రియమీ చిరుతిండి
ప్రతిరోజూ తిన్నాగాని మొహంమొత్తబోదండి
మిర్చిబజ్జి తినని జన్మ నిజంగానె దండగండి
పడవే పల్లెలలోనా
పడవే మాకు ఆటవస్తువు కాగా
కాగితపు పడవే పిల్లకాల్వలో సాగా
1.జలజలరాలే చినుకుల్లోనా
బిలబిల పిల్లల పలుకుల్లోనా
వానావానా వల్లప్పా
చేతులుచాపే చెల్లెప్పా
గిరగిర తిరుగుతు గంతులు వేయ
తడితడి దుస్తుల నర్తన లాడ
2.వెలిసీవెలియని వర్షంలోనా
ఇసుక మేటల కుప్పల్లోనా
పాదము జొనిపి ఇసుకను కప్పి
పిచ్చుక గూళ్ళే ఒడుపుగ కట్టి
పుల్లలతోని ఎరలను కదిపి
ఆరుద్ర పురుగుల పెటెలొ పెట్టగ
Saturday, June 22, 2019
శ్రీనివాసా అని అర్థించగనే కలుగును సిరిసంపదలు
ఆపదమెక్కులవాడా అని తలవగనే అంతరించు ఇక్కట్లు
ఏడుకొండలవాడా అంటూ వేడగనే వీడును మదిచీకట్లు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా
1.బంగారు శిఖరాల అలరారు ఆలయం
భువిలోన వెలసిన అపర వైకుఠం
సప్తగిరులపై వెలసిన స్వామి చిద్విలాసం
దర్శించగ తరియించును మన జీవితం
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా
2.కోట్లమంది భక్తులకు స్వామి ఎడల విశ్వాసం
నిలువుదోపిడనునది భవబంధమోచనం
తలనీలాలీయగా సమసిపోవు అహంభావం
అడుగడుగు దండాలతొ జన్మ సాఫల్యం
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
గోవిందా హరి నమో నారాయణా
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని-
కళ్ళల్లో వత్తులేసుకొని
పగలంతా పనులు మానుకొని-
రేయంతా నిదుర వదులుకొని
చకోరి పక్షుల్లా వేచి చూసాము రామా
చాతక పక్షుల్లాగా తపన పడ్డాము రామా
ఇళ్ళూ వాకిళ్ళ ధ్యాస మరిచాము రామా
పద్నాలుగేళ్ళూ దారి కాచాము రామా
నువ్వింక వస్తావని-మా ఆర్తి తీర్చేవని
మారాజు వౌతావని-మమ్మేలుకొంటావి
రఘుకుల సోమా రామా కారుణ్య ధామా
దశరథ నందన రామా హే పట్టాభిరామా
అనుకున్న క్షణము వచ్చిందిగా
కల నిజమై ఎదుటే నిలిచిందిగా
స్వాగతమయ్యా సాకేత రామా
సుస్వాగతమయ్యా హే సార్వభౌమ
నీవేలేనీ రాజ్యం బీడై పోయింది
నీవేలేని నగరం అడివే అయ్యింది
కష్టాలు తీర్చేవాళ్ళు కరువాయెగా
కన్నీళ్ళు తడిచేవాళ్ళే లేరాయెగా
నువ్వొచ్చినావంటె మా బత్కులె పండేను
నువురాజ్యమేలితెమా కడుపులె నిండేను
విజేతవై నువ్వు వచ్చావయ్యా
అయ్యోధ్యపురికే వన్నె తెచ్చావయ్యా
సుగ్రీవునితో మైత్రి చేసావట
బలశాలివాలిని మట్టుబెట్టావట
మారుతినే బంటుగ చేసుకున్నావట
అంబుధికే వారధికట్టి దాటావట
సీతమ్మను చెఱనే బెట్టిన-
లంకేశుడు రావణున్ని
ఒక్క బాణంతో నేల కూల్చావట
శరణన్న విభీషణున్కి పట్టం కట్టావట
దండాలు నీకు కోదండ రామయ్యా
జేజేలు నీకివే మాజానకి రామయ్యా
నీ చూపు పడితేనే మేఘాలు మెరిసేను
నువ్వడుగు పెడితేనె వానల్లు కురిసేను
పంటలే పండేను గాదెలే నిండేను
ఊరూర ఇకపై ప్రతిరోజు పండగౌను
నీ గాధలే మాకు మార్గాన్ని చూపేను
మా బాధలింక మటుమాయమయ్యేను
ఇంటింట ప్రతి పూట నవ్వులే విరిసేను
ప్రతినోట రామ రామ రామయే పలికేను
వందన మిదిగో అందాల రామా
మావినతులందుకో నీలమేఘశ్యామ
https://youtu.be/S4hMSOIDkas?si=uTV1nbdyl1qaxwI0
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
ఏమౌతున్నది నాదేశం
జగతికి ఏమని సందేశం
హిందూ ముస్లిం సిక్కు ఇసాయి
లౌకిక తత్వమె మతమిట భాయి
భారతీయతే అభిమతమోయి
జై జవాన్ జై కిసాన్
జైవిజ్ఞాన్ జై అనుసంధాన్
1నేటికి సైతం నింగివైపు
ఆశగ చూసే భారతరైతు
జీవనదులు గంగాయమునలు
కాకూడదిక అంబుధి పాలు
నదులన్నీ మళ్ళాలి బీడు భూములలోకి
పండిన పంటచేరాలి హర్షంగా పెదాలపైకి
వర్షం ఎన్నడు రాయకూడదు
కృషీవలుని తలరాతలను
కంటతడే పెట్టక కర్షకుడికపై
కననేకూడదు కలచేకలను
2.నెత్తురుకూడ గడ్డకట్టే చలిలోను
కణకణమండే ఎండల్లో ఎడారిలోను
తుఫానువేళనైనా సాగరతీరంలోను
అడవులు కొండలు కోనలలోను
రేయీపగలు పహారా కాచే సైనికుడు
శత్రువుగుండెలొ నిద్రపోయే యోధుడు
వీరమరణంపొందినా లోటురావద్దు
తన భార్యాపిల్లలెపుడూ అనాధలుకావొద్దు
మననిశ్చింతకు జవాను త్యాగం మూలంమరవొద్దు
రోజొక రూపాయ్ వితరణ చేయగ వెనుకాడవద్దు
3.ఉన్నతవిద్యలు నేర్చాకా జాతికి వెన్నుపోటు వద్దు
పరదేశాల పౌరులగుటకై ఎవరూ మోజు పడవద్దు
తెలివితేటలు దేశ ప్రగతికై ధారపోయాలి
పరిశోధనలు ప్రావీణ్యతలు ఇటనే చూపాలి
విద్యా వైద్యం ప్రభుతచొరవతో ఉచితం కావాలి
తేరగ ఇచ్చే తాయిలాలిక రద్దుకావాలి
ఆదుకునేందుకు సర్కారే ముందుకురావాలి
ఉపాధి కల్పనతోనే ఉత్పాదక పెరగాలి
మన ద్రవ్యానికి ప్రపంచమంతా విలువీయాలి
భారతదేశం ఇలలోనే తొలిస్థానానికి ఎదగాలి
జగతికి ఏమని సందేశం
హిందూ ముస్లిం సిక్కు ఇసాయి
లౌకిక తత్వమె మతమిట భాయి
భారతీయతే అభిమతమోయి
జై జవాన్ జై కిసాన్
జైవిజ్ఞాన్ జై అనుసంధాన్
1నేటికి సైతం నింగివైపు
ఆశగ చూసే భారతరైతు
జీవనదులు గంగాయమునలు
కాకూడదిక అంబుధి పాలు
నదులన్నీ మళ్ళాలి బీడు భూములలోకి
పండిన పంటచేరాలి హర్షంగా పెదాలపైకి
వర్షం ఎన్నడు రాయకూడదు
కృషీవలుని తలరాతలను
కంటతడే పెట్టక కర్షకుడికపై
కననేకూడదు కలచేకలను
2.నెత్తురుకూడ గడ్డకట్టే చలిలోను
కణకణమండే ఎండల్లో ఎడారిలోను
తుఫానువేళనైనా సాగరతీరంలోను
అడవులు కొండలు కోనలలోను
రేయీపగలు పహారా కాచే సైనికుడు
శత్రువుగుండెలొ నిద్రపోయే యోధుడు
వీరమరణంపొందినా లోటురావద్దు
తన భార్యాపిల్లలెపుడూ అనాధలుకావొద్దు
మననిశ్చింతకు జవాను త్యాగం మూలంమరవొద్దు
రోజొక రూపాయ్ వితరణ చేయగ వెనుకాడవద్దు
3.ఉన్నతవిద్యలు నేర్చాకా జాతికి వెన్నుపోటు వద్దు
పరదేశాల పౌరులగుటకై ఎవరూ మోజు పడవద్దు
తెలివితేటలు దేశ ప్రగతికై ధారపోయాలి
పరిశోధనలు ప్రావీణ్యతలు ఇటనే చూపాలి
విద్యా వైద్యం ప్రభుతచొరవతో ఉచితం కావాలి
తేరగ ఇచ్చే తాయిలాలిక రద్దుకావాలి
ఆదుకునేందుకు సర్కారే ముందుకురావాలి
ఉపాధి కల్పనతోనే ఉత్పాదక పెరగాలి
మన ద్రవ్యానికి ప్రపంచమంతా విలువీయాలి
భారతదేశం ఇలలోనే తొలిస్థానానికి ఎదగాలి
రాగం:మధ్యమావతి
సంగీతం సంగీతం
సంగీతంతో మనిషి జీవితం
సంగీతంతో బ్రతుకు సార్థకం
సంగీతం సంగీతం
అణువణువున సంగీతం
అడుగడుగున సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం
1.సాగర ఘోషలొ సంగీతం
ఊపిరులూనగ సంగీతం
తొలకరి చినుకుల సంగీతం
లబ్ డబ్ ఎద లయ సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం
2.మేఘ గర్జన లొ సంగీతం
గాలి కదలికలొ సంగీతం
శకుంత కువకువ సంగీతం
సమ్మోహక పిక సంగీతం
సంగీతమే ప్రకృతి సాంతం
సంగీతమే సృష్టి స్థితి లయం
3.శిశు రోదనలో తొలిసంగీతం
లాలిపాటలో మధుర సంగీతం
కిరుకిరు ధ్వనులే తొట్లె సంగీతం
చిటపటమంటలె చితి సంగీతం
అణువణువున సంగీతం
అడుగడుగున సంగీతం
రాగం:చక్రవాకం
చంద్రమౌళీశ్వరీ రాజరాజేశ్వరీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము
1.నీ నయనాలలో కేదార క్షేత్రాలు
నీ దరహాసములొ భగీరథీ తీర్థాలు
నీసన్నిధిలో జన్మరాహిత్యాలూ
నీ సేవలే ఇల ఆనంద సూత్రాలు
హే త్రిపుర సుందరీ భువనైక మోహినీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము
