https://youtu.be/70uRp9wuDnA
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
వసంత పంచమి శుభాకాంక్షలు
రాగం :రంజని
అరుణ కలువ నీవు
కరుణ నొలుకు తావు
నీ మోము మోదాల తావు
నీ మోవి చిరునవ్వుల రేవు
మా నతుల గొనెడి జగన్మాతవు
మా వినతుల వినెడి సరస్వతి మాతవు
సౌందర్య లహరివి నీవు
శివానంద లహరివౌతావు
భవరోగ హరణ మూలికవు
భవతిమిరాంతక దీపికవు
మా నతుల గొనెడి జగన్మాతవు
మా వినతుల వినెడి సరస్వతి మాతవు
దయామృత వర్షిణివి
నీవు నవరస పోషణివి
అను నిత్య సంతోషిణివి
మృదుమంజుల భాషిణివి
మా నతుల గొనెడి జగన్మాతవు
మా వినతుల వినెడి సరస్వతి మాతవు