Thursday, September 15, 2022

 

https://youtu.be/gi1cd8KWCPA

నేడు ఇంజనీర్స్ డే-ఇంజనీర్ మిత్రులకు శుభాకాంక్షలు


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విశ్వకర్మ వారసులారా మీకు వందనం

మయబ్రహ్మ శిష్యులారా అభినందన చందనం

నిర్మాణరంగంలో అద్భుత కుశలత మీది

సాంకేతికతలో మీ నిపుణత ఎనలేనిది

ఇంజనీరంటే ఇలలోనే ఘనుడు

ఇంజనీరంటే విశ్వవ్యాప్త వామనుడు


1.ఇందుగలదందు లేదును సందేహమేలేదు

వైద్య వ్యవసాయ రక్షణ శాఖలందూ లేకపోలేదు

సాఫ్ట్ వేర్ అంతరిక్ష సమాచార వ్యవస్థలు ఇంజనీరింగ్ కే చెందు

మానవ జీవనం అనునిత్యం ఇంజనీరింగ్ తో సుఖములనందు

ఇంజనీరంటే ఇలలోనే ఘనుడు

ఇంజనీరంటే విశ్వవ్యాప్త వామనుడు


2.ఆకాశ హర్మ్యాలు సాగర సొరంగాలు వంతెనలు ఆనకట్టలు

అప్రతిభులగావించే  అపూర్వకట్టడాలు విభ్రమాలు

సరికొత్త రంగాలలొ సత్తా చూపే వింత ఆవిష్కరణలు

బ్రతుకే టెక్నాలజితో ముడివడి మానవ మనుగడలు

ఇంజనీరంటే ఇలలోనే ఘనుడు

ఇంజనీరంటే విశ్వవ్యాప్త వామనుడు


OK

Wednesday, September 14, 2022


https://youtu.be/TVnpvL-bG8o

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎగిరిపోయే సమయమొచ్చిందే చిలకా

కనుమరుగయ్యే కాలమేతెంచిందే ఇక

చెట్టుతోటి గట్టుతోటి పెట్టుకున్న

ముచ్చట్లకు సెలవికా

ఏటితోటి పాటతోటి అల్లుకున్న

బంధాలకు వీడ్కోలికా


1.రానే వస్తుంది  రావలసిన రోజొకటి

లోకమంత వెలుగున్నా నీకు కటిక చీకటి

చేయిదాటి పోవుటకు సరిపోతుంది తృటి

ఎంతటివారికైనా తప్పనిది ఇదే పరిపాటి


2.చక్కదిద్దుకోవాలి తెలివిగలిగి జీవితం

కూడబెట్టుకోవాలి చిటికెడైన పుణ్య ఫలం

వెంటతీసుకెళ్ళలేము ఓ తృణమూ ఫణమూ

మిగిలిపోవాలి ఇలలో మనదైన మంచితనమూ

 

https://youtu.be/bSZh6GAK5dA?si=9GVrwSdSky4WXmw6

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా మనసుకెంతటి ఆరాటం

ఈ మనిషికెందుకు ఉబలాటం

అందని వాటికోసం అర్రులు చాస్తూ

అందలేదని ఎందుకో కినుకవహిస్తూ


1.కొండకు వేసే వెంట్రుక కోసం ఆ వగపెందుకో

నింగికే నిచ్చెన వేస్తూ చేరలేదని బెంగ ఏలనో

చూసికొన్ని తృప్తి పడాలి విని సైతం నందించాలి

పుక్కిటిలో పట్టలేము కోరికల సాగరాన్ని 

అక్కునైతె చేర్చలేము ఇంద్రచాపాన్ని


2.అల్లంత దూరంలోనే చందమామ అందాలు

గాలిలో తేలివస్తేనే హాయి మొగలిరేకు గంధాలు

 శ్రావ్యమే పిక గానం మర్మం నది జన్మస్థానం

కనిపించి తీరాలా కోయిల రూపం

శోధించగ అవసరమా తీరితే దాహం


https://youtu.be/jytjkP0zDxU?si=fFS36yXrw1rWbXNz

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అర్చించనీ అనవరతం

అక్షరాల పూలతో పదముల సుమ మాలతో

పాడనీ నినుకొనియాడనీ 

నీవొసగిన గాత్రంతో  ఏకాగ్ర చిత్తంతో

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి


1.ఏ మార్గమైనా నీ వైపే సాగనీ

ఎదలయగా నీనామం నాలో మ్రోగనీ

నా రచనలన్నీ రంజింపజేయనీ

గళమే మనోహరమై వీనుల విందవనీ

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి


2.సాహిత్యమే ఎరుగని ఓ పామరుణ్ణి

నా కవనమంతా నీ  కరుణా కటాక్షమే

సంగీతమేమీ తెలియని లల్లాయిగాణ్ణి

ఈ స్వరకల్పనంతా నీ సేవా విశేషమే

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి

Tuesday, September 13, 2022

 https://youtu.be/2zztuYtSUUE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేకన్న కలవే

నీవే నా అష్టవిధ నాయికలవే

నాకున్న కళవే

పున్నమినాటి ధవళ చంద్రకళవే

కళకళలాడే కళగా నీవే నాలో కలవుగా

కల కలమే ప్రభవించనీ నిను నా కవనకళగా


1.నా జీవన భవానివి

నే మెచ్చిన విభవానివి

మరపురాని అనుభవానివి

నా బ్రతుకున అపురూప సంభవానివి

విరివిగా లభ్యమవని బ్రహ్మకమల విరివి

తలచినంత మేనంతా వ్యాపించే ఆవిరివి


2.నా ఎదబీడుకు తొలకరివి

నా ప్రబల ప్రణయ మకరివి

తోడై ననునడిపే అభయంకరివి

సతతము సంతసము కూర్చు శ్రీకరివి

ఈ ఇలలో నాకోయిలవై గీతాలయవైతివి

శ్రావ్యగాత్ర మాధురితో నాలో లయమైతివి

 

https://youtu.be/9STIildrMFk?si=R29zPQssoL3PxMK9

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెల్లారనీకు ఈ చీకటి రాతిరిని

భరించలేను నిజాల వెలుతురిని

పిల్లాడి నూరడించు అమ్మజోలని

మైమరచి వింటు కలల తేలనీ


1.ఏవో చిక్కులలో చిక్కుకొని

దిక్కూమొక్కేదో వెతుక్కొని

అంతుచిక్కక అభయం దక్కక

శరణంటిని స్వామీ నిను మొక్కుకొని


2.అంతులేని వింతకథలు

తల నిండా తరగని వెతలు

నిరతమూ మొలకెత్తే కవితలు

శ్రోతల ఓరిమికివె చేజోతలు


https://youtu.be/rGArfvLho5o?si=BtmbX407ZaPBPjYE

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసానంది


ఉగ్ర మహోగ్ర విగ్రహా నృసింహా

భీకరాకారా శ్రీకరా భక్తానుగ్రహా

గోదావరి నదీ తీర మా ధర్మపురీశా

ప్రహ్లాద రక్షకా శేషప్ప కవిపోషా

నమో దుష్ట సంహారా నరమృగవేషా


1.జ్వలిత రక్త నేత్రా విచలిత గాత్రా

విస్ఫులింగ వీక్షణ అరిదైత్యభీషణ

దంష్ట్రా కరాళ ముఖా వజ్రతీక్ష్ణ నఖా

స్తంభ సంభవా ప్రభో భార్గవీ వల్లభా

నమో దుష్ట సంహారా నరమృగవేషా


2.శంఖచక్ర భూషణా శరణు సంకర్షణా

అగణిత మహిమాన్వితా వందిత చరణ

త్రిగుణాతీతా త్రిజగన్మోహన నారాయణా

ఆశ్రిత వత్సల ఆగమ వర్ణిత కరుణాభరణా

నమో దుష్ట సంహారా నరమృగవేషా

Sunday, September 11, 2022


https://youtu.be/PrG9mE2h3tU?si=rKGdKn67TeM67FKI


 శ్రీరస్తు శుభమస్తు-ఆయురారోగ్యమస్తు

శుభసంకల్పమస్తు-శివసంకల్పమస్తు

సర్వేజనాః సర్వదా-సుఖినోభవంతు

అరుణాచలేశ్వరా -సిద్ధింపజేయగ నీవంతు


1.పిపీలికాది బ్రహ్మ పర్యంతం

నీ ఆనతితోనే చైతన్యవంతం

మనోబుద్ధ్యహంకార చిత్తాలు సైతం

నీ కృపతోనే సాఫల్యవంతం

అరుణాచలేశ్వరా ప్రసాదించు  ప్రశాంతం


2.తారుమారవుతాయి స్థితిగతులు

తామసులు పరిణమించి తథాగతులు

సజీవులవుతారు శివా నీ శరణాగతులు

పునీతులవుతారు వినినంత నీ వింత సంగతులు

అరుణాచలేశ్వరా మన్నించు మా వినతులు


Saturday, September 10, 2022

OK

ఎందుకోయీ నందబాల 

ఇంతటి కాఠిన్యము

వెన్ననెంతో తిన్నగాని 

నీకేల కరకు హృదయము


ఎందుకోయీ నందబాల 

ఇంతటి కాఠిన్యము

వెన్ననెంతో తిన్నగాని 

నీకేల కరకు హృదయము


యుగములు పొగిలిన నీ జాడే కనరాదు

యమునాతటి నెంత వెతికినా నీ ఆచూకేలేదు

జాగేలా చెంతకికనైనను ఏతెంచను

బాలను నను గైకొను  వేగిరముగను


ఎందుకోయీ నందబాల 

ఇంతటి కాఠిన్యము

వెన్ననెంతో తిన్నగాని 

నీకేల కరకు హృదయము


పరకాంత చింతనే లేదందువా

పరాకుచెందితివా గోవింద మాధవా

పరిపరి విధముల వేడితి పరమాత్మా

పరసౌఖ్య మందీయ భవతాపమేబాయ


ఎందుకోయీ నందబాల 

ఇంతటి కాఠిన్యము

వెన్ననెంతో తిన్నగాని 

నీకేల కరకు హృదయము

https://youtu.be/Nr6DUVzEW58


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఫలించని కలలెన్నో

నెరవేరని ఆశలెన్నో

ఎండమావులౌతున్నాయి దరిజేరుతుంటే

నీటిబుడగలౌతున్నాయి చేజిక్కించుకుంటే


1.నోటికందకుంది కంచంలో బుక్కైనా

 చేదుగా మారుతోంది అది మిఠాయి ముక్కైనా

జన్మ కుండలి లోపమే ఇది కాబోలు

అంతుబట్టని మర్మమే విధి శాపాలు


2.సమయం మించుతోంది సమకూరులోగా

గగన గండమౌతోంది కలతలా మలకమైనా

విక్రమార్కుడే నాకు ఆదర్శమవ్వాలి

భగీరథుడి తీరుగా గంగభువికి దించాలి

Thursday, September 8, 2022

 https://youtu.be/RxeYUbswQoU

వేంకటేశ నిన్నే నే శరణంటా

సంకటాలు నన్నంట రాకుండా ఏ పూట

శ్రీకాంత నీవుంటివి నా మనసంతా

చింతలు వేధించునా చిదానంద నీ చెంత

శ్రీనివాస శ్రీధరా ముకుంద మాధవా

గోవిందా వాసుదేవ విష్ణవే నమః


1.ఉన్నచోట ఉండనీయవు  ప్రశాంతంగా

ఉన్నంతలొ గడుపుకోనీయవు తృప్తికరంగా

బరిలోకి తోస్తావు బావురుమనిపిస్తావు

తీరం చేరే లోగా  నావను కుదిపేస్తావు

శ్రీనివాస శ్రీధరా ముకుంద మాధవా

గోవిందా వాసుదేవ విష్ణవే నమః


2.మార్గదర్శివే నీవై నను నడిపించు

ఆత్మబంధువీవై చేయూత నందించు

సద్గురుడవు నీవై సద్బుద్ధి కలిగించు

ఘనవైద్యుడవీవై వ్యాధులు మాన్పించు

శ్రీనివాస శ్రీధరా ముకుంద మాధవా

గోవిందా వాసుదేవ విష్ణవే నమః


Wednesday, September 7, 2022

 


https://youtu.be/A940nSrgD9c?si=49Y8oin_x1u6k3ప

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : మాయా మాళవ గౌళ


కొండలాగ మారనీ గుండెను

ఎండకు ఎండినా వానకు నానినా

ఏమాత్రం చెక్కుచెదరక

ఏవిపత్తుకూ బెదరకా

పల్లానికి పారనీ మదినదిని

వాగులు కలిసినా మలుపులు తిరిగినా

తానెదురీదకా విధినెదిరించకా


1.సంతసించు సమయాన్ని

సంక్లిష్టం చేసుకొంటు

ప్రశాంతతని ప్రతిక్షణం

రణంగా మార్చుకొంటు

కోరి కొరవితో తలగోక్కొంటూ

తప్పుల ఉప్పెనలో చిక్కుకొంటూ

వగచనేలా వాపోవనేలా


2.వ్యాపించనీ ఈ అవని

 ప్రాణవాయువులా

ఆలపించనీ ఆశించని

పికమై పరవశ గానాల

నీ ప్రవృత్తి నీదిగా నీకోసం నీవుగా 

ఆతృత చెందక అడియాసకు లొంగక

అనవరతంగా ఆనందతీరంగా

Friday, September 2, 2022

 https://youtu.be/UhAM7tGY3DM


నీ సంకీర్తన 

చేయనీ ననువేంకట రమణ

నీ పదములునా 

మది దాల్చనీ పావనచరణ

పాహి పాహి శ్రీవేంకటేశమ్

దేహి దేహి శ్రీ శ్రీనివాసమ్


1.నీ దివ్య రూపాన్ని నన్నూ దర్శించనీ

నీ సుందర మూర్తిని నన్నూ వర్ణించనీ

నీ లీలలన్నీ నను దండిగ కొనియాడనీ

నీ మహిలనే పాటగ చాటింపజేయనీ


2.నిరతము నీనామ స్మరణ జేయనీ

నీ గుణ గానాల నను మునిగి తేలనీ

మనసెపుడు నీమీద మగ్నమై చెలగనీ

నను నీలో లయమై శూన్యంగా మిగలనీ



Wednesday, August 31, 2022


https://youtu.be/xitlxchAGP8

రజతాచల వాస  రాజ రాజేశ్వరా

రజత కవచ విరాజ శ్రీ రామలింగేశ్వరా

సీతా రామచంద్ర నిర్మిత సైకత విగ్రహా

పునీతులను కావింపగ సత్వరానుగ్రహా

నమో ధర్మపురీశ్వరా కాశీ విశ్వేశ్వరా


1.గౌతమీ తట విలసిత గౌతమేశ్వరా

తూరుపు దిశ వేలుపు నీలకంఠేశ్వరా

దక్షిణాధీశ ఈశ మృత్యుంజయేశ్వరా

పశ్చిమ దిక్కున వెలసిన ఓంకారేశ్వరా

నమో ధర్మపురీశ్వరా కాశీ విశ్వేశ్వరా


2.మర్మము నెరుకపరచు నర్మదేశ్వరా

సదానందకారకా రామానందేశ్వరా

చకిత విజయదాయకా చంద్రశేఖరా

జగదంబాయుతా త్రయంబకేశ్వరా

నమో ధర్మపురీశ్వరా కాశీ విశ్వేశ్వరా


 https://youtu.be/L4IZICZLWME


విస్తారమైన వీనులు నీవి

వినాయకా వినవేమి వినతులు మావి

నిశితమైన దృక్కులు నీవి

నగజా తనయా కృపగను మము స్వామి


గుండెలోన నిలిపాము అండగ ఉంటావని

గండాలు దాటించు వక్రతుండ నమోనమామి


1.ఉండ్రాళ్ళు నీకు మేము దండిగా పెడతాము

 సంకటాలు గట్టెక్కించు సతతం సత్వరము

కడుపార పెడతాము కుడుములను

కనికరించి తొలగించు మా ఇడుములను


గుండెలోన నిలిపాము అండగ ఉంటావని

గండాలు దాటించు వక్రతుండ నమోనమామి


2.వెలగపళ్ళు పెడతాము బొజ్జనిండ నీకు

వెతలను ఎడబాపవయ్యా వేగిరమే మాకు

పాయసాన్ని ప్రియమార నీకు నివేదిస్తాము

ఆయురారోగ్యాలూ ప్రసాదించ వేడేము


గుండెలోన నిలిపాము అండగ ఉంటావని

గండాలు దాటించు వక్రతుండ నమోనమామి


https://youtu.be/UEV8LEERSvs

సంకల్పము నీ బలము 

సంకటహర గణపతి

పట్టుదలే నీతత్వము

పార్వతి సుత విఘ్నపతి

ఆత్మవిశ్వాసమే నీ ఆరాధన

అవిమాలో పెంచమని మా ప్రార్థన


1.పరమ శివుని ఎదిరించి

కరి వదనము బడసినావు

గణాధిపత్యముకై మాతా పితరుల

ప్రదక్షిణమును సలిపినావు

నీకార్యదీక్ష నీ బుద్దికుశలత

అవిమాకీయమని నీకిదె చేజోత


2.నీ వికటరూపుగని 

పకపకమనె చంద్రుడింక

శాపమిచ్చితివి శశిని గననీకుండ

చవితిన గాంచినవారల కపనింద

మంచి మనసు మానవత నీ వరాలు

అవి మాకొసగమని కోటి నమస్కారాలు




Saturday, August 27, 2022

 

https://youtu.be/11DQwP6BTNs

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తంగేడుపూల రంగూ సీరా కట్టిన రంగమ్మా

సింగారమెలికే నీ నవ్వే పాలామీది పొంగమ్మా

సక్కిలిగింతలెందుకే నను సూసీనప్పుడల్లా

నీసిగ్గూ సిలకెత్తుకెల్లా మెలికెలు తిరిగేవె నిలువెల్లా


1.తురిమావే సిగలోనా తురాయి పూలు

పులిమావే నీలి కనుల కాటుక సోగలు

కొక్కెమేసి లాగుతోంది మనసును ముక్కెర

పెదాల ఊరుతోంది పాకమైన చక్కెర


2.తొడిగావే గాజులను మోచేతి దాకా

ముడిచావే మోజులను రాతిరయే దాకా

నంగనాచి నడుమేమో వేపుతోంది ఆగనీక

బుంగమూతి ఉత్తిదె నీ గుండె గుట్టు నాకెరుక


pic courtesy: Sri Agacharya Artist


https://youtu.be/j3rQ33SbZKI?si=e-E6XQ4BewGTtfyT

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తరించనీ నను నీ గాన లహరి

అంతరించనీ నీ భావనలో శ్రీహరి

మునిగితేలనీ నీకృతుల మురహరి

స్థిరపడనీ తిరుమలేశ నను నీ వేంకటగిరి


1.పలువర్ణాల పదపారిజాతాలు

పలుకనీ నా నోట నీ సంస్తుతి గీతాలు

రమ్యమై చెలగనీ దిగ్దిగంతాలు

రంజింపజేయనీ రస హృదయాలు


2.మ్రోగనీ వీనుల వినుతించు కీర్తనలు

సాగనీ జగమెల్ల భక్త జనుల భజనలు

నలగనీ ప్రతినోట నా పాటల ప్రార్థనలు

కలగనీ మనుజులకు తాత్త్విక యోచనలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరుణ రాగాలు సందడి చేసే