2.బ్రహ్మాది దేవతలు నీ భృత్యులే తల్లీ
ఏడేడు లోకాల సామ్రాజ్ఞి నీవె జనని
సృష్టిస్థితి లయలు నీమాయలే
అంతఃకరణాలు నీ ఆజ్ఞలోనే
శ్రీచక్ర రూపిణి మణిద్వీపవాసినీ
మాతా శ్రీకరి శ్రీ లలితేశ్వరి
నీపాద పద్మాల భ్రమరమై మననిమ్ము
నీ చరణ మంజీరమై మ్రోగనిమ్ము
రాగం:సింధుభైరవి
నటరాజా శంభో నగజా విభో
తాండవ కేళీ లోలా లయకారా ప్రభో
తెరవాలీ మూడో కన్ను కలపాలీ మన్నూ మిన్నూ
మ్రోగాలీ ఢమఢమఢమఢమ ఢమరూ
సాగాలీ ధిమిధిమి నీ నర్తిత పదములూ
1.ఊపిరినే శృతి చేసెను ప్రకృతి
ఎద స్పందన లయ కూర్చితివా పశుపతి
జీవనాదమొనరించి ఇచ్చితివీ మానవాకృతి
తపించి తరించగ జన్మరాహితి
వచ్చిన సంగతి మరచి నీచకర్మలాచరించి
భ్రష్టులమైతిమి పతనగతిని చరించి
2.ఉత్కృష్టమైనది ఈ మానుష జన్మము
ఉన్నతమైనది మనిషి మనిషి బంధము
సృష్టికార్యమన్నది అతి పవిత్రమైనది
వావివరుస వయసు మరచి నికృష్టమైనది
నీవె ఇక దిగివచ్చి మాకు నియతి నేరుపు
మారని మనుజులను నీవె మంటగలుపు
రాగం:చంద్రకౌఁశ్
చిద్విలాసా తిరువేంకటేశా
అర్ధనిమీలితనేత్రా నిజ శ్రీనివాసా
శిలాసదృశా సర్వేశా
భక్త పోష బిరుదాంకిత సప్తగిరీశా
నటనలు చాలించి మము పాలించరా
దుర్ఘటనలు వారించి దృష్టి సారించరా
1.నిన్ను నమ్ముకుంటే నట్టేట ముంచుదువా
నీవే శరణనన్ననూ స్వామీ మిన్నకుందువా
ప్రహ్లాదుని కోసము నరహరివై వెలిశావట
ధృవుడిని సైతము ఆదరించినావట
ప్రకటితమవ్వాలి ఇపుడే నీమహిమలు
లోకానికి చూపాలి నీ అద్భుత లీలలు
2.ఎలుగెత్తి పిలిచిందని బ్రోచితివా కరిరాజును
దుఃఖితయై ప్రార్థించగ కాచితివా పాంచాలిని
నిన్నేమి కోరనని కొరవితొ మంట పెట్టితివా
నీ కొండకు రానని గుండెను మండిచితివా
పరమదయాళా తాళను మన్నించరా
దండించినదిక చాలు దయగన జాగేలరా
రాగం:సరస్వతి
గజాననా నగజానందనా
నిజముగ నిను నమ్మితిని
రుజలను మాన్పరా స్వస్థత కూర్చరా
లంబోదరా పాశాంకుశ ధరా
చిత్తము శీఘ్రమే కట్టడి సేయరా క్రమతను నడపరా
1.తలపులొ వాక్కులో సతతము నిను నిలిపెద
ప్రతి పనియందును తొలుతగ నిను మ్రొక్కెద
నిద్దురలో మెలకువలో నిన్నే స్మరియించెద
సత్వరమే వరమీయగ నిను ప్రార్థించెద
ఏకదంతా మూషకాసుర నుతా
నమోవాకమిదిగో మోదకామోదకా
2.తొందరపాటుతో పొరబడనీయకుమా
లౌక్యము నాకు గఱపి నన్నుద్ధరించుమా
అహంభావమంత నాలొ అంతరింపజేయుమా
కడతేరు వరకునూ ఆరోగ్యమునీయుమా
వక్రతుండా నీవే నాకు అండదండ
ప్రణవాత్మజ నీకిదే ప్రణుతుల పూదండ
Wednesday, June 19, 2019
అక్కున జేర్చవే గ్రక్కున బ్రోవవే
ముక్కెర దాల్చిన తల్లి
చక్కెర పల్కుల పాలవెల్లి
చక్కని మాయమ్మ చదువులమ్మా
వక్కాణించవె వరములు వాక్కాంతమ్మా
1.నిక్కము చూడగా మిక్కిలి నాతప్పులు
లెక్కలు వేయగా దుఃఖమె కద దక్కెనూ
మొక్కెదనమ్మా చెల్లించగ నా మొక్కులు
తక్కించకు నన్నికపై తనయునిగా లెఖ్ఖించి
చక్కని మాయమ్మ చదువులమ్మా
వక్కాణించవె వరములు వాక్కాంతమ్మా
2.ఒక్క నిమిషమైన నన్ను పక్కన పెట్టకు
నా తిక్క తగ్గించగ నీవె నాకు ఇక దిక్కు
మొక్కలాగె ఉన్నాను ఎదగని నను వృక్షంగా
తక్షణమే దరిజేర్చు మోక్షమె నా లక్ష్యంగా
చక్కని మాయమ్మ చదువులమ్మా
వక్కాణించవె వరములు వాక్కాంతమ్మా
Monday, June 17, 2019
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:ఖరహరప్రియ
ఏడు స్వరములు ఏబదియారు అక్షరములు
ఎదలో భావాలు వేనవేలు-గీతాలై ఇల జాలువారు
1.అనుభూతి మెదులు -సరిగమలు వెలయగ
పదములు కదులు- పదనిసల దెసగా
తనువే ఊగు లయ కలయగా
తన్మయముగ సాగు పాటే తేనెల ఊటగా
2.చతురత మీరగ జంత్రవాద్యములు
నిపుణత తోడుగ జతులు గతులు
గళమున గంగా యమునలు పొంగగ
మనోధర్మ సరస్వతి మధుర సంగమ కృతి
రాగం:హంసనాదం
చైతన్యము నీవే-నా ఊపిరి కావే
నవనాడుల క్రియాశీల జీవకణము కావే
జపమాలా కరధారిణి-జయతు శారదామణీ
1.యోచన జనియించనీ-కార్యరూపు దాల్చనీ
సత్కర్మలననుష్ఠింప-జనతతి నుతియించు రీతి
ప్రయోజనము తక్షణమే సిద్ధించనీ-
ప్రమోదమే ఈప్సితమై వర్షించనీ
పుస్తక హస్త భూషిణీ-జయతు శారదామణీ
2.పంచజ్ఞానేంద్రియములు-నీకై తపియించనీ
పంచకర్మేంద్రయములు-నీ దిశగా సాగనీ
త్రికరణ శుద్ధిగా నా బుద్ది మెదలనీ-
త్రిగుణాతీతముగా నన్ను కదలనీ
జాగృతనాద వీణాపాణీ-జయతు శారదామణీ
Saturday, June 15, 2019
ఏక్షణం వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేస్కో
1.అప్పుడు మనతో ఉన్నవాళ్ళే ఆప్తులు
తప్పులన్ని సరిదిద్దే వాళ్ళే దోస్తులు
ఎప్పటికీ సప్పోర్ట్ చేస్తూ సాగేదే ఫ్రెండ్ షిప్
మామా,బావా,చిచ్చా,భయ్యా అనే పిలుపు
ఏర్పరుస్తుంది పక్కా రిలేషన్ షిప్
2.పడినా లేస్తూ పరుగెత్తాలి కాన్ఫిడెన్స్ తో
ఓటమి గెలుపులు కామనేగా స్పోర్ట్స్ మీట్ లో
క్రీడాస్ఫూర్తిని మాత్రమే నువు ఆప్ట్ చేసుకో
జిందగీహై పల్ పల్ జీనా పల్ పల్ మర్నా
హెల్పింగ్ నేచర్ పాలసీ నువ్వడాప్ట్ చేస్కో
చెలి నవ్వులే హరివిల్లులు
చెలి చూపులో వెన్నెల జల్లులు
తొలి ప్రేమ గురుతులు ప్రియురాలి తలపులు
యాదికొస్తేనె మదికెంత పులకింతలు
గుడిమెట్లమీద నది గట్టుకాడ
కాపు కాసి చూసేటి ఆ దొంగ చూపులు
అలనాటి స్మృతులు చిననాటి చేష్టలు
గుర్తుకొస్తేనె కన్నుల్లొ చెమరింతలు
తొలి ప్రేమ గురుతులు ప్రియురాలి తలపులు
యాదికొస్తేనె మదికెంత పులకింతలు
తెల్లారిమసకల్లొ ముగ్గేయచూడగ
తెల్లార్లు నావింత కలవరింతలు
నా మూగ ప్రేమ నా మౌన భాష
ఎదవిప్పజాగైన నా చింతలు
తొలి ప్రేమ గురుతులు ప్రియురాలి తలపులు
యాదికొస్తేనె మదికెంత పులకింతలు
బడివదిలినపుడో నడివీథిలోనో
వెనువెంట నడిచే ఆ వెంబడింతలు
అవి స్వప్నలోకాలు చెలి జ్ఞాపకాలు
భగ్న ప్రేమైతెనేమి మధురక్షణాలు
తొలి ప్రేమ గురుతులు ప్రియురాలి తలపులు
యాదికొస్తేనె మదికెంత పులకింతలు
వారానికి ఒకమారైనా సాయికోవెలకు వెళ్ళే వారం
సాయికి పంచ హారతులు మనసారా ఇచ్చేవారం
సాయి పల్లకీ మోసేవారం సాయి భజనలు చేసేవారం
ఓంసాయి శ్రీసాయిజయజయ సాయి
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
1.సుప్రభాతముతొ సాయిని లేపి
పాలతొ సాయిని అభిషేకించి
షాలువ సాయికి మేనున చుట్టి
విభూతిగంధము తిలకము దిద్ది
మెడలో పూలమాలలు వేసి
ధూపము దీపము వెలిగించి
నైవేద్యము సాయికి నివేదించి
నీరాజనమే సాయికి ఇచ్చి
మంత్రపుష్పమే భక్తిగ చదివి
ధునిలోభస్మము నుదుటను దాల్చి
తీర్థప్రసాదము స్వీకరింతుము
2.సాయి ఎదుటన ఆసీనులమై
మదిలోసాయిని పదిలపర్చుకొని
బాధలనన్ని పోగొట్టమని
సంపదలెన్నో సమకూర్చమని
ఆపదలోన ఆదుకొమ్మని
విద్యాబుద్దులు నేర్పించమని
మిద్దెలు మేడలు ఇవ్వమని
పదవులు బిరుదులు ఆశించి
సాయిని వేడుదమని ఎంచి
ధ్యానములోనా మైమరచి
సాయినామమే జపియించెదము
Friday, June 14, 2019
దుఃఖమెలా తీరుతుంది అగచాట్లే ఆగకుంటే
మిణుకుమిణుకుమనే ఆశను విధి చిదిమేస్తుంటే
ఏల్నాటి శని పగబూని బ్రతుకును కబళిస్తుంటే
1.దురదృష్టం త్వరపడి తానే అడ్డుపుల్లలేస్తుంటే
అడుగులోన అడుగేవేసి పదిలంగానే నడుస్తుంటే
వైకుంఠ పాళిలో పాములన్ని కాటేస్తుంటే
