రాగం:తోడి
ఎందుకు నను నిర్దేశించావో
ఏపనికి ననుపురమాయించావో
అటుగానే సాగనీ నా అడుగులు హే ప్రభో
తేల్చుకోనీ సాధనలో నను చావో రేవో
1.వచ్చింది దేనికో వడియాలు పెట్టనా
పుట్టుకకు పరమార్థం దోచికూడబెట్టనా
సమయాన్ని జారవిడిచి శోకాలు పెట్టనా
ఖర్మ ఇంతేనంటూ నిత్యం నిన్ను తిట్టనా
ఒడిదుడుకుల పాల్బడనీ నడవడిక నా పరమవనీ
తప్పనిదైనా సరే తప్పుదారి నను తప్పించుకోనీ
2.తోచినంతలో నన్ను పరులకెపుడు సాయపడనీ
ఎదలొ ఎన్ని వెతలున్నా చిరునవ్వులు పూయనీ
తరులవోలె ఝరులకుమల్లే తనువును కడతేరనీ
తరతరాలు మరువని మనిషిగ నన్ను కీర్తిగొననీ
నన్ను నీకు ప్రతినిధిగా భావించుకోనీ
జన్మ సార్థకమయ్యేలా నన్ను తరియించనీ