విరులు విప్పారి వన్నెలు పూసే

ఝరుల అలల నురగ లెగసే

మరులు గొన్న నా మది మురిసే


1.పంచదార పలుకులే పరవశింప జేసే

మధుర దరహాసాలే మాయలొ ముంచేసే

కలకోయిల స్వనమంటి గాత్రమే మంత్రమేసే

కలహంస నిర్ణయమల్లే నాతో మైత్రి చేసే


2.రూపమపూర్వ సౌందర్యమై మెరిసే

మనసే అనన్యమౌ సౌహార్ద్రతే కురిసే

సభ్యతా సంస్కృతీ కలిసి అడుగులేసే

ఆత్మీయతే వెన్నెలై నెలపొడుగూ కాసే

https://youtu.be/iwDz1KdzDrw?si=TyjZv62UbzkoZ7qi

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:సారమతి

నీవున్నదే నాకోసము నీలవర్ణదేహా
నీ పదములే నాకు సన్నిధి దివ్య సుందర విగ్రహా
తిరుమలేశ వేంకటేశ కలికల్మషనాశా
వరములు నీ అభయకరములు నాకిల జగదీశా

1.ఆడిస్తావు ఓడిస్తావు నా ఏడుపు వేడ్కగా చూస్తావు
ఓదారుస్తావు ఏమారుస్తావు మరలా బరిలోకి తోస్తావు
ఎగదోస్తావు పడవేస్తావు నా దీనత చోద్యంగా చూస్తావు
క్రీడిస్తా నలిగినా సరే నీ వినోదానికై
ఆడేస్తా  పొగలితేం సర్వదా నీ సరదాకై

2.గొప్పేనా స్వామీ ఎప్పుడూ నాపై నీవే నెగ్గితే
తప్పేంటి ప్రభూ ఓసారైనా నే గెలుపు వైపు మొగ్గితే
ఎలారక్తికడుతుంది ఏ ఆటైనా ప్రత్యర్థి ప్రతిభ తగ్గితే
నాకు నేర్పు గురువుగా ఆడే నేర్పరితనం
ఓటమికైనా బేలగా క్రుంగని తెంపరిగుణం


Thursday, August 25, 2022

 

https://youtu.be/PRpscXB2UQo

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసు చూరగొనని కవితా ఓ కవితేనా

మేధను మురిపింపజేయలేనిదీ గేయమేనా

కదిలే కళ్ళను ఠక్కున ఆపగలుగు ఆరంభం

ఆసాంతం వదలక చదివించే శైలీ శిల్పం


కవితంటే వెంటాడి వెంటాడి వేధించాలి

పాటంటే పెదాలపై సతతం నర్తించాలి


1.వ్రాసిన వారెవరనేది కాకుండా అలరించాలి

వాసిగల భావాలు కవనాన పరిమళించాలి

ఆనోట ఈనోట నాని నాని విశ్వవ్యాప్తి నొందాలి

విరోధులైనా సరే ప్రశంసించగలిగేలా చిందాలి


కవితంటే పదపదము గుండెను పిండాలి

పాటంటే ఒడలంతా పరవశాలు నిండాలి


2.పటాటోపాలు లేక సత్తా ప్రదర్శించగలగాలి

చిత్రపటాలనే ఎద ఎదలో చిత్రింపజేయాలి

ముఖ చిత్రాల చిత్రాలు లేక పదచిత్రణ విరియాలి

చదివిన మది  తనదిగా కవితను  అనుభూతించాలి


కవితంటే కడదాకా విడవని హస్తం కావాలి

పాటంటే కలలోనూ మరవని నేస్తమవ్వాలి

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిరీక్షణే  క్షణం క్షణం నరకం

ప్రతీక్షయే ప్రతిక్షణం ప్రత్యక్ష నరకం

నిర్దుష్ట కాలానికీ ఎదిరిచూపు కష్టసాధ్యం

అస్పష్టపు గడువుకైతె నాదృష్టిలో అసాధ్యం

క్షణమొక యుగమౌతుంది చెలి విరహంలో

యుగమే క్షణమై కరుగుతుంది సమాగమంలో


1.పదునాలుగు వర్షాల వనవాసం

పన్నెండు వత్సరాల అరణ్యవాసం

తడబాటు లేక ఎడబాటెలా సైచారో

విసుగన్నదే లేక అంతగా ఎలా వేచారో

క్షణమొక యుగమౌతుంది చెలి విరహంలో

యుగమే క్షణమై కరుగుతుంది సమాగమంలో


2.ఒక యాతన గొంగడిక్రిమి సీతాకోక చిలుకవగా

ఒక వేదన  రామకథే బోయనోటి పలుకవగా

గర్భస్థ శిశువు తపన నవమాసాలూ ఓర్పుగా

శతమానం భవతియే ఈ నర జన్మకు చాలింపుగా

క్షణమొక యుగమౌతుంది చెలి విరహంలో

యుగమే క్షణమై కరుగుతుంది సమాగమంలో

Wednesday, August 24, 2022

https://youtu.be/xVTv2Gl0F9M?si=kmtlemzFUXcz-dAx

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:వలజి

నా మనసంటి స్నిగ్ధవు నీవు
నా మదిదోచు ముగ్ధవు నీవు
ఎంతకూ తీరిపోని దుగ్ధవు నీవు
నాకెప్పటికీ అస్పష్టపు సందిగ్ధవు     

1.జిలేబీలా నోరూరే రసజ్ఞవు
జిలిబిలి  పలుకుల అభిజ్ఞవు
జాబిలి సొగసుల మనోజ్ఞవు
నను జాగృత పరిచేటి ప్రజ్ఞవు

2.నిరంతరం నా ప్రేమదీక్షవు
 యుగ యుగాల నా ప్రతీక్షవు
నీవే నీవే చెలీ ఏకైక నా అపేక్షవు
నేనుగా వేసుకున్న తీయని శిక్షవు


https://youtu.be/IIEj2udUhjg?si=eB1YkjBHE9hUI_-P

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:కీరవాణి

నిండు పున్నమే నేడు
ఐనా కటిక చీకటే నాతోడు
నందనవనమే నా ముందు
ఐనా ఎడారే నా మనసందు

ఎన్నుంటేం చెలీ పక్కన నువ్వేలేక
సున్నానైనాను చక్కని నీ నవ్వుల్లేక

1.ప్రేమిస్తేనే తెలిసేది ఎడబాటు బాధ
సహానుభూతితోనే ఎరిగేవు మనోవ్యధ
తేలికగా తీసుకోకు నా అపార అనురాగం
తేలితేలి పోనేపోదు నీతో నా సహయోగం

ఎన్నుంటేం చెలీ పక్కన నువ్వేలేక
సున్నానైనాను చక్కని నీ నవ్వుల్లేక

2.కంచెలెన్నొ దాటుకొని నీకై అరుదెంచా
ముళ్ళదారులెన్నెన్నో కడచి నా చేయందించా
నిన్ను చేర అధిరోహించా ఆగమేఘాలు
నన్ను ఔననడానికింకా ఏల మీనమేషాలు

ఎన్నుంటేం చెలీ పక్కన నువ్వేలేక
సున్నానైనాను చక్కని నీ నవ్వుల్లేక


Monday, August 22, 2022

https://youtu.be/Nhj3T25HKSU?si=WsZ5tsgYnh-4h_ఓం

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


నీ ఆగడాలు ఆగాలి సుడిగాలి

నీ దుడుకు తనం తగ్గాలి వడగాలి

బలమెంతో ఉందని చెలరేగిపోకు

నిలకడే లేని నీకు ఇంత నీల్గుడెందుకు


1.వానతో చేరి నీవు భీభత్సం సృష్టిస్తావు

నిప్పుతో జతగూడి దావానలమవుతావు

కడలి అలలతో కలిసి ఉప్పెనై ముంచేస్తావు

చండప్రచండ రూపంతో ప్రపంచాన్నే వణికిస్తావు


2.రైతుపంట కొల్లగొట్టి కంటనీరు తెప్పిస్తావు

జాలరిని అంతలోనే గల్లంతు చేసేస్తావు

బాటసారి ప్రాణాంతకమౌ వడదెబ్బ తాకిస్తావు

ఇల్లాలి పొదరింటిని పెంట పెంట చేస్తావు


3.చిరుగాలిగా మారి విరితావి నందించు

ప్రియురాలి ముంగురులూపి అందాలు పెంచు

శ్రమజీవికి స్వేదమునార్పి బడలికను తొలగించు

మవ్వన్నెల జెండాను నింగిలొ రెపరెపలాడించు


4.స్వఛ్ఛమైన ప్రాణవాయువై ఊపిరులందించు

శాంత దూతనీవై జగమంతా స్వేఛ్ఛను పెంచు

పంచభూతాల ఖ్యాతిని నీవొకింత ఇనుమడించు

రామబంటు జనకునిగా శుభమునలనే ఒనగూర్చు



https://youtu.be/01D9HadO6M4?si=Qcve9wo6mvbFxQxr

శివశంకరా-అభయంకరా

హరహర పురహర గంగాధరా

శంభో మహాదేహ బృహదీశ్వరా

కరుణాంతరంగా అరుణాచలేశ్వరా

ప్రణమామ్యహం ప్రణవనాదేశ్వరా

భజామ్యహం భవానీ రాజరాజేశ్వరా


1.అంజలింతు నీకు అమరనాథేశ్వరా

కొణిగె నీకిదే గొనుము గోకర్ణేశ్వరా

కైమోడ్పులివె నీకు భంభం బోలేశ్వరా

మొక్కెదను మనసారా మురుడేశ్వరా

ప్రణమామ్యహం ప్రణవనాదేశ్వరా

భజామ్యహం భవానీ రాజరాజేశ్వరా


2.సన్నతి నీకిదే పశుపతినాథేశ్వరా

వందనమునందుకో మహానందీశ్వరా

దండంబులుగైకొను కాళేశ్వర ముక్తీశ్వరా

శరణీయమంటిరా రామలింగేశ్వరా

ప్రణమామ్యహం ప్రణవనాదేశ్వరా

భజామ్యహం భవానీ రాజరాజేశ్వరా





Sunday, August 21, 2022

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


జయము నీకు జయ విజయుల అధిపతి

జయము నీకు జయము విజయ సారథి

జయము నీకు తిరుమల శ్రీ వేంకటపతి

జయములు దయచేయుము మాయమ్మ అలమేలు మంగాపతి


1.కలుషితమైన మా చిత్తములకు ఔషధము

భవ తారక మంత్రమైన గోవింద యను పదము

అనవరతము నామ స్మరణ అందించు పరమపదము

విడువను నే గరుడగమన తలనిడుదును నీ పదము


2.ఇడుముల నిన్నిన్ని నా కొసగితివే గాని

పొరబడి సైతము నిను వదిలితినా ఇభవరద

సమీక్షించుకో నా సంయమనము గమనించుకో

అయినను ధర్మమని తోచినచో నన్నుపేక్షించుకో

 


https://youtu.be/JNsw3pAXnWQ?si=nULwLk_lhNqkrcC4

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


అష్టమినాడు పుట్టిన కిష్టయ్య

అష్టకష్టాలు ఆ నాటినుండే నిను పట్టెనయ్యా

అష్టమ సంతానమైతివి దుష్టుల హతమార్చితివి

అష్టభార్యల కిష్టుడివైతివి జీవిత విస్పష్టగీత నుడివితివి


1.కాళింది నది నీపాదాలు చుంబించె

కాళీయుడు నీపాద ముద్రలు తలదాల్చె 

బ్రహ్మకైన వరములు నీదివ్య చరణాలు

నీ చిట్టి పదచిన్నెలు మా నట్టింటికి వన్నెలు


2.ఉట్టికట్టిపెట్టాను నా ఊహలు ఊసులు

నీ కందే ఎత్తుకె ఉంచాను వెన్నా మీగడలు

దోచుకొనుట ఇష్టమని నీకై దాచిపెట్టినాను గాని

నీవెరగని దేమున్నది ఎరిగితి సర్వాంతర్యామివని


*కృష్ణాష్టమి శుభాకాంక్షలు*

 

https://youtu.be/vGYa-03yR2I?si=AjHmgFEJqDbMMLlS

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక్కసారి తప్పకుండ చచ్చిపోత

నీ వాడి చూపుల తూపులు గుచ్చుకొని

ఒకసారి మాడిపోయి మసినౌతా

నీ వేడి తపనల సెగలను తగులుకొని

మంచి చెడ్డ లెంచడెవడు చంచలాక్షి నిన్నుగాంచి

ప్రపంచమంత దారబోసీ తా దాసుడౌను తలవంచి


1.నీ అందచందాలు వర్ణనాతీతాలు

నీ మేని పొంకాల పోల్చవలం కారాలు

నీ హావభావాలు మదన విలాసాలు

నీ ఒంపు సొంపులు రామప్ప శిల్పాలు

మంచి చెడ్డ లెంచడెవడు చంచలాక్షి నిన్నుగాంచి

ప్రపంచమంత దారబోసీ తా దాసుడౌను తలవంచి


2.ముట్టుకోనంటె పందెం ముప్పైయారు లక్షలు

ముద్దెట్టుకోనంటె పణమే మూడుకోట్ల రూకలు

కౌగిలించ మానుకుంటె నెత్తమే నాఆస్తిపాస్తి మొత్తము

చూసి తలతిప్పనోడు మనిషంటె ఒప్పదు నా చిత్తము

మంచి చెడ్డ లెంచడెవడు చంచలాక్షి నిన్నుగాంచి

ప్రపంచమంత దారబోసీ తా దాసుడౌను తలవంచి

Thursday, August 18, 2022

 https://youtu.be/tIys6sZvVZ8


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వజ్రోత్సవ భారతమా నీకు వందనం

త్రివర్ణ పతాక విరాజితమా నీకు సలాం

అకుంఠిత దీక్షా బలిదాన ఫలం నీ విజయం

అప్రతిహతం స్వాతంత్ర్యానంతర వికాసం

వందేమాతరం జైహింద్ నినాదమే నిరంతరం


1.ఆంగ్లేయుల పాలనలో అణగారిన చైతన్యం

అరాచకాలతో దాష్టీకంతో నీదెంతటి దైన్యం

సిపాయిల తిరుగుబాటుతో తొలి స్వతంత్ర పోరాటం

ఉధృతమాయే సత్యాగ్రహ దీక్షతో గాంధీజీ సంగ్రామం

అప్రతిహతం స్వాతంత్ర్య సమరం ఆద్యంతం

వందేమాతరం జైహింద్ నినాదమే నిరంతరం


2.కొదవలేదు నీపుత్రులకు నిజ దేశభక్తులకు

సాటిరారు మన శాస్త్రవేత్తలకు మేధావులకు

ఎందరెందరో కదా ఘన నేతలు ప్రగతి విధాతలు

ఎందరో కీర్తితెచ్చిన మహనీయులు విధేయులు

అప్రతిహతం స్వాతంత్ర్యానంతర వికాసం

వందేమాతరం జైహింద్ నినాదమే నిరంతరం


OK


https://youtu.be/YlNe1KvNR38?si=_fHJ2FpZcoX7FK7R

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:చంద్ర కౌస్

వెన్నెలంటి చల్లని నీ వీక్షణం
గుండెలో గుచ్చేంత తీక్షణం
కొక్కానికి చిక్కడమే ప్రేమలక్షణం
నువ్వనుమతించు వరకు నిరీక్షణే క్షణక్షణం

1.తలదాల్చిన ఆ విరులే
నా ఎదరేపెను ఆవిరులే
చెలరేగెను మరిమరి మరులే
నివేదించగా నీకవి సోమరులే

2.సృష్టించిన విధే నిను వరించగా
ఉచితముగాదని వాణీ నిలువరించగా
ఎంచి ఎంచి నాకే నిను బహుకరించగా
ఈ జన్మకిదిచాలని మదియె పులకరించెగా


Saturday, August 13, 2022


https://youtu.be/xTUfL-KnynY?si=i_raTE6_VHOMmV_b

శివాయ గురవే నమః శ్రీదక్షిణామూర్తయేనమః

భవానీ పతయేనమఃశంభోమహాదేవాయనమః

నీ నామ గానాలు నిగమార్థసాధకాలు

జ్యోతిర్లింగ రూపాలు పరమార్థ దాయకాలు

పాలించరా నను లాస్యవినోద

పరిమార్చరా వేగిరమే నా వ్యధ


1.తామరాకు మీది తుషారం నీవ్యవహారం

తాపసివైనగాని భార్యా పిల్లల సంసారం

అంతుపట్టలేకుంది హరా నీతత్వసారం

అన్నీ ఉన్నాయిగాని అనుభవానికైతె దూరం

పాలించరా నను లీలా వినోద

పరిమార్చరా వేగిరమే నా వ్యధ


2.సాకారం నిరాకారం ఇదమిద్దంకాదు నీ ఆకారం

సైకతమున్నగాని సాంబా నీరూపు సాక్షాత్కారం

ఈశ్వరాన్వితమై ప్రతిపదం నీ మంత్రాక్షరం

అస్పష్టపు సందిగ్దపు అశాంతి జీవితం నీవరం

పాలించరా నను గానవినోద

పరిమార్చరా వేగిరమే నా వ్యధ


https://youtu.be/bSWix6bO3gQ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ వగలు చూస్తే నాకు కెవ్వు కెవ్వు

నీ సెగలు చూస్తె నాకు జివ్వు జివ్వు

మరులు రేపుతోంది నీ నడుం ముడత కొవ్వు

ఆగలేను వేగలేను సైచలేను మన నడుమన దవ్వు


1.నీ పరువం విరిసిన పువ్వు

నా ప్రణయం తపనలు రువ్వు

నీవల్లనే నా బ్రతుకున  నవ్వు

నా మదినున్నది ఒకేఒక నువ్వు


2.రాజుకుంటోంది కోర్కెల కుంపటి

చొరబడమంటోంది కొంటె దుప్పటి

తనువులు లతలై పెనవేయుట పరిపాటి

ఒకటితో ఒకటి కూడితే ఫలితమూ ఒకటి

Ok

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆకాశరాజుకు జామాతనీవు

లోకాలనేలెడి అధినేతవు

వకుళామాతకు ప్రియమైన సుతుడవు

శుకశౌనకాది ముని సేవితుడవు

జనకుడవునాకీవె నిజహితుడవు

వేంకటేశా నమో కలిభక్త వరదుడవు

కొనియాడ నాతరమ కొండలరాయా

మెప్పింప నావశమ పద్మావతీ ప్రియా


1.రత్నమకుటమునీకు చేయించలేను

పట్టు పీతాంబరం పట్టి పెట్టగాలేను

వైజయంతీమాలనల్లి వేయగలేను

వాసిగా నగలేవి తీర్చి దిద్దగలేను

వదలినా పీల్చినా ఊపిరితొ నీపేరె

నిదురలో మెలకువలొ ఏదైన నీతీరె

కొనియాడ నాతరమ కొండలరాయా

మెప్పింప నావశమ పద్మావతీ ప్రియా


2.వేవేల పదముల వేగ రాయగలేను

తీరైన రాగాల పాడి కొలువగలేను

మధుర గాత్రమ్ముతో రంజిపగాలేను

వేదమంత్రాలతో వేడి మ్రొక్కగలేను

మనసులో మాటలో చేతల్లొనీవే

నాకున్న ఏకైక దిక్కుమొక్కువు నీవె

కొనియాడ నాతరమ కొండలరాయా

మెప్పింప నావశమ పద్మావతీ ప్రియా

Friday, August 12, 2022

 

https://youtu.be/gLpCLQBz0ls?si=Ahri4v6Wi2జీసీనవైజజ్

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పురిటి నొప్పులు -పుడమి తల్లికి 