జీవితచదరంగంలోనా చుట్టుముట్టి చంపేస్తుంటే
దినం ఎలాసాగుతుంది బలిచేస్తుంటే
2.సంసార సాగరంలో బిగబట్టి ఈదుతుంటె
దారితెన్ను కానరాక చీకట్లు ముసురుతుంటే
దిక్కుతోచకుండా తుఫానులో చిక్కుకుంటే
ఇంతచాలదన్నట్టు తిమింగలం మింగబోతే
భవిత ఎలా ఉంటుంది బడుగుజీవికి
Tuesday, June 11, 2019
నీ వీణానాదములో మేధ పెంచుకొన్నాము
ఎందులకమ్మా మాలో ఈ వికృత తత్వాలు
అపశృతులేలమ్మా చెలరేగ పైశాచికత్వాలు
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి
1.మారదేమొ నుదుటిరాత మంచిగ రాయొచ్చు కదా
సత్కర్మలు చేయునట్లు నాడేసరి దిద్దొచ్చు కదా
తల్లివని నమ్మితిమి మా ఆలనచూడవే
కల్పవల్లివని వేడితిమి సన్మార్గము నడపవే
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి
2.యాచించకుండా బ్రతుకు సాగనీయవే
వంచించకుండా మాకు బుద్దిగరపవే
చదువు సంస్కారమిచ్చి మము తీర్చిదిద్దవే
అనుబంధం ఆత్మీయత మాఎదలో నాటవే
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి
తొలకరి జల్లుల పులకరమీవు
వల్లకాడులో బూడిదనేను
మృతినే తరిమే అమృతమీవు
నన్ను చిగురింప జేయవే
నాకు మరుజన్మ నీయవే
1.వసంతాలు వాకిట్లో ఆటలాడె నాడు
ప్రభాతాలు చీకట్లకు తావీయలేదపుడు
నరదృష్టే తాకిందో-నా విధి వక్రించిందో
పేకమేడలాగా కూలిపోయె జీవితం
శిథిమైన కోవెలలా మిగిలిపోయె నాగతం
2.అనురాగ చదరంగంలో పావునై పోయాను
చెలి ప్రేమ నాటకంలో అతిథి పాత్రనైనాను
ఎందుకు మురిపించిందో-ఎందుకు వంచించిందో
బిచ్చగాడినైనాను బ్రతుకు ధారపోసి
పిచ్చివాడినైనాను భవితను బలిచేసి
Friday, June 7, 2019
నయనాలు మూసుకొన్నావో
నామాల్లో దాచుకొన్నావో
దారుణాలే చూడలేక -కారణాలే చూపలేక
శ్రీవేంకటేశ శ్రీశా- చిద్విలాస భవ్యవేషా
1.జగమంత నీదు మాయే-జనులంత బొమ్మలాయే
ఈ కుటిల నటనలేల-ఈ జటిల బ్రతుకులేల
తెఱదించవేల ఈవేళ-పట్టించుకోవ మాగోల
శ్రీవేంకటేశ శ్రీశా- చిద్విలాస భవ్యవేషా
2.నియమాలు నీకు లేవు-తర్కాలు పనికిరావు
నీగెలుపు కొరకె నీవు -తొండి నీ ఆడుతావు
పితలాటకాల క్రీడ-సరదాయే నీకు ఆడ
శ్రీవేంకటేశ శ్రీశా- చిద్విలాస భవ్యవేషా
Thursday, June 6, 2019
Friday, May 31, 2019
మాయదారి మధువు నీవు మానవా
సారా రక్కసి లిక్కరింక మానవా
మేలుకోరి చెబుతున్న వినవా
మేలైన విధమే కనవా
పూబాటను బట్టి సాగుమా
ముద్దుల్లోన ముంచురా
కౌగిట మురిపించురా
మగువను మించి మత్తు లేదురా గమ్మతులేదురా
1.ఇప్పసార తాగుతూ వీధికెక్కబోకురా
ఫుల్లేసి కక్కబోకురా
తాటికల్లు తాగుతూ తగువెట్టుకోకురా
ఒళ్ళుమర్చి దొర్లకురా
విస్కీబీరు రమ్ము జిన్నూ లివరుకు ముప్పురా
వోడ్కా బ్రాందీ స్కాచ్ వైన్ ఏదైన విషమేనురా
మాన మరియాదలన్ని మంటగలుసురా
ఇల్లు ఒళ్ళు గుల్లయీ చిత్తు చిత్తౌదువురా
కల్లుమానకుంటే చింతా సంక్షోభము
కళ్ళుతెరుచుకుంటేనే అంతా సంక్షేమము
2.సంకలో పెట్టుకొని లోకమంత వెతుకకు
ఇంటనే ఉంది కిక్కు నిచ్చే ఇల్లాలు
మచ్చిక చేసుకొని ముద్దుముచ్చటలాడుకో
ఉండనే ఉండవు సరసాలకెల్లలు
దేశాలైనా ఏలేనేతలు ఆలికి మాత్రం బానిసలే
యుద్ధాలైనా గెలిచే రారాజులు రాణికి రేయంతా దాసులే
ప్రేమను పంచరా నీ భామనింక అనునయించరా
తరుణి తనువు హాయిపలుకు వీణరా వాయించరా
ఆలినే బూతులు తిట్టు రాతిరంత బాధలు వెట్టు దాసన్నా దేవదాసన్నా
ఒళ్ళు గుల్లచేసుకొని ఇల్లు వీథికీడ్చుకొని మర్యాదమంటగలుపకోరన్నా
పెళ్ళాం పుస్తె గుంజుకొని లిక్కర్లొ నంజుకొని కంటతడివెట్టనిత్తువేలన్నా
1.సొంతడబ్బు పెట్టిమరీ తాగుబోతుగామార్చి వింతగా నవ్వుతుంది లోకం
చుక్కదిగకుంటేను అప్పుపుట్టకుంటేను ఎక్కివస్తుంది నీకు శోకం
కల్లు సారా బీరు రమ్ము ఒక్కటే లివరుకింక ముప్పన్నది దక్కుటే
విస్కీ జిన్ను వోడ్కా బ్రాందీ స్కాచ్ లు-నిషా గొలిపి చంపే విషాలు
2. ప్రేమపంచుతుంది ప్రాణమైన ఇస్తుంది మనసుపెట్టి చూస్తే ఇల్లాలు
తనకడుపు మాడ్చుకొని కోడికూరపెడుతుంది అమ్మలా సాకుతుంది మగనాలు
మగువే గమ్మత్తురా తనతనువే మత్తురా మరిగితె వదలవా మధురాలు
ముద్దుల్లొ ముంచురా కౌగిట బిగియించురా వశమైతే దొరుతాయి స్వర్గాలు
Thursday, May 30, 2019
వామస్థిత పార్వతీ సంయుతం
గంగాధరం గణనాథస్య సహితం
మాతాంకాసీన స్వామినాథ సేవితం
వృషభాది వాహన సమాయుతం
కైలాస పురపతిం భజామ్యహం సతతం॥
ఈశ్వరం గంగాధరమ్
గౌరీమనోహరమ్
గుహగణనాథయోః ప్రియకరమ్
మయూర మూషక మృగనందీ
పరివారమ్
వందే శంకరం భవపాపహరమ్ ॥
సుముఖ షణ్ముఖయోః జనక గంగాగౌరీ నాయక
శశి భూషణ నాగాభరణ నీలకంఠ త్రినయన
వృషభ మూషిక కేసరి మయూర పరివేష్ఠిత
శూల ఢమరు ధర నటరాజ భక్తవశంకర
దయాసాగర పురహర నమస్తే రామలింగేశ్వరా॥
మా దుస్థితి కనలేవా-మా ఎదలో మనలేవా
రామనామ భజనతో-నిను మెప్పించెదను
సీతమ్మకు విన్నవించి-నిను ఒప్పించెదను
జయజయహే పవనసుతా-నమోస్తు శ్రీ రామదూత
1.ఈ కలి యుగమందున ప్రత్యక్షదైవమీవు
ఇడుములనెడబాపుటకై కంకణబద్ధుడవు
కోరినదొసగుటలో పరమేశ్వర సముడవు
కొండగట్టులోన హరిహరిగా నెలకొన్నావు
జయజయహే పవనసుతా-నమోస్తు శ్రీ రామదూత
2.నీవు తలచుకొంటే నిమిషమేచాలు
కనుమరుగైపోతాయి కష్టాలు కన్నీళ్ళు
నీ అండమాకుంటే నిశ్చింత జీవితాలు
మనసారా నమ్మినాము వదలము నీచరణాలు
జయజయహే పవనసుతా-నమోస్తు శ్రీ రామదూత
గొంతువిప్పితే చైత్రగీతం
నీతో ఉన్న సమయం పరుగుల జలపాతం
నీ విరహంలో ప్రతిక్షణం నిప్పుల సుడిగుండం
1.ముట్టుకోబోతే ముడుచుకుంటావు అత్తిపత్తిలాగా
పట్టుకోబోతే జారిపోతావు మంచుముక్కలాగా
అంతలోనే చేతికందే చందమామవౌతావు
వింతగానే నవ్వులవెన్నెల రువ్వుతుంటావు
ఊరిస్తావు ఉడికిస్తావు పిచ్చివాడిగ మారుస్తావు
నీతో ఊహసైతం నిజమగు స్వర్గలోకం
నీ తలపులలో అనుక్షణం ఆనందనందనం
2.నేను శ్వాసించే ప్రాణవాయువై బ్రతికిస్తావు
నేను ప్రేమించే హృదయరాణివై అలరిస్తావు
వద్దంటూనే వారిస్తూనే నా వద్దకొస్తావు
ఆకాశంలో మెరుపల్లే నువు మాయమౌతావు
ఆశలు రేపి బాసలు చేసి నన్నే నమ్మిస్తావు
వదులుకోలేని వజ్రం నువ్వే నా చెలీ
సత్యంకాని స్వప్నం నువ్వే నా సఖీ
తీర్చడానికిప్పటికీ నీకు తీరిక లేదు
నువ్వుత్త గారడోడివి-నువ్వొట్టి మాయగాడివి
సాయి నువ్వు గరీబా-బాబా నీ కింతటి డాబా
1.షిర్డీ దర్శించినా దుఃఖము హరియించలేదు
సిరిసంపదల ఊసు అసలే ఎత్తలేదు
మము రక్షింతువన్న మాటనీటి మూటాయే
త్రికరణశుద్ధిగా శరణన్నా వినవాయే
కాలహరణమే గాని కరుణించక పోతివి
సమాధిమీదనీవు కొలువైన ఒక రాతివి
2.గుడ్డిగా నిను నమ్మితిమి దృష్టిని సారించవేమి
మా భారము నీదంటిమి ఇంతటి తాత్సారమేమి
పరిపరివిధముల నిను ప్రార్థనైతె జేసితిమి
నీగుడి మెట్లన్నీ ఎక్కిఎక్కి అలసితిమి
నీ ఉనికిని చాటుకొనగ నీదే ఇక తరువాయి
నీ పటమైనా పలుకునన్న నీవాక్కును నిజం చేయి
అనంగ నాశినమ్
జంగమ వేషినమ్
అంతరంగ వాసినమ్
వందే శశిధారిణమ్
వందే వృషవాహినమ్
1.అర్ధనారీశ్వరమ్
అవ్యయ గంగాధరమ్
మృగచర్మ ధారిణమ్
భవతాప హారిణమ్
వందే నటేశ్వరమ్
వందే జటాధరమ్
2.త్రినేత్ర శోభినమ్
