Monday, August 23, 2021

 

https://youtu.be/gGaf7KRbj0w

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దేశ్


జాబిలి తలమానికము-జాలి కడలి మానసము

జాగరణయె నీ వ్రతము-జాగెరుగని కనికరము

జాడగనము జగమందున- శివా నీవంటి దైవము


1.చిరు చిరు సేవలకే సురతిని పొందేవు

తరతమ భేదాలు లేక వరములనొసగేవు

భక్తి ఒక్కటే ముఖ్యము మూఢమైనదే గానిమ్ము

చిత్తము నీపరమైతెచాలు జగడమూ జరుగనిమ్ము

శ్రీ కాళ హస్తి గాథ తెలిపెను గద ఈ సత్యమ్ము

సామాన్యులకైన శివా  కాగలవు కైవసమ్ము


2.నెగ్గజాలనయ్యా శివా పట్టుబట్టి పరికించ

ఒగ్గజాల నీపదాలు నన్నిలా ఉడికించ

అందరినీ ఆదుకొనే ఆప్తబంధువని నమ్మితి

అక్కున ననుగొన అక్కెఱనా అమ్మ సమ్మతి

మంజునాథ మహాదేవ నీవే శరణాగతి

సాంబశివా సదానంద నా కీవే సదాగతి

Saturday, August 21, 2021

https://youtu.be/CCEBxd9AfmA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:మోహన

"యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః 
తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల"

అనురాగం విరిసే వేళ-అనుబంధం మురిసే వేళ/
వచ్చింది నేడే రాఖీ పండగ-శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగ

1.తోబుట్టువుల మమతల వారధి/
సోదరి సోదర ప్రేమకు నెలవిది/
రక్షాబంధన పర్వదినమిది/
సంతోషాలే కొలువు దీరినది

2.ఇందిర బలికి కట్టిన రక్షకు గురుతిది/
ద్రౌపది కృష్ణుల ఆత్మీయ చిహ్నమిది/
లాభ క్షేముల ఆకాంక్షమేరకు/
సంతోషిమాత పుట్టిన దినమిది

3.గాయత్రి మాతను మది కొలిచేది/
నూతన యజ్ఞోపవీత ధారణచేసేది/
నిత్యకర్మానుష్ఠాన అనుజ్ఞను పొందేది/
ప్రాయశ్చిత్త పంచగవ్యం సేవించే రోజిది



వేనోళ్ళ స్తుతించేను శేషుడు

నిరంతరం నుతించేను నారదుడు

వేదోక్త స్తోత్రాల సర్వదా గణుతింతురు సప్త మహా ఋషులు

వేల కీర్తనలతో కొనియాడిరి నిను  త్యాగయ్యా అన్నమయలు

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా


1.మనసులోనె తలచేను ఇపుడో అపుడో

ఇంటిలొ పూజింతును వీలున్నపుడెపుడో

గుడిలోనిను దర్శింతును ఏ పండగ పబ్బానికో

తిరుమల కరయడము ఎన్నాళ్ళకొ ఎన్నేళ్ళకో

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా


2.నిర్మించలేను స్వామి నీ సుందర మందిరాలు

ఈయగలేను ప్రభూ ఏ ఘనమైన కానుకలు

చేయగలేను నేను విరివిగా దానాలు ధర్మాలు

మోయలేను గోవిందా నిస్సార సంసార భారాలు

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నీలాంబరి


జోలపాటనై నిను బజ్జోబెడతా

లాలిపాటనై నిను జో కొడతా

హాయిగా నిదురించు ఈ నాన్న ఎదమీద

రేయంతా ఆదమరచి సేదదీరు నిశ్చింతగా 

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో


1.ఉలికి పడకు నీకే తెలియని బూచిని తలచి

కలత చెందకు కడుపులోని నలతకు వగచి

నీ జుత్తులొ వేళ్ళు జొనిపి సున్నితంగ రాస్తా తలను

నీ వెన్నుంతా నిమురుతూ హత్తుకుంటా ప్రేమతోను

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో


2.కథలెన్నో చెపుతాను ఊకొడుతు నువ్వుంటే

నెమరువేస్తాను నీ అల్లరిని మైమరచి నువువింటే

నువు చేసిన మారాము నే చేసిన  గారాలు

నిదురలోకి నీవుజారితె నే ఊపిరి తీసుకుంటా

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో

Friday, August 20, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ దివ్య లోకాలనుండి ఏతెంచినావో ఇలకు

ఏడేడు భువనాలలోనూ సాటిలేనే లేరు నీకు

విరించి సైతం సృజించలేదు నీలా సృష్ట్యాదిగా

తరించిపోతాడు నిను గాంచి ప్రవరాఖ్యుడైనా


1.స్థాణువులౌతారు ఎవరైనా నీవెదురైతే

అనిమేషులౌతారు నీచూపు తమపైన వాలితే

ఇంద్రధనుసే నేలపై దిగినట్టుగా కనికట్టుకాగా

పూలవనమే నడిచొచ్చినట్టుగా ఆకట్టుకోగా


2.ఖంగుతింటారు కవులంతా నిన్ను వర్ణించగా 

విస్తుపోతారులే చిత్రకారులైనా నిను దించగా

చతికిలపడతారు శిల్పులు నిను శిల్పీకరించగా

తికమక పడతారు అందగత్తెలే నిన్ననుకరించగా

Thursday, August 19, 2021

 

https://youtu.be/LCvtbFpw4ps

*శ్రావణమాస  వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రావమ్మా వరలక్ష్మీ  క్షీరాబ్ధి ప్రియ పుత్రి

అందెలు ఘల్లనగా అడుగిడవే అంబుజనేత్రి

కరుణజూడవమ్మా వరమహాలక్ష్మి

శుక్రవార శుభవేళ అమ్మా సౌభాగ్యలక్ష్మి


1.నీ చలవనే తల్లీ సిరిసంపదలన్నీ

నీ వరములే జనని హోదాలు పదవులన్నీ

ఇచ్చినట్టె ఇచ్చినవన్నీ దూరం చేయకమ్మా

ఉన్నంతలొ పరమానందం ప్రసాదించవమ్మా


2.కలతలు రాకుండా సాగనీయి కాపురం

వెతలేవి కలగకుండా గడపనీ జీవితం

నలతలు సలపకుండా కాపాడు ఆరోగ్యం

నగవులు నిండేలా చెలఁగనీ మా గృహం


https://youtu.be/0lUyQcmUuQo?si=do-JmE0SBuJt98M7

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం : మధువంతి


స్వాగతం ప్రియతమా కలల లోకంలోకి

హాయిగా తీయగా మాయగా అచట మన ఉనికి

దైహిక బాధలు మరచి ఐహిక కాంక్షలు విడిచి

ఆత్మలుగ ఏకమవగా సంగమిద్దాం కాలాలు కడచి


1.తెల్లారిలేస్తూనే చుట్టు ముట్టు జంజాటాలు

మెడకుబడిన పామల్లే బరువులు బాధ్యతలు

తప్పించుకోలేని మూణ్ణాళ్ళ భవబంధాలు

వెంటాడి వేధించే దుర్భరమౌ దుర్గంధాలు


2.ఆకలీ దప్పులమాట లేనె లేదు ఇచ్చోట

ఆంక్షలు కట్టుబాట్లకు అవకాశం ఉండదిట

నాకు నీవు మహరాణి నీకు నేను రారాజు

నిదురించిన సమయమంతా స్వర్గమే మనకేరోజు

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీకోసం నేనున్నాను

నీకోసమే నేనున్నాను

ఊపిరిలో ఊపిరిగా

ఎద చేసే సవ్వడిగా

కన్నీరు తుడిచే ఆప్తుడిగా

నీ నలతను తీర్చే వైద్యుడిగా


1.కబురంపే పనిలేదు ఏకాకితోనో

వ్యధ చెందే పనిలేదు ఏకాకివీవనో

అడగాల్సిన పనిలేదు బాధ్యతే నాదంటాను

తలుచుకోనక్కఱలేదు తెలుసుకొంటాను

నిరంధిగా నీవుండు భారమంత నాకొదిలేసి

నిశ్చింతగా నువు బజ్జుండు భరోసా నాపైనవేసి 


2.ఏపనిలో నేనున్నా ఆలోచన నీగురించే

ఎంత నిదురలోనైనా మదినిన్నే కలవరించే

నీకెలా ఉందోగాని నీవు నేను వేరేకాదు

నీవులేక ఏనిమిషం బ్రతుకు నాకు చిరుచేదు

దేహమైతె నీదైనా ప్రాణంలో ప్రాణంనేను

నేనంటు లేనేలేను నీవుగా ఎపుడో మారాను

https://youtu.be/XkGwNwc8sdc?si=TqE1cMnoo4uvy8హాఫ్

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:నట భైరవి

అందంగా తగిలించుకుంటారు
ముందో వెనకో సాయీ నీ పేరు
నీవంటే ఎంతటి భక్తి తమకుందో
లోకానికంతటికీ ఆసక్తితో తెలిపేరు
ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు
సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు

1.ఏ పని చేసినా బాబా దయ అంటుంటారు
ఫలితం ఏదైనా సాయి దయే అని వాపోతారు
లీనమైపోతారు బాబా నీ మైకంలో 
మునిగితేలుతుంటారు సాయీ నీ లోకంలో
ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు
సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు

2.సాయిరాం అంటూ మాటలు మొదలెడతారు
చీటికి మాటికి బాబా అంటూ కదలాడుతారు
ఎప్పుడు చూడు నీదే ధ్యాసగ ధ్యానం చేస్తారు
తప్పనిసరిగా పలికే దైవం నీవని భావిస్తారు
ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు
సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉలుకూలేదు పలుకూలేదు 

కులుకూలేదు అలకా లేదు

మతలబు  ఏంటో నాకు చెప్పమ్మో

మందహాసం కాస్తైనా గుప్పమ్మో

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా


1.ముల్లుగుచ్చుకున్నదా గులాబీలు త్రెంచుతుంటే

వేలుకోసుకున్నదా  వెన్నకోయబోతుంటే

వేడిసెగ తాకిందా దీపంవత్తి ఎగదోస్తుంటే

నడుంపట్టివేసిందా దిండు సవరిస్తుంటే

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా


2.లాఘవంగ తీయనా నొవ్వకుండ ముల్లుని

మలాంనే పూయనా వేలికైన గాయానికి

నవనీతం రాయనా కాలిన వేళ్ళ కొసలకు 

నూనె మర్ధన చేయనా నాజూకు నడుముకు

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా

 2422 పాటల వరకే ముద్రణ కోసం సంగ్రహించడమైనది

వీటిలో అత్యుత్తమమైనవి 108X11= 1188 పాటలు ప్రచురించడం జరుగుతుంది

Tuesday, August 17, 2021


మాయచేసావు నాకళ్ళను-తొలిచూపులోనే

గాలమేసావు నాగుండెకు-మైమరపు లోనే

కళ్ళు దాటి గుండె మీటి-

దాడిచేసావు నా మనసుమీదే

ఆక్రమించావిక బ్రతుకంత నీదే


1.పారిజాత పరిమళ సహితం

నీ ఆగమనం కమ్మేనేదొ మైకం

నిన్ను చూస్తూ చూస్తూ చూస్తూ

మరిచాను చూట్టూ ఉన్న లోకం

ఊపిరే ఆగింది నీతో ఉన్నంత సేపు

తాగకముందే నిను చూస్తుంటే

ఎక్కింది మొత్తంగ గమ్మత్తు కైపు


2.దూరమైనాయి నా అన్నపానాలు

భారమైనాయి నా పంచ ప్రాణాలు

 ఒట్టేసి చెప్తున్నా  అమ్మతోడు

ఏ జన్మలోను ఇక నువ్వే నాతోడు

నువులేక గడిపే ప్రతినిమిషం నరకం

తెలిసీ నువ్వు మది తెలుపలేకుంటె

గూడు కడుతుంది నీలో మౌనశోకం

OK


దాచుకున్నావు కన్నుల్లొ 

దోచుకొచ్చి వెన్నెల్ని 

పొదువుకున్నావు పెదవుల్లొ

అందమైన నవ్వుల్ని

ఫిదా బన్ గయా తెరే మై జానెమన్

దిల్ తొ కభీదియా అబ్ లేలో మెరే జాన్


1.వాయించకుండ ఉండలేను

నీ మోవి పిల్లనగ్రోవి

ఆఘ్రాణించకుండ మనలేను

నీ మేని కమ్మనితావి

ఒదిగిపో నా కౌగిలింతలో

ఏ చింతలేక జీవితాంతం

ఉంచుకో నీ తోడు నీడగా

చెలికానిగా నే నీకే సొంతం


2. జయించనా మరణాన్ని

అమృత కలశాల నాస్వాదించి

రమించనా నీ సజీవ శిల్పాన్ని

అమర సౌఖ్యాల ననుభూతించి

చెలీ నీ పొందు  పొందడం

మరు జన్మలేని కైవల్యం

నీతో క్షణమైన గడపడం

సచ్చిదానంద సమతుల్యం

Sunday, August 15, 2021

https://youtu.be/KFhgeMrOS-0?si=IAY1C3qLw9jk5vyn

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:షణ్ముఖ ప్రియ

పరునిగ తోచవు పరమశివా
నాకిహము పరము నీవే కావా
తండ్రివి నీవు నా తల్లి గౌరి
దండంబులు మీకివే మల్లారి మారి

1.గణపతీ దేవసేనాపతీ
అయ్యప్పా మా కగ్రజ భాతి
ఇందఱి మీ అండ నాకున్నది
ఈశ్వరా ఇక కలగదు వెఱపన్నది

2.బంధుమిత్రులే నీ ప్రమధ గణం 
అంతకుమించింది  దైవబలం
దేవుళ్ళే ఆప్తులైన మనోబలం
సర్వకార్యసిద్ధికి ఆలవాలం


Saturday, August 14, 2021

 నా దేశమా నా భారత దేశమా

జగతికి తెలిపెడి మానవతా సందేశమా

చెదరని ఆకృతి చెరగని సంస్కృతి 

మువ్వన్నెల పతాకతో నింగికి పట్టగ హారతి

జోహార్ జోహార్ జోహార్ నీకిదె భారత భారతి


1.సున్నా అన్నది కనుగొని 

శూన్యం గణితాధారమని

వేదవిజ్ఞాన విశ్లేషణలో వికాసమెంతో సాధించి

శాస్త్రవిజ్ఞాన రంగంలో ఆవిష్కరణలుగావించి

ప్రపంచానికే తలమానికమై వరలే నా దేశమా

మేధావులనే విశ్వవ్యాప్తి గావించిన నా దేశమా


2.తాత్విక దర్శనమందించి

యోగ అన్నది అనుగ్రహించి

పారమార్థక సాధనమ్ములో సార్థకతనే బోధించి

మానవసేవయే మాధవసేవగ లోకానికి ప్రవచించి

ప్రపంచానికే తలమానికమై వరలే నా దేశమా

తత్వవేత్తలే విశ్వవ్యాప్తమై వెలిగే నా దేశమా





కదలవు మెదలవు-ఉలకవు పలకవు

పొగడినా పొంగవు-తెగడినా కృంగవు

ఎలా నీవు వశమయ్యేది-శ్రీహరి

ఏ మంత్రానికి లొంగేది తిరుపతి శ్రీపతి


1.గోవింద యనుచు నామాలు పఠించనా

కాలినడకతో నీ సప్తగిరుల నెక్కనా

తలబిరుసుని వదిలేసి నీలాలొసగనా

నీ కోనేటిలొ మునకలేసి పునీతమవనా


2.నీ మంగళ విగ్రహాన్ని దర్శించనా

పలు విధాల సేవలతో అర్చించనా

ముడుపులు కానుకలను సమర్పించనా

మనసావాచా కర్మణా నన్నే నివేదించనా

నీ పాదపద్మాల నా కవి తలనుంచనా

Friday, August 13, 2021



ఎవరిమోవి పైననో  చిరునవ్వుగా
ఏ హృదయ వేదనో తీర్చ నువ్వుగా
ఆనందమై జీవితం హాయిగా
ఆరుబయట పున్నమి రేయిగా

1.డబ్బుకు కొదవేమో నిరుపేదగా
సంపన్నలమే ఎంతైనా ప్రేమపంచగా
ప్రేమిస్తే కోల్పోయేదేముంది మనిషిగా
పోతే సమయం పొందితె ప్రేమమయం

2.వచ్చాము ఒంటరిగా పుడమికి
పోతాము ఒంటిగానే పైకి దివిపైకి
నడుమనే స్నేహితులు బంధువులు
పరులెవ్వరు ఆప్తులవగ నరులందరు

'కిసీకి ముస్కురాహటోంపె-'హిందీ పాటకు నా స్వేఛ్ఛానువాదం)