వానకారున-చినుకు పడితే

కలల పంటయె-కవుల జన్మకి 

పొత్తమొక్కటి -అచ్చు పడితే


నిండి ఉంది -లోకమంత

ఆనందమే -నందించగ

ఆత్మ బంధులె-మనుజులంతా

అనురాగ సుధనే-పంచగ


1ఎంచి చూడగ దొరకదా 

మంచి ఎందైనా!,

దృక్పథాలే సజావైతే

ఎందుకిక ఏ మందైనా


పైమెరుగుల అందమెందుకు

ప్రేమించక హృదయ మందైనా

వెగటు పుట్టదా రోజూ తినగ 

కమ్మని షడ్రుచుల విందైనా


2.నిర్మించుకోవలె మనకుమనమె

మనమున కలల సౌధమే

గుర్తించి గురుతుంచుకోవలె

మేధోజలధి అగాధ నిధులే


ఎంత ఎదిగితె మాత్రమేమి

ఒదుగు సూత్రమెరుగక

సంపదెంతో సొంతమైనా

శాంతి పొందక చింతయేనా

https://youtu.be/dkMPCA1LsZA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం : వలజి 


అన్న ఎడల అనురాగం-చెల్లి పట్ల మమకారం

అక్కతోటి అనుబంధం-తమ్ముడంటె లాలనం

అనుభూతులు పంచే-ఆత్మీయత పెంచే

అపురూప బాంధవ్యం రక్షాబంధనం

ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం


1.ప్రేగు పంచుకున్న రక్త సంబంధము

ఆటపాటల  బాల్య స్నేహ బంధము

సహపాఠీలుగా పోటీపడిన ఆ చందము

వింతగా విధి కలిపిన అనూహ్య బంధము

అనుభూతులు పంచే-ఆత్మీయతలు పెంచే

అపురూప బాంధవ్యం రక్షాబంధనం

ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం


2.ఎంతటి కష్టమొచ్చినా అండగనిలిచేది

ఏ అవసరమొచ్చినా తోడుగ నడిచేది

బలము బలగమనే భరోసా ఇచ్చేది

ఇంటికి ఆడపడుచే కళాకాంతి తెచ్చేది

అనుభూతులు పంచే-ఆత్మీయతలు పెంచే

అపురూప బాంధవ్యం రక్షాబంధనం

ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం

Tuesday, August 9, 2022

 

https://youtu.be/DIzxLcZG0i4?si=HUX48gH7J2U3py2D

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొందరిని చూస్తే పెట్టబుద్ధి

కొందరిని చూస్తే మొట్టబుద్ది

కలిసిన వేళా విశేషమేమో

ఎదురైనప్పటి దుర్ముహూర్తమో

మూడునాళ్ళ ముచ్చటకెందుకు అకారణ ద్వేషాలు

నవ్వులు పంచుకుంటె చాలు ఏల వ్యర్థావేశాలు


1.కలుపుకొనగ సరిపోని సారూప్యతలు

వెతికి మరీ విభేదించు వ్యతిరేకతలు

తన బాటలొ సాగాలను నియంత పోకడలు

విభజించి వినోదించు వింతవింత ఎత్తుగడలు

మూడునాళ్ళ ముచ్చటకు అకారణ ద్వేషాలు

నవ్వులు పంచుకుంటె చాలు ఏల వ్యర్థావేశాలు


2.పారదర్శకత్వమే హృదయాన మృగ్యము

కప్పదాటు మాటలే అలవాటై నిత్యము

నిర్దుష్టతే కరువైన అస్పష్టపు వ్యక్తిత్వము

నొప్పించి మరీ ఆనందించే పైశాచికత్వము

మూడునాళ్ళ ముచ్చటకు అకారణ ద్వేషాలు

నవ్వులు పంచుకుంటె చాలు ఏల వ్యర్థావేశాలు

Monday, August 8, 2022


https://youtu.be/mdZJlCAHfrw

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


సుందరాకార సుందర కాండ శూర

వందిత పాదాబ్జా హనుమ వానరవీర

లంకాదహనా ఆంజనేయ దానవ భంజన 

శంకరాంశ సంభూత సీతాశోకవినాశా

సాష్టాంగవందనాలు వాయునందనా


1.రామనామ మహిమను ఋజువుపర్చినావయ్యా

శ్రీ రామబంటుగ జగమున కీర్తికెక్కినావయ్యా

రోమరోమమున రాముడిని నిలిపి కొలిచినావయ్యా

మా హృదయారామమున కొలువుదీరవయ్యా


2.చిరంజీవి నీవుకదా సాక్షత్కరించవయ్యా

సంజీవరాయుడవే ఆరోగ్యమీయవయ్యా

జితేంద్రియా మామతిని అదుపుచేయవయ్యా

రామభక్త మారుతీ భక్తిని కలిగించవయ్యా

 

https://youtu.be/9exDi_FuGX8?si=SEjX0aKM3Kp1cuDM

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నందివాహన నాగాభరణ

నమోస్తుతే నగజా రమణ

శరణంటిని పావన చరణ

కురిపించరా హర నీ కరుణ


1.అభిషేక ప్రియ గణేశ జనకా

బిల్వదళార్చిత ముక్తి దాయకా

కన్నప్ప సేవిత కామిత వరదా

మార్కండేయ ప్రాణదాయకా

వందన మిదిగో సుందరేశ్వరా

నందము నందించరా నటేశ్వరా


2.గంగాధర హే చంద్రశేఖరా

గరళకంఠ శంభో మహేశ్వరా

లేంబాల విలసిత రాజేశ్వరా

ధర్మపురీ శ్రీరామ లింగేశ్వరా

మొరవినరా సిరిగిరి మల్లీశ్వరా

సరగున బ్రోవర భోలా శంకరా

Sunday, August 7, 2022

https://youtu.be/wDQ833ncT6Y?si=OiY8o3DJzpfF7obV

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : సిందు భైరవి

వాలెను సీతాకోక చిలుక
గులాబీ వయ్యార మొలక
వలపులనే చిలికెనులే రామచిలుక
గోరింకతో అంకురించగ ప్రేమమొలక
ప్రతి అనుబంధం ప్రకృతి కానుక
మనలోను రవళించే ప్రణయగీతిక

1.రాసిపెట్టి ఉంది కాబట్టే మన కలయిక
సెలయేరై చేరింది నీవల్లే రేపను మరీచిక
పారలేదు నెరవేరలేదు విధి విసిరిన పాచిక
కడదాకా వీడని బంధం మనదన్నదే పూచిక
ప్రతి అనుబంధం ప్రకృతి కానుక
మనలోను రవళించే ప్రణయగీతిక

2.మధుర సాహచర్యమే మనకు నిత్యవేడుక
పచ్చని కాపురమే పరమానందపు వేదిక
ఒకే మాట ఒకే బాటగా జీవితాన మన నడక
అనుభవిద్దాం అనుక్షణం మించితె ఈ తరుణం రాదిక
ప్రతి అనుబంధం ప్రకృతి కానుక
మనలోను రవళించే ప్రణయగీతిక


మువ్వన్నెల జెండా మన గుండే

మన దేశపౌరులకూ అండగుండే

కాషాయం తెలుపు ఆకుపచ్చ కలగలుపులొ ఎంతో వెలుగుండే

ధర్మచక్రమ్నది మన జెండాకే గుండెగుండే

ఎగురేద్దాం ఇంటింటా స్వేఛ్ఛా పతాకను

నీలినింగికంతటికీ మన కీర్తితాకనూ

పంచ సప్తతి స్వతంత్ర వసంతమా జయహో

అజాదీకా అమృత మహోత్సవమా జయహో


1.దాస్యశృంఖలాలతో బానిసగా చెఱసాలలో

మ్రగ్గిమ్రగ్గి క్రుంగి క్రుంగి నిస్సహాయగా పరపాలనలో

పడరాని పాట్లు పడతూ కన్నీళ్ళతో బ్రతుకీడుస్తూ బేలగా కబేలగా

ఏదిక్కు తోచక ఆదుకునే దిక్కే లేక

అయోమయంగా అమాయకంగా ఆనాడు


దండియాత్రతో దండయాత్రనే ప్రకటిస్తూ

ఉదయించిన గాంధీజీ నిలిచాడు తోడు


2.అజాద్ హింద్ ఫౌజ్ తో కదన బాటగా  ఎగరేసాడు విప్లవబావుటా  బాసగటగా

కదంతొక్కుతూ అదను చిక్కగా ఎదిరించాడు

సుభాసు బోస్ బెదరిని నేతగా పోరుకూతంగా

ఆసేతు హిమాచలం జైహింద్ నినాదంగా

స్వరాజ్యమే జన్మహక్కన్నదొకటే వాదంగా


సాధించిరి స్వతంత్రం యోధులంతా 

ప్రాణాలర్పించి బలిదానంగా తృణప్రాయంగా


OK

Saturday, August 6, 2022

https://youtu.be/YMAHhI0gnNc


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:తోడి


స్నేహానికి అర్థమంటె మనమే నేస్తం

మైత్రికిగల పరమార్థం మనమే సమస్తం

వెలితి నాకెపుడుతోచినా అది నీ సోపతి

తులలేని కలిమి నా కిలోనిది నీ చెలిమి


1.పొద్దుపొడుపు నీ స్నేహ మాధుర్యం

నన్ను నడుపు అండగ నీవున్న ధైర్యం

ఆటవిడుపు వత్తిడిలో నీ సహచర్యం

ఎంత ఒడుపు ఆలంబన నీ ఔదార్యం


2.గొంతు తడుపు జీవనది మన స్నేహితం

సేదతీర్చు చెట్టునీడ మన మైత్రీబంధం

దారిచూపు దిక్సూచి మన ఆత్మాబంధం

బ్రతుకు పరిమళింపజేసే సుగంధం మన సంబంధం

 https://youtu.be/IHTUd6GLEXk?si=4nLpCUbokKYLlnFT

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:పీలూ

ఎంతగా నేనెదురుచూచితినో
ఎనుబదినాలుగు లక్షల జన్మలెత్తి
ఎంతగా నే వగచియుంటినో
పదేపదే పదేపదే ఇట పుట్టి చచ్చి
తుదకు దొరికె స్వామి ఈ దుర్లభనరజన్మ
వదులుకోనీ తడవ కాదనక నను చేకొమ్మా

1.విజ్ఞత విచక్షణ ఎరగని అజ్ఞానినైతి
ఆహార నిద్రా భయ మైథునాలే నాకు స్మృతి
ఎన్నాళ్ళీ పంకిల వలయమౌ పుట్టుక మిత్తి
కణ కీటక మత్స్య పక్షి మృగ జీవాకృతి

తుదకు దొరికె స్వామి ఈ దుర్లభనరజన్మ
వదులుకోనీ తడవ కాదనక నను చేకొమ్మా

2.నిన్నటిదాకా నే పశువునే మనిషి రూపునా
వచ్చిన పని మరచి తుఛ్ఛవాంఛల ప్రాపునా
ఏ ఒక్కటి చేసితినో సత్కర్మ నీ ప్రేమ వశాన
అవగతమాయెనా జీవితపరమార్థమీ క్షణాన

శరణాగతినీవే నను నీలో కలుపుకో గణనాథా
వదులుకోను ఈ తడవ కాదనక నను చేకొమ్మా


 https://youtu.be/i54cDOk1bXw


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శ్యామ


తిరు వేంకట నారాయణా శరణం

మరువను స్వామీ మనమున నిన్నేక్షణం

అడుగడుగున నా మనుగడకు నీవేకారణం

పరమాత్మా పురుషోత్తమా విడువను నీ చరణం


1.అరయగ నాకుబలాటము తిరుమల మందిరం

మెరయును కాంచగ అద్భుత కాంచన శిఖరం

సరగున చనెదను పొందుటకై నీదివ్యదర్శనం

చమరించును కని నా కన్నులు నీ రూపమెంతో సుందరం


2.వేల వేదనలు తీర్చమని వేడగ నీకడకొస్తిని కొండలరాయ

కోటి కోరికలు కోరెదననుకొంటిని  నిను కోనేటిరాయ

కల్పవృక్షమే నీవైనప్పుడు పత్రం పుష్పం ఫలములు నాకేల

నీ పదముల చెంతన చింతలుండునా మననీయి స్వామి  నీ మ్రోల

 

https://youtu.be/bG-Z8FxBArw

రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


నీకూ నాకూ లేనే లేదు వేరువేరుగ జీవితం

ఇరువురిదీ ఎప్పటికీ ఒకటే ప్రేమగీతం

పరువాలు ప్రాయాలు అయితేనేం పరిమితం

జన్మలుగా విడిపోనీ మన బంధం శాశ్వతం


1.తనువులు తాకని తపనలనెరుగని రాగబంధం

పరిపరి తలచెడి చనువుగ మసలెడి ఆత్మబంధం

నిన్ను చేరుకోవాలని నిరంతరం ఉబలాటం

నీ మనసు నల్లుకోవాలని అనునిత్యం ఆరాటం


2.కుదురుగా ఉండదు- నిన్ను కనని నా మది

చెదిపోతుంటుంది పనేదైనా- నిలవనీదు నీ యాది

రేయంతా కురిసేను- మనమీద- కలల కౌముది

కాలమే కట్టాలి -ఇకనైనా - మనలను కలిపే వారధి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:రీతి గౌళ


పువ్వు మూతి ముడిచింది

నీ నగవు సొగసు తూగక

కలువ కినుక బూనింది

నీ కనులకు సరిపోలక

బ్రతకనీ పాపం వాటిని

వాటి మానాన భువన వాటిని


పందానికి అందదేది నీతో జగతిన

నీ అందానికి వందనమే సుందరానన


1.నరదృష్టి నీమీద సోకుతుందని

నీ సోకు ఎడల బెంగ నా ఎడదని

సూర్యరశ్మి తాకితే కములుతుందని

నీ మేనుపట్ల నాకెంతో దిగులే భామిని


దాచలేను సైచలేను మనోభావాలని

నిను కావగ భ్రామరినై నీపై వాలని


2.గర్వమే నీ అపూర్వ సౌందర్యానికి

ఓర్వను నిన్నోర్వకుంటె ఒరులనేనాటికి

ముప్పిరులేగొనసాగే మరులు ముమ్మాటికి

చప్పున నినుగన తపనే చీటికిమాటికి


దయగనవే దరిజేరగ తరుణీ లలామ

కన్నుల ఏలనీ ననునీ లావణ్య సీమ


PIC courtesy: Sri. AGACHARYA artist

Thursday, August 4, 2022

https://youtu.be/G7cPbdhVGl0?si=42M_xf1tQO97B9jW

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:భీంపలాస్

మాట మట్టి కరిపిస్తుంది
మాట ఎదను తెగ కోస్తుంది
మాట మమత పంచుతుంది
మాట చనువు పెంచుతుంది
మనుషులను కలిపే వంతెన మాట
మహోన్నతికి చేర్చే నిచ్చెన మాట
మాటే దివ్య మంత్రము మాటే ఇంద్రజాలము
మాటే భవ్య మార్గము మాటే దుర్గమ దుర్గము

1.కొన్నికొన్ని మాటలు రతనాల మూటలు
మరికొన్ని మాటలు తేనియల తేటలు
కొన్నిమాటలైతే ఎడతెగని ఊటలు
ఇంకొన్ని మాటలైతే అభ్యున్నతి బాటలు
మాటే దివ్య మంత్రము మాటే ఇంద్రజాలము
మాటే భవ్య మార్గము మాటే దుర్గమ దుర్గము

2.గుండెలో గుచ్చుకుంటాయి ఈటెల మాటలు
కాపురాన చిచ్చుబెడతాయి చెప్పుడు మాటలు
జోల పాటలవుతావు మార్దవాల మాటలు
మేలుకొలుపులవుతాయి స్ఫూర్తిగొలుపు మాటలు
మాటే దివ్య మంత్రము మాటే ఇంద్రజాలము
మాటే భవ్య మార్గము మాటే దుర్గమ దుర్గము


Wednesday, August 3, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


ఉలికి ఉలికి పడుతున్నా 

నీ ఉనికిని కనుగొన కన్నయ్యా

ఉలికి సైతం చిక్కుతున్నా

ఈ కలికిని కానవేల చక్కనయ్యా


1.ఏ అమర సుధను పంచెనో ప్రియ రాధిక

ఎంత వెన్న ముద్దిచ్చెనో ఎలమి గోపిక

బృందావనమే నాడెందమది నిరతి వేదిక

బంధించితి నా మనమున నీకిక వేరు తావే లేదిక


2.అధర సుధల నందించెద నందకిషోరా

పాలు చిలికి వెన్నను పంచెద నవనీతచోరా

దేహవలువ వలిచి నన్నర్పించెద వేణుధరా

నేనంటూ లేనటుల లయమొందెద శ్యామసుందరా



 https://youtu.be/_24x29aDdrA?si=muROhbVSNHtejivw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: శ్రీ రాగం

మణులు వద్దు మాణిక్యాలొద్దు
మరి మరి పదవులు అధికారాలొద్దు
మిద్దెలూ మేడలొద్దు ఆస్తులు అంతస్తులొద్దు
ఉన్నదాన్ని అనుభవించు భాగ్యమీయవమ్మా
ఉన్నంతలో సంతృప్తిగా జీవించనీయవమ్మా

వరలక్ష్మీ కలవరమే కలుగజేయకమ్మా
భాగ్యలక్ష్మీ సర్వదా ఆరోగ్యమీయవమ్మా

1.సౌధమే ఐనా గదులెన్నిఉన్నా 
అవసరపడును ఆరడుగుల స్థలమే
ఎంతవండుకున్నా కమ్మని రుచులున్నా
జిట్టెడు పొట్టకు పట్టేది పట్టెడే

కంటినిండ నిద్దురనే పోనీయవమ్మా
తిన్నతిండి కాస్తా ఒంటబట్టనీయవమ్మా

వరలక్ష్మీ కలవరమే కలుగజేయకమ్మా
భాగ్యలక్ష్మీ సర్వదా ఆరోగ్యమీయవమ్మా

2.వాహనాలు ఉంటే ఏమి వేళమించిపోతే
గమ్యాన్ని చేరుకొనే గతిగాన రాకుంటే
విలాసాలు ఎదురుగ ఉన్నా వీలుకాకపోతే
అనుభవించు దేహమే సహకరించకుంటే