త్రిశూల పాణినమ్
త్రిలోక పూజితమ్
త్రిగుణాతీత్మకమ్
వందే పంచాననమ్
వందే ప్రమధాధిపమ్
3.పత్నిసుతవిరాజ భోగినమ్
నిత్య సత్య విరాగ యోగినమ్
గణనాథ గుహనాథ పితరమ్
అభిషేకప్రియం నిరంతరమ్
వందే నీలకంఠమ్
వందే కాలకాలమ్
శ్వేతాంబరధారీ-మాతా కృపాకరీ
వీణామృదునాద ప్రియకరి శుభంకరీ
మందస్మితవదనారవింద వాగీశ్వరీ
వినుతింతు సదా నీ కృతులనే
విన్నవింతు నెరవేర్చ నా వితులనే
1.తలపుల నువు నిలిచి-మరపుని తరమనీ
గళమును నువు మలచి-మార్ధవమే కురవనీ
నా ఎదలో సుస్థిరపడి-అజ్ఞానము వెరవనీ
నన్ను నేను తెలుసుకొనగ-నా బ్రతుకే మురవనీ
నా జన్మ ముగియనీ
2.సంగీత సాహితీ గంగలు నను ముంచనీ
వాదనలో వాదములో కుశలత మరి మించనీ
మాధుర్యము ఔదార్యము జగతికి నను పంచనీ
విద్యలకే శ్రీ విద్యవు-నీ ఎరుక నాలొ దీపించనీ
అహమును వంచనీ
Monday, May 20, 2019
నీ పదముల రేణువు నేను
నా పదముల ప్రాణము నీవు
బాసరలో భాసిల్లే భగవతి
స్థిరపరచవే సంస్థితవై నామతి
భారతీ దయా జలధీ
నా ప్రతి గీతీ నీ అభినుతి
1.నా పలుకునకర్థము నీవే
నావాక్కున చక్కెర కావే
అక్కరముల అక్కెర ప్రియమై
చక్కని చిక్కని భావన నీవే
వాగీశ్వరీ కరుణా ఝరీ
నా జిహ్వ నీకవని కవనవని
2.నా గళమే కర్ణకఠోరం
చేయవె సత్వరమే మృదుమధురం
శ్రవణపేయమై శ్రావ్యగాత్రమై
దయసేయవె హృదయనాదం
సంగీత సామ్రాజ్ఞి కృపావర్షిణి
కలవాణి నా కలల ఫలదాయిని
మళ్ళీ బ్రతికొచ్చావని ఏసని భావించనా
ఫకీరులా గడిపావని మహ్మద్ వని ఎంచనా
పూజలు గొన్నావని ఈశుడవని సేవించనా
సాయీ నీ తత్వమె చిత్రమోయి
సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-
సచ్చిదానందరూప సద్గురు సాయి
1.రోగాలను విభూతితో మాన్పే వైద్యుడవు
శోకాలను అనునయముతొ తీర్చే హితుడవు
జీవిత సత్యాలను బోధించే గురుడవు
భవజలధిని అవలీలగ దాటించే సరంగువు
సాయీ నీ తత్వమె చిత్రమోయి-సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-సచ్చిదానందరూప సద్గురు సాయి
2.బంధాలు లేకున్నా మాకు బంధువైనావు
రాగద్వేష రహితుడవైనా మోహవశుడవైనావు
మాలోన ఒకడవుగా షిరిడీలో మసలినావు
మానవతను ఎరుక పరచి దైవమై నిలిచావు
సాయీ నీ తత్వమె చిత్రమోయి
సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-
సచ్చిదానందరూప సద్గురు సాయి
రూపము గనినంత చూపరులకు భీకరము
చల్లనైన నీదృక్కులు సర్వదా శ్రీకరము
నీ దర్శన భాగ్యమే ఆనందకరము
భవభయ హారకము నీ అభయకరము
ధర్మపురీ నరహరీ నీకు వందనాలయా
మము దయజూడగ శ్రీ చందనాలయా
1.వైశాఖ శుద్ధ చతుర్ధశీ రోజున
గోధూళివేళ స్తంభమునందున
నీ శ్రీ హరిఏడీ ఢింబకా చూపుమని
హిరణ్యకశ్యపుడు గద్దించినంతనే
సర్వాంతర్యామివని చాటిచెప్పడానికి
ఉద్భవించినావు ప్రహ్లాదుని మొరవిని
2.శిరమేమో కేసరిగా నరశరీరధారిగా
ద్వారమే పీఠముగా ఆసీనుడవయ్యి
భీషణ దంష్ట్రలు వాడియౌ నఖములతో
ఊరువుల పైనా ఒక ఉదుటున వేసుకొని
ఉగ్ర నారసింహుడవై ఉదరమే చీల్చివేసి
దితి సుతుని హతమార్చి నీ భక్తుని బ్రోచితివి
3.గోదావరి తీరమున ధర్మపురీ క్షేత్రమున
శ్రీ లక్ష్మీ సహ యోగ నరసింహమూర్తిగా
వెలసినావు స్వామి నీ మహిమలు జూపగా
మలచినావు స్వామీ మా బ్రతుకులు నీవిగా
శేషప్పవరదుడవై శతకము రాయించితివి
రాఖీప్రియ సఖుడవై సతతము నువు కాచితివి
చలనం లేని శిలవైనావు
స్పందన ఎరుగని ఎదవైనావు
ఉలులెన్ని విరిగాయో నిను చెక్కలేక
కలలెన్ని కరిగాయో నువు కానరాక
1.అమావాశ్య బ్రతుకే నాది
తెల్లారని రేయి నాది
వేగుచుక్కలాగా తట్టిలేపుతావు
మలయమారుతానివై చుట్టుముట్టుతావు
ఎంతకూ పొద్దుపొడవదు
వింతగా లిప్తగడవదు
తూర్పు తలుపు తెరవకనే దినం గడచును
మేలుకొలుపు తెలియకనే నిద్ర కమ్మును
2.పరిచయాలె సరిగమలై
స్నేహితాలె పికగీతాలై
జీవితాన సంగీతం జలపాతమవ్వాలి
అనుభూతుల సుమగంధాలే విరజిమ్మాలి
నీచర్యలు చిత్రమైనవి
నీ చేష్టలు ఆత్రమైనవి
తప్పుకపోతుంటే నన్ను సెలుకుతుంటావు
ముట్టుకోబోతుంటే నువు ముడుచుకుంటావు
నీ కాలిమువ్వనౌతా నే కాలి కాటుకనౌతా
నీ మోవినవ్వునౌతా నీ గుండె గువ్వనౌతా
నా హృదయ రాణీ నీ ఇంటి దివ్వె నౌతా
నా ప్రణయ దేవీ నీ పూజ పువ్వునౌతా
1.క్రీగంటి చూపుకే నేను పడిపోయాను
నీవొంటి స్పర్శకే వివశుడిని అయ్యాను
సోయగాలు తిలకిస్తూ నే సోలిపోయాను
నీ హొయలుకే తరిస్తూ మైమరచిపోయాను
అతిలోక సుందరీ బానిసగా మార్చావే
శతపుష్ప మంజరీ దాసునిగ జేసావే
2.నీ వాలు జడలోనా మిన్నాగు నాట్యాలు
నీకొంగుముడిలోనా భూలోక స్వర్గాలు
నీ నడుము వంపుల్లో ఇసుక మైదానాలు
నీ అడుగుజాడల్లో నవపారిజాతాలు
రసరమ్య వాహినీ మాయలేవొ చేసావు
జగదేక మోహిని మత్తులోన ముంచావు
తీరదు ఋణము నను గన్న మా అమ్మది
తీరదు ఋణము నడిపించు మాయ'మ్మది
కడుపు చించి జన్మనిచ్చినందుకు
కడలి దాటించి దరిచేర్చునందుకు
1.స్తన్యమిచ్చి నా బొజ్జనింపింది
కంటికి రెప్పలా ననుకాచింది
తననోరుకట్టుకొని కోరినదిచ్చింది
కథలుచెప్పి జోలపాడి
నన్ను నిదురపుచ్చింది
నిస్వార్థపు సేవచేసి
ప్రేమగా పెంచింది
తనకుతాను మొత్తంగా
నాకే బ్రతుకు పంచింది
2.స్థిరమైన చిత్తముతో
చిత్ర పటము చూడలేదు
ఏకాగ్ర దృక్కులతో
తల్లి ప్రతిమ దాల్చలేదు
స్తోత్రాలు మంత్రాలతొ
అంబనుపూజించలేదు
మనసుపెట్టి ఎన్నడు
మాతను ధ్యానించలేదు
ఎందుకో జగజ్జననికి నాపై అనురాగం
ఏ పుణ్య విశేషమో
కవిగాయక ఘనయోగం
Sunday, May 19, 2019
చెప్పకుంటె గుండె పోటు
మానవత అనాధగా తిరుగుతోంది
మాయువత మత్తులో జోగుతోంది
నా దేశ ప్రగతి ఆకాశవీథిలో
నా దేశ సంస్కృతి నడివీథిలో
1.ఎన్నికలే కల్లోలం నా ప్రజా స్వామ్యంలో
అధికారమె ప్రాథమ్యం రాజకీయమైకంలో
వ్యక్తిత్వం ఆత్మహత్య చేసుకుంటుంది
సిద్ధాంతం పట్టపగలు హత్యచేయ బడుతుంది
నా దేశ రాజ్యాంగం ఆదర్శప్రాయము
నా దేశ స్వాతంత్ర్యం అనిర్వచనీయము
2.నగ్నత్వం నగ్నంగా నాట్యమాడుతుంది
మృగత్వం పసికూనలననుభవిస్తుంటుంది
విలువల వలువలిచట చిరుగుల పేలికలు
కన్నవారి బంధాల్లో కాముకతల కతలు
నా దేశం ఉమ్మడి కుటుంబాలకాలవాలం
నా దేశం చిత్తకార్తి కుక్కల వ్యవహారం
3.విద్య భారతావనిలో చుక్కలుచూపెడుతోంది
మార్కులవేటలో మూర్ఖంగా నలుగుతోంది
వైద్యం విధిని విడిచి డబ్బులెక్క పెడుతోంది
నైపుణ్యం విదేశాల వెర్రిలో ఎదుగుతోంది
నా దేశం మేధావుల ఖజానా
నా దేశం స్వార్థానికి నమూనా
Wednesday, May 15, 2019
ద్వయరూపా దనుజారి నరకేసరి
జగతిలోన లేరెవరూ నీకు సరి
దుర్జన నిర్మూలన కంకణధారి
ధర్మపురి సంస్థిత హే చక్రధారి
కరములు మోడిచి శరణంటిమి స్వామి
కనికరమును జూపగ చరణాల వాలితిమి
1.ఉగ్ర యోగ రూపాలతొ వెలసినావు
అనుగ్రహము మాపైన కొనియున్నావు
నిత్యపూజలెన్నో అందుకొనుచున్నావు
నిరతము భక్తజనుల కాచుచున్నావు
కరములు మోడిచి శరణంటిమి స్వామి
కనికరమును జూపగ చరణాల వాలితిమి
2.జయంతోత్సవమును జయతుగ జరిపేము
చందనోత్సవమును కనువిందుగ చేసేము
డోలోత్సవాలు సంబరాలె ఏటేటా
వసంతోత్సవాలు ఆనందాలు మాకంట
కరములు మోడిచి శరణంటిమి స్వామి
కనికరమును జూపగ చరణాల వాలితిమి
Sunday, May 12, 2019