మనసువిప్పి చెప్పలేరు మగువలంతా

చూపులు ఎక్స్ రేలుగా చేసి 

ఎరగాలి గుండెలోని చింత

ఏదడిగినా కాదది కాదంటారు

కనుగొనడం మీకు చేతకానే కాదంటారు

వేగడం కష్టమే ఇల్లాలితో

కనులనే చెలిమెగా మార్చే చెలితో


1.టిఫినేమి చేయాలంటూ అడిగేరు తీయగా

ఇడ్లీ ఉప్మాలెందుకంటూ మాటల్తో మాయగా

పూరీ వడలైతే గుండెకి చేటంటూ గోలగా

బజ్జీలు దోసెలైతే గ్యాస్ ట్రబులంటూ ప్రేలగా

ఉన్నదేదొ పెట్టమంటే అసలు పట్టించుకోరు

కాలికేస్తె మెడకేసి ఖంగునే తినిపిస్తారు


2. చీర సెలక్ట్ చేయమంటూ షాపింగ్కి తీస్కెళ్తారు

షాపుకో వందచూసి వంద షాపుల్దిప్పుతారు

డైలీయూజ్ కేనంటూ పట్టుచీర పనిపడతారు

రంగంటే అంచంటూ పేచీలు పెడుతుంటారు

నాకు నప్పేదేదో మీకే బాగా తెలుసంటారు

తనికి నచ్చినదాన్నే మనతొ ఔననిపిస్తారు



ప్రియా నీ కోసమే కలవరం

నీ బాధతో ఎద సతమతం

జివ్వునలాగేనా కండరాల సలపరం

నీ వెతను తీర్చలేకుంటే ఎవరికెవరం


1.ఎలా చేయగలిగేవో నీవైన పనులన్ని

ఎంతగా మూల్గేవో గత్యంరంలేక నా చిన్ని

కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగేనో

నొప్పితో ఒళ్ళుకుప్పకూలేనో


2.తైలంతో మర్ధన చేస్తే ఉపశమించేనో

లేహ్యాన్ని పూస్తే కాస్త తెరిపి వచ్చేనో

మాత్రలేసుకుంటే ఇంచుక నయమౌతుందే

నా పాట మంత్రమై అనునయమౌతుందే

Thursday, August 12, 2021


పది అవతారాల పిదప పదకొండోది

సద్గురువుకు స్వరూపమౌ అవధూతది

సాయీ తత్వమాయె వివాదాస్పదము

వితండవాదనలా విశ్వాసమంటె హాస్యాస్పదము

సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో

అవధూత చింతన గురుదేవదత్త జయహో


1.రంధ్రాన్వేషకులకు తమ జన్మన్నా సందేహమే

నాస్తిక శ్రేష్టులకు తమ తండ్రి ఎడలసైతం సంశయమే

నమ్మకాన్ని నిర్వచించే వారెవరు  సృష్టిలో

అనుభూతులన్ని అనుభవైకవేద్యాలే నా దృష్టిలో

సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో

అవధూత చింతన గురుదేవదత్త జయహో


2.గాలి కంటికి ఆనదు నిప్పు రుచికి అందదు

నీరు గంధమెరుగదు శూన్యాకాశం స్పృశించదు

సాధించే దిశలోనే మన శోధన సాగాలి

యోగించునంతవరకు యోగిని సేవించాలి

సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో

అవధూత చింతన గురుదేవదత్త జయహో

https://youtu.be/rxh5OBp_Peg?si=k-yOLWgeiVN3L5kT

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:వాగధీశ్వరి

నను తరించనీ నీ సేవలో శ్రీ వాణి
నను గమించనీ నీ త్రోవలో కమలాసను రాణి
అవతరించినావే నను ఉద్ధరించగా
నా కవన వధూటివై ఆలంబననీయగా
నేటి మూలా నక్షత్రమందు నీ జన్మదినము
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు

1.కలిగించు యోగ లబ్ధి-చేకూర్చు భవరస సిద్ధి
ఓలలాడనీ నీ తన్మయాబ్ధి-వికసించనీ మంద బుద్ధి
పథనిర్దేశమునిపుడే కావించవే-సద్గతిని నాకందించవే
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు

2.ఉద్ధీపించు మూలాధారం-ఛేదించు నా సహస్రారం
చెలగనీ నాలోఒక్కో చక్రం-ఐక్యమై లోకాల కాలచక్రం
మరుజన్మేలేని పరమీయవే-నన్నిక వీడనని వరమీయవే
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు


Wednesday, August 11, 2021


 https://youtu.be/SPCCz7GsP8E?si=Ht0ydHO2lI4eZzNb

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ

రాగం : కాపి 


నామ్ కే వాస్తేనా దోస్తానాలు

పేరుకు మాత్రమేన ఫ్రెండ్ షిప్పులు

కష్టంలో సుఖంలో  కలిసిరాని స్నేహాలు

మోదాన్నీ ఖేదాన్నీ పంచుకోని నేస్తాలు

ఎడారిలో ఎండమావులే అజాగళస్తనాలే


1.సూక్తులెన్నొ ఉంటాయి స్నేహితమంటే

సుద్దుల వరకే సాగుతుంది సోపతంటే

అరమరికలె లేనిది అలనాటి బాల్యమైత్రి

కల్మషాలనెరుగనిది చిన్ననాటి చెలిమి


2.ఆశించి చేసేది కాదెప్పుడు మిత్రుత్వం

హృదయమెరిగి మెలగుటయే ప్రియత్వం

గాయం నీదయీ బాధ నాదవడమే నెయ్యము

విజయం నాదయీ  సంబరం నీదైతే సఖ్యము


3.ఫేక్ లే చాలా మటుకు ఫేస్బుక్ స్నేహాలు

టైంపాస్ లే ఈనాటి వాట్సప్ దోస్తీలు

నీకొరకే నేనంటూ నిలిచేదే నిజ స్నేహం

స్నేహానికి నేనెపుడూ మనసారా దాసోహం

https://youtu.be/2sBL4mwzHbw?si=SMruA65Iezua3dCn

వంకర తొండపు దేవర శంకర కుమారా

దీవించరమా వంకర టింకర సంకర బుద్ధులు మార

మొక్కెదనిన్నిదె చక్కని విగ్రహా ప్రియమారా

గ్రక్కున బ్రోవర  చిత్తము నీదిగ చేకొను నే నేమార


1.మరచితివేమో నను నువు స్వామి ఓ బొజ్జగణపయ్యా

అడగకముందే అక్కఱ దీర్చిన అద్భుత దైవం నీవయ్యా

నిద్దుర సమయానా సిద్దివినాయకా అనే కదా నే తలచేది

పొద్దున లేస్తూనే సిద్దివినాయకా  నీ చిత్రపటమునే చూసేది


2.కినుక వహించావు నా ఎడ ఎందుకో నా దోషమేమనో

అలక బూనినావు నావైపు నీచూపు ప్రసరించవైతివేలనో

తెలిసీతెలియకా చేసిన తప్పులకు గుంజీలు తీసెదను సంకటనాశా

తొందరపాటుగనో  నా పొరపాటుగనో చేసిననా ఐపుసైపు విఘ్నేశా

Tuesday, August 10, 2021


https://youtu.be/KfrI79vEgiE?si=c2jTr2xPpu7byu2H


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:పంతువరాళి (కామవర్థిని )


దివ్య రూపిణి,విద్వన్మణి

తేజో వాహిని,మన్మోహిని

జనని  జగదానందిని

వందనమందుకో పావని


1.చిరుత ప్రాయమునాడె-జీవిత సత్యము తెలిపితివి 

బుద్బుద ప్రాయమిదియని ఎరుక పరిచితివి 

ఆత్మశోధనలోనా అమ్మా నేను అద్వైతినైతిని 

సిద్ధినిపొందగోరి నీ శ్రీరూపమునే మదినిలిపితిని 


2.నా ఆనందానికి నీవే స్వస్వరూపమైతివి

నన్నుద్ధురించ పూనుకొని దయతో సిద్ధమైతివి

అక్కున నను చేర్చి తల్లీ నిక్కముగా బ్రోవవే 

నిరతము నీ సన్నిధిలో నిలువగ వరమీయవే 


https://youtu.be/C--0Ua10sqg?si=O_7EPVL8GLez6lY6

ప్రస్తుతించనేల మానవ కాంతలను

కొనితెచ్చుకోనేల కోరికోరి వెతలను

నీ తలపులు నిలుపనైతి నా తలను

నీ తపనలొ రాయనైతి కవితలను

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని


1.అందమే నీవైతే నిన్నుమించి ఏముంటుంది

ప్రకృతే నీవైతే ప్రతితావున తెఱగుంటుంది

రాజరాజేశ్వరి అంబా బాలా త్రిపుర సుందరి

శారదాంబా శ్యామలాదేవి అతిలోకసుందరి

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని


2.ఐహికమౌ సుఖములకై వెంపర్లాడ నీయకే

మూణ్ణాళ్ళ మురిపెంకోసం నన్ను ముంచేయకే

అతివలందరిలోను నీరూపే నా మతి తోచనీవే

శాశ్వత పరసౌఖ్యము నొసగి నన్నుద్ధరించవే

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని

https://youtu.be/u7K-Rloj6K0

రాగం:మధ్యమావతి


మంగళగౌరి జనని 

కామిత ఫలదాయిని

శుభ శ్రావణ మంగళ వారమున

వ్రతముజేతుమమ్మా కనవెమమ్ము కనికకరమున


1.పాలకడలి చిలుకువేళ కాలకూటమెగియగా

సర్వమంగళ పార్వతీవు హరుని కానతీయగా

గరళము గళమున నిలిపిన చంద్రకళాధరు లీల

మంగళ గౌరీ  కొల్తుము నిను మాంగల్యము కాచేల


2.సోదరి ద్రౌపదికి శ్రీకృష్ణుడు తెలిపినది

నోమునోచుకున్నంత ఐదోతనము నిలిపేది

ఆయురారోగ్యాలు  భోగభాగ్యాలనీయ

మంగళగౌరీ స్తుతించేము సంతతిని బ్రోచేలా  

Monday, August 9, 2021


నా తనువే వేణువు శృతిచేయరా మురళీధరా

నా మనసే స్థాణువు కరిగించరా కరుణాకరా

ఎన్నో జన్మలుగా వేచివేచిచూస్తున్నా 

రాగాలు మరచిపోయి రాటుదేలి నేనున్నా


1.వెన్నలాంటి నాహృదయమాయె పాషాణం

కొడిగట్టిపోతోంది నీ స్మరణలొ నా ప్రాణం

జాలిమాని మనకురా జాగుసేయబోకురా

మరుభూమిగ మారింది మరుల బృందావని

కన్నీరు మున్నీరాయే కన్నయ్య కోసమని


2.పశువును నా మతిజూడ  పాలించు గోపతి

వశపడకున్నది ఉడికించకు నను యదుపతి

శరణుజొచ్చినానురా శకటాసుర సంహారా

అక్కున జేర్చుకో  అమరేంద్ర వినుతా

గ్రక్కున బ్రోవర నను గజేంద్ర సన్నుతా


శిరోజాలకే  పోలిక  మేఘమాలిక

నక్షత్రమయ్యింది నీకు ముక్కుపుడక 

మీనాలు నయనాలై వదన సరోవరాన

నోరూరే చెర్రీలే నీ మధుర అధరాన

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు


1.సిగ్గులు నిగ్గుదేల కెంపులాయే నీ చెంపలు

సమీరాలు సయ్యాడగ చెలగే నీ ముంగురులు

ముద్దరాల ముద్దాడగ నా తపనలే పరితపించు

జవరాల నిను స్పృశించ నా తనువే పరవశించు

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు


2.ఏన్ని జన్మలెత్తినా  నీ కొరకే పుట్టాలి

తపస్సు చేసైనా తప్పక నీచేయిపట్టాలి

మూడుముళ్ళు వేసిమరీ నీ జత కట్టాలి

నీఅడుగు కందిపోకుండా అరచేతులు పెట్టాలి

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు

Sunday, August 8, 2021


https://youtu.be/I3D3sRB7E2w?si=lH_SlNgZ1PEz5M3a


నరజన్మ కోరానా పరమేశ్వరా

నరకమే మేలేమొ హరహరా

ఉత్కృష్ట మనుమాట ఉత్తుత్తదే ఉమేశ్వరా

నికృష్టమన్నది నగ్నసత్యమే నటేశ్వరా

శంభో శివశంకరా వందే గంగాధరా


1.నీవైపు ఒక అడుగు నే వేస్తే

ఆమడ దూరం నువు తోస్తే

ఎలా దాటను ఈ వైతరణి

ఎలా ఈదను భవ జలధి

దుఃఖభరితమె ప్రతినిమిషం

ఏమిటి స్వామి నా దోషం

శంభో శివశంకరా వందే గంగాధరా


2.కష్టాల కొలిమిలొ నను కాల్చి

దేహపు మకిలిని పోకార్చి

ఆత్మైకభావన సానబట్టి

పరమాత్మనే ఇక చేరునట్టి

బాటలోన నను నడిపించి

కడతేర్తువా  నా చేయిపట్టి

శంభోశివశంకరా వందే గంగాధరా


మనసుకు పరవశం మనిషిలొ కలవరం

నిన్ను చూసినంత

నను నేను మరచితి హృదయాన్ని పరిచితి 

నీ పాదాల చెంత

నమ్మవే నా చెలీ సృష్టిలో నీఅందం

అదే అదే ఒక వింత పులకింత


1.లేలేత రవికిరణం ఇచ్చే హాయంత

 మొగలిపొదలు గుప్పే తావంత

మరులుగొలుపు పున్నమి రేయంత

నమ్మవే నా చెలీ సృష్టిలో నీ అందం

అదే అదే ఒక వింత పులకింత


2.గులాబీల సుకుమారమె నీ  ఒళ్ళంతా

కలువల నయగారమే  నీ రెండు కళ్ళంతా

పికగాత్ర మాధుర్యమే నీ మార్ధవ గళమంతా

నమ్మవే నా చెలీ సృష్టిలో నీ అందం

అదే అదే ఒక వింత పులకింత

Saturday, August 7, 2021

OK



నవ్వుతాయి నీ కన్నులు  

పలుకుతాయి నీ చూపులు 

పెదవులు చదువుతాయి మైత్రీవేదాలు

గొంతులొ ఒలుకుతాయి మంజులనాదాలు


1.కళలు చెలఁగుతుంటాయి తనువులోన

కలలు మెలుగుతుంటాయి మనసులోన

తేజస్సే ప్రజ్వలించు నీ మేధలో

విజయాలే ప్రస్ఫుటించు నీ గాధలో


2.నిజ మహీజవే ఈ మహిలో నిప్పువై

ఎలా ముడిచినా అందగించు కొప్పుపై

ఆరని పోరాటపు బాటలో

తీరని ఆరాటపు వేటలో



https://youtu.be/erysnsPhO7A

అల్లనేరేడు పళ్ళు నీకళ్ళు

కాజూకత్లీలు  చెవి తమ్మెలు

పొంగిన పూరీలు నీ బుగ్గలు

అల్లన పనసతొనలు పెదవులు

నోరూరిపోతోంది నినుగని నెచ్చెలి

నకనకలాడుతోంది వగల సెగల ఆకలి


1.కొరుకుమనే భక్ష్యాలు నమలమనే భోజ్యాలు

నీ దేహపులిహోరలే తమకాగ్నికి ఆజ్యాలు

మెడవంపున లేహ్యాలు చుబుకాన చోష్యాలు

తనువిందు భోజనానికే సరిక్రొత్త భాష్యాలు

నోరూరిపోతోంది నిను గని నెచ్చెలి

నకనకలాడుతోంది వగల సెగల ఆకలి


2.మధురం మాటలో క్షారం చూపులో

కారం వయారంలో పులుపు వలపులో

వగరు నీ వయసులో చేదు నీ చీదఱ లో

రుచులారు  మక్కువే మనసుకు సరసములో

నోరూరిపోతోంది నినుగని నెచ్చెలి

నకనకలాడుతోంది వగల సెగల ఆకలి


OK

https://youtu.be/RB0PxXc844Q


వేంకటేశ వేంకటేశ వేంకటేశ పాహిమాం

శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస పాలయమాం

తిరుమలగిరిరాయ ఈప్సిత ఫలప్రద

భావయామి తం సతతం గోవిందం నమామ్యహం

దర్శయామి భవరూపం హృదయాంతరమహరహం


1.ఇంద్రాది దేవ సంపూజితం-ఇందిర మందిర మానసం

కలియుగ వరదం గోవిందం దీనావన బిరుదాంకితం

భావయామి తం సతతం గోవిందం నమామ్యహం

దర్శయామి భవరూపం హృదయాంతరమహరహం


2.సప్తగిరివాసినం నిరంజనం  సప్త ఋషి సేవితం 

సకలలోక వందితం భవభంజనం జనార్దనం

భావయామి తం సతతం గోవిందం నమామ్యహం

దర్శయామి భవరూపం హృదయాంతరమహరహం

Friday, August 6, 2021

https://youtu.be/cdeB40KIQQ0?si=Gox9XgDN_I9yBZhS

నీ యాదిల నే బతుకుతున్న నా బంగరు బావా

మనాది పెట్టబోకురా మేనత్తకొడుకా శివా శివశివా

ఏటేటా ఊరొస్తనంటివి నన్నుజూడ మరిచావా

ఎదిరిసూసి ఏష్టకొచ్చెరా రోజూ నాకిదే చావా


1.కొలువు కుదిరికుదురంగనె తోల్కపోతనంటివి

గాలిమోటరెక్కంగనె గట్లటెట్ల నువు మారిపోతివి

అమాసలెన్నొవాయే పున్నాలు వచ్చిపాయే

జాతర్లెన్నొ జరిగిపాయే పండుగులింక పండిపాయే

నీ జాడపత్తలేదాయే మాటా మంచి కరువాయే

ఫోనుగన్కలేకపాయే నీ పానమెట్లుందొ ఎర్గనాయే


2.పట్టుచీరనైతె పట్టుబట్టి పంపుతానంటివే

పట్టగొల్సులింక పడిపడి చేయిస్తనంటివే

మనువాడి   మస్కటింక చూపిస్తనంటివే

గుండెల్లొ వెట్టుకొని చూసుకొంట నంటివే

అవ్వేవి నాకొద్దు నువ్వైతే జల్దిరా పడిగాపులు పడ్తిరా

బతుకింక నీకే ముడుపు కడ్తిరా వలపు దాచిపెడ్తిరా


OK

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


స్పందించని ప్రతి గుండె పాషాణం

పులకించని దేహం ఎముకల భోషాణం

మనసంటూ ఉండాలి నవనీతమైతేనే

మనిషంటూ మనగలిగితే మదిలోనూ మాటలోనూ తేనే


1.చిగురాకు పరవశించదా చిరుగాలి స్పర్శకు

చినుకు పలకరించదా నేలతల్లి ఎదురుచూపుకు

మునగదీసుకోవాలా పట్టువిడుపులే లేక

మూతిముడుచుకోవాలా చిరునవ్వైన రువ్వక


2. కడలి నదిని కౌగిలించదా అలల చేతులు సాచి

వేకువ వెలుతురుకూతమీయదా రవిని రమ్మని పిలిచి

ప్రేమగా మీటలేరా ఎదుటివారి హృదయవీణను

ఒడుపుగా నాటలేరా కరడు ఎదలలొ కాస్త కరుణను


నిదుర పారిపోయింది-నిన్నుచూసాక

గుండె జారిపోయింది-నువుకన్ను వేసాక

ఎలా గడపనే నా చెలీ ఈ రాతిరి

ఎలా ఓపనే నెచ్చలి తనువు తిమ్మిరి


1.ప్రేమ ఒకవైపు తడుతూ-దోమలొకవైపు కుడుతూ

రెప్పవేయలేకున్నా  తిప్పలెన్నొ పడుతున్నా

వయసు గిల్లుడే పడతూ-నల్లులకు నెత్తురు నిస్తూ

కనుకు తీయలేకున్నా -తపన మోయలేకున్నా


2.హంసతూలికా తల్పం- సుతిమెత్తని నీ అంకం

స్వర్గసౌఖ్యమే అల్పం- అనంగరంగం నీ అంగాంగం

ఊహల్లొ విహరిస్తూ ఉద్విగ్నతనాపుకొస్తున్నా

మన కలయిక తలపోస్తూ మరులు నెమరువేస్తున్నా

Thursday, August 5, 2021

OK


నీకేమో నవ్వులాట నా కేమో ప్రేమపాట

రైలుపట్టాలయ్యేనా మన బాట

కలవడం సాధ్యమా ఏదో ఒకచోట

ఎపుడో ఒకపూట

ఎన్నాళ్ళిలా మూగవేదన-నరకయాతన


1.మనసులో అనురాగంగా బయటేమో బింకంగా

నీలోనీకే తెలియని వింత మథనంగా

మనలేవు మౌనంగా తెలుపలేవు ఎద భావంగా

పట్టలేని విడువలేని సందిగ్ధంగా

ఎన్నాళ్ళిలా మూగవేదన-నరకయాతన


2.ముట్టబోతే అత్తిపత్తివి-తలచకుంటే అగరుబత్తివి

ఎలా వేగనేనీతో నాచెలీ ఎలనాగ

నిశ్చయంగా నీది ప్రేమే నీ గుండె మండే కొలిమే

మదిముళ్ళు విప్పక  మునిగేది మనమే

ఎన్నాళ్ళిలా మూగవేదన-నరకయాతన

Wednesday, August 4, 2021

https://youtu.be/Lw1ZPdZtFLo?si=Qv43UYeqFNabi0Et

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నమ్మేకద రాసాను సాయి నీపై వందల పాటలు
మమ్మేలెడి వాడవనే బాబా చేసాము నీకు పూజలు
వమ్ముచేయగా నీ మహిమలాయె ఒట్టి గాలి మాటలు
సొమ్మసిల్లెగా నా మది నీ బోధలవగ నీటిమూటలు
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