నిలిచిపో మాఇంట వినోదాలు విరిసేనంటా
నిండిపో మనసంతా ఆనందాలు పండేనంటా

వరలక్ష్మీ కలవరమే కలుగజేయకమ్మా
భాగ్యలక్ష్మీ సర్వదా ఆరోగ్యమీయవమ్మా


Tuesday, August 2, 2022

 

https://youtu.be/536D_oWum2k?si=tfLZufTrAPMmwN5జ్

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిత్రమే ఇది మోహ సూత్రమే

ఆత్రమే ఇది ప్రేమ పాత్రమే

కురిసిన చినుకులు ఎగదోయగ జ్వాలలు

తడిసిన తపనలతో నవ యవ్వన లీలలు


1.ఆషాఢ విరహానికి హానికరములు

చేరలేని తీరాలు చేర్చలేని కరములు

చూపులే రేపుతాయి ఆరని మంటలు

వింతవింత యాతనల నూతన జంటలు


2.తీరునా ఆకలి స్వయంపాక సాయమున

మారునా ఋతు ఆకృతి వేగే సమయమున

రాధామాధవ రతి సాక్షిగ ఈ యువ ప్రాయమున

మోక్షము చేకూరునా నిరీక్షణకు రయమున

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాగే వరకే లాగ గలిగే రబ్బరే జీవితం

తెగే వరకూ సాగదీస్తే నిబ్బరించదు స్నేహితం

స్థితిస్థాపక తత్వమెరిగితె ఉభయకుశలోపరి

గాజుబొమ్మగ కాచినపుడే మైత్రియగు హితవరి


11.చేతులడ్డుగ ఉంచాలి- స్నేహమన్నది దీపమే

నీరుపోసి పెంచాలి- చెలిమి ఎదిగే పాదపమే 

ప్రేమనెంతో పంచాలి సోపతి పసిపాపనే

మనసెరిగీ వర్తించాలి మైత్రి అపురూపమే


2.సహానుభూతి చెందాలి అభాండాలువేయక

సమర్పించుకోవాలి ఏమాత్రం సంశయించక

ఎన్నాళ్ళకు కలుసుకున్నా తాజాగా తలపించాలి

కన్నీళ్ళు తుడిచేవారిగ  నేస్తానికి అనిపించాలి

Sunday, July 31, 2022

 

https://youtu.be/zyDzR_5Xjvo?si=7IJc1r3qI7mMwkYX

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ముల్తాన్


అర్ధనారీశ్వరా నీ పానవట్టము పైన

నిర్మాల్యమైనను తొలగించనైతినే

పరమేశ్వరా నీదు పావన లింగము మీద

పట్టెడు నీళ్ళైనా పోయనైతినే


అయిననూ నన్ను నీవు ఆదుకొని తీరవలెనులే

నను గన్న నేరానికి భవతీరానికి చేర్చవలెనులే

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.పంచాక్షరి పలుకుటకూ కొంచపడితనే

పత్రిదళము నుంచగ యత్నించనైతినే

నందికొమ్ముల నడుమనుండి దర్శించనైతినే

చండీ ప్రదక్షణం నేనొకటైనా చేయనైతినే


అయిననూ నన్ను నీవు ఆదుకొని తీరవలెనులే

నను గన్న నేరానికి భవతీరానికి చేర్చవలెనులే

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.ఏ పూటా ఉపవసించు మాటే మరుగనైతినే

జన్మకో శివరాత్రి జాగారమన్నది ఎరుగనైతినే

గుణనిధికన్న మిన్న నే గుణదోషాలందునా

శివమానస పూజనే నిలిపెద చిత్తమందునా


అయిననూ నన్ను నీవు ఆదుకొని తీరవలెనులే

నను గన్న నేరానికి భవతీరానికి చేర్చవలెనులే

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

OK

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా

తిరు వేంకట నాయకా పాహిమాం

ఆపదమొక్కుల వాడా ఆశ్రితజన పోషకా

పద్మావతి ప్రియవల్లభా పాహిమాం

పరమానందదాయకా పాహిమాం పాహిమాం


1.నిత్యకళ్యాణము పచ్చతోరణము

ఏ పొద్దుచూసినా తిరుమల వైభోగము

కనుల పండగే నీ బ్రహ్మోత్సవ సంరంభము

పావనకరమే స్వామీ మీ పరిణయ వైభవము


2.అకాశరాజు గోవిందరాజులు కుబేరుడాదిగా 

వేంచేసెదరు మునులు ముక్కోటి దేవతలు

గరుడ హనుమ సూర్య చంద్ర వాహనములందున

ఊరేగింపు చూడ తపించి పోయెదరు తరించగా



Saturday, July 30, 2022

 https://youtu.be/46CfPP5bDs4


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలియుగ వరదా కల్మషనాశా

కరుణాంతరంగా నిజ భక్తపోషా

తిరుమలవాసా శ్రీ వేంకటేశా

సరగున వరమీయరా శ్రీ శ్రీనివాసా

వదలను పదములు స్వామీ వందన శతములు

గోవిందా ముకుందా నెరవేర్చు మా ఇతములు


1.అలుపులేదు విసుగు వేసట రాదు

నిను వేడుతు నివేదించు మా వేల వినతులు

అదుపులేదు కొదవలేదు ఎంతకు అంతులేదు

నిను కోరగ బతిమాలగ మా మొక్కులు ముడుపులు

ఇచ్చేవాడివనే కదా నిను సాధించేది

మముగన్నవాడివనే తండ్రీ సదా వేధించేది


2.తృప్తియన్నదే లేదు ఎన్నున్నామాకు

ఉన్నతపదవులు తరగని సిరి సంపదలు

ఆశచావదాయె అందుకొనగ మాకు

సమ్మాన  పురస్కృతులు బిరుదులు 

యాగీ చేసినా నీవు యోగించవాయే

హఠము చేసినా మాకు ప్రాప్తించవాయే


OK



Friday, July 29, 2022

https://youtu.be/vrV1qkKGkQ4?si=jdrQdNGYKUwexAmV

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

చావుకు సవాలు విసురుతూ
వైరికి సత్తా చాటుతూ
దేశం కోసమే పుడుతూ దేశం కోసం బ్రతుకుతూ
దేశం కోసమె అసువులు బాసే సైనికులారా మీకు సలాం
జాతిపతాకను నింగిలొ నిలిపే జవానులారా మీకు జోహార్

1.సరిహద్దు వద్దా  కదం తొక్కుతుంటారు
దేశ అంతర్గత భద్రత సరిదిద్దుతుంటారు
యుద్ధమంటె అనవరతం సిధ్దంగా ఉంటారు
శత్రుమూక ఎంతటిదైనా ఛెండాడుతుంటారు
కర్తవ్యపాలనయే మీకు వేదవాక్కు
భరతమాత రక్షణయే ఏకైక హక్కు

2.కులమతాలతో ఏ నిమిత్తమూ లేదు
ఫలితాల కోసం ఆయత్తమూ లేదు
పదవుల కోసం నానా గడ్డీ కరిచేది లేదు
ప్రకీర్తికోసం ఎటువంటి ప్రయత్నమూ లేదు
సమ్మెలు ఎరుగని కర్మవీరులు మీరు
భగవద్గీత నిత్యాచరణులు మీరు



నింగిలోకి తొంగి చూస్తా నిను చూడగతోస్తే

నీలినీలి మబ్బుల్లో నీ నీలికురులు తిలకిస్తా

కొలను కేసి వెళతాను నీ మోము కనగ నేను

విచ్చుకున్న అరవిందంలో దర్శించుకుంటాను


అణువణువున నీవే ఉంటే ఆరాటమెందుకంట

అడుగడుగున ఎదురౌతూ నిలిచేవు నా కంట


1.అల్లనేరేడు పళ్ళు అపూర్వమే నీ కళ్ళు

నోరూరు సిమ్లాఆపిళ్ళు నీ సొట్టల చెక్కిళ్ళు

కోటేరు  నీ ముక్కు లేవు వేరు ఆనవాళ్ళు

ఎర్రనైన చెర్రీ పళ్ళు నిగారించె నీ అధరాలు


అణువణువున నీవే ఉంటే ఆరాటమెందుకంట

అడుగడుగున ఎదురౌతూ నిలిచేవు నా కంట


2.శంఖాన్ని కాంచినంత నీకంఠం తలపొచ్చేను

కొండల్ని చూసినంత నీ గుండెలె స్ఫురియించేను

వాగులో వంకేందైన లాగును నడమొంపు వంకే

మైదానపు చిన్నిదొనైనా గుర్తుతెచ్చు నీ నాభినే


అణువణువున నీవే ఉంటే ఆరాటమెందుకంట

అడుగడుగున ఎదురౌతూ నిలిచేవు నా కంట


OK




 

https://youtu.be/W7c_9foeHL8

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాల కడలిలో పుట్టిన తల్లి

ఫణిపతి శయనుని గాదిలి

శుభదాయిని శుక్రవార లక్ష్మి

వరదాయిని శ్రీ వరలక్ష్మి

మంగళమిదిగో మహాలక్ష్మి

వందనాలమ్మా వైభవలక్ష్మి


1.హరినేత్ర వాహిని 

శ్రీహరి సమ్మోహిని

డోలాసుర మర్దిని

లీలా వినోదిని

మంగళమిదిగో మహాలక్ష్మి

వందనాలమ్మా వైభవలక్ష్మి


2.పద్మముఖి పద్మాక్షి

పద్మకర విలాసిని

పద్మచరణ శోభిని

పద్మ ప్రియే పద్మాసని

మంగళమిదిగో మహాలక్ష్మి

వందనాలమ్మా వైభవలక్ష్మి

 నీ మరపు పొరల అట్టడుగున నేను

సమాధియౌతున్నాను

నీ నిర్లక్ష్యపు నిర్లిప్తపు విస్పందనకు

కాలిబూడిదౌతున్నాను

మౌనంగా కలిసిపోతున్నాను కాలగర్భంలో

మంచుగా కరిగిపోతున్నాను కవోష్ణ విరహంలో



1.పెరుగున్న దూరానికి జరిమానా నా జీవితం

చెలగుతున్న ఆశలకు జైలుఖానా నా స్వగతం

గొంతులోన దాచుకున్నా ప్రణయ హాలాహలం

పంటనొక్కి ఆపుకున్నా ఆగకుంది అధర రుధిరం

మౌనంగా కలిసిపోతున్నాను కాలగర్భంలో

మంచుగా కరిగిపోతున్నాను కవోష్ణ విరహంలో


2,కంచెల్ని కూల్చివేసి కాలుమోపు నా ఎద గుమ్మం

అవధుల్ని అధిగమించి వెలిగించు నా గృహ దీపం

కొంగుముడిని వీడకుండా చేరుకుందామీ యుగాంతం

పరస్పరం తోడునీడగ అడుగేద్దాం ఏడు జన్మలు సాంతం

మౌనంగా కలిసిపోతున్నాను కాలగర్భంలో

మంచుగా కరిగిపోతున్నాను కవోష్ణ విరహంలో


OK

https://youtu.be/Ts3mWFz6XZ4?si=Y1dYciQegPxO5L-U


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నట భైరవి


చేజార్చకు ప్రతిక్షణం విలువైనదే

ఏమార్చకు అనురాగం అమూల్యమే

ఉన్నదైతె ఒక్కటే జీవితం ప్రియతమా

మరలిరాదు మరలరాదు గ్రహించుమా అనుగ్రహించుమా


1.రేపని మాపని వేయకు వాయిదాలు

చీటికి మాటికి చెప్పకు కారణాలు

రోజుకో సారైనా తలుచుకుంటె చాలుగా

వారానికోమారు కలుసుకుంటె మేలుగా

ఉన్నదైతె ఒక్కటే జీవితం ప్రియతమా

మరలిరాదు మరలరాదు గ్రహించుమా అనుగ్రహించుమా


2.యానకాలు చేర్చలేవు ఎదలోని భావన

మాధ్యమాలు కూర్చలేవు ఎడబాటుకు సాంత్వన

మాటలు ప్రవహింపగలవు చూపులు మెరియ

ఆశలు చిగురించగలవు నవ్వులు కురియ

ఉన్నదైతె ఒక్కటే జీవితం ప్రియతమా

మరలిరాదు మరలరాదు గ్రహించుమా అనుగ్రహించుమా


OK

Wednesday, July 27, 2022

 https://youtu.be/vNYmfdRPpNU?si=HpNADYePSaT16JU-


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గురువువైతే సాయినీవు బోధపరచు బ్రతుకు పాఠము

సద్గురుడవీవే ఐతె గనుక నేర్పవే గుణపాఠము

మాదాకబళం మఠం నిద్ర చింతలేనీ జీవితం

నిరంతరమౌ ఇంత చింతన పనిలేకనేనా వ్యాపకం

దైవరూపుడ వనెద సాయి తక్షణం ప్రత్యక్షమైతే

పరమాత్మ నీవని ప్రస్తుతించెద నాకు నయమైతే


1.పిచ్చి చేష్టల బిచ్చగాడివి లెండీదోట మాలివి

లేని బంధం కలుపుకుంటివి దండి బుద్ధిశాలివి

ఖానాకు ఠికానాకు గతిలేని గారడీ ఫకీరోడివి

ఇన్ని నే నిన్నన్నగాని ఊరకుండిన పిరికివాడివి

దైవరూపుడ వనెద సాయి తక్షణం ప్రత్యక్షమైతే

పరమాత్మ నీవని ప్రస్తుతించెద నాకు నయమైతే


2.గోళీలాటలు బాలకులతోనా చిత్రమే కాదా

జ్ఞాన బోధలు విబుధవర్యులతోనా వింతే గదా

మహిమలంటివి మాయలంటివవి చిటికెడు విభూదా

పూజలందే పుణ్యస్థలమది నీ దేహమున్నది సమాధా

దైవరూపుడ వనెద సాయి తక్షణం ప్రత్యక్షమైతే

పరమాత్మ నీవని ప్రస్తుతించెద నాకు నయమైతే

 రాగం:రాగేశ్రీ(రాగేశ్వరి)

Monday, July 25, 2022

https://youtu.be/hv1OkkmHy_U


గతస్మృతుల మననానికి అపూర్వ వేదిక

మధురానుభూతుల పునఃసృష్టికి ఆత్మీయ కలయిక

రజతోత్సవ పురస్సర మా విద్యాదీపిక

జగతికి వెలుగందీయుచు వెలిసినదీ అపురూప వేడుక


1.  కరీంనగర్ శివారున ఉన్నదీ దిగువ మానేరుపురం

అట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మా పాలిట వరం

మేధో సంపత్తికి ఆలవాలం మాగౌరవ ఉపాధ్యాయ గణం

అరటిపండు నొలిచి పెట్టినటులె వారి బోధనవిధానం


2.పందొమ్మిది వందల తొంబయ్యేడు పదవతరగతి జట్టు

ఆట పాటలతో బాటు పోటీపడి చదువుటకూ గట్టి ఆటపట్టు

అరమరికలు ఎన్నున్నాగాని అందరిదొకేమాట అన్నదే పెద్దగుట్టు

ఏ స్థాయిలొ ఏపదవిలొ ఎవరున్నా పరస్పరం తోడు నీడ మా చెలిమి చెట్టు

 

https://youtu.be/bcZeCl_9y1Q

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరుగగ అరుగుల పల్లెన చేసే బాతాఖానీనీ

పరుగుల బ్రతుకుల పట్నం చేసే సెల్తోఖూనీ

ఏదొంగ దారిన దూరిందో పల్లెల్లోకి మాయదారి పట్నం

ఏ దళ్ళెక్కి పారిపోయిందో నగరానికి అయ్యో నా గ్రామం


1.పచ్చని పొలాల పైరగాలుల దర్జాగ వెలిగిన మా గ్రామం

రియలెస్టేటు కబ్జాల పాలై వెలవెలబోయిన మాగాణం

చిల్లర సరకులు ఉద్దెరకిచ్చే మా సౌకారి కిరాణ దుకాణం

బడామాల్ ల ఆన్ లైన్ మార్ట్ ల దాడికి చేసెను అశ్రుతర్పణం


2.కమ్మని రుచులతొ అమ్మచేతి హాయిగ అరిగే వంటకాలు

పిజ్జాబర్గర్ బేకరి చైనీస్ టేస్టుల పేరిట హెల్త్ కి సంకటాలు

పాలకు సైతం కటకటలాడే గడ్డుదినాలు పల్లెలపాలు

శంఖులొ పోసిన తీర్థం తీరాయె పట్నం పాకెట్ పాలు


3.కొలువుల కెగబడి కొనుటకు నిలబడి జరిగేనా సాగుబడి

రూపాయి నోట్లే కడుపులు నింపునా పల్లెన సేద్యం మూలబడి

జబ్బుకు చదువుకు కార్పోరేట్ల కబుర్ల మాయ లోబడి

డాబుకుపోగ నిలువు దోపిడిగ డబ్బులవదులును ఇబ్బడిముబ్బడి

https://youtu.be/CoTFSMkckJE?si=OLzoykgV-A7WyBcn


ఒకే క్రియకు దొరుకు ఫలములు రెండు

ఒకే నామ స్మరణకు శుభములు మెండు

నిలుపుకుంటెచాలు హనుమంతుని ఎదయందు

రాముడెటులు వాసముండు హనుమ హృదయమందు

రామ శ్రీ రామ రామ రఘురామా

రామా సీతారామ రామా రవికులసోమా


1.నారాయణ నమఃశివాయ మంత్ర సంక్షిప్తమే రామ యై రూపొందు

ప్రత్యక్ష దేవుడు మోక్షప్రదాయకుడు రామనామగానముతో ఆనందమొందు

సంజీవరాయుడు  సౌమిత్రి ప్రాణబంధు

జితేంద్రియడిగా పేరుబడసె లోకమందు

రామ శ్రీ రామ రామ రఘురామా

రామా సీతారామ రామా రవికులసోమా


2.యుగములు కడచినా నిలిచినవాడు వాగధీశుడు

భవిష్య బ్రహ్మగా చిరంజీవిగా  కొనసాగే శ్రీ కపీశుడు

నిరతము శ్రీ రామభజనలో మునిగితేలును ఆంజనేయుడు

సదా బ్రహ్మచారియై ప్రతి ఊరును కాచును

పవనాత్మజుడు

రామ శ్రీ రామ రామ రఘురామా

రామా సీతారామ రామా రవికులసోమా

Saturday, July 23, 2022

https://youtu.be/eaHS92qwObI?si=VQhklXoEG4nH0Cp7


అద్భుతమే విశ్వరచన విశ్వనాథా

అబ్బురమే అణునిర్మితి గౌరీనాథా

అంతుబట్టలేనిదే ఈ జీవకోటి

వైద్యనాథా

అగణిత మహిమాన్వితమే మానవమేధ నాగనాథా

పాహిమాం కైలాసనాథా

పాలయమాం కైవల్యదాతా


1.కట్టగలిగి నప్పుడు ఆకాశ హర్మ్యము

కూలదోయ గలుగగ ఏముంది మర్మము

సృజన విలయ వలయం నీకానవాయితీయే

కొడిగట్టే దీపాన్ని వెలిగింప జేయగ నీ నిజాయితీయే

పాహిమాం కైలాసనాథా

పాలయమాం కైవల్యదాతా


2.పిచ్చుకపై బ్రహ్మాస్త్రము నువువేయుట ఘోరము

చక్కనైన ఆరోగ్యము చెడగొట్టగ విడ్డూరము

మహిమలెన్ని చేసితివో మహిలో మహేశ్వరా

లీలలెన్ని చూపితివో ఇలలో నీలకంఠేశ్వరా

పాహిమాం కైలాసనాథా

పాలయమాం కైవల్యదాతా


https://youtu.be/aGR99a5_o-c?si=2DNF9RyS4NGtnkml

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:హంసనాదం

ఉన్నావో లేవోయని ఎన్నక నిను పూజిస్తాము
కొండలు ఏడు ఎక్కైనా దండిగనిను దర్శిస్తాము
వేంకట రమణా కరుణాభరణా
మొక్కులు ముడుపులు చెల్లిస్తాము
ప్రీతిగ తలచే తలనీలాలను సంప్రీతిగ నీకర్పిస్తాము
ఏ కొదవా లేదు స్వామి భక్తీ విశ్వాసాలకు
సాటి మనిషినే మనిషిగ చూడని మా అల్పబుద్దులకు