జగతిని జనతతి నేలెడి జగదోద్ధారిణీ
జిజ్ఞాస కారిణి జన్మరాహిత్యదాయిని
జ్ఞాన సరస్వతి మాతా పరవిద్యా వరదాయిని ప్రణమామ్యహం
1.వాగ్గేయకార వాంఛిత పలదాయిని
సంగీతామృతధారా వర్షిణి
శృతి లయ భావ విస్తృత సంచారిణి
వీణాగాన వినోదిని మందస్మిత హాసిని
జ్ఞాన సరస్వతి మాతా పరవిద్యా వరదాయిని ప్రణమామ్యహం
2.సప్త చక్ర పరివేష్ఠిని యోగిని
సప్త స్వర విహారిణి రాగిణి
సప్తతాళ ఘోషణి ప్రణవరూపిణి
సప్త ఋషి సేవిని పారాయణి
జ్ఞాన సరస్వతి మాతా పరవిద్యా వరదాయిని ప్రణమామ్యహం
నా కంటినుండి దుముకా-వింత పోరాటం
నా గుండె లోతులనుండి
నా గొంతు మలుపులనుండి
నా కనుల కొలుకులనుండి
కారిపోవగ-జారిపోవగ
1.ఎండి పోయిన ఏరులన్నీ- నిండి పారగా
ఇంకిపోయిన నదులన్నీ -వరదలై ఉప్పొంగగా
మిగిలిపోయిన నేలనంతా- కడలిలో కలిపేయగా
మనసుమాట మీరుతుంటూ-గుట్టు గట్టు తెంచుకొంటూ
కుంభవృష్టితొ ముంచివేయగ-ఉప్పెనల్లే ఊడ్చివేయగ
2.పెదవిమాటున నొక్కి పెట్టా బాధనంతా
నవ్వుచాటున దాచిఉంచా వేదనంతా
కవితల జలతారుముసుగే వేసా బ్రతుకంతా
మిన్నుకే చిల్లు పడినట్టు-కన్నుకే గాయమైనట్టు
నీటిబదులుగ నెత్తురొస్తూ- రెప్పలను తోసివేస్తూ
అమ్మంటేనే మమత
అమ్మంటే త్యాగశీలత
అమ్మేగా ఇలలో దేవత
1.అమ్మంటే అంతులేని ఆప్యాయత
అమ్మంటే కొలవలేని కారుణ్యత
అమంటేనే ఎనలేని బాధ్యత
అమ్మేగా అమ్మకు సారూప్యత
2.అమ్మంటే లాలించే ఒడి
అమ్మంటే తొలుదొల్త బడి
అమ్మతావు అనురాగపుగుడి
అమ్మేగా వీడని కన్నప్రేగు ముడి
3. అమ్మంటే తీర్చలేని ఋణం
అమ్మంటే తెంచలేని బంధం
అమ్మంటే స్నేహసుగంధం
అమ్మేగా మన మనుగడకర్థం
Friday, May 10, 2019
చిత్రమైన తత్వం నీది
తత్వమున్న రూపంనీది
భిన్నమైన అస్తిత్వం నీది
ధన్యమాయే నినుగని జన్మే నాది
భోలా శంకరా-భక్తవశంకరా
లయకారాహరా -ప్రళయభయంకరా
1.కంటిలోన కాల్చెడి మంట
తలమీద ఆర్పెడి గంగంట
గొంతులోన కాలకూట విషమంట
శిరమందు శీతల సుధాంశుడంట
2.మహాకాయగణపతికి మూషకము
బాలసుబ్రహ్మణ్యానికి మయూరము
జంగమయ్య నీ వాహనం నందియట
జగదంబ మా గౌరమ్మకు కేసరియట
3.ఎలుకను మ్రింగే నాగులె నగలు
పాములు జడిసే నెమలికి నెలవు
ఎద్దుని చంపే సింహానికి తావు
అన్నీ ఒకేచోట మనేలా చేస్తావు
4.తైతక్క లాడుతావు
తపస్సులూ చేస్తావు
ఇల్లిల్లూ బిచ్చమెత్తుతావు
అడిగినదేదైనా ఇచ్చేస్తావు
Thursday, May 9, 2019
కలియుగదైవమీవె కరుణాభరణా
మొక్కులు ముడుపులు తలనీలాలు
లెక్కకు మిక్కిలిగా భక్తులు తండోపతండాలు
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా
1.పాదచారులౌతారు సప్తగిరులనెక్కుటకై
పడిగాపులు పడతారు నీ దర్శనానికోసమై
పిల్లాపాపలతో వస్తారు నీ కృపకొరకై
చల్లగచూడమని వేడుతారు నమ్మికతో
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా
2.పాపాలు తొలగించగ పాపనాశనం
పుణ్యాలనందగ ఆకాశగంగాస్నానం
తిరుమల వీథులే అపర వైకుంఠం
సిరులను కురిపించగ మంగాపట్నం
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా
అమ్మ ఉన్నచోటి బ్రతుకు సులువైనది
అమ్మ ఎడద ఎంతటి విశాలమైనది
జనమంతా బిడ్డలుగా భావించగలుగునంతటిది
అమ్మంటే అనురాగమూర్తిరా
ప్రేమపంచడానికి అమ్మనే స్ఫూర్తిరా
1.ఆకలేసినప్పుడల్లా అమ్మతలపుకొస్తుంది
దిక్కుతోచనప్పుడల్లా అమ్మగురుతుకొస్తుంది
దెబ్బతాకినప్పుడూ అమ్మాఅని అరిచేము
నొప్పితాళనప్పుడూ అమ్మనే పిలిచేము
అమ్మంటే ఆదుకొనే ఆత్మబంధువు
అమ్మంటే అంతేలేని అమృత సింధువు
2.చందమామనైనా నేలకు దింపుతుంది
గోరుముద్దలోనా మమత కలిపిపెడుతుంది
కథలెన్నొచెప్పుతూ బ్రతుకు బోధచేస్తుంది
హాయిగొలుపు జోలపాడి నిదురపుచ్చుతుంది
అమ్మ పేగు పంచుకొన్న బంధమురా
సకలజీవరాశుల్లో అమ్మ అద్భుతమ్మురా
3.రాసి రాసి కలం సిరా ఇంకిపోయినా
గుట్టలుగా పుస్తకాల రాశి మారినా
సృష్టిలోని ఘనకవులే ప్రతిభచూపినా
అమ్మ కవన వస్తువుగా అసంపూర్ణమే
అమ్మంటే కమ్మనైన భావనరా
అమ్మంటే దివ్యమైన దీవెనరా
కళకళలాడుతోంది మన ఊరు
స్వచ్ఛనైన జలాలతో
పచ్చనైన పొలాలతో
రారా నేస్తం ఈతలు కొడదాం
సరదాసరదాగా చేపలు పడదాం
వేసవి సెలవులు ఆనందంగా
ఆటల పాటల గడిపేద్దాం
రెక్కలు సాచిన పక్షుల్లాగా
గగనపు వీథుల విహరిద్దాం
రారానేస్తం దోస్తీ చేద్దాం
సరదాసరదాగా కుస్తీ పడదాం
తోటమాలి గన్నుగప్పి
మామిడికాయలు కోద్దాం
మనని పట్టుకోను వస్తే
పరుగులు పెడదాం
దొరికిదొకటైనా పంచుకుందాం
కాకెంగిలి చేసైనా కమ్మగ తిందాం
చెట్టు చెట్టు పైనా
కోతికొమ్మలాడుదాం
పిట్టపిట్టతోనూ
కబురులు చెబుదాం
రారా నేస్తం కోయిలతో పోటీపడదాం
సరదాసరదాగా జాబిలితో జట్టే కడదాం
నా పుట్టుక కర్థమేమిటో
నా జన్మకు పరమార్థమేమిటో
ఎరిగించరా షిరిడిసాయీ
భవజలధిని వేగమే దాటించవోయీ
నా జన్మదినమున తీర్చరా వేదన
నా మనసే నీకు సాయీ.... నివేదన
1.అడగనిదే ఇచ్చావు ఎన్నో
అడుగడుగున తోడై నిలిచావు
అందలాలనెక్కించావు
అంతలోనె నిర్దయగా పడద్రోసావు
నా జన్మదినాన తీర్చరా వేదన
నామనసే నీకు సాయీ......నివేదన
2.ఎంతమందికో నీవు మహిమలు చూపావు
మరెంత మందికో ఆత్మ బంధువైనావు
సడలని విశ్వాసమే ఉన్నది
నను అక్కున జేర్చుకుంటావన్నది
నా జన్మదినాన తీర్చరా వేదన
నామనసే నీకు సాయీ...... నివేదన
నా కవితల్లో ప్రభవించే తల్లీ
నా పాటకే ప్రాణమైన మాతా
ఏజన్మలోని పుణ్య ఫలమో
ఏకర్మలోని దివ్య బలమో
నన్నాదరించితివే సరస్వతి
నను అక్కునజేర్చుకుంటివే వాణి
ఎలానిన్ను కీర్తించనూ ఏ వరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ
1.చదువలేదు ఏనాడు ప్రాచ్యకళాశాలలో
పట్టాలు పొందలేదు సాహిత్య శాస్త్రములో
ఛందస్సు వ్యాకరణం చెలగి నేర్వనేలేదు
భాష పట్ల బహువిధముల కృషి సల్పలేదు
ఏ తొలి ఉషస్సులో నీ దృక్కులు ప్రసరించెనో
ఏ శుభ ఘడియలో నీ వాక్కులు ఫలియించెనో
నను కరుణించితివే వేదమయీ
నను దయజూసితివే నాదమయీ
ఎలానిన్ను కీర్తించనూ ఏవరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ
2.స్వరముల సంగతే ఎరిగింది లేదు
శృతిలయ సూత్రాలు తెలియగలేదు
రాగతాళాలను సాధన చేయలేదు
వాగ్గేయకారుల కృతులను వినలేదు
అమ్మలాలి పాటలోని హాయి ఎదను కదిపిందో
కోయిల గొంతులోని మధురిమ నను కుదిపిందో
నను కృపజూసితివే పాట పల్లవింపజేసి
నా తలనిమిరితివే మనోధర్మ రీతిగఱపి
ఎలానిన్ను కీర్తించనూ ఏవరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ
Thursday, May 2, 2019
ఆ ప్రేమముందు దైవమైన దిగదుడుపే
కడుపు ప్రేగు బంధము తెగదు జీవితాంతము
స్వంత రక్తపాశము వెంటాడును సాంతము
1.నలుగు పిండి బొమ్మచేసి మురిసె పార్వతి
కరిశిరమును పొందివెలిసె సిద్ధి గణపతి
తండ్రి ప్రేమ ఎంతటిదో తొలివేల్పుగ నుడివె పశుపతి
సుబ్రమణ్యస్వామిని చేసే దేవసేనాపతి
2.పుత్రప్రేమ పరాకాష్ఠ తార్కాణం దశరథుడు
కనకున్నా ప్రేమపంచె యశోదానందులు
గతములోన ఎన్ని లేవు కడుపుతీపి కథనాలు
నా సుతుడిని కరుణించగ ఏలమీనమేషాలు
Wednesday, May 1, 2019
ఇదే ప్రసాదమనుకొని కళ్ళకద్దుకో
దైవాన్ని ప్రశ్నించగ నీ అర్హతేమిటి
