అప్సరసల అందం నీది
మిసమిసల పరువం నీది
రుసరుసల అలకే నీది
శషభిషల పలుకే నీది
ఆగలేను వేగలేను సతమతమయ్యేను
విడువలేక పట్టలేకా నీతో చిక్కేను
1.ఉన్నచోట ఉండీలేకా ఉండనీవు
నన్ను నా మానానా బ్రతుకనీవు
తప్పుకోబోతే ఎరవేసి లాగేవు
పట్టుకోబోతే నిన్ను కన్నెర చేసేవు
ఆగలేను వేగలేను సతమతమయ్యేను
విడువలేక పట్టలేకా నీతో చిక్కేను
2.నీవు చూపే చొరవ వల్లనే ఎదలోకి చొరబడతాను
నిజాయితీ ప్రేమ నీదని ప్రతిసారీ పొరబడతాను
కోపముంటె చంపివేయి-నీ కౌగిట నలిపేసి
పబ్బమింక గడిపివేయి నన్నిపుడే బలిచేసి
ఆగలేను వేగలేను సతమతమయ్యేను
విడువలేక పట్టలేకా నీతో చిక్కేను