1.ఎంతటి నీచానికైనా ఒడిగడితాము అక్రమార్జనకు
ఎంతగ దిగజారైనా ఎసరు పెడతాము పదవులకు
పాపం పసితాపం కనరాదు
ఏ కోశానా మాలోనా
ఉచితానుచితం ఎంచము ఎప్పుడు ఏవిషయాన
ఏ కొదవా లేదు స్వామి భక్తీ విశ్వాసాలకు
సాటి మనిషినే మనిషిగ చూడని మా అల్పబుద్దులకు

2.పిల్లికి బిచ్చం పెట్టని నైజం పుట్టుకతోనే మాకలవాటు
స్వార్థంకోసం విలువలు మరచి తెగించడమే మా గ్రహపాటు
మానవుడే దేవుడంటూ మనిషిగ ఎత్తితివెన్నో అవతారాలు
ఆదర్శంగా నడవడమెటులో ఆచరించి చూపినవెన్ని గాథలు
ఏ కొదవా లేదు స్వామి భక్తీ విశ్వాసాలకు
సాటి మనిషినే మనిషిగ చూడని మా అల్పబుద్దులకు


 

https://youtu.be/Gx3FOEZFPWI?si=7RMs7CZIKXdBJiRY

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:దేశ్


ఒకసాయి ఉన్నాడు 

ఓ సాయబున్నాడు

ఒక బికారి ఉన్నాడు

ఒక ఫకీరు ఉన్నాడు

ఎవరైతేనేమి ఆపద్భాందవుడు

ఆవులగాచినవాడే అర్జునుడు

సాయినాథుడు సద్గురునాథుడు

సచ్చిదానందుడు షిరిడీ ధాముడు


1.మంచిని పెంచినవాడే మాననీయుడు

మమతను పంచినవాడే

మహనీయడు

మానవతను కలిగినవాడే మహిలో దేవుడు

భరోసా బ్రతుకిచ్చినవాడే

గురుదేవుడు పూజనీయుడు

సాయినాథుడు సద్గురునాథుడు

సచ్చిదానందుడు షిరిడీ ధాముడు


2.ఏ రుసుములు కోరనివాడు

నిరాడంబరుడు

ఏ పదవుల నాశించనివాడు

నిత్యబిచ్చగాడు

పాడుబడ్డ మసీదులో నివాసమున్నాడు

చిరుగుల దుస్తులతోనే తిరుగాడినాడు

సాయినాథుడు సద్గురునాథుడు

సచ్చిదానందుడు షిరిడీ ధాముడు

Tuesday, July 19, 2022


https://youtu.be/M1-Xh2JkjYQ?si=hIcxezXE6p4LTJnk

గురుదేవ దత్తుడవీవు చపల చిత్తుడనేను

అత్రి పుత్రుడవీవు మదోన్మత్తుడనేను

అజ్ఞాన తిమిరాన మ్రగ్గుచునేను

అగమ్యగోచరమై అల్లాడుతున్నాను

సన్మార్గము చూపరా సద్గురుదేవా

సద్గతినను నడపరా 

సతీఅనసూయ నందనా


1.ఇంద్రియాల వలలో విలవిల లాడి

అరిషడ్వర్గముతో అతిసులువుగ ఓడి

సంసార వలయంలో బొంగరమై కదలాడి

నీకృపకై వేచాను నిను శరణాగతి వేడి

సన్మార్గము చూపరా సద్గురుదేవా

సద్గతినను నడపరా 

సతీఅనసూయ నందనా


2.గురు కరుణను పొందగ తహతహలాడి

ఐహిక బంధాలనుండి విడివడి

అష్టాంగయోగము యోగించబడి

హంస ఎపుడు ఎగురునో నీ వెంబడి

సన్మార్గము చూపరా సద్గురుదేవా

సద్గతినను నడపరా 

సతీఅనసూయ నందనా


Monday, July 18, 2022

https://youtu.be/uA-xPXQxM1w?si=6BB0yWjXr0P-P2mE

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ

రాగం : పీలూ 


తప్పుకుంటా తప్పకుండా

నీకు నేను కాలేనో గుదిబండ

వాడిపోయెను మనమైత్రి పూదండ

సైచలేను బ్రతుకును ఇకపై నిన్ను కలవకుండ


1.బదులీయని నీమౌనం

శ్రుతి తప్పిన పికగానం

చిల్లుబడిన కుండైంది అభిమానం

చెత్తకుండి పాలైంది నా బహుమానం

చిన్న నిర్లక్ష్యమైనా గుండెకౌను గాయం

చిరు నిర్లిప్తతతోనే చనువంతా మటుమాయం


2.పట్టుబట్టి చేసేస్నేహం

పట్టిపెట్టు పంగనామం

ఉబుసుపోని కబురైంది హృదయ నినాదం

బూదిలో పన్నీరైంది

నా అంకిత భావం

వరదంతా నా కన్నీరే గమనించవు అదినీతీరే

మాటవరసకైనా తలవవేఁ

నేనంటే శూన్యపు విలువే

https://youtu.be/sZWxRvJe-jc

రాగం:అమృత వర్షిణి

భక్తుడనైతే నన్ననుగ్రహించు

ద్విషత్తుడనైతే సంగ్రహించు

ఏదేమైనా సరే నాపై నీ దృష్టి సారించు

నీ సన్నిధి నిరతం ప్రసాదించు

నమో నారసింహా- దైవమేది నీ తరహా

శరణుకోరనెవరిని స్వామీ- నిను మినహా


1.అతి మదమ్ముతో విర్రవీగి

వరగర్వముతో గద్దించి వాగి

గదతో చెలరేగి స్తంబాన్ని మోదగా

ఉద్భవించినావు నరకేసరిగా

ఋజువు పరచినావు సర్వాంతర్యామిగా

దునిమినావు దైత్యుని దుష్టశిక్షణా దక్షునిగా


2.సంపూర్ణ విశ్వాస వేద్యునిగా

విద్యలమర్మం హరియేయను ఆద్యునిగా

భారం నీపైవేసి మనగలిగిన ప్రహ్లాదుని

నిను నుతించి ముక్తిని బడసిన శేషప్పని

కాచి చాటినావు నీవు భక్త పక్షపాతివని

శిష్టరక్షణార్థమై అవతరించి బ్రోచెదవని

Sunday, July 17, 2022

https://youtu.be/WT066-htEVM?si=o0hRDtcopoPiNrqg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:సరస్వతి 


శివోహం శివోహం పరమశివమ్ 

నీవంటే నాకు లేదు భేదభావమ్ 

శివోహం శివోహం మహాదేవమ్ 

అహం దహించెనా త్వమేవాహమ్ 


1.చిక్కులు నీకున్నవి తలలోనే

నా బ్రతుకంతా చిక్కుబడే వెతలలోనే

శివగంగ అలుగంగ ఇలన కరువుకాటకంగా

నా నయన అశ్రుగంగ జాలువారు అనవరతంగా

నీకు నాకు లేనే లేదు భేదభావం

భ్రమర కీటక భంగి శివోహం శివోహమ్ 


2.నుదుటి కంట మంట మండు నీకు

అశాంతితో మండు చుండు గుండె నాకు

నాగాభరణాలతో  మేనంతా నీకు

రోగాభరణాలతో కడుచింతే నాకు

నీకు నాకు లేనే లేదు భేదభావం

ఇనుమయస్కాంతమైనటుల శివోహం శివోహమ్ 







https://youtu.be/mD0T6rUYOBY

పరమ దయాళా

పరమేశ్వర పింగళా

భక్త వరద ధవళ పుద్గలా

పురహర వందే నీలగళా


1.విశాల  హృదయా

కాశీ విశాలాక్షీ ప్రియా

విశ్వేశ్వర గంగాతీరనిలయా

పశుమతిని నేను పశుపతి 

పరి పాలించవయా


2.తిన్నడి పాటి నే గానా

మార్కండేయుని బోలనా

కరి కర్కటి సాటి తూగనా

భోళాతనమున ఎంచగ 

నను పంచాననా


OK

 నా వెన్నుదన్ను నీవే అన్నులమిన్నా

నా ఎదకు కన్ను నీవే

వన్నెల వదనా

నా ప్రతి విజయం వెనక నీవే

నా శ్రీమతి గీతా

అడుగడుగున తోడునీవే  సుందర హసితా

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు


1.సరిగమలను ఒలికించే సంసార వరవీణవు

మధరిమలను చిలికించే నా మానస సదనవు

అనుకున్నది సాధించేలా విశ్వాసం నింపే ప్రేరణవు

తరచి తరచి తర్కించే నా జీవన విశ్లేషణవు

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు


2.ఉడికించేవు ఊరించేవు వారించేవు వారిజనేత్రి

మురిపించేవు నను మై మరపించేవు కోమల గాత్రి

సహనంలో సాటి నీకు రాగల దిలలో ఒకటే ధరిత్రి

శతమానం భవతి నా ప్రియసతీ

వీడనీకు మన జన్మల మైత్రి

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు


Saturday, July 16, 2022

OK

పురూరవ సార్వభౌమ నిర్మితమందిరము

చందనచర్చిత ద్వయావతార సుందర విగ్రహము

సింహాచల శ్రీలక్ష్మీ వరాహ నరసింహ క్షేత్రము

పరమ పవిత్రము ప్రహ్లాద వరదుని పావన ధామము


1.హిరణ్యాక్షు దునిమి ధరణిని ఉద్ధరించి వెలిసిన వరాహ రూపము

హిరణ్య కశిపు సంహరించి భక్త ప్రహ్లాదుని బ్రోచిన నరసింహతేజము

ఏక కాలమందున దివ్య సాక్షాత్కారము

సింహాద్రిని దర్శించిన సులభ సాధ్యము


2.ఉగ్ర జ్వలిత దేహానికి ఉపశమనము చందన లేపనము

కరుణా దృక్కుల కమనీయ స్వరూపము కామితార్థదాయము

సింహాద్రి అప్పన్న భక్తజనుల కల్పవృక్షము

స్తంభ సంభవుని సాక్షిగ కోరికలీడేరును పెనవేయగ కప్ప స్తంభము

Thursday, July 14, 2022

 

https://youtu.be/Vil89h6Rq2s?si=g-ZE7oHa5-hLu5nT

హే దీన బంధో దయాపూర్ణ సింధో

నమ్మి వచ్చినానురా నన్ను కానరా స్వామీ

తిరుమలేశ గోవిందా కరుణజూడు పాహి ముకుందా

విన్నపాల నాలకించి నన్ను పాలించరా


1.అల్లంత దూరం నుండి-

కొండంత భారంతోని -నిన్ను చేరవచ్చినాను నిలువు నామాల వాడా

తలనీలాలిచ్చేసాను-కోనేట్లో నే మునిగాను నీవాకిట నిలుచున్నాను నిన్ను చూసేందుకు పరితపించి పోతున్నాను


2.మరల మరల రాలేనయ్యా

నేను మరలి పోనయ్యా

మరచి పోయినాను నినుగాంచి

మైమరచినానయ్యా

వింతవింత కోరికలేవో వెంటతెచ్చినానయ్యా 

మన్నించి నిను సేవించే భాగ్యమొక్కటీయవయ్యా


శ్వాసమీదనే ధ్యాసను నిలుపు

నీమీద నీకు అదే తొలి గెలుపు

ఆలోచనలను చేయకు అదుపు

విచ్చలవిడి తిరుగగ వాటికి రానీయి అలుపు


ఏదో ఒక క్షణమందున కలుగును మైమరపు

అదే కదా ధ్యానికి మేలుకొలుపు


1.ఇంద్రియాలు వాటి పనిని అవి చేసుకోనీయి

మనోబుద్ద్యహంకార చిత్తాలను కట్టడి చేయకోయి

మూలాధారంలో  ఏదో కదలిక మొదలయ్యి

పాకుతుంది కుండలినీ  పైపైకి జాగృతమైపోయి


2.సాగనీ ప్రయాణం స్వాధిష్ఠానం మీదుగా

నాభిక్రింద మణిపూరం ఉద్దీపనమవగా

ఉరఃపంజర మధ్యమాంతాన అనాహతం జ్వలించగా

కంఠ్యాదిన విశుద్ధి చక్రం చైతన్యమందుగా


3.భృకుటి మధ్య వెలుగొందును ఆజ్ఞాచక్రం

అణిమా గరిమాది అష్ట సిద్ధుల మూల కేంద్రం

సంతృప్తిని చెందక చేరాలి బ్రహ్మరంధ్రం

అదే కదా అలౌకిక పరమానం సహస్రారం

సహస్రార ఛేదనతో సంప్రాప్త మయ్యేను నిస్తారం



Wednesday, July 13, 2022

ఎంత సన్నని గీత- చావు బ్రతుకుల మధ్య

కన్నుమూసి తెరిచేలోగా- ప్రపంచమే  మిథ్య

గట్టునుండి చూసేవారికి-చెప్పలేని ఉబలాటం

వరదలొ కొట్టుక పోయేవారికి -జీవన్మరణ పోరాటం


1.అప్పటిదాకా నవ్వుతు తుళ్ళుతు ఉన్న మనిషి

కుప్పకూలిపోతుంటే-కళ్ళప్పగించడమే తెలిసీ

దేశాధినేతలైతే ఏమి-రాజాధిరాజులైతే ఏమి

నిస్పక్షపాతమే మృత్యుదేవతకు యామదూతలకు 


2.నేల నీరూ గాలి నిప్పు-ముంచుకొచ్చిందంటే ప్రతిదీ ముప్పు

రోగం నొప్పి ప్రమాదం ఏదైతేనేం ఏదో ఓ కారణం

అనివార్యం అనూహ్యం వరించెనా నిర్వాణం

అనాయాస మరణం ప్రసాదించగా పరమాత్మకు విన్నపం


https://youtu.be/wraC77Z8yo8


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్

రాగం:శుభపంతువరాళి


కనులు చెలమెలాయే

కనుకొలుకుల వరదలాయే

కనని వినని వేదనయే కారణమాయే

కనుగొనలేరెవరూ ఎద బడబానలమాయే


1.కక్కలేని మ్రింగలేని గరళమే ఇది

అవిరళంగ పారుతోంది  దుఃఖ నది

ఏ సాంత్వన పొందనిది మందన్నది లేనేనిది

గుండె రాచపుండై కబళించే

దండి దమనకాండ ఇది


2.పైనేమో చిరు నగవు పటారం

లోనేమో తెగని తగువు వ్యవహారం

రాపిడిలో నుసిగా రాలుతూ మనసు నలిగె చక్రవ్యూహం

మరణమొకటె తీర్చేటి అంతులేని వింతదాహం


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉంటావేల స్వామీ కొండలపైన

ఉండలేవా ఏమీ మా గుండెలలోన

తిరుమలలో బదరీనాథ్ లొ వైష్ణవత్వంగా

శ్రీశైలంలో కేదార్ నాథ్ లొ శివతత్వంగా

వేలవేల భక్తులు లక్షలాది యాత్రికులు దర్శనార్థమై పడరానిపాట్లు

నీ గిరి కొస్తే నీ దరికొస్తే ఎందుకయా అగచాట్లు


1.అకాల వర్షాలు ఉధృతమైన వరదలు 

హఠాత్తుగా విరిగే కొండచరియలు

ఏ దారీ లేక దిక్కుతోచక అల్లాడుతు అలమటించు ఆపన్నులు

నమ్మికదా వచ్చినారు ఉంటాయని నీ వెన్నుదన్నులు


2.అడుగడుగున ఎదురయ్యే అవినీతికి బలియౌతూ

అక్రమాలు ఆగడాలు కనలేక కుదేలౌతూ

దూరాభారాలకోర్చి వ్యయప్రయాసలే భరించినా

కుటుంబాలు సభ్యులనే కోల్పోవుట నీకీర్తి పెంచునా


OK


 


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవిని నేను  జీవనదిని నేను

కవితనై అనవరతం ప్రవహిస్తాను

ఎందరు దాహం తీర్చుకున్నా

ఎవ్వరు కలుషిత పర్చుతున్నా

ఆగదు నా కవనం అనంతమే నా పయనం


1.ఒకరి పట్ల అనురాగం లేదు

ఎవరి ఎడల ఏ ద్వేషం లేదు

కొండలు కోనలు ఎదురైనా అధిగమించి

వాగులు వంకలతో దారంతా సంగమించి 

సాగుతాను చైతన్యంగా సాగర తీరందాక

అడ్డుకట్టలెన్నికట్టి ఆపజూచినా వెనుకంజవేయక


2.ఏ పుష్కర పురస్కారం ఆశించక

దరులలో హారతులకై తలవంచక

ఒకోసారి ఉదృతమై ఉప్పొంగే వరదగా

ఎల్లకాలం మానవాళి మనుగడకే వరదగా

కల్మషాలనే సమాజంలో సమూలంగా కడిగేస్తా

గలగలగా గంభీరంగా అలజడిగా సడిచేస్తా




Tuesday, July 12, 2022


https://youtu.be/a8nmjD-OH9U


యాడబడితె ఆడనె ఉంటావట సామి

మా యాదిల మనకపోతె నాయమా ఏమి

తిరిగినాము కాళ్ళరిగేలా ఊళ్ళకూళ్ళు

నిను సూడగ దనివారక గోపురాలు గుళ్ళూ 

నర్సిమ్మసామి నీకు మా దండాలు

చెంచు లచ్మిని గూడ్న పెంచలయ్య తీర్చు మాకున్న గండాలు


1.కంబం పగులగొడ్తె ఊడిపడినావు

నరసింగం రూపుతో ఉగ్రంగ నిల్చావు

దూర్తుడు ఇరన్య కశిపున్ని చీల్చావు

ప్రాలాద సామిని దగ్గెరికి దీశావు

నువ్వంటె మాకు మా ఐదు పానాలు

నమ్మికొలిచినాము మేమిన్ని దినాలు


2.ఆవేశంతొ ఊగిపోతు అడివంతాదిరిగావు

చెంచులచ్మి ఎదురపడితె శాంతించినావు

అమ్మనిన్ను పెనవేయగ ఆడ్నే సిలగ వెల్శావు

నిమ్మలమై మునిగ నిల్చి మమ్ముల నిల గాచేవు

కల్యాణం మా ఇంట్లో జరగునటుల జేయి

పిల్లా పాపలతో మము సల్లగ జూడవోయి


https://youtu.be/QN_p9oBRYtw

నీ దివ్య మంగళ విగ్రహం

దర్శించితి స్వామి ధన్యోహం

అనిమేషుల మౌదుమటులె కాంచినంత తృటికాలం

శ్రీలక్ష్మీనరసింహ స్వామీ దాసోహం


1.రత్నఖచిత మకుటము దేదీప్యమానము

జ్వలిత నేత్ర యుగళము దుర్జన భీకరము

దంష్ట్రా కరాళ వక్త్రము ప్రకటిత రసనము

శటసంయుత భీషణోగ్ర కంఠీరవ

వదనము


2.శంఖ చక్ర సహిత కర యుగ్మము 

నిశిత వజ్ర నఖాన్విత హస్త విరాజితం

వక్ష స్థల కౌస్తుభ శోభితం

పీతాంబర ధారిణం   

నర మృగ ద్వయ రూప సమ్మోహనం మన్మోహనం


https://youtu.be/cAOLzSA0XzE


స్వామివారి తత్వమంతా-సామాజిక దృక్పథమే

నరసింహావతార నిదర్శనం-సర్వవ్యాపకత్వమే

నర మృగ యుగ దేహుని గ్రహించగా జీవకారుణ్యమే

ప్రహ్లాద వరదుని ఆరాధనలో-అడుగడుగున మానవీయకోణమే

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో



1.జీవజంతు జాలమంతా నరసింహుని అవతారమే

ప్రతి మనిషిని భావించినంత-మహావిష్ణు రూపమే

చరాచరజగత్తులో ఆవరించి ఉన్నదంత పరమాత్మయే

ఎరిగి మసలుకొనగలిగిన-నరుల జన్మ చరితార్థమే

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో


2.ఆపన్నుల నాదుకొనమనే దివ్య సందేశము 

అరాచకము నెదిరించమనే-భవ్యాదేశము

అవయవాలె ఆయుధాలనే-గురూపదేశము

ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసే-దిశానిర్దేశము

జయ జయ నారసింహ జయహో

జయ లక్ష్మీ నారసింహ జయహో

OK

నవ నారసింహం-నమామ్యహం

భవతారకనామం భజామ్యహం

అతులిత నుత మహిమాన్వితం

స్తంభ సంభవ తవ దివ్య చరితం

శరణమహం స్మరామ్యహం నరహరే దాసోహం


1. అహో మహా బలా యని

నిను సురలు మునులు కొనియాడగ కరుణబూని

వెలిసావు అహోబిలాన నవవిధ రూపమ్ములనే గొని

అగస్త్యమహాముని ప్రార్థన మన్నించి శనివారం దర్శనమీయ ప్రకటితమైనావు మాల్యాద్రిని

హిరణ్యాక్ష కుమారుని రక్తాలోచనుని దునిమి వశిష్ఠముని వినతితో నెలకొన్నావు అంతర్వేదిని