విధినే నిలదీయగ నీ ప్రజ్ఞ ఏపాటిది
1.వికృతంగ నీకు ఆకారమిచ్చినా
వక్రబుద్ది నీలోన కలిగించినా
వీథుల్లో తిరిగులాగ అనాథనే చేసినా
క్షుద్బాధ తాళలేని దొంగగ నిను మార్చినా
దైవాన్ని నిందించగ నీసుకృత మేపాటిది
విధిని తూలనాడగనీ పుణ్యశేష మెంతటిది
2.కష్టాలు మూకుమ్మడి దాడి చేసినా
మానలేని రోగాలు ఎంతగ పీడించినా
ఋణ బాధలు కరుణమాని కలచివేసినా
లోకమంత ఏకమై నీపై పగబూనినా
దైవం దయజూడగ నీ నమ్మిక ఎంతటిది
విధినీకు వరమీయగ నీవినతులు ఏపాటివి
3.మునులవోలె తీవ్రమైన తపస్సులే చేసావా
ఋషులతీరు యజ్ఞయాగ హవిస్సులే వేసావా
రావణబ్రహ్మ లాగ రుద్రవీణ మీటావా
శబరిలాగ ఏళ్ళకేళ్ళు వేచివేచి చూసావా
అంతటివారికే తప్పలేదు తిప్పలు
ఎంతటివారికైన విధివింత పరీక్షలు
దాగి ఉంటుంది మానవత్వము-
మిగిలి ఉంటుంది ప్రేమతత్వము
మనిషివనే సంగతి మరచి మనబోకు నేస్తమా
మూడునాళ్ళ జీవితానికి సార్థకతను కూర్చుమా
1.ఏదో ఒక దృశ్యం నిన్ను కదిలించక మానదు
ఏదో ఒక కవనం నిన్ను మేల్కొలుపక సాగదు
బండరాళ్ళు సైతం కరుగుతాయి సంగీతానికి
లోకమంత క్షామమైనా కరువుండదు కంటనీటికి
మనిషివనే సంగతి మరచి మనబోకు నేస్తమా
మూడునాళ్ళ జీవితానికి సార్థకతను కూర్చుమా
2.గోచైనా లేకుండా వచ్చాము ఇలాతలానికి
చిల్లికాసునైనా కొనిపోము మనతో స్వర్గానికి
ఉన్నదాంట్లొ ఎంతోకొంత సాయపడితె సంతృప్తి
చేదోడువాదోడై ధైర్యమిస్తె తరగదు ఆస్తి
మనిషివనే సంగతి మరచి మనబోకు నేస్తమా
మూడునాళ్ళ జీవితానికి సార్థకతను కూర్చుమా
3.అరిషడ్వర్గాలలో లోభమే కడు హీనం
పదితరాలసంపద ఉన్నా చేయబోము చిరుదానం
నేత్రమూ రక్తమూ ఏదైనా వితరణయే
చితిలొ కాలు అవయవాలు వదాన్యతకు అర్హమైనవే
బలి శిభి దధీచి కర్ణులు దాతృత్వ శ్రేష్ఠులు
లేదనక కోరిన దిచ్చిన ఆదర్శప్రాయులు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
ఇది ప్రేమికుల రోజు
ఇదంటేనే ప్రేయసీ ప్రియులకు మోజు
తెలుసుకుంటారు పరస్పరం మనసులను
గెలుచుకుంటారు నమ్మకము ప్రేమలను
1.అనురాగం నోచని హృదయం అర్రులు చాస్తుంది
మూసుకున్న తలుపులను ఆతృతగా తీస్తుంది
చిన్న పలకరింపుకే పులకరించి పోతుంది
చిరు స్పర్శకైనా పరవశించి పోతుంది
వలపు వలలో పడినా ప్రేమికులకు అది మోదం
ఎదుటివారి ప్రతి ప్రతిపాదన మదికి ఆమోదం
2.త్యాగమే ఆయుధమై విజయాలనందిస్తుంది
చెలిమి తను అంకితమై కాలాన్ని బంధిస్తుంది
కోరింది కాదనకా కానుకలతో మురిపిస్తుంది
అడిగింది వద్దనకా దేహాలను మరిపిస్తుంది
ఆకర్షణ మత్తులో విచక్షణే నశియిస్తుంది
సాహసమే ప్రభవించి తెగువ వెలుగు చూస్తుంది
Saturday, April 27, 2019
OK
కొండగట్టు మారుతి దండిగ దీవించనీ
ధర్మపురి నరహరీ నిను దయగననీ
నీ జన్మదినమీనాడు ఆయురారోగ్యాలు ప్రసాదించనీ
శుభాశీస్సులివిగో హరీష్ భరద్వాజా
శుభాకాంక్షలందుకో మా యువరాజా
1.బాసర సరస్వతి నిను వాసిగ పలికించనీ
తిరుపతి బాలాజీ సప్తగిరులనెక్కించని
వెములాడ రాజన్న కోడెను కట్టించనీ
నీ జన్మదినమీనాడు ఆయురారోగ్యాలు ప్రసాదించనీ
శుభాశీస్సులివిగో హరీష్ భరద్వాజా
శుభాకాంక్షలందుకో మా యువరాజా
2.భద్రాద్రి రామయ్య లగ్నము జరిపించనీ
శబరీశుడు అయ్యప్ప దీక్షను పండించనీ
షిరిడిసాయినాథుడు జన్మ ధన్యతనొందించనీ
నీ జన్మదినమీనాడు ఆయురారోగ్యాలు ప్రసాదించనీ
శుభాశీస్సులివిగో హరీష్ భరద్వాజా
శుభాకాంక్షలందుకో మా యువరాజా
ఎలా భరిస్తున్నావో కంటిలొ ప్రళయానలం
బుసకొట్టే విషనాగులె నగలంట
చితికాలిన విభూతియే మేనంతా
కాలకంఠ కాసింత కనికరించరా
జ్వాలనేత్ర రవ్వంత కరుణించరా
1.శ్మశానంలొ ఉంటావు పుర్రెలోన తింటావు
అఘోరాలగురువై అలరారుతుంటావు
సన్యాసివనలేను సంసారిగ ఎనలేను
పరిశీలచేసినను ఎంతకూ గ్రహించనైతి
మదనారి ఇసుమంత దయజూడరా
జడదారి క్రీగంట ననుజూడరా
2.చూడబోతె సతులిద్దరు వీరులైన సుతులిద్దరు
పట్టించుకుంటావో పట్టనట్టుంటావో
మాయకులోబడితివో మాయకే మాయనీవొ
తరచితరచి చూసినా తత్వమెరుగనైతిని
జంగమయ్య నన్నొకింత కృపజూడరా
సిద్ధయోగి సత్వరమే నను బ్రోవరా
3.కఫమునిండె నాగళమున నిను స్తుతిచేయనీదు
కన్నులందు భగభగ దనివారగ నిను చూడనీదు
నీ చలవ వల్లైతే తప్పును సవరంచరా
నాచిత్తవృత్తిదైతె బుద్దినిపుడె సరి దిద్దరా
వైద్యనాథ దీననాథ నా ఔషధమీవేరా
మృత్యుంజయ పాహిపాహి ఆరోగ్యమునీయరా
OK
ఉసురుతీసుకున్నా ఉలకని మతి ఎందులకు
కడుపునింపలేని కంటితుడుపులెందులకు
ఓదార్పే ఎరుగలేని అధినేత లెందుకు
1.కొండగట్టుదుర్ఘటనకు స్పందించని దెందులకు
పూజారి హత్యకైన చలించలేనిదెందులకు
సిరిసిల్లదురాగతాల ఊసెరుగని దెందులకు
పసుపురైతు గోసెరుగని పద్ధతి మరిఎందులకు
2.విద్యార్థుల ఆత్మబలికి విలువీయక పోవనేల
పట్నాల దుస్థితిపై పట్టింపుమరువనేల
పార్టీలను పరిమార్చగ కంకణబద్ధతేల
పక్షపాతధోరణితో ప్రతిభను తొక్కేయనేల
3.ఇల్లుచక్కదిద్దకుండి ఊళ్ళేలడమెందుకు
తన్నుమాలిన ధర్మం కొమ్ముకాసుడెందులకు
ఆశపెట్టి బాసచేసి మాట తప్పుడెందులకు
కన్నుమిన్నుకానకుండి కాలుదువ్వుడెందులకు
నా ఎదగల భావన నీవే
నా గళమున ఆలాపనవే
నా కవితల సృజనవు నీవే
నా సేదదీర్చే మలయసమీరమువే
నా తపనలనార్పే మధురసరస్సువే
నా చెలీ నన్ను చేరరావే
వేగిరంనా కంటిపాపకావే
1.పరుగులు తీరే నీలిమేఘం నీవేనీవే
పుడమిని తడిపే వానచినుకై రావే
హొయలే పోయే సెలయేరంటే నీవే
కడలికౌగిట ఒదిగే నదివైరావే
నా చెలీ నన్ను చేరరావే
వేగిరంనా కంటిపాపకావే
2ఎడారిదారుల ఒయాసిస్సువు నీవే
చీకటి రేయికి తొలిఉషస్సువు నీవే
చకోరి పాలిటి శరత్తువైరావే
శిశిరపు వాకిటి ఆమనివై రావే
నా చెలీ నన్ను చేరరావే
వేగిరంనా కంటిపాపకావే
Monday, April 22, 2019
లక్ష్యం లేని హననం
జిహాద్ పేరిట నరమేధం
ఈనాటి ఉగ్రవాదం
పెట్రేగే తీవ్రవాదం
1.సిద్ధాంతం లేని వాదం
అంధకారపు జూదం
విధ్వంసమే నినాదం
పిచ్చోడి చేతి రాయే విధానం
జిహాద్ పేరిట నరమేధం
ఈనాటి ఉగ్రవాదం
పెట్రేగే తీవ్రవాదం
2.దేశమేదైనా విద్వేషమే
సాటిజనులైనా విరోధమే
పాపభీతిఅంటే పరిహాసమే
ఆత్మాహుతంటే పరితోషమే
జిహాద్ పేరిట నరమేధం
ఈనాటి ఉగ్రవాదం
పెట్రేగే తీవ్రవాదం
3. లేకపోతేనేం ఏ బంధమూ
తప్పుకుంటేనేం ఆ మార్గము
వేటాడే పులి నైజం ఆ ఇజం
వెంటాడే మృత్యుతత్వం ఆమతం
జిహాద్ పేరిట నరమేధం
ఈనాటి ఉగ్రవాదం
పెట్రేగే తీవ్రవాదం
తలమీద మాతల్లి ఊరేగంగ
సగమేను మాయమ్మ ఆక్రమించంగ
కన్నుల కురిసే వెన్నెల వర్షంగా
హృదయమంత ఉప్పొంగే కరుణామృతగంగ
శంకరా అభయంకరా..శంకరా భక్తవశంకరా..
భక్త వశంకరా
1.ఇవ్వాలనుకున్నప్పుడె ఇస్తావు నువ్వు
ఇచ్చేదాకా వదలను నీ పాదాలతావు
బెట్టుజేయబోకురా ఓ మెట్టుదిగితె చాలురా
చావు పుట్టుకలన్నీ నీ కనుసైగతోనెరా
ఆటలాడబోకురా నటరాజ నిన్నె నమ్మితిరా
శంకరా అభయంకరా..శంకరా భక్తవశంకరా..
భక్త వశంకరా
2.దీనులెలా అయ్యాము నీ దయలేకనే
ఇడుములపాలైతిమెలా నీకృప లేకనే
పక్షపాతివైతివో మము లక్ష్యపెట్టకుంటివో
కొందరికే ఎందులకు ఆవేదన
మరికొందరికేలా ఆనందము
శంకరా అభయంకరా..శంకరా భక్తవశంకరా..