1.సాయిరాం అంటూ సదా నీ నామమె పలుకుదునే
ఆర్తితో దీనంగా నిను చిత్రపటములందు కాంచెదనే
వెతికి వెతికిమరీ నీవున్న మందిరముకు చనుదునే
గురువారము ఉపవసించి నీ ధ్యానమె చేయుదునే
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

2.మామూలు నరుడవో సద్గురుడవో అది మాకేల
మాయల మరాఠీవొ గారడి వాడివో చూపునీ లీల
ఆశలెన్నొ ఉన్నవి నీఎడ అవి  అడియాసలు కావాలా?
నెరవేరక మా కోర్కెలు కడదాకా నేనిలాగే చావాలా
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం



నీ సిగలో నను మందారమవనీ

నీ నుదుట సిందూరమై మనని 

నీ పాదాల పాంజేబునై పరవశించనీ

నీ ఎదపై తాళినై ఎపుడూ నివసించనీ

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా


1.నీ పెదవుల ఎల్లపుడు అల్లలాడె పేరు నాదిగా

నీ తలపుల  అల్లరిగా కదలాడుతు నే మనాదిగా

నీ బడలిక పోకార్చే నినుసేదదీర్చే అమృత ఔషదిగా

నిను లాలించి పాలించి మురిపించగ నే అమ్మ ఒడిగా

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా


2.అడగకనే వసతుల నమరించే నీ వరునిగా

పరకాంతల కలనైనా కాంచబోని ప్రవరునిగా

పడకటింట పరిమళాలు ప్రసరించే మరునిగా

నా తనువున నువు సగమను అపర శంకరునిగా

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా

https://youtu.be/mPxyCoC9hAs?si=1kM1f7qbK9nzJtb5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


నల్లంచు తెల్లచీర నవమోహిని

కురులలో నెలకొంది కృష్ణయామిని

పలుక పరవశింపజేయు రసరాగిణి

గాలం వేసావు నా గుండెకు భామామణి


1.క్రీగంటి చూపులో ఊరించే కొంటెదనం

మందార పెదాలలో ఉడికించే జాణతనం

చెప్పకనే చెబుతోంది ప్రేమకు సుస్వాగతం

తెలుపుతోంది ప్రణయానికి ప్రియమారగ ఆహ్వానం


2.మత్తెక్కి పోతోంది మల్లెమాలతో సాంతం

కైపు నింక పెంచుతోంది బిగుతైన అంగాంగం

ఊహలు తూనీగలై సెగలు రేపు సంగమం

కౌగిలిలో కడతేరగ స్వర్గమే పాదాక్రాంతం



మది మెచ్చింది నీ పెదవిమీది పుట్టుమచ్చ

ఎద వేగం హెచ్చింది ఎలా ఎరుకపరుచను నా ఇచ్ఛ

అందానికి విలాసం నీవే నీవేనని మనసిచ్చా

కనికరించగా ప్రేయసీ నా మీద నీకెందుకంతటి కచ్చ


1.కన్నులతో చేసావు నను కట్టడి కనికట్టుగా

పెదవులలో దాచావు పుట్టతేనె పట్టు గుట్టుగా

నవ్వుల్లో కురిసావు ఆణిముత్యాలనే గుట్టగా

నడుమొంపులొ దించావు హరివిల్లును బెట్టుగా


2.జాబిలి జాలిగొంది చంద్రిక నీవుగా విరియగా

మల్లిక తల్లడిల్లె  నెత్తావి తననువీడి నిన్ను చేరగా

గులాబీ గునిసింది సుకుమారం నీ మేనిగ మారగా

సెలయేరు తడబడె నీ నడకలు అనుసరించగా

Tuesday, August 3, 2021

https://youtu.be/x7dkyBBzNZ8?si=KIl82xwOUhRdGC3o

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

పుట్టినరోజంటే అందరికీ సంబరమే
ఎదలోని ఉద్వేగం తాకుతుంది అంబరమే
దీవెనలీయమని ప్రతివారికి విన్నపాలు
ఆనందం పంచుకోగ ఎల్లరకు వేడుకోలు
అందుకోండి మీకివే  జన్మదిన శుభాకాంక్షలు
చిన్నవారు మీరైతే నా శుభాశీస్సులు
హాప్పీ బర్త్ డే టూయూ,విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

1.తలస్నానం చేసి కొత్తదుస్తులే వేసి
దైవదర్శనం చేసి అమ్మచేత హారతి గైకొని
 పెద్దలందరికీ పాదాభివందనం చేసి
పేదసాదలెందరికో తోచిన సాయం చేసి
జన్మదినం జరుపుకునే ఉదాత్తులెందరో
అందుకోండి మీకివే  జన్మదిన శుభాకాంక్షలు
చిన్నవారు మీరైతే నా శుభాశీస్సులు
హాప్పీ బర్త్ డే టూయూ,విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

2.షవర్ బాత్ చేసేసి ఫాషన్ డ్రెస్ వేసి
కొవ్వత్తులార్పేసి, కేక్ నే కోసాక
మొకాలకే పూసేసి గందరగోళంచేసి
బర్త్ డే పర్సన్ కి చుక్కలు చూపించే
ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొనే వారెందరో
అందుకోండి మీకివే  జన్మదిన శుభాకాంక్షలు
చిన్నవారు మీరైతే నా శుభాశీస్సులు
హాప్పీ బర్త్ డే టూయూ,విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ



అరువు తెచ్చుకున్న ప్రతి అందం

ఔతుందా ఎపుడైనా నీ సొంతం

సొంతమొహం చూపలేని వింత తత్వం

జలతారు ముసుగేసి చూపే యత్నం

నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం

లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం


1.దొరికినదల్లా నీదికాదన్నదే పరమార్థం

తేరగ ప్రాప్తించినదైనా మనదేయను స్వార్థం

ఉచితంగా పొందినా పరులకు పంచలేని నైజం

అయాచితంగ వచ్చినా హక్కుగ ఎంచడమే చిత్రం

నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం

లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం


2.నీకున్నవన్నీ పునీతమౌ శృంగార భావనలు

ఎదుటి వారివేమో మదమెక్కిన రసికతలు

మహిళవై రతికేళి ప్రస్తావన నీదైతే సాహసం

పురుష కవుల సౌందర్య ఉపాసనేమొ పరిహాసం

నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం

లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం



Monday, August 2, 2021


చూడాలని ఉన్నా చూడలేకపోతున్నా

పాడాలని ఉన్నా పాడలేకపోతున్నా

ఒకేవైపు ప్రేమతో తన్లాడుతున్నా

నీ హృదయసీమలోకి చేరలేకపోతున్నా


1.పిలవనైన పిలవవన్నది నా అభియోగం

తలవనైన తలవవన్నది నా అభిప్రాయం

కలవనైన కలవవన్నది నాకున్న ఆరాటం

తెలుపనైన తెలుపవేలనో నీ మనోభీష్టం


2.గుదిబండనైనానేమోనని నా అనుమానం

ఇబ్బందిపెడుతున్నానేమోనని నా భావనం

తప్పొప్పులేమోగాని తప్పనిసరి నాకనురాగం

నీ మదిలొ చోటీయడమే నా జీవన ఘనయోగం


ఎక్కడ ఆపాలో చూపులు

ఎంతగ గ్రోలాలో వంపులు

కళ్ళతోనే ముగ్గులు వేస్తా ఒళ్ళంతా

తలపుల్లో వలపులు పూస్తా నీ చెంత

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని


1.ముని మారిపోడా కామునిగా నినుగని

ముదుసలి సైతం సైగచేయడా నిన్ను రమ్మని

అస్ఖలిత బ్రహ్మచారీ గుటకలు మ్రింగడా నీ సోకుకి

విస్మయ నీ విలాసమే మహాహాని మా నిగ్రహానికి

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని


2.దోబూచులాడెనే దోర సవురు దాచవైతివే

దొంగాటలాడెనే అంగపు హొరంగు అడచవైతివే

ఊరించి ముంచేవు ఉత్తినే ఉడికించి చంపేవు

ఉక్కిరిబిక్కిరి చేసి ఉల్లమునంతా డొల్లగమార్చేవు

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని

https://youtu.be/BqIbCKUmIJg

శివుడంటే మంగళకరుడు

హరుడంటే మనోహరుడు

అనాథనాథుడే విశ్వనాథుడు

అఖిలాండేశ్వరుడు భోళాశంకరుడు

ప్రణామాలు ప్రణామాలు ప్రణవస్వరూపునికి

సాష్టాంగ వందనాలు సదానంద రూపునికి


1.ఆది మధ్యాంత రహితుడు వేదవేద్యుడు

 దక్షిణామూర్తిగా భవుడు  పరమ పూజ్యుడు

అనాలంబి ఢమరుక వాద్య సంగీత లోలుడు

కుముదము పూరించే ఖట్వాంగధరుడు శర్వుడు

ప్రణామాలు ప్రణామాలు ప్రణవస్వరూపునికి

సాష్టాంగ వందనాలు సదానంద రూపునికి


2.సతికోసం హతాశుడైన అర్ధనారీశ్వరుడు

దక్షాధ్వరధ్వంసి  ఉగ్రాక్షుడు రౌద్రవీరభద్రుడు

మదనారి జటధారి నిటలాక్షుడు నీలకంఠుడు

ఋతంబరుడు వృషపర్వుడు రామలింగేశ్వరుడు

ప్రణామాలు ప్రణామాలు ప్రణవస్వరూపునికి

సాష్టాంగ వందనాలు సదానంద రూపునికి

https://youtu.be/0uJr7H6oK_s

మా తల్లీ ముత్యాలమ్మా-మమ్మేలగ రావమ్మా

మా కుస్తాపూరు భక్తులకెల్లా-ఖుషీలనే ఈయవమ్మా

మమ్ములనే చల్లగ చూడ-మా ఊళ్ళో వెలిసావమ్మా

వరాలనే కురిపించుటకై-గుళ్ళోనువు నిలిచావమ్మా


1.గంగనీటి తానాలు-సంబరంగ చేయిస్తాము

తీరొక్కపూవులు తెచ్చి-నిన్ను తీర్చిదిద్దుతాము

పట్టూబట్టలనే కట్టి నీ సుందర రూపం చూస్తాం

పంచభక్ష్యాలను పెట్టి నీకు మేము  నివేదిస్తాం


2.ఆషాఢ మాసంలో-బోనాల నర్పిస్తాం

ఆదివారాలలో సైతం-నిన్ను మేము అర్చిస్తాం

జగాలకే తల్లివి నీవు-ఆరోగ్యాలనీయవే

పరమేశ్వరి నీవేనమ్మా-పాడిపంటలీయవే

శబరిలాగ నేను రేగుపళ్ళ నీయనా

సుధామనై అటుకుల ముళ్ళెనీయనా

హనుమలాగ నీకు సేవచేయనా

కుబ్జలాగ నీకై దారి కాయనా

ఎలా మెప్పించను నిన్ను నల్లనయ్యా

మనసారా నిన్నే నిన్నే నమ్మితినయ్యా


1.పుండరీకునిలా కొలువనా తల్లిదండ్రుల

శ్రవణకుమారునిలా తలదాల్చనా జననీజనకుల

విభీషణుడిలా శరణాగతి పొందనా నీ పదముల

విబుధ విదురునిలా అర్చించనా పలువిధముల

ఎలా మెప్పించను నిన్ను నల్లనయ్యా

మనసారా నిన్నే నిన్నే నమ్మితినయ్యా


2.రాధలాగ నేను విరహబాధ నొందనా

మీరాలాగ కీర్తించి తన్మయమొందనా

తులసీదాసును నేనై నిన్నే స్మరించనా

సూరదాసు ధ్యాసనై జగతి విస్మరించనా

ఎలా మెప్పించను నిన్ను నల్లనయ్యా

మనసారా నిన్నే నిన్నే నమ్మితినయ్యా


ఎక్కడ ఆపాలో చూపులు

ఎంతగ గ్రోలాలో వంపులు

కళ్ళతోనే ముగ్గులు వేస్తా ఒళ్ళంతా

తలపుల్లో వలపులు పూస్తా నీ చెంత

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని


1.ముని మారిపోడా కామునిగా నినుగని

ముదుసలి సైతం సైగచేయడా నిన్ను రమ్మని

అస్ఖలిత బ్రహ్మచారీ గుటకలు మ్రింగడా నీ సోకుకి

విస్మయ నీ విలాసమే మహాహాని మా నిగ్రహానికి

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని


2.దోబూచులాడెనే దోర సవురు దాచవైతివే

దొంగాటలాడెనే అంగపు హొరంగు అడచవైతివే

ఊరించి ముంచేవు ఉత్తినే ఉడికించి చంపేవు

ఉక్కిరిబిక్కిరి చేసి ఉల్లమునంతా డొల్లగమార్చేవు

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని

Sunday, August 1, 2021

 ఎన్ని నేర్చుకున్నానో జీవితాన పాఠాలు

కాలమెన్ని నేర్పిందో అనుభవ గుణపాఠాలు

ప్రేక్షకునిలా చూడడమే ఏ ప్రమేయమూలేక

నదివాలుకు సాగడమే ఎప్పుడూ  ఎదురీదక


1.ఆశించిన ప్రతిసారి ఆడియాసగ మారడమే

ఊహించిన దేదైనా నెరవేరకపోవడమే

జీవితమంటేనే ఇలాగే ఉంటుందని ఎంచడమే

పొందినదల్లా ఆనందంగా అంగీకరించడమే


2.మిన్నుసైతం విగిరి పడింది నా వెన్నుమీద

కనీవినీ ఎరుగునట్టి విధి వైపరీత్యం కదా

అన్నమైనా మన్నుగ మారింది నోరుచేరులోగా

దొరికిందే వరమనుకొనుడే నగ్నసత్యంగా


మరచిపోయిన మధువనాన

మరల ఎందుకు మరులవాన

చితికి పోయిన నా జీవనాన

చిగురులెందుకీ  మోడున


1.నిను కొసరెడి కోరిక కొఱవే,

నెరవేరక నా కన్నుల చెఱువే

తపనల తమకాన నిద్ర కరువే

ఫలించని ప్రతి కల ఇక బరువే 


2.ఏకాంతమే నాది ఏకాకిగా ఉన్నా 

ఒంటరినే కాను ఏ కాంత లేకున్నా

గతం విస్మరించి నాతోనే రమిస్తున్నా

నీవేలేని లోకంనుండి విరమిస్తున్నా

OK


అరెరే ఎంతటి వైచిత్రి మన మైత్రి

ఎంతగానొ పావనము మన స్నేహము

చినుకులా కురిసింది కడలిగా మారింది

ఆది అంతమే తెలియకుంది వింతగా

నీవు నేను  వేరంటేనే అది ఒక చింతగా


1. కాంతినిచ్చు దీపమైనా ఆరిపోతుంది

తావినొసగు ఏ పూవైనా వాడిపోతుంది

అందం తరుగుతుంది గంధం ఇగురుతుంది

చెక్కుచెదరదేనాటికి మన చెలిమి

ఖర్చెంతచేసినా ఒడవనిదీ ఈ కలిమి


2.దోస్తంటే నినదించే హృదయము

నేస్తం  పరాయికాదు మన సమస్తము

అనురాగ ప్రతాపము త్యాగపు నిజరూపము 

కలహించదు కుదురుకున్న మన చిక్కని సోపతి

కలనైనా విరహించదు మన అపూర్వ సంసక్తి

Friday, July 30, 2021


https://youtu.be/0PhNAzoNh5U


మెత్త'గా తాకావు నా హృదయాన్ని…

కొత్తగా పూచావు మధురమైన భావాన్ని…

మనసంతా నిండిపోయేలా

కలలన్నీ పండిపోయేలా


1.బదిలీ చెయ్యి నీ కోప తాపాలు

 రుద్దెయ్యి  నా మీద నీ అసహనాలు

అలకలు కినుకలు నా ఎడల ప్రయోగించు

భావోద్వేగాలన్నీ  కేవలం నాకే పంచు

నరికినా నవ్వుతాను తరువులాగా

తప్పులు సరిదిద్దుతాను గురువులాగా


2.అందగజేస్తాను నీకు ఆనందాలన్నీ

ఊరేగిస్తాను నిన్ను అందలమెక్కించీ

ఆసరాగ నేనుంటా  జీవితమంతా

ఆలంబన నేనౌతా ఒడిదుడుకుల చెంత

నిన్ను నీకు చూపుతాను  అద్దంగా

అహర్నిశలు నీసేవకె నే సంసిద్ధంగా


తాయిలాల జాతర-ప్రగతికి పాతర

ఉచితాల పంచన- మానవీయ వంచన

కులం పేర మతం పేర కించపరచగా

ముసలితనం మిషగనో వైకల్యపు జాలిగనో

విధివక్రించిన సంగతికది హేళనగానో

రాజకీయ లబ్దికై- ఎన్నికలలొ సిద్ధికై


1.సోమరులను చేసే హీన సమాజమై

నిర్వీర్యులుగా మార్చేసే పచ్చి నిజమై

ఎవరో పడవేసే ఎంగిలిమెతుకులకై ఆశగా

ఎవరి దయాభిక్షకో పడిగాపుల దెసగా

ఓటును బేరం పెట్టే కట్టుబానిసలుగా చేస్తూ

ఆత్మను తాకట్టుపెట్టే దాసులుగా మార్చేస్తూ


2.పరాన్నజీవులుగా తయారుచేస్తూ

ఉత్పత్తికి పరోక్షంగ తిలోదకాలిస్తూ

కొందరి కష్టార్జితాన్ని పన్నులుగా లాగేస్తూ

తమ తాతసొమ్ముగా తేరగా పంచేస్తూ

బిచ్చమెత్తడాన్నే సమూలంగ రూపుమాపలేక

బిచ్చగాళ్ళుగా ఖాతాల్లోకె నేరుగా బిచ్చంవేస్తూ



ఎన్నాళ్ళని నాకింకా వేంకటేశ్వరా

యాంత్రికమైన ఈ భవబంధనాలు

ఎప్పటికని కడతేరు తిరుమలేశ్వరా

సంసార సంద్రాన రోజూ తలమునకలు

నిశ్చల భక్తి నాకు ప్రసాదించరా

నిర్మల అనురక్తి నీ ఎడ కలిగించరా

నమోనమో వేంకటేశ్వరా నమోనమో తిరుమలేశ్వరా


1.ఉత్తమమైనది ఈ మానుష జన్మం

జన్మజన్మాలుగా చేసిన పుణ్యాల ఫలం

నీ పదసన్నిధి అది ఎంతటి భాగ్యం

విమలమైన మానసం ప్రశాంత జీవనం

నిశ్చల భక్తి నాకు ప్రసాదించరా

నిర్మల అనురక్తి నీ ఎడ కలిగించరా

నమోనమో వేంకటేశ్వరా నమోనమో తిరుమలేశ్వరా


2.నిరంతరం నను నీ చింతనలో మననీ

చరాచరజగత్తులో నిను దర్శించనీ

నే చేసేడి ప్రతికర్మ నీకే అంకితమవనీ

నా ఎదలయ నీ నామమే సదా స్మరించనీ

నిశ్చల భక్తి నాకు ప్రసాదించరా

నిర్మల అనురక్తి నీ ఎడ కలిగించరా

నమోనమో వేంకటేశ్వరా నమోనమో తిరుమలేశ్వరా

Thursday, July 29, 2021


కారిపోకు కన్నులనుండి కన్నీరుగా

జారుకోకు హృదయం నుండి మోసకారిగా

వరముగా మారవే ఈ పిపాసికే గోదారిగా

దారెరుగని బాటసారికి నీవే పూదారిగా


1.అశలెందుకు రేపేవే బాసలెందుకు చేసేవే

ప్రేమనెందుకు తెలిపావే ఎందుకు వంచించావే

ఆటలాడుకోనేలా తోలుబొమ్మగా ఎంచి

ఆజ్ఞాపించనేలా కీలుబొమ్మగా మార్చి


2.మురిపాలు చూపుతూనే గుండె ముక్కలు చేసావు

నవ్వులను ఒలికిస్తూనే నటనలతో ముంచేసావు

అవసరమా నీకు ఇంతటి నాటకీయత

మించిపోలేదింకా నాఎద కోరె నీ జత


అందచందాల మాట సరేసరి

నీ మేధచూసి ఆగింది నా ఊపిరి

అంచనాలకు మించినావే సుందరి

నీకు ఫిదానైపోయానే మరిమరి


1.కళ్ళతో చేసేస్తావు కథాకళి నృత్యం

నవ్వులలో చూపిస్తావు భరతనాట్యం

హావ భావాలలో నర్తించేవు మణిపురి

నడయాడే నీ ప్రతిభంగిమ నాట్యమయూరి


2.భాషాభినివేశంలో భారతీ దేవివి

శాస్త్రసాంకేతికతలో శారదా దేవివి

వైజ్ఞానిక ప్రతిభలో అపర వాగ్దేవివి

బహుముఖీయ ప్రజ్ఞతో భాసిల్లితివి

Wednesday, July 28, 2021


చెప్పలేను నీ ఎదుట

మనసు విప్పలేను ఏపూట

ఆరాధిస్తాను  నిన్ను మౌనంగా

ఆలపిస్తానిలా హృదయ గానంగా


1.అందరానంతగా దూరమైనావు

కలిసేంత అందుబాటులోనే ఉన్నా

అందచందాలతో కలచివేస్తావు

కలలోను సైతం నాచిత్తమంతా

నిస్సహాయంగా నీవైనం

నిండామునకలేస్తూ నా ప్రాణం


2.కాసింతలోనే కుదరకుండె జాతకం

ఇరువురం ఎంతగా ఇష్టపడినా

కనికరించక కట్టడిచేసే సమాజం

భవితను బలిచేస్తూ ఎంతవేడినా

బ్రతికినంతకాలం వెతలువీడవు

మరుజన్మకైనా నా మరులు వాడవు

Tuesday, July 27, 2021


నా గుండె తూనికరాయి-నీపై ప్రేమకొలవడానికి

నా మనసు కలికితురాయి-నీ పాపిట నిలవడానికి

తెలపడానికి సరిపోదు-నాకున్న భాషాజ్ఞానం

దేవి ఎడల భక్తునికుండే-భవ్యమౌ  ఆరాధనభావం

హృదయగతమైనది మన బంధం

కేవలం మనచిత్తానికె అనుభవైకవేద్యం


1.లాలనకు అమ్మగా-ఆలనకు నాన్నగా

పాలనకు ప్రియసఖిగా-ఆత్మీయ బంధువుగా

సృష్టిలో ఏబంధం పోల్చనట్టుగా

ఇలలోన బంధాలన్నీ సరిపోనట్టుగా

ఎదలోన ఎదగా ఒదిగినట్లుగా

మదిలోన తలపే మొలిచినట్టుగా

హృదయగతమైనది మన బంధం

కేవలం మనచిత్తానికె అనుభవైకవేద్యం


2.కెరటానికి మేఘానికి ఉన్న సంబంధం

స్రవంతికి సాగరానికి మధ్య అనుబంధం

దిగదుడుపే లోకంలో ఏ రక్తసంబంధం

తీసికట్టే గణుతిస్తే ప్రతీ అనురాగ బంధం

నీలోకి నీవే తొంగిచూడు ఒకసారి

అవగతమౌతాను నేనే నీవుగా మారి

హృదయగతమైనది మన బంధం

కేవలం మనచిత్తానికె అనుభవైకవేద్యం


కష్టమనుకొనుడెందుకు-ఇష్డపడి పనిచేద్దాం

స్పష్టతను వ్యక్తపరచి-బెస్టునే అందజేద్దాం

సవాళ్ళనే ఛేదించడం-హాబీగా స్వీకరిద్దాం

వహ్వా వహ్వా అనుప్రశంసలే-మనసొంతం చేసుకుందాం


1.యజమానులం మనమే-సంస్థమనది ఎప్పటికీ

ఒకరు మనకు నేర్పాలా- మన డ్యూటీ ఏమిటని

ప్రణాళికలు వేసుకుంటూ- పద్ధతిగా సాగాలి

నిర్దేశిత గమ్యాలన్ని- అలవోకగ సాధించాలి


2.చమటోడ్చి చేసే పని-ఔట్ డేటెడని ఎరగాలి

సూక్ష్మంలో మోక్షాన్ని- స్మార్ట్ గా చూపాలి

వ్యూహాలు రచియిస్తూ- టీమ్ వర్క్ చేయాలి

జీతంలో ప్రతిరూపాయికి-ప్రతిఫలాన్ని తిరిగివ్వాలి

Monday, July 26, 2021


https://youtu.be/RIGym56NQ4s?si=47h_4PSi55W8c7Eo

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మాయింటి వాకిటిలో తులసిమొక్క నీవు

మా కంటికి వెలుగునిచ్చు కాంతిలెక్క నీవు

సంసార సంద్రాన దారిచూపు వేగుచుక్కవు

నిత్యం దాంపత్యం పండించే ఆకువక్కవు

నాకోసమే దిగివచ్చిన నాపాలిటి దేవత

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో నా జీవన గీత


1.శిశిరానికి తావే లేదు వసంతమై నీవుండగా

దవనానిది తావే కాదు నీవే మల్లెపూదండగా

నీ నవ్వుల హాయిముందు వెన్నెలైనా దండగే

సందడిగా నువు తిరుగాడ ప్రతిరోజు పండగే

నాకోసమే దిగివచ్చిన నాపాలిటి దేవత

నీపుట్టినరోజున  శుభాకాంక్షలివిగో నా జీవన గీత


2.అసూయనే అవనికి నీవంటే నీకెంతటి ఓపిక

అరుంధతికి అబ్బురమేనంట  నీకంతటి ఒద్దిక

సావిత్రికి సైతం  సంబరమే  నీ తెగువ చూసాక

శ్రీ  లక్ష్మి స్థిరపడిందింట  నువుకాలుమోపాక

నాకోసమే దిగివచ్చిన నాపాలిటి దేవత

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో నా జీవన గీత


చంద్రకాంతి అందం చకోరిలా గ్రోలనా

మేఘమాల సౌందర్యం చిరుగాలినై స్పృశించనా

ఇంద్ర ధనుసు సొగసు గని కేరింతలేయనా

జలపాత  సోయగాన్ని చకితుడనై తిలకించనా

ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు

పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు


1.తరువుకున్న త్యాగగుణం ప్రశంసార్హమే

నదికి కలిగిన దాతృత్వం  అభినందనీయమే

పొడిచే తొలిపొద్దు అరుణిమ అభినుతించదగినదే

మలిసంజె వెలుగుల రంగులుపొంగే నింగిఎంచదగ్గదే

ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు

పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు


2.శిఖరాలు లోయలు పచ్చని పచ్చికబయళ్ళు

హిమానీనదాలు నురగలెత్తు సాగర కెరటాలు

మారే ఋతువుల విరిసే పలువన్నెల సుమశోభలు

రోదసిలో అబ్బురపరచే అనంత కోటి తారకలు

ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు

పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు

Sunday, July 25, 2021


కరోనా కాలంలో దీనంగా మౌనంగా కళాకారులు

పస్తులలో అనునిత్యం బ్రతుకులు బేజారులు

వైభవంగా వెలిగినవారు అందలంలొ తిరిగేవారు

ఆదరణకు నోచక అతలాకుతలం ఔతున్నారు


1.సినిమాలే లేక థియేటర్లూ లేక ప్రేక్షకుల ఆచూకే కనక

విడుదలకు నోచుకోక  ఓటిటీకి ఏదోరేటుకి పెట్టుబడేరాక

కుదేలైపోయింది చతికిలబడిపోయింది సినీ పరిశ్రమ

వేలాది కార్మికులంతా వీథులపాలైనారు దిక్కుతోచక


2.తమస్థాయిని పక్కనబెట్టి ఈగోలన్ని దూరంనెట్టి

ఎలాగోలా బ్రతుకుబండిని నెట్టుకొచ్చేలా ప్రతితలుపు తట్టి

వచ్చిన అవకాశం ఏమాత్రం వదులుకోక ఇచ్చిందేదొ పుచ్చుకొని

కన్నీటిపర్యంతమై కడగండ్లు ఆసాంతమై అభిమానం తాకట్టు పెట్టి


3.వేడుకలే లేక వినోదాల మాటలేక వివాహాలవేదికలే లేక

పంతుళ్ళు పందిళ్ళు వంటవాళ్ళు పలువిభాగాలు పనిలేక

ప్రైవేటు స్కూళ్ళూలేక జీతభత్యాలులేక పూటగడవక

ఎందరో ఉద్యోగులు ఉపాధ్యాయులు అప్పైనా పుట్టక ఎంత కటకటా

Saturday, July 24, 2021


మొకమే చూపించవు

మనసే ఎరిగించవు

ఐనా చిత్రమే అంతర్జాల స్నేహితము

ఎంతటి గమ్మత్తో మనకున్న బంధము


1.కానుకలడుగుతావు మొదటి పరిచయంలోనే

బహుమతి కోరుతావు తొలి పలకరింపులోనే

కొనిపెట్టమంటావు కంచిపట్టు చీరలనే

తెచ్చిపెట్టమంటావు బంగారు నగలనే

ఏ అధికారముందో నిస్సిగ్గుగ కోరుటకు

ఆత్మగౌరవం లేదో  నోరువిప్పి అడుగుటకు 


2.కాకమ్మ కథలు చెప్పి అనారోగ్యమంటావు

పసివారి పేరు చెప్పి డబ్బులడుగుతుంటావు

అప్పుగానె ఇమ్మని బ్రతిమాలుతుంటావు

బదులుగా దేనికైన తయారౌతుంటావు

బంధుత్వం ఏముందని చనువు చూపుతావు

చుట్టెరికం కలుపుకొని చొరవతీసుకుంటావు


మంజులవే మంజరివే మంజుల మంజరి నీవే

లాలసవే మదాలసవే సదా నా శ్వాసవు ధ్యాసవు నీవే

నాలో సరికొత్తగా మొలకెత్తే  మధుర భావం నీవే

కలలోను తలపులలోను చెలఁగే అపురూప రూపం నీదే


1.పలురకాల విరులే విరిసే ఆమని  నీవే

పలుకు తేనె వానలు కురిసే నందనవనివే

పలువరుసలొ తళుకులు మెరిసే మౌక్తిక హారానివే

పలువురు నీ సౌందర్యానికి పరవశించు అబ్బురానివే


2.హరి మోహినియై అనుకరించే నీ అందచందాల్ని

హరివిల్లే నీమేను వర్ణించలేను నేను నీ సోయగాన్ని

హరి వంటి కటి నీది నా పిడికిటిలో పట్టే పాటిది

హరి హరికి హరిణమవడవే నీ తనువుకు పరిపాటది


https://youtu.be/c7othpA665Y?si=pvTYcrdNPwcBm33S


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం :రేవతి


పరమ శివమ్ నమామి పరమగురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

నమోస్తుతే దత్తత్రేయం సద్గురుమ్

ప్రణతోస్మి మాతఃపితరమ్ పావన జన్మ గురుమ్

గురుపౌర్ణమాస్యాం ప్రణామ్యహం నిజగురుమ్ సకలగురుమ్


1.సముద్ధరించే నా సద్గురుడు ఏచోట  గుప్తమై ఉన్నాడో

భవజలధిని దాటించే భవ్యగురుడు ఎప్పుడు ప్రాప్తుడౌతాడో

భవతారకముపదేశించే ఆత్మగురుడెలా అనుగ్రహించేనో

చేయి పట్టినడిపించే చైతన్య గురుడు నన్నెప్పుడు చేరేనో

ప్రణతోస్మి మాతఃపితరమ్ పావన జన్మ గురుమ్

గురుపౌర్ణమాస్యాం ప్రణామ్యహం నిజగురుమ్ సకలగురుమ్


2.ఏ సేవలు చేసి నా గురుదేవుని మెప్పునిపొందాలో

గురుదక్షిణ ఏదొసగి నా గురునాథుని సత్కరించాలో

తలలోనాలుకలా గురు కనుసన్నలలో నిరంతరం మెలగాలి

ప్రాణాలైదు గురుపరమే చేసి నా అత్మ సమర్పణ చేయాలి

ప్రణతోస్మి మాతఃపితరమ్ పావన జన్మ గురుమ్

గురుపౌర్ణమాస్యాం ప్రణామ్యహం నిజగురుమ్ సకలగురుమ్

Friday, July 23, 2021


https://youtu.be/EoDyM1TCmq8?si=FUtHassidutX1D1V

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :బిలహరి

బాసటగా నేనుంటాను-పూవుకు తీగలా ఇలా
ఆసరాగా నేనౌతాను-తీగకు  పందిరిలా సరా
నీకు తోడు నీడై చేదోడు వాదోడై
నీవెంట సాగుతా బ్రతికినంత కాలం
నిను కాచుకుంటుంటా నే కలకాలం

1.అడగాల్సన పనిలేదు-అవసరాలు తీరుస్తాను
చెప్పాల్సిన పనిలేదు-మనసును చదివేస్తాను
ప్రాణానికి ప్రాణంగా నేను మసలుకొంటాను
స్నేహానికి స్నేహంగా నిన్ను అనుసరిస్తాను

2.మకరందం నీవైతే-నేను సుధా మాధుర్యం
ప్రబంధమే నీవైతే-నేను రసరమ్య కావ్యం
పెనవేసుకుంది అపూర్వ అనుబంధం మనమధ్య 
లోకమన్నది మనకికమీదట అంతా మిథ్య