2.ఉగ్రయోగ ద్వయ మూర్తులుగా

గోదావరి నదీతీరమందున

స్థిరవాసమున్నావు ధర్మపురిన శేషప్ప వరదునిగా

పానకమే ప్రీతిగా గ్రోలుతూ 

అర్పించిన సగం తిరిగి ప్రసాదిస్తూ వరలుతున్నావు మంగళ గిరిన

చెంచులక్ష్మినే మోహించి పెండ్లాడి పెనవేసి

పెనుశిలగా నిలిచావు పెంచలకోనలోన


3.యాద ఋషిని బ్రోవగా ఉగ్రయోగజ్వాలగండభేరుండ రూపాలుగా యాదగిరిన వెలుగొందేవు లక్ష్మీనరసింహునిగా

వరాహవదనము కేసరివాలము మానవ దేహము కలిగిన మూర్తిగా

చందనలేపిత రూపంగా అగుపించేవు సింహాద్రిన అప్పన్నగా

మత్స్యావతారాన సోమక సంహారాన వేదాలకు వరమిచ్చి నీసన్నిధి స్థానమిచ్చి వేదమూర్తిగా వరలేవు వేదాద్రిన

https://youtu.be/9uy4ZOM01y0

రాగం:తోడి


కృతిరచించ నాతరమా రమాధవుని మహిమను

శ్రీ నరసింహావతార  గాథను

వినిననూ చదివిననూ తరింపజేయును మానవ జన్మను

నుడివినను పాడినను అంతరింపజేయును  అఘమును


1.సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులను

స్వామి దర్శనార్థమై వైకుంఠమేతెంచినంతను

అడ్డగించ ద్వారపాలకులా జయవిజయలను

కోపించి శపించగా మునులా భృత్యులను

శ్రీహరి కృపనొంది జన్మించిరి

హిరణాక్ష హిరణ్య కశిపులుగాను


1.హరి వైరిగా చెలరేగెను హిరణ్య కశిపుడు

గడగడలాడెను శచీపతి తన పదవి గతించినప్పుడు

నారాయణ మంత్రమొసగినంత నారదుడు- 

హరి భక్తుడాయె గ్రహించి దితి సుతు సతి గర్భాన ప్రహ్లాదుడు 


2.హరి తన పాలిటి అరి యని

వారించె హరిని స్మరించ జనకుడు ప్రహ్లాదుని

సర్వాంతర్యామి మహా  విష్ణువని 

కొలిచి తరించమనె తన తండ్రి హిరణ్య కశిపుని

ఏడిరా  శ్రీహరి  ఇందు కలడాయని మోదెను వెనువెంట ఎదుటగల  స్తంభాన్ని


3.వరగర్వితుడా దైత్యుని దునుమాడగ

నరహరి మహోగ్ర రూపమ్మున  వెలువడగ

కోఱలతో గోరులతో హిరణ్యకశిపుని చీల్చి చెండాడగ

శాంతింపమని ప్రహ్లాదుడు నరసింహుని వేడెగా

Wednesday, July 6, 2022

https://youtu.be/y-QroB5r7P0


నువ్వంటూ ఉన్నావని 

మా మొరలే విన్నావని

నిన్ను నమ్మినాము సాయీ

పరీక్షలే పెట్టినగాని

జాప్యమిటుల చేసినగాని

సత్ఫలితం ఇవ్వకతప్పదోయి


1.పాటలెన్నొ కట్టానంటే పనీపాట లేదన్నాట్టా

నీ పదములు పట్టానంటే

నావి నటనలన్నట్టా

నువు రాయివైనా మానే

కరుగాలి మా కథవింటే

సమాధియైనాగాని కదలాలి మావెత కంటే


2.ఫకీరువే నీవనుకొన్నా 

కన్నీరు కార్చేవు మా దుస్థితికి

అవధూతగ నిను కనుగొన్నా

ఆదుకొని తీరేవు మా దుర్గతికి

నీపేరే పెట్టుకొని- నిత్యం నిన్నే-నే

స్మరిస్తున్నా

ప్రాధేయపడుతున్నా -నన్నే నీవు విస్మరిస్తున్నా


OK



OK

 హారతి నేనే పట్టకుంటే-ఆపాటిదే నీ అందమంటే

పాటలె నేను కట్టకుంటే-అందరివంటిదే నీ ఒంటి మట్టే

సుందరాంగీ నను గానకుంటే నువు చుప్పనాతివే

మోహనాంగీ నన్నొప్పకుంటే నువ్వప్పలమ్మవే


1.మూలన పడిఉన్న బండరాయిని శిల్పంగ చెక్కానే

నిబిడీకృతమై నీలొ దాగి ఉన్న నగిషీలనెన్నో సానబట్టానే

గుండెను గుడిచేసి ప్రేమదేవిగ నిన్ను కూచొబెట్టానే

ముడుపులెన్నొగట్టి నీ ముందుపెట్టి జేజేలు కొట్టానే


2.రవిగాంచకున్నట్టి రాణ బైటపెట్టి కవితలెన్నొ నేను కట్టానే

ఎండ తగులకుండా చినుకు తడుపకుండ గొడుగు నీకు పట్టానే

కాలుకందకుండ లోకాలుతిప్పి నీకు చూపెట్టానే

ఎవరికందకుండ ఎత్తెంతొ ఎక్కించి నిన్నుగా నిలబెట్టానే


Tuesday, July 5, 2022

 లంచావతారం ప్రపంచవ్యాప్తం

అవినీతి వివిధ రూప పరివ్యాప్తం

లంచమివ్వక తప్పని సామాన్యుని అసహాయత్వం

వేళ్ళూనుక పోయింది దేశమంతా ఇది బహిరంగసత్యం


1.సాంప్రదాయమయ్యింది అవినీతి సైతం

రివాజుగా మారింది అమ్యామ్యా

చేతి వాటం

ఇందుగలదందు లేదను సందేహమెందుకు

లంచం తప్పనిసరైంది పని జరిగేందుకు


2.రెవెన్యూ మున్సిపల్ కార్యాలయమేదైనా

రవాణా రిజిస్ట్రేషన్ న్యాయ శాఖలేవైనా

ఫైలంటూ ముందుకి కదిలే మంత్రం లంచం

కేసంటూ కొసకంటూ తేల్చే సాధనం లంచం


https://youtu.be/ZMQ-HPleMOA?si=Kl_JY2YoWnW9uKMw


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఖర్చులేదు వెచ్చం లేదు-పంచుకుంటే తరిగి పోదు

పదేపదే వాడుతుంటే పదునెక్కే వింతైన తీరు

శ్రోతల తపనల దాహం తీర్చే సెలయేరు

పాటే తేనేల ఊట -పాటే మనసుకు ఊరట

పాటే పువ్వుల బాట-పాటే ప్రగతికి బాసట


1.పాడేవారికి పరవశమే ప్రతిగీతం

ఎవరున్నా వినకున్నా అదోలోకం

మధువుకన్నా మిన్నదే ఈ మైకం

స్థలము సమయం అవసరమే లేని వైనం

పాటే తేనేల ఊట -పాటే మనసుకు ఊరట

పాటే పువ్వుల బాట-పాటే ప్రగతికి బాసట


 2.ఒంటరి పయనాన వెంటొచ్చే నేస్తం

దగా పడిన తమ్ముడికి కన్నీరు తుడిచే హస్తం

జన్మజన్మాల పుణ్యఫల సంప్రాప్తం

పాటను ప్రేమించే వారికి పాటనే సమస్తం

పాటే తేనేల ఊట -పాటే మనసుకు ఊరట

పాటే పువ్వుల బాట-పాటే ప్రగతికి బాసట



https://youtu.be/cMz43jgy6g4

భోజన ప్రియ నమో లంబోదరాయ

పంచభక్ష్య పరమాన్న నైవేద్య సంప్రియ

కడుపారా తినవయ్యా ఆరగింపులు

మనసారా గొనవయ్యా మా నివేదింపులు


1.మోదకాలు గైకొనుమా మోదకారకా

కుడుములు స్వీకరించు శ్రీగణనాయకా

ఉండ్రాళ్ళ నొసగితిమి దండిగ భుజియించరా

అరిసెలు గారెలివిగొ ముదముగ గ్రహియించరా


2.లడ్డూ పాయసాలు సంతుష్టిగ గ్రోలరా

జిలేబీ పులిహోర సంతృప్తిగ సాపడరా

వెలగపళ్ళు తిని బ్రతుకున వెలుగులు దీపించరా

చెఱకు గడలు గొని మనసుల తీపినింక నింపరా


 

https://youtu.be/ynEJXIu8F5A

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంజనీ పుత్రా మహాబల గాత్రా

సుగ్రీవ ప్రియ మిత్రా బ్రహ్మచర్య దీక్షా పవిత్రా

ఆర్త త్రాణ పరాయణా రామనామ పారాయణా

మా ఇష్టదైవము నీవు మాత్రము

అనవరతం నినుచూడగ మా కాత్రము

మా హారతి గొనవయ్యా మారుతి రాజా

సిందూరాంకిత దేహా గదాయుధ విరాజా


1.నీ చరితము బోధపడిన నరజన్మ చరితార్థము

నీ నడవడిలో అడుగడుగున జీవన పరమార్థము

చెరగని మైత్రికి నీవే నిదర్శనం

విశ్వసనీయతకు నీవే ఉదాహరణం

మా హారతి గొనవయ్యా మారుతి రాజా

సిందూరాంకిత దేహా గదాయుధ విరాజా


2ఆజ్ఞాపాలనకు నీవే తార్కాణం

అకుంఠిత దీక్షా దక్షతకు నీవాలవాలం

జితేంద్రియా ఏకాగ్రతకీవె మార్గదర్శనం

సంజీవరాయా నీనామ  స్మరణయే ఆరోగ్యదాయనం

మా హారతి గొనవయ్యా మారుతి రాజా

సిందూరాంకిత దేహా గదాయుధ విరాజా




Monday, July 4, 2022



https://youtu.be/qqC20ooKr9g?si=qXZOnN13YiQrtC8Z

వేకువనే నువు చిమ్మగ వాకిలి

అద్దంలా మారుతుంది ఆ లోగిలి

చెలరేగి ముంగురులే ముద్దాడగ చెక్కిలి

చిరు చెమటలు చిరుగాలికి ముత్యాలుగ రాలి

ఉషఃసుందరీ తుషార మంజరీ

నీ వయారానికే బేజారై  నా గుండె జారీ

ఊడిగమే  చేయుటకై నీకు నే గులాముగా మారీ


1.చీర కొంగును నడుముకు చుట్టి

కుచ్చిళ్ళను  నాభి క్రింద దోపి

ముంగిట ముగ్గును వేసే లోపే

పిండి పట్టిన చేతితో ముంగురులెగదోస్తే

ముగ్గుపిండే బుగ్గల ముద్దాడేస్తే

ఉషఃసుందరీ తుషార మంజరీ

నీ వయారానికే బేజారై  నా గుండె జారీ

ఊడిగమే  చేయుటకై నీకు నే గులాముగా మారీ


2.కుడికాలు కాస్త  మడిచేస్తూ

వింతగా దొంతిగా వంగేస్తూ

ఎడంచేత పొడుగాటి జడ నొడిసిపడ్తూ

రంగవల్లులే అందంగా పెడ్తూంటే

పౌష్యలక్ష్మే ప్రత్యక్షంగా తోస్తూ

ఉషఃసుందరీ తుషార మంజరీ

నీ వయారానికే బేజారై  నా గుండె జారీ

ఊడిగమే చేయుటకై నీకు నే గులాముగా మారీ


Sunday, July 3, 2022


https://youtu.be/gaLhrO4Epfc

మహాదేవ శంకరం భక్తవశంకరం

శ్రీకరం శుభకరం అభయంకరం

త్రయంబకం త్రిపురాంతకం 

నమో పంచభూతాత్మకం నమో నమఃశివాయ నమశ్శివమేకమ్


1.భూతత్వయుక్తం చర్మ శల్యసంయుతం

శీతోష్ణవిచలితమీ భూఘనం

నశ్వరం ఖనన దహన అంకితం

ఈశ్వరా నీకే సమర్పితం

నమో పంచభూతాత్మకం నమో నమఃశివాయ నమశ్శివమేకమ్


2.జల రుధిర రూప ద్రవ సమన్వితం

ఆమ్లజని పూరితం తేజో విరాజితం

చైతన్య జీవశక్తి విలసితం ఆత్మాకాశ సంభూతం

నమో పంచభూతాత్మకం నమో నమఃశివాయ నమశ్శివమేకమ్


3.చిదంబరేశ్వరం శ్రీకాళహస్తీశ్వరం

అరుణాచలేశ్వరం జంబుకేశ్వరం

ఏకాంబరేశ్వరం కాశీ విశ్వేశ్వరం

కాళేశ్వర ముక్తీశ్వర శ్రీరాజరాజేశ్వరం శ్రీ రామలింగేశ్వరం

నమో పంచభూతాత్మకం నమో నమఃశివాయ నమశ్శివమేకమ్


Saturday, July 2, 2022

 



https://youtu.be/FhblbOiK6k0?si=nYbLcXecVfxRpuR-

నీ ఒళ్ళే మదనుని విరుల విల్లు

నీ కళ్ళే వదలని సూదంటు రాళ్ళు

నీ సొగసే నేల దిగిన హరివిల్లు

నీ వయసే నిత్య వసంతమై విలసిల్లు

వెంటపడక మానెదరా వేదాంతులైనా

కంటగింపె నీ అందం చెలీ దివికాంతలకైనా


1.వెనకనుండి చూస్తే మేనకవే

కనగ ముందుకెళితే ఊర్వశివే

తలఎత్తగ అబ్బో  తిలోత్తమవే

సింగారాల తులతూగే అపర రంభవే

వెంటపడక మానెదరా వేదాంతులైనా

కంటగింపె నీ అందం చెలీ దివికాంతలకైనా


2.నీలవేణి నీ జడ నీలోత్పలము

అలివేణి నీ మోము అరవిందము

పూబోణీ నీ అధరము చూతము

నడుమే నవమల్లిక చనుదోయి అశోకము

వెంటపడక మానెదరా వేదాంతులైనా

కంటగింపె నీ అందం చెలీ దివికాంతలకైనా


Friday, July 1, 2022


https://youtu.be/Mw8JC_yrIYw?si=4WZfEl_cpCe1E7II

నా దృష్టి నీమీదే కరివరదా

దయావృష్టి కురియనీ సదా నా మీద

సర్వస్య శరణాగతి నీవే గోవిందా

తిరుమలేశ భక్తపోష పాహి ముకుందా

నీ పద పద్మాలనే నే తలదాల్చెద


1.మరపురాదు తిరునామాంకిత వదనం

అపర వైకుంఠమే నీ బంగారు సదనం

నీ నామస్మరణయే ఏకైక ముక్తి సాధనం

సారసదళనేత్ర స్వామీ నీకు సాష్టాంగ వందనం


2.వజ్ర కాంచన మకుటం నీ శిరో భూషణం

కౌస్తుభ మణిహారం విశాల వక్షస్థల శోభితం

వైజయంతి మాలాలంకృత దివ్య విగ్రహం

వీక్షణమాత్రాన మన్మోహనం అలౌకికా నందదాయనం




 

https://youtu.be/jqIJ9T6WsDA

అక్షరార్చన జేతు అనుదినము నీకు

లక్ష్యమొక్కటె నాకు దీక్షతప్పగనీకు

ధ్యాసయు శ్వాసయు నీవె ప్రతిజన్మకు

ప్రణతులు ప్రణుతులివె ప్రణోదేవీ 

నీ  పద పద్మ యుగ్మమ్ముకు వాగ్దేవీ


1.నా కలమొలికే అక్షరమేదైనా బీజాక్షరమవనీ

నా మనమున మననమయే భావం

దివ్యమంత్రమవనీ

ప్రభవించే ప్రతిగీతం పరమ పావనమౌ

సంకీర్తనయే కానీ

జనుల నాల్కలందు నాని నా పాట శాశ్వతమై నిలవనీ


2.పరులకు పంచితే పెరిగే సంపద కవనం నీవరం

శ్రోతలనలరించినా కొలది మార్ధవమౌ గాత్రం నీ ప్రసాదం

పాఠక హృద్యమౌ సాహితీ సౌరభమందించవే

జనరంజకమై వరలెడు సంగీతాంబుధి

యందికనను ముంచవే


Wednesday, June 29, 2022

వ్యూహాత్మక మౌని రాజకీయ జ్ఞాని

పాలనా పటిమకు ప్రతీకయే పీవి

గర్విద్దాం మన తెలుగువాడైనందుకు పివీ

విశ్వవిఖ్యాతమే ప్రధానిగా ఆయన కీర్తి తావి

జయహో పాములపర్తి వేంకట నరసింహారావు గారు

శ్రద్ధాంజలి నీకిదే బహుభాషా కోవిదుడా జోహారు


1.కాంగ్రేసు పార్టీకి జన్మాంత సేవకుడవే

ఇందిరా గాంధీకి అనుంగు విధేయుడవే

సంక్లిష్ట సమయాలలో తగు సలహాదారుడవే

అలుపెరుగని సాధనా శూరుడవే

జయహో పాములపర్తి వేంకట నరసింహారావు గారు

శ్రద్ధాంజలి నీకిదే సుకవి కోవిదుడా జోహారు


2.ఆర్థిక సంస్కరణల విప్లవ వీరుడివే

బ్యాంకింగ్ రంగానికి సంజీవరాయుడవే

అగణిత ఉద్గ్రంథ పఠనా,రచనాశీలుడవే

మా ధర్మపురికి చిరకాల ఆప్తమిత్రుడవే


 సిగలొ మందారం-నుదుటి సింధూరం

అధర దరహాసం-నీ హృదయ స్థిరవాసం

కోరలేదు నిను నేస్తం-దొరికిందే నా ప్రాప్తం

నీ పదముల అందియగానైనా

మననీయవే నను జీవితాంతం

నీ చరణ మంజీర మంజుల స్వనమునై రవళించనీ అనవరతం



1.నీ మువ్వల సవ్వడికి నా నవ్వులు జతజేస్తా

నీ దారి వెలుగులకై కను దివ్వెలు వెలిగిస్తా

నీకు అంగ రక్షకుడిగా అడుగడుగున తోడొస్తా

కనుపాపల నిను దాచి రెప్పలనే కప్పేస్తా


2.నీ కాలు కందకుండా అరచేతుల నడిపిస్తా

ప్రతిరోజూ నిను చూడగ పడిగాపులు పడిఛస్తా

ఆత్యాశే నాదైనా నిను పొందగ ఆశిస్తా

మరుజన్మకు సరియని మాటిస్తే  ఇపుడే నే ఛస్తా


Monday, June 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక గొప్ప నాన్నకు కొడుకును 