భక్త వశంకరా
కలే నీవై.. వలే నీవై
ఆకలే నీవై ..కావలే నీవై
రావే చెలీ నన్నలరించగా
నీవే చెలీ వెన్నెలలు చిలకరించగా
1.నవ్వులే కురిపించేవు సదా
మనసునే మురిపించగ అమరసుధ
తీరదా నా వ్యధ
వింతయే నా గాథ
2.బాల్యమే నీకు నేస్తం
యవ్వనం నీకు చుట్టం
అందమే నీకు దాసోహం
అందుకే నీపై నా మోహం
3.తిరగరాద్దాం ప్రణయ చరితలు
చెరిపివేద్దాం విరహ గురుతులు
కలిసి ఉందాం కాలమంతా
పంచుకుందాం బ్రతుకు పంథా
Saturday, April 13, 2019
కష్టాల కడలిలో
శిథిలమైన నావలో
ఎన్నాళ్ళు సాగునో
నా జీవితం
తప్పుకోను వీలులేదు
దూకినా ఈత రాదు
తీరమే కానరాని
ఈ పయనం
1.ఎంతకు తెగని
చీకటి రేయి
ముంచెత్తేలా
తుఫాను గాలి
చేజారి పోయింది
ఆశల చుక్కాని
చుక్కైనా చూపకుంది
తూరుపు దిక్కుని
2.అలలే చెలరేగి
చెరిపాయి కలలనెన్నో
మింగచూస్తున్నాయి
తిమింగలాలెన్నో
రాసిపెట్టి ఉన్నాకా
అద్భుతాలు జరుగవా
నావికులెదురొచ్చి
గమ్యాన్ని చేర్చరా
విరించే వరించే నీవవతరించగా
వ్యాసుడే వినుతించే నువు అవధరించగా
వాల్మీకే వినుతికెక్కె నువ్వు ఆదరించగా
వాఙ్మయ రూపిణి వాణీ పారాయణీ
సన్నుతి నీకిదే సరస్వతీ భారతీ
1.శారదలు నీ కన్నులు నీవి దయాదృక్కులు
కారునీరదలు కురులు నగవుల మౌక్తిక సిరులు
పుస్తక హస్తభూషిణి మస్తక జడతవారిణి
జపమాలా కరధారిణి జన్మరాహిత్యకారిణి
వాఙ్మయ రూపిణి వాణీ పారాయణీ
సన్నుతి నీకిదే సరస్వతీ భారతీ
2.సప్తస్వర వరదాయిని సప్తతాళ వితరణి
సప్తవర్ణ కదంబశోభిణి సప్తలోకైక పావని
సప్త ఋషీ సంసేవిని సప్తవ్యసన పరిహారిణి
హంసవాహిని జనని పరమ హంసానందిని
వాఙ్మయ రూపిణి వాణీ పారాయణీ
సన్నుతి నీకిదే సరస్వతీ భారతీ
https://youtu.be/C1n8ruxE_2k?si=2vz94knAtrIsidq7
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం: శుభపంతువరాళి
ఏ దైవం మొరాలిస్తుందో
ఏ దీవెన ఫలిస్తుందో
ఏదేవత కరుణిస్తుందో
నా దైన్యం పరిహరిస్తుందో
1.ఎక్కని గుట్టలేదు
మొక్కనివేలుపు లేదు
చేయని పూజలేదు
నోచని వ్రతమేలేదు
ఏ మంత్రం ఉద్ధరిస్తుందో
ఏ యంత్రం అభయమిస్తుందో
2.వాడని వైద్యంలేదు
చేయని చికిత్సలేదు
వేయని ఔషధిలేదు
రాయని తైలం లేదు
ఏ మందు నయంచేస్తుందో
ఏన్నడు జయం వరిస్తుందో
పరవశమున నీ నుతి-పాడెద నే సన్మతి
కోరెదనేనొక్కటే కలిగించగ సద్గతి
వేడెద నిను సర్వదా ఈయగ శరణాగతి
1.విషయవాంఛలెప్పుడు తొలచేను నా మది
విశేషించి అరివర్గము విక్రమించు నెమ్మది
నను మించును వంచనతో పంచేంద్రియ సంకీర్ణము
నడిపించు సారథివై గెలిపించగ సంగరము
కోరెదనేనొక్కటే కలిగించగ సద్గతి
వేడెద నిను సర్వదా ఈయగ శరణాగతి
2.నువు దయకురిపించగా-భక్తి ఇనుమడించదా
నీ కరుణ ప్రసరించగ జన్మయే తరించదా
నిత్యము నీ సేవలో బ్రతుకే పులకించదా
నీ పాద సన్నధిలో ఆత్మైక్య మొందదా
కోరెదనేనొక్కటే కలిగించగ సద్గతి
వేడెద నిను సర్వదా ఈయగ శరణాగతి
జాలిగుండె నీదయా
మండుకన్ను రుద్రయ్యా
దండివాడ వేనయా
పుట్టుక చావు అంతా నీ మాయ
ఏమీ ఎరుగనట్టు ముక్కుమూసుకుంటావయా
1.ఇల్లేమో శ్మశానం-ఒళ్ళంతా శామీలం
నగలు పన్నగాలు-నడుముకు పులితోలు
పగటి వేషగాడివయా-నిత్య బిచ్చగాడివయా
కుబేరునికె దాతవయా-విశ్వానికె నేతవయా
ఆపద సంపద నీమాయ
ఏమీ ఎరుగనట్టు గమ్మున ఉంటావయా
2.ఆలేమో భద్రకాళి-నీవేమో మల్లారి
సంతతేమొ శూరులైన షణ్ముఖుడు గణపతి
తలమానికమే శశి - నెత్తిన భాగీరథి
తడుపగ మురిసేవయా తపనల తీర్చేవయా
అనురాగము అనుబంధము అంతానీ మాయ
ఏమీ పట్టనట్టు తపము చేసుకొంటావయా
ఓటంటే కాదురా చెల్లని నోటు
ఓటు వేయుటే ప్రగతి బాటరా
ఓటువేస్తె బ్రతుకు పూలతోటరా-నామాట సద్దిమూటరా
ఐదేళ్ళే ఆయువురా ఓటుకు
ఆయుధమది అవినీతి వేటుకు
ఆచితూచి ఓటెయ్యి తగునేతకు
నువ్వేరా బ్రహ్మవు తలరాతకు-నేతలరాతకు
తాయిలాలకాశపడును వానరమురా
అప్పచ్చికి చొంగకార్చు శునకమురా
అడ్డమైన గడ్డికరుచు ఖరమురా
వ్యక్తిత్వము వీడకురా నరవరా-ఓటరు ప్రవరా
పౌరులందరికీ ఓటన్నది అమ్మేరా
హీనులైనగాని ఇలన అమ్మనమ్మేరా
ఆత్మవంచకులను ఎవరైనా నమ్మేరా
ఓటుతొ గుణపాఠంనేర్పు జన్మజన్మేరా-ఓటేయకుంటె నీ ఖర్మేరా
https://youtu.be/TQXsON0FGBU?si=0zORkZmaUP1Rll0u
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం : భీంపలాస్ (అభేరి )
మేధకు అధిదేవతవు-వాక్కునకే ఏలికవు
బాసరపుర భాసితవు-జ్ఞానసరస్వతి మాతవు
అంజలి నీకిదే మంజుల వాణీ
హారతిగైకొనవే వీణాపాణీ
1.మరపునకే వెరపు నీవు-నన్నేల మరచినావు
శారదవై వరలుతావు-తపనలేల పెంచుతావు
తల్లివి నీవుండగ-తల్లడిల్ల జేతువేల
అమ్మవు నీవాదరించ-ఆదుర్దాకు తావేల
దయగనవే తక్షణమే-తరగని కరుణా వీక్షణివీవే
2.మనసుకు హాయిగొలుపు-సంగీతము నీవు
మెదడును చైతన్య పరచు-ఉత్తేజము నీవు
నీ గానము కాదేల-దివ్యమైన ఔషధము
నీ ధ్యానము కూర్చదేల-ఆత్మానందము
లోపములెంచబోకె-లోకజనని సనాతని
https://youtu.be/eYLuGQovBhs?si=PLDnK02fLK-hce7B
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం : సారంగ తరంగిణి
రాధ :
మురళిని నేనౌతా మోహన మురళిని నేనౌతా
నీ పెదవుల మధువులు గ్రోలగ
లాలించరా మురిపాల తేలించరా
మ్రోయించరా తపనలు తీర్చరా
సారంగ తరంగిణుల నొలికించరా
కృష్ణ :
రవళిని నేనౌతా నీ అందెల రవళిని నేనౌతా
నీ పదముల పదనిస లలరగా
పాలించవే నను పరిపాలించవే
నీ ఒడిలో బడలిక మరవగ
స్పర్శించవే మేనంత స్పృశియించవే
కృష్ణ :
దేహము రాధగ ఈ మాధవు భావము
గోవిందుడే ఆత్మగ రాధికా నీ జీవము
అద్వైతామృతం మన సంగమ జనితము
రాధా కృష్ణ-కేళీ విలాసము-సదా సరస భరితము
రాధ :
క్షీరభాండ ప్రియం,-పూతన ప్రాణహారిణమ్
యదుకుల జనరంజకం ఆనంద వర్ధనమ్
గోకుల గోపికా మానస సంచారిణమ్
మీరా హృదయ బృందావన విహారిణమ్
మేఘం నీవైతే పవనం నేనౌతా
వాహిని నీవైతే కడలిని నేనౌతా
ఆమని నీవైతే కోయిల నేనౌతా
నీదానగా నీ శ్వాసగా సాగిపోతా జీవితాంతం ఒకటే ఆత్మగా
నీవాడిగా నీ నీడగా ఉండిపోతా జన్మజన్మలు నీ తోడుగా
1.నా ఎడారి దారిలో ఒయాసిస్సు నువ్వు
నా చీకటి రేయికీ ఉషస్సువే నువ్వు
తీయని తీరని తపనలు తీర్చే శరత్తు నువ్వు
ఎదలో దాగిన వేదన మాన్పే మహత్తు నువ్వు
శిలలా మిగిలిన నన్ను శిల్పం చేసావు
మునిలా ఉన్న నన్ను రామునిలా మార్చావు
అధరం నీవైతే వెదురును నేనౌతా
పరువం నీవైతే ప్రణయం నేనౌతా
2.నేను పాడే రాగంలో సప్తస్వరములు నువ్వు
నేను నడిచే మార్గంలో ఏడు అడుగులు నువ్వు
మనసును ఓలలాడించే మధుర సంగీతం నువ్వు
బ్రతుకున చైతన్యం నేర్పే జీవ జలపాతం నువ్వు
దారం తెగినా గాలిపటానికి ఆధారమైనావు
తీరం దొరకని నా నావకు దిక్సూచి వైనావు
గాత్రం నీవైతే గానం నేనౌతా
దేహం నీవైతే ప్రాణం నేనౌతా
Saturday, March 16, 2019
రసికజనులెందరో
నా గాత్ర మాధుర్యములో
పరవశింపగా
నను కోరుచుందురే
అభిమానులందరూ
నా గానలాహిరిలో
ఓలలాడగా
కోయిలే నాకు గురువు గొంతెత్తి పాడగా
సెలయేరె ఆదరువు
నా పాటగతులు సాగగా
తోటలోని ప్రతితరువు
నాకు శ్రోతకాగా
అనుదినము నాకచ్చేరి ఆనందవర్షితగా
రాగాలనెరుగనైతి త్యాగరాజులాగా
పదములు పలికించనైతి
అన్నమయ్యలాగ
మనోధర్మ సంగీతం నాకు ఊతము
హృదయజన్య నిజభావం నా గీతము
Saturday, March 9, 2019
నాస్తికులకి సైతం ఆదర్శ ప్రాయుడవు
అనాథగా అవతరించి ఆత్మబంధువైనావు
షిర్డీలో వసియించి ఎదఎదలో వెలిశావు
కులమతాతీతంగా మనిషిని ప్రేమించావు
జీవకారుణ్యమూ మానవత పంచావు
దైవంమానుష రూపేణా నీవేలే సాయి
మనిషే దైవమనగ నీవేగా బాబా
బాబా సాయిబాబా- బాబా షిర్డీ బాబా
1.మహిమల దాపున ఆకర్షణ ఉన్నది
లీలల వెనుక నీ ఆదరణ ఉన్నది
బూడిద నొసగుటలో పరమ తత్వమున్నది
నీ మాటల మాటున వేదాంత మున్నది
దైవంమానుష రూపేణా నీవేలే సాయి
మనిషే దైవమనగ నీవేగా బాబా
బాబా సాయిబాబా- బాబా షిర్డీ బాబా
2.నీ జీవిత మర్మమే గురు గ్రంథము
నీ బోధలసారమే గీతా మకరందము
నీకరుణా దృక్కుల్లో కనిపించును క్రైస్తవము
నీ దరహాసములో వికసించును ఇస్లాము
దైవంమానుష రూపేణా నీవేలే సాయి
మనిషే దైవమనగ నీవేగా బాబా
బాబా సాయిబాబా- బాబా షిర్డీ బాబా
Saturday, March 2, 2019
మసలుకొ పామరుడా ఎరిగి లింగార్చన పరమార్థం
శివుడొక్కడే విశ్వనాథుడు-భవుడొక్కడే ఆత్మరూపుడు
శివోహం సదాశివోహం-దాసోహం సదా సోహం
1.పంచభూతాత్మకుడు-పంచానన రూపుడు
పంచప్రాణాధీశుడు- పంచామృత ప్రియుడు
సలిలధారతోనే సంతుష్టుడు
మారేడు దళమిడితే పరవశుడు
2.అహరహరం హరధ్యానము-శివరాతిరి మర్మము
నవవిధభక్తి యుతము శివదీక్షా విధానము
నదీ స్నానం ఉపవాసం పాపహారకం
జాగరణ నామ స్మరణ ముక్తి కారకం
3.ప్రకృతియే పార్వతి-కాలాత్ముడే రుద్రుడు
భక్తవశంకరుడు అభయంకరుడు
అర్ధనారీశ్వరమే సకల సృష్టికి మూలం
అంబా శివ కళ్యాణమె ఆనంద దాయం
Tuesday, February 26, 2019
నీ సొగసంతా ఋతుశోభలే!