Thursday, July 22, 2021


పూలలో నీవే…పాలలో నీవే

ఏ వేళలోనైనా నా మదిలొ మెదిలేవే

ఉదయాన నీవే నిశిలోను నీవే

ఎప్పుడూ సడిచేస్తూ నా హృదయమైనావే


1.నీకు నువ్వు మామూలే 

నాకు అద్భుతం నీవేలే

నీకు నేను ఎందరిలానో

ఏకైక సుందరి నాకీవే

పలకరింపుకోసం పడిగాపులు కాచేను

చిన్న నవ్వుకోసం బ్రతుకంతా వేచేను


2.నువ్వు ఎదురయ్యే సందర్భం

నాకది దీపావళి పర్వదినం

నీవద్ద గడిచిన సమయం

అపురూపమానందమయం

మళ్ళీమళ్ళీ నీ సన్నిధినే నే కోరుకుంటాను

ఎన్నిజన్మలెత్తినగాని నీకొరకే పుడుతుంటాను

Wednesday, July 21, 2021


నా కవనం సమాజాన ప్రభంజనం

నా గీతం శతశతఘ్ని సంధానం

గురి తప్పని తుపాకి నా కలం

ఎగజిమ్మిన లావాయే నా గళం


1.నా రచనే ప్రతి మదిలో ఆలోచనా సృజనం

నా పథమే బహుముఖ వికాస ప్రయోజనం

అవినీతి నక్కలకు నా గానమే సింహగర్జనం

దేశద్రోహ ముష్కరులకు నా గేయంతో నిమజ్జనం


2.నా తత్వం సకల జన మనోరంజకత్వం

నా ధ్యేయం తెలుగు భాష విశ్వవిఖ్యాతం

నా హృదయం దేశశ్రేయస్సుకే అంకితం

నా ప్రాణం దేశమాత చరణాల పారిజాతం


కొత్తగా పరిచయం చేయవా జీవితం

చిత్తమే నీవుగా నిండగా ఈ క్షణం

నిరీక్షణకు తెరదించేసి

ఆశలను మొలిపించేసి

చేయవా బ్రతుకునే నందనం

హాయిగా గడపగా జన్మాంతం


1.ఎడారిలో ఒయాసిస్సుగా ఎదురైనావు

తమస్సులో ఉషస్సుగా వెలుగిచ్చావు

బీడునేలలోనా చిలకరించవా చినుకులు

మౌన మందిరానా మ్రోగించవా జేగంటలు


2.కవితలే రాయనా నీ తనువున  పెదాలతో 

ముగ్గులే  వేయనా ఎదపై  నా పల్లవ పదాలతో

పరిష్వంగ పంజరంలో శాశ్వతంగ బంధించు

అధరమధురామృతాన్ని తనివితీర అందించు

Tuesday, July 20, 2021


ఉపాసించనీయవే దేవీ నిను నిత్యం

ఉపవసింపజేయవే సదా నీ సామీప్యం

రసనము నీవల్లనె సల్లాపములాడునే 

ఉల్లము నీవల్లనె ఉల్లాసము నొందునే

మంజుల వీణా గానవినోదినీ వందనం

మంజుల మంజీర స్వన గామినీ అభివందనం


1. చల్లని నీ చూపువల్ల నా కలమే కదనుతొక్కు

  దయగల నీ ఎదవల్లనె చిక్కనైన కవితలొలుకు

చిరునగవుల నీమోముగనగ మదివికసించు

పావనమౌ నీ చేరువ మనశ్శాంతి ప్రసాదించు

మంజుల వీణా గానవినోదినీ వందనం

మంజుల మంజీర స్వన గామినీ అభివందనం


2.అనవరతం నా మేధలొ కొలువుదీరవే

విచక్షణను అహరహం జాగృత పరచవే

సున్నితమౌ భావుకతను స్ఫురింపనీయవే

అక్షరాలు శరములుగా పరిణమింపజేయవే

మంజుల వీణా గానవినోదినీ వందనం

మంజుల మంజీర స్వన గామినీ అభివందనం

Monday, July 19, 2021

https://youtu.be/T223VldcR4Y

ప్రథమ పర్వదినం పరమ పవిత్ర దినం

ఏడాదిలో తొలి ఏకాదశి సుదినం

 ఆషాఢ శుద్ధ ఏకాదశి శుభదినం

హైందవ ధార్మికులకు ఇది విశిష్టదినం

భక్తిముక్తిదాయకం సాయుజ్య సాధకం


1.దక్షిణాయన ఆగమనం ధర పరిభ్రమణ పరిణామం

యోగీశ్వడైన మురారి శ్రీహరి యోగనిద్రారంభం

పద్మ ఏకాదశిగా విశేష నామాంతర సంయుతం

కఠోర ఉపవాస సహిత జన జీవనం నేడు కడు పావనం


2. శయన ఏకాదశి ఆదిగా ఉథ్థాన ఏకాదశి తో అంత్యమై

కొనసాగే చాతుర్మాస్య దీక్షతో ఎల్లరు పునీతులై

ఉత్తమగతులనంద మహితులై జన్మరహితులై 

నిత్య వైకుంఠ ప్రాప్తినందేరు పరమపదమునే పొందేరు


ఏకపక్షమేనేమో నా ప్రేమ

నింగి కెగసే కెరటంలా ఆరాటంలా

నిర్లక్షమేనేమో నేనంటె నీకు ఓ భామ

గాలికి అంటే కంటకంలా సంకటంలా


1.బలవంతపు చర్యగా  బదులు పలకడం

మొక్కుబడిగనే  నువు స్పందించడం

చొరవన్నది  ఏమాత్రం చూపించకుండటం

ఆసక్తిని కాస్తైనా ప్రకటించక పోవడం

ఎదుర్కొనే ఎదుటివారికెంతటి దుర్భరం

ప్రేమరాహిత్యమే ఇలలో రౌరవ నరకం


2.మెడకు పడ్డ పామల్లే ఏల భావించడం

పాదం పట్టు జలగలాగనా పరిగణించడం

దృక్పథమే సరికాదేమో ఈ వ్యతిరేక యోచనం

అంతర్మథనమే జరిగేనో నీలోన అనుక్షణం

త్రికరణశుద్ధిగా సాధ్యమే మనం స్నేహించడం

దోషమా నిజాయితీ బంధం నీతో  ఆశించడం

https://youtu.be/NeEw5DCn0zk?si=Jen9kJ31lBERRDs-

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: పహాడి

చూడాలని ఉంది నిన్నే తేరిపార
వేడాలని ఉంది దేవతవని మనసారా
దర్శనమీయవే నా ప్రణయదేవేరి
నిరంతరం తపించితి నిన్నే కోరికోరి

1.చూపులతో నే చేస్తా పుష్పాభిషేకం
మాటలతో చేసేస్తా మంత్రాభిషేకం
అలంకరిస్తానే అక్షర నక్షత్ర హారం
ఆలపిస్తా నీ దివ్య గీత నీరాజనం

2.అహరహం స్మరిస్తా నీ మంజులనామం
బ్రతుకంతా తరించగా చేస్తా నీ అర్చనం
నాకు నీ ప్రసాదమే సౌందర్యోపాసనం
నీ వొసగెడి వరమే సదా నీ సన్నిధానం


https://youtu.be/u_KEYwRo_HM

న టరాజ     నిటలాక్షా నటేశ్వరా భవా

మ హాదేవ   మహాదేవ పరమశివా

శి తికంఠా    శిపివిష్టా శైలధన్వా శర్వా

వా మదేవ   విశ్వేశ్వర విశ్వనాథ వృషపర్వా

య తిరాజ  యజ్ఞేశ్వర యమరాజ ప్రభువా

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ


1.ఆకాశ సదృశా వ్యోమకేశ అఖిలాండేశ్వరా

గణనాథ జనకా గుడాకేశ గంగాధరా

తాండవలోల కాలకాల నీలకంఠేశ్వరా

దక్షాధ్వరధ్వంసి దక్షిణామూర్తీ దిగంబరా

పన్నగధర శశిభూషణ అర్ధనారీశ్వరా

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ


2.కాళేశ్వర ముక్తీశ్వర శ్రీరామలింగేశ్వరా

నగరేశ్వర భీమేశ్వర శ్రీరాజరాజేశ్వరా

బాలేశ్వర భువనేశ్వర సోమసుందరేశ్వరా

ఈశ్వరా మహేశ్వరా శ్రీకాళహస్తీశ్వరా

శంభో శంకరా పురహరా ఓంకారేశ్వరా

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ

Sunday, July 18, 2021


https://youtu.be/49YBI3kDkVI?si=StaTp_eNyqg1DA8T

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :చారుకేశి 


మధురిమలు ముసిరేను నడి వయసులోన 

పరిఢవాలు కురిసేను ప్రౌఢ సొగసులోన

నిండుదనం అణువణువున తొణికిసలాడి

చూపుతిప్పకోనీవు గుండె పిండి పూబోడి

నితంబినీ అభినందనలందుకో మనసారా

మత్తకాశిని మన్ననలందుకో ప్రియమారా


1.నీ అందం ఆచూకి ఆసాంతం తెలియగా

తనువున అయస్కాంత కేంద్రమేదొ అరయగా

వన్నెలేవి నప్పునో ఏ వలువలు మేనొప్పునో

కట్టుబొట్టు ఎలా కట్టడిచేసి మది కట్టివేయునో

నితంబినీ అభినందనలందుకో మనసారా

మత్తకాశిని మన్ననలందుకో ప్రియమారా


2ఎలా పూయించాలో నవ్వులలో పారిజాతాలు

ఎలా ప్రకటించాలో నీ చూపులలో స్వాగతాలు

 ఏ మంత్రమేయాలో మాటలతో అనుభవమే మెండై

ఎలా వశులజేయాలో మిషలతో మెళకువలు తోడై

నితంబినీ అభినందనలందుకో మనసారా

మత్తకాశిని మన్ననలందుకో ప్రియమారా

Friday, July 16, 2021

 

https://youtu.be/KRPt2q6Ujqg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


ఎరుక పరచవయ్యా స్వామి ఏడుకొండులవాడా

తెలిసింది పిసరంత లేదు ఏమని నిను నే పాడ

కనిపించేదే దైవము కాదు అనిపించేదె జ్ఞానము కాదు

దారిచూపు తిరుమలరాయా నాలో లోలో నిను చూడ

అలవిగాదు నాకికపై నీకై చీటికి మాటికి నిను  వేడ


1.పంచేంద్రియములు వంచన జేయగ

అరిషడ్వర్గములు  నన్నాక్రమించగా

సప్తవ్యసనముల పాలబడితిని దుర్మతిని

అష్టకష్టాలతో సతమతమైతిని దుర్గతిని

దారిచూపు తిరుమలరాయా నాలో లోలో నిను చూడ

అలవిగాదు నాకికపై నీకై చీటికి మాటికి నిను  వేడ


2.నవవిధ భక్తుల నీదరి జేరగ

దశావతారముల ఆరాధించగ

ఏకాదశి వ్రతము ఏమరక జేసితి  సంప్రీతిని

ద్వాదశాక్షరిని సదా జపించితి నే నియతిని

దారిచూపు తిరుమలరాయా నాలో లోలో నిను చూడ

అలవిగాదు నాకికపై నీకై చీటికి మాటికి నిను  వేడ

 అతను:   నందనవనమే నీతో జీవనం

   ఆమె:    బృందావనమే నీతో సహగమనం

అతను:    మండువేసవైనా నీతోఉంటే కులూమనాలి

   ఆమె:    పూరి గుడిసెలొ మనమున్నా అది స్వర్గం కాక ఏమనాలి


1..అతను: పచ్చడి మెతుకులు సైతం నీచేత పంచభక్ష్య పరమాన్నాలు

ఆమె:       నూలు చీర కూడ నువు కొని తెస్తే నాకది కంచి పట్టు పీతాంబరం

అతను:   ఎంతగా కష్టించివచ్చినా నీ ఒడిలో సేదదీరితె అలసట మటుమాయం

ఆమె:      చేతిలోచేయుంచి దూరమెంత నడిచినా నాకది  పుష్పకవిమాన పయనం


2.ఆమె:   భరించరాని తలపోటైనా నీచేతి స్పర్శతో నాకుపశమనం

అతను:   సమస్యల సుడిగుండమందైనా నీతోడుంటే నాకది ఆనంద తీరం

ఆమె:      అమవాస్య రాత్రులైనా నీ సావాసం లో వెన్నెల విరజిమ్మేను

 అతను: నువు చెంత ఉన్నంత  శిశిరాలు వసంతాలై పూలు  వెదజల్లేను

Thursday, July 15, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవిత ఆర్తి ఉంటుంది కవి తలలో

కవి స్ఫూర్తి కనబడుతుంది కవితలలో 

దేహం ప్రాణం లాగా గీతం గానం లాగా

సూర్య కిరణం లాగా క్షణము తరుణం లాగా

నీవూ నేనూలాగా మనమున మను మన లాగా


1.ఒంటరినావ నీవైనావా-దారితెన్నూ మరిచినావా

అవమానాలే సైచినావా అనుమానంగా తలచినావా

తీరంచేర్చేతోడునవనీవా-భారంతీర్చే జోడుకానీవా

కాలమంతా పంచుకోనీవా ప్రియురాలివై ననుచేరవా


2.పసిడి సౌధాన  బ్రతికేద్దాం-స్వప్నలోకాల్లొ విహరిద్దాం

హంసతూలికా తల్పాన - హాయిగా ఆదమరుద్దాం

నీ సొగసు నాకు నజరానా నా మనసే నీకు ఖజానా

అనుభూతులెన్నో అనుభవిద్దాం సరసజగతినేలేద్దాం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సుప్రభాతం మిత్రమా

పలుకు తేనియ లొలికే ప్రియతమా

రాతిరంతా కలకు రావు

పగటిపూటా పట్టించుకోవు

నన్ను మరువకు ఎన్నడు నేస్తమా

నన్ను వదలకు ఎప్పుడు హృదయమా


1.కోవెల గంటల మంజుల నాదానివై

కోయిల కుహుకుహు మంజుల రావానివై

కోనేటి అలల మృదంగ మంజుల వాదానివై

కొత్తపెళ్ళికూతురి మంజీర మంజుల స్వానానివై

శ్రవణాల మురిపించావు హాయిచేకూర్చగా

మది రంజిలజేసావు మనసునే దోచగా


2.తరువు ఊగ ఆకుల గలగలల మంజుల రవళివై

నదిలొ పారు జలధార జలజలల మంజుల క్వణమువై

వెదురుపొదల గాలివేసే ఈలల మంజుల పదరువై

నరనరాలు పులకరించు గాజుల మంజుల సవ్వడివై

నా ఎదనలరించావు ఆహ్లాద మొనరించగా

జీవ రసితమైనావు జాగృత పర్చగా

Wednesday, July 14, 2021

https://youtu.be/6KfFhRue1as?si=MMmnwb9psInjCdMK

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : నీలాంబరి


శుభరాత్రి నేస్తమా… 

కొనసాగనీ మన చెలిమినీ…

నిదురించుమా మిత్రమా 

నను నీ కలవనీ, కలలో నీతో కలవనీ…

కలకాస్తా నిజమవనీ


1.పగలంతా చెప్పుకున్న సుద్దులన్నీ సద్దుమణగనీ

స్వప్నమందైనను వదలని స్నేహం ముద్దుగొలపనీ

కనురెప్పనై కాపుకాస్తా నీకనుపాపను పొద్దూ మాపును

చేదోడు వాదోడై తీర్చిదిద్దుతా  మధురంగా మనదైన రేపును


2.కష్టమే రాకపోనీ నీకు  వస్తేగిస్తే నన్ను మరువబోకు

అదృష్టమే వేయనీ మారాకు ఎద పొంగిపోతుంది నాకు

నీ అడుగులు తడబడకుండా చేయిపట్టి నడిపిస్తా

నీ పదములు కందకుండా నా హృదయ తివాచి పరుస్తా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈ వన్నెల వగలాడి ఎంతటిలోభి

కొసరి కొసరి చూపుతోంది అందాల నాభి

కనిపించీ కనిపించనీయకుంది కభీకభీ

ఉక్కిరిబిక్కిరై ఊరకుండనంటుంది నా గుండె అభీభీ


1.దాచుకున్న దాని మీదనే మిక్కిలి మమకారం

విప్పని గుప్పిటి అంటేనే ఎదలో దుమారం

కప్పిన పైటకొంగు మూయకుంది నాభి సొంపు

జారిన చీరకట్టు లాగుతోంది  గుట్టు వైపు

దోబూచులాట చిరుగాలికి ఈపూట

జవరాలికి సయ్యాట మనసైనచోట


2.ఉల్లిపొరలు విప్పుతుంటె మిగిలేది హుళుక్కే

అదనుచూసి ఒప్పకుంటె విరితేనె ఆవిరి లెక్కే

బెట్టు చేస్తూనే కాసింత పట్టువిడుపుండాలి

లొట్టలేయించక కడుపు కాస్త నింక నింపాలి

తరుణం మించిపోతె తపనకుద్వాసన

తాత్సారం చేస్తుంటే కోర్కెలుడిగిపోవనా

Tuesday, July 13, 2021

 

https://youtu.be/AZCXsBByjPA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జయగోదావరి మాత మాపాలిటి  సౌభాగ్య విధాత

గౌతమ ముని తపఃఫలిత సంజనిత

శ్రీరామ పాద స్పర్శిత  పరమ పునీత

హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత

పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత


1.అహల్యాసతి  పాపము ప్రక్షాళణ జేసితివి

పాముకు శాపముబాపి మనుజ రూపమిచ్చితివి

త్రయంబకేశ్వరాన వెలసి సలిలరయమువైతివి

బాసరపురముకు అరసి తెలుగుల వరమైతివి

హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత

పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత


2.కృషీవల ఫలసాయార్జిత పరితోషిణి

విద్యుదుత్పత్తి కారిణి మానవ జీవతరంగిణి

.స్నాన పాన జప ధ్యానుల అను నిత్య స

కారిణి

నరసింహుని సేవకజన భవతాప హారిణి

హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత

పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత

OK

Monday, July 12, 2021

https://youtu.be/oCF8iX2kHiw?si=pW_UjBd8XBE0KRwd


గుండె గుండెలో మువ్వన్నెల జెండా

ప్రతి భారతీయుని కలలే పండ

జాతీయతే పిడికిళ్ళు నిండా

జాతి  జాగృతికే అండదండ

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా


1..జైళ్ళలో మగ్గారెందరొ జీవితాంతం

లాఠీ దెబ్బలు తిన్నారు ఉద్యమసాంతం

తూటాలకు ఎద ఎదురొడ్డారు ఏ మాత్రం వెరవక

అహింసతోనే సాధించారు సంపూర్ణసాధికారత

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా



2.బానిస సంకెళ్ళనే త్రెంచివేసి

భావదారిద్ర్యమే త్రుంచివేసి

సమైక్య గీతం ముక్తకంఠంతొ ఆలపించారు

పంద్రా అగస్ట్ స్వతంత్ర కేతన మెగురవేసారు

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా




 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుర్తింపుకోసం ఎంత ఎంత వెంపర్లాట