మంచి కొడుకులకు నాన్నను 

కొడుకుగా నేను ఎందుకూ కొఱగాను

నాన్నగానూ ఎవరికీ అక్కఱకే రాను


1.మా నాన్న నాకెప్పటికీ రియల్ లైఫ్ హీరో

నాన్నగా నా విలువను లెక్కిస్తే  మాత్రం జీరో

అనురాగాలు ఉద్వేగాలు నా కెంతో దూరం

నాతో అనుబంధం  కుటుంబానికే భారం

మనిషిగా నేనేంతో స్వార్థపరుడను

అంటీముట్టక వ్యవహించే పరుడను


2.నాన్నకెంతో భయపడతూ చిననాడు నలిగాను

నాన్నను నేనను తేడా చూపక మిత్రుడిగా మెలిగాను

నాన్న ఆజ్ఞకు లోబడి బ్రతుకును గడిపాను

స్వేఛ్ఛగా నిర్ణయాలను తనయులకే విడిచాను

కోరడానికేముంది సతీసుతుల ఆనందం మినహా

నాదైన నా వైఖరే తామరాకుపై నీటి బొట్టు తరహా

 

https://youtu.be/QHoS9vSDeTw?si=CxfErztjyKeIwQbL

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


నీ వశమైనాను సదాశివా

ఇహ పర వశమే ప్రభూ నీత్రోవ

సదవకాశమే సర్వదా నీ సేవ

సత్కర్మ విశేషమే ఇది మహాదేవా


1.ఇడుముల బడద్రోతువా నీ చిత్తం నా ప్రాప్తం

వరముల కురిపింతువా అది మాత్రం నీ దయాపరత్వం

నీ పదముల నిక వదలను శంభో శంకరా

నీ మననము మరి మానను మహేశ్వరా హరా


2.సులభ సాధ్యుడవనీ భోలావని నిన్నెంచుకుంటిని

దృష్టిని సారింతువని శరణంటిని

నువు ముక్కంటివని

గుడి గుండాలుగా గుండెలనే నువు భావింతువని

తలచిన తడవుగా తక్షణమే ఎదుట సంభవితువని

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్


సాధ్యమే సాధ్యమే సజావైన దృక్పథం

జీర్ణమైతీరుతుంది స్వీకరిస్తే వాస్తవం

సానుకూల వర్తనతో స్వప్నాలు సాకారం

సకారాత్మ భావనతో లభ్యం శాంతి సౌఖ్యం


1.అంతా మనమంచికే అని లోకులు అందురు

మంచి తలచి మంచి పలికి మంచి చేస్తూ అందరు

మంచి చేయ పరిణమించు మనిషే దైవంగా

మంచిని ఆచరించ మనలను రక్షించు 

నిశ్చయంగా


2.సద్భావం సచ్ఛీలం సత్వర్తన సంప్రాప్తం సాధనతో 

సహృయత మృదుభాషణ నగవులు నగలుగా నడవడితో

మంచివి చూస్తూ మంచివే వింటూమంచిగా జీవించగ ఆనందంతో

మంచి ప్రపంచం నిర్మించగలం మనుషులమంతా విశ్వాసంతో

Friday, June 24, 2022

https://youtu.be/UrhhaVQ2S9w

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్


రాగం:కాంభోజి


ఆలిమాట కెదురుచెప్పు మగడేడి జగాన

శ్రీమతి గీత దాటు పతియేడి ప్రపంచాన

హృదయపీఠాన నిన్ను పట్టమహిషి చేసాడే

వైకుంఠానికె నిను మహరాణిని చేసాడే

నీఆజ్ఞ మీరునా శ్రీపతీ… వేంకటాచలపతీ

నీ మాట జవదాటునా మాయమ్మ అలమేలు మంగా ప్రణతి


1.తల్లిచాటు పిల్లలం తండ్రి ఎడల భయభక్తులం

అమ్మా నీ కొంగు చాటుచేసుకొని అంగలార్చెదం

విసుగులేని సమయాన తనకు(నాన్నకు)విన్నవించవే

చిన్నచిన్న మురిపాలను తీర్చగ ఒప్పించవే

నీఆజ్ఞ మీరునా శ్రీపతీ… వేంకటాచలపతీ

నీ మాట జవదాటునా మాయమ్మ అలమేలు మంగా ప్రణతి


2.తీరిక చేసుకొని  పట్టించుకొన మనవే

అక్కున జేర్చుకొని ఆలన చూడ మనవే

చక్కెర పొంగలి పెట్టి వినిపించు మా మనవే

పుక్కిట కప్పుర విడియమెట్టి వినమనవే

నీఆజ్ఞ మీరునా శ్రీపతీ… వేంకటాచలపతీ

నీ మాట జవదాటునా మాయమ్మ అలమేలు మంగా ప్రణతి

 

https://youtu.be/C3jHexA82ag?si=CSaAf9NP9nnChtgy

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎత్తుకెళ్ళావే నా ఎదనెప్పుడో

చిత్తుచేసావే మదినెన్నడో

పిచ్చోణ్ణి చేసావె రెచ్చగొట్టి

ఎర్రోణ్ణి చేసావె సోకు విందెట్టి

బ్రతికేదెలా ఇక చచ్చేదెలా

పట్టేదెలా మరి వదిలేదెలా

నా పంచ ప్రాణాల నుగ్గబట్టి


1.మరచిపోయే వేళలో కెలికి వెళతావు

కలిసి నడిచేదారిలో కలికీ జారుకుంటావు

తలచేదెలా మరి వగచేదెలా

మెరుపంటి నిన్ను వలచేదెలా

తలపోయకే నా వెతని సోదిలా


2.చెప్పలేను నాపై ప్రేమలేదని

ఒప్పుకోనూ నేనే నీకు ముఖ్యమని

 చొరవ నాదే చెలీ గర్జ్ నాదే

తపన నాకే నీఎడ ఫర్జ్ నాదే

ఔనన్న కాదన్న నిజమెప్పుడూ చేదే

Thursday, June 23, 2022

https://youtu.be/ru1fX7LBMu8?si=ybXPuVlZYrcZaRlH

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:భాగీశ్వరి

నిను మోహించితి నిను దేహించితి
అహరహము నీకై తహతహ లాడితి
అహము దహించితి దేహము దాచితి
విరహము మించగ నిను తలపోసితి
రాధాలోలా రాస విహారా నాకీయరా శరణాగతి

1.సందేహించక నన్నావహించు
నా వాసనలిక సంగ్రహించు
అద్వైతమను తరహా సంగమించు
త్వమేవ మమనాథమ్ అనుగ్రహించు
మాధవా మహానుభావా నాతో రమించు

2.శిరసావహించితి నీపదధూళి
నువు లేక మనలేను శిఖిపింఛమౌళి
మ్రోగించి మురిపించు అనురాగ మురళీ
సాగించు నాతో రసరమ్య రతికేళి
నీలో లయమవగ హరీ నా మనసే నివాళి


Wednesday, June 22, 2022

 

https://youtu.be/oSv7SoSKyck?si=Xm4bbCPW-tDliFT9

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


కవన తెరల చాటున వలపు దాచుకున్నా

మనసు పొరల మాటునా మమత పెంచుకున్నా

కక్కలేక మ్రింగ లేకా సతమత మవుతున్నా 

గుడ్లు మిటకరిస్తూనే రోజులు గడిపేస్తున్నా

చెలీ పొంగుతోంది గుండెలో గోదావరి

ప్రేయసీ రగులుతోంది రావణకాష్ఠం మతిగా మారి


1.విషయమేది రాసినా ఆవు వ్యాసమౌతోంది

ఏ దారికి మారినా నీతావుకు చేర్చుతోంది

సమాసాలన్ని కలిసి నీ ప్రేమస్వామ్యమౌతోంది

ఊహ ఊటగా ఊరి బ్రతుకు రమ్యమౌతోంది

చెలీ పొంగుతోంది గుండెలో గోదావరి

ప్రేయసీ రగులుతోంది రావణకాష్ఠం మతిగా మారి


2.భావమేది పలికినా కళ్యాణ సంబంధమాయే

రాగమేది పాడినా కళ్యాణి అనుబంధమాయే

నీ తలపు తట్టగానే తనువే మయూరమాయే

మనువు సాధ్యమయ్యే దాకా జగమంతా మాయే

చెలీ పొంగుతోంది గుండెలో గోదావరి

ప్రేయసీ రగులుతోంది రావణకాష్ఠం మతిగా మారి

https://youtu.be/cZyEDL9_aos

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ పేరులోనే  ఏదో  ప్రకంపనం

నీ రూపులోనూ యమ ఆకర్షణం

నెరవేరునా నా కల ఏ జన్మలోనైనా నీతో నా సహజీవనం

నీవే నీవే నీవే నీవే నీవేలేనా ప్రియభావనం

మంజులా మంజులా నీ ప్రేమరాజ్యానికి నే రారాజులా

మంజులా మంజులా నేనుంటా నీ సిగలో వాడని విరజాజిలా


1.మంజులమంటే కోమలం

మంజులమంటే పరిమళం

మంజులమంటే మనసుకు మత్తుని గొలిపే రసనము

మంజులమంటే ప్రణయము

మంజులమంటే పరిణయం

మంజులమంటే నందనవనిలా తలపించే జీవనం

నాకై నేనే రాసుకున్న నిఘంటువులో

ప్రతి పదము ప్రతి పదార్థం మంజులమే


2.మంజులమంటే దేవళం

మంజులమంటే దైవము

మంజులమంటే ఆరాధించే నివేదించే విధానము

మంజులమంటే హృదయము

మంజులమంటే ప్రాణము

మంజులమంటే కాలము లోకము సకల విశ్వము

మంజులమంటే నాకై నాచే కల్పిత

కవిత్వము

 

https://youtu.be/LZhKaakiOZI?si=Jv0q34r5yf6l7Gkg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లతలా అల్లుకపోయింది నీ స్నేహయోగం 

కవితలా అంకురించింది నీపై అనురాగం 

నీ వన్నెచిన్నెలకు మనసే మురిసింది

వలపుల వలనే ఒడుపుగా మది విసిరింది

హృదయ సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టింది

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చేసింది


1.ఇంద్రధనువు కనుబొమలు

చూపులు విరి తూపులు

ఊరించే బూరెల్లాంటి బుగ్గలు

కన్నాను నాసికగా సంపంగి మొగ్గను

తుమ్మెదలను ఆకర్షించే మధుర అధరాలు

నను మైమరిపింప జేసే మదిర దరహాసాలు

హృదయ సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టాయి

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చివేసాయి


2.పైటదాపు దాటు వెన్నెలవెన్నగిన్నెలు 

చాటులేని నడుమున ఇసుక తిన్నెలు 

చాటుతున్నవి వాటి వాటి పాటవాలు

నాభిమాత్రం ఒంటిగానే చేసేనే సవాలు

అరటిబోదెలైనాయి నీ ఊరువులు

తమలపాకులనిపించే లేలేత పాదాలు

హృదయ సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టాయి

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చివేసాయి

Monday, June 20, 2022

 

https://youtu.be/GtA0YZayug4?si=oediKDWMHtyhmSud

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అదిగో పులియన ఇదిగో తోకయనక యువత

రాజకీయచదరంగం జిత్తులనెదిరించగ  మీ విజ్ఞత

కీలుబొమ్మలై తోలుబొమ్మలై కొమ్మకాయక

మనకంటూ ఉంటుందిగా నిటారుగా వెన్నెముక


1.రెచ్చగొట్టు వాదాలకు గొడుగు పట్టక

చిచ్చుపెట్టు చర్యలకు నడుం బిగించక

ప్రగతిశీల దారులలో పయనించే దిశగా

విచక్షణతొ ప్రవర్తించి ముందడుగేయగా


2.వ్యక్తిత్వం కుటుంబం  జాతి నిర్మాణం లక్ష్యంకాగా

సఛ్ఛీలం సద్వర్తన సదాశయం సర్వదా ముఖ్యంగా

ఓటును వాడాలి పదునైన ఆయుధంగా

అండగ నిలవాలి మన జెండా కొరకై అనవరతంగా

Sunday, June 19, 2022

 

https://youtu.be/yO8WFbuDp9M

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


ఎంతకూ తీరకుంది నా దాహం గంగాధరా

ఏమిటో ఆరకుంది నా మోహం చంద్రశేఖరా

నా గళముకు నిగళమేల గరళకంధరా

నా కలముకు తపనలేల శూలధరా

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ


1.వారాశిగా భావాలనే తలపోసితి

రాశిగా నే కవితలెన్నో వ్రాసి పోసితి

చిత్తశుద్ధిగా శివా నీ పూజనే చేసితి

ఆత్మతృప్తి లేకనే భవా అల్లలాడితి

మెప్పించలేకపాయే నా కావ్యాలు సాహిత్య కారులను

కదిలించ లేకపాయె నా గేయాలు సామాన్య శ్రోతలను

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మార్ధవాన్ని గాత్రంలో కూర్చవైతివి

సంగీతాన్ని శాస్త్రంగా  నేర్పవైతివి

ఊటలాగ కఫమెంతో ఊరజేస్తివి

కంఠనాళాలనే కపర్దీ కరకుజేస్తివి

గొంతు జీరబోవునాయే ఎలుగెత్తి పాడితే

తాళమెచటొ తప్పునాయే ఊపుగా ఊగితే

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక వెర్రిబాగులోడే నాన్న

స్వార్థపరుడెవరున్నారు తనకన్నా

తన కోర్కెలకోసమే నిను కన్నా

విలనే తానై తన కలల హీరోగా నిను కన్నా

చేతకాని వాడనిపించుకున్న

ఈతరాని వాడని ముద్రవేయించుకున్న

ఒక వెర్రిబాగులోడే నాన్న

స్వార్థపరుడెవరున్నారు తనకన్నా


1.తెప్పలు తగలేసే తనయులకై

తీరం చేరవేసే సరంగుతానై

గడ్డాలనాడొక తెడ్డుజూపు కొడుకులకై

అడ్డాలు పడకుండా అరచేతులుంచినందులకై

ఈసడించబడుతున్న

విలువను కోల్పోతున్న


2.బాధ్యతలెరుగని బద్మాషులున్నా

హక్కులు మిక్కిలిగా గుంజుకున్నా

తండ్రిగ చెప్పుకొన్న తలవంపులనుకున్నా

ఎదురుగ కనిపించినా మొకం తిప్పుకున్నా

ఎదను సమాధాన పర్చుకునే

మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే

https://youtu.be/vODJlb-SJHw?si=e5K8-GjUNMVAG4r1

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:దర్బార్ కానడ

నాదను కొంటేనే కలవరం
కాదనుకొంటే మనం ఎవరికి ఎవరం
ఇంతకన్న ఎలా తెలుపను నా ఎద వివరం
అలజడి రేగింది నీవల్లే నా ప్రశాంత మానస సరోవరం

1.నీ తలపులతో ఔతుంది నా మది చిత్తడి
నీ ఊహలకే దూకుతుంది భావావేశం మత్తడి
నీదేలే నా హృదయం మేలిమి పుత్తడి
చేదేలే నువు కాదంటే ఆరదు నా కంటతడి

2.ఎప్పుడు ముడివడిందో మనకీ చిక్కుముడి
ఇచ్చేసా ఏనాడో నీకు నిలువుదోపిడి
ఓపలేను ఆపలేను గుండెలోనీ రాపిడి
త్రెంచుకోకు చంపమాకు మనబంధం పొరబడి


Friday, June 17, 2022

 

https://youtu.be/pKJlwsQ48NE?si=o2GOZBW9dr6f57BA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరవై స్తంభాల ఆలయమంటే నీదే వేంకటేశ్వరా

మా ధర్మపురిలో నిలువెత్తు విగ్రమున్నది నీకే శ్రీనివాసుడా

ఆగ్రహమే ఎరుగవు నీవు అనుగ్రహం మినహా

చిద్విలాస మూర్తిగ వెలిసావు ఎదన సిరితో సహా

ప్రణామాలు నీకివే వాంఛితార్థదాయకా

ప్రమోదాలు నీవల్లే రమా నాయకా


1.గోదావరి జలములతో నిత్యాభిషేకాలు

ప్రతి శుక్రవారము నీకు క్షీరాభిషేకాలు

పలు వన్నె చిన్నెల పట్టు వస్త్రా లంకారాలు

భక్తవరుల మనోభీష్టాలైనవి నీ ఆభరణాలు

తులసిదళాలతో పలువిధ విరులతో అల్లిన మాలలు

కళ్ళు రెండుచాలవు కనగ మదిన ఆనంద హేలలు


2.ఏటేటా జరిగేను బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు

కనుల పండుగ చేసేను కోనేటి తెప్పోత్సవాలు డోలోత్సవాలూ 

శివ నరసింహులతో బాటు రథోత్సవాలు

ఆర్జిత సేవలు అర్చనలు భోగాలు

నీకు అంగరంగ వైభోగాలు

కళ్ళు రెండుచాలవు కనగ మదిన ఆనంద హేలలు

Wednesday, June 15, 2022

 

https://youtu.be/1JqUsQY0VCE?si=CiH2vvCjXX6xWijN

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

తరించిపోయింది నీ పాదాలు కడిగిన కడలి
పరవశించిపోయింది నీపై వెన్నెల కురిసిన పున్నమి జాబిలి
వయ్యార మొలికింది  నీ మేను తాకిన చిరుగాలి
అపురూపమైన నా నెచ్చెలి 
నీవు నాదానివన్న ఊహకే మనసు ఎగిరిపోతోంది దూదిపింజలా తేలితేలి