కన్నుల్లో వెన్నెల ప్రభలే
నా కవితలన్ని నీ కళాప్రతిభలే
అదేలే పదేపదే మది కుదేలే
సరేలే నీ పరువానికవి కొసరేలే
భామిని మేనే ఆమని
సెగలు రేపు పంటివిరుపు వేసవి
నవ్వులజల్లే వానకారుగా గని
చూపుల మత్తుచిమ్మె శరత్తుని
అదేలే పదేపదే మది కుదేలే
సరేలే నీ పరువానికవి కొసరేల
బిగికౌగిట నలిగె హేమంతము
దరిచేర బెదిరేను శిశిరము
నీవున్న తావే నిత్య వసంతం
నీతోటిలోకం స్వర్గ తుల్యము
అదేలే పదేపదే మది కుదేలే
సరేలే నీ పరువానికవి కొసరేలే
Monday, February 25, 2019
మంద్రస్వర మధుర నాదవినోదిని
కలవాణి విధిరాణి కలహంస వాహిని
సకలజన శ్రేయోదాయిని నమోస్తుతే జగజ్జనని
1.షడ్జమ రిషభ గాంధార మధ్యమ
పంచమ ధైవత నిషాద స్వరధుని
ధ్రువ మఠ్య రూపకైక
ఆట త్రిపుట ఝంపె తాళ రంజని
సంగీత సామ్రాజ్ఞి సాయుజ్య వరదాత్రి
సకలజన శ్రేయోదాయిని నమోస్తుతే జగజ్జనని
2.నవరస పోషణి జ్ఞాన ప్రదాయిని
మనోవికాస ప్రేరేపక సాధిని
సామగాన సమ్మోహ ప్రకాశిని
మేధో కణచేతన అనుకూలకారిణి
సర్వరుగ్మహారిణి పరమ దయావర్షిణి
సకలజన శ్రేయోదాయిని నమోస్తుతే జగజ్జనని
Tuesday, February 12, 2019
రచన,స్వరకల్ప&గానం:రాఖీ
అరుణ కిరణ భాస్కరా
జన జాగృత దినకరా
అర్ఘ్యములివె అందుకో-ఆరోగ్యదాయకా
మా అంజలిగొనుమిదే-ఆదిత్య నామకా
1.తిమిరాంతక ధీ ప్రదీప లోకమిత్ర
సప్తాశ్వ రథారూఢ తేజో నేత్ర
సప్తవర్ణ సమ్మేళన శ్వేతకాంతి ధాతా
ప్రజ్వలిత జ్యాలాయుత ప్రభాకరా పవిత్రా
వందనమిదె అందుకో వేదవేద్యా
మా అంజలి గొనుమిదే ఆదిదేవా
2.ఏక చక్ర కూబర ప్రవేత విఖ్యాత
సంజ్ఞా ఛాయా ద్వికళత్ర విరాజిత
నవగ్రహ కేంద్రక శక్తియుత అధినేత
రవి సూర్యాది ద్వాదశ నామాంకిత
ప్రణతులివే అందుకో పద్మబాంధవా
మా అంజలి గొనుమిదే అహర్బాంధవా
ఎన్ని వలపులో
మలుపు మలుపులో
ఎన్ని తలపులో
మూగ మనసులో
విధి చేసే వింత గారడీ
వివరించగ ప్రతి కలమూ తడబడీ
1.ఏ వంక లేనిది ఈ నెలవంక
ఉప్పెనలే ఆపింది రెప్పల వెనక
కాలానికి తానే కట్టుబడి
బంధపు గుప్పిటిలో పట్టుబడి
సర్దుకపోతోంది మదినే సమాధి చేసి
రోజుగడుపుతూ ఉంది కలలను నలిపేసి
2.చేయని తప్పుకే శిక్షననుభవిస్తూ
కట్టబాట్ల సంకెళ్ళు కడదాకా మోస్తూ
మోవిపై నవ్వులు పూస్తూ
లోలోన అనుక్షణం మరణిస్తూ
నటియిస్తున్నది పాత్రోచితంగా
బ్రతుకుతోంది జీవశ్చవంగా
Sunday, February 10, 2019
తోటకు మరలి వస్తుందా
మూగవోయిన పికమే ఇకపై మరలకూస్తుందా
మదికే హాయినిస్తుందా
చేజారి పగిలిన అద్దం మామూలుగ ఔతుందా
చెదిరిపోయిన మధురస్వప్నం తనువరిస్తుందా
1.మడమతిప్పదెప్పుడూ ముందుకే సాగేకాలం
గుఱే తప్పదెన్నడూ విధి విధిగ సంధించేబాణం
జ్ఞాపకాలు శూలాలై గుండెనే గుచ్చుతుంటే
అనుభూతులు జ్వాలలై మనసునే మండిస్తుంటే
ఎలానయమౌతుంది సలుపుతున్న గాయం
ఓర్చుకోలేని వ్యధ కంటే నరకమెంతో నయం
2.ఆ దారం తెగిన పతంగం జారేది ఏ తావో
తుఫానులో చిక్కిన నావ చేరేది ఏ రేవో
రెప్పపాటులోనే జీవితమే కుప్పకూలు
తప్పుమనది కాకున్నా జాతకాలె తారుమారు
ఎవరు మార్చి రాయగలరు నుదుటిరాతను
ఎవరు మాన్పివేయగలరు కడుపుకోతను
భావము నీవై నా జీవము నీవై
ఏలగరావో వేంకటరమణ
నన్నేలగ రావో సంకటహరణ
1.బండరాయి కూడ కరుగుతుంది నా ఆర్తనాదాల నేవిని
కౄరమృగము దారినొదులుతుంది నా గుండె కోతను తను గని
కరుణ మరచినావేల దయాసాగరా
పట్టించుకోవేలా నను నటశేఖరా
ఏలగరావో వేంకటరమణ
నన్నేలగ రావో సంకటహరణ
2.బంధమెరుగవైతివి పాశశూన్య నిరంజనా
బాధలెరుగవైతివి దేహరహిత పరమాత్మా
తెలుసుకోగ నీ వశమా నా వ్యధ
మాన్పివేయ నీ తరమా రమాధవా
ఏలగరావో వేంకటరమణ
నన్నేలగ రావో సంకటహరణ
దేవుడివైనా ఇలపై మనిషిగ మాకై పుట్టావో
సాయిరాం షిర్డీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయిరాం
1.తప్పటడుగులను తప్పించి చేయూత నిచ్చావు
దారీతెన్నూ తెలియని వేళల దిక్సూచి వైనావు
తీరం దొరకని నావల పాలిటి దీపస్తంభము నీవు
భారం మోసి గమ్యం చేర్చే మార్గదర్శివి నీవు
సాయిరాం షిర్డీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయిరాం
2.అందరు ఉన్న అనాధనీవు అనాధలందరి బంధువువు
బిచ్చమునెత్తే యాచకుడవు కోరినదొసగే దాతవునీవు
బూడిదతోనే వ్యాధులు మాన్పే ఘన సిద్ధవైద్యుడవు
మననముతోనే మహిమలు చూపే ఐంద్రజాలికుడవు
సాయిరాం షిర్డీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయిరాం
https://youtu.be/dlVKkr93dLk?si=Az6UaoOZGQ37Z9hj
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం : తోడి
ఎలా తొలగించనూ నీ వేదన
ఎలా మాన్పించనూ నీ రోదన
ఎలా పంచుకోనూ నీ నరక యాతన
ఎలా ఓదార్చనూ ఎడతెగదు గుండెకోత
1.అశ్వినీ దేవతలైనా ఔషదమందించలేదు
సాక్షాత్తు ధన్వంతరే మందు ప్రసాదించలేదు
చరకుడు శుశ్రుతుడు చికిత్సేది చూపలేదు
జగతిలోని వైద్యమేది నివారణే చూపలేదు
చేష్టలుడిగి ఉన్నాను నిస్సహాయంగా
అద్భుతాలనాశిస్తూ ఎంతెంతో అతృతగా
2.పులిపాలతొ తగ్గేదైతే అయ్యప్పను శరణందు
సంజీవని సరిపోతేను అంజన్నను ప్రాధేయపడుదు
అమృతమే అవరమైతే మోహినినే వేడుకొందు
వైద్యనాథుడే దిక్కంటేను స్వామితోనె మొరలిడుదు
మహిమలింక చూపాలి మహేశుడైనా
కలవరము తీర్చాలి వరములిచ్చి నేడైనా
అనాధవెన్నటికీ కావునేస్తం
ఏకాకిగ తలపోయకు నీదేఈ సమస్తం
విధాత రాసిన నుదుటి రాత మార్చివేసి
కరువైన కన్నవారి లోటే పూడ్చివేసి
నిను వెన్నంటి ఉంటుంది మానవలోకం
నీకు చేయూత నందించి మాన్పుతుంది గుండె శోకం
1 .పూర్తిగా చావలేదు మానవత్వము
అంతరాల్లొ దాగుంది ప్రేమతత్వము
వితరణ చాటుతుంది దాతృత్వము
జాలిని ఆశించక కసిని పెంచుకోక
తీర్చిదిద్దుకో ఉన్నతంగ వ్యక్తిత్వము
నిను వెన్నంటి ఉంటుంది మానవలోకం
నీకు చేయూత నందించి మాన్పుతుంది గుండె శోకం
2.ఆకలికెపుడు లొంగి దొంగగా మారకు
ద్రోహుల చెంతజేరి నేరాలకు పాల్పడకు
తేరగా వస్తుందని బిచ్చగాడివైపోకు
శ్రమనెప్పుడు నమ్ముకో కృషిచేస్తూసాగిపో
ఆత్మవిశ్వాసమే గెలుపుమూలమని మరువకు
నిను వెన్నంటి ఉంటుంది మానవలోకం
నీకు చేయూత నందించి మాన్పుతుంది గుండె శోకం
https://youtu.be/HAs7w-Hr91w?si=ssVWGVr11N01CF5G
విద్యయు విజ్ఞానము-తల్లీ నీ ప్రసాదము
కవనము సంగీతము-నీదయా విశేషము
జగతికి మూలమీవె-మూలా నక్షత్ర జాత
తరగని మేధనీవె -కృపగని మము జగన్మాత
నమోస్తుతే సరస్వతీ-ప్రణతులివే భారతీ
1.వసంత పంచమిన ప్రభవించినావు
విధాత నెచ్చెలివై వరలుతున్నావు
నీవీణా నాదముతో ఊపిరులూనినాము
నీచల్లని చూపులతో రూపుదిద్దుకున్నాము
అనురాగము మాలోన విలసిల్లనీయవే
మానవతను మాలోన పరిమళింపజేయవే
నమోస్తుతే మాతా శారదా-ప్రణుతులివే ధీవరదా
2.కాశ్మీర క్షేత్రాన భువిని వెలసినావు
బాసర పురమందును కొలువుదీరి యున్నావు
శృంగేరి పీఠాన్ని అధివసించియున్నావు
మా ధర్మపురియందున విరాజిల్లుతున్నావు
మాహృదయము సదానీకు ఆవాసము కానీయవె
మావాక్కున నీ విభవము ప్రకటింపజేయవే
నమోస్తుతే జననీశ్రీవాణీ-ప్రణుతులివే పారాయణీ