కీర్తి కోసమెందుకె మనసా ఇంతగా తండ్లాట

గోరంత ప్రతిభ ఉన్నా కొండంత అపేక్షట

ఇసుమంత కృషిచేస్తేనే ఇలన వెలిగి పోవాలంట

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం


1.ఎవరి మెప్పుకోసము ఎలుగెత్తేను పికము

ఏ పురస్కారముకై పురివిప్పును మయూరము

ఇంద్రధనుసు ఎందుకని అందాలు చిందుతుంది

మేఘమాల దేనికని మెరుపులని చిమ్ముతుంది

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం


2.కొలనులో విరిసిన కమలం ఏమికోరుకుంటుంది

వెన్నెల వెదజల్లే జాబిలి ఏ సత్కారమడుగుతుంది

హాయిగొలుపు పిల్లతెమ్మెర సమ్మానించమంటుందా

తపన తీర్చు వర్షపుజల్లు బిరుదులే ఇమ్మంటుందా

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం

https://youtu.be/bm_KUa4U_D4


ఉత్తర దిక్పతి సకల సంపత్పతి

అలకాపురపతి సిరి వరదా ధీమతి

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి


1.విశ్రవసు దేవవర్ణి ప్రియపుత్రా

భరద్వాజ ఋషిపుంగవ సుపౌత్రా

చార్వీ పతీ  స్వామీ పింగళ నేత్రా

త్రిపాద అష్టదంష్ట్ర లఘు గాత్రా

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి


2.మహాదేవ ప్రియసఖా పూర్వ గుణనిధిరూపకా

శ్రీ వేంకటేశ కళ్యాణ వినిమయ ఋణదాయకా

గదాయుధ ధరావీరా నర వాహన సంచాలకా

జంబాల నామాంతరా నర లోక నిజ పాలకా

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి


https://youtu.be/bm_KUa4U_D4

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పంజరాన్ని వీడిరావే నా పావురమా

బంధనాలు త్రెంచుకోవే ఓ ప్రియతమా

దిగంతాలు దాటివెళదాం 

దివ్యమైన లోకం ఉంది

యుగాంతాల అంతుచూద్దాం

భవ్యమైన జీవితముంది


1.సాలెగూడులోన చిక్కే చక్కనైన నీ బ్రతుకే

విధే వక్రించి ముక్కే  బంగారు నీ భవితే

అంతుపట్టలేకుంది నీ అంతరంగం

కట్టువీడ తలపడుతోంది యౌవనతురంగం

చేయందుకోవే ఓ చంచలాక్షి

నీ జతను కోరుతోంది నా ప్రాణపక్షి


2.ఊబిలోన దిగబడిపోయాం బయటపడలేము

సాగరాన ఈదుతున్నాం చేరలేము ఏతీరం

మనసంటు ఉందిగాని మార్గమే లేదాయే

తీపి తీపి జ్ఞాపకాలే వేపాకు చేదాయే

సాంత్వనే అందజేద్దాం పరస్పరం

ఊరటే చెందగలము అనవరతం




పల్లెటూరి చిన్నదాన

పట్నం చదువుకు వచ్చినదాన

రెక్కలె రాని పక్షిలాగా

దారం తెగిన పతంగిలాగా

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర


1.రంగురంగుల హంగులే పట్టిలాగుతాయి

ఫ్యాషన్ పేరిట వికృతాలు చుట్టుముడతాయి

కొత్తకొత్త వ్యసనాలన్నీ నిన్నే కోరి వరిస్తాయి

వింత వింత స్నేహాలన్నీ ఆప్తంగా కనిపిస్తాయి

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర


2.పార్టీల్లో చేరకపోతే నిన్ను గేలి చేస్తారు

పబ్బులకు వెళ్ళకపోతే జాలిగా చూస్తారు

డేటింగ్ అన్నది చేయకపోతే అప్డేవలేదంటారు

మాదక ద్రవ్యాలకే బానిసగా మారుస్తారు

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర

Saturday, July 10, 2021


నాదానివై మంజుల నాదానివై

ఆవిర్భవించావు నిశ్శబ్ద విశ్వమే రవళించగా

మోదానివై ఎదల ప్రమోదానివై

అవతరించావు చిరకాల స్వప్నమే ఫలించగా

అందుకో నేస్తమా జన్మదిన శుభాకాంక్షలు

ఆనందమే చిందగా కురిపింతు అక్షరాక్షంతలు


1.మూర్తీభవించిన స్త్రీమూర్తిగా సౌహార్ద దీప్తిగా

తీర్చిదిద్దిన అపరంజి బొమ్మగా ముద్దుగమ్మగా

పదహారు కళలొలికే సిరిగా సౌందర్య లహరిగా

 విలసిల్లు వికసించే విరిగా జనాళికే స్ఫూర్తిగా

అందుకో నేస్తమా జన్మదిన శుభాకాంక్షలు

ఆనందమే చిందగా కురిపింతు అక్షరాక్షంతలు


2.ఉపాధ్యాయ ఉద్యోగాన  పదోన్నతే పదింతలై

కవనలోక తలమానికగా పురస్కార పులకింతలై

షట్కర్మయుక్తగా కాపురాన ప్రేమలే చిగురించగా

జీవితమే సాఫల్యమొందగ కనులే చెమరించగా

అందుకో నేస్తమా జన్మదిన శుభాకాంక్షలు

ఆనందమే చిందగా కురిపింతు అక్షరాక్షంతలు

Friday, July 9, 2021


ఎవరికెలా ముడిపెడతాడో పరమేశ్వరుడు

ఎవరితో జతకడతాడో మనలనా భగవంతుడు

ఏ క్షణం జీవితాన్ని ఏ మలుపు తిప్పుతాడో

ఏ ఋణం తీర్చుకొనగ ఏ బంధం విప్పుతాడో


1.పరిచయాలన్నిటిలో మన ప్రమేయమెంతని

స్నేహాం కొనసాగుటలో మన పాత్ర ఏమేరకని

ఎదురయ్యే సందర్భం ఎవరు రచించారని

ఎదుర్కొనే సంఘటనలు ఎవరు సృజించారని


2.పరమార్థమేదో లేకుండా ఉండదు ప్రతి జన్మకు

ప్రయోజనమొకటి కలుగకుండ ఉండదు ప్రతికర్మకు

ఏ చర్యవల్ల ఏ చర్యకే ముందొ అవినాభావ సంబంధం

దైవలీలల్లోనా సంభవమే ఏదో కార్యకారణ సంబంధం

Thursday, July 8, 2021



https://youtu.be/aTkyjXR5dI4


విశ్వసించా నా శ్వాసవే నీవుగా సాయి

పలవరించా నీ నామమే పగలు రేయి

నిజాయితే కొఱవడిందో నీ మీది భక్తిలో

సజావుగా సాగకుంది నా బ్రతుకే ఆసక్తితో


1.ఎందరు నిను కొలిచేరో-లబ్దెవరికి చేకూరేనో

షిరిడీ దారి పడతారు-నీ సమాధిన తలపెడతారు

ఎవ్వరికే సిరి దొరికేనో ఏ సంపద సమకూరేనో

ద్వారకమాయికేగుతారు-ధునిబూది తలనెడతారు


2.చెప్పుడు మాటలు వినను-కాకమ్మ కథలు నమ్మను

మరిమరి నిను వేడను- మదిలో మాత్రం నే మరవను

ఏరీతి చక్కబెట్టెదవో  -చేజారిన ఈ నా జీవితం

ఎలా మరమ్మత్తు చేసెదవో -శిథిలమైన నా హృదయం

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎలా ఋజువు పరుచను నా ప్రేమను

ఎలా ఎరుక పరుచను నా మనసును

ఏ అపురూప కానుకనందించను

ఏ విధి నా హృదినిక ప్రకటించను


1. పారిజాత తరువును గొనిరానా

సత్యపరం చేసాడు కృష్ణుడేనాడో

ఐనా పారిజాత పరిమళమే నీ సొంతం

అమృతాన్ని దివికేగి సాధించుకరానా

పాత్రకే పరిమితమై మితంగా లభ్యమౌనో

పుష్కలమే నీ అధరాల్లో ఆ సుధామాధుర్యం


2.కోహినూరు వజ్రం సంపాదించనా

ఆంగ్లేయులు దొంగిలించిరి అలనాడే

నీకాలిగోటి విలువకు తూగదుగా ఆ రత్నం

పాలరాతి మందిరమే నిర్మించనా

కఠినమేకద శిలాకోవెల  సుకుమారీ నీకేల

నా గుండెను గుడిగా మలచి కొలిచేను నిత్యం

Tuesday, July 6, 2021

 

ఎలా కాచి ఉంచను నీ వదన కమలాన్ని

తుంటరి తుమ్మెదల దండునుండి

ఎలా ఏమార్చను నీ చరణ పల్లవాన్ని

గండుకోయిలల దాడినుండి

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే


1.క్షీరసాగర మథనం మళ్ళీ మొదలౌతుంది

నీ అధరామృతం కోసం

శివ మనోచపలత్వం మరలా సాధ్యమౌతుంది

నీ నవమోహన రూపంకోసం

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే


2.ప్రపంచాన్ని సాంతం త్యజించవచ్చు

నీ క్రీగంటి చూపుకు

విశ్వాన్ని సైతం జయించగావచ్చు 

నీ అరనవ్వు కైపుకు

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే


OK

 

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతటి శిక్షనో ఈ నిరీక్షణ

నీకెప్పటికైనా చెలీ ఎరుకౌనా

ఎంతగకాల్చునో విరహ వేదన

కాసింతైనా నీకిక అవగతమౌనా

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా


1.కన్నయ్య రాకకు రాధ ఎలా ఎదిరి చూసిందో

దుష్యంతుని జాడకై శకుంతలెంత వేచిందో

ప్రణయాగ్ని జ్వాలలోన ఎవరెంత వేగారో

ప్రియతముల సంగమించ ఎంతగా గోలారో

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా


2.రామునికి దూరమై సీత ఎంత వగచిందో

నలుడి నెడబాసి దమయంతెలా సైచిందో

చేజారి పోతే తెలియును గాజు పూస రత్నమనీ

చెలికాని వెలితిని మరచుట విఫల యత్నమేననీ

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా

 

https://youtu.be/W64g06TYrKU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సకల సృష్టికే స్త్రీ మూలం

ఆకాశంలో అతివ సగం

స్వావలంబన సాధికారత

సబలకు పెట్టని ఆభరణం

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం


1.సకల విద్యలకు అధిదేవతయే మాతా శ్రీ సరస్వతి

సిరులను వరముగ నరులకిచ్చే లక్ష్మి సైతం పడతి

అసురదూర్తులను మట్టుబెట్టినది కాదా ఆదిపరాశక్తి

నిబిడీకృతమౌ మనో బలమునే గుర్తెరగాలి ప్రతి ఇంతి

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం


2.పలురంగాలలొ పురుషుని దీటుగ నిలిచింది ప్రమద

వ్యోమగామిగా గగనతలంతో విహరించింది ధీర

దేశమునేలే నేతగ నాడే పరిపాలించెను తరుణి

సంతతి పొందే ఉన్నతి ఖ్యాతికి కారణభూతం కాంత

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మెరుగులు దిద్దని ముడి సరకు

అమరపురి నుండి దిగె ఈ ఇలకు

సహజాతమే నీ అపురూప సౌందర్యం

అపరంజి శిల్పమేనీ అనన్య సోయగం


1.కొలనులోన విచ్చిన కమలం

వనములొ  విరిసిన మందారం

అణువణువు నీ తనువు మొగలి సౌరభం

తాకిచూస్తే హాయిగొలిపే గులాబి సుకుమారం


2.అనంగ రంగం నీ అంగాంగం

 బృందావన రస సారంగం

హద్దులు దాటి పెదవులు మీటే కమ్మదనం

హత్తుకపోతే మత్తులొముంచే వెచ్చదనం

 

https://youtu.be/A4NIJt8szQM

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భో భో భో భో బోళా శంకరా

భో భో భో భో శంభోశంకరా

ప్రభో రాజరాజేశ్వరీ విభో శంకరా

సాంబ సదాశివ భక్తవశంకరా హరా

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా


1.జటాఝూట హఠయోగీ గంగాధరా

కరుణా కటాక్ష వీక్షణా బాలేందుశేఖరా

నిటలాక్ష విషకంఠా వృషభ వాహనా

శూలధరా పురంధరా ఫణి భూషణా

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా


2.త్రయంబకా పంచముఖా మృత్యుంజయా

వైద్యనాథ భూతనాథ విశ్వనాథ సహాయా

నటరాజా చిద్విలాస ప్రళయ రౌద్ర రూపాయా

రాజేశ్వర పరమేశ్వర కైవల్యదాయకాయ

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా

Sunday, July 4, 2021


https://youtu.be/rMlYA6GEbwk

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జన్మనే వరమిచ్చిన మముగన్నతల్లీ

నీ జన్మదినము ఈనాడే మా కల్పవల్లి

సంబరమే చేసెదము మేము సంతసిల్లి

దీవెనలందెదము నీ పదముల ప్రణమిల్లి

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


1.నాన్నకు తగు ఇల్లాలిగ మన్నలే పొందావు

కన్న మా ఏడుగురిని కనుపాపగ సాకావు

అత్తింటికి పుట్టింటికి పెద్ద దిక్కువైనావు

చెల్లెళ్ళను కోడళ్ళను ఆదరణతొ చూసావు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


2.ఇంటికెవరు వచ్చినా కడుపునింపి పంపావు

కమ్మనైన రుచులతో తృప్తిదీర పెట్టావు

ఎవరికైనా సాయపడి రెక్కలరగ దీసావు

అన్నపూర్ణవై అతిథుల మతులలో నిలిచావు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


3.తీరలేని వెతలున్నా నవ్వెన్నడు చెరగలేదు

ఎంతకష్టమెదురైనా నీ ధైర్యం సడలలేదు

నిన్ను తలచుకుంటే నిరాశే దరికిరాదు

సవాళ్ళనే ఎదుర్కొనగ నీ తెగువకు సరిలేదు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీరెండలో మెరిసే అపరంజి గులాబీ

నా గుండె తహతహలాడే ఆరెంజి జిలేబీ

రోజూ చూడాలనిపించే రోజా పువ్వు నువ్వు

నోరూరించి మనసునుదోచే మడత  కాజానువ్వు


1.గాలి మోసుకొస్తుంది నీ మేని పరిమళం

మబ్బు చిలకరిస్తుంది నీ హృదయ మర్మం

నది కౌగిలిస్తుంది నీ ప్రతినిధిగా నా దేహం

చెట్టు సేదతీరుస్తుంది నీకు మారు అంగాంగం


2.వెలవెలబోతుంది సూర్యరశ్మి నీ ముందు

తళతళ విద్యుల్లత నిను గని వగచెందు

ఇంద్రధనసు కన్నా నీ వన్నెలె కనువిందు

నీ ఊహ మెదిలినంత మదికెంతో పసందు

 రచన,స్వరల్పన&గానం:డా.రాఖీ


రాగం:సారమతి


హరి వేంకట నారాయణా

సిరివల్లభా కమలనాభా

కరుణాభరణా  దీనావనా

పరిపరి విధములుగా నిను నుతియింతును

మరిమరి నీ చరణములే నే శరణందును 


1. కరినైనా కానైతిని సరగున నను బ్రోవగా

బలినైనా అవకపోతిని నీపదమే తలనిడగా

రాయిగా పడివున్నా  తాకాలని నీ అడుగు

వెదురునై  ఒదిగున్నా చేరాలని నీ మోవి

పరిపరి విధములుగా నిను నే కోరెదను

త్వరపడి నీ పదములనే నేనిక చేరెదను


2.నీ గుడి గంటనై నిన్నంటెద సవ్వడిగా

అఖండ దీపమునై వెలిగెద గర్భగుడిన

తులసీదళ మాలనై అలరింతును నీ మెడన

చక్కెర పొంగళినేనై స్థిరపడెదను నీ కడుపున

పరిపరి విధములుగా చేసెద నీ సేవలు

నీ సన్నిధిలో మనుటకు ఎన్నెన్ని స్వామి త్రోవలు

Friday, July 2, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందితే వంపులు 

అందకుంటె జంప్ లు

అందాల ఇంతులవి

ఇంతే సంగతులు


1.వలపులతో వలలు

అర్భకులే చేపలు

చిక్కిన వెనువెంటనే

చిక్కులే చిక్కులు


2.మాయలేడి జోడి

మాయ చేయ లేడి

పులిహోర కలపబడి

బ్రతుకంతా చేతబడి

 https://youtu.be/x2pdd2n5RNI?si=c7lOr_PFrbEC8o04

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఎద మంజుల నాదమా నా కవన వేదమా

యుగయుగాల నా తపఃఫలమా 

నా కలానికే దొరికిన అపూర్వ వరమా

తడబడుతోంది నినుగాంచ నాదృష్టి 

నివ్వెరబోతోంది నీ అందానికి ఈ సృష్టి


1.నీ శిరోజాలు కృష్ణవేణి పాయల జాలు

నీ కన్నులు మిలమిల ఇంద్రనీలమణులు

నీ నునులేత చెంపలు కెంపులరుచి నెలవులు

పోలికే దొరకదు తీరిచి దిద్దిన నీ ముక్కునకు

తడబడుతోంది నినుగాంచ నాదృష్టి 

నివ్వెరబోతోంది నీ అందానికి ఈ సృష్టి


2. పిల్లనగ్రోవిగా తోస్తోంది నాపెదాలకు నీమోవి

మత్తులోన ముంచుతోంది నీ మేని పారిజాత తావి

చిత్తైపోయింది నా చిత్తము నీమాయకు లోబడి

నా మనసే నను వీడెను నీ లోనికి చొరబడి

చర్వితచరణమైంది చెప్పిన ఉపమానము

అందానికి ఇకనుండి నీవేలే నిర్వచనము


https://youtu.be/ynmtOVJGl-0


మనసాయే నిను గన షిరిడీ సాయి

వినవాయే మొరలిడ పగలూ రేయి

సద్గురుడవీవని నాకెంతో గురి

పట్టితి నీపదము విడవను ఏ మరి

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను


1.నీ సూత్రాలు తలదాల్చలేను

నీ స్తోత్రాలు పఠియించ లేను

పంచహారతుల నొనరించలేను

పల్లకి భారము మోయగలేను

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను


2.చీకటి వేళల దీపము నీవే

ఆకటి వేళల అన్నము నీవే

శోకము బాపెటి నేస్తము నీవే

లోకములో నాకిక దైవము నీవే

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను


OK

Thursday, July 1, 2021

 

https://youtu.be/bpnQJvPTmVs?si=glZq006Bhc7జబీనియ్

వేములాడ వాడ రాజన్న

దయగల్ల వాడ రాజన్న

శివసత్తులదొర జంగమదేవర

ఎల్లలోకాల నీవె చల్లగ కావర


1.  గుండె  నిండుగా  చేసుకొని

గుండంలొ నిండా ముంచి మెయ్యని

గుడి గంట ఠామ్మని కొట్టి నేనిలిస్తిని

గురి నీ మీదనే పూరా పెట్టుకొంటిని


2.చెంబెడు నీళ్ళు కుమ్మరిస్తిని

శివ లింగమ్మీద పత్రి పెడితిని

శంభో శంకా నా వంక చూడమని

సాగిలబడి నీకు మొక్కుకుంటిని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మళ్ళీ పుట్టాలి మనం 