1.తహతహలాడుతుంది గులాబీ
నీ జడలో తానొదిగి గుర్తింపు పొందాలని
తపనేపడుతుంది పచ్చలహారం
నీ ఎదపై  చేరగ హెచ్చరిల్లు తన అందాలని
తానేం తక్కువతింది కోక నిను చుట్టుకోక 
తన బ్రతుకే వృధా కనుక నీకే చెందాలని
తన్మయమొందుతోంది మనసు అనుక్షణం
తలపోస్తూ నీతో పొందు ఆనందాలని

2.గోదారి గట్టున ఉన్న ఇసుకతిన్నెలన్ని 
వేచిచూస్తుంటాయి మన కబుర్లకోసమని
రాదారి పక్కనున్న తురాయిపూవులన్ని 
దారి కాస్తుంటాయి  మనపై కురుద్దామని
పావురాలు బ్రతిమాలుతాయి 
ప్రేమరాయబారాలు   తాము నెరపు తామని
ఎరిగితివా ప్రియా గొప్పకవుల కలాలు సైతం 
మన ప్రణయం కావ్యాలుగా రాయ గోరాయని


https://youtu.be/IS5ck9vmWdc?si=bXPsc27mf7R5edtw

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : శివరంజని

సౌందర్య నిధినీవే-నా జీవన కౌముదివే
నిశీధులన్ని నీవల్లే ప్రకాశించినాయి
మధురానుభూతులెన్నో సంప్రాప్తమైనాయి
కొనసాగింతునే…నా ప్రేమ ఏడు జన్మలదాకా
క్షణమైనా మనలేనే చెలీ నీతోడు లేక

1.నిర్జన ఎడారులే  నిన్నటి నా బ్రతుకంతా
బ్రహ్మజెముళ్ళే నే నడిచిన దారంతా
అలమటించి పోయాను ప్రేమరాహిత్యంతో
పరితపించిపోయాను నే తీరని దాహంతో
శ్రావణ మేఘమై అనురాగం కురిసావే
శరత్తు చంద్రికవై ఆహ్లాదం పంచావే

2.నిండైన జాబిలికి చెట్టుమచ్చనే అందం
 నీ నగు మోముకు మోవి పుట్టుమచ్చ అందం
అందాలన్ని ఒక్కదిక్కే కుప్పబోస్తె నీ చందం
కనుగిలుపక నిన్ను చూస్తే అంతులేని ఆనందం
రాయంచలు వయార మొలుకు నీ కులుకులు నేర్వంగా
రాచిలుకలు పలికి తేనె చిలుకు నీవే గురువని గర్వంగా


Tuesday, June 14, 2022

 రచన,స్వరకల్పన &గానం:డా.రాఖీ


వ్యర్థపు వ్యక్తులకు జన్మెందుకిస్తావో

ప్రయోజనం లేని మనుజుల ఎందుకు పుట్టిస్తావో

అర్థంపర్థమేమైనా ఉందా స్వామీ నీచర్యలకు

పైశాచికానందమేనాప్రభూ నీ వికృత క్రతువులకు

దేవుడంటె దేవుడిలా ప్రవర్తించు స్వామి

నిను నమ్మివారి బాధ్యత నిర్వర్తించవేమి


1.భరించగరాని బాధలు తగిలింతువేల

కనీవినీ ఎరుగనట్టి కఠినరీతి శిక్షింతువేల

తప్పుచేయడం మాకు సరదానా ఏమి 

వక్రబుద్ది పుట్టేల ప్రేరేపింతువెందుకు స్వామి

దోషాలు ద్రోహాలు నీవు చేసుకుంటూ

తగినశాస్తి చేసానంటూ నీవే నవ్వుకుంటూ


2.కారణం మేమే ఐతే ఏకంగా మరణశిక్ష వెయ్యి

ముందువెనక చూసుడెందుకు ఇపుడే చంపెయ్యి

చావుకైతె వెఱించిందిలేదు బ్రతికిందే ఇక చాలు

దైన్యంగా నూరేళ్ళకంటే అనాయాస మృతి మేలు

కోరింది ఏదీ తీర్చన దాఖలాయే లేదు

మరిమరి కోరను స్వామి ఆఖరిదిది తీర్చేద్దూ

Monday, June 13, 2022

 

https://youtu.be/wv64meWEL20?si=MeZteI011xYDBQko

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భవతారకం నీ నామం నమఃశివాయ

పరమ ఔషధం నీ తీర్థం నమఃశివాయ

సులభ సాధ్యం నీ అర్చనం నమఃశివాయ

కైవల్య సాధనం నీ ధ్యానం నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ


1.శుభ సూచకం నీ దర్శనం నమఃశివాయ

అఘనాశనం నీ స్పర్శనం నమఃశివాయ

అంజలి సలిలం నీ అభిషేచనం

నమఃశివాయ

పత్రి దళం నీకు ప్రియ సమర్పణం

నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ


2.సుస్వర ధారణం నీ పదసేవనం నమఃశివాయం

నశ్వర భావనం నువు వినా జీవనం

నమఃశివాయ

పంచాక్షరీ మంత్రం పరమ పవిత్రం

నమఃశివాయ

అక్షరమగు అక్షరాలు లక్ష్యము నెరవేర్చనీ మోక్షమునీయనీ నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ

 https://youtu.be/0ql5t1PfIt4


కడిగిన ముత్యము నీ రూపం

స్వచ్ఛని స్ఫటికము నీ అందం

విరిసిన పుష్పము నీ దరహాసం

అనురాగ రంజితం నీమానసం

నవమోహిని నీ దర్శనం ఉత్తేజ జనితం

ప్రియభామిని నీ స్పర్శతొ అమరత్వ భావనం


1.సుప్రభాత శుభవేళ ఇల్లూ వాకిలి తీర్చిదిద్ది

ముంగిట ముగ్గేసి గడపకు పసుపు రాసి కుంకుమనద్ది

అభ్యంగనమొనరించి కురులారగ నెట్టెము జుట్టి

తులసి కోట చుట్టు దిరిగి తులసిని అర్చించగ

నవమోహిని నీ దర్శనం ఉత్తేజ జనితం

ప్రియభామిని నీ స్పర్శతొ అమరత్వ భావనం


2.చేతిలొ పాలచెంబు కొప్పులొ మల్లెచెండు పరవశమొందించు

నల్లంచు తెల్లచీర నాభికనగ జార

మునివర్యులనైనా ముగ్గులోకి దించు

ముద్దు ముచ్చట్లతో వింత కౌగిలింతలతో ఎదలానందించు

శృంగార తరంగాల అంగాలు అంగలార్చ కైవల్యమందించు

నవమోహిని నీ దర్శనం ఉత్తేజ జనితం

ప్రియభామిని నీ స్పర్శతొ అమరత్వ భావనం


Ok

Saturday, June 11, 2022


కానుకగా నీకీయనా నగిషీలు కలబోసిన పసిడి గాజులను

బహుమతినందీయనా మెరిసే రవ్వలు పొదిగిన హారాలని

అలంకరించనా మంజులమగు నీ పదాల స్వర్ణ మంజీరాలని

మణిమయ మకుటమే తలనుంచనా విశ్వైక సుందరి నీవేనని


1.జాంబవంతునితో పోరి కొనితేనా భామామణీ శమంతకమణిని

బొందితోనే అమరావతి చేరి ఎత్తుకరానా పారిజాత తరువుని

ఇంద్ర ధనుసునే దించి చీరగ అందించి

నందింప జేయనా డెందముని

అలకాపురినే నీపరం చేసి మురిపింపగజేయనా నీ మురిపెముని


2.కోహినూరు వజ్రమే నీవైతే మరొకటెలా సంపాదించను

తాజ్ మహల్ సౌందర్యం సరిరాదే

అద్భుత హర్మ్యమేది నిర్మించను

మానవ సాధ్యమేదైనా తులతూగదు

కానుకనీయగా నీ జన్మదినమును

నభూతోనభవిష్యతి నామతి నీకెపుడో ఇచ్చేసితిగా నా మనమును








https://youtu.be/k3pNwO7qGrE

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాకము నరకమని మరి లేవు నరునికి 

శోకము సౌఖ్యము ఏకమే నీ భక్త వరునికి

నిశ్చింతయు నీ చింతయు అపర స్వర్గ ధామము

ఆరాటము అసంతృప్తి అవనిలొ యమ లోకము

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


1.ఋణము తీర్చుకొనుటకే సతీ సుతుల బంధాలు

వడ్డీకి వడ్డీ వేసి గుంజుకొని నంజుకతిను చందాలు

దృష్టిని నీనుండి మరలించెడి మోహ గంధాలు

నీటి బుడగ నిలుచునంత సేపటి ఆనందాలు

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


2.వ్యాధులుగా బాధించును పూర్వజన్మ పాపాలు

వెంటాడి వేధించును ఏనాడో ఏ అర్భకులోఇచ్చిన శాపాలు

అశాంతి అలజడి వత్తిడి నిలువెల్లా దహించు తాపాలు

అడుసు త్రొక్కి జలము కోరునటుల ఈ పరితాపాలు

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


OK


https://youtu.be/uPE4fnmEPOc

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువు చెప్పిందేమిటి సాయి

మరి చేస్తున్నదేమిటి సాయి

నీ మాటకు చేతకు పొంతన ఐతే లేదోయి

కరుణను మాత్రం వర్షిస్తుంది నీకనుదోయి

సాయిబాబా షిరిడీ సాయిబాబా

ఎంతకాలం నీ గారడీ సాయిబాబా


1.షిరిడీలో అడుగిడితే రావంటివి ఆపదలు

నా సమాధి తాకినంత  తొలగునంటివి వేదనలు

తలువగనే పిలువగనే వచ్చెదవన్నవి అనృతాలు

నమ్మితె కోర్కెలు తీర్చెదవన్నవి కోతలే కోతలు


2.శరణన్నవారికి దక్కేదేముంది నేనే ఉదాహరణం

దిక్కునీవని మ్రొక్కేవారి భారం మోసావ ఏదీ తార్కాణం

ఆదుకున్నదీ చేదుకున్నదీ లేదన్నదే

నా ఆరోపణం

త్రికరణ శుద్ధిగ విశ్వసించాను చేయాలి నీవే నిజనిర్ధారణం

Wednesday, June 8, 2022

https://youtu.be/dig29bXPUJs


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిత్తకార్తి కుక్కకన్నా హీనం

గోతికాడి నక్కకన్నా నీచం

ఒక్కటైనా లేదు నీలో మనిషి లక్షణం

భువికి భారం నీఉనికిఘోరం  ఏ క్షణం


1.ఏకపత్నీ వ్రతుడు రాముని జన్మభూమి ఇది

చతుర్విధ పురుషార్థాలను ఆచరించే

పుణ్యస్థలమిది

నా దేశం ప్రపంచానికే ఆదర్శం

నా దేశం అంటేనే విశ్వసందేశం

సతి అనుమతి లేనిఎడల ధర్మరతియూ నేరమే

బలాత్కారం మానభంగం పరులపై అతి క్రూరమే


2.వావి వరుసలు జాలి కరుణలు  నీకడ మృగ్యమే

మానవీయ విలువలన్నవి ఎరుగనీ 

వికృత మృగమువే

నీవు చేసే భీభత్సం మెచ్చదే సమాజం

నీది ఎంతటి కుత్సితం మారదా నైజం

మాటు వేసి వేటాడే అకృత్యాలే దారుణం 

చట్టరీత్యా  తగినశాస్తిగ శిక్ష ఒకటే నీకు మరణం

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చీరకట్టులోనే ఉంది సుదతి సింగారం

చేలముతో ఇనుమడించు ఇందువదన సౌందర్యం

కనికట్టు చేస్తుంది భారతీయ వనిత కట్టుబొట్టు

కట్టిపడవేస్తుంది కాళ్ళకాడ మగవాడిని ఎరిగి ఆయువుపట్టు


1.చీరలు పలు కొలతలు వన్నెలు నగిషీలు అంచులు కొంగులు నాణ్యతలు

చేనేత పట్టు సిల్కు సింథటిక్కుల సారీలు పెక్కురీతులు

వివిధ సందర్భాలకు అమరి అలరెడు

తరుణుల ప్రియతములు

దాయాదుల విరోధానికి భాగవత విలాసానికి హేతువులు


2.ప్రాంతాలవారిగా సంతరించుకుంది 

చీర ప్రత్యేకత

కట్టుకొనుటలో ఆకట్టుకొనుటలో చీరలకుంది విశిష్టత

మరాఠీ గుజరాతీ మార్వాడీ మళయాళి తెలుగుది దేనికదే ఘనత

దాచిదాచక అందాలతొ కనువిందు చేయుటే చీర మార్మికత

Tuesday, June 7, 2022

 

https://youtu.be/kHAU-JGAuVE?si=xsbG0Utwk_7emlLg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కలానికి బలమిచ్చే విటమిన్ల టానిక్ నువ్వు 

నడుమన నను ముంచక ప్రేమతీరం చేర్చే టైటానిక్ నువ్వు

ఏడాది పాటూ నాలో పల్లవించే నవ వసంతం నువ్వు

నెలపొడుగునా పున్నమిలా వెన్నెల కురిసే జాబిలి నువ్వు


1.ఏ మూలో నీ హృదయంలో చోటిచ్చిన మైత్రివి నువ్వు

కవితను పొంగి పొరలింపజేసే వైచిత్రివి నువ్వు

నా జీవిత నాటకంలో ప్రముఖమైన పాత్రవి నువ్వు

ఎండకు వానకు తోడైనిలిచి ననుకాచే

ఛత్రము నువ్వు


2.నన్ను నేను దిద్దుకునేలా నా మదికి అద్దము నువ్వు

గెలుపు గిరుల నెక్కించే ఎత్తైన నిచ్చెన నువ్వు

నా నాలుక పైన ఆడే లల్లాయి పాటవు నువ్వు

నాకు వేడుక కలిగించే నృత్త నయన జంటవు నువ్వు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏదనేదో వెలితిగా

మనసంతా నలతగా

పాట రాయని ప్రతిపూట

కలం కదలక అలసట


1.నవ్యత నందించేలా

రమ్యత సాధించేలా

ధన్యతను పొందేలా

భావమొకటి రాదేలా


2.వస్తువుల జబర్దస్తీ

పద సంపద నా ఆస్తి

గేయానికి హాయితొ దోస్తీ

కృషితో దుర్భిక్షం నాస్తి

Monday, June 6, 2022


https://youtu.be/n4Boj7U0fLA

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అప్పగింతలంటే కళ్ళప్పగింతలే

సాగనంపుడంటే కన్నుల చెమరింతలే

నోముల పంటగా కన్న కూతురిని-పెళ్ళికూతురిని

అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారిని

ఆఖరి ఘట్టానికి వచ్చిందిక కళ్యాణం

ఒక అయ్యచేతిలో బొట్టిని పెట్టే తరుణం

మారుతుంది తానిక అత్తింటి తోరణం

తీరేనా ఎప్పటికీ పుట్టింటితో రుణం


1.పుట్టింది మొదలుగా ఇంటికి మహలక్ష్మి

ఇంటిల్లిపాదిని ఏలే ఏకైక యువరాణి

ఆజ్ఞలు వేస్తుంటే పాటించుటే పరిపాటి

నవ్వులు రువ్వుతుంటే మెరుపు వెలుగులేపాటి

మారుతుంది తానిక అత్తింటి తోరణం

తీరేనా ఎప్పటికీ పుట్టింటితో రుణం


2.ఆడింది ఆటగా పాడింది పాటగా

తనమాటే వేదవాక్కు

అమ్మానాన్నలకు ఆరిందానిలా తానే పెద్ద దిక్కు

బంగరు తల్లిగా బుంగమూతి పట్టడం తన జన్మహక్కు

మంచి కోడలనే మాట మా గారాల పట్టికి ఎలాగూ చిక్కు

మారుతుంది తానిక అత్తింటి తోరణం

తీరేనా ఎప్పటికీ పుట్టింటితో రుణం

 

https://youtu.be/qDxPaJnN2hI?si=nielkdQUjIzQeiMv

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈ మేను లేకపోతె మాత్రమేమి సాంబ శివా

నేనుగా నీలో అజరామరమై మనలేనా సదాశివా

ఉన్నంత వరకు దేహమున్నంతవరకు చేయనీ నీ సేవ

నిను చేరెడి తోవలోనె నను నడిపించరా మహాదేవా


1.రేపు మాపని మా పని ఆపని వేలుపు నీవని

నమ్మి నాను నెమ్మనమున నమో పినాకపాణి

దారాసుత బంధాల నుండి విముక్తి చేయరా కపర్దీ

ఈదలేను చేదుకో  భవ జలధిని కళానిధీ


2.లింగాకారా గంగాధరా త్రయంబకా ప్రభో మృత్యుంజయా

నర్తించరా నటరాజా నా నాలుకపై నమో నమఃశివాయ

పరమేశ్వరపరమై వరలెడు జన్మ నీవొసగెడి వరమయా

 శివమేకమై శివైక్యమై శివోహమై మననీ నను దయామయా

Friday, June 3, 2022


https://youtu.be/cFWKpK4sKJU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సంకటాలెన్ని స్వామి చిన్ని అంకురానికి

బాలారిష్టాలే బాలాజీ ప్రతి బీజానికి

ఒడుదుడుకులు తట్టుకొని చెట్టుగ గట్టెక్కుటెంత కష్టము 

మనిషి లక్ష్యమే వృక్షపుగతియైతే జన్మధన్యమగుట తథ్యము

తిరుమలేశ నీ రచనా కౌశలాన సృష్టి సమస్తం కడు విచిత్రము


1.క్రిములు తొలిచి ఒళ్ళు గుల్ల చేసే ప్రమాదము

సారవంతమైన నేలన లోతున నాటితేనే పటుత్వము

తగినంతగ జలమందగ మొలకెత్తును జీవిగ విత్తనము

మొక్కగ ఎదుగుతూ మానుగ మనుదారిలొ ఎందరిదో పెత్తనము

మనిషి లక్ష్యమే వృక్షపుగతియైతే జన్మధన్యమగుట తథ్యము

తిరుమలేశ నీ రచనా కౌశలాన సృష్టి సమస్తం కడు విచిత్రము


2.కంచె ఒకటి పశువుల నోటికందకుండ కుజమును కాయాలి

చీడ పీడలన్నిటిని విధిగా ఎదుర్కొని 

పూలు కాయలు ఫలాలు కాయాలి

తరువు తనువులొ అణువణువు పరుల కొరకె దారపోయాలి

తన కొమ్మలొ భాగమే కామాగా మారి

నరికే గొడ్డిలి  కొమ్ముకాయాలి

మనిషి లక్ష్యమే వృక్షపుగతియైతే జన్మధన్యమగుట తథ్యము

తిరుమలేశ నీ రచనా కౌశలాన సృష్టి సమస్తం కడు విచిత్రము