మనదైన లోకంలో ఈ క్షణం

ఆంక్షలేవి లేని చోట ఆకాంక్షలు తీరే వాకిట

వాస్తవికతకు సమాంతరంగా

భావుకతకు సుందర తీరంగా


1.ఆకలి దప్పులకు తావుండదచట

జరా మరణాలకు వీలుండదచట

అనురాగమొక్కటే విరిసేటి తోట

ఆనందం మాత్రమే కురిసేటి చోట

అది అందమైన మనదైన ఊహల జగము

అట నీవు నేను ఒకరికొకరం చెరి సరి సగము


2.పలుకుల జలపాతాలే ప్రవహిస్తుంటే

పాటల పారిజాతాలే పరిమళిస్తుంటే

అమృతాన్ని  ఆసాంతం ఆస్వాదిస్తూ

హాయినే జీవితాంతం అనుభూతిస్తూ

కలిసి మనం పయనిద్దాం దిగంతాల దాకా

కలలపంట పండిద్దాం యుగాంతాలదాకా


https://youtu.be/eimfjGN3NSg?si=kIHq6bcKNcp-_0e-

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: శ్రోతస్విని

మ్రోగనీ నా ఎద మంజులమై నీ పద మంజీరమై
దిద్దనీ నా పెదాలు అరుణిమలే  నీపదాల పారాణియై
నడిపించనీ అరచేతుల పదిలంగా నీ పాదాలు కందనీయక
నిమరనీ నాకనురెప్పలతో సౌమ్యంగా నీ పాదాలకానందమీయగ

1.తరించనీ నీ పవళింపుసేవలో మెత్తని నీ పదములనొత్తగా
నిదురించనీ మైమరచి నీ పదముల తలగడపై రేయంతా మత్తుగా
మెటికలు విరియనీ నీకాలి వ్రేళ్ళకే అపురూపంగా నను కొత్తగా
మర్ధన చేయనీ అతిసున్నితంగా నీ పాదాల తీపులే చిత్తవగా

2.తేలిపోనీ నను నీ బొటన వ్రేలు నా ఛాతిపై ముగ్గులేయగా
మూల్గనీ నీ పాదాలు నా నిలువెల్లా కొలతలేవో తీయగా తీయగా
సోలిపోనీ నీ అరిపాదం నా చెంపకు సుమ గంధం రాయగా మాయగా
వాలిపోనీ అలసిసొలసి నీ పదతాడనతో ఆ హారతి నీయగా హాయిగా


Tuesday, June 29, 2021

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమవ్వగలను నేస్తమా 

బంధాలకతీతమై నీకు నేనౌతా సర్వం సహా

ఏమివ్వగలను మిత్రమా 

నేనే నీవైపోయిన నీకు -నిన్ను నీకు మినహా


1.నీవుగా కోరింది ఇప్పటికి నెరవేరంది

మనసారా నువు బాగా మెచ్చింది -ఇంకా ఏముంది

నావద్ద దాచుకుంది నాకెంతో నచ్చేది

నన్నిమ్మని అడిగింది నీవేకదా అది -నిన్ను నీకు ఇచ్చేది

ఖరీదెవరు కట్టలేంది అమూల్యమే అది నీకు నా బహుమతి


2.దూరంగా ఉన్నాగాని ఒకే ఒరలొ కత్తులం

పరస్పరం ప్రభావంతో సాహితీ పాన మత్తులం-కవన చిత్తులం

చేరువగా భావాలున్నా చేరలేని తీరాలం

తలపులతో తలమునకలయే పావురాలం-స్నేహగోపురాలం

సృష్టిలో తీయనిది ఎన్నటికి తరగనిది చెలిమి నీకు  కానుక

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా అంతరాత్మవు నీవు

నామేధలో  పార్వతీ మాతను నిలిపేవు

నా పంచప్రాణాలే పంచ భూతవిశ్వము

నాదనుకొను ఈ దేహమే నీదైన గృహము

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము


1.గుణరూప రహితుడవు నిత్య నిరంజనుడవు

సాకార నిరాకార సందిగ్ధ లింగ ప్రాప్తుడవు

సర్వవ్యాపకుడవు అఖండ విశ్వజనకుడవు

త్రయంబకుడవు నీవు సాంబ సదా శివుడవు

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము


2.వేదవేద్యుడవు సంగీత శాస్త్రాద్యుడవు 

తాండవకేళీ విలాసుడవు నటేశ్వరుడవు

ఆది వైద్యుడవు సకల విద్యా పారంగతుడవు

ప్రళయకాల రుద్రుడవు మృత్యుంజయుడవు

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చారెడేసి కళ్ళున్న చారులత

బారెడంత జడ ఉన్న మంజులత

ఒదిగిపో నీవే నా కవితగా

సాగవే  బ్రతుకంతా నా జతగా


1.గోముగా చూడకే నా వంక

అరనవ్వు రువ్వకే చంద్రవంక

వెక్కిరించినా నీ ప్రేమకదో వంక

వైరులకూ దొరకదు నీలో ఏ వంక


2.ఊరించడం నీకు మామూలే

ఉడికించకు మగటిమికది సవాలే

ఊహలే రేపేను నీ పరువాలే

ఉక్కిరిబిక్కిరాయే నాలో భావాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోకమంతా నిదురపోతోంది

నా కవితకిపుడే వేకువయ్యింది

చెదురుమదురుగా ఎదను తట్టిన

భావసంచయము

కుదురుగా ఇపుడిపుడే వచ్చి

కూర్చె నీ సరము


1.సెలయేరై పారుతుంది ఎడారిలోనూ

గులాబీగ పూస్తుంది స్మశానంలోను

చంద్రికయై వెలుస్తుంది అమావాస్యలోను

చిరుజల్లై కురుస్తుంది ఎద బీడులోను

వేగుచుక్కగా మారి దారి చూపుతుంది భావుకత

పొద్దుపొడుపుగా ఆశలకే రుచిస్తుంది నా కవిత


2.ఆర్తి తెలియపరుస్తుంది ప్రేమికుల జతకు

స్ఫూర్తి కలుగజేస్తుంది యథాలాప యువతకు

మార్గదర్శనం చేస్తుంది సరియగు నడతకు

జాతీయత రగిలిస్తుంది నా దేశజనతకు

వేగుచుక్కగా మారి దారి చూపుతుంది భావుకత

పొద్దుపొడుపుగా ఆశలకే రుచిస్తుంది నా కవిత

Monday, June 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గృహిణితో మగనికి ఇంట ఒత్తిడి 

యజమానితో  పనిలో పడని ఒత్తిడి 

అధిక రక్త పోటుతో  ఒళ్ళంతా  ఒత్తిడి 

కలత నిదుర వలన మనసుంతా ఒత్తిడి

ప్రశాంతతే కరువై బ్రతుకంతా ఒత్తిడి

ఆసాంతం అనుక్షణం భరించలేని ఒత్తిడి


1.నరకమే సుఖకరం  ఒత్తిడుల మధ్యన

చావే గత్యంతరం బ్రతుకు వధ్యశిలన

అసమర్థుడి జీవయాత్ర పుట్టుకతో మొదలౌను

అడుగడుగున సతమతమై మెదడంతా చెదలౌను

ప్రశాంతతే కరువై బ్రతుకంతా ఒత్తిడి

ఆసాంతం అనుక్షణం భరించలేని ఒత్తిడి


2. అస్తవ్యస్తమే బ్రతుకు నాదిగా అనాదిగా 

విఫలయత్నమే గెలుపుకు సమిధగా వ్యధగా

ఉప్పెనతో కప్పబడే భవిష్యత్తు సాంతం

తుఫానుతో చిత్తడాయే జీవన వసంతం

ప్రశాంతతే కరువై బ్రతుకంతా ఒత్తిడి

ఆసాంతం అనుక్షణం భరించలేని ఒత్తిడి

Saturday, June 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అసూర్యంపశ్యవు నీవో

అనాఘ్రత పుష్పమునీవో

జలతారు మేలిముసుగులో

జగదేక సుందరినీవో

అమృత కలశపు అంజలితో

అపర జగన్మోహిని నీవో


1.మత్తుకళ్ళతొ చిత్తేచేసిన మత్స్యగంధివి నీవో

పాలనురుగుల నవ్వులతో మాయచేసిన గంగవునీవో

మతిచలించే అందమున్న ఇంతి దమయంతివి నీవో

చూపులతో కైపును రేపే అప్సరాంగన ఊర్వశి నీవో


2.రాసలీలతొ మురళీధరునికి రక్తికూర్చిన రాధవునీవో

ఇంద్రుడే పాదాక్రాంతుడైన సుందరి అహల్యవే నీవో

దుశ్యంతుని హృదయము దోచిన శకుంతలవు నీవో

రవివర్మ కుంచెకు దొరకని సౌందర్య దేవత నీవో

Friday, June 25, 2021



ఇలా నిర్ణయించావా నా జాతకం

బలిచేయనెంచావా నా జీవితం

ఏ మలుపు తిరిగేనో నీచేత నా కథనం

గాలివాటు పతంగమాయే నా భవితవ్యం

అరవిందాననా తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ


1.నిన్ను అడుగు వాడిలలేడు

నీకు సాటి మొనగాడెవ్వడు

నీనోటి మాటనే ఒక వేదమంత్రం

నీ ఆదేశమే అది రాజ శాసనం

నీదే ఈ సామ్రాజ్యం మా విలువే శూన్యం ఎంత దైన్యం

అరవింద నయన  తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ


2.కంచే చేన్ను కాచకుంటే దిక్కెవ్వరు

రెప్ప తప్పుకుంటుంటే కన్నుకు చుక్కెదురు

రాజుతలుచుకున్నాడంటే దండనే దండన

దైవం కన్నెర్రజేస్తే బ్రతుకు సుడిగుండాన

నీవే దయగాంచు నీవె ఆదరించు నన్నుద్ధరించు

అరవింద చరణ  తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెఱకు గడవు నీవు ఎటుతిన్నా తీయదనమె

ఇంద్ర ధనువు నీవు ఎటుకన్నా ప్రన్నదనమె

వర్ష ఋతువు నీవు పుడమంతా పచ్చదనమె

హేమంత ఉషస్సువు తనువంతా వెచ్చదనమె

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే


1.తెలుగు మాట నీవు అగుపించును తేటదనం

బ్రతుకు బాట నీవు తలపించును నందనం

వలపు తోట నీవు మేను విరుల సవరదనం

ప్రగతి మీట నీవు  నా మనోరథ ప్రచోదనం

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే


2. అంతులేని ప్రేమ నీవు నీతోనే జీవనం

అనవరతం నీ సన్నిధి అపర బృందావనం

ఆహ్లాదము నీ తలపే అది కమ్మని భావనం

అపురూపము మనకలయిక ఇల కడు పావనం

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే

Thursday, June 24, 2021

 

https://youtu.be/0qU3846QCgc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శుక్రవార శుభలక్ష్మి

చక్రధారి గృహలక్ష్మి

స్వాగతమమ్మ నీకు ఆరోగ్యలక్ష్మి

వందనమమ్మ నీకు ఆనందలక్ష్మి


1.వక్ర బుద్ధి మాకెవరికి కలగనీయకమ్మా

అక్రమార్జన కెపుడు మాకు తావీయకమ్మా

తృణమో ఫణమో పంచే గుణమీయవమ్మా

ఉన్నంతలొ జీవించే తృప్తి నీయవమ్మా


2.చిరునవ్వును పెదవులపై చెరగనీయకమ్మా

బంధుమిత్రులే సిరులను భావమీయవమ్మా

ప్రకృతితో చెలిమి జేయు వరమీయవమ్మా

నీ ఆకృతి మా మదిలో చెదరనీయకమ్మా

 రచన,స్వరకల్పన&గానం:రాఖీ


రెప్పకు చూపుకు పోరాటం

తనువుకు మనసుకు తప్పని జగడం

రెప్పనిదుర పొమ్మంటుంది

చూపు ఆగమంటుంది

తనువు తప్పదంటుంది

మనసు గోడు వినమంటుంది


1.రెప్ప చెప్పి ఒప్పిస్తోంది

కలకు చెలిని రప్పిస్తానని

చూపు నమ్మనంటోంది

నిమిషమైన ఆపలేనని

నిదుర బెదిరి పోతోంది

కలత కుదరదంటోంది

గొడవ సద్దుమణిగే లోగా

వేకువ పొడసూపుతోంది


2.రెప్పమూసినా గాని

చెలి రూపు నిలిపింది

స్వప్నాల సౌధం లోకి

సఖిని సాగనంపింది

తనువుతో రాజీకొచ్చి

మనసు నెమ్మదించింది

చెలియ మనసుతో చేరి

ప్రణయ గీతి పాడింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బంధించు  నీ హృదయంలో

సంధించు నీ ప్రణయంలో

సాధించు నన్ను సఖీ నీ సన్నిధిలో

ముంచిఉంచు ఎప్పటికీ ప్రేమాంబుధిలో

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే


1.ఊపిరాడనీయకూ నీ కౌగిలిలో

తేరుకోనీయకు ముద్దుల జడిలో

గాయపరచవే నన్ను నాలిక ఛూరికతో

దోచేయి సర్వస్వం మంత్రతంత్ర విద్యలతో

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే


2.బానిగా మార్చుకో వశీకరణ చేసి

దాసునిగా చేసుకొ దేవీ కోరికలే తీర్చేసి

నను కట్టడి చేసేయి కనికట్టు చేసేసి

నేన్నే లేకుండా చేయి నీవుగా మార్చేసి

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వు నవ్వితే రోజూ పున్నమి

నాకన్నుల నీవే నిండు జాబిలి

మేఘమాల మధ్యన చందమామ నీ మోము

ఒక నిమిషమైనా దృష్టి మరల మనలేము


1.పొందికలోనె ఉంది నీ ఎనలేని అందము

ఒద్దికనే తెలుపుతోంది  పొందిన ఆనందము

నిను గనినంతనే పరవశమౌ నా డెందము

కలయే నిజమై  కలవరమౌ చందము


2.హళేబీడు శిల్పాలు నినుగాంచి చెక్కినవే

అజంతా చిత్రాలకు అలనాడు ప్రేరణవే

ప్రబంధ నాయిక పాత్రలు నీ వల్ల వెలిసినవే

దేవీ మూర్తులన్ని నీ స్ఫూర్తితొ మలచినవే

Wednesday, June 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కాస్తంత తోడొస్తావా-కలలోకి వెళుతున్నా

నీచేయినందిస్తావా-తలమునకలౌతున్నా

కవితలకు వీలౌతుంది-కవి తలకు మేలౌతుంది

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను


1.నీ చూపుల శరాలనే మారుస్తా అక్షరాలుగా

నీ పదాల గురుతులనే పేరుస్తా పదాలుగా

నీ మంజుల దరహాసాన్నే వాక్యాల్లో కుమ్మరిస్తా

నీ గాత్ర పరిమళాన్నే  గీతమంత పరిచేస్తా

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను


2.నీ స్పర్శలోని హాయిని రాగమందు రంగరిస్తా

నీ గుండె సవ్వడిని పాటకు తగు లయచేస్తా

కలిగే గిలిగింతలన్నీ గమకాలు పలికిస్తా

మిగిలే అనుభూతులన్నీ కృతిగా నేనాలపిస్తా

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మీటితే మ్రోగుతుంది నీ హృదయవీణ

రాగాలు పలుకేనది అది సంగీత ప్రవీణ

సవరించితే చాలు తెగిన తీగలన్నీ

వరించేను మధురిమలెన్నో ఎదుటి ఎదలన్నీ


1.ఆటగా భావించారో ఘాటుగా వేటేసారో

మోటుగా వాయించారో చేటుచేయనెంచారో

మూలబడిపోయింది నీ మానసవీణ

మూగవోయి మిన్నకుంది ఈ నవ్వుల నిక్వణ


2.శిథిలమైపోయింది మరమ్మత్తులే లేక 

శకలమై మిగిలింది బాధ్యతెవరు తీసుకోక

దుమ్మునంత దులిపేస్తే నవ్యంగా తోస్తుంది

శ్రుతిచేసి సంఘటిస్తే సవ్యంగా పలికేస్తుంది


PIC.courtesy:  Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముసుగేసుకోకు నీ మనసుకు

విసుగునే పులుమకు అందాలమోముకు

అద్దమైన ఎప్పుడు చూపని సౌందర్యం నీది

అనుభూతి చెంది ఉండని లావణ్యం నీది

పూర్వజన్మ పుణ్యమే నిను పొగిడే అవకాశం

ప్రస్తుతించ ధన్యమే అనుమతించ నా అదృష్టం


1.దబ్బపండు ఛాయలో నీ మేనిరంగు

అబ్బా అని అనిపించేలా అంగాంగ హంగు

మబ్బులను మరిపించేలా నీకురులు రేగు

పబ్బమల్లె నినుగనినంత ఉల్లమే ఉప్పొంగు


2.వెతికితేనె కనబడునంత నంగనాచి నడుము

మతిచెలింప చేసేంత దోబూచి నీ ఉదానము

చితి నుండి బ్రతికించేటి నీ నడకల సోయగము

కృతిని నాతొ పలికించేటి అపురూప రూపము


3.ఎక్కడ మొదలెట్టానో కవితంతా తికమక

ఎలా చెబుదామన్నా ప్రతీది పాత పోలిక

నయనాలు అధరాలు దరహాసము నాసిక 

చతికిల బడిపోయాను ఉపమానమె తోచక

 


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏడడుగులు నడవనీ

మూడుముడులు వేయనీ

మనస్సాక్షిగా అగ్నిసాక్షిగా

తాళిబొట్టుకట్టనీ తలంబ్రాలు పోయనీ

శుభలగ్నాన కళ్యాణ మండపాన

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


1.పరస్పరం ఇరువురం ఇష్టపడి

జరగనీ తాంబూలల మార్పిడి

ఊరూ వాడంతా మన పెండ్లి సందడి

నూతన అనుబంధాలే ముడివడి

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


2.ఆహ్వాన పత్రికలే ఎల్లరకూ పంచి

బంధు మిత్రులందరినీ మనవుకు పిలిచి

రంగరంగవైభవంగా విహహమునకేతెంచి

విందునారగించనీ అతిథులు మననాశీర్వదించి

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


3.కన్యాదానమునే మామనుండి స్వీకరించి

మంగళవాద్యాల మధ్య మంగళాష్టకాలు చదువ

సుముహూర్త సమయాన వేదమంత్రాలనడుమ

 జిలకర బెల్లాన్ని మనం తలలపై దాల్చనీ

నీలేత పాణిగ్రహణమేచేయనీ-నిను పరిణయమాడనీ





Tuesday, June 22, 2021


https://youtu.be/NeYGpZVOJEM?si=yy1PnFY5XZsbGu9O

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: హిందోళం

శుభోదయం ప్రాణ మిత్రులకు
అపారమైన ప్రేమ పాత్రులకు
సారస్వత జ్ఞాన నేత్రులకు
మధుర మధురతర సుమధుర గాత్రులకు

1. సాహిత్యమే వైద్యం రోజువారి వత్తిడికి 
సంగీతమే హృద్యం మనోల్లాసానికి
కవిత్వమే నైవేద్యం పాఠకుల ఆకలికి
అనుభవైకవేద్యం సకలం హృదయానుభూతికి

2.పఠనంతో పదునౌతుంది ప్రతివారి మేధ
సాధనతో సాధ్యమే మనోహర గానసుధ
పరస్పరం స్పందిస్తేనే సేదదీరుతుంది ప్రతి ఎద
స్నేహితమే సృష్టిలోన నేస్తం - అంతులేని సంపద


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మిడిసిపాటెందుకు-మూణ్ణాళ్ళ చిందుకు

మూతిముడుచుడెందుకు-చిరునవ్వు విందుకు

కన్నుమూసి తెరిచేలోగా-పడుతుంది బ్రతుకు తెఱ

వినియోగ పరచాలి-అనుక్షణం ఏమరక


1.వెలివేయ బడతావు-గిరిగీసుకుంటుంటే

కనుమరుగై పోతావు-కలిసిసాగిపోకుంటే

ఆధారం తెగిన పతంగి-ఎగిరేను ఎంతటి దూరం

చుక్కానే లేని  పడవ-చేరలేదు కోరిన తీరం


2.గర్వభంగం చేసేయి-నీ అహంభావానికి

అర్థాన్ని స్పష్టం చేయి- ఆత్మవిశ్వాసానికి

అహర్మణీ వెలుగీయదు-అహం మబ్బు కమ్మేస్తే

పరాజయం తప్పదు- సాధననే సడలిస్తే

 

https://youtu.be/FxP6zt4td0I?si=r0hyQ7D0T5lnMoHa

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:లలిత


కమలాసనురాణి -కఛ్ఛపి వీణాపాణి

శరణంటిని నిను వాణీ-జయతు జపమాలా ధారిణీ


1.ప్రజ్ఞను దయచేయి విజ్ఞత నాకీయి

నీ అనుజ్ఞ మేరకు గీతాల రసజ్ఞత నందీయి

విజ్ఞాన రూపిణి ప్రజ్ఞాన ప్రదాయిని

స్థిత ప్రజ్ఞతనొనగూర్చవే వరదాయిని


2.లౌక్యమునీయవే పరసౌఖ్యము నీయవే

శక్యముకాదు నినువినా సఖ్యత నందీయవే

సారస్వత సామ్రాజ్ఞి నీ ఆజ్ఞ నా కవనం

 గీర్దేవి వేదాగ్రణి  నీకై జిజ్ఞాసే నా జీవనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ వాలు చూపులే వలవేసెనే

నీ వాలు జడే నన్ను బంధించెనే

సవాలు చేయకే గెలవలేను నీ పందెం

భావాలు కవితలుగా మార్చేను నీ అందం


1.వెన్నలాంటి నీ మేను నునుపుదనం

వెన్నెలంటి నీ తనువున తెల్లదనం

వెన్నంటి వస్తుంది నీ ఒంటి పరిమళం

వన్నెలు నీవెన్నగ నా తరమా ప్రియ నేస్తం


2.పదహారు కళలొలుకును నీ పరువం

పదహారు ప్రాయాన నిను కన పరవశం

పదహారణాల నీ తెలుగు ప్రన్నదనం

పదహారు తీరుల కొలుతును నిను అనుదినం


https://youtu.be/jrHV5mvZodA

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జిల్లేడు మాలలివిగొ ఇంద్రియ జితుడా

సిందూర లేపనమిదె అంజనీ సుతుడా

వందనాలనందుకో వాయుపుత్రుడా

సేవలనే గైకొనుమా సుగ్రీవ మిత్రుడా


1.పంచామృతాలతో నిను అభిషేకింతు 

పంచన చేర్చుకో పంచముఖీ హనుమా

దండకముతొ నిన్ను మనసారా నుతింతు

అండదండగా యుండి మమ్ముకావుమా


2.ఏల్నాటి శని దోషము పరిహరించివేతువు

మండలకాలము నిను దండిగ కొలిచినంత

తీరిపోని ఆశలన్ని తప్పక నెరవేర్చెదవు

రామనామ జపమునే నిరతము చేసినంత

Monday, June 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముప్పైయ్యారు ఇరవైనాలుగు ముప్పైయ్యారు

నిలువెత్తు నీరూపం కంటే నా గుండె బేజారు

ఓ చెలీ నీ చూపే నను చంపే వాడి కైజారు

ఇలా నిను చూస్తుండి పోయానంటే రేయితెల్లారు


1.కొండలు కోనలు దిబ్బలు మైదానాలు

నదులు లోయలు జాలువారే జలపాతాలు

నీలినీలి మేఘాలు అణువణువూ పూవనాలు

ప్రకృతి సాంతం నీవైనట్టుగ చెలీ నీ అందచందాలు


2.మీనాలు మైనాలు శుక పిక శారికలు

వయారమొలికే నాట్య మయూరాలు

నడకలతో  హోయలొలికే రాజహంసలు

పుణికిపుచ్చుకున్నావే చెలీ శకుంతాల సోయగాలు

Sunday, June 20, 2021

https://youtu.be/UZ8ozqDV0kk?si=qNx9B6iFPRRm6tfB

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: మధ్యమావతి

శారదా నా కవన వరదా
ఏల నీ హృదయాన పరదా
నీ నామజపమే నాకు సదా
నా ఊసంటేనే నీకు చేదా?
నువు కనికరించే రోజే రాదా

1.అక్షరమౌ నీ అక్షర సుధ
లక్షణమౌ నీ పద సంపద
ఊతమీయవే మాత నా గీతమందున
చేయూతనీయవే నా జీవితమందున

2.శ్రుతి శుభగమవనీ ప్రతి కృతిని
లయ లయమైపోనీ నీ ఆకృతిని
సుస్వరాలు రవళించనీ మనసుకను రాగమై
గమకాలు పరిమళించనీ ఎదకు శుభయోగమై


 

https://youtu.be/nbTqWezBdCk

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శిరము నుండి దూకేను ఒక విషము

గళము  నందు నిలిచేను ఒక విషము

విషయ వాంఛా రహితుడవు శివుడవు

విషమము నీతత్వము మాకు అర్థమే కావు

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక


1.మునులెందరు నీకై తపమాచరించిరో

రావణాదులెందరు నీ వరములనందిరో

నందివాహన సచ్చిదానంద ధవళ మోహన

అమర వందిత గంగాధరా నమో పంచానన

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక


2.ఏ స్థాణువైనా  కనగ లింగ రూపమే

ఏ శబ్దమైనా నాకు ఓంకార నాదమే

భోళాశంకరుడవు శశాంకధరుడవు

సుజ్ఞాన వరదుడవు త్రిపురాసుర హరుడవు

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీలాల మేఘాల నీ కేశాలు

వేసాయి నామదికి పాశాలు

గాలికి చెలరేగుతూ ఆసక్తే  రేపుతూ

అలరించినాయి నీకందమిస్తూ

మురిపించినాయి నా ఎద దోస్తూ


1.కదలాడు మీనాలు నీ సోగనయనాలు

తీస్తాయి చూపులతో నా పంచప్రాణాలు

తాళజాలరెవ్వరు  నీ తీక్షణ సుమ బాణాలు

నినుచూస్తూ  బ్రతికితె చాలు నాలుగే క్షణాలు


2.భూమినైన మించిఉంది నీ ఆకర్షణ

ఎదురుగా నీవుంటే అంతర్గత ఘర్షణ

చెప్పలేను మానలేను అంతఃకరణ

నీ కరుణ గనకుంటే అది మరణ యాతన

 

https://youtu.be/CvOpQYZBchw?si=u2-Uu9BYdsJJv2

(పితృదేవుల దినోత్సవ సందర్భంగా మా నాన్న సంస్మృతిలో)


వాడని గులాబీవి నీవు

కమ్మని జిలేబీవి నీవు

సజీవంగ మెదులుతాయి నీ తలపులు

 వెన్నంటే ఉన్నాయి  నీ మందలింపులు

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే


1.నడవడి నది కట్టడికి ఆనకట్ట నీవు

మా ఉన్నతి అక్కెరలకు తేనెతుట్టెవు

కష్టాలలో సైతం నవ్వే గుట్టునెరుకపర్చావు

ఉన్నంతలొ జీవించే పట్టు తెలియజేసావు

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే


2.అంజయ్యసారు కొడుకన గర్వమే

నీతోటి గడిపిన ప్రతిరోజూ పర్వమే

ఆహారం ఆహార్యం నీవన్నీ రుచికరమే

నీకడుపున పుట్టడం మాకపూర్వ వరమే

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూడనీ నను చూడనీ నిను చూడనీ కడతేరనీ

పాడనీ నీ మిసిమి పొగడనీ,నను తరించనీ

మాటాడనీ నను మది తెలుపనీ స్నేహించనీ

తోడవనీ ననునీ నీడవనీ నిను విడువక జీవించనీ


1.చందమామలా నీ మోముని

మిలమిల నక్షత్రాలు నీ నేత్రాలని

కోటేరు సూటి నీ ముక్కెర ముక్కని

పెదాలు పిండుకొనే తేనె తెట్టెలని

ఊహించుకొన్నాను కలలెన్నొ కన్నాను

ఊహ వాస్తవంగా చేయనెంచవే

కలలు నిజం చేయగా కనిపించవే


2.చూపు మరలనీయని నీరూపుని

మధురతరమైన నీ మాట తీరుని

మనోహరమైన నీ చిరునవ్వుని

మెరుపుతీగ వంటి నీ హొయలుని

చిత్రించుకొన్నాను ఆత్రంగ ఉన్నాను

సజీవంగ మారనీ నామనో చిత్రమే

వరమై వరించనీ నా మదిలోని ఆత్రమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


నీ ముక్కుపోగు నన్ను ముగ్గులోకి లాగు

నీ కలువ కళ్ళు నన్ను కదలనీవెలాగు

నీకొంటె నవ్వు నన్ను వెంబడించి సాగు

ఇక నీ ఆరాధన అనుక్షణం కొనసాగు

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవె నా జీవితమీవె కావె


1.మధువలవాటు లేదు మత్తులో ముంచావే

ఒరులను నేనెరుగను కొంగున ముడివేసావే

రేయిలేదు పగలు లేదు ఎప్పుడూ నీధ్యాసే

కవితా నా కవిత యంటు సదా నీ ధ్యానమే

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవె నా జీవితమీవె కావె


2.గులాబీల రెక్కలే నీ లేలేత పెదాలు

తమలపాకు తీరేలే చిగురంటి పాదాలు

ఎక్కడ ముద్దిడినా మధురాతి మధురాలు

హద్దులు  దాటించగలుగు నీ మేని సోయగాలు

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవే నా జీవిత మీవె కావె

Friday, June 18, 2021

 రెచ్చగొట్టగలుగుతుంది పుట్టుమచ్చ సైతం

పిచ్చి పిచ్చి ప్రేమలకు పచ్చబొట్టె ఊతం

వలవేసిపడుతుంది క్రీగంటి ఆలోకితం

వలపుల ముడివేస్తుంది అధరస్మితం


1.కొండలకెగ బ్రాకుతుంది కొంటెచూపు జలపాతం

మంటలనెగదోస్తుంది నడుం ముడత నవనీతం

స్వేదమునే రేపుతుంది నూగారు హిమపాతం

వడగళ్ళలొ మునుగుతుంది ఎద ఎడారి ప్రాంతం


2.అహ్వానం పలుకుతుంది పంటినొక్కు శుకము

ఆదరించ పూనుతుంది  చుంబన కపోతము

అక్కున జేర్చుతుంది ప్రియ లాలన శకుంతము

ఆలపించి మురిపించును అనుభూతి పికము




https://youtu.be/TToQMJitRkQ?si=HFLFPvGIqKKF0T78

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అశనిపాతమై విషాద గీతమై

ఆనందపు ఛాయేలేని జీవితమై

అడుగడుగూ అపార దుఃఖభరితమై

ఇదేనా నీ ప్రసాదము ఇంతేనా జన్మాంతము

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా


1.జగత్పితవు నీవంటారే నేనే అనాథనా

జగన్నాథ నీవంటూ ఉంటే జనులకింత వ్యథనా

తప్పుచేస్తె దండించాలి స్వప్నాలు పండించాలి

దారితప్పు వేళల్లో చేయపట్టి నడిపించాలి

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా


2.మా ప్రమేయమెంత ఉంది  మా మనుగడలో

మా ప్రతాపమేముంది మా గెలుపులలో

గడిచినంత గడిచింది కాలమంత కష్టాల్లో

ఇకనైనా మననీయి నీ చల్లని కనుసన్నలలో

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక కవిత నాలో మెదిలింది

కలంతో జత కలిపింది

ఎదలోతు భావాలనే  వెలికి తీసింది

ఒద్దకగా అల్లుకుంటూ అందంగా వెలిసింది


1.అచ్చరువునొందేలా అచ్చరాలు కూర్చింది

ఇంద్రజాలమేదోచేసి పదాలుగా మార్చింది

మనసుల నలరించేలా పరిమళాల నద్దింది

గేయమై రూపుదాల్చి హృదయాలు గెలిచింది


2.అలతి అలతి నడకలతో అడుగులేసింది

చిరునవ్వు చెదరకుండా నుడుగులే పలికింది

ఆహ్లాదం రంగరించి అనుభూతులిచ్చింది

మరవలేని జ్ఞాపకమై మదిలోన దాగుంది

Thursday, June 17, 2021

 https://youtu.be/T8qIwWVhMWs


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టుపీతాంబరాలు కట్టబెట్టినాము

పట్టుబట్టి ఆభరణాలు నీకు పెట్టినాము

పట్టెనామాలతో కోరమీసాలతో

దిట్టంగా ఉన్నావు దివ్యంగా కొలువున్నావు

ధర్మపురీ నరసింహా దయగనగ జాగేలా

దితిసుతు సుతు కాచిన సంగతి  మరచితివేల


1.శంఖ చక్రాలునీకు అలంకార ప్రాయాలా

కౌముది నందకము చేరాయా ఓ మూల

భీకర కోఱల వాడి వాడ ఉడిగి పోయిందా

చీల్చిన నఖముల పదును మొండివారి పోయిందా

జరుపవేల దుష్ట శిక్షణ చేవ కాస్త తగ్గిందా

చేయవేల శిష్టరక్షణ దయ అడుగంటిందా


2.నెరనమ్మితి నిన్ను స్వామి త్రికరణ శుధ్ధిగా

కొనియాడితి సర్వదా నీ కృపయే పరలబ్ధిగా

సనకాది ఋషులకేనా నీ దివ్య దర్శనం

ప్రహ్లాద బాలునికేనా నీ కరుణా కటాక్షం

పక్షపాతివైతివా శ్రీపతి నా గతిగానక

పక్షివాహన నీవే శరణాగతి ప్రభోనాకిక

Wednesday, June 16, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలుసైపోతున్నా నీ వెంటబడి

బోల్తా పడుతున్నా అడుగులు తడబడి

నాకు నేనే మిగులకున్నా నీకు లోబడి

బ్రతుకే కోల్పోతున్నా మనది ప్రేమగా పొరబడి


1.దూరం అంతేగా ఇరువురి ఇళ్ళ నడుమ

అవసరమొకటేగా పరస్పరం తీర్చుకోగ

అందం నీకుందంటే ఒకరుండాలి నాలా పొగడ

బంధం కోరుకుంటే కావాలెవరో సరిపడ


2.బయట  పెట్టదే పడతి తన ఎడద

చుట్టూ తిప్పుకోవడమే స్త్రీకి సరదా

మర్మమే గ్రహించకనీ మాయలోన పడినాను

నాకు గాక నీకూ గాక రెండిటికీ చెడినాను

 

https://youtu.be/bvJdnQmgkuE?si=_RkrgNH1f2qms22m


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:కీరవాణి

సాక్షాత్కరించవయ్య సద్గురుదత్తా

సాష్టాంగవందనమిదె జగద్గురు దత్తా

ప్రత్యక్షమిక కావయ్య అత్రివరపుత్రా

ప్రత్యక్షరమూ నీవయ్య అనసూయ  ప్రియసుతా


1.త్రైమూర్త్యవతారా త్రిజగన్మోహనా

త్రిగుణాతీత నమో త్రైలోక్య పూజితా

త్రిభువన రక్షక పాహిమాం మోక్షదాయకా

త్రికరణశుద్ధిగ వేడెద శరణాగత పాలకా


2.దండకమండలధర అవధూతా

శంఖచక్ర కర భూషా భక్త జనపోషా

త్రిశూల ఢమరుక హస్తా సచ్చిదానంద

శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి నమః


3.దిగంబరా దిగంబరా గురుదేవ దత్తా దిగంబరా

దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభా దిగంబరా

దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతి దిగంబరా

దిగంబరా దిగంబరా దిగంబరా జయ దిగంబరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసంతా కలకల

నా నయనాల వలవల

ఓ నా శశికళ.. ఏకైక నా కల 

నీవేలే ఇల మోహన బాల

నువు కాదంటే నాకీ బ్రతుకేల

నువు వద్దంటే ఇకపై చితిజ్వాల


1.నోరూరేలా నీ పెదవుల అరుణిమ

సుధలే గ్రోలగ రసనే మధురిమ

నీవే పదహారు ప్రాయపు లేలేత లేమ

నినుముట్టుకున్నా తరిస్తుంది నా జన్మ

నువు కాదంటే నాకీ బ్రతుకేల

నువు వద్దంటే ఇకపై చితిజ్వాల


2.నుదుటిన జీరాడే ముంగురులు

చెంపలు ముద్దాడే చెవి వంకీలు

ఆటంక పరిచేను నా అన్ని చర్యలు

ఎలా నీకు చేయాలి ప్రియా నా సపర్యలు

నువు కాదంటే నాకీ బ్రతుకేల

నువు వద్దంటే ఇకపై చితిజ